మంచి ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకుంటా : స్పీకర్ | MLA and get good recognition: Speaker | Sakshi

మంచి ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకుంటా : స్పీకర్

Oct 21 2015 3:55 AM | Updated on Nov 6 2018 4:32 PM

ప్రజలకు అందుబాటులో ఉంటూనే వారి సమస్యలను పరిష్కరిస్తూ మంచి ఎమ్మెల్యేగా నిలిచిపోయేలా పనులు చేస్తానని ...

శాయంపేట :  ప్రజలకు అందుబాటులో ఉంటూనే వారి సమస్యలను పరిష్కరిస్తూ మంచి ఎమ్మెల్యేగా నిలిచిపోయేలా పనులు చేస్తానని శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని నేరేడుపల్లి గ్రామంలో రూ.15లక్షలు, అప్పయ్యపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి నుంచి ప్రాతినిధ్యం ఏ ఎమ్మెల్యే కూడాఅభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. 1994లో మండలంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇప్పుడు అవే సమస్యలు ప్రజలను పీడిస్తున్నాయని తెలిపారు. పత్తిపాక నుంచి నేరేడుపల్లి గ్రామానికి వచ్చే రెండు సంవత్సరాల్లో బీటీ రోడ్డు నిర్మాణ పనులను చేపడతానని ఆయన హామీ ఇచ్చారు.

దీనివల్ల రైతులకు, ప్రజలకు ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఆత్మకూర్ మండలం కటాక్షపూర్ నుంచి రేగొండ మండలం రూపురెడ్డి పల్లి వయా నేరేడుపల్లి గ్రామం మీదుగా డబుల్ రోడ్డు వేయిస్తానని, నేరేడుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సమస్యలను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేయిస్తానని ఆయన ప్రకటించారు. ఇంకా గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానని స్పీకర్ తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు వంగాల రమాదేవి, సర్పంచ్ బనగాని మంజుల, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రవీందర్, నాయకులు పొలెపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, చల్లా చక్రపాణి, కర్ర ఆదిరెడ్డి, పోతు రమణారెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement