
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, నిజాంపేట్, జగద్గిరిగుట్ట, రామాంతాపూర్, ఉప్పల్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఆదివారం సాయంత్రం కావడంతో సరదాగా బయటకు వెళ్లిన పలువురు.. ఒక్కసారిగా వర్షం కురవడంతో కాసింత ఇబ్బందికి గురయ్యారు.
నగరంలో ఆదివారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్‌కుమార్ క్షేత్ర స్థాయిలో సహాయక బృందాలను, అధికారులు అప్రమత్తం చేశారు.