Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Govt illegal case on Raj Kasireddy1
మద్యం మసి పూసి.. సిట్‌ పోలీసుల ‘కసి’

సాక్షి, అమరావతి: అక్రమ కేసులు నమోదు చేయడం..లేని ఆధారాలు సృష్టించేందుకు బెది­రింపులు, వేధింపులకు పాల్పడడమే చంద్రబాబు ప్రభుత్వ ఏకైక విధానంగా మారింది. రెడ్‌ బుక్‌ కుట్రలను అమలు చేయడమే పనిగా పెట్టుకున్న సిట్‌ అధికారులు ప్రభుత్వ పెద్దల కోసం చట్టాన్ని ఉల్లంఘిస్తూ బరితెగిస్తున్నారు. ఇందులోభాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్‌ పన్నాగం పరాకాష్టకు చేరింది. ఈ అక్రమ కేసులో సాక్షిగా విచారణకు పిలిచిన రాజ్‌ కసిరెడ్డిని సిట్‌ అధికారులు సోమవారం హైదరాబాద్‌లో అరెస్టు చేయడమే దీనికి తాజా నిదర్శనం. విజయవాడలో సిట్‌ అధికారుల ఎదుట మంగళవారం విచారణకు హాజరవుతానని చెప్పిన ఆయనను హడావుడిగా అరెస్టు చేయడం వెనుక పక్కా కుట్ర ఉందన్నది స్పష్టమవుతోంది. గోవా నుంచి సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్న రాజ్‌ కసిరెడ్డిని శంషాబాద్‌ విమానాశ్రయంలోనే సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం విచారణకు హాజరవుతానని చెప్పినా వినిపించుకోకుండా తమ వాహనంలోకి ఎక్కించి విజయవాడకు తరలించారు. ఓ వైపు న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం అయినప్పటికీ సిట్‌ అధికారుల రాజ్‌ కసిరెడ్డిని హడావుడిగా అరెస్టు చేయడం వెనుక అసలు పన్నాగం ఇలా ఉంది. విచారణకు వస్తానంటే అరెస్టు ఏమిటో...? రెడ్‌బుక్‌ కక్ష సాధింపే తప్ప మరొకటి తమ ఉద్దేశం కాదని చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. ఈ కేసులో రాజ్‌ కసిరెడ్డిని సోమవారం హడావుడిగా అరెస్టు చేసిన తీరే అందుకు నిదర్శనం. మంగళవారం సిట్‌ విచారణకు హాజరవుతానని ఆయన సోమవారం మధ్యాహ్నం ఆడియో సందేశం విడుదల చేశారు. అయినా సోమవారం సాయంత్రం హడావుడిగా హైదరాబాద్‌లో అరెస్టు చేయల్సిన అవసరం ఏమిటి? అంటే ఆయనను విచారించడం.. వాస్తవాలు తెలుసుకోవడం తమ లక్ష్యం కాదని సిట్‌ తన చేతల ద్వారా వెల్లడించింది. అరెస్టు చేసి వేధించి.. ప్రభుత్వ రెడ్‌బుక్‌ కుట్రకు అనుకూలంగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే తమ అసలు కుట్ర అని తేల్చిచెప్పింది. రాజ్‌ కసిరెడ్డి విషయంలో సిట్‌ మొదటి నుంచీ అదే కుతంత్రంతో వ్యవహరిస్తోంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు రావాలని ఆయనకు సిట్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో కుటంబ సభ్యులకు నోటీసులు అందించారు. తనను ఏ విషయంలో విచారించాలని భావిస్తున్నారో తెలియజేస్తే తగిన సమాచారంతో వస్తానని ఆయన సిట్‌ అధికారులకు ఈ–మెయిల్‌ ద్వారా తెలిపారు. కానీ, ఆయన అడిగిన సమాచారం ఇవ్వకుండా వెంటనే మరోసారి ఈ–మెయిల్‌ ద్వారా నోటీసులు పంపడం గమనార్హం. దాంతో రాజ్‌ కసిరెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు నిర్ణయం అనంతరం విచారణకు స్వయంగా వస్తానని.. దర్యాప్తునకు సహకరిస్తానని కూడా రెండు రోజుల క్రితం ఓ ఆడియో సందేశం పంపించారు. ఇంతలో న్యాయ ప్రక్రియకు కాస్త సమయం పడుతుండటంతో ఇక తానే మంగళవారం విచారణకు వచ్చి పూర్తిగా సహకరిస్తానని సోమవారం తెలిపారు. అంటే మంగళవారం ఆయన విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి వస్తారని తెలుసు. మరి రాజ్‌ కసిరెడ్డిని హైదరాబాద్‌లో సోమవారమే అరెస్టు చేయల్సిన అవసరం ఏమొచ్చింది? న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం ఈ అంశం ప్రసుతం న్యాయస్థానం పరిధిలో ఉంది కూడా. తనకు జారీ చేసిన నోటీసులను సవాల్‌ చేస్తూ రాజ్‌ కసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ కోసం కూడా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ రెండు ప్రస్తుతం ఆయా న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. మరోవైపు విచారణకు హాజరవుతాను.. దర్యాప్తునకు సహకరిస్తానని కూడా రాజ్‌ కసిరెడ్డి చెప్పారు. అయినా సరే అరెస్టు చేయడం గమనార్హం. దీని వెనుక పోలీసుల పక్కా కుట్ర ఉందన్నది సుస్పష్టం బెదిరించి లొంగదీసుకునేందకునా..! ఇప్పటికే కుటంబు సభ్యులను తీవ్రంగా వేధించిన సిట్‌ రెడ్‌బుక్‌ కుట్రకు అనుకూలంగా రాజ్‌ కసిరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే సిట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఆయనను హడావుడిగా అరెస్టు చేసింది. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో సోమవారం అర్ధరాత్రి విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి తీసుకువచ్చారు. సిట్‌ చీఫ్, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు ఆ సమయంలో కార్యాలయంలోనే ఉన్నారు. మంగళవారం తెల్లవారుజాము వరకు ఆయనను బెదిరించి పూర్తిగా తమకు అనుకూలంగా లొంగదీసుకోవడమే సిట్‌ ప్రస్తుత లక్ష్యం. ఇప్పటికే ఈ కేసులో రాజ్‌ కసిరెడ్డి కుటుంబ సభ్యులను సిట్‌ అధికారులు కొన్ని రోజులుగా తీవ్రంగా వేధించి బెంబేలెత్తించారు. హైదరాబాద్‌లోని రాజ్‌ కసిరెడ్డి నివాసానికి వెళ్లి తల్లిదండ్రులతో పాటు సమీప బంధువులను కూడా బెదిరించి వేధించారు. ఆయన సన్నిహితుడు, ఎరేట్‌ హాస్పిటల్స్‌ అధినేత విజేయంద్రరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను కూడా బెదిరించారు. ఈ విధంగా రాజ్‌ కసిరెడ్డి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితులు అందరినీ లక్ష్యంగా చేసుకుని పోలీసులు తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ప్రస్తుతం రాజ్‌ కసిరెడ్డి పైనే పూర్తి స్థాయిలో పోలీసు మార్క్‌ ప్రతాపం చూపించనున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయనను బెదిరిస్తున్నట్టు సమచారం. మొదటినుంచీ సిట్‌ తీరు అంతే.. అక్రమ కేసులో లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్‌ మొదటి నుంచి కూడా దండనీతినే నమ్ముకుంది. బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను తీవ్రస్థాయిలో వేధించి సాధించింది. సిట్‌ అధికారుల బెదిరింపులపై ఆయన మూడు సార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా సరే సిట్‌ తీరు మాత్రం మారలేదు. వాసుదేవరెడ్డిని మూడు రోజుల పాటు గుర్తు తెలియని ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించి మరీ వేధించింది. తద్వారా తాము చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేలా ఒప్పించింది. వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వెంటనే ప్రభుత్వం ఆయనను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్‌ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం. అదే రీతిలో బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ స్పెషల్‌ ఆఫీసర్‌ సత్యప్రసాద్, చిరుద్యోగి అనూషను కూడా సిట్‌ అధికారులు వేధించి బెదిరించి వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. ఇక విజయ సాయిరెడ్డి ఎంపీగా మరో మూడున్నరేళ్లు పదవీ కాలం ఉన్నా సరే కేవలం టీడీపీకి కూటమికి రాజ్యసభలో ప్రయోజనం కలిగించేందుకే రాజీనామా చేశారు. ఉప ఎన్నిక నిర్వహిస్తే ఆ సీటు గెలుచుకునేందుకు వైఎస్సార్‌సీపీకి తగినంత మంది ఎమ్మెల్యేల బలం లేదని తెలిసినా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం కేవలం చంద్రబాబు కుట్రలో భాగమే. అసలు ఎలాంటి కుంభకోణం జరగనే లేదని విజయసాయిరెడ్డే సిట్‌ విచారణ అనంతరం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయినా సరే అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి సిట్‌ అధికారులు బరితెగించి బెదిరింపులకు పాల్పడుతూ అధికారికంగా గూండాగిరీకి తెగిస్తున్నారు. కుట్రతోనే వక్రీకరణ ప్రైవేట్‌ కంపెనీల వ్యవహారంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎలాంటి అవినీతి లేని ఈ వ్యవహారంలో నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్‌ కొత్త కొత్త కట్టుకథలను తెరపైకి తెస్తోంది. అదాన్‌ డిస్టిలరీల ఏర్పాటుకు రూ.100 కోట్ల అప్పు ఇప్పించడం అంటూ వినిపించిన కథ తాజా వక్రీకరణ. తన అల్లుడు కుటుంబానికి చెందిన అరబిందో కంపెనీ అదాన్‌ డిస్టిలరీ ఏర్పాటునకు రూ.100 కోట్లు అప్పు ఇచ్చిందని విజయసాయిరెడ్డి చెప్పారు. అంటే అరబిందో కంపెనీ అప్పు ఇచ్చింది. అదాన్‌ డిస్టిలరీస్‌ తీసుకుంది. అది రెండు కంపెనీల మధ్య వ్యవహారం. దేశంలో ఎన్నో ప్రైవేటు కంపెనీల మధ్య అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం సర్వసాధారణం. దానిపై ఆ రెండు కంపెనీల్లో ఎవరూ కూడా ఫిర్యాదు చేయనే లేదు. మరి ఆ వ్యవహారానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం ? ఆ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ ఈ కేసుకు ముడిపెట్టాలని యత్నించడం హాస్యాస్పదంగా ఉంది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే.. దర్యాప్తు పేరిట సిట్‌ ఎందుకు ఇంతగా నిబంధనలకు విరుద్ధంగా బరితెగిస్తోంది...!? అంటే వినిపించే ఏకైక సమాధానం.. అసలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఎలాంటి అవినీతి లేదు కాబట్టే లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్‌ ఇంతగా దిగజారుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43వేల బెల్ట్‌ దుకాణాలను తొలగించింది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు లైసెన్సులు మంజూరు చేశాయి. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మరి మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి..? ఇవ్వవనే ఇవ్వవు. ఎలాంటి అవినీతి లేని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో సిట్‌ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోతోంది. అందుకే అప్పటి అధికారులు, ఇతర సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగానే కేసును కొనసాగించడమే సిట్‌ ఏకైక విధానంగా మారింది. అసలు లేని కుంభకోణంపై అక్రమ కేసు నమోదు చేసి రాజ్‌ కసిరెడ్డి లక్ష్యంగా పావులు కదుపుతుండడం గమనార్హం. ఆయన కేవలం కొంత కాలం అదీ కోవిడ్‌ వ్యాప్తి ఉన్న రోజుల్లో పరిశ్రమల శాఖ సలహాదారుగా మాత్రమే వ్యవహరించారు. ఆయన పదవీ కాలాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెన్యువల్‌ కూడా చేయనే లేదు. రాజ్‌ కసిరెడ్డికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానానికి ఎలాంటి సంబంధమే లేదు.

ED Notice Issued To Actor Mahesh Babu2
మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు

టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు(Mahesh Babu) కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న విచారణకు రావాలని అందులో పేర్కొంది. ఇటీవల సాయి సూర్య డెవలపర్స్‌, సురానా గ్రూపులపై ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థల ప్రాజెక్టులకు మహేష్‌ ప్రచార కర్తగా వ్యవహరించారు. ప్రచారం చేసి రూ.5.9 కోట్లు మహేష్‌ అందుకున్నారు. సాయి సూర్య డెవలపర్స్‌ సంస్థ తరఫున ప్రమోషన్‌ కింద రూ.2.5 కోట్ల నగదు, రూ.3.4 కోట్లు చెక్‌ రూపంలో ఆయన అందుకున్నట్లు సమాచారం. పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఇన్‌ఫ్లుయెన్స్‌ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే లావాదేవీలపై ఈడీ ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉంది.

Google Monopoly Ends For Android TVs In India Check The Fine Details3
గూగుల్ ఆధిపత్యానికి చెక్: ఇక అంతా యూజర్ ఇష్టం..

గూగుల్, ఆండ్రాయిడ్ టీవీ కేసు ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. భారతదేశ స్మార్ట్ టీవీ మార్కెట్‌లో టెక్ దిగ్గజం 'గూగుల్' అనుసరిస్తున్న విధానాలు సరికాదని 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' (CCI) ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్మార్ట్ టీవీలలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ను గూగుల్ ప్లే స్టోర్‌లో డిఫాల్ట్‌గా అందించడాన్ని ఇకపై కొనసాగించమని కంపెనీ స్పష్టం చేసింది. సీసి ఆదేశాల మేరకు గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.ఇండియా స్మార్ట్ టీవీ రంగంలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. యాంటీ కాంపిటీటివ్ పద్ధతులు అవలంబిస్తోందని, మార్కెట్‌లో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోందని సీసీఐ ఆరోపించింది. గూగుల్‌కు ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లో ఒకటైన భారతదేశంలో.. స్మార్ట్ టీవీల కోసం గూగుల్ రూపొందించిన 'టెలివిజన్ యాప్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్' కింద, తమ ఆపరేటింగ్ సిస్టమ్, ప్లే స్టోర్ & ఇతర అప్లికేషన్‌లను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయడం ద్వారా గూగుల్ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' దర్యాప్తులో గుర్తించింది.గూగుల్, ఆల్ఫాబెట్‌లపై ఇద్దరు భారతీయ యాంటీట్రస్ట్ న్యాయవాదులు కేసు దాఖలు చేశారు, దీని తర్వాత CCI ఈ విషయంలో దర్యాప్తుకు ఆదేశించింది. గ్లోబల్ టెక్ దిగ్గజం ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్టమ్‌లను లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల కోసం సవరించిన వాటిని అభివృద్ధి చేయాలనుకునే చిన్న సంస్థలకు.. గూగుల్ అడ్డంకులను సృష్టించే పద్దతులను అవలంబిస్తున్నట్లు విచారణలో తెలిసింది.సీసీఐ ఆదేశాల మేరకు.. గూగుల్ కంపెనీ ఒక సెటిల్‌మెంట్ అప్లికేషన్ దాఖలు చేయడానికి అంగీకరించింది. దీని ప్రకారం.. భారతదేశంలోని ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల కోసం ప్లే స్టోర్, ప్లే సర్వీసులను ఒకే ప్యాకేజీగా కాకుండా.. విడిగా లైసెన్స్ ఇచ్చేందుకు గూగుల్ ప్రతిపాదించింది. కొత్త ఒప్పందం ప్రకారం, ప్రీ-ఇన్‌స్టాలేషన్ కోసం ఉచితంగా అందించబడుతున్న గూగుల్ ప్లే స్టోర్, ప్లే సర్వీసులకు ఇకపై లైసెన్స్ ఫీజు వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది.భారతదేశంలో ఆండ్రాయిడ్ టీవీలను విక్రయించే అన్ని భాగస్వాములకు ఓ లేఖ పంపించాలని గూగుల్‌ను సీసీఐ ఆదేశించింది. ఇకపై వారు గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను ఖచ్చితంగా ఉపయోగించాల్సిన అవసరం లేదు. కాబట్టి తమకు నచ్చిన ఏదైనా ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను వాడుకునే స్వేచ్ఛ ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేయాలని సూచించింది.గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్, ప్లే స్టోర్‌ను ఇష్టపడే వినియోగదారులు ఇకపై టీవీ కొనుగోలు చేసే ముందు.. తాము ఎంచుకున్న మోడల్‌లో ఏవి ఇన్‌స్టాల్ అయి ఉన్నాయో రిటైలర్లు లేదా బ్రాండ్‌లను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇకపై ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లు, యాప్ స్టోర్‌లు కూడా స్మార్ట్ టీవీ తయారీదారులతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉంది.ప్రస్తుతానికి అన్ని అప్లికేషన్ స్టోర్లలో అన్ని యాప్‌లు అందుబాటులో లేవు. గూగుల్ ప్లే స్టోర్, అమెజాన్ యాప్ స్టోర్ వంటివి టీవీ వినియోగదారుల కోసం విస్తృత శ్రేణి యాప్‌లను అందిస్తున్నాయి. అనేక ప్రధాన యాప్ డెవలపర్లు కూడా ప్రధానంగా యాపిల్, గూగుల్, అమెజాన్ స్టోర్‌లకు సేవలు అందిస్తున్నారు.కొత్త ఒప్పందం ప్రకారం.. భారతదేశంలోని ఆండ్రాయిడ్ టీవీ భాగస్వాములు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఎంచుకోవడమే కాకుండా, తమ టీవీలలో ఏ గూగుల్ యాప్‌లను డిఫాల్ట్‌గా ఉంచాల్సిన అవసరం లేదు. ఇది ప్రస్తుతం స్మార్ట్ టీవీలకే పరిమితమైంది. భవిష్యత్తులో దీనిని ఇతర పరికరాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని సీసీఐ తెలిపింది. ఈ కేసు సెటిల్‌మెంట్ కింద గూగుల్ 2.38 మిలియన్ డాలర్లు లేదా రూ. 20 కోట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Harvard University Sues Trump Over US Federal Funding Cuts4
ట్రంప్‌ యాక్షన్‌.. హార్వర్డ్‌ యూనివర్సిటీ రియాక్షన్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చర్యలకు.. హార్వర్డ్‌ యూనివర్సిటీ(Harvard University) తగ్గేదే లే అంటోంది. విశ్వవిద్యాలయానికి అందించే ఫెడరల్‌ నిధులకు ట్రంప్‌ సర్కార్‌ కత్తెర వేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కత్తెరకు సిద్ధపడుతున్న తరుణంలో విశ్వవిద్యాలయం అనూహ్యంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.ఫెడరల్‌ నిధులను నిలిపివేయడం ద్వారా.. విద్యాపరమైన నిర్ణయాలపై నియంత్రణ సాధించడానికి ట్రంప్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ మసాచుసెట్స్‌ (massachusetts) కోర్టులో దావా వేసింది. అంతేకాదు పలు యూనివర్సిటీలను కూడా ట్రంప్‌ లక్ష్యంగా చేసుకున్నారంటూ దావాలో ప్రస్తావించింది. ట్రంప్‌ చర్యలు ఏకపక్షంగా ఉన్నాయని.. ఫెడరల్‌ చట్టాలను, నిబంధలను ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొంది. నిధులను స్తంభింపజేయడం, ఫెడరల్‌ సమాఖ్య గ్రాంట్లపై విధించిన షరతులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని, హార్వర్డ్ ఖర్చులను చెల్లించేలా ట్రంప్‌ ప్రభుత్వాన్ని ఆదేశించాలని దావాలో హార్వర్డ్‌ యూనివర్సిటీ కోరింది.హార్వర్డ్‌ యూనివర్సిటీకి వైట్‌హౌస్‌(White House) పలు నిబంధనలు జారీ చేసిన విషయం తెలిసిందే. విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో యూదు వ్యతిరేక నిరసనల కట్టడికి సంబంధించినవి అవి. అయితే, వాటిని వ్యతిరేకిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్‌ అలాన్‌ గార్బర్‌ పేర్కొన్నారు. ఇక్కడి నుంచి అసలు వ్యవహారం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హార్వర్డ్‌ యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్‌ డాలర్ల ఫెడరల్‌ నిధులకు కత్తెర వేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 1 బిలియన్‌ డాలర్ల కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైద్య పరిశోధనల కోసం యూనివర్సిటీకి ఇచ్చే ఫెడరల్‌ గ్రాంట్లు, కాంట్రాక్టుల నుంచి 1 బిలియన్‌ డాలర్లను తగ్గించాలని ట్రంప్‌ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తాజాగా ఓ కథనం ప్రచురించింది.అయితే.. వైట్‌హౌజ్‌ జారీ చేసిన డిమాండ్లకు ఏ మాత్రం తలొగ్గేది లేదని హార్వర్డ్‌ అధ్యక్షుడు అలాన్‌ గార్బర్‌(Alan Garber) స్పష్టం చేస్తున్నారు. వాటిని బహిరంగంగా తిరస్కరిస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి కొత్త బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. గార్బర్‌ చర్యలపై ట్రంప్‌ యంత్రాంగం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. విదేశీ విద్యార్థుల అక్రమ, హింసాత్మక కార్యకలాపాల రికార్డులను సమర్పిస్తేనే కొత్తగా విదేశీయులను చేర్చుకునేందుకు అనుమతిస్తామని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి ట్రంప్‌ ప్రభుత్వం స్పష్టంచేసింది. రికార్డులను సమర్పించకపోతే వర్సిటీకున్న ప్రవేశాల అర్హతను రద్దు చేస్తామని హెచ్చరించింది. విద్యార్థుల రికార్డులను అందించాలని ఆదేశిస్తూ హోంలాండ్‌ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్‌ వర్సిటీకి ఇప్పటికే ఓ లేఖ రాశారు. ఈ నెల 30వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని అందులో కోరారు. ఒకవేళ వర్సిటీ స్పందించకపోతే.. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్‌ కార్యక్రమం (ఎస్‌ఈవీపీ) ధ్రువీకరణ రద్దవుతుందని పేర్కొన్నారు. కానీ, ఈ పరిణామాలను హార్వర్డ్‌ తేలికగా తీసుకుంటోంది. ‘ఆ లేఖ మా దృష్టికీ వచ్చింది. గతంలో మేం చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాం. మా స్వాతంత్య్రం, రాజ్యాంగ హక్కుల విషయంలో మేం రాజీ పడలేం. మేం చట్ట ప్రకారమే నడుచుకుంటాం. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని ఆశిస్తున్నాం’ అని వర్సిటీ ప్రతినిధి స్పష్టంచేశారు.తమ డిమాండ్లను రహస్యంగా ఉంచాలని ప్రభుత్వం కోరినప్పటికీ.. హార్వర్డ్‌ యూనివర్సిటీ వ్యవహరించిన తీరుతోనే వైట్‌హౌస్‌ ఈ విషయంలో మరింత దూకుడుగా వెళ్లడానికి ఒక కారణమని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తన నివేదికలో పేర్కొంది.ట్రంప్‌ యంత్రాంగంతో ఘర్షణ వైఖరి కారణంగా హార్వర్డ్‌ యూనివర్సిటీ.. ఫెడరల్‌ నిధుల నుంచి దాదాపుగా 9 బిలియన్‌ డాలర్లను కోల్పేయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టుకు చేరడంతో ఏం జరగబోతోందా? అనే ఆసక్తి నెలకొంది.

Why will Pope Francis be buried outside the Vatican Details Here5
పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరిక

చారిత్రకంగా చూస్తే... పోప్స్ మృతదేహాలను వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా నేలమాళిగల్లో ఖననం చేయడం రివాజు. ఈ సంప్రదాయాన్ని కాదని 1903లో పోప్ లియో-13 మృతదేహాన్ని ఆయన కోరిక మేరకు సెయింట్ జాన్ లేటరన్ బాసిలికాలో పూడ్చిపెట్టారు. ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) ఆఖరి కోరిక ఏంటో తెలుసా? తన భౌతిక కాయాన్ని వాటికన్ వెలుపల సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి(రోమ్)లో ఖననం చేయాలనేది ఆయన మనోవాంఛ. 2023 డిసెంబరు 12న మెక్సికన్ వార్తా సంస్థ ‘ఎన్+’కు కు ఇంటర్వ్యూ ఇస్తూ ఫ్రాన్సిస్ తన అంత్యక్రియలకు సంబంధించి మనసులోని మాట బయటపెట్టారు. అంత్యక్రియల ఏర్పాట్ల గురించి ఆర్చ్ బిషప్ డీగో జియోవని రవేలీతో అంతకుముందే చర్చించినట్టు తెలిపారు. సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి విషయానికొస్తే... ఆరుగురు పోప్స్ మృతదేహాలను అక్కడ ఖననం చేశారు. చివరిసారిగా 1669లో పోప్ క్లెమెంట్-9 అంత్యక్రియలు అక్కడ నిర్వహించారు. శిశువైన జీసస్ ను కన్య మేరీ ఎత్తుకున్న ‘సేలస్ పోపులి రోమని’ (రోమ్ ప్రజలకు రక్షణ) పెయింటింగ్ ఆ చర్చిలో ఉంది. ఆ చిత్రంతో పోప్ ఫ్రాన్సిస్ ది ప్రత్యేక అనుబంధం. పోప్ హోదాలో పర్యటనలు చేసి తిరిగొచ్చాక ఆయన దాని ఎదుట ప్రార్థనలు చేసేవారు.:::జమ్ముల శ్రీకాంత్(Source: AmoMama.com. Photo Credit: The Catholic Weekly).

Dalits Social Exclusion in Pithapuram6
‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’లో ఇదేం ఘోరం

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో పెరుగుతున్న పెత్తందార్ల ఆగడాలను ఆపాలని పలువురు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ నియోజకవర్గం పిఠాపురంలోనే దళితులను పెత్తందార్లు సామాజిక బహిష్కరణ చేసిన ఘటన ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇటువంటివి చోటుచేసుకుంటున్నాయని, ఇవి పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. సమస్యకు మూలమైన.. విద్యుద్ఘాతం వల్ల చనిపోయిన దళిత యువకుని కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల ఆరి్థక సహాయం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీరి ఆవేదన వారి మాటల్లోనే...రాష్ట్ర హోంమంత్రి మల్లాం గ్రామానికి వెళ్లాలి పిఠాపురం నియోజకవర్గంలోని మల్లాం గ్రామంలో దళితులను సాంఘిక బహిష్కరణకు పాల్పడిన పెత్తందార్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినప్పటికీ ‘శాంతి భద్రతల పేరుతో’ చర్చలు జరిపి రాజీలు చెయ్యడం దుర్మార్గం. పెత్తందార్లపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర హోంమంత్రి అనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయులు ఆ గ్రామాన్ని సందర్శించాలి. బాధ్యులపై కేసులు నమోదు చేయించి దళితులకు మనోధైర్యం కల్పించాలి. – అండ్ర మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాటసంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర కార్యదర్శి పవన్‌ పర్యటించాలి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మల్లాం గ్రామంలో పర్యటించి దళితులకు మనోధైర్యం కల్పించాలి. సామాజిక బహిష్కరణ అమలు జరిగిన కాలానికి బాధితులందిరికీ పరిహారం చెల్లించాలి. –వి.శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పవన్‌ స్పందించాలి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ స్పందించి పెత్తందార్లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి. గ్రామంలో దళితులకు రక్షణ కల్పించాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్‌ చేస్తున్నాం. – కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అప్పుడు గరగపర్రు.. ఇప్పుడు మల్లాం గత టీడీపీ పాలనలో గరగపర్రు­లో అంబేడ్క­ర్‌ విగ్ర­హం విషయంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేయడంతో రాష్ట్రవ్యాప్త ఉద్యమం జరిగింది. అదే తరహాలో ఇప్పుడు టీడీపీ కూటమి పాలనలో మల్లాంలో దారుణం జరిగింది. రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి దారితీయకముందే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – నల్లి రాజేష్‌ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు

10 grams of 24-carat gold crosses Rs 1 lakh mark in India7
సిరి మా 'లక్ష'మి.. పసిడి పరుగే పరుగు..!

న్యూఢిల్లీ: అందరికీ ప్రియమైన బంగారం దేశంలోని సామాన్యులను మాత్రం బెంబేలెత్తించేలా పరుగులు తీస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 78 వేలు పలికిన 10 గ్రాముల 24 క్యారట్ల ధర తాజాగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్‌ మొదలవుతున్న వేళ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కలుపుకుని ఏకంగా రూ.లక్ష మార్కును దాటేసింది. సోమవారం బెంగళూరు బులియన్‌ మార్కెట్‌లో రూ. 1,02,000గా పసిడి ధర నమోదైంది. ఇక ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు రూ. 1,650 పెరిగి రూ. 99,800 మార్క్‌ను తాకగా హైదరాబాద్‌లో అటు ఇటుగా రూ. 1,00,100కు చేరుకుంది. మరోవైపు 99.5 శాతం స్వచ్ఛతగల బంగారం ఢిల్లీలో రూ. 1,600 పెరిగి రూ. 99,300 వద్ద నూతన గరిష్టాన్ని నమోదు చేసింది. డాలర్‌ బలహీనపడటం, చైనా–అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం బంగారం కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 26 శాతం ర్యాలీ చేసింది. 10 గ్రాములకు రూ. 20,850 పెరిగింది. మరోవైపు వెండి కిలో రూ. 500 పెరిగి రూ. 98,500 మార్క్‌ను చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌ (31.1 గ్రాములు)కు 101 డాలర్ల వరకు ఎగసి 3,430 డాలర్లకు చేరుకుంది. 2006 వరకు నాలుగు అంకెల స్థాయికే పరిమితమైన బంగారం ధర.. 2007 నుంచి అయిదు అంకెల స్థాయిలోకి అడుగుపెట్టింది. ఏటా ధర వృద్ధి చెందుతూ 2012లో రూ.31 వేలకు చేరినప్పటికీ.. ఆ తరువాత పసిడి ధర ఒడిదుడుకులకు లోనై తిరోగమనం చెందింది. ఇక 2016 నుంచి ఏటా దూకుడు కొనసాగించింది.ఎంసీఎక్స్‌లోనూ రికార్డులు..మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ (ఎంసీఎక్స్‌) లోనూ బంగారం రూ. 98 వేల రికార్డు స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల జూన్‌ నెల కాంట్రాక్టు ధర రూ. 2,111 పెరగడంతో (2.22%).. ఆల్‌టైమ్‌ గరిష్టం రూ. 97,365 నమోదైంది. ఆగస్ట్‌ నెల కాంట్రాక్టు సైతం రూ. 2,104 పెరిగి రూ. 98,000కు, అక్టోబర్‌ కాంట్రాక్టు రూ. 2,617 పెరిగి రూ. 98,000కు చేరడం గమనార్హం.బంగారం అంటే సంపద. కుటుంబానికి ఆర్థిక భరోసా. అభివృద్ధికి సూచిక.కష్టకాలంలో తోడుంటుందన్న ఓ నమ్మకం. సామాన్యుడైనా, సంపన్నుడైనా తన కష్టార్జితంలో ఎంతో కొంత బంగారం రూపంలో పొదుపు చేసుకోవడం, పెట్టుబడిగా దాచుకోవడం అనాదిగా వస్తోంది. ఆడపిల్ల ఇంట్లో ఉందంటే బిడ్డ భవిష్యత్, పెళ్లి కోసం బంగారం కూడబెట్టడం భారతీయ కుటుంబాల్లో తొలి ప్రాధాన్యత. అంతేనా.. పండగైనా, వేడుకైనా నలుగురిలో ఆభరణాలు జిగేల్‌మనాల్సిందే. స్థాయిని చూపించుకోవడానికీ ఒక సాధనమైంది. తరతరాలుగా కుటుంబంలో భాగమైన ఈ పుత్తడి ఇప్పుడు అందనంత దూరం పరుగెడుతోంది. బంగారం ఇప్పుడు ప్రియమైంది. అందరూ ఊహించినట్టుగానే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ ధర పన్నులు కలుపుకొని రూ.లక్ష దాటింది.ఈ పరుగు ఇప్పట్లో ఆగదంటోంది బులియన్‌ మార్కెట్‌. పరిస్థితులూ ధరలకు ఆజ్యం పోస్తున్నాయి. మరోవైపు ధరలు అమాంతం పెరగడంతో భారతీయ వినియోగ దారులు వివాహాలు, ఇతర శుభకార్యాలకు గతంతో పోలిస్తే ఆచితూచి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు బంగారు వర్తకులు చెబుతున్నారు. అయితే ఆభరణాలతో పోలిస్తే బంగారు కడ్డీలు, నాణేల కొనుగోలుకే వినియోగదారులు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. - నూగూరి మహేందర్‌ ఎందుకీ పరిస్థితి?ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అంతర్జాతీయ పరిణామాలు బంగారానికి చుట్టుకున్నాయి. డాలర్‌ విలువ పడిపోవడం, అమెరికా–చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం మరింత ముదిరి ఆర్థిక మాంద్యం భయాలు రేకెత్తించడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు అమెరికా డాలర్‌ విలువ తగ్గింది. అమెరికా ట్రెజరీలు భారీగా అమ్ముడుపోతున్నాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేటు తగ్గింపు అంచనాలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు, బంగారం ఆధారిత ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుదల కూడా 2025లో పుత్తడి ర్యాలీకి మద్దతిచ్చాయి.గరిష్టాలూ గరిష్టమే..పసిడి 2024లో 40కిపైగా సందర్భాల్లో ఆల్‌టైమ్‌ హై ధర నమోదు చేసింది. 2025లో 23 సార్లు గరిష్టాలను తాకింది. దీంతో గరిష్టాలు గరిష్ట స్థాయిలో నమోదు కావడం విశేషం. ఔన్స్‌ ధర 2,650 డాలర్లతో 2025 సంవత్సరం ప్రారంభమైంది. సంప్రదాయ పరిణామాలకు విరుద్ధంగా 2024లో డాలర్‌ ఇండెక్స్‌ పెరిగి ఈక్విటీ మార్కెట్లు బాగా పనిచేసినప్పటికీ బంగారం ధర దాదాపు 28% అధికం కావడం గమనార్హం. అమెరికా డాలర్, భారత రూపాయి, చైనీస్‌ యువాన్, జపనీస్‌ యెన్, యూరో, బ్రిటిష్‌ పౌండ్, కెనడియన్‌ డాలర్, ఆ్రస్టేలియన్‌ డాలర్‌ సహా అన్ని ప్రధాన కరెన్సీలలో బంగారం ఆల్‌ టైమ్‌ గరిష్టాలను తాకింది. అంతర్జాతీయంగా ఔన్స్‌ (31.1 గ్రాములు) బంగారం ధర 2025 మార్చి 14న 3,000 డాలర్లు తాకి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఔన్స్‌ పసిడి రేటు 2,500 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు చేరుకోవడానికి కేవలం 210 రోజులు పట్టింది. గత రికార్డులు చూస్తే బంగారం ధర 500 డాలర్లు పెరగడానికి సగటున 1,708 రోజుల సమయం తీసుకుంది. వినియోగంలో మనం ఎక్కడంటే..⇒ 2024 నాటికి భారతీయుల వద్ద పుత్తడి నిల్వలు – 25,000 టన్నులు ⇒ ప్రపంచ మొత్తం పరిమాణంలో భారతీయుల వద్ద ఉన్న పసిడి – 11.56 శాతం ⇒ యూఎస్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కియే దేశాల సెంట్రల్‌ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలను మించి భారతీయుల వద్ద పసిడి ఉంది. రూపాయి బలపడటంతో ఉపశమనమే..డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఈ ఏడాది ఫిబ్రవరి 10న రూ.87.95 తాకి ఆల్‌ టైమ్‌ గరిష్టం నమోదు చేసింది. రూపాయి అదే స్థాయిలో ఉన్నా, మరింత బలహీనపడ్డా భారత్‌లో ఈపాటికే గోల్డ్‌ రేట్‌ రూ.లక్ష దాటేది. కొద్ది రోజులుగా డాలర్‌ మారకంతో పోలిస్తే రూపాయి బలపడుతుండటం కాస్త ఉపశమనం కలిగించే అంశం. సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.85.38గా నమోదైంది. ఇక 2025 జనవరి 1న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78 వేలకు అటుఇటుగా పలికింది. సరిగ్గా 100 ఏళ్ల క్రితం ధర రూ.18.75 మాత్రమే.ప్రత్యామ్నాయం వైపు కొనుగోలుదారుల చూపు..సంప్రదాయంగా భారతీయ కొనుగోలుదారులు పెట్టుబడికి విలువ, ఆకట్టుకునేలా ఉండేలా 22 క్యారెట్లతో తయారైన బంగారు ఆభరణాలను ఇష్టపడతారు. అయితే పెరుగుతున్న ధరలు వారిని ప్రత్యామ్నాయాలను అన్వేషించేలా చేశాయి. ఆకర్షించే రూపు, సరసమైన ధర రెండింటినీ అందించే క్లిష్ట, తేలికైన డిజైన్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీంతో 18, 14 క్యారట్ల ఆభరణాలు ఇప్పుడు ప్రజాదరణ పొందుతున్నాయి. తక్కువ బరువుతో సంప్రదాయ డిజైన్లను ఆభరణాల తయారీదారులు రూపొందించడానికి తయారీ సాంకేతికతలో వచి్చన పురోగతి వీలు కల్పించిందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ తెలిపింది. 22 క్యారెట్లతో తయారు చేసిన ఆభరణాల్లో 91.67% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 18 క్యారెట్లు అయితే 75% స్వచ్ఛమైన బంగారం, 25% ఇతర లోహాలు ఉంటాయి. 22 క్యారెట్ల బంగారంతో పోలిస్తే 18 క్యారెట్లతో తయారైన ఆభరణం ధర దాదాపు ఐదో వంతు తక్కువగా ఉంటుంది. తక్కువ ధర, ఎక్కువ మన్నిక కారణంగా 18 క్యారెట్ల ఆభరణాలకు డిమాండ్‌ క్రమంగా ఊపందుకుంది. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా రెండేళ్ల క్రితం కేవలం 5–7% ఉండగా ఇప్పుడు 15% కంటే ఎక్కువగా పెరిగిందని ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది.ఆభరణాల్లో మనమే ఫస్ట్‌..భారత్‌లో ఏటా 10 లక్షలకుగా వివాహాలు జరుగుతున్నాయి. పెళ్లిళ్లకే ఏటా 300–400 టన్నుల పసిడి అమ్ముడవుతుందని కళ్యాణ్‌ జువెల్లర్స్‌ అంటోంది. దీపావళి, అక్షయ తృతీయ వంటి శుభదినాల్లో హిందువులు పసిడిని కొనుక్కుంటున్నారు. చైనాలోనూ అంతే. పెళ్లిళ్లు, బిడ్డ పుట్టిన నెలరోజులకు జరిపే వేడుక, ఇతర ముఖ్య సందర్భాల్లో ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. చైనాలో అత్యధికులు టియోచు సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. దీని ప్రకారం వరుడి కుటుంబం వధువు కోసం నెక్లెస్, గాజులు, చెవి కమ్మలు, ఉంగరాన్ని కొనుగోలు చేస్తారు. చైనాను మించి ప్రపంచంలో అత్యధికంగా 2024లో భారతీయ వినియోగదార్లు 560 టన్నుల ఆభరణాలను అందుకున్నారు. 510 టన్నులతో చైనా రెండవ స్థానంలో ఉంది. గత ఏడాది భారతీయులు 240 టన్నుల గోల్డ్‌ బార్స్, కాయిన్స్‌ను కొనుగోలు చేస్తే చైనా వాసుల విషయంలో ఇది 345 టన్నులు ఉంది.పెట్టుబడిగా బంగారం..సెంట్రల్‌ బ్యాంకుల కొనుగోళ్లను మినహాయిస్తే ప్రపంచ పసిడి డిమాండ్‌లో ఇండోనేసియా, వియత్నాం సహా ఆసియా వాటా ఏకంగా 64.5 శాతానికి చేరుకుంది. అయితే పెట్టుబడి స్వేచ్ఛ సూచికలో ఆసియా దేశాలు ప్రధానంగా భారత్, చైనా పేలవంగా ఉన్నాయి. భారతీయ కుటుంబాల్లో 6 శాతం కంటే తక్కువ సంపద ఈక్విటీల్లో, 15 శాతం బంగారంలో పెట్టుబడి పెడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడంతో చైనీయులు బంగారం వైపు ఆకర్షితులవుతున్నారు. ఏటా 1–2 శాతం వడ్డీ ఇచ్చే డిపాజిట్లకు బదులు చైనీయులు చిన్నమొత్తంలో పసిడిని దక్కించుకుంటున్నారు. సెంట్రల్‌ బ్యాంక్‌ బాటలో పెట్టుబడిగా ముడి బంగారాన్ని కొంటున్నారు. ఎగుమతులు డీలా..భారత్‌ నుంచి 2024–25లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 11.72 శాతం క్షీణించి రూ. 2,43,390 కోట్లకు చేరాయి. అలాగే దిగుమతులు 11.96 శాతం తగ్గి రూ.1,67,384 కోట్లుగా ఉన్నాయి. యూఎస్, చైనా మార్కెట్లు నిదానించడం, ప్రపంచంలో పలు ప్రాంతాల్లో యుద్ధాలు, రష్యా తవ్విన వజ్రాలపై ఆంక్షలు, చవకగా లభించే ల్యాబ్‌ తయారీ వజ్రాలు వెరసి రెండేళ్లుగా దేశం నుంచి ఎగుమతులు తగ్గడానికి కారణం అయ్యాయి. విదేశాలకు సరఫరా అయిన రత్నాలు, ఆభరణాల్లో యూఎస్‌ వాటా ఏకంగా 30.4 శాతం ఉంది. అయితే అమెరికా భారీ సుంకాలను ప్రకటించిన తర్వాత ఎగుమతుల్లో భారీగా తగ్గుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రంగంలో అతిపెద్ద మార్కెట్‌ను ప్రభావితం చేసే కొత్త సుంకాలు.. డైమండ్‌ కటింగ్, ఆభరణాల తయారీలో ప్రపంచంలో ముందంజలో ఉన్న భారత్‌ తన స్థానాన్ని నిలబెట్టుకునే సామర్థ్యాన్ని అడ్డుకుంటాయని భావిస్తున్నారు.ఎస్‌జీబీల మాటేమిటి?భారత్‌లో సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ పథకం (ఎస్‌జీబీ) 2015 నవంబర్‌లో ప్రారంభం అయింది. పథకంలో భాగంగా మొత్తం 67 విడతలుగా 146.96 టన్నుల గోల్డ్‌ బాండ్స్‌ జారీ అయ్యాయి. ప్రస్తుత ధరల వద్ద బకాయి ఉన్న సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను రిడీమ్‌ చేయాలంటే ప్రభుత్వం సుమారు రూ. 1.3 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం 7 విడతల బాండ్లను పూర్తిగా తిరిగి చెల్లించింది. 8వ విడతకు ముందస్తు రిడెమ్షన్‌ కూడా ఆఫర్‌ చేసింది. తుది చెల్లింపు 2032 ఫిబ్రవరిలో జరగనుంది. పెరుగుతున్న బాధ్యతను సమతౌల్యం చేయడానికి ప్రభుత్వం గోల్డ్‌ రిజర్వ్‌ ఫండ్‌ (జీఆర్‌ఎఫ్‌)ను సృష్టించింది. 2023–24లో ఈ నిధిలో రూ. 3,552 కోట్లు జమ చేసింది. దీన్ని 2024–25 సవరించిన బడ్జెట్‌లో రూ. 28,605 కోట్లకు పెంచింది. గోల్డ్‌ బాండ్స్‌ కింద ఇన్వెస్టర్లకు 2024–25 చివరి నాటికి చెల్లించాల్సిన మొత్తం రూ. 85,000 కోట్లకు చేరుకుంటుందని 2024 జూలై మధ్యంతర బడ్జెట్‌ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. పసిడి దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆశించిన ప్రయోజనం లేకపోగా దూసుకుపోతున్న పుత్తడి ధరలతో ఖజానాపై ఆర్థిక భారం పడింది. దీంతో పథకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అందం, గుర్తింపు వ్యక్తీకరణ..రత్నాలు, ఆభరణాల పరిశ్రమ భారత జీడీపీకి 7% సమకూరుస్తోంది. ఈ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ మార్కెట్‌ విలువ దేశంలో సుమారు రూ.6,82,960–7,25,645 కోట్లు ఉంది. 2035 నాటికి ఇది రూ.19,20,825 కోట్లకు చేరుకుంటుందని అంచనా. సంప్రదాయికంగా ఆభరణాలు ఒక పెట్టుబడి. ఇప్పుడు ఇది అందం, గుర్తింపు వ్యక్తీకరణ. ఈ మార్పు అన్ని వయసుల వారికీ వర్తిస్తుంది. భిన్న డిజైన్లు కోరుకుంటున్నప్పటికీ యువ వినియోగదారులు ఆభరణాలపట్ల మొగ్గు చూపుతున్నారు. - సందీప్‌ కోహ్లీ సీఈవో, ఇంద్రియ, ఆదిత్య బిర్లా జువెలరీ బంగారం ధర పెరుగుదలకు నిపుణులు చెబుతున్న కారణాలు....: వాణిజ్య సుంకాలు :..సుంకాల కారణంగా ప్రపంచమార్కెట్లు తీవ్ర అనిశి్చతిని ఎదుర్కొంటున్నాయి. ట్రంప్‌ ప్రకటించిన 90 రోజుల విరామం, ఆ తర్వాత ఏవైనా పరిణామాలు బంగారాన్ని సురక్షిత స్వర్గధామంగా ఆకర్షణీయంగా ఉంచుతాయి. అమెరికా–చైనాప్రతీకార చర్యలు ఇప్పటికే స్వల్పకాలంలో డిమాండ్‌ను పెంచుతున్నాయి...: సెంట్రల్‌ బ్యాంక్స్‌ కొనుగోళ్లు :..కేంద్ర బ్యాంకులు దశాబ్దాలుగా స్థిరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. మూడేళ్లలో ఇవి ఏటా 1,000 టన్నులకుపైగా సమకూర్చుకున్నాయి. మార్చి 2025లో వరుసగా 5వ నెలలోనూ చైనా బలమైన బంగారం కొనుగోళ్లను నివేదించింది...: స్టాగ్‌ఫ్లేషన్‌ ఆందోళనలు :..తాజా యూఎస్‌ ఫెడ్‌ పాలసీ మినిట్స్‌ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్టాగ్‌ఫ్లేషన్‌ వైపు మళ్లవచ్చనే ఆందోళనలను సూచిస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, తక్కువ ఆర్థిక వృద్ధి, అధిక నిరుద్యోగితను స్టాగ్‌ఫ్లేషన్‌ అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో బంగారం మెరుగైన పనితీరు కనబరుస్తుంది...: చైనా ఈటీఎఫ్‌ పెట్టుబడులు :..చైనా గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో రికార్డు స్థాయిలో 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2025లోనూ కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. 2024 నుంచి అంతర్జాతీయంగా ఈటీఎఫ్‌ పెట్టుబడులు పెరుగుతున్నాయి...: ఫెడ్‌ రేటు కోతలు :..యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ 2025లో మరో రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది బంగారం ధరల పెరుగుదలకు మద్దతు ఇస్తుంది. ..: స్థిరమైన పనితీరు :..2000 నుంచి 2025 వరకు బంగారం రెండుసార్లు మినహా అన్ని సందర్భాల్లోనూ అనుకూల రాబడిని అందించింది...: భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు :..రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం నుంచి ఇజ్రాయెల్‌–హమాస్‌ కాల్పుల విరమణ పతనం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ అశాంతి వరకు భౌగోళిక రాజకీయ అనిశ్చితి బంగారం డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయి...: కరెన్సీ హెచ్చుతగ్గులు :..డాలర్‌ సూచిక మూడేళ్ల కనిష్ట స్థాయిలో ట్రేడవుతోంది. స్విస్‌ ఫ్రాంక్, జపనీస్‌ యెన్, యూరోలతో పోలిస్తే తీవ్ర నష్టాల్లో ఉంది. ఈ కరెన్సీలలో బంగారం చౌకగా మారింది...: పెరుగుతున్న రుణ స్థాయిలు :..2024 నవంబర్‌లో యూఎస్‌ జాతీయ రుణం రికార్డు స్థాయిలో 36 ట్రిలియన్‌ డాలర్లు దాటింది. ఈ రుణాన్ని ఎలా నిర్వహిస్తారనే దానిపై పెరుగుతున్న ఆందోళనలతో బంగారం సహజ హెడ్జ్‌గా మారింది. ప్రపంచ రుణం కూడా పెరిగింది. ..: మార్కెట్‌ అస్థిరత :..2025లో ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అస్థిరత పెరిగింది. పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలు దెబ్బతిన్నాయి.వాణిజ్య ఉద్రిక్తతలకుతోడు వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, భౌగోళిక అనిశి్చతులు, డాలర్‌ బలహీనపడడం బంగారం, వెండి ధరల పెరుగుదలకు మద్దతునిచ్చాయి. ఈ ఏడాది బంగారం ఇప్పటికే 25 శాతానికి పైగా పెరిగింది. ఏప్రిల్‌ 2 సుంకాలపై ప్రకటన తర్వాత నుంచి చూసినా 6 శాతం పెరిగింది.- సతీష్‌ కోటక్‌ మహీంద్రా ఏఎంసీ ఫండ్‌ మేనేజర్‌ ఈటీఎఫ్‌ ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల డిమాండ్‌ పెరిగింది.భారత్‌లో రానున్న పండుగల సీజన్‌నుదృష్టిలో పెట్టుకుని చూస్తే బంగారానికి అదనపు మద్దతు లభించనుంది. సుంకాలకు సంబంధించి అనిశ్చితి, యూఎస్‌ డాలర్‌ బలహీనత, ట్రెజరీ ఈల్డ్స్‌ పెరుగుతుండడం బంగారం ధరల ర్యాలీకి తోడ్పడుతోంది. – జేఎం ఫైనాన్షియల్‌ కమోడిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రణవ్‌ మెర్‌

40 students from Bihar IIT village clear JEE Main 20258
ఆ ఊరి పేరు ఐ.ఐ.టి. విలేజ్‌

బిహార్‌ గయా జిల్లాలో పట్వాటోలి గ్రామాన్ని ‘ఐ.ఐ.టి. విలేజ్‌’ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఐ.ఐ.టి ర్యాంకులు సాధించివారు విపరీతంగా ఉంటారు. ఐ.ఐ.టి 2025 రిజల్ట్స్‌లో ఏకంగా 40 మంది స్టూడెంట్స్‌ ర్యాంకులు తెస్తే వీరిలో అమ్మాయిలే అధికం. నేతవాళ్లు ఎక్కువగా ఉండే ఈ ఊరి నుంచి ఇంటికొక ఇంజనీర్‌ ఉండటం విశేషం. ఇదెలా జరిగింది?ఎవరో ఒకరిద్దరు తలుచుకుంటే ఏ మార్పూ రాదని కొందరు అనుకుంటారు. కాని ఒక మనిషి తలుచుకున్నా మార్పు వస్తుంది. వచ్చింది.1991.బిహార్‌లోని గయ జిల్లాలోని పట్వాటోలి అనే చిన్న గ్రామంలో జితేంద్ర పట్వా అనే అబ్బాయికి ఐ.ఐ.టి.లో ర్యాంక్‌ వచ్చింది. ఆ ఊరి నుంచి ఎవరికైనా అలాంటి ర్యాంక్‌ రావడం ఇదే ప్రథమం. ఊరంతా సంతోషించింది. ఆ అబ్బాయి బాగా చదువుకున్నాడు. స్థిరపడ్డాడు. కాని ఊరికే ఉండలేదు. ఊరికి ఏదైనా చేయాలనుకున్నాడు.దేనికంటే ఆ ఊరు అప్పటికే తన ప్రాభవం కోల్పోయింది.పట్వాటోలిని ఒకప్పుడు అందరూ ‘మాంచెస్టర్‌ ఆఫ్‌ బిహార్‌’ అని పిలిచేవారు. ఆ ఊర్లో అందరూ నేతపని వారే. నేత వస్త్రాలకు మంచి గిరాకీ ఉన్న రోజుల్లో ఆ ఊరు ఒక వెలుగు వెలిగింది. అయితే కాలక్రమంలో వచ్చిన మార్పులు వారిని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంచేశాయి. ఈ నేపథ్యంలో పిల్లలను మంచి చదువులవైపు మళ్లిస్తే ఊరి భవిష్యత్తు మారుతుందని భావించాడు జితేంద్ర పట్వా.2013లో అతడు ఊరికి వచ్చి ‘వృక్ష సంస్థాన్‌’ పేరుతో ఒక ఎన్‌.జి.ఓ మొదలెట్టాడు. పేద నేతగాళ్ల పిల్లలకు, దిగువ మధ్యతరగతి ఇతర వర్గాల పిల్లలకు ఉచితంగా ఐ.ఐ.టి కోచింగ్‌ ఇవ్వడమే ఆ సంస్థ లక్ష్యం. ఒకప్పుడు ఆ ఊరిలో టెన్త్‌ తర్వాత చదువు మానేసేవారు. ఇప్పుడు టెన్త్‌ సమయం నుంచే ఐ.ఐ.టి. కోచింగ్‌ మొదలెడుతున్నారు.అయితే ఇది ఆషామాషీగా జరగడం లేదు. విద్యార్థుల కోసం ఈ ఊరితో పాటు చుట్టుపక్కల కొన్ని లైబ్రరీలు స్థాపించారు. అవన్నీ ఐ.ఐ.టి. చదవడానికి అవసరమయ్యే పుస్తకాలతో నిండి ఉంటాయి. వాటిని ఏ పద్ధతిలో చదువుకుంటూ వెళ్లాలో గైడ్‌ చేస్తారు. అలాగే ఐ.ఐ.టి. చదివి ముంబై, ఢిల్లీలో స్థిరపడ్డ జితేంద్ర మిత్రులు ఇక్కడికొచ్చి క్లాసులు చెబుతారు. కొత్తల్లో వీరు క్లాసులు చెప్పినా ఇప్పుడు ఇక్కడ నుంచి ఐ.ఐ.టి.కి వెళ్లినవాళ్లు క్లాసులు చెబుతున్నారు.అంటే ఈ ఫ్రీ కోచింగ్‌ ఎన్నాళ్లైనా కొనసాగే విధంగా ఇక్కడి విద్యార్థులే నిష్ణాతులయ్యారన్న మాట. వస్త్రాలు నేసి రెక్కాడితే డొక్కాడని స్థితిలో ఉన్న ఈ ఊరిలో జె.ఇ.ఇ.– 2025 రిజల్ట్స్‌లో 40 మంది ర్యాంకులు సాధించారు. వీరిలో శరణ్య అనే అమ్మాయి టాపర్‌గా నిలిచి 99.64 పర్సంటేజ్‌ సాధించింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని పల్లెల నుంచి కూడా ఎందరో ఐ.ఐ.టి. సాధించారు. వారు ఇలాంటి అడుగు వేస్తే ప్రతి పల్లెటూరి నుంచి చదువు మీద ఆసక్తి ఉన్న విద్యార్థులు గొప్ప చదువులకు వెళతారు. గ్రామాల దశను మారుస్తారు.

Rasi Phalalu: Daily Horoscope On 12-04-2025 In Telugu9
ఈ రాశి వారికి అనుకోని ధనలాభం.. వ్యాపార వృద్ధి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.నవమి ప.1.03 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: శ్రవణం ఉ.8.06 వరకు, తదుపరి ధనిష్ఠ,వర్జ్యం: ప.12.02 నుండి 1.36 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.08 వరకు, తదుపరి రా.10.50 నుండి 11.36 వరకు, అమృతఘడియలు: రా.9.30 నుండి 11.01 వరకు.సూర్యోదయం : 5.44సూర్యాస్తమయం : 6.13రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం... అనుకోని ధనలాభం. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో మరింత ఆదరణ.వృషభం... కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. పనులు ముందుకు సాగవు. ఆర్థికంగా కొంత ఇబ్బంది. ఆస్తులపై ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యమే. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.మిథునం.... వ్యవహారాలలో కొన్ని ఆటంకాలు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య,కుటుంబసమస్యలు. ఆలయాల సందర్శనం.కర్కాటకం... వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వృత్తి,వ్యాపారాలు పుంజుకుంటాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. నిరుద్యోగుల యత్నాలు సఫలం. వాహనయోగం.సింహం... నూతన వరిచయాలు. శుభకార్యాల నిర్వహణ. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలు దర్శిస్తారు. సంఘంలో విశేష గౌరవం. విద్యావకాశాలు.కన్య... అదనపు ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో అదనపు పనిభారం.తుల... బంధువులతో స్వల్ప తగాదాలు. దూరప్రయాణాలు. అనుకున్న పనులలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని చికాకులు. ఆలయాల సందర్శనం. బంధువుల కలయిక.వృశ్చికం... సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి.ధనుస్సు.... కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులకు అవకాశం. దైవచింతన.మకరం... చేపట్టిన పనులలో విజయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందువినోదాలు. సోదరులతో వివాదాలు తీరతాయి. శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.కుంభం... ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. ఆరోగ్యసమస్యలు.మీనం... విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

Gujarat Titans beat Kolkata Knight Riders by 39 runs10
గుజరాత్‌ గర్జన

కోల్‌కతా: గుజరాత్‌ టైటాన్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనకు డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతులెత్తేసింది. దీంతో సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో టైటాన్స్‌ 39 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (55 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాయి సుదర్శన్‌ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిపించారు. బట్లర్‌ (23 బంతుల్లో 41 నాటౌట్‌; 8 ఫోర్లు) ధాటిగా ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో రసెల్, వైభవ్, హర్షిత్‌ తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్‌ అజింక్య రహానే (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే రాణించాడు. గుజరాత్‌ బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ, రషీద్‌ ఖాన్‌ చెరో 2 వికెట్లు తీశారు. ఆ ఇద్దరు బాదేశారిలా... గుజరాత్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో ముందుగా సాయి సుదర్శన్‌ బౌండరీతో బాదుడు మొదలు పెట్టాడు. మూడో ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. కాస్త ఆలస్యమైనా... గిల్‌ ఐదో ఓవర్లో రెండు వరుస బౌండరీలతో దూకుడు షురూ చేశాడు. టైటాన్స్‌ పవర్‌ప్లే స్కోరు 45/0. అలీ వేసిన ఏడో ఓవర్లో గిల్‌ 6, 4, 4లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. క్రమం తప్పకుండా ఫోర్లు బాదేయడంతో సగం ఓవర్లు ముగిసేసరికి గుజరాత్‌ 89/0 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్లోనే గిల్‌ 34 బంతుల్లో, సుదర్శన్‌ 33 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 100 దాటింది. ఎట్టకేలకు సుదర్శన్‌ను అవుట్‌ చేసిన రసెల్‌ కోల్‌కతాకు ఊరటనిచ్చాడు. అయితే బట్లర్‌ రాకతో దంచుడులో ఏ మార్పులేకపోయింది. ఆఖర్లో గిల్, రాహుల్‌ తెవాటియా (0) వికెట్లు పడినా కూడా భారీస్కోరు సాధ్యమైంది. కెప్టెన్‌ ఒంటరి పోరాటం పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన నైట్‌రైడర్స్‌ పవర్‌ప్లేలోనే ఓపెనర్లను కోల్పోయింది. సిరాజ్‌ తొలి ఓవర్లోనే రహా్మనుల్లా గుర్బాజ్‌ (1) పెవిలియన్‌ చేరగా, కెప్టెన్‌ రహానేతో అడపాదడపా షాట్లతో స్కోరును నడిపిస్తున్న సునీల్‌ నరైన్‌ (17)ను రషీద్‌ ఖాన్‌ బోల్తా కొట్టించాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ (14) మెప్పించలేకపోయాడు. బాధ్యతగా ఆడిన రహానే 36 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, అదేస్కోరు వద్ద వాషింగ్టన్‌ సుందర్‌ అతన్ని అవుట్‌ చేశాడు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన రసెల్‌ (15 బంతుత్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్‌) స్టంపౌట్‌ కావడంతో కోల్‌కతా లక్ష్యానికి దూరమైంది. రఘువంశీ (13 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కాసేపు అలరించాడు. స్కోరు వివరాలు గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయి సుదర్శన్‌ (సి) గుర్బాజ్‌ (బి) రసెల్‌ 52; శుబ్‌మన్‌ గిల్‌ (సి) రింకూ సింగ్‌ (బి) వైభవ్‌ 90; బట్లర్‌ (నాటౌట్‌) 41; తెవాటియా (సి) రమణ్‌దీప్‌ (బి) హర్షిత్‌ రాణా 0; షారుఖ్‌ ఖాన్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–114, 2–172, 3–177. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4–0–44–1, మొయిన్‌ అలీ 3–0–27–0, హర్షిత్‌ రాణా 4–0–45–1, వరుణ్‌ చక్రవర్తి 4–0–33–0, నరైన్‌ 4–0–36–0, రసెల్‌ 1–0–13–1. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్‌ 1; నరైన్‌ (సి) తెవాటియా (బి) రషీద్‌ 17; రహానే (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) సుందర్‌ 50; వెంకటేశ్‌ (సి) సుందర్‌ (బి) సాయి కిషోర్‌ 14; రింకూ సింగ్‌ (సి) గిల్‌ (బి) ఇషాంత్‌ 17; రసెల్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 21; రమణ్‌దీప్‌ (సి అండ్‌ బి) ప్రసిధ్‌ కృష్ణ 1; మొయిన్‌ అలీ (సి) షారుఖ్‌ (బి) ప్రసిధ్‌ కృష్ణ 0; రఘువంశీ (నాటౌట్‌) 27; హర్షిత్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–2, 2–43, 3–84, 4–91, 5–118, 6–119, 7–119, 8–151. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–32–1, ఇషాంత్‌ 2–0–18–1, ప్రసిధ్‌ కృష్ణ 4–0–25–2, రషీద్‌ ఖాన్‌ 4–0–25–2, సుందర్‌ 3–0–36–1, సాయి కిషోర్‌ 3–0–19–1.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement