
పిల్లలమర్రి వద్ద వివరాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లాకే తలమానికంగా నిలుస్తున్న పిల్లలమర్రికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే శ్రీని వాస్‌గౌడ్ తెలిపారు. పట్టణంలోని పిల్లలమర్రిని సోమవారం ఆయన సందర్శించారు. మర్రి చెట్టు పరిరక్షణకు చేపడుతున్న చర్యలు తెలుసుకున్న ఆయన మాట్లాడుతూ త్వరలోనే ప్రజల సందర్శనకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంత రం దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశా రు. టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటయ్యతో పాటు తిరుమల వెంకటేశ్, రియాసత్‌ఖాన్, నవీన్‌రాజ్, ఖాద్రీ, చంద్రకాంత్ పాల్గొన్నారు.