బీజేపీని ఓడించడానికి ఆప్‌తో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్: బీజేపీని ఓడించడానికి ఆప్‌తో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఓట్లను ఆప్‌కు బదలాయించడం వల్లే ఒకశాతం ఓట్లు తగ్గి, బీజేపీ ఓడిపోయిందన్నారు. బీజేపీ ఏవైనా తప్పులు చేస్తే తప్పకుండా ఆత్మ పరిశీలన ఉంటుందన్నారు. ముస్లింల విశ్వాసం పొందేలా పార్టీని నడిపిస్తామని వెల్లడించారు. అలాగే, తెలంగాణలో సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఛాతీ ఆసుపత్రిని హైదరాబాద్ నుంచి తరలించాలనే నిర్ణయంపై బీజేపీ న్యాయపోరాటానికి దిగుతుందన్నారు.