Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

India And Pakistan Army Related Full Details1
సింహానికి చిట్టెలుకకు పోలికా?.. భారత్‌, పాక్‌ బలాబలాలు ఇలా..

డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ఎదురుగా తొడగొట్టిందట.. గట్టిగా యాభై కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు మిలిటరీ వాహనాలకు డీజిల్ పోయలేరు.. ఒకసారి ఫైటర్ జెట్లను ట్రయల్ రన్ తీయాలంటే లక్షలు ఖర్చు.. దానికి చేతగాదు.. యుద్ధ ట్రయాంకర్లకు ఆయుధాలు.. వంటివి ఫిక్స్ చేయాలంటే నట్లు .. బోల్టులు కరువే.. అసలు సైనికులకు యూనిఫారాలు. బూట్లు కూడా కొత్తవి ఇవ్వాలంటే పాతవాటికి మాసికాలు వేసుకుని రోజులీడుస్తున్న దారుణం. భారత్ నుంచి గోధుమపిండి ఇస్తే తప్ప మూడుపూటలూ ముద్దకు ఠికాణాలేని కరువు బతుకులు.. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు భారత్ కు సవాల్ విసురుతోంది. అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న విలువ, గౌరవం.. మార్కెట్ వాల్యూ.. సైనిక.. ఆర్థిక సంపత్తితో పోలిస్తే పాకిస్తాన్ ఒక పిపీలికం.. కానీ ఏదో తెగింపు.. దేశంలో పోతున్న పరువును కాపాడుకునేందుకు ఏదో ఒక బిల్డప్ ఇస్తూ అక్కడి సైనిక పాలకులు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.. ఈ తరుణంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సైనిక బలాలు.. బలగాల మధ్య ఏపాటి వ్యత్యాసం ఉందో చూద్దాం. గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025 తాజా నివేదిక ప్రకారం ఇరు దేశాల మిలిటరీ శక్తి ఇలా ఉందిసమగ్ర మిలిటరీ ర్యాంకింగ్:భారతదేశం: ప్రపంచంలో 4వ ర్యాంక్, పవర్ ఇండెక్స్: 0.1184పాకిస్తాన్: ప్రపంచంలో 12వ ర్యాంక్, పవర్ ఇండెక్స్: 0.2513మానవ వనరులు:మొత్తం జనాభా: భారతదేశం – 1.4 బిలియన్ | పాకిస్తాన్ – 252 మిలియన్యాక్టివ్ సైన్యం : భారతదేశం – 14,55,550 | పాకిస్తాన్ – 6,54,000రిజర్వ్ సిబ్బంది: భారతదేశం – 11,55,000 | పాకిస్తాన్ – 5,50,000పారా మిలిటరీ దళాలు: భారతదేశం – 25,27,000 | పాకిస్తాన్ – 5,00,000వాయుసేన బలాబలాలు.. మొత్తం విమానాలు: భారతదేశం – 2,229 | పాకిస్తాన్ – 1,399యుద్ధ విమానాలు: భారతదేశం – 513 | పాకిస్తాన్ – 328ఎటాక్ హెలికాఫ్టర్లు : భారతదేశం – 80 | పాకిస్తాన్ – 57 పదాతిదళం బలాబలాలు :ట్యాంకులు: భారతదేశం – 4,201 | పాకిస్తాన్ – 2,627ఆర్మర్డ్ వెహికల్స్: భారతదేశం – 1,48,594 | పాకిస్తాన్ – 17,516మొబైల్ రాకెట్ వ్యవస్థలు: భారతదేశం – 264 | పాకిస్తాన్ – 600నావికాబలం :మొత్తం నేవీ స్థావరాలు.. కేంద్రాలు : 293 | పాకిస్తాన్ – 121ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు: భారతదేశం – 2 | పాకిస్తాన్ – 0జలాంతర్గాములు : భారతదేశం – 18 | పాకిస్తాన్ – 8డిస్ట్రాయర్స్: భారతదేశం – 13 | పాకిస్తాన్ – 0రక్షణ ఖర్చు:భారతదేశం: $75 బిలియన్పాకిస్తాన్: $7.64 బిలియన్ఇప్పుడు చెప్పండమ్మా.. ఎవరిది బలం.. ఎవరిది బలుపు.. గతంలో ఎన్నోసార్లు భారత్ మీదకు తెగబడి వారంరోజుల్లోనే చేతులెత్తేసి. మోకాళ్ళమీద నిలబడి శరణు వేడిన సందర్భాలు ఉన్నాయ్. బతికితే చాలు దేవుడా అంటూ పలాయనం చిత్తగించిన పాకీ సేనలు ఇప్పుడు మళ్ళీ ఏం చూసుకుని బోర్డర్లో సైనిక సన్నాహాలు చేస్తున్నాయో. తెగింపా.. తెంపరితనమా.. దేశంలో పరువుకాపాడుకునే క్రమంలో ఈ ఓవర్ యాక్టింగ్ అనివార్యమా.. ఏదైనా సరే.. భారత్ సేన ఒకసారి అడుగు ముందుకు వేస్తె అది పాక్ అంతు చూసేవరకూ ఆగేది లేదని భారత్ ప్రభుత్వం మరోసారి గట్టిగ్గా స్పష్టం చేసింది.- సిమ్మాద్రిప్పన్న

Indian Army Blast Pahalgam Incident Adil Asif Houses2
పహల్గాం ఘటన.. కశ్మీరీ ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత

పహల్గాం దాడిలో పాల్గొన్న ఇద్దరు కశ్మీరీ ఉగ్రవాదులకు భద్రతా బలగాలు షాకిచ్చాయి. స్థానికంగా ఉన్న అసిఫ్‌ షేక్‌((Asif Sheikh) , అదిల్‌ హస్సేన్‌ తోకర్‌ల ఇళ్లను గురువారం రాత్రి పేల్చిపడేశాయి. తద్వారా ఉగ్రవాదంపై ఉక్కు పాదం తప్పదనే సంకేతాన్ని ఇండియన్‌ ఆర్మీ ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నాం పహల్గాం బైసరన్‌ లోయలో జరిగిన మారణకాండలో 26 మంది టూరిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఈ ఇద్దరు కశ్మీరీలు పాల్గొన్నట్లు సైన్యం ధృవీకరించుకుంది. దాడి తర్వాత ఈ ఇద్దరితో పాటు ఉగ్రవాదులంతా పిర్‌పంజల్‌ పర్వతాల్లో దాక్కొని ఉండొచ్చని భద్రతా బలగాలు భావించి గాలింపు చేపట్టాయి. డ్రోన్‌లు, భద్రతా బలగాల కూంబింగ్‌తో ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాయి.అనంత్‌ నాగ్‌ పోలీసులు ఈ ఇద్దరితో పాటు మరో ఇద్దరు పాక్‌ టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు సైతం ప్రకటించారు. గురువారం రాత్రి ఈ ఇద్దరి ఇళ్లను ఐఈడీతో భద్రతా బలగాలు ధ్వంసం చేశారు. 2018లో పాక్‌కు వెళ్లిన ఈ ఇద్దరూ.. లష్కరే తాయిబా ఉగ్ర సంస్థలో చేరి శిక్షణ తీసుకున్నారు. ఈ మధ్యే మరో నలుగురితో కలిసి కశ్మీర్‌లోకి చొరబడినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. As per initial reports Asif Sheikh was Involved in #Pahalgam attack. When army reached his House, suspicious IED type material was seen, BDS along RR, destroyed that IED in which Asif's house partially damaged. pic.twitter.com/dhB37wLumw— War & Gore (@Goreunit) April 25, 2025అదిల్‌ హుస్సేన్‌ తోకర్‌కు ఇద్దరు సోదరులు. అనంత్‌ నాగ్‌లో కొంత భూమి ఉంది ఈ కుటుంబానికి. అసిఫ్‌ కుటుంబానికి సంబంధించిన వివరాలు పెద్దగా తెలియరాలేదు. పహల్గాం దాడి తర్వాత ఈ ఇద్దరి కుటుంబాలను భద్రతా బలగాలు రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నట్లు అక్కడి మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.

YSRCP expressed concern over Chandrababu economic policies3
రూటు మార్చిన చంద్రబాబు.. ఏపీలో ఆర్థిక విధ్వంసం

తాడేపల్లి,సాక్షి: దేశంలో ఎప్పుడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో రాజ్యంగ విరుద్ధమైన విధానాలకు తెగబడింది. సీఎం చంద్రబాబు ఆర్థిక విధానాలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తం చేసింది.ఈ మేరకు ఎక్స్‌ వేదికగా.. అందకారంగా రాష్ట్ర భవిష్యత్‌ అంటూ ట్వీట్‌ చేసింది. ఆ ట్వీట్‌లో ‘వినాశకర ఆర్థిక విధానాలు అప్పులకోసం రాజ్యాంగ ఉల్లంఘనలు. 436 గనులను తాకట్టు పెట్టిన చంద్రబాబు. ఈ గనులన్నీ ఏపీ ఎండీసీకి అప్పగిస్తూ ఉత్తర్వులు. ఏపీఎండీసీ ద్వారా అప్పుల సృష్టి. రూ.1,91,000 కోట్ల విలువైన గనులు తాకట్టుపెట్టి రూ.9వేల కోట్ల అప్పు. భవిష్యత్తు ఆదాయాలను రుణ సంస్థలకు కట్టబెడుతూ నిర్ణయం. రుణాలిచ్చే సంస్థలు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచే వాయిదాలు తీసుకునే అవకాశం. రుణ సంస్థలకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ఏకైక ప్రభుత్వంగా నిలిచిన చంద్రబాబు సర్కారు. చరిత్రలో ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం తొలిసారి. వినాశ ఆర్థిక విధానాలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అంటూ’ పేర్కొంది. .@ncbn వినాశకర ఆర్థిక విధానాలు అప్పులకోసం రాజ్యాంగ ఉల్లంఘనలు436 గనులను తాకట్టు పెట్టిన చంద్రబాబుఈ గనులన్నీ ఏపీ ఎండీసీకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఏపీఎండీసీ ద్వారా అప్పుల సృష్టిరూ.1,91,000 కోట్ల విలువైన గనులు తాకట్టుపెట్టి రూ.9వేల కోట్ల అప్పుభవిష్యత్తు ఆదాయాలను రుణ సంస్థలకు… pic.twitter.com/ET5g0nWA2J— YSR Congress Party (@YSRCParty) April 24, 2025

Next 78000 Years: Gavaskar Lambast Perpetrators Behind Pahalgam Incident4
మీరేం సాధించారు?.. మరో 78 వేల ఏళ్లైనా ఇదే పరిస్థితి: గావస్కర్‌ ఫైర్‌

పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన (Pahalgam Incident) నేపథ్యంలో భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. డెబ్బై ఎనిమిదేళ్లుగా ఒక్క మిల్లీ మీటర్‌ భూమి కూడా చేతులు మారలేదని.. మరో 78 వేల ఏళ్లు గడిచినా పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన అన్నారు. మరి అలాంటప్పుడు శాంతియుత జీవనం గడపకుండా.. అమాయకుల ప్రాణాలు తీస్తే వచ్చే లాభమేమిటంటూ తీవ్రవాదులకు చురకలు అంటించారు.బైసరన్‌ లోయలోఉ‍గ్రవాదులు, వారికి మద్దతుగా నిలిచే వారు ఇకనైనా వాస్తవాన్ని గుర్తించి.. ఇలాంటి పిరికిపంద చర్యలను చాలించాలని గావస్కర్‌ సూచించారు. కాగా జమ్మూ కశ్మీర్‌‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై మంగళవారం ఉగ్రదాడి జరిగిన విషయం విదితమే. జమ్మూకశ్మీర్‌లో ‘మినీ స్విట్జర్లాండ్‌’గా పేరుగాంచిన బైసరన్‌ లోయలో ఉగ్రవాదులు జరిపిన భీకర దాడిలో 26 మంది మృతి చెందారు. బాధితులకు అండగాఈ నేపథ్యంలో తీవ్రవాదుల చర్యను క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో మనమంతా ఒక్కటిగా ఉండి... బాధితులకు అండగా నిలవాల్సిన అవసరముందని పలువురు క్రీడాకారులు అభిప్రాయపడ్డారు.క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్, విరాట్‌ కోహ్లి, బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్, మహ్మద్‌ సిరాజ్, సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్, పార్థివ్‌ పటేల్, శుభ్‌మన్‌ గిల్, కేఎల్‌ రాహుల్, అనీల్‌ కుంబ్లే, రవిశాస్త్రి, శ్రీవత్స గోస్వామి, టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్, స్టార్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్, జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా, షూటర్‌ అభినవ్‌ బింద్రా, బాక్సర్‌ నిఖత్‌ జరీన్, పీఆర్‌ శ్రీజేశ్‌ తదితరులు ఉగ్రవాదుల దాడిని ఖండించారు. అంతేకాదు.. పాకిస్తాన్‌తో క్రీడా సంబంధాలు ఎప్పటికీ పునరుద్ధరించకూడదని పలువురు ప్లేయర్లు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై సునిల్‌ గావస్కర్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. భారతీయులందరిపై దీని ప్రభావం ఉంటుంది.మరో 78 వేల ఏళ్లు గడిచినా ఇదే పరిస్థితిదుశ్చర్యలకు పాల్పడేవారిని, వారికి మద్దతునిచ్చే వారిని నేను ఒకే ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నా.. ఇలాంటి పనుల వల్ల మీరు ఏం సాధించారు? ఇకపై ఏం సాధిస్తారు?గత 78 ఏళ్లుగా ఒక్క మిల్లీ మీటర్‌ భూభాగం కూడా చేతులు మారలేదు. మరో 78 వేల ఏళ్లు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాదు. మరి అలాంటపుడు శాంతియుతంగా జీవిస్తూ.. దేశాభివృద్ధిపైన దృష్టి పెట్టడం మంచిది కదా! దయచేసి ఇకనైనా పిరికిపంద చర్యలు మానుకుని.. బుద్ధిగా ఉండండి’’ అని ఉగ్రవాదులకు హితవు పలికారు.చదవండి: PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్‌!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..

Pak Deputy PM calls Pahalgam terrorists freedom fighters5
పహల్గాం ఉగ్రదాడిపై పాక్‌ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌: జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో ఉగ్రదాడి వేళ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌ పహల్గంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్నిస్వాంతంత్ర్య సమరయోధులని అభివర్ణించారు. పహల్గాంలో ఉగ్రమూఖల దుశ్చర్యను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. పాకిస్తాన్‌ తీరుపై పరోక్షంగా దుమ్మెత్తి పోస్తున్నాయి. ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్‌కు సంఘీభావం తెలుపుతున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్‌ సైతం పహల్గాంలో జరిగిన దాడిని ఖండించినప్పటికీ, తామే ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తున్నారనే ఆరోపణలను కొట్టిపారేసింది. Pakistan Deputy Prime Minister and Foreign Minister Ishaq Dar calls Pahalgam Islamic terrorists asFreedom fighters'And our liberals have Aman ki Asha with this Terrorist country 😡😡😡 pic.twitter.com/rrWUxWtArJ— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) April 24, 2025అయితే, ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఏప్రిల్‌ 22న పహల్గాంలో దాడి చేసిన వారు స్వాంతత్య్ర సమరయోధులని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన అధికారిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం జిల్లాలో దాడులు చేసిన ఉగ్రవాదులు స్వాతంత్య్ర సమరయోధులై ఉండవచ్చు’ అని అన్నారు. "Pakistan Army is ready for any challenge", stated Foreign Minister and Deputy Prime Minister Ishaq Dar in response to India’s actions after the Pahalgam incident. #IshaqDar #Pakistan #India #Pahalgam #TOKReports pic.twitter.com/QYfjFq6vQx— Times of Karachi (@TOKCityOfLights) April 24, 2025భారత్‌కు గట్టి బదులిస్తాంప్రధాని మోదీ పహల్గాం ఉగ్రవాదులకు బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడ దాక్కున్నా ప్రపంచపు అంచుల దాకా వెంటాడి మరీ వాళ్లను మట్టిలో కలిపేస్తాం. వారిని ప్రోత్సహిస్తున్న దుష్టశక్తినీ కఠినంగా శిక్షిస్తాం. కలలోనైనా ఉహించలేని స్థాయిలో ప్రతీకారం తీర్చుకుని తీరుతాం’ అని పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ఇషాక్‌ దార్‌ పరోక్షంగా స్పందించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా పాక్‌ సైన్యం ఎలాంటి సవాళ్లకైనా సిద్ధంగా ఉందన్నారు. భారత పౌరులు సురక్షితంగా ఉండరుభారతదేశం ఏదైనా దుస్సాహసానికి ప్రయత్నిస్తే గతంలో కంటే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పాకిస్తాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుంటే భారత పౌరులు సురక్షితంగా ఉండరని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.

Hyderabad Local Body MLC Elections Counting Updates6
Hyderabad MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ విజయం అందుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్‌ హాసన్‌కు 63 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు కేవలం 25 ఓట్లు వచ్చాయి. దీంతో, ఎంఐఎం అభ్యర్థి 38 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకున్న 25 ఓట్లు మాత్రమే పొందిన బీజేపీ అభ్యర్థికి వచ్చాయి. ఇక, ఎంఐఎంకి చెందిన 49, కాంగ్రెస్‌కి చెందిన 14 ఓట్లు కలిపి 63 ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి వచ్చాయి. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటింగ్‌పై బీజేపీ ఆశలు పెట్టుకున్నప్పటికీ ఎవరూ ఓటు వేయలేదు. దీంతో, ఓటమి ఎదురైంది. ఇక, హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 112 ఓట్లకు గాను పోలైన 88 ఓట్లు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియా సభ్యులు పోలింగ్ లో పాల్గొన్నారు. కాగా, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బీజేపీ మాత్రం క్రాస్‌ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకునప్పటికీ అలాంటి ఏమీ జరగకపోవడంతో ఓటమిని చవిచూసింది. మరోవైపు, ఎన్నికల ఫలితాలపై బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్‌ను ఎలక్షన్ కమిషన్ ఎందుకు రద్దు చేయవద్దు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఓట్లు వేయవద్దని అని చెప్తారు.. మరి మీరు ఏ విధంగా ఓట్లు అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు సహకరించింది. ఎంఐఎం చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పని చేస్తుంది. ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అనేది అర్థమవుతుంది. హైదరాబాద్, తెలంగాణ ప్రజలు ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి.ఎన్నికల్లో సహకరించిన బీజేపీ నాయకత్వానికి, అందరికీ ధన్యవాదాలు. నాకు ఓటేసిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులకు కృతజ్ఞతలు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. వారు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్న వారిని ఓటింగ్‌కు రానివ్వకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. సంఖ్య పరంగా మేము ఓడినా.. నైతికంగా నేను గెలిచాను. ఎంఐఎంకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ తొత్తులుగా మారాయి. ఎంఐఎంకు కాంగ్రెస్‌ డైరెక్ట్‌గా మద్దతు ఇస్తే.. బీఆర్‌ఎస్‌ ఓటింగ్‌కు రాకుండా దోహదపడింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా.. కౌంటింగ్‌ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఆఫీసు వద్ద భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు జీహెచ్‌ఎంసీ వద్ద మోహరించాయి.

CIA Document From 1993 Has Resurfaced Following Pahalgam Incident7
భారత్‌, పాక్‌ మధ్య యుద్ధం తప్పదా?.. సంచలన నివేదిక

భారత్, పాక్.. రెండు దేశాలూ ఒకదాని గురించి మరొకటి అంచనాలు వేయడంలో పొరపాట్లు జరిగినా లేదా రెండిట్లో ఏదో ఒక దేశం అకారణంగా అతిగా స్పందించినా... సాధారణ శతృత్వం కాస్తా అణుయుద్ధానికి దారి తీయవచ్చు! 1980, 1990ల నాటి అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదికలు ఈ ఉపద్రవాన్నే సూచిస్తున్నాయి. కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు బలిగొన్న నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మిన్నంటుతున్నాయి. ఇదే తరుణంలో విడుదలైన అమెరికన్ ఇంటెలిజెన్స్ రహస్య నివేదికలు మరిత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. డీక్లాసిఫై అయిన ఇంటెలిజెన్స్ నివేదికల పత్రాలను అమెరికాలోని నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ మంగళవారం (ఈ నెల 22న) బహిర్గతం చేసింది.నివేదికల ప్రకారం భారత్, పాక్ నడుమ యుద్ధం సంభవించే అవకాశాలు స్వల్పమే అయినప్పటికీ పరస్పరం అంచనాలు వేయడంలో ఆయా దేశాలు పొరబడినా లేదా ఉభయ దేశాల్లో ఏదో ఒకటి అహేతుకంగా ప్రతిస్పందించడమో, అసమంజస నిర్ణయాలు తీసుకోవడమో జరిగినా సంప్రదాయ వైరం కాస్తా అణుయుద్ధంగా పరిణమించవచ్చు. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 160 న్యూక్లియర్ వార్ హెడ్లు, పాక్ అమ్ములపొదిలో 165 అణు వార్ హెడ్లు ఉండవచ్చని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ అంచనా. ఆధునిక క్షిపణి వ్యవస్థలు అణుయుద్ధ ముప్పును ‘వేగవంతం’ చేస్తున్నాయి. పాక్ క్షిపణి ‘షహీన్’ ఏడు నిమిషాల్లో న్యూఢిల్లీని చేరగలదు. అలాగే భారత్ క్షిపణి ‘ప్రళయ్’ ఆరు నిమిషాల లోపే ఇస్లామాబాద్ మీద దాడి చేయగలదు. మరో ముఖ్యాంశం... ‘నో ఫస్ట్ యూజ్’ పాలసీకి తాము కట్టుబడినట్టు భారత్ గతంలో ప్రకటించింది. ఈ ‘నో ఫస్ట్ యూజ్ న్యూక్లియర్ డాక్ట్రిన్’ ప్రకారం... భారత భూభాగంపైనో, భారత సైనిక దళాలపైనో అణుదాడి జరిగితేనే మన దేశం ప్రతీకార అణుదాడులకు ఉపక్రమిస్తుంది. అంతేతప్ప భారత్ తనంతట తానుగా, ముందుగా అణ్వాయుధాలను ఏ దేశంపైనా ప్రయోగించదు. ‘ఇండియాస్ రియాక్షన్ టు న్యూక్లియర్ డెవలప్మెంట్స్ ఇన్ పాకిస్థాన్’ శీర్షికతో ఉన్న 1981 నాటి అమెరికన్ స్పెషల్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ (ఎస్ఎన్ఐఈ) ప్రకారం... తమ భద్రతకు తీవ్రంగా ముప్పు వాటిల్లుతుందని భావిస్తేనే భారత్ ముందస్తుగా పాక్ అణు కేంద్రాలపై దాడులు చేస్తుంది. ఇక ‘నో ఫస్ట్ యూజ్ అణు విధానం లాంటి స్వీయ నియంత్రణ, కట్టుబాట్లు మన పొరుగు దేశానికి లేవు. 2019లో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ వద్ద బాంబులు వేసి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశాయి. అలాంటి సాధారణ, సంప్రదాయ దాడి సందర్భాల్లో పరిస్థితులను అర్థం చేసుకోకుండా పాకిస్థాన్ ఒకవేళ అసంబద్ధంగా ప్రవర్తిస్తే జరిగేది... అణుయుద్ధమే!.ఇండియాతో మరో యుద్ధం తలెత్తితే తమ దేశం మొత్తం కాకపోయినా తమ మిలిటరీ నాశనమవుతుందని పాక్ సైనిక నాయకత్వం భయపడినట్టు 1993 నాటి సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) రహస్య నివేదిక ఒకటి వెల్లడించింది. ‘ఇండియా-పాకిస్థాన్: ప్రాస్పెక్ట్స్ ఫర్ వార్ ఇన్ ద నైంటీస్’ శీర్షికతో ఉన్న ఈ నివేదిక... భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు 20% (ఐదింట ఒక వంతు) ఉన్నట్టు అప్పట్లో అంచనా వేసింది.- జమ్ముల శ్రీకాంత్.Conflict with India could destroy Pak military, if not the entire state : declassified CIA docs.Recently declassified paper predicted a spectacular terror attack could increase chances of conflict, Pak would fear destruction of the state.https://t.co/PfOwuRym9A pic.twitter.com/StP3TDJPZi— Manu Pubby (@manupubby) April 24, 2025పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం దౌత్యపరమైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. అందులో సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో ప్రధాన చర్చనీయాంశమైంది. భారత్‌ చర్యలకు ప్రతిగా.. పాక్‌ కూడా భారత్‌పై పలు ఆంక్షలను విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది.

Microsoft HR Policy For Employees PIP or Severance8
ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?

తక్కువ పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులకు రెండు ఆప్షన్లు ఇచ్చేలా మైక్రోసాఫ్ట్ ‍ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒకటి.. పర్ఫార్మెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(పనితీరు మెరుగుదల కార్యక్రమం-పీఐపీ). ఇందులో భాగంగా కఠినమైన లక్ష్యాలను అంగీకరించి, అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉద్యోగులు వృత్తిపరంగా తమనుతాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. రెండోది.. కంపెనీ ఆఫర్‌ చేసిన ప్యాకేజీని తీసుకొని కంపెనీ నుంచి నిష్క్రమించడం. స్వచ్ఛందంగా వైదొలగాలనుకునే ఉద్యోగులకు కంపెనీ 16 వారాల వేతనాన్ని అందిస్తోంది. అయితే ఈ రెండు ఆప్షన్స్‌లో దేన్ని ఎంచుకుంటారనే దానిపై ఉద్యోగులు ఐదు రోజుల్లో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.బిజినెస్ ఇన్‌సైడర్‌ నివేదిక ప్రకారం మైక్రోసాఫ్ట్ కొత్త చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్మన్ ఒక ఈమెయిల్‌లో ఈమేరకు వివరాలు వెల్లడించారు. ‘అధిక పనితీరును వేగవంతం చేయడానికి, తక్కువ పనితీరు సమస్యను అంతే వేగంగా పరిష్కరించడానికి ఈ విధానం మెరుగైన సాధనంగా తోడ్పడుతుంది’ అని ప్రకటించారు. మైక్రోసాఫ్ట్‌లో పీఐపీలు ఎంచుకున్న ఉద్యోగులు వారి పనితీరును బెంచ్‌మార్క్‌తో రుజువు చేసుకోవాల్సి ఉంటుంది లేదా కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన ‘గ్లోబల్ వాలంటరీ సెపరేషన్ అగ్రిమెంట్ (జీవీఎస్‌ఏ) కింద సెవెరెన్స్ ప్యాకేజీని ఎంచుకోవాలని ఈమెయిల్‌లో సూచించారు. పీఐపీ మార్గాన్ని ఎంచుకున్న వారు సెవెరెన్స్ ప్రయోజనాలను కోల్పోతారని కంపెనీ తెలిపింది. అందుకు సంబంధించి ఉద్యోగులు ఐదు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఈమెయిల్‌లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘మీరూ జాగ్రత్తగా ఉండాలి’పీఐపీ సమయంలో పేలవమైన పనితీరు ప్రదర్శించిన ఉద్యోగులపై రెండేళ్లపాటు తిరిగి సంస్థలో చేరకుండా నిషేధం విధిస్తూ ఈ విధానం నిర్ణయం తీసుకుంది. పనితీరు తక్కువగా ఉన్న సిబ్బందిని మైక్రోసాఫ్ట్‌లోని ఇతర ప్రాజెక్ట్‌ల్లో బదిలీ చేయకుండా కూడా ఈ విధానం పరిమితులు విధించింది. మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ప్రారంభంలో తక్కువ పనితీరు కనబరిచిన సుమారు 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన, పారదర్శకమైన సర్వీసులు అందించడానికి, జవాబుదారీతనం, పనితీరును బలోపేతం చేయడానికి ఈ కొత్త చర్యలు రూపొందించినట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ కోల్మన్ తెలిపారు.

Ananya Nagalla paid her Last Respect to Pahalgam Incident Victim Madhusudan Rao9
పహల్గాం బాధితుడి ఇంటికి అనన్య నాగళ్ల.. నెట్టింట ప్రశంసలు

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 26 మంది అసువులు బాశారు. వారిలో నెల్లూరుకు చెందిన మధుసూధనరావు ఒకరు. ఓ ఈవెంట్‌ కోసం నెల్లూరు వెళ్లిన హీరోయిన్‌ అనన్య నాగళ్ల.. మధుసూధనరావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించింది. అతడి భౌతికకాయానికి నివాళులు అర్పించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. తీవ్రంగా ఖండించాలిపహల్గామ్‌ సంఘటన నాకెంతో బాధ కలిగించింది. నేను ఒక ఈవెంట్ కోసం నెల్లూరుకి వచ్చాను. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తి నెల్లూరు పక్కన కావలి అని తెలుసుకొని చూసేందుకు వచ్చాను. మతం పేరు తెలుసుకుని మరీ చంపేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. శ్రీ మధుసూదనరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. భారత యువతగా మనం ఇలాంటి ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించాలి.సోషల్‌ మీడియాలో సంతాపాలు..భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అని అనన్య (Ananya Nagalla) ట్వీట్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉగ్రదాడిలో మరణించినవారికోసం సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు తప్పితే ఏ ఒక్కరూ వారి ఇంటికెళ్లి కుటుంబాలను పరామర్శించలేదు. మీరే నిజమైన హీరోయిన్‌కానీ మీరు మాత్రం నేరుగా బాధితుడి ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మీరు నిజమైన హీరోయిన్‌ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా అనన్య నాగళ్ల గతంలోనూ తన మంచి మనసు చాటుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవించినప్పుడు ప్రభుత్వానికి విరాళాలు అందించి ప్రశంసలు అందుకుంది.తెలుగమ్మాయి సినీ కెరీర్‌అనన్య నాగళ్ల తెలుగమ్మాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి తన స్వగ్రామం. నటనపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి షార్ట్‌ ఫిలింస్‌లో నటించింది. షాదీ అనే లఘు చిత్రం తనకు బాగా పేరు తెచ్చిపెట్టింది. 2019లో మల్లేశం సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ప్లే బ్యాక్‌, వకీల్‌ సాబ్‌, మళ్లీ పెళ్లి, తంత్ర, పొట్టేల్‌, శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌ వంటి పలు చిత్రాలతో అలరించింది. బహిష్కరణ అనే వెబ్‌ సిరీస్‌ కూడా చేసింది. పహల్గామ్ సంఘటన నాకెంతో బాధను కలిగించింది. ఈ రోజు నేను ఒక ఈవెంట్ కోసం నెల్లూరుకి వచ్చాను… ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తి నెల్లూరు పక్కన కావలి అని తెలుసుకొని చూసేందుకు వచ్చాను… మతం పేరు తెలుసుకుని మరి చంపేయడాన్ని నేను తిసుకోలేకపోతున్నాను..శ్రీ మధుసూదనరావు గారి ఆత్మకు శాంతి… pic.twitter.com/q2ZuMj2G8M— Ananya Nagalla (@AnanyaNagalla) April 24, 2025 చదవండి: పాక్‌ నటుడికి బాలీవుడ్‌ బ్యూటీ సపోర్ట్‌.. వారిపై బ్యాన్‌ కరెక్ట్‌ కాదు

Tollywood Actors Spent Rs 17 Lakh On A Fancy Car Number10
అంతా.. ఫ్యాన్సీ ఫ్యాన్సే..! ఏంటీ ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్‌..

గత కొంతకాలంగా టాలీవుడ్‌ స్టార్లు తమ వాహనాల నెంబర్ల కోసం ఎంతటి ఖర్చుకైనా సై అంటున్నారు. ఇటీవలె ఓ ప్రముఖ టాలీవుడ్‌ నటుడు తన వాహనం కోసం ఓ ఫ్యాన్సీ నెంబర్‌ను వేలంలో కొనుగోలు చేశారు. ఆయన ఈ నెంబర్‌ కోసం ఏకంగా రూ.7లక్షలకు పైగా వెచ్చించడం విశేషం. ఆయనొక్కరే కాదు టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు తమకు నచ్చిన నెంబర్ల కోసం పోటీపడుతున్నారు. అయితే స్టార్ల ఆరాటం వెనుక అనేక రకాల సెంటిమెంట్లు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల నగరానికి చెందిన కార్పొరేట్‌ కంపెనీలు సైతం నెంబర్ల వేటలో స్టార్లతో పోటీపడుతుండడం కనిపిస్తోంది. మహేష్‌ నుంచి మాస్‌ మహారాజ్‌ దాకా.. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సైతం నెంబర్ల వేటకు నేను సైతం అంటున్నారట. ఆయన తన వాహనాలైన రేంజ్‌ రోవర్, మెర్సిడీజ్‌ జీఎల్‌ఎస్‌ల కోసం టీఎస్‌ 09 ఇకె 600, టీఎస్‌ 09 జీఒ 600 లను కొనుగోలు చేశారట. నాగార్జున బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ కోసం ఏపీ 09 బీడబ్ల్యూ 9000ను వేలంలో దక్కించుకున్నారని సమాచారం. నెంబర్‌ను ఆయన పవర్‌ఫుల్‌ నెంబర్‌గా పరిగణిస్తారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా నెంబర్లపై ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తున్నారట. ఆయన తన రేంజ్‌రోవర్, వోల్వో ఎక్స్‌సీ 90 నెంబర్‌ టీఎస్‌07 జీఇ 9999 రూ.10లక్షలు పైనే ఖర్చు చేశారని సమాచారం. సీనియర్‌ హీరో రవితేజ కూడా తన ఎలక్ట్రిక్‌ వాహనం బీవైడీ అట్టో 3 నెంబరు టీఎస్‌ 09 జీబీ 2628 కోసం రూ.17,628 వెచి్చంచారని సమాచారం. కార్పొరేట్‌ కంపెనీలు సైతం.. హీరో బాలకృష్ణ తర్వాత ‘0009’నెంబర్‌ను నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కొనుగోలు చేయడం విశేషం. కంపెనీలు సైతం తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లను పొందేందుకు పోటీ పడుతున్నాయనడానికి ఇదో నిదర్శనం. వ్యాపార ప్రతిష్ఠను పెంచడంలో, బ్రాండ్‌ గుర్తింపును పెంచడంలో వాహనాల నెంబర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ఆర్టీఓ నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలంలో ‘టీజీ 09 9999’ నంబర్‌ను సోనీ ట్రాన్స్‌పోర్ట్‌ సొల్యూషన్స్‌ సంస్థ రూ.25.5 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ నంబర్‌ను టయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌ వాహనానికి కేటాయించారట. మెఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌) ‘టీజీ 09 డీ 0009’ నంబర్‌ను రూ.10.4 లక్షలకు సొంతం చేసుకుంది. ‘టీజీ 09 సీ 9999’ నంబర్‌ను రూ.7.19 లక్షలకు శ్రియాన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కొనుగోలు చేసిందట. అదే విధంగా పోరస్‌ అగ్రో ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ’ టీజీ 09 డీ 0006’ నంబర్‌ను రూ.3.65 లక్షలకు దక్కించుకుందని, వేగశ్రి గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ‘టీజీ 09 డీ 0005’ నంబర్‌ను రూ.3.45 లక్షలకు కొనుగోలు చేసిందని సమాచారం.జూనియర్‌ ఎన్‌టీఆర్‌ సైతం.. సినీ హీరో నందమూరి బాలకృష్ణ రూ.7.75 లక్షలకు అత్యంత డిమాండ్‌ ఉన్న ‘0001’ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను దక్కించుకుని వార్తల్లో నిలిచారు. అదే విధంగా టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్‌టీఆర్‌ సైతం ఫ్యాన్సీ నెంబర్ల వేటలో ముందున్నారట. ఆయన రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన లాంబోర్గినీ ఉరూస్‌ వాహనం నెంబర్‌ కోసం భారీగానే వెచ్చించారని విస్వసీయ వర్గాల సమాచారం. టీఎస్‌ 09 ఎఫ్‌ఎస్‌ 9999 కోసం ఏకంగా రూ.17లక్షలు వ్యయం చేశారు. ఎనీ్టయార్‌ దాదాపుగా తన అన్ని కార్లకూ 9999 నెంబర్‌నే ఎంచుకుంటారట. సెంటిమెంట్స్‌తో ఆర్టీఏకి కాసుల పంట.. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తమ వాహనాలకు ప్రత్యేక నంబర్లను పొందడం ద్వారా తమ ప్రతిష్ఠను పెంచుకోవాలని చూడడం ఈ ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్‌ పెరగడానికి కారణమవుతోంది. అలాగే 6, 9 తదితర నంబర్లను సెంటిమెంట్‌గా లక్కీ నెంబర్లుగా భావించడం కూడా మరో కారణం. కంపెనీలు తమ బ్రాండ్‌ను ప్రత్యేకంగా చూపించేందుకు ప్రత్యేక నంబర్లను ఉపయోగిస్తున్నాయి. ఏదైతనేం.. సదరు సెంటిమెంట్లు, క్రేజ్‌ మూలంగా గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో నగరంలోని ఐదు ఆర్టీఓ కార్యాలయాలు ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.124.20 కోట్లు ఆదాయాన్ని గడించాయి. పోటీ పెరుగుతుండడంతో వీటి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఇది గత ఏడాది ఆదాయం రూ.118 కోట్లతో పోలిస్తే సుమారు 5% పెరుగుదల నమోదైందని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement