
చిన్న సినిమాలను బతికించండి..
జీఎస్టీతో ప్రాంతీయ సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలను తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ప్రాంతీయ భాషా చిత్రాలకు 12శాతం పన్ను నిర్ణయించాలని కోరుతూ అరుణ్‌జైట్లీకి వినతిపత్రం సమర్పించారు. అలాగే చిరు వర్తకుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. హైబ్రిడ్ వాహనాలపై 28శాతం, ఎలక్ట్రిక్ పరికరాలపై –12 సెస్సు, ప్లాస్టిక్ – 28శాతం, ఆయుర్వేద ఉత్పత్తులపై 12శాతం జీఎస్టీతో ఆ రంగాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ రంగాలపై పన్ను తగ్గించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారని కేతిరెడ్డి వినతిపత్రంలో పేర్కొన్నారు.