పరిహారం కోసం నిర్వాసితుల ఆందోళన | farmers protest for Compensation of lands | Sakshi
Sakshi News home page

పరిహారం కోసం నిర్వాసితుల ఆందోళన

Published Thu, Aug 20 2015 2:27 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

తమ భూములు సేకరించి ఆరేళ్లయినా ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదంటూ సింగరేణి భూనిర్వాసితులు నిరసనకు దిగారు.

తిర్యాణి: తమ భూములు సేకరించి ఆరేళ్లయినా ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదంటూ సింగరేణి భూనిర్వాసితులు నిరసనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం కైరిగూడలోని ఓసీపీ కోసం చుట్టుపక్కల గ్రామాలైన డోర్లి, దేవయ్యగూడ, ఉల్లిపిట్ట, చందుగూడలకు చెందిన భూములను అధికారులు తీసుకున్నారు. ఆయా గ్రామాల రైతులు గురువారం మధ్యాహ్నం  కైరిగూడ ఓసీపీ ఎదుట నిరసన తెలిపారు. తమకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement