
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియా–తెలంగాణ పార్లమెంట్ సంబంధాల అధ్యయన యాత్రలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా పార్లమెంట్ ప్రతినిధుల బృందం శాసనసభా స్పీకర్ మధుసూదనాచారిని కలిసింది.
శుక్రవారం స్పీకర్ చాంబర్‌లో ఆస్ట్రేలియా ఎంపీ ఆంథోని అల్బెన్స్ నేతృత్వంలోని బృందం ఆయనను కలసి వివిధ అంశాలపై చర్చించింది. చట్టసభల కార్యకలాపాల గురించి ఆ బృందం అడిగి తెలుసుకుంది. అనంతరం ప్రతినిధుల బృందాన్ని స్పీకర్, శాసన సభా కార్యదర్శి నర్సింహాచార్యులు సత్కరించారు.