
పూజా భోస్లే
ముంబై : భూమ్మీద నూకలు ఉంటే చావు అంచులదాకా వెళ్లినా సరే బతికి బయటపడొచ్చు అంటారు. ముంబైకి చెందిన ఓ అమ్మాయి విషయంలోనూ ఇదే జరిగింది. అదుపు తప్పి రైలులోంచి కిందపడి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. అసలేం జరిగిదంటే.. ముంబైని చెందిన పూజా భోస్లే(17) ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఘట్కోపర్, విఖ్రోలివైపు వేళ్లే లోకల్ రైలు ఎక్కింది.
ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో ఆమె డోర్ వద్దే నిలబడి ఉంది. రైలు కదులుతూ కొంచెం దూరం వెళ్లాకా అదుపు తప్పి కింద పడబోయింది. అక్కడే మిగతా ప్రయాణికుల్లో ఒకరు ఆమె చేతులను గట్టిగా పట్టి లాగారు. అదే సమయంలో ఎదురుగా మరో రైలు వస్తోంది. ఇక పూజ పని అయిపోయిందనుకుంటున్న సమయంలో అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బతికి బయటపడింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. స్పల్ప గాయాలైన పూజను ప్రథమ చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఇప్పుడా వీడియో వైరల్ అయింది. ఆ వీడియో మీకోసం..