ప్రాణభిక్ష పెట్టండి.. | Help To kidney Patients In Warangal | Sakshi
Sakshi News home page

ప్రాణభిక్ష పెట్టండి..

Published Mon, Mar 4 2019 9:06 AM | Last Updated on Mon, Mar 4 2019 9:09 AM

Help To kidney Patients In Warangal - Sakshi

సంగెం: రెక్కాడితేనే డొక్కాని నిరుపేద కుటుంబం. నిత్యం కూలీనాలీ చేసుకుంటేనే ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లే దీనస్థితి. అలాంటి కుటుంబంలోని తల్లికి రెండు కిడ్నీలు పాడైపోయాయనే  పిడుగులాంటి నిజం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తుండడంతో దిక్కుతోచని దయనీయస్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న అభాగ్యురాలి దీనగాధ. వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తికి చెందిన సదిరం లలిత(45), మల్లయ్య దంపతులకు ఒక కుమారుడు రాజు,  కూతరు కోమల ఉన్నారు. గుంట జాగలేని నిరుపేద కుటుంబం కావడంతో రెక్కల కష్టాన్ని నమ్ముకిని కూతురు కోమల, కుమారుడు రాజులకు వివాహం జరిపించారు.

ఇక తమ కష్టాలు గట్టెక్కుతాయని అనుకుంటున్న సమయంలో లలిత ఆనారోగ్యం భారినపడింది. ఆసుపత్రుల చుట్టూ తిరిగి మందులు వాడుతున్న క్రమంలో లలితకు రెండు కిడ్నీలు పాడైపోయాయని డాక్టర్లు పిడుగులాంటి నిజం చెప్పారు. లలిత ఆరోగ్యం కుదుట పడాలంటే కిడ్నీ మార్పిడి తప్పనిసరి అని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆ కుటుంబసభ్యులు  కన్నీరు మున్నీరవుతున్నారు. లలిత ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో డయాలసిస్‌ చికిత్స పొందుతున్నది.

లలితకు కిడ్నీ ఇచ్చేందుకు భర్త మల్లయ్య, కుమారుడు రాజు సిద్ధంగా ఉన్నప్పటికీ వీరి కిడ్నీ లలి తకు సరిపోతుందో లేదోనని, పరీక్షలు నిర్వహిం చుకోవడానికి కూడా చేతిలో చిల్లిగవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. తమ కిడ్నీ సరిపోకుంటే జీవ న్‌ధాన్‌ కింద అవయవదానం చేసిన వారి  కిడ్నీ అయినా అమర్చి లలితకు ప్రాణభిక్ష పెట్టా లని  భర్త ,కుమారుడు వేడుకుంటున్నారు. కిడ్నీ మార్పిడికి దాతలు సహకరించాలని కోరుతున్నారు.  

అకౌంట్‌ నంబర్‌ 
73065213615
సదిరం లలిత ఏపీజీవీబీ గవిచర్ల బ్రాంచ్,
ఐఎఫ్‌సీ కోడ్‌ ఏపీజీవీ0005158  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement