ఆడకుండానే లంక క్రికెట్ టీమ్ వెనక్కి | Srilankan junior cricket team sent back citing security reasons | Sakshi

ఆడకుండానే లంక క్రికెట్ టీమ్ వెనక్కి

Published Mon, Aug 4 2014 11:17 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

ఆడకుండానే లంక క్రికెట్ టీమ్ వెనక్కి - Sakshi

ఆడకుండానే లంక క్రికెట్ టీమ్ వెనక్కి

శ్రీలంక అండర్-15 క్రికెట్ టీమ్ చెన్నై నుంచి స్వదేశానికి వెనుతిరిగింది. భద్రతా కారణాలరీత్యా జూనియర్ క్రికెటర్లు ఆడకుండానే ఇంటిముఖం పట్టారు.


చెన్నై : శ్రీలంక అండర్-15 క్రికెట్ టీమ్ చెన్నై నుంచి స్వదేశానికి వెనుతిరిగింది. భద్రతా కారణాలరీత్యా జూనియర్ క్రికెటర్లు ఆడకుండానే ఇంటిముఖం పట్టారు.  అండర్-15 టోర్నమెంట్లో పాల్గొనేందుకు గత రాత్రి కొలంబో నుంచి 16మంది జట్టు సభ్యులు చెన్నై చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఆటగాళ్లకు భద్రత కల్పించలేమని తమిళనాడు పోలీసులు చేతులెత్తేశారు.

షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నమెంట్ స్థానిక నెహ్రు స్టేడియంలో ఈనెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ జరగాల్సి ఉంది. ముఖ్యమంత్రి జయలలితపై అనుచిత వ్యాసాన్ని ప్రచురించిన శ్రీలంక రక్షణ శాఖ ధోరణిపై  తమిళనాడు అట్టుడుకుతున్న విషం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో శ్రీలంక ఆటగాళ్లకు రక్షణ కల్పించలేమని పోలీసులు స్పష్టం చేశారు.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement