
కష్టాలనగానే భయపడిపోతుంటాం. ఎందుకంటే ఆ సమయం ఎవ్వరైన చెప్పుకోలేని వేదన అనుభవిస్తారు. దాటుకుని రావడం అంత ఈజీ కూడా కాదు. పదేపదే వెంటాడే ఛీత్కారాలు, అవమానాలు తట్టుకుంటూ లక్ష్యంపై ఫోకస్ పెట్టడం కష్టమే అయినా సాధ్యం కానీ విషయం అయితే కాదు. అలా భావించిన వాళ్లే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని కనివినీ ఎరుగని సక్సస్‌ని అందుకుంటారు. పైగా తనని కష్టపెట్టిన వాళ్లే చేతులెత్తి సలాం కొట్టే స్థాయికి చేరుకుంటారు. అలాంటి విజయాన్నే అందుకుని యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది 23 ఏళ్ల ఊర్మిళ. ఆమె కథ ప్రతిఒక్కరికీ ఓ కనువిప్పు, సక్సెస్‌కి చిరునామాగా చెప్పొచ్చు.
ముంబైకి చెందిన 23 ఏళ్ల ఊర్మిళ పాబుల్ ఐదవ తరగతిలో ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. సింగిల్ మదర్ పెంపకంలో పెరిగింది. ఎన్నో అవహేళనలు, కష్టాలు ఎదుర్కొంది. తన తల్లే ఒంటరిగా తనని, సోదరుడుని చదివిస్తోందన్న విషయాన్ని ఏ క్షణాంలోననూ మరువలేదు. అదే ఆమె ఎదుగదలకు బూస్టప్‌గా తీసుకుంది.
పడుతున్న ప్రతి కష్టాన్ని తన లక్ష్యాన్ని గుర్తు చేసేవిగా భావించింది. ఆ సానూకూల దృక్పథం, అచంచలమైన పట్టుదల, దీక్షలే ఆమెను స్కేట్‌బోర్డింగ్‌లో ఛాంపియన్‌గా మార్చింది. పలు అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాతినిథ్యం వహించేలా చేసింది. ఆ క్రీడలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునే రేంజ్‌కి ఎదిగింది.
అలా ఆమె 36వ జాతీయ క్రీడలలో రజత పతకాన్ని గెలుచుకోవడమే గాక UAEలోని షార్జాలో జరిగిన ప్రపంచ స్కేట్‌బోర్డింగ్ ఛాంపియన్‌షిప్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకుంది. ఈ విజయాన్నీ ఆమెను ఒలింపిక్ అర్హతకు హెల్ప్ అవుతాయి కూడా. ప్రస్తుతం ఆమె స్నోబోర్డింగ్‌లో శిక్షణ తీసుకుని మరీ. గుల్మార్గ్‌లో జరిగిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో కాంస్య పతకాన్ని సాధించింది.
ఈ ఏడాదే స్నోబోర్డింగ్ క్రీడలో శిక్షణ తీసుకుని పోటీలోకి దిగినా.. విజయ ఢంకా మోగించి ప్రపంచమే సతన వైపుతిరిగి చూసేలా చేసింది ఊర్మిళ. 'దటీజ్ ఊర్మిళ' అనుపించుకుంది. అంతేగాదు వ్యక్తిగత కష్టాలు మనిషిని ఉన్నతస్థితికి తీసుకువచ్చే సోపానాలని చాటిచెప్పింది.
(చదవండి: ఎవరీ నిధి తివారీ? ఏకంగా ప్రధాని మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా యువ ఐఎఫ్ఎస్ అధికారిణి..!)