అమితాబ్‌తో మరోసారి రేఖ | After 3 decades, Rekha pairs up with Amitabh in 'Shamitabh' | Sakshi

అమితాబ్‌తో మరోసారి రేఖ

Published Wed, Oct 8 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

అమితాబ్‌తో మరోసారి రేఖ

అమితాబ్‌తో మరోసారి రేఖ

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటి రేఖలది ఒకప్పుడు సూపర్ హిట్ పెయిర్. వీరిద్దరి గురించి రకరకాల ప్రచారం కూడా జరిగింది. ఇప్పటికీ అవివాహితగానే ఉన్న రేఖ అరుదుగా చిత్రాల్లో నటిస్తున్నారు.

 బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటి రేఖలది ఒకప్పుడు సూపర్ హిట్ పెయిర్. వీరిద్దరి గురించి రకరకాల ప్రచారం కూడా జరిగింది. ఇప్పటికీ అవివాహితగానే ఉన్న రేఖ అరుదుగా చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే మళ్లీ అమితాబ్ బచ్చన్, రేఖలు కలిసి నటించి చాలా కాలమైంది. ఈ సంచలన జంటను మళ్లీ కలపాలని చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు బాల్కి అమితాబ్, రేఖలను కలిపి చిత్రం చేస్తున్నారు. ఈయన ఇంతకు ముందు అమితాబ్‌తో చీని కమ్, పా వంటి వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కించారు. దీంతో బాల్కి తన తాజా చిత్రం షమితాబ్‌లో అమితాబ్ బచ్చన్, రేఖలను నటింప చేస్తున్నారు.
 
 ఈ చిత్రంలో నటుడు ధనుష్, అక్షర హాసన్‌లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రేఖ నటిస్తున్న విషయాన్ని రహస్యంగా ఉంచగా నటుడు ధనుష్ తన ట్విటర్‌లో పేర్కొంటూ బహిరంగ పరిచారు. రేఖ ప్రముఖ దివంగత నటుడు జెమిని గణేశన్ కూతురన్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో ప్రముఖ కథానాయికిగా వెలుగొందిన రేఖ తమిళ నటుడు ధనుష్‌తో నటించడం ఇదే తొలిసారి. అందుకే ఆయన రేఖతో నటించాననే ఆనందాన్ని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇంతకీ ఈ చిత్రంలో అమితాబ్, రేఖల మధ్య సంబంధం ఏమిటో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement