ghmc
-
ఏదో ఒకరోజు వస్తామంటారు.. ఏ రోజు వస్తారో తెలియదు!
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి సంగారెడ్డి జిల్లా కోత్లాపూర్‌లో పదేళ్ల క్రితం నాలుగు వందల చదరపు గజాల స్థలం కొనుగోలు చేశారు. 2020లో ఎల్ఆర్ఎస్ (LRS) కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఫీజు చెల్లించాలని నోటీస్ వచ్చింది. కానీ.. ఆ స్థలం చెరువుకు దగ్గరలో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు నీటిపారుదల, రెవెన్యూ అధికారుల అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఎల్ఆర్ఎస్ నిబంధనల ప్రకారం కూడా ఇప్పుడు రెవెన్యూ, నీటిపారుదల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే హెచ్ఎండీఏ నుంచి ప్రొసీడింగులు లభిస్తాయి. కానీ.. రెవెన్యూ, నీటిపారుదల అధికారుల కోసం ఎదురుచూస్తూ సదరు వ్యక్తి తన స్థలం వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది.ఏదో ఒకరోజు వస్తామని అధికారులు చెబుతున్నారు. ఏ రోజు వస్తారో తెలియక సదరు వ్యక్తి నిత్యం హిమాయత్‌నగర్ (Himayat Nagar) నుంచి కోత్తాపూర్కు, సంగారెడ్డికి తిరగాల్సి వస్తోంది. ఇది ఒక్క కోత్లాపూర్‌కు చెందిన బాధితుడి సమస్య మాత్రమే కాదు. చాలామంది దరఖాస్తుదారులు నీటిపారుదల, రెవెన్యూ అధికారుల అలసత్వం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగించినప్పటికీ సాంకేతిక చిక్కులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పథకాన్ని సద్వియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఫీజులు చెల్లించాలా.. వద్దా..? చెరువులు, కుంటలు తదితర నీటి వనరులకు 200 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలకు రెవెన్యూ, నీటిపారుదల శాఖల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఎల్ఆర్ఎస్ ఫీజు నోటీసు అందుకున్నవారు ఫీజు చెల్లించేందుకు వెసులుబాటు ఉంది. క్షేత్రస్థాయి తనిఖీల్లో ఆ స్థలం నీటి వనరులను ఆనుకొని ఉన్నట్లు తేలితే చెల్లించిన ఫీజును తిరిగి దరఖాస్తుదారుల ఖాతాలో జమ చేస్తారు. కాగా.. ప్రాసెసింగ్ పేరిట 10 శాతం వసూలు చేస్తారు. దీంతో చాలామంది ముందస్తుగా ఫీజులు చెల్లించేందుకు వెనకడుగు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ పూర్తి చేసిన తరువాతనే ఫీజు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాల మధ్య సమన్వయ లోపం తదితర కారణాలతో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మధ్యతరగతి వర్గాలు శివారు ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేశారు. అలాగే.. వివిధ జిల్లాలకు చెందినవారు సైతం నగరానికి చేరువలో సొంత స్థలాలను కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఘట్కేసర్, పోచారం, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, పటాన్చెరు తదితర ప్రాంతాల్లో స్థలాలను కొనిపెట్టుకున్నారు. ఇలా వివిధ చోట్ల కొనుగోలు చేసిన వాళ్లంతా అటు అధికారుల చుట్టూ, ఇటు తమ స్థలాల వద్దకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ప్రొసీడింగులు లభిస్తాయో లేదోననే సందేహంతో ఫీజులు చెల్లించేందుకు వెనకడుగు వేస్తున్నారు. హెచ్ఎండీఏ (HMDA) కార్యాలయంతో పాటు పలు మున్సిపల్ కార్యాలయాలకు బాధితులు బారులు తీరుతున్నారు. ఎల్–1, ఎల్–2 స్థాయిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు.సర్వర్ల డౌన్‌తో అవస్థలు.. సాంకేతిక కష్టాలు అధికారులను సైతం వదలడం లేదు. తరచూ సర్వర్లు డౌన్ కావడంతో అకస్మాత్తుగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ స్తంభించిపోతోంది. తిరిగి ఆన్లైన్ (Online) సేవలను పునరుద్ధరించేవరకు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ‘ఒక్కో జోన్లో నలుగురైదుగురు టెక్నికల్ సిబ్బంది పని చేస్తున్నప్పటికీ రోజుకు 40 ఫైళ్లు కూడా పరిష్కరించలేకపోతున్నాం’ అని ఒక అధికారి తెలిపారు.చదవండి: హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలుసర్వర్ డౌన్ (Server Down) కావడంతో గంటకోసారి ‘ఎర్రర్’ వచ్చేసి పనులు నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు. హెచ్ఎండీఏలో సుమారు 3.44 లక్షల దరఖాస్తులు ఉండగా.. ఇప్పటి వరకు 40 వేలుకూడా పూర్తి కాకపోవడం గమనార్హం. ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో హెచ్ఎండీఏకు రూ.1,500 కోట్లు వస్తాయని అంచనా. కాగా.. ఇప్పటి వరకు రూ.120 కోట్ల ఆదాయం కూడా లభించలేదు. -
జీహెచ్ఎంసీలో తగ్గిన భవన నిర్మాణ అనుమతులు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. గత ఆర్థిక సంవత్సరంలో 13,641 భవన నిర్మాణాలకు అనుమతులివ్వగా, తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం (2024–25)లో అవి 13,421కి తగ్గాయి. అయినప్పటికీ ఆదాయం మాత్రం కొంత పెరిగింది. క్రితంసారి రూ.1107.29 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ.1138.44 కోట్ల ఆదాయం సమకూరింది. హై రైజ్ భవనాలు (High-rise buildings) సైతం క్రితం కంటే తగ్గాయి. క్రితంసారి 130 హై రైజ్ భవనాలకు అనుమతులు జారీ కాగా.. ఈసారి 102 హై రైజ్ భవనాలకు మాత్రమే అనుమతులు జారీ అయ్యాయి. హై రైజ్ భవనాల్లో ఇనిస్టిట్యూషనల్ భవనాలు, ఆస్పత్రుల వంటివి మాత్రం గతం కంటే ఈసారి పెరిగాయి. గతంలో అలాంటివి కేవలం 12 మాత్రం ఉండగా, ఈసారి 46కు పెరిగాయి. దీంతో ఆదాయం (income) పెరిగింది. 50 అంతస్తుల భవంతికి అనుమతి తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొండాపూర్‌లో జీ+49 అంతస్తులతో 50 అంతస్తుల నివాస భవనానికి అనుమతులు జారీచేశారు. 165.95 మీటర్ల ఎత్తుతో 8 టవర్లుగా ఈ నిర్మాణానికి అనుమతులు జారీ అయినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. నేటి నుంచి ‘బిల్డ్ నౌ’’ జీహెచ్ఎంసీ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల్ని మరింత సరళీకరించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత ‘బిల్డ్ నౌ’ (BuildNow) పోర్టల్ ద్వారానే కొత్త దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చీఫ్ సిటీ ప్లానర్ కె. శ్రీనివాస్ తెలిపారు. భవన నిర్మాణాలకు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారంతా ‘బిల్డ్ నౌ’లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇటీవలే దీన్ని సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించడం తెలిసిందే. వ్యక్తిగత నివాస భవనాలు 75 చదరపుగజాల్లోపు ఇళ్లకు ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్, పదిమీటర్ల లోపు ఎత్తు, 500 చదరపు గజాల్లోపు వాటికి ఇన్స్టంట్ అప్రూవల్ ఇస్తారు. అంతకు మించిన వాటికి సింగిల్‌విండో ద్వారా అనుమతులు జారీ చేస్తారు. చదవండి: యువ ఐఏఎస్ అధికారికి ఫ్యూచర్ సిటీ పగ్గాలు! -
సిటీలో దొడ్డు బియ్యమే!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిస్తే కానీ, సన్న బియ్యం పంపిణీ జరిగే అవకాశాలు కానరావడం లేదు. జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ నామినేషన్ ప్రక్రియ ఈ నెల 9వ తేదీతో ముగియనుంది. విత్‌డ్రాల అనంతరం ఎన్నిక ఏకగ్రీవమైతే 10వ తేదీ తర్వాత కోడ్ ముగిసే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఎన్నికల బరిలో అభ్యర్థులు మిగిలి ఎన్నికలు జరిగితే మాత్రం ఈ నెల 29 వరకు కోడ్ అమలులో ఉంటుంది. ఆ తర్వాతనే సన్నబియ్యం జరిగే అవకాశాలున్నాయి. వాస్తవంగా ఏప్రిల్ కోటా నుంచి బియ్యం కేటగిరి మారుతుండటంతో ఎన్నికల కోడ్ నేపథ్యంలో సన్నబియ్యం పంపిణీపై పౌరసరఫరాల శాఖ ఎన్నికల కమిషన్‌ను అనుమతి కోరినా..ఇప్పటి వరకు అనుమతి లభించలేదు. దీంతో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ కొనసాగుతోంది. దొడ్డు బియ్యంపై అనాసక్తి జీహెచ్ఎంసీ పరిధిలోని ఆహార భద్రత(రేషన్) లబ్ధి కుటుంబాలు దొడ్డు బియ్యంపై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. పౌరసరఫరాల శాఖ అర్బన్ పరిధిలో సుమారు 12.56 లక్షల రేషన్ కార్డులుండగా, అందులో బుధవారం నాటికి కేవలం 20 వేల కుటుంబాలు మాత్రమే ఈ నెల కోటా డ్రా చేసినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ నెల 17న హైదరాబాద్, 23న రంగారెడ్డి జిల్లాలో, 20న మేడ్చల్మల్కాజిగిరి అర్బన్ పరిధిలో నెల వారి కోటా గడువు ముగియనుంది. అయితే కోటా గడువులోగా ఎన్నికల కోడ్ ముగిస్తే మాత్రం సన్నబియ్యం కోటా డ్రా చేయవచ్చని లబి్ధకుటుంబాలు భావిస్తున్నాయి. -
నారాయణ పేట జిల్లాలో విచిత్రం
కోస్గి: ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పిస్తూ అమలుచేస్తున్న ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) గందరగోళంగా మారింది. 336 గజాల ప్లాటుకు ఏకంగా రూ.104 కోట్ల ఎల్ఆర్ఎస్ ఫీజు విధించటంతో సదరు ప్లాటు యజమాని బిక్కమొహం వేశాడు. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం భోగారం (Bogaram) గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి తన ప్లాటు క్రమబద్ధీకరణ (Land Regularisation) కోసం గతంలో రూ.1,000 ఫీజు చెల్లించి వివరాలు నమోదు చేసుకున్నాడు.గురువారం తన ప్లాటుకు సంబంధించిన ఫీజు వివరాలు తెలుసుకునేందుకు కోస్గిలోని ఓ ఆన్లైన్ కేంద్రానికి వెళ్లాడు. అయితే 336.9 గజాల ప్లాటుకు రూ.104,35,19,683 ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని ఆన్లైన్లో చూపడంతో అవాక్కయ్యాడు. ఆన్లైన్లో చూపిన వివరాల మేరకు 336.9 గజాల ప్లాటుకు సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన మార్కెట్ విలువ (Market Value) రూ. 2,21,22,016 కుగాను రెగ్యులరైజ్ చార్జీలు రూ.1,12,676,14 ఉండగా.. 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీ రూ.104.34 కోట్లు చూపించారు. ఈ విషయంపై ఎంపీడీఓ శ్రీధర్‌ను వివరణ కోరగా.. సదరు ప్లాటు యజమాని వివరాలు సేకరించి జిల్లా అధికారులకు పంపించినట్లు తెలిపారు. ఆ ప్లాటుకు తగ్గిన ఎల్ఆర్ఎస్ రుసుము!జడ్చర్ల: జడ్చర్లలోని ఓ ప్లాటుకు ఎల్ఆర్ఎస్ రుసుము రూ.27.33 కోట్లుగా నిర్ణయించటంపై గురువారం మీడియాలో వచ్చిన కథనాలపై మున్సిపల్ అధికారులు స్పందించారు. సంబంధిత దరఖాస్తును మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి పరిశీలించి సరిచేశారు. కిష్టారెడ్డి నగర్‌లోని సర్వే నంబర్ 108లో కె.ఝాన్సీకి చెందిన 200 చదరపు గజాల ప్లాటుకు ఎల్ఆర్ఎస్ ఫీజు (LRS Fee) ఏకంగా రూ.27,33,42,785గా నిర్ణయించిన విషయం విదితమే. ఈ విషయాన్ని మీడియా వెలుగులోకి తేవటంతో అధికారులు తప్పును సరిదిద్దారు. ఆ ప్లాటుకు రూ.30,034లను ఎల్ఆర్ఎస్ ఫీజుగా నిర్ణయించారు. అలాగే తప్పుగా చూపిన ప్లాటు విస్తీర్ణాన్ని కూడా సరిచేశారు.హైదరాబాద్‌లో స్పందన అంతంతే.. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారు 1,07,865 మంది కాగా.. వీరిలో ఇప్పటి వరకు కేవలం 5,505 మంది మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీని వినియోగించుకున్నారు. తద్వారా జీహెచ్ఎంసీకి రూ.69.62 కోట్లు సమకూరాయి. మొత్తం దరఖాస్తుదారుల్లో 58,523 మందికి ఆటోమేటిక్‌గా ఫీజు లెటర్స్ జారీ కాగా, వారిలో కేవలం 5,505 మంది మాత్రమే 25 శాతం ఫీజు రాయితీని వినియోగించుకున్నారు. వీరిలో 40 మందికి ప్రొసీడింగ్స్ జారీ అయినట్లు సమాచారం. మరో నాలుగు రోజుల్లో గడువు ముగుస్తుందని, మిగతా వారు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ సూచించింది.చదవండి: సజ్జనార్‌కు మరో కీలక బాధ్యత? -
'కార్లు కడిగితే రూ.10 వేలు జరిమానా'
సాక్షి, హైదరాబాద్: వేసవిలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు జలమండలి పడరాని పాట్లు పడుతోంది. పదేళ్ల నాటి జనాభాకు తగ్గట్టు కేటాయింపులున్నా... వాటినే సర్దుబాటు చేసి ఎండకాలంలో గట్టెక్కేందుకు అనువైన అన్ని మార్గాలపై దృష్టి సారించింది. ఇప్పటికే నీటి సరఫరాలోని లీకేజీలను గుర్తించి చెక్ పెట్టిన జలమండలి (Water Board) తాజాగా సరఫరా చేసే నీరు తాగునీటికి మినహా ఇతర అవసరాలకు వాడకుండా కట్టడి చేసే చర్యలకు ఉపక్రమించింది. నల్లా వదిలిన సమయంలో తాగు నీటితో వాహనాలు, ఇంటి ముందు బండలు కడగడంతో పాటు గార్డెన్ ఇతర అవసరాలకు వినియోగించడాన్ని జలమండలి సీరియస్‌గా పరిగణించింది. మండుటెండలకు తాగునీటి వినియోగంతో పాటు పడిపోతున్న భూగర్భజలాలతో నీటికి డిమాండ్ పెరగుతోంది.ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీటి కంటే అధికంగా సరఫరా చేసే పరిస్థితులు లేవు. దీంతో బెంగళూరు తరహాలో తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగించేవారిపై జరిమానాతో కొరఢా ఝళిపిస్తోంది. తాజాగా జీహెచ్ఎంసీ (GHMC) మేయర్ గద్వాల విజయలక్ష్మీ కూడా తాగు నీటి వృథాను సీరియస్‌గా పరిగణించి రూ. 10 వేల జరిమానా విధించాలని జలమండలి యంత్రాంగానికి సూచించారు. ఇప్పటికే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన ఇద్దరు వినియోగదారును గుర్తించి తొలిసారిగా జరిమానాగా రూ. వెయ్యి విధించి జలమండలి నోటీసులు జారీ చేసింది. తాజాగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి క్షేత్ర స్థాయిలో నీటివృధాపై బృందాలను రంగంలోకి దింపింది. యువకుడికి ఫైన్ 15 రోజుల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నం. 78లో ఒక యువకుడు తాగు నీటితో బైక్ వాషింగ్ (Bike Washing) చేస్తుండగా గమనించి తొలిసారి తప్పుగా భావించి రూ.1000 జరిమానా విధించారు. జర్నలిస్టు కాలనీలో ఒక మహిళ తాగునీటితో వాహనం శుభ్రం చేయడం గుర్తించి ఫైన్ విధించారు. ప్రస్తుతం 547 ఎంజీడీల నీరు సరఫరాజలమండలి పరిధిలో 13.7 లక్షల నీటి కనెక్షన్లు ఉండగా ప్రతి రోజూ 547.86 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తోంది. పదేళ్ల నాటి నీటి కేటాయింపులతో రెండింతలు పెరిగిన జనాభాకు రోజువారీగా తాగు నీరు సరఫరా (Drinking Water Supply) పెద్ద సవాలుగా తయారైంది. నగరంలో తగినంత స్థాయిలో భూగర్భ జలాలు లేకపోవడం వల్ల 150–200 కిలో మీటర్ల దూరం నుంచి జలాలను తరలించి శుద్ది చేసి తాగునీరు సరఫరా చేస్తోంది. ప్రతి వెయ్యి లీటర్ నీటి సరఫరాకు రూ.48 ఖర్చు భరిస్తోంది. ఇదిలా ఉండగా జలమండలి సరఫరా చేస్తున్న నీటిలో సుమారు 20 శాతం పైగా నీరు లీకేజీలతో వధా పోతున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇక RRR వరకు హెచ్ఎండీఏ అనుమతులే..ఇప్పటికే లీకేజీలు చెక్...! ఇప్పటికే తాగు నీటి సరఫరాలో లీకేజీలను చెక్‌పెట్టింది. ప్రధాన జలాశయాల నుంచి సర్వీస్ రిజర్వాయర్ల వరకు మార్గమధ్యలో లీకేజీలను గుర్తించి మరమత్తు పనులు పూర్తి చేసింది. మరోవైపు క్షేత్ర స్థాయిలో సర్వీస్ పైప్లైన్లపై దష్టి సారించి లీకేజీలలను నివారించింది. కార్లు కడిగితే రూ.10 వేలు జరిమానా వేయండి తాగు నీటితో కొందరు నిత్యం తమ కార్లు, ఇంటి ముందున్న బండలు, రోడ్లు కడుగుతున్నారు. వారికి తాగు నీటి విలువ తెలియడం లేదు. అలా వ్యవహరిస్తున్న వారిపై రూ. 10 వేల జరిమానా విధించాలి. – గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ మేయర్తాగు నీరు వృథా చేయొద్దు తాగు నీరు అనేది విలాసవంతమైనది కాదు. అత్యవసరమైనది. నీటి వృథా (Water wastage) తగ్గించగలగితే ఇతరులకు దాహార్తి తీర్చినవారవుతారు. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి నీటిని తరలించి శుద్ది చేసి సరఫరా చేస్తున్నాం. ఇంతటి ప్రాముఖ్యమైన నీటిని వృథా చేయకూడదు. - అశోక్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్, జలమండలి -
‘బిల్డ్ నౌ’ ఎలా పని చేస్తుంది..?
సాక్షి, హైదరాబాద్: సామాన్యులు సైతం సులభంగా ఇంటి నిర్మాణ, లే ఔట్ అనుమతులు పొందేలా ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ‘బిల్డ్ నౌ’ను జీహెచ్ఎంసీ (GHMC) అందుబాటులోకి తెచ్చింది. ‘బిల్డ్ నౌ’తో భవన నిర్మాణ అనుమతుల కోసం ఎంతో కాలం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. స్థలం ఎంత విస్తీర్ణంలో ఎన్ని అంతస్తులు నిర్మించవచ్చో, వదలాల్సిన సెట్బ్యాక్లు తదితర భవన నిర్మాణ నిబంధనల సమాచారం తెలుపుతుంది. సామాన్యులు ఇంటి అనుమతికి దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుందని, డ్రాయింగ్స్ పరిశీలన నిమిషాల్లోనే పూర్తవుతుందని జీహెచ్ఎంసీ చీఫ్ సిటీప్లానర్ శ్రీనివాస్ తెలిపారు.ప్రస్తుతం టీజీబీపాస్లో ఇన్స్టంట్ అప్రూవల్‌కు, మిగతా అనుమతులకు వేర్వేరు విండోస్ ఉండగా, బిల్డ్ నౌలో అన్నింటికీ ఒకే విండోతో త్వరితగతిన అనుమతులు జారీ అవుతాయి. భవన నిర్మాణం పూర్తయ్యాక ఎలా ఉంటుందో కూడా త్రీడీలో చూపుతుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ప్రారంభించిన దీన్ని క్రమేపీ హెచ్ఎండీఏ, డీటీసీపీ, తెలంగాణ (Telangana) మొత్తం అమల్లోకి తేనున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా గురువారమే ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకున్న ముగ్గురికి అనుమతులు జారీ చేశారు. ఇలా పని చేస్తుంది.. → ఏఐతో పాటు సురక్షిత డిజిటల్ ట్రాన్సాక్షన్, స్థలం పరిమాణానికి సంబంధించిన అవగాహన, ఆలోమేషన్ వంటి వాటితో అత్యంత వేగంగా అనుమతుల జారీ. → దేశంలోనే అత్యంత వేగవంతమైన డ్రాయింగ్ వ్యవస్థ సులభతరం.. మెరుపువేగం. → 5 నిమిషాల్లోపునే డ్రాయింగ్ పరిశీలన పూర్తవుతుంది. ఇప్పటి వరకు 2–30 రోజుల సమయం పట్టేది. → అధునాతన క్యాడ్ ప్లగిన్. డిజైన్ సాఫ్ట్‌వేర్‌తో ప్రత్యక్ష అనుసంధానం. → డ్రాయింగ్స్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నదీ లేనిదీ తక్షణమే నిర్ధారిస్తుంది. → సాధారణ లోపాలు నివారిస్తూ దరఖాస్తు ప్రక్రియ సులభతరం చేస్తుంది. → వాట్సాప్ ద్వారానూ అప్డేట్స్ తెలియజేస్తుంది. ప్రాసెస్ ఫ్లోను దరఖాస్తుదారులు ఆన్లైన్లో చూసుకోవచ్చు. → సందర్భానుసారం మారే ఫీజులు, టారిఫ్‌లు, ప్రాసెసింగ్ ఫీజులు తక్షణమే నవీకరించుకోవచ్చు. 360 డిగ్రీస్ పారదర్శకత. → స్థూల, సూక్ష్మస్థాయిల్లో ప్రాజెక్ట్ పరిస్థితి, పనితీరు పరిశీలన. → వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయం. → పట్టణ నియమ నిబంధనలు మార్పుల్పి క్షణాల్లో అప్డేట్ చేసుకోవచ్చు. → పాలసీ ఆధారిత అప్డేట్స్ను రిపోర్టులు, చట్టపర పత్రాల్లో అమలు చేయొచ్చు. → అందరికీ అర్థమయ్యేలా ఇంగ్లిష్తో పాటు తెలుగు, ఉర్దూ భాషల్లోనూ ఉంటుంది. ఎన్ని అంతస్తులైనా.. → ఇప్పటి వరకు డ్రాయింగ్స్ పరిశీలనకే ఎన్నో రోజులు పట్టేది. బిల్డ్‌నౌతో 7.7 ఎకరాల విస్తీర్ణంలోని హైరైజ్ భవనాలకు, 33 అంతస్తులున్న 5 టవర్లకు, 12 అంతస్తుల ఎమినిటీస్ బ్లాక్‌కు, 22 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియా భవనాలకైనా 5 నిమిషాల్లోనే పరిశీలన పూర్తవుతుంది. → సింగిల్ విండోతో వివిధ ప్రభుత్వ విభాగాల వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. → జియో ఇంటెలిజెన్స్‌తో ఆటోమేటిక్‌గానే మాస్టర్ప్లాన్లు, సంబంధితమైనవి పరిశీలిస్తుంది. → అడ్వాన్స్డ్ క్యాడ్ ప్లగిన్ భారీ భవనాలకు సైతం ఆర్కిటెక్టులు, ఇంజినీర్ల సమయాన్ని తగ్గస్తుంది. వారాలు, నెలల నుంచి రెండు మూడు రోజులకు తగ్గుతుంది. → క్యాడ్ ప్లగిన్ వినియోగానికి సంబంధించి వెబ్సైట్ నుంచి వన్ టూ వన్ వీడియో కన్సల్టేషన్ కూడా జరపొచ్చని చెబుతున్నారు. →సిటిజెన్ సెంట్రిక్ డిజైన్‌తో పనిచేస్తుంది. -
GHMC: చెత్త వేస్తే ఈ–చలాన్.. ఎలాగో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ఓవైపు చెత్త సమస్యల పరిష్కారం.. మరో వైపు జీహెచ్ఎంసీ ఖజానాకు గండి పడకుండా రెండు రకాలుగా ఉపకరించేందుకు జీహెచ్ఎంసీ ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ‘చెత్త వేస్తే ఈ–చలాన్’ విధానం మంచి ఫలితాలిస్తోందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ విధానం కోసం జీహెచ్ఎంసీ (GHMC) ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సంబంధిత అధికారులకు శిక్షణ నిచ్చింది. వాటిని వినియోగిస్తూ ప్రస్తుతం వారు మూడు రకాల ఉల్లంఘనలకు పెనాల్టీలు (Penalties) విధిస్తున్నారు. సొమ్ము పక్కదారి పట్టకుండా.. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన వారెవరో గుర్తించేందుకు ప్రస్తుతం అన్నిప్రాంతాల్లో తగిన సాంకేతికత అందుబాటులో లేకపోవడంతో.. తొలుత దుకాణాల ముందు చెత్త వేసేందుకు ప్రత్యేకంగా చెత్త డబ్బాలు ఏర్పాటు చేయని దుకాణదారులకు, దుకాణాల ముందు వ్యర్థాలు వేస్తున్న వారికి, ఎక్కడ పడితే అక్కడ సీఅండ్‌డీ (నిర్మాణ, కూల్చివేతల) వ్యర్థాలు వేసినట్లు గుర్తించిన వారికి ఈ–చలానాలు (E Challan) విధిస్తున్నారు. దీంతో పాటు పెనాల్టీలను సైతం యూపీఐ (UPI) ద్వారానే చెల్లించాల్సి ఉండటంతో పెనాల్టీల సొమ్ము పక్కదారి పట్టకుండా జీహెచ్ఎంసీ ఖజానాలోకే చేరేందుకు మార్గం ఏర్పడింది. పెనాల్టీల వివరాలు అందుబాటులోకి.. గతంలో పెనాల్టీలకు పుస్తకాల్లోని రసీదులిచ్చినప్పుడు ఎవరికి ఎంత మేర పెనాల్టీ విధించారో, ఎంత వసూలు చేశారో, ఎంత జీహెచ్ఎంసీ ఖజానాలో చెల్లించారో, అసలు చెల్లించారో లేదో తెలిసేది కాదు. ప్రస్తుతం ఈ–చలానా కావడంతో ఎంతమందికి చలానాలు విధించింది, వాటిలో ఎంతమంది చెల్లించింది, ఎంత మొత్తం చెల్లించింది తదితర వివరాలు యాప్‌లోనే ఎప్పుడైనా ఉన్నతాధికారులు సైతం చూడవచ్చని అడిషనల్ కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్ (శానిటేషన్) తెలిపారు.చదవండి: అసలు హెచ్‌సీయూ భూములు ఎన్ని.. వివాదం ఏంటి?అంతేకాకుండా పెనాల్టీలు విధిస్తారని తెలిసి యజమానులు తమ దుకాణాల ముందు బిన్లు ఏర్పాటు చేసుకుంటారని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త, సీఅండ్‌డీ వ్యర్థాలు వేసేవారు కూడా క్రమేపీ తగ్గుతారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. మొత్తానికి యాప్‌తో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, ఈ అనుభవంతో మున్ముందు మరిన్ని ఉల్లంఘనలకు సైతం ఈ యాప్‌ను వినియోగించుకొని ఈ–చలానాలను విధించనున్నట్లు రఘు ప్రసాద్ తెలిపారు. గత వారం రోజుల్లో దుకాణాల ముందు చెత్త డబ్బాలు ఉంచని 189 మంది దుకాణాల నిర్వాహకులకు విధించిన పెనాల్టీలు రూ.4,10,300. → ఇందులో మంగళవారం 19 మందికి రూ. 55,400 పెనాల్టీలు విధించారు. → వారం రోజుల్లో యూసుఫ్‌గూడ సర్కిల్లో అత్యధికంగా 33 మందికి రూ.1,36,000 పెనాల్టీ విధించారు. → మెహిదీపట్నం, ముషీరాబాద్, అంబర్‌పేట, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, బేగంపేట, మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, చార్మినార్ సర్కిళ్లలో మాత్రం ఇంకా ఈ–చలానాలు ఇంకా ప్రారంభించనట్లు తెలిసింది. ఈ సర్కిళ్లలో ఇంతవరకు ఎలాంటి పెనాల్టీలు విధించలేదు. -
బిల్డర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొందరు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ.. బిల్డర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. వీరంటే జీహెచ్ఎంసీ సిబ్బంది వణికిపోతున్నారని, అందరూ కూర్చుని కాంప్రమైజ్ అవుతుండడంతో.. అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. శాసనసభలో మంగళవారం జరిగిన జీరోఅవర్‌లో ‘దానం’మాట్లాడారు. తన ప్రమేయం లేకుండా.. తన నియోజకవర్గంలోని ఈద్గా మైదానంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థలం ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. దీంతో తాను వెళ్లి.. సబ్ స్టేషన్‌కు వేసిన పునాదులను కూల్చివేశానన్నారు. తన క్యాంపు కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరినా కేటాయించడం లేదని ‘దానం’ విమర్శించారు. » అంబర్‌పేటలో రూ.400 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మించగా, సీఎంకు సమయం లేక ఇంకా ప్రారంభించలేదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఫ్లైఓవర్‌కు సమాంతరంగా సర్వీసు రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మూసారాంబాగ్ ఫ్లైఓవర్ నిర్మాణం నత్తనడకన సాగుతోందని, వేగం పెంచాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ 15 నెలలుగా తమ నియోజకవర్గాల్లో ఎలాంటి పనులకు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. » ఎల్బీనగర్ నియోజకవర్గంలో హుడా ఆమోదించిన లేఅవుట్లో 44 కాలనీలు ఏర్పాటు కాగా, ఆ తర్వాత ఆ స్థలం ప్రభుత్వానిదని పేర్కొంటూ రిజిస్ట్రేషన్లు ఆపేశారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 118 కింద ఈ స్థలాలను క్రమబద్దికరించి కన్వేయన్స్ డీడ్స్ జారీ చేసిందని చెప్పారు. ఎన్నికలు రావడంతో కొందరికి ఇవ్వలేకపోయిందన్నారు. మిగిలిన వారికి సైతం కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వడంతో పాటు నిషేధిత జాబితాల నుంచి ఈ స్థలాలను తొలగించాలని కోరారు. ఈ సమస్యను గతంలో సైతం తన దృష్టికి తీసుకువచ్చారని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బదులిచ్చారు. » నగరంలోని బస్తీ దవాఖానాల్లో వైద్యులు, అత్యవసర మందులు లేవని యాకుత్‌పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ తెలిపారు. రక్త పరీక్షలు సైతం జరపడం లేదని పేర్కొన్నారు. అలాంటప్పుడు బస్తీ దవాఖానాలకు ప్రజలు ఎందుకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలానికి తక్షణమే ఎన్వోసీ జారీ చేయాలని జీహెచ్ఎంసీని కోరారు. » ప్రకాశ్‌నగర్, ఇతర కాలనీల ప్రజలు అటవీ భూముల్లో ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని, వారికి పట్టాలు ఇవ్వాలని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. » తన నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలకు టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ.15 కోట్లు రావలసి ఉండగా, ఇవ్వడం లేదని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. మెట్పల్లి ఆస్పత్రి నిర్మాణానికి కూడా నిధులు ఇవ్వాలని కోరారు. మునిపేటలో రుణమాఫీ జరగని 330 మంది రైతులు ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్తే అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. » నాగర్‌కర్నూల్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనం నిర్మించాలని, సాంకేతిక విద్య కళాశాలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే కె.రాజేశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. » సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల మధ్య ఉన్న తన నియోజకవర్గం.. గత బీఆర్ఎస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని మానకొండూరు ఎమ్మెల్యే కె.సత్యనారాయణ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆట పాటలు, ఎగరడం, దూకడానికే పరిమితమయ్యారని, నియోజకవర్గానికి ఏమీ చేయలేదని విమర్శించగా, బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. కేవలం 24 ఎకరాలు సేకరిస్తే 10వ ప్యాకేజీ పనులు పూర్తయ్యేవని, బాలకిషన్ ప్రజలను రెచ్చగొట్టి పనులు జరగకుండా చేశారని ఆరోపించారు. సత్వరం భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. » ఆసిఫాబాద్ నియోజకవర్గం ఉండి గ్రామంలో రూ.8.5 కోట్లతో మంజూరైన వంతెన నిర్మాణ అంచనాలు రూ.14.4 కోట్లకు పెరిగాయని, నిధులు మంజూరు చేసి సత్వరం పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి విజ్ఞప్తి చేశారు. లక్మాపూర్ వంతెనను కూడా పూర్తిచేయాలని, ఆసిఫాబాద్ నుంచి అస్మాపూర్ వరకు రోడ్డు వేయాలని కోరారు. » నారాయణపేట నియోజకవర్గం కోయిల్‌కొండ నియోజకవర్గంలో బీసీ వసతి గృహ భవనం శిథిలావస్థకు చేరిందని, కొత్త భవనాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ధన్వాడలో డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. » నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నిర్మాణం పూర్తయిన 396 ఇళ్లతో పాటు నిర్మాణం ఆగిపోయిన 252 ఇళ్లను పూర్తిచేసి లబ్దిదారులకు అందజేయాలని ఎమ్మెల్యే డి.సూర్యనారాయణ గుప్తా విజ్ఞప్తి చేశారు. » మిర్యాలగూడను స్పెల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. తన నియోజకవర్గంలో రైస్ మిల్లులు ఎక్కువగా ఉండగా, విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం కింద భూములు కోల్పోయిన నిర్వాసితుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. -
అది మా జాగా.. మేమే నిర్మిస్తాం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ ప్రతిపాదించిన ఫ్లై ఓవర్లలో విప్రో జంక్షన్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఖాజాగూడ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణాల అంచనా వ్యయం రూ.837 కోట్లుగా చెప్పి..నాలుగో ప్యాకేజీలో భాగంగా ఈ మూడింటికీ కలిపి టెండర్లు పిలవాల్సి ఉంది. కానీ విప్రో జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి మాత్రం టెండర్లు పిలవకుండా పెండింగ్‌లో ఉంచి మిగతా రెండు జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వాటి నిర్మాణ అంచనా వ్యయం రూ.650 కోట్లు. విప్రో జంక్షన్ వద్ద టెండరు పిలవకపోవడానికి కారణం ఆ మార్గంలో మెట్రో రైలు మార్గం కూడా రానున్నందున ఒకే పిల్లర్‌పై మెట్రో మార్గం, జీహెచ్ఎంసీ ఫ్లై ఓవర్‌ను డబుల్ డెక్కర్‌గా నిర్మించాలని భావించారు. ఆ మేరకు జరిగిన జీహెచ్ఎంసీ, రైల్వే అధికారుల సమావేశంలో డబుల్ డెక్కర్ నిర్మాణానికి రైల్వే నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. దాంతోపాటు మెట్రో మార్గం నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు, తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని రైల్వేతో సమన్వయం కుదరదని జీహెచ్ఎంసీ కూడా భావించింది. అంతే కాకుండా జంక్షన్ల వద్ద ట్రాఫిక్ జామ్‌లు లేకుండా సిగ్నల్ ఫ్రీగా ఉండేందుకు జీహెచ్ఎంసీ ఫ్లై ఓవర్లను నిర్మిస్తోంది. మెట్రో రైలు స్టేషన్ జంక్షన్‌లోనే ఉంటుంది. ఇలా వివిధ అంశాల్లో వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకొని ఆ ఫ్లై ఓవర్‌కు టెండర్ పిలవలేదు. అది మా జాగా.. మేమే నిర్మిస్తాంమరోవైపు, విప్రో జంక్షన్ స్థలం తెలంగాణ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు చెందినది కావడంతో తమ స్థలంలో అవసరమైన ఫ్లై ఓవర్‌ను తామే నిర్మిస్తాం సదరు కార్పొరేషన్ అధికారులు జీహెచ్ఎంసీకి తెలిపినట్లు సమాచారం. దీంతో ఇక విప్రో జంక్షన్లో ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ విరమించుకుంది. మిగతా మార్గాల్లో డౌటే ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లోనూ డబుల్ డెక్కర్ల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జీహెచ్ఎంసీ కొత్తగా నిర్మించబోయే ఫ్లై ఓవర్ల మార్గాల్లో మెట్రో రైలు మార్గాలున్నట్లయితే ఫ్లై ఓవర్ల పై వరుసలో మెట్రో రైలు మార్గానికి అనుగుణంగా పిల్లర్లు నిరి్మంచాలని భావించారు. ఎత్తయిన పిల్లర్లు నిర్మించి డబుల్ డెక్కర్‌గా రెండు నిర్మాణాలు చేయాలనుకున్నారు. అందులో భాగంగానే విప్రో జంక్షన్ వద్ద కూడా సిద్ధమైనప్పటికీ, ప్రభుత్వశాఖలు వేటికవిగా అందుకు విభేదించడంతో జీహెచ్ఎంసీ విరమించుకుంది. మియాపూర్ –పటాన్‌న్‌చెరు మార్గంలో ఆలి్వ¯Œన్ క్రాస్‌రోడ్, మదీనగూడ, చందానగర్, బీహెచ్ఈఎల్,ఇక్రిశాట్ల మార్గాల్లో, నాగోల్– ఎయిర్పోర్ట్ మార్గంలో ఎల్బీనగర్, కర్మ¯న్Œ ఘాట్, ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్ తదితర ప్రాంతాల్లో మెట్రో రైలు రానుంది. ఆ మార్గాల్లో జీహెచ్ఎంసీ ఫ్లై ఓవర్లు వచ్చేచోట డబుల్డెక్కర్లుగా డబుల్ డెక్కర్లు నిరి్మంచేందుకు ఆలోచనలు చేసినప్పటికీ, తాజా పరిస్థితులతో డైలమాలో పడ్డాయి. ⇒ నాగోల్– ఎయిర్‌పోర్టు మార్గంలో మెట్రో మార్గంలో జీహెచ్ఎంసీ ఫ్లై ఓవర్లు వచ్చే ప్రాంతాలు ⇒ టీకేఆర్ కాలేజ్,గాయత్రినగర్, మందమల్లమ్మ జంక్షన్లు ⇒ ఒమర్ హోటల్– సోయబ్హోటల్ (వయా మెట్రో ఫంక్షన్‌హాల్) ⇒ బండ్లగూడ– ఎరక్రుంట క్రాస్‌రోడ్స్ ⇒ మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్ రోడ్, కాటేదాన్ జంక్షన్. ⇒ మియాపూర్ క్రాస్‌రోడ్– ఆలి్వన్ క్రాస్‌రోడ్ మార్గంలో మదీనగూడ గంగారం వద్ద. -
హైదరాబాద్ సిటీలో మరిన్ని ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు
సాక్షి, సిటీబ్యూరో: హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) పనుల్లో భాగంగా రెండు జంక్షన్ల వద్ద నాలుగు ఫ్లై ఓవర్లు.. రెండు అండర్‌పాస్‌లు.. రెండు రహదారుల విస్తరణ, అభివృద్ధి పనుల కోసం జీహెచ్ఎంసీ (GHMC) జాతీయ స్థాయి టెండర్లను పిలిచింది. ఈ పనుల నిర్మాణ వ్యయం దాదాపు రూ. 650 కోట్లు. టెండర్ల దాఖలుకు చివరి తేదీ వచ్చే నెల 9. గ్రేటర్ నగరంలో సిగ్నల్ ఫ్రీ (Signal Free) ప్రయాణం కోసం ఇప్పటికే ఎన్నో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు (Underpass) తదితర వసతులు అందుబాటులోకి వచ్చాయి. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మరిన్ని ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించేందుకు సిద్ధమైన ప్రభుత్వం దాదాపు రూ.2,400 కోట్ల మేర పనులు చేపట్టాల్సిందిగా ఇటీవల జీహెచ్ఎంసీని ఆదేశించింది.అందుకనుగుణంగా ఇప్పటికే కేబీఆర్ పార్కు (KBR Park) పరిసరాల్లో కొన్ని స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఫాక్స్ సాగర్ నాలా వద్ద ఫ్లై ఓవర్ పనులకు టెండర్లు ఆహ్వానించిన జీహెచ్ఎంసీ.. తాజాగా ఖాజాగూడ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్ల వద్ద మరికొన్ని ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లకు టెండర్లు ఆహ్వానించింది. వీటితో పాటు సైబరాబాద్ సీపీ కార్యాలయం నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు 215 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ, అంజయ్యనగర్ నుంచి రాంకీ టవర్ రోడ్ వరకు 150 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ పనులకు టెండర్లు పిలిచింది. జీహెచ్ఎంసీ నుంచి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ పనుల్ని రెండేళ్లలో పూర్తి చేయాల్సిందిగా టెండరు నిబంధనల్లో పేర్కొంది. పనులు పూర్తయ్యాక రెండేళ్లపాటు అవసరాన్ని బట్టి మరమ్మతులు వంటివి చేయాల్సి ఉంటుంది. తాజాగా టెండర్లు పిలిచిన పనులు ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద.. → ఐఎస్బీ నుంచి డీఎల్ఎఫ్ రోడ్ వరకు రెండు వైపులా ప్రయాణానికి మొదటి వరుస ఫ్లై ఓవర్. నాలుగు లేన్లు. క్యారేజ్ వే వెడల్పు 7.5 మీటర్లు. → ఐఎస్బీ నుంచి గచ్చిబౌలి వెళ్లేందుకు రెండో వరుసలో మరో ఫ్లై ఓవర్. మూడు లేన్లుగా ప్రయాణం. క్యారేజ్‌వే వెడల్పు 11 మీటర్లు. → డీఎల్ఎఫ్ నుంచి బీహెచ్ఈఎల్ రోడ్ వైపు వెళ్లేందుకు రెండో వరుసలో మూడు లేన్ల ఫ్లై ఓవర్. క్యారేజ్‌వే వెడల్పు 11 మీటర్లు. → గచ్చిబౌలి నుంచి బీహెచ్ఈఎల్ వరకు రెండు వైపులా ప్రయాణానికి ఆరు లేన్లతో అండర్ పాస్. 11 మీటర్ల క్యారేజ్‌వే. వరద నీరు పోయే మార్గాలతో పాటు 2 లక్షల నీటి సామర్థ్యంతో సంప్ నిర్మాణం. ఖాజాగూడ జంక్షన్ వద్ద.. → నానక్‌రామ్‌గూడ – టోలిచౌకి రోడ్ వరకు మూడు లేన్లతో ఫ్లై ఓవర్. క్యారేజ్‌వే 9.5 మీటర్లు. → టోలిచౌకి రోడ్– బయోడైవర్సిటీ వరకు మూడు లేన్లతో అండర్‌పాస్. క్యారేజ్‌వే 11 మీటర్లు. రెండు వైపులా ఫుట్‌పాత్‌లతో పాటు వాటి కింద డక్ట్ నిర్మాణం. వరదనీరు పోయే మార్గాలతో పాటు సంప్ నిర్మాణం. → ఈ పనులతో పాటు ఆయా జంక్షన్ల వద్ద రోడ్ల పునరుద్ధరణ, ఫుట్‌పాత్‌లు, లైటింగ్, ఇతరత్రా సదుపాయాలతో ఆధునికీకరణ. సైబరాబాద్ సీపీ కార్యాలయం – గచ్చిబౌలి జంక్షన్ వరకు, అంజయ్యనగర్ –రాంకీ టవర్ రోడ్ వరకు రోడ్లను వెడల్పు చేసి సాఫీగా ప్రయాణం సాగేలా ఆధునికీకరించాలి. ఇదివరకే టెండర్లు పిలిచిన పనులుప్యాకేజీ – 1 కింద రూ. 580 కోట్ల అంచనా వ్యయంతో.. → జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్ వద్ద అండర్‌పాస్. → జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 నుంచి కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ వరకు మొదటి వరుస ఫ్లై ఓవర్. → యూసుఫ్‌గూడ రోడ్ నుంచి రోడ్ నంబర్ 45 వరకు రెండో వరుస ఫ్లై ఓవర్. → కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ జంక్షన్ వద్ద జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ రోడ్ వరకు అండర్‌పాస్. → బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ రోడ్ వరకు ఫ్లై ఓవర్. → ముగ్ధ జంక్షన్ వద్ద కేబీఆర్ ఎంట్రన్స్ రోడ్ నుంచి పంజగుట్ట రోడ్ వరకు అండర్‌పాస్. ప్యాకేజీ–2 కింద.. రూ. 510 కోట్ల అంచనా వ్యయంతో.. → రోడ్ నంబర్–45 జంక్షన్ వద్ద ఫిల్మ్‌నగర్ రోడ్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ రోడ్ వరకు అండర్‌పాస్. → జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ రోడ్ నుంచి రోడ్ నంబర్ 45 వరకు ఫ్లై ఓవర్. → ఫిల్మ్‌నగర్ జంక్షన్ వద్ద మహారాజా అగ్రసేన్ జంక్షన్ రోడ్ నుంచి రోడ్ నంబర్ 45 జంక్షన్ వరకు అండర్‌పాస్. → ఫిల్మ్‌నగర్ రోడ్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ రోడ్ వరకు ఫ్లై ఓవర్. → మహారాజా అగ్రసేన్ జంక్షన్ వద్ద కేన్సర్ హాస్పిటల్ రోడ్ నుంచి ఫిల్మ్‌నగర్ రోడ్ వరకు అండర్‌పాస్. → ఫిల్మ్‌నగర్ రోడ్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 వరకు ఫ్లై ఓవర్. → కేన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ రోడ్ వరకు అండర్‌పాస్. → మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 వరకు ఫ్లై ఓవర్.→ ఆయా ఫ్లై ఓవర్ల నిర్మాణాలు పూర్తయితే కోర్ సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి పశ్చిమం వైపు.. ఐటీ కారిడార్లకు రాకపోకలు చేసేవారికి సమయం, వ్యయ ప్రయాసలు తప్పుతాయని అధికారులు పేర్కొన్నారు. -
బీఆర్ఎస్ యువ కార్పొరేటర్ హేమ సామల వివాహ వేడుకలో ప్రముఖుల సందడి (చిత్రాలు)
-
గ్రేటర్ హైదరాబాద్‌లో ఆస్తి పన్ను చెల్లింపు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, సాక్షి : హైదరాబాద్ నగర వాసులకు జీహెచ్ఎంసీ శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను చెల్లింపులో వడ్డీపై 90 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే గతేడాది బకాయిదారులకు బల్దియా వన్ టైం సెటిల్మెంట్ అవకాశాన్ని కల్పిచ్చింది.తాజాగా, మరోసారి ఆ అవకాశాన్ని కల్పిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెలాఖరు వరకు పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేవారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. తద్వారా 2024-25 సంవత్సరానికి కేవలం 10 శాతం వడ్డీతో బకాయిదారులంతా తమ ఆస్తిపన్నును చెల్లించే వెసులుబాటు కలుగుతుంది. అయితే,ఈ ఓటీఎస్ ద్వారా పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ వసూలవుతుందని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. సుమారు రెండు వేల కోట్ల ఆస్తి పన్ను లక్ష్యంగా తెలంగాణ సర్కారు ఈ ని ర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
Hyderabad: గుర్రపు డెక్క తొలగిస్తుండగా ప్రమాదం
హైదరాబాద్: లంగర్‌హౌస్‌లోని చెరువులో గుర్రపు డెక్క తొలగించడానికి వెళ్లిన జీహెచ్ఎంసీ మలేరియా విభాగం కాంట్రాక్ట్ ఉద్యోగి షేక్ కరీం, తొమ్మిదో తరగతి చదువుతున్న ఆయన కుమారుడు సాహిల్ ప్రమాదవశాత్తు అందులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన బుధవారం జరిగింది. కాగా.. బల్దియా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తండ్రీ కొడుకులు చెరువులో మునిగి మృత్యువాత పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణ గుట్ట కందికల్ గేట్ ప్రాంతంలో నివసించే షేక్ కరీం (39) జీహెచ్ఎంసీ మలేరియా విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగి. ఇతడికి ఈత బాగా రావడంతో చెరువుల శుద్ధి కోసం పంపించేవారు. ఇందులో భాగంగా మంగళవారం లంగర్‌హౌస్‌లోని జీహెచ్ఎంసీ చెరువులో కరీం గుర్రపు డెక్క తొలగించి వెళ్లాడు. బుధవారం సెలవు కావడంతో 9 వ తరగతి చదువుతున్న తన కుమారుడు సాహిల్‌ను అధికారుల అంగీకారంతో తనతో పాటు తీసుకువచ్చాడు. గుర్రపు డెక్క తీస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరూ చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. పతంగుల మాంజానే ప్రాణాలు తీశాయా? లంగర్‌హౌస్ చెరువును ఎప్పటికప్పుడు శుద్ధి చేయకపోవడంతో గుర్రపు డెక్కతో పాటు చెరువులో చెత్త పేరుకుపోయింది. దీనికితోడు ఇటీవల పతంగులు చెరువు నిండా పడ్డాయి. పతంగుల మాంజా దారాలలో చిక్కుకొని తండ్రీ కొడుకులు మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. కుమారుణ్ని కాపాడే ప్రయత్నంలో.. గుర్రపు డెక్క తొలగించడానికి చెరువులో దిగిన సమయంలో రెండు బండరాళ్ల వద్దకు కరీం తన కుమారుడు సాహిల్‌ను పంపించాడు. ఆ సమయంలో కాలుకు ఏదో తట్టుకుందని, తనతో కావట్లేదు.. తనను కాపాడాలని సాహిల్ అరిచాడు. ఇటువైపు ఉన్న తండ్రి వెంటనే అక్కడికి వెళ్లి కుమారుడిని ఎత్తే ప్రయత్నంలో ఇద్దరు మునిగిపోయారు.అధికారులు పరార్.. కరీం, సాహిల్‌లు చెరువులో ఉన్న సమయంలో ఒడ్డున ఎంటమాలజిస్టు అధికారి రమేష్‌తో పాటు ఆరుగురు మలేరియా విభాగం సిబ్బంది ఉన్నారు. నీటిలో మునిగిపోతున్న కుమారుడు సాహిల్‌ను కరీం తన భుజాలపై ఎత్తుకుని సిబ్బందిని కాపాడాలని కోరాడు. ఆ సమయంలో అధికారులతో పాటు సిబ్బంది కాపాడే ప్రయత్నం చేయకుండా జరిగిన విషయాన్ని స్థానిక నాయకులకు, మరికొందరికి ఫోన్ ద్వారా తెలుపుతూ సహాయం కావాలని కోరారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది స్పందించి ఉంటే వారి ప్రాణాలు దక్కేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తాను బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లో లంగర్‌హౌస్‌కు వచ్చి ఈ చెరువును దత్తత తీసుకొని అభివృద్ది చేస్తానన్నారు. అప్పుడు వచ్చి వెళ్లిన ఆమె మళ్లీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. వెంటనే స్పందించిన హైడ్రా కమిషనర్.. చెరువులో తండ్రీ కొడుకులు మునిగిపోవడంతో పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫోన్ చేసి సహాయం కోరారు. స్పందించిన ఆయన వెంటనే సహాయం కోసం డీఆర్ఎఫ్ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపారు. సహాయక సిబ్బందికి కూడా మాంజా దారాలు అడ్డు రావడంతో 3 గంటల పాటు శ్రమించి తండ్రీకొడుకుల మృతదేహాలను వెలికితీశారు. కాగా.. 14 ఏళ్ల బాలుడిని పనిలో ఎలా పెట్టుకుంటారని జీహెచ్ఎంసీపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లంగర్‌హౌస్ చెరువులో తండ్రికొడుకుల మృతికి జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లే బాధ్యత వహించాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ మండిపడ్డారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
‘సీనియర్లను’ ఇబ్బంది పెట్టొద్దు!
సాక్షి, హైదరాబాద్: తమకు గుర్తింపు కార్డులివ్వడంలో అధికారులు ఆలస్యం చేస్తున్నారని, తద్వారా కొన్ని సదుపాయాలు పొందలేకపోతున్నామని సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కొందరు సీనియర్ సిటిజన్లు కమిషనర్ ఇలంబర్తికి ఫిర్యాదు చేశారు. వారి సాదకబాధకాలు విన్న కమిషనర్ సీనియర్ సిటిజన్లకు గుర్తింపు కార్డులివ్వడంలో జాప్యం చేయొద్దని, వారిని ఇబ్బంది పెట్టొద్దని సంబంధిత అధికారుకు సూచించారు. ఇవి మాత్రమే కాకుండా ప్రజల నుంచి అందే అన్ని ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచి్చన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఆయన సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరితంగా పరిష్కరించాలని సూచించారు. ఈ వారం ప్రధాన కార్యాలయానికి మొత్తం 82 విజ్ఞప్తులు రాగా, ఎప్పటిలాగే టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించినవి అత్యధికంగా 46 ఉన్నాయి. మిగతావి ఆస్తిపన్ను, ఆరోగ్యం, ఇంజినీరింగ్ (నిర్వహణ), పరిపాలన, విద్యుత్, భూసేకరణ, యూబీడీ, హౌసింగ్, ఫైనాన్స్ విభాగాలకు సంబంధించినవి ఉన్నాయి. కార్యాలయం దాకా రాలేని ఆరుగురు ఫోన్ ద్వారా తమ తమ సమస్యల గురించి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు శివకుమార్ నాయుడు, గీతా రాధిక, పంకజ, రఘు ప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, యాదగిరి రావు, సీసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జోన్లలో జరిగిన ప్రజావాణి కార్యక్రమాల్లో ఆరు జోన్లలో వెరసి 112 అర్జీలందాయి. వాటిల్లో కూకట్పల్లి జోన్లో 51, ఎల్బీనగర్లో 13, శేరిలింగంపల్లిలో 12, సికింద్రాబాద్‌లో 27, చార్మినార్‌లో 8, ఉండగా, ఖైరతాబాద్‌జోన్ కేవలం ఒక్కటి మాత్రమే అందడం విశేషం. -
Hyderabad: ప్రాణాలతో చెలగాటం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడే సంబంధిత అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఆ తర్వాత అందరూ ఆ విషయాన్ని మరిచిపోతున్నారు. భవనాలు కూలినప్పుడే అక్రమ నిర్మాణాలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడే సేఫ్టీ నిబంధనలు గుర్తుకొస్తాయి. అలాగే లిఫ్టుల్లో ప్రమాదాలు జరిగినప్పుడే వాటి నిర్వహణ గుర్తుకొస్తుంది. శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లో ఆరేళ్ల బాలుడు లిఫ్టులో ఇరుక్కుపోవడంతో లిఫ్టులు.. వాటి నిర్వహణ.. తీసుకోవాల్సిన భద్రతచర్యలు వంటివి చర్చనీయాంశంగా మారాయి. ఎవరికీ పట్టదు.. లిఫ్టులు, వాటి నిర్వహణకు సంబంధించి ఏ ప్రభుత్వ విభాగం కూడా పట్టించుకోవడం లేదు. జీహెచ్ఎంసీలో భవనాల నిర్మాణాలకు నిబంధనలున్నప్పటికీ, లిఫ్టుల ఏర్పాటుకు సంబంధించి నిబంధనల్లేవని సంబంధిత అధికారులు తెలిపారు. లిఫ్టుల స్టెబిలిటీ, నిర్వహణలపై కూడా నిబంధనల్లేవు. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సరి్టఫికెట్ ఇచ్చినట్లుగానే లిఫ్టుల ఏర్పాటుకు సంబంధించి లిఫ్ట్ ఇన్స్పెక్టర్ సరి్టఫికెట్ ఉండాలనేది ప్రతిపాదనలకే పరిమితమైంది. భవనం ఎత్తును బట్టి లిఫ్టులు ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ, లిఫ్టుల స్టెబిలిటీ, నిర్వహణలకు సంబంధించి ఎలాంటి నిబంధనల్లేవు. ఏటా వేల సంఖ్యలో భవనాల నిర్మాణం జరుగుతున్న జీహెచ్ఎంసీలో లిఫ్ట్ ఇన్స్పెక్టర్ లేకపోవడం దారుణమనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నిర్వహణలో నిర్లక్ష్యం.. ⇒ స్టెబిలిటీ లేకపోవడం.. నాసిరకం లిఫ్టులు వాడటం ప్రమాదాలకు ఒక కారణం కాగా, కనీస నిర్వహణ లేకపోవడం ప్రమాదాలకు తావిస్తోంది. ⇒ సాధారణంగా లిఫ్టు ఏర్పాటు సమయంలోనే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రైవేటు సంస్థలు సంబంధిత లిఫ్టు కంపెనీలతో ఏఎంసీ(యాన్యువల్ మెయింటనెన్స్ కాంట్రాక్ట్) కుదుర్చుకుంటాయి. నిర్ణీత వ్యవధుల్లో పరీక్షించడం, అవసరాన్నిబట్టి పరికరాలు సరఫరా చేయడం, తగిన మరమ్మతులు చేయడం వంటివి చేయాలి. ⇒ విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లో ఇవి మరింత పకడ్బందీగా ఉండాలి. ⇒లిఫ్టులో లిఫ్ట్ ఆపరేటర్ తప్పనిసరిగా ఉండాలి. ఆపరేటర్ లేకుండా లిఫ్ట్ వినియోగించరాదు. ⇒పనిచేసే ‘అలార్మ్’ బెల్ ఉండాలి.లేని పక్షంలో కనీసం ఫోన్ చేసేందుకు వీలుగా ల్యాండ్‌లైన్ ఉండాలి. ⇒అత్యవసర సమయాల్లో ఫోన్ చేసేందుకు వీలుగా సంబంధిత ఎమర్జెన్సీ నెంబర్లులిఫ్టులోకనబడేలా ఉండాలి. ⇒ గ్రిల్‌తో కూడిన లిఫ్టుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. గ్రిల్ వాటికంటే పూర్తిగా మూసుకునే డోర్వి, అందరికీ కనిపించేలా అద్దాలవి అయితే మేలు. గతంలోనూ ప్రమాదాలు.. ⇒గతంలో కుందన్‌బాగ్‌లోని ఐఏఎస్‌ల క్వార్టర్లలోని లిఫ్టు కేబుల్ తెగి ప్రమాదం జరిగిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హిమాయత్‌నగర్‌లో లిఫ్టులో ఇరుక్కొని ఒకరు మృతి చెందారు. ⇒వ్యాపార సంస్థలతోపాటు నివాస అపార్ట్మెంట్లలోనూ లిఫ్టులతో అప్రమత్తంగా ఉండాలి. నిరీ్ణత వ్యవధుల్లో సరీ్వసు చేయించడం, లిఫ్టు ఆపరేటర్ విధుల్లో ఉండేలా చూడటం అవసరం. -
జీహెచ్ఎంసీ టార్గెట్ 600 కోట్లు.. బడాబాబులు, స్టార్ హోటళ్లకు షాక్!
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలున్న బడా బాబులకు, స్టార్ హోటళ్లకు బల్దియా అధికారులు షాకిస్తున్నారు. పన్నులు కట్టకపోవడంతో భవనాలను సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మార్చి నెలాఖరు నాటికి మరో రూ.600కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ (GHMC) కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా బల్దియా రెవెన్యూ విభాగం ఇప్పటికే ఆరు లక్షల మంది యజమానులకు నోటీసులు జారీ చేస్తోంది. ట్రేడ్ లైసెన్సులు తీసుకోని వారికి, గతంలోని లైసెన్సులు పునరుద్ధరించుకోని వారికి మరో లక్షన్నర నోటీసులు జారీ చేసింది. అంతటితో అధికారులు ఆగలేదు. మొండి బకాయిలున్న ప్రైవేటు ఆస్పత్రులు, విద్యా సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సముదాయాలకు తాళం వేయాలని నిర్ణయించారు. గడిచిన వారంలో 100 భవనాలకు తాళం వేశారు. ఇదే సమయంలో అధికారులు తమ పంథా మార్చారు. ప్రస్తుతం బస్తీలు, కాలనీల్లో వినూత్న తరహాలో ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 31లోగా ఆస్తి పన్నుతో పాటు మొండి బకాయిలను వెంటనే చెల్లించాలంటూ క్షేత్ర స్థాయిలో అన్ని శాఖల సిబ్బంది చేతికి మైక్సెట్లు ఇచ్చి చాటింపు వేయిస్తున్నారు. ఈ సందర్బంగా ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదారులకు నోటీసులు ఇవ్వడంతో పాటు స్పందించని వారి ఆస్తులను సైతం జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారు. చాలా వరకు ప్రభుత్వ భవనాలే..ఆస్తిపన్ను బకాయి రూ.5లక్షలకు మించి ఉన్న భవనాలు 4వేలకుపైగా ఉన్నాయి. అత్యధికంగా జూబ్లిహిల్స్ సర్కిల్లో 700 నిర్మాణాలు, ఖైరతాబాద్‌లో 650, గోషామహల్లో 550, బేగంపేటలో 280, సరూర్‌నగర్‌లో 180, అంబర్‌పేట్‌లో 140, మెహిదీపట్నంలో 150 ఉన్నాయి. వాటి నుంచి రూ.4వేల కోట్ల పన్ను వసూలు కావాల్సి ఉందని అంచనా. అందులో చాలా వరకు ప్రభుత్వ భవనాలున్నాయి. పంజాగుట్టలోని ప్రముఖ సర్కారు ఆస్పత్రి రూ.55కోట్లు, బంజారాహిల్స్‌లో రోడ్డు నెం.12లోని ప్రభుత్వ కార్యాలయం రూ.కోట్లలో ఆస్తిపన్ను బకాయి పడ్డాయి.కొన్ని సంస్థల బకాయిలు ఇలా.. జూబ్లీహిల్స్ లాండ్ మార్క్ ప్రాజెక్ట్ బకాయి రూ.52కోట్లు. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ బకాయిలు రూ.32కోట్లు. హైదరాబాద్ ఆస్బెస్టాస్ సంస్థ బకాయిలు రూ.30కోట్లు. సోమాజీగూడ కత్రియా హోటల్ బకాయి రూ.8.62 కోట్లు. ఇండో అరబ్ లీగ్ బకాయి రూ.7.33 కోట్లు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బకాయిలు రూ.5.5 కోట్లు. -
భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న జాయింట్ కమిషనర్ భార్య
బౌద్ధనగర్: తనను వేధింపులకు గురి చేస్తూ.. మరో మహిళతో కలిసి ఉన్న జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది ఆయన భార్య. ఈ ఘటన వారాసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాచకొండ సైదులు, బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని వారాసిగూడకు చెందిన జానకీరామ్ జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు గతంలో వివాహమైంది. కొంత కాలం తర్వాత దంపతులు విడాకులు తీసుకున్నారు. 2018లో బౌద్ధనగర్‌కు చెందిన కల్యాణితో జానకీరామ్‌కు రెండో పెళ్లి జరిగింది. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత జానకీరామ్, కల్యాణి కలిసి ఆయన తల్లిదండ్రులతో నివసించసాగారు. ఈ క్రమంలోనే కల్యాణిని అత్తామామలతో పాటు తన భర్త అన్న, వదిన వేధింపులకు గురి చేసేవారు. జానకీరామ్‌కు మరో వివాహం చేసేందుకు కల్యాణిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో జానకీరామ్ నాలుగు నెలల క్రితం భార్యను ఆమె పుట్టింట్లో వదిలేసి వెళ్లాడు. అప్పటి నుంచి కల్యాణి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా భర్త లిఫ్ట్ చేసేవాడు కాదు. దీంతో భర్తపై అనుమానం కలిగిన కల్యాణి శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి వారాసిగూడలోని భర్త ఇంటికి వెళ్లి చూడగా.. అతను మరో అమ్మాయితో కలిసి ఉన్నాడు. వీరిద్దరినీ పట్టుకొని దేహశుద్ధి చేశారు. వారాసిగూడ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని జానకీరామ్‌తో పాటు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. తన భర్త మరో మహిళను పెళ్లి చేసుకుని కాపురం పెట్టినట్లు సమాచారం రావడంతో వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు బాధితురాలు కల్యాణి తెలిపారు. తన భర్తతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారని, తాను 3 నెలల గర్భిణిగా ఉన్న సమయంలో కడుపుపై భర్త తన్నడంతో గర్భస్రావం జరిగిందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ లీక్ చేసి చంపేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదులో కల్యాణి పేర్కొన్నారు. 20 మంది దాడి చేశారు: జానకీరామ్ తనతో పాటు ఇంట్లో ఉన్న తన స్నేహితురాలిపై 20 మంది దాడికి పాల్పడ్డారని జాయింట్ కమిషనర్ జానకీరామ్ వారాసిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భార్య కల్యాణి, బావమరిది బులిశెట్టి భాస్కర్ సుమారు 20 మందితో కలిసి ఇంట్లోకి వచ్చి దాడి చేశారన్నారు. ఇరువురి ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రాచకొండ సైదులు తెలిపారు. -
ముస్తాబు అయిన హైదరాబాద్ (ఫొటోలు)
-
అమ్మాయితో భార్యకు అడ్డంగా దొరికిన జీహెచ్ఎంసీ అధికారి
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డునపడేస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. సొసైటీలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు సైతం వివాహేతర సంబంధాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో పరువు తీసుకుని నవ్వుల పాలవుతున్నారు. తాజాగా జీహెచ్ఎంసీకి చెందిన ఓ అధికారి బాగోతం బట్టబయలైంది. తన కంటే 20 ఏళ్ల తక్కువ వయసున్న అమ్మాయితో సదరు అధికారి వివాహేతర సంబంధం పెట్టుకోగా అతడి భార్య వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదారు.వివరాల ప్రకారం.. జీహెచ్ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకీరామ్‌ను వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమెతో కలిసి నగరంలోని వారాసిగూడలో మకాం ఉంటున్నాడు. భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో భార్య కళ్యాణికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో జానకీరామ్ ఎక్కడికి వెళుతున్నాడని కళ్యాణి నిఘా పెట్టింది. దీంతో, వారాసిగూడలోని ఒక అపార్ట్మెంట్లో ఉన్నట్లు గుర్తించింది.దీంతో, ప్లాన్ ప్రకారం భర్తను ఫాలో చేసిన కళ్యాణి.. అపార్ట్మెంట్లోని గదిలో వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరినీ ఆమె చితకబాదారు. అనంతరం, కళ్యాణి మాట్లాడుతూ.. జానకీరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో వివాహేతర బంధం పెట్టుకున్నాడని అన్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాడని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం వెళ్లడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిద్దరిని స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో జానకీరామ్‌కు తగిన బుద్ది చెప్పాలని పోలీసులను కళ్యాణి కోరారు. -
HYD: తాజ్ బంజారా హోటల్ సీజ్.. కారణం ఇదే
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ప్రముఖ హోటల్ తాజ్ బంజారా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. పన్ను బకాయిలు చెల్లించని నేపథ్యంలో సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్ తాజ్ బంజారాను జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ఉదయం సీజ్ చేశారు. గత రెండేళ్లుగా హోటల్ యాజమాన్యం పన్నులు బకాయిలు చెల్లించకపోవడంతో సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. రూ.1.40కోట్లు పన్ను బకాయిలు ఉన్నట్టు అధికారులు చెప్పుకొచ్చారు. గడిచిన రెండు సంవత్సరాలుగా హోటల్ నిర్వాహకులు పన్ను బకాయలు చెల్లించలేదు. దీనిపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా హోటల్ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఈ క్రమంలో సీజ్ చేసినట్టు తెలిసింది. ఇక ఈ ఘటనపై తాజ్ హోటల్ యాజమాన్యం స్పందించింది. సీజ్‌చేసి వారెంట్ ఇష్యూ చేయడంతో హుటాహుటిన హోటల్ నిర్వాహకులు స్పందించారు. జీహెచ్ఎంసీకి బకాయి పడిన కోటీ 43 లక్షల రూపాయల పన్నులో సగం చెల్లించినట్టు తెలిపారు. మిగతా బకాయిలను వారంలోగా చెల్లించేందుకు ఒప్పుకున్నట్టు స్పష్టం చేశారు. అయితే తాజా బంజారానే కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లో భాగంగా డిఫాల్టర్స్ అందరికీ నోటీసులు పంపింది జీహెచ్ఎంసీ. మూడేళ్లుగా పన్ను చెల్లించనివాళ్లకు వారెంట్స్ ఇష్యూ చేశారు. అందులో భాగంగానే తాజ్ బంజారాకి కూడా నోటీసులు ఇచ్చారు. రెడ్ నోటీస్ ఇష్యూ చేయడంతో తప్పని పరిస్థితుల్లో సగం పన్ను చెల్లించింది తాజ్ బంజారా యాజమాన్యం.హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌లో బంజారాహిల్స్‌లోని తాజ్ బంజారా కూడా ఒకటి. ఈ హోటల్‌కు సెలబ్రెటీలు ఎక్కువగా వస్తుంటారు. క్రికెటర్లు ఎప్పుడు వచ్చినా ఈ హోటల్లోనే ఎక్కువగా బస చేస్తుంటారు. అలాగే దేశంలోని కీలక రాజకీయనేతలు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేస్తారు. పార్టీ సమావేశాలకు అనుకూలంగా ఉండడంతో ఎక్కువ మంది దీని వైపు మొగ్గుచూపుతారు. -
Hyderabad: శనివారాల్లో ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’
లక్డీకాపూల్ (హైదరాబాద్) : ఆస్తి పన్ను(Property Tax) సమస్యల పరిష్కారం కోసం ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి మార్చి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి(GHMC Commissioner) తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ప్రజలకు ఆస్తిపన్ను సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పన్ను సమస్యలు, పునఃసమీక్ష అభ్యర్థనలు (ఆర్పీఎస్) ఆస్తిపన్ను అంచనాల్లో సవరణలు, బిల్ కలెక్టర్ల ద్వారా/ఆరీ్టజీఎస్ ద్వారా చెల్లింపుల నమోదు, ఆన్లైన్ బకాయిలు సరిచేయడం, కోర్టు కేసుల పరిష్కారం, ఐజీఆర్ఎస్ సమస్యలు, స్వయం మూల్యాంకనం (సెల్ఫ్ అసెస్ మెంట్) తదితరాలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కార కార్యక్రమం ఈ నెల 22న, మార్చి 1, 8, 15, 22,29 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు డిప్యూటీ కమిషనర్స్ కార్యాలయాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆస్తిపన్నుకు సంబంధించిన ఏవైనా సమస్యలున్న వారు తమ సంబంధిత జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పైన పేర్కొన్న తేదీలలో నిర్వహించే ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం కార్యక్రమంలో సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని కమిషనర్ సూచించారు. -
GHMC: బరిలో బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన అధికార మార్పిడితో జీహెచ్ఎంసీ పాలక మండలిలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలి ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్–ఎంఐఎం పార్టీలు స్టాండింగ్ కమిటీకి పరస్పర అవగాహనతో పోటీ చేయడంతో ఎన్నిక జరగకుండానే కమిటీ ఏకగ్రీవమవుతూ వచ్చింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సఖ్యతగా ఉండే ఎంఐఎం..తన స్టాండ్ కనుగుణంగా ప్రస్తుతం కాంగ్రెస్‌తో జత కట్టింది. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం తమ కార్పొరేటర్లను స్టాండింగ్ కమిటీ ఎన్నిక కోసం బరిలో దింపాయి. ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుంచి సైతం ఇద్దరు స్టాండింగ్ కమిటీకి నామినేషన్లు వేయడంతో ఉపసంహరణ గడువు దాకా కొంత డ్రామా జరిగే అవకాశం ఉంది. స్టాండింగ్ కమిటీలో 15 స్థానాలున్నాయి. కార్పొరేటర్లు 15 మందిని ఎన్నుకోవాల్సి ఉంది. ఇద్దరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం..ఇద్దరి మృతితో నాలుగు స్థానాలు ఖాళీ కాగా 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరే స్టాండింగ్ కమిటీని ఎన్నుకునేందుకు ఓటర్లు. ఎక్కువ ఓట్లు పొందిన వారు స్టాండింగ్ కమిటీ సభ్యులయ్యే అవకాశం ఉంది. పొత్తు లేకుండా పారీ్టలు వేటికవి విడివిడిగా పోటీ చేస్తే పరిస్థితి వేరుగా ఉండేది. ఎక్కువ మంది కార్పొరేటర్లున్న బీఆర్ఎస్ గెలిచేది. కానీ ఎంఐఎం, కాంగ్రెస్ పొత్తుతో ఆ రెండు పార్టీల వారే ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. కార్పొరేటర్ల బలానికనుగుణంగా స్టాండింగ్ కమిటీకి పార్టీలు సభ్యులను నిలబెడుతున్నాయి. బీఆర్ఎస్–ఎంఐఎం పొత్తు ఉన్నప్పుడు బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆపార్టీ నుంచి 8 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నిలబడి, గెలిచేవారు. ప్రస్తుతం కాంగ్రెస్ కంటే ఎంఐఎం బలం ఎక్కువగా ఉండటంతో ఎంఐఎం ఎనిమిదిమందిని బరిలో దింపింది.కాంగ్రెస్ నుంచి ఏడుగురు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తమ కార్పొరేటర్లను పోటీకి దింపాలో, వద్దో నిర్ణయించకముందే ఆ పార్టీకి చెందిన ఇద్దరు నామినేషన్లు వేశారు. పారీ్టల బలాల దృష్ట్యా, అధిష్ఠానం ఆదేశిస్తే వారిద్దరూ ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. లేని పక్షంలో క్రాస్ ఓటింగ్‌పై ఆశతో బరిలో ఉండవచ్చు. అదే జరిగితే ఉత్కంఠ భరితమైన పోలింగ్ జరగనుంది. బీజేపీ సైతం స్టాండింగ్ కమిటీకి పోటీ చేయాలని భావించినప్పటికీ, పార్టీ పెద్దల సూచనతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఒకవేళ పోలింగ్ జరిగితే, పోటీలో లేని బీజేపీ సభ్యుల ఓట్లు ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి.నేడు నామినేషన్ల పరిశీలన నామినేషన్ పత్రాలను కమిషనర్ కార్యాలయంలో మంగళవారం స్క్రూటినీ చేస్తారు. పోటీకి అర్హులుగా నిలిచేవారు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈనెల 21వ తేదీ వరకు గడువుంది. అన్ని నామినేషన్లు అర్హత పొంది, ఎవరూ ఉపసంహరించుకోని పక్షంలో 25వ తేదీన పోలింగ్‌జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్టాండింగ్ కమిటీలో స్థానం ఉన్న కాంగ్రెస్ పారీ్ట..బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు స్టాండింగ్ కమిటీలో స్థానం లేకుండానే ఉంది. తిరిగి స్టాండింగ్ కమిటీలోకి వచ్చే అవకాశం ఏర్పడినట్లు పరిశీలకులు చెబుతున్నారు.నామినేషన్లు వేసింది వీరే.. గడువు ముగిసేలోగా నామినేషన్లు వేసిన వారిలో ఎంఐఎం నుంచి బాతా జబీన్, సయ్యద్ మిన్హాజుద్దీన్, అబ్దుల్ వాహబ్, మహ్మద్ సలీమ్, పరీ్వన్ సుల్తానా, సమీనాబేగం, డా. అయేషాహుమేరా, గౌసుద్దీన్ మహ్మద్లున్నారు. కాంగ్రెస్ నుంచి మహాలక్ష్మి రామన్ గౌడ్, బూరుగడ్డ పుష్ప, సీఎన్ రెడ్డి, వి.జగదీశ్వర్‌గౌడ్, బానోతు సుజాత, బొంతు శ్రీదేవి, ఎండీ బాబా ఫసియుద్దీన్లున్నారు. బీఆర్ఎస్కు చెందిన జూపల్లి సత్యనారాయణరావు, ప్రసన్నలక్ష్మి కూడా నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు పార్టీల గుర్తింపు అంటూ లేదు. -
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్ : ఫార్ములా-ఈ రేసు కేసులో దర్యాప్తును అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ముమ్మరం చేసింది. తెలంగాణ మున్సిపల్ శాఖ, ఫార్ములా-ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్ఈవో)ల మధ్య జరిగిన ఒప్పందం, అందులో చోటు చేసుకున్న ఉల్లంఘనలపై అధ్యయనం చేస్తోంది.ఈ క్రమంలో గత నెలలో ఎఫ్ఈవో సీఈఓ ఆల్బర్టోకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ లండన్ నుండి వర్చువల్‌గా ఆల్బోర్టోను ఏసీబీ విచారిస్తోంది. విచారణలో భాగంగా సీజన్ 9 చెల్లింపులు , లెటర్ ఆఫ్ ఇంటెంట్, లాంగ్ ఫార్మ్ అగ్రిమెంట్ గురించి ఏసీబీ అధికారులు ఆల్బోర్టోను ప్రశ్నిస్తున్నారు. -
Hyderabad: అవినీతి మకిలి.. అధ్వానపు పాలన
సాక్షి, హైదరాబాద్: అయిదేళ్ల కాల పరిమితి కలిగిన జీహెచ్ఎంసీ పాలక మండలికి(GHMC Governing Council) నేటితో నాలుగేళ్ల పదవీకాలం పూర్తవుతోంది. రేపట్నుంచి అయిదో (చివరి) సంవత్సరంలోకి అడుగిడనుంది. 2021 ఫిబ్రవరి 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన పాలకమండలికి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ వరకు గడువు ఉంది. ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం 150 డివిజన్లుగా ఉన్న జీహెచ్ఎంసీ(GHMC) విభజన జరిగే అవకాశాలుండటంతో ఆ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కొత్త పాలక మండలికి ఎన్నికలయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా ముందస్తుగానే పాలకమండలి ఎన్నికలు జరిగే అవకాశం దాదాపు లేదు. ఏవైనా కారణాలతో నెల, రెండు నెలల ముందుగానే ఎన్నికలు జరిగినా ఈ పాలకమండలికి మిగిలింది పది నెలల గడువే. అందుకే ఈలోగా ఇంటిని చక్కదిద్దుకునేందుకు కాబోలు.. కార్పొరేటర్లు కాలికి పని చెబుతున్నారు. తిరిగి ఓట్ల కోసం ప్రజల ముందుకు వెళ్లేందుకో, లేక పనుల టెండర్లలో వచ్చే కమీషన్ల కోసమో స్థానిక సమస్యలంటూ నిధుల కోసం కొట్లాడుతున్నారు. కార్పొరేటర్ల డివిజన్లకు నిధులివ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. మేయర్ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi) సైతం గతంలో లేని విధంగా క్షేత్రస్థాయి పర్యటనలు విస్తృతం చేశారు. హోటళ్ల తనిఖీలు వంటివి చేస్తున్నారు. కార్పొరేటర్లు సైతం తమ డివిజన్లలో పర్యటిస్తున్నారు. కోఆప్షన్ ఎన్నిక లేదు.. వార్డు కమిటీలూ లేవు పాలకమండలికి నాలుగేళ్లు పూర్తవుతూ.. అయిదో ఏట అడుగుపెడుతున్నా ఇప్పటి వరకు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగలేదు. వార్డు కమిటీలు, ఏరియా కమిటీలు కూడా ఏర్పాటు కాలేదు. ఈ ఎన్నికలేవీ జరగకుండానే నాలుగేళ్లు పూర్తి చేసిన పాలకమండలి బహుశా ఇదేనేమో. మరణించిన కార్పొరేటర్ల స్థానాల్లో.. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కార్పొరేటర్ల స్థానాల్లో వాటి భర్తీకి ఉప ఎన్నికలూ జరగలేదు. ఇలా.. రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన పనుల ఊసే లేకుండాపోయింది. స్టడీ లేని టూర్లు సభ్యులు స్టడీ టూర్ల పేరిట వివిధ నగరాలు చుట్టివచ్చినా అక్కడి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమిటో, వాటిల్లో వేటిని ఇక్కడ అమలు చేయవచ్చో నివేదిక ఇవ్వని పాలకమండలి కూడా ఇదే. ఇక పాలకమండలి సర్వసభ్య సమావేశాల్లోనూ ప్రతిసారీ గందరగోళాలే. ఏనాడూ సమావేశాలు సవ్యంగా సాగలేదు. ఇలా.. చెబుతూపోతే నెగెటివ్ అంశాలు తప్ప పాజిటివ్ అంశాలు కనిపించకపోవడం దురదృష్టకరం. కప్పదాట్లు.. పాలకమండలిలో చెప్పుకోదగిన అంశాల్లో పార్టీ మారి్పడులు ప్రముఖంగా ఉన్నాయి. పాలకమండలికి జరిగిన ఎన్నికల్లో తొలుత కేవలం రెండుస్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ బలం ఇప్పుడు 24కు చేరడం ఇందుకు దృష్టాంతం. చివరకు ఒక పారీ్ట(బీఆర్ఎస్)లో ఉండి మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన వారు సైతం మరో పార్టీ(కాంగ్రెస్)లోకి మారడం ఇందుకు నిలువెత్తు నిదర్శనం.ప్రత్యేకంగా చేసిందేమిటి? నాలుగేళ్లు పూర్తయినా.. ఈ పాలకమండలి హయాంలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంటూ ఒక్కటి కూడా లేకపోవడమే దీని ప్రత్యేకత. పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ నిషేధం, కల్తీ లేని ఆహారం.. ఇలా ఏ కార్యక్రమం చూసినా అమలులో విఫలమైంది. విజయవంతం చేయలేకపోయింది. పరమ అధ్వానపు పరిపాలన కూడా ఈ పాలకమండలి హయాంలోదే కావడం గమనార్హం. బర్త్, డెత్ సరి్టఫికెట్లు, మ్యుటేషన్లు, ఇతరత్రా ఎన్నో అంశాల్లో అవినీతి వెల్లడైంది. వెలుగునిచ్చే వీధి దీపాల్లోనూ అవినీతి చీకట్లే నిండుకున్నాయి. -
ఇక్కడ ఇలా.. అక్కడ అలా.. చెత్త ఎలా?
సాక్షి, హైదరాబాద్: విస్తరిస్తున్న నగరంతో పాటే చెత్త సమస్యలూ పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ నుంచి గతంలో రోజుకు 3,500 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడగా.. ప్రస్తుతం 7,500 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది. దీని నిర్వహణ కోసం జవహర్‌నగర్ డంప్ యార్డుకు తరలిస్తున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తతో ఎంతో కాలంగా అక్కడి పరిసర గ్రామాల ప్రజలు తల్లడిల్లుతున్నారు. చెరువుల కాలుష్యం తగ్గించేందుకు లీచెట్ ట్రీట్మెంట్ వంటి పనులు జరుగుతున్నా తమ ఆరోగ్యానికి ముప్పేనని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని చెత్త మొత్తం ఒకేచోట పోగు పడకుండా ఉండేందుకు నగరానికి నాలుగు వైపులా డంపింగ్ యార్డులు, చెత్త నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ప్రకటిస్తున్నాయి. దశాబ్దం క్రితం నుంచే ఆ దిశగా చర్యలు ప్రారంభమైనా, స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత, నిరసనలతో అవి ముందుకుసాగడం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లా పరిధిలోకొచ్చే నగర శివార్లలోని ప్యారానగర్లో ఏర్పాటు కానున్న చెత్త నిర్వహణ కేంద్రానికీ అదే పరిస్థితి ఎదురవుతోంది. పనులకు సాగనీయకుండా గత నాలుగు రోజులుగా పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. బతుకులు బలి చేస్తారా? అక్కడ అత్యాధునిక సాంకేతికతతో యూరోపియన్ దేశాల్లోని చెత్త నిర్వహణ పద్ధతుల్ని పాటిస్తామని, దాని వల్ల పరిసరాల్లో ఎలాంటి కాలుష్యం వ్యాపించదని చెబుతున్న జీహెచ్ఎంసీ అధికారుల మాటల్ని ప్రజలు విశ్వసించడం లేదు. నగరంలోని చెత్తతో తమ బతుకులు బలి చేస్తారా? అని ప్రశి్నస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏం కానుందన్నది మున్ముందు తేలనుంది. అక్కడ ఏర్పాటు కానున్న చెత్త నిర్వహణ కేంద్రం గురించి జీహెచ్ఎంసీ అధికారులేమంటున్నారంటే.. ⇒ అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీతో ఏర్పాటు కానున్న ప్లాంట్‌లో అడ్వాన్స్డ్ డ్రై అనరోబిక్ బయోమిథనేషన్ టెక్నాలజీ (డీఏబీటీ)తో తడిచెత్త నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. కంపోస్టు ఎరువు తయారవుతుంది. ⇒ఆర్డీఎఫ్(రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫూయెల్) ప్రాసిసెంగ్ తో పొడిచెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ⇒ జవహర్‌నగర్‌లో పుష్కరకాలంగా పేరుకుపోయిన చెత్తతో దుర్వాసన, కాలుష్యం వంటి సమస్యలుండగా, ప్యారానగర్ ప్లాంట్‌లో అలాంటి సమస్యలుండవు. ⇒ చెత్త అనేది అసలు నిల్వ లేకుండానే ఎప్పటికప్పుడు ప్రాసెస్ అవుతుంది. చెత్త బహిరంగంగా కనిపించదు. ⇒ డీఏబీటీతో వెలువడే బయోగ్యాస్‌ను ఇంధనంగా లేదా విద్యుత్ ఉత్పత్తికి వినియోగించవచ్చు. ఆర్డీఎఫ్ను విద్యుత్ తయారీకి ఉపయోగిస్తారు. ⇒ ఈ ప్లాంట్‌లో పనులన్నీ భూమిలోపల బంకర్లలో, మూసివేసిన షెడ్లలో జరుగుతాయి. చెత్త రవాణా సైతం ఆయిల్ ట్యాంకర్ల మాదిరిగా పూర్తిగా మూసి ఉండే వాహనాల ద్వారా జరుగుతుంది. గాలిని కూడా బయో ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేయడం వల్ల ఎలాంటి దుర్వాసనలు రావు. ⇒ డ్రై డైజెసన్ టెక్నాలజీ వల్ల లీచెట్ (విష జలాల) సమస్య ఉండదు. చెత్త నిర్వహణలో పర్యావరణపరంగా మేలైనది. అక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్ స్థానిక అవసరాలకు సరిపోతుంది. ⇒ రోజుకు 2 వేల మెట్రిక్ టన్నుల చెత్తతో 15 మెగావాట్ల విద్యుత్, 270 టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. చెత్తను మోయలేని జవహర్‌నగర్ నగరం నుంచి ప్రస్తుతం వెలువడుతున్న దాదాపు 7,500 మెట్రిక్ టన్నుల చెత్తతో పాటు శివార్లలోని మున్సిపాలిటీల చెత్త అక్కడికే వెళ్తోంది. జవహర్నగర్ఫై పడుతున్న ఈ భారాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా నలువైపులా చెత్త నిర్వహణ ఏర్పాటు కేంద్రాలకు ఎప్పటినుంచో ఆలోచనలున్నాయి. జీహెచ్ఎంసీలో ఒక వ్యక్తి నుంచి రోజుకు వెలువడుతున్న చెత్త 2019లో 500 గ్రాములు 2024లో 733 గ్రాములుజవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలుతున్న చెత్త 2014లో 3,500 మెట్రిక్ టన్నులు 2024లో 7,500 మెట్రిక్ టన్నులు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ చెత్త 9వేల మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. నగరానికి నాలుగువైపులా డంపింగ్ కేంద్రాలు, చెత్త నిర్వహణ కేంద్రాల ఏర్పాటుతో జవహర్‌నగర్‌పై భారం తగ్గుతుంది. -
పిక్కలు పీకేస్తున్నాయ్
పటాన్‌చెరులోని ఇస్నాపూర్‌లో 2024, జూన్ 28న వీధికుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు విశాల్ మృతిచెందాడు. బిహార్‌కుచెందిన బాలుడి కుటుంబం పొట్టకూటి కోసం రాష్ట్రానికివచ్చిoది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన బాలుడిపై కుక్కలు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.హైదరాబాద్ మణికొండలో 2024, జూన్ 22నఓ మహిళపై ఏకంగా 15 వీధికుక్కలు దాడి చేశాయి. సుమారు అరగంటసేపు తీవ్రంగా దాడి చేశాయి.చివరకు ఎలాగోలా బాధితురాలు వాటి బారి నుంచిప్రాణాలతో బయటపడింది.సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఏటా కుక్కకాట్లు పెరిగిపోతున్నాయి. రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కుక్కల దాడుల ఘటనలు వందలు, వేలల్లో చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కుక్క కాట్లు తగ్గడం లేదు.. ప్రభుత్వ గణాంకాలే దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. 2024లో 1,21,997 కేసులు నమోదవగా జీహెచ్ఎంసీ, చుట్టుపక్క జిల్లాల్లోనే 42,067 కేసులు నమోదయ్యాయి. ఆయా ఘటనల్లో 13 మంది మరణించారు. 2023 గణాంకాలతో పోలిస్తే ఇది చాలా అధికం. స్పందించిన హైకోర్టు వీధికుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు మృతిచెందిన ఉదంతంపై వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. గతంలో ఇదేఅంశంపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లకు దీన్ని జత చేసింది. ఈ పిటిషన్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిజస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కౌంటర్ దాఖలు చేసింది. దీనిపైరిప్లై కౌంటర్ వేయడానికి సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరడంతో విచారణ 25కు వాయిదా వేసింది.జీహెచ్ఎంసీ చేస్తున్న కసరత్తు ఇలా..» మున్సిపల్ కార్పొరేషన్ బయట కుక్కల కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటు కుక్కకాట్లు, ఇతరఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 040–2111111 అందుబాటులోకి.. » 898 కుక్కల సంరక్షణ కేంద్రాలతోపాటు 92 బోన్లు, కుక్కల తరలింపునకు 49 వ్యాన్ల ఏర్పాటు » యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ)కి సంబంధించిన6 ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు. స్టెరిలైజేషన్,వ్యాక్సినేషన్‌కు చర్యలు » 18 మంది వెటర్నరీలు,ఆరుగురు షెల్టర్ మేనేజర్లు, 22 పారా వెటర్నరీలు, 362 మంది డ్రైవర్లు, అవుట్ సోర్సింగ్ వర్కర్ల నియామకంకుట్లు వేస్తే వైరస్ వ్యాప్తి... కుక్క కరిచిన వెంటనే ట్యాప్ వాటర్, సబ్బుతో గాయాన్ని కడగాలి. చర్మంపై గాయాలకు టీటీ, యాంటీ రేబిస్ నాలుగు డోసులు సరిపోతుంది. కుక్క కరిచిన 1వ రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు టీకా వేయించుకోవాలి. కండ లోపలికి గాయమైనా కుట్లు వేయకూడదు. వేస్తే శరీరంలో వైరస్ మరింత వ్యాప్తి చెందుతుంది. ఒకవేళ చేతులు, ముఖంపై తీవ్ర గాయాలైతే ముందుగా అక్కడ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ వేయాలి. 2 గంటలు ఆగాక కుట్లు వేయవచ్చు. ఎంత ఆలస్యమైనా యాంటీ రేబిస్ టీకా తీసుకోవాలి. – డాక్టర్ జి.రాజమనోహర్‌రెడ్డి, ల్యాప్రోస్కోపిక్ సర్జన్మెదడు అదుపులో ఉండదు... రేబిస్ సోకిన కుక్కలమెదడు అదుపులోఉండదు. ఎదురుగా ఏ జీవివచ్చినా కరుస్తాయి. కరిచినప్పుడు లాలాజలంలోఉండే వైరస్ శరీరంలోకి వెళ్తుంది. రేబిస్ సోకినజంతువు, వ్యక్తి కూడా కుక్కల మాదిరేప్రవర్తిస్తారు.– చిట్యాల బాబు,వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, కనగల్సంవత్సరాల వారీగా రాష్ట్రంలో కుక్క కాటు కేసులు, అనుమానాస్పద మరణాలు.. 2022 2023 2024 మొత్తం కుక్క కాటు కేసులు 92,924 1,19,014 1,21,997 3,33,935 అనుమానాస్పద మరణాలు 8 15 13 36 -
జీహెచ్ఎంసీకి ఎంపీ వార్నింగ్..కారణమిదే..
సాక్షి,సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లాను మరో జవహర్‌నగర్‌గా మార్చాలని చూస్తున్నారని,శుద్ధి పేరుతో నల్లవల్లి ఫారెస్ట్‌లో రోజుకు వంద లారీల చెత్త పోసేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. ఈ మేరకు రఘునందన్‌రావు బుధవారం(ఫిబ్రవరి5) మీడియాతో మాట్లాడారు.‘చెత్త పోసే వ్యవహారాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న ప్రజా ప్రతినిధులను అడ్డుకుంటున్నారు. పటాన్ చెరువు ప్రాంతం ఇప్పటికే కంపెనీలతో కలుషితం అయింది.2015లో అప్పటి ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇచ్చిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. నలవల్లిలో చెత్త శుద్ధి పనులు ఆపకపోతే అధికారులకు భౌతిక దాడులు తప్పవు.పట్నం చెత్తను పల్లెలో వేస్తామంటే ఊరుకోం. అరెస్ట్ చేసిన నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలి. పచ్చని అడవుల్లో చెత్త వేసి భూములు కలుషితం చేస్తామంటే ఊరుకునేది లేదు. దీన్ని ఉపసంహరించుకోకుంటే ప్రత్యక్ష నిరసనకు దిగుతాం.పోలీసులతో ప్రజలను భయపెట్టి పనులు చేపట్టడం సరికాదు.చెత్తకు హైదరాబాద్,రంగారెడ్డి అయిపోయింది ఇప్పుడు సంగారెడ్డి మీద పడ్డారా’అని రఘునందన్‌రావు నిలదీశారు. -
కుంగ్ ఫూ శిక్షణ..ఆత్మరక్షణ కుర్రకారులో భారీ క్రేజ్
ఆత్మ రక్షణ క్రీడలైన కుంగ్ ఫూ, మార్షల్ ఆర్ట్స్ పై నగర వాసులకు ఆసక్తి పెరుగుతోంది. నగరంలోని జీహెచ్ఎంసీ గ్రౌండ్స్ వేదికగా అభ్యాసన చేస్తున్నారు పలువురు క్రీడాకారులు. దీంతో పాటు పతకాలు సాధిస్తూ కొందరు.. స్ఫూర్తిగా మరికొందరు ఈ మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు నగరవాసులు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలువురు క్రీడాకారులు ప్రతిభను కనబరుస్తూ పతకాలు సాధిస్తున్నారు. – సనత్‌నగర్ నగరంలో ఇటీవలికాలంలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణకు ఆదరణ పెరుగుతోంది. తల్లిదండ్రుల్లో ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పట్ల పెరుగుతున్న అవగాహనే ఇందుకు కారణం. పైగా చిన్నతనం నుంచి ఇటువంటి శిక్షణలో పాల్గొనడంతో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్న మాట. దీంతో చిన్నారులు కూడా ఈ తరహా శిక్షణ తీసుకునేందుకు కఠోర దీక్షతో అభ్యాసన చేస్తున్నారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ గ్రౌండ్స్‌లో నిర్వహించే శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకుంటూ రాటుదేలుతున్నారు. ఆ‘శక్తి’ని గమనించి.. కోచ్‌లు సైతం పిల్లల్లోని ఆ‘శక్తి’ని గమనించి కుంగ్‌ఫూలో ఉన్నత శిక్షణను అందిస్తూ వివిధ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. బేగంపేట ఓల్డ్ పాటిగడ్డలోని జీహెచ్ఎంసీ గ్రౌండ్, బ్రాహ్మణవాడీ, మాసబ్ ట్యాంక్, విజయనగర్ కాలనీల్లో కుంగ్ ఫూ – మార్షల్ ఆర్ట్స్‌లో గ్రాండ్ మాస్టర్ కంటేశ్వర్, డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ కళ్యాణ్, జీహెచ్ఎంసీ కోచ్ చందు నిరంతరం శిక్షణను అందిస్తున్నారు. 2010 జనవరి 1 నుంచి వీరు శిక్షణ కొనసాగిస్తుండగా ఇప్పటి వరకూ వందలాది మంది కుంగ్ ఫూలో శిక్షణ పొందారు. చదవండి: లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అమ్మేసిన సోనాక్షి సిన్హా, లాభం భారీగానే! పలు పోటీల్లో... నగరంలో ఎల్బీ స్టేడియం, కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియం, సరూర్‌నగర్, బాలయోగి స్టేడియం తదితర ప్రాంతాల్లో ఎక్కడ పోటీలు జరిగినా ఇక్కడి చిన్నారులు పాల్గొంటూ ప్రతిభను కనబరుస్తున్నారు. ఒక్క నగరానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని వరంగల్, సిర్పూర్ కాగజ్ నగర్, బెల్లంపల్లి, మందమర్రి, ఖాజీపేటతో పాటు ఒడిస్సా, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలను సాధించారు. నాలుగేళ్ల చిన్నారుల నుంచి.. మానసిక, శారీరక దృఢత్వం, ఏకాగ్రత కోసం నాలుగేళ్ల చిన్నారి నుంచి 23 ఏళ్ల యువకుల వరకూ ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. శిక్షణ తీసుకున్న వారిలో చాలామంది వెళ్లిపోగా, ప్రస్తుతం ఆయా కేంద్రాల వేదికగా 70 మంది వరకూ శిక్షణ పొందుతున్నారు. చిన్నతనం నుంచే కుంగ్ ఫూలో శిక్షణ పొందడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని మాస్టర్లు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి : లూపస్ వ్యాధి గురించి తెలుసా? చికిత్స లేకపోతే ఎలా?!కుంగ్ ఫూతో మేలు.. కుంగ్ ఫూ, మార్షల్ ఆర్ట్స్ ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. శారీరక, మానసిక దృఢత్వం పెరిగి, ఆత్మరక్షణతో పాటు ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. మా చిన్నారులు ప్రతిభ కనబరుస్తూ.. పతకాలు సాధించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. – కంటేశ్వర్, కళ్యాణ్, చందు, కంగ్ ఫూ మాస్టర్లు మాస్టర్ల ప్రోత్సాహమే.. కుంగ్ ఫూలో నేను బ్లాక్ బెల్ట్ సాధించాను. మాస్టర్లు, కోచ్‌ల ప్రోత్సాహంతో ఇప్పటి వరకూ ఎన్నో పోటీల్లో పాల్గొన్నాను. మొత్తం 30 బంగారు, 25 వెండి, 15 కాంస్య పతకాలను సాధించానంటే.. అది వారి శిక్షణ ఫలితమే. – వాసు, కుంగ్ ఫూ క్రీడాకారుడు -
బిచ్చగాళ్ల వేషంలో బీజేపీ కార్పొరేటర్లు
-
‘అక్రమ అరెస్టు’లపై కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్‌ను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్ లను అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారాయన. ఇవాళ్టి సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు పడగా.. ఆపై ఆందోళనకు దిగిన వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.‘‘కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా?. గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ నిధులను కనీసం కూడా ఖర్చు చేయకుండా.. మరోసారి అవే కాగితాల పైన అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజా ప్రతినిధుల గొంతు నొక్కుతారా?. .. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జీహెచ్ఎంసీ అసమర్ధ తీరును ప్రశ్నిస్తే కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదు. హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలి. అప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటాం. అరెస్టు చేసిన కార్పొరేటర్లను, పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలి. ఇచ్చిన హామీలను అమలను చేయకుండా అరెస్టుల పేరుతో ప్రజాప్రతినిధులను అణగదొక్కాలని చూస్తే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని అన్నారాయన. -
GHMC కౌన్సిల్ మీటింగ్ హిట్.. బీజేపీ కార్పొరేటర్ల వినూత్న నిరసన
-
BRS కార్పొరేటర్లు సస్పెండ్.. ఆపై అరెస్ట్.. జీహెచ్ఎంసీ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాల నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లను మేయర్ విజయలక్ష్మి సస్పెండ్ చేశారు. సమావేశానికి అడ్డుపడడంతో పాటు తనపై పేపర్లు విసిరడంతో జీహెచ్ఎంసీ సెక్షన్ 89/1 ప్రకారం ఆమె ఈ చర్యకు ఉపక్రమించారు. ఆపై రంగప్రవేశం చేసిన మార్షల్స్.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను బయటకు తీసుకెళ్లారు. అయితే బీహెచ్ఎంసీ బయటే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టగా.. పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.అంతకు ముందు.. ప్రశ్నోత్తరాలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. అప్పటికే బయటకు తీసుకెళ్లిన తమవాళ్లను లోపలికి తీసుకురావాలంటూ డిమాండ్ చేశారు. అయితే.. బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎవరో తనకు తెలియదని, ఆ పార్టీ సభ్యులు తనపై పేపర్లు విసిరారని మేయర్ విజయలక్ష్మి ఆరోపణలకు దిగారు. దీంతో.. మేయర్‌కు క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్కు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో మేయర్ పోడియం వద్ద చేరుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు పరస్పరం దూషించుకున్నారు. దీంతో.. సమావేశాన్ని మేయర్ మరోసారి వాయిదా వేశారు. అంతకుముందు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో రసాభాస చోటు చేసుకోవడంతో కాసేపు సమావేశాన్ని మేయర్ వాయిదా వేశారు. ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ ఫ్లకార్డులతో నిరసనకు దిగగా.. బడ్జెట్ ఆమోదం విషయంలో మొండిపట్టుతో ఉన్న కాంగ్రెస్ సభ్యులు వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ సభ్యుల్లో కొందరిని మార్షల్స్ సాయంతో మేయర్ బయటకు పంపించేశారు. ఆపై విపక్షాల ఆందోళన నడుమ గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా పడింది.ఎన్నికల హామీల మాటేంటి?గురువారం ఉదయం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే.. ముందుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు మేయర్ ప్రకటించారు. అయితే.. ప్రజా సమస్యలపై ముందు చర్చించాలని బీఆర్ఎస్, బీజేపీలు పట్టుబట్టాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు గురించి నిలదీశాయి. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. ఫ్లకార్డులు పట్టుకుని బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. మేయర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో సభను వాయిదా వేసిన మేయర్.. ఆ వెంటనే బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఇది మరింత అగ్గి రాజేసింది.ఏకపక్షంగా బడ్జెట్‌ను మేయర్ ఆమోదించడంపై నిరసనకు దిగిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల చేతుల్లోని ఫ్లకార్డులు లాక్కొని చించేశారు కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్. దీంతో.. కార్పొరేటర్లు ఒకరినొకరు తోసేసుకున్నారు. మేయర్ ఎంత విజ్ఞప్తి చేసినా సభ్యులు తగ్గలేదు. మేయర్‌కు వ్యతిరేకంగా కౌన్సిల్లో విపక్షాలు ఆందోళనకు దిగారు. దీంతో సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారామె. ఆపై కౌన్సిల్ హాల్లోకి మార్షల్స్ ప్రవేశించి.. బీఆర్ఎస్ కార్పొరేటర్లలో కొందరిని బయటకు తీసుకెళ్లారు.అంతకుముందు.. కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపించింది. సర్వసభ్య సమావేశం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులు భావించారు. ఈ క్రమంలోనే ఆఫీస్ బయట భారీగా పోలీసులు, మీటింగ్ హాల్ వద్ద మార్షల్స్‌ను మోహరించారు. ‘బిచ్చగాళ్లు’గా బీజేపీ కార్పొరేటర్లుబీజేపీ కార్పొరేటర్ల(BJP Corporaters) వినూత్న నిరసనకు దిగారు. బిచ్చగాళ్ల వేషధారణ తో జీహెచ్ఎంసీ(GHMC) కౌన్సిల్ మీటింగ్‌కి వచ్చారు. ట్యాక్సులు కడుతున్నా తమ డివిజన్లకు నిధులు కేటాయించడం లేదని ఆరోపిస్తున్నారు వాళ్లు. ‘‘మా డివిజన్‌కి నిధులు ఇవ్వండి సారూ..’’ అంటూ అడుక్కుంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఇక.. కౌన్సిల్ లో గందరగోళం నెలకొంటే కారకులైన ఆ వ్యక్తులను బయటకు పంపుతామని అధికారులు చెబుతున్నారు.సర్వసభ్య సమావేశంలో రూ.8,440 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్‌పై చర్చించనున్నారు. మరోవైపు కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగగ్రెస్ చర్చలు జరుపుతోంది. ఈ ఉదయం మంత్రి పొన్నం నివాసంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు చర్చలు జరుపుతున్నారు. ఇక.. ఫిబ్రవరి 10 తర్వాత మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. -
చెరువుల కబ్జాపై కన్నెర్ర!
సాక్షి, హైదరాబాద్: ఆక్రమణదారుల చెర పడకుండా చెరువులను కాపాడేందుకు కంకణం కట్టుకున్న హైడ్రా (Hydraa) వాటి పరిరక్షణే లక్ష్యంగా దృష్టి సారిస్తోంది. ఇటీవల హైడ్రా బృందం శివారుల్లో పలు ప్రాంతాల్లో పర్యటించి చెరువుల పరిస్థితితోపాటు ప్రభుత్వ భూముల కబ్జాల సంగతి తేల్చేందుకు పర్యవేక్షణలు చేపట్టింది. ఈ సందర్భంగా స్థానికులు, బస్తీవాసులు, ప్రజలు తమ చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయని, భవనాలు, బహుళ అంతస్తులు వెలుస్తున్నాయని వినతులు సమర్పించారు. హైడ్రా కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి (Prajavani) కార్యక్రమంలో కూడా చాలామంది చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రాత పూర్వక ఫిర్యాదులను అందజేశారు. ఈ మేరకు హైడ్రా రాజధానికి సమీపంలోని చాలా చెరువులు ఆక్రమణకు గురైనట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.ఆక్రమణదారులు మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 200 చెరువులను, చెరువు శిఖం భూములను, బఫర్జోన్లలో పెద్ద ఎత్తున వెంచర్లు వేసి, రూ.వందల కోట్లు ఆర్జించారు. అసలు విషయం తెలియక స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకొన్న సామాన్య, మధ్యతరగతి (Middle Class) ప్రజలు మాత్రం ఆర్థికంగా నష్టపోతున్నారు. వర్షాకాలంలో ఈ కాలనీలు, అపార్ట్మెంట్లు జలాశయాలుగా మారుతున్నాయి. హబ్సిగూడ, రామంతాపూర్ చెరువును ఆనుకొని ఏర్పడిన మూడు కాలనీలు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మునకేస్తున్నాయి. కూకట్పల్లి, (Kukatpally) కుత్బుల్లాపూర్, ప్రగతినగర్, నిజాంపేట్, గాజుల రామారం, సరూర్‌నగర్, మేడ్చల్, దమ్మాయిగూడ, వెంకటాపూర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, టోలిచౌకి, గుండ్లపోచంపల్లి, జల్పల్లి, బడంగ్పేట్, నాచారం, ఉప్పల్, చెంగిచర్ల, మల్కాజిగిరి, ఘట్కేసర్, పోచారం తదితర ప్రాంతాల్లో చెరువులు అదృశ్యమై కాలనీలు పుట్టుకొచ్చాయి. ఆక్రమణలో.. మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ‘రా’చెరువు, చింతల చెరువులోని బఫర్ జోన్లను దర్జాగా కబ్జా చేసి, బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. చెంగిచర్ల బస్సు డిపో సమీపంలో ఉన్న చెరువు కట్టను ధ్వంసం చేసి.. బహుళ అంతస్తుల భవనాలను నిర్మించటం వల్ల సమీపంలోని కాలనీలు జలమ యం కాగా, రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. పోచారం పురపాలక సంఘం పరిధిలోని వెంకటాపూర్ నాడెం చెరువు ఆక్రమణకు గురికావటంతో బహుళ అంతస్తులు వెలిశాయి. దమ్మాయిగూడ, నాగారం, (Nagaram) బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్ పురపాలక సంఘాల పరిధిలోని చెరువు భూముల్లో కూడా అక్రమంగా భవనాలు వెలిశాయి. రెవెన్యూ, నీటి పారుదల, పురపాలక శాఖల మధ్య సమన్వయం లేకపోవటం వల్లే ఈ కబ్జాల పర్వం మూడు పూవ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, కూకట్పల్లి, ఉప్పల్ సర్కిళ్లలో వరదలతో కాలనీలన్నీ జలమయంగా మారినప్పుడల్లా.. చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ పరిధితో ఉన్న పలు అక్రమ కట్టడాలను మొక్కబడిగా కూల్చివేస్తున్నారు. వీరి అలసత్వాన్ని అవకాశంగా తీసుకుంటున్న కబ్జారులు కోర్టు కెళ్లుతుండటంతో వాటి జోలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది.అంతంతే.. శివారుల్లో చెరువులు, కుంటల ఆక్రమణలు ,ప్రభుత్వ భూముల కబ్జాలపై ఫిర్యాదులు చేసినప్పుడు , కథనాలు వచ్చినపుడు లేదా ఉన్నతస్థాయి ఒత్తిళ్లు వచ్చినప్పుడు మాత్రమే ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగం కదలి తూతూ మాత్రంగా కూల్చివేతలకు శ్రీకారం చుట్టి .. రాజకీయ పెద్దల జోక్యంతో చేతులు దులుపేసుకుంటున్నారు. కొన్ని చోట్ల కూల్చివేతలకు చేపట్టినా కొంత కాలం తర్వాత తిరిగి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. శాఖల మధ్య సమన్వయ లోపం కబ్జాదారులకు అనువుగా మారుతోంది. హైడ్రా ఏర్పడిన తర్వాత కబ్జాదారులు, భూఅక్రమణ దారుల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు తమ బండారం బయట పడి అక్రమ కట్టడాలు నేలమట్టమవుతాయోనని బిక్కుబిక్కుమంటున్నారు. చదవండి: చెట్టు చెట్టుకో కథ.. తెలంగాణలోని 9 చారిత్రక వృక్షాలివీ.. -
మీరు కెమెరా నిఘాలో ఉన్నారు!
సాక్షి, సిటీబ్యూరో: కమిషనర్‌ను కలిసేందుకు ఇప్పటికే నిబంధనలు అమలు చేస్తున్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీకి వచ్చే వారు, పోయే వారు స్క్రీన్లపైనా కనబడేలా కొత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం.. పరిసరాల్లో దాదాపు 40 వరకు సీసీటీవీ కెమెరాలున్నాయి. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి వస్తున్నారో దృశ్యాలు వాటిల్లో నిక్షిప్తమవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న వాటిల్లో నమోదయ్యే దృశ్యాలు స్క్రీన్లపై అందరికీ కనిపించేలా కూడా మేయర్ ఎంట్రెన్స్, కమిషనర్ ఎంట్రెన్స్ వద్ద ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న స్క్రీన్‌పై నగరంలోని ఆయా ప్రాంతాల్లోని దృశ్యాల్ని కూడా వీక్షించే ఏర్పాట్లున్నాయి. వరదలు, గణే శ్ నిమజ్జనం వంటి సందర్బాల్లో మేయర్, అధికారులు నగర పరిస్థితుల్ని పరిశీలించేందుకు సదరు ఏర్పాట్లు చేయడం తెలిసిందే. -
కోర్టులు ఆదేశిస్తే తప్ప పని చేయరా?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులు ఆదేశిస్తే తప్ప అధికారులు పని చేయడం లేదని, మీ విధులు కూడా న్యాయస్థానాలే నిర్వహించాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేసింది. అధికారుల వద్దకు వచ్చే ప్రజల ఫిర్యాదులను పరిష్కరించకపోవడంతో వారు విధిలేక కోర్టులను ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యానించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించడంలోనూ అదే నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడింది. ఈ ఒక్క కోర్టు(15వ కోర్టు)లోనే ధిక్కరణ కేసులు 110 ఉన్నాయని చెప్పింది. కోర్టుల ఆదేశాలు, రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు చదువుతూ.. ఆ మేరకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచించింది. ఇతర ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్‌లు పెడుతూ వారికి తగిన సూచనలు అందించాలని కమిషనర్‌ను ఆదేశించింది. హైదరాబాద్ టోలిచౌకిలోని కాశీష్ దుకాణం ముందు అక్రమ నిర్మాణం చేపడుతున్నారంటూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా తమ ముందు హాజరైన జీహెచ్ఎంసీ కమిషనర్‌ను పలు ప్రశ్నలు అడగడంతోపాటు అక్రమ నిర్మాణాలపై అనుసరించాల్సిన విధానంపై సూచనలు చేశారు. ఆస్తి పన్ను వసూలుకే పరిమితమా? ‘కేవలం ఆస్తి పన్ను వసూలుకే జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారనే భావన ప్రజల్లో రానివ్వొద్దు. రోజురోజుకు మీపై వారిలో విశ్వాసం లేకుండాపోతోంది. కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వస్తోంది. చాలాచోట్ల స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి ఆ తర్వాత విధానాన్ని పాటించకుండా నిద్రపోతున్నారు. సీజ్ చేసినా చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. కూల్చివేత అంటూ రెండు రంధ్రాలు చేస్తే సరిపోతుందా? దానికి ఓ నిర్దిష్ట ప్రక్రియను అనుసరించకుంటే ఎలా? మీరు పెట్టిన రంధ్రాలను పూడ్చివేసి మళ్లీ నివాసం ఉంటున్నారు. అలా అని బుల్డోజర్ సిద్ధాంతాన్ని సమర్థించం. కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా అర్ధరాత్రి పూటనో లేదా వేకువజామున నాలుగు గంటలకో నిర్మాణం చేస్తున్నారు. నేను నివాసం ఉంటున్న కుందన్‌బాగ్ ప్రాంతంలో కూడా నిద్ర లేకుండా చేస్తున్నారు. న్యాయమూర్తి పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుడి పరిస్థితి ఏంటి? విద్యా సంవత్సరం కొనసాగుతున్నందున ఒక్క విద్యా సంస్థలకు తప్ప ఇతర అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం అధికారులు చర్యలు చేపట్టవచ్చు’అని పేర్కొన్నారు.సివిల్ కోర్టుల నోటీసులపై స్పందనేది?‘సివిల్ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లలో నోటీసులు జారీ చేసినప్పుడు స్పందించకుంటే ఎలా? కొన్నిసార్లు స్టాండింగ్ కౌన్సిల్స్ కూడా హాజరుకావడం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో సివిల్ కోర్టు ఎక్స్‌పార్టీ అని పేర్కొంటూ, ఇతర పార్టీ లకు అనుకూలంగా ఆదేశాలు ఇవ్వాల్సివస్తోంది. మీ నిర్లక్ష్యం కారణంగా అక్రమ నిర్మాణదారులు లబ్దిపొందుతున్నారు. కొందరు అధికారులు, కౌన్సిల్స్ చట్టం, సెక్షన్లు తెలియకుండా కౌంటర్లు వేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారుల నుంచి స్పందన లేక కోర్టులకు వస్తున్న కేసులు 70 నుంచి 80 శాతమున్నాయి. మీరే అన్ని నిర్ణయాలు తీసుకోలేరు. ఆ మేరకు చట్టంలో మార్పులు చేసేలా ప్రిన్సిపల్ సెక్రెటరీని కోరండి. సిటీ ప్లానర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, డిప్యూటీ కమిషనర్లు.. అంతా కూర్చొని మాట్లాడండి. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ఏ చర్యలు తీసుకోవాలో ప్రణాళిక రూపొందించుకోండి. అలాగే వివాదాస్పదమైన టోలీచౌకి నిర్మాణంపై జనవరి 22లోగా నివేదిక ఇవ్వండి’అని కమిషనర్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, రాజీ కుదిరిందని పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్ కోరగా, న్యాయమూర్తి నిరాకరించారు. అక్రమ నిర్మాణంపై రాజీనా అని ప్రశ్నిస్తూ.. విచారణ వాయిదా వేశారు. -
జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 45లో బెంగాల్ టైగర్ చూసారా..? (ఫొటోలు)
-
ఆ ఫుడ్.. సేఫ్టీనా?
‘హైదరాబాద్‌లోనే పేరున్న ఓ హోటల్ నుంచి తెచ్చిన చికెన్ బిర్యానీ పార్శిల్లో బొద్దింక.. మరో హోటల్లో బిర్యానీలో కనిపించిన జెర్రీ... ప్రసిద్ధి చెందిన ఓ హోటల్ కిచెన్‌లోని ఫ్రిజ్‌లో పాడైపోయిన చికెన్..సేంద్రియ పంటల నుంచి తయారు చేసే స్వీట్ల దుకాణంలో అపరిశుభ్ర వాతావరణం’... గత కొంతకాలంగా హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లోని హోటళ్లలో ఆహార ప్రియులకు వినిపిస్తున్న చేదు వార్తలు ఇవి.సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటవుతున్న హోటళ్లు, ఇతర ఫుడ్ సెంటర్లలో ఆహార తనిఖీలకు అవసరమైన సిబ్బంది లేకపోవడం, ఆహార పరీక్షలు జరిపే సదుపాయాలు మెరుగుపడకపోవడం వంటి కారణాలతో కొన్నేళ్లుగా ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు ఏమాత్రం శ్రద్ధ చూపలేదు.జీహెచ్ఎంసీతోపాటు అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు హోటళ్లకు ట్రేడ్ లైసెన్స్‌లు ఇవ్వడంపై చూపిన శ్రద్ధ ఆహార భద్రతపై పెట్టలేదు. రోడ్ల పక్కన గప్‌చుప్, మిర్చిబజ్జీలు, బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు ఇతర ఆహారం అందించే స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లు హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాలు, నగరాల్లో విచ్చలవిడిగా వెలిశాయి. మధ్యాహ్నం, రాత్రి భోజనాలు కూడా రోడ్ల పక్కనే అందించే స్ట్రీట్ ఫుడ్ పాయింట్లు అయితే కోకొల్లలు. వీధుల్లోని ఫుడ్ సెంటర్లతోపాటు పేరున్న హోటళ్లలో సైతం నాణ్యత ప్రమాణాలతో ఆహారం అందించడం లేదని ఇటీవల తనిఖీలతో తేటతెల్లమైంది. ‘ఫుడ్ సేఫ్టీ ఆన్‌వీల్స్’ద్వారా రాష్ట్రవ్యాప్త తనిఖీలు ఆహార భద్రతపై వచ్చిన వందలాది ఫిర్యాదుల నేపథ్యంలో సీఎం రేవంత్, మంత్రి దామోదర రాజనర్సింహ ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్వీ.కర్ణన్‌ను ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌గా నియమించి ఆహార భద్రతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకొనే బాధ్యతను ఆయనకు అప్పగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆహార తనిఖీ కోసం నాచారంలో ఒకే ల్యాబ్ ఉంది. అయితే కొత్తగా మూడింటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాచారం ల్యాబ్‌ను ఆధునీకికరించడంతోపాటు వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల కొత్తగా 24 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులకు వివిధ జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఐదు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటికి తోడు మరో పదింటిని రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నారు. ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’పేరిట ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏ) ప్రత్యేకంగా ఈ మొబైల్ యూనిట్లను అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వాహనాల్లో ఫుడ్ లే»ొరేటరీలను ఏర్పాటు చేసి, నగరం, పట్టణాల్లో రోజుకో ఏరియాలో మొబైల్ పరీక్షలు నిర్వహిస్తోంది. తద్వారా సంవత్సరానికి కనీసం 24 వేల ఆహార నమూనాలు పరీక్షించేలా లే»ొరేటరీలను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. దీనికోసం 10 మంది ల్యాబ్ టెక్నీíÙయన్లు, ఇతర సిబ్బందిని నియమించింది. జీహెచ్ఎంసీతోపాటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండలో ఈ పది మంది ఇప్పటికే రంగంలోకి దిగారు. స్ట్రీట్ ఫుడ్స్, గప్‌చుప్ బండ్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల వద్ద ఎఫ్ఎస్ఎస్ఏ నిబంధనలకు అనుగుణంగా ఆహారం ఉందో లేదో పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
సార్‌ను కలవాలంటే సవాలే!
సాక్షి, హైదరాబాద్: అది జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం. కమిషనర్‌ను కలిసేందుకు వెళ్లాలనుకుంటున్నవారికి కార్యాలయ ద్వారం ఎదుటే ఉన్న పోలీసులు అడ్డుకుంటారు. మీకు ఏం పని? అని అడుగుతారు. కమిషనర్ సార్‌ను కలవాలి. సర్కిల్, జోన్లో పరిష్కారం కానందున ఇక్కడికి వచ్చాం అంటే.. మీ సమస్య ఏమిటో అక్కడ చెప్పండి.. అంటూ దగ్గర్లోనే ఉన్న కంప్యూటర్ ఆపరేటర్‌ను చూపుతారు. అక్కడ తమ సమస్య చెప్పడానికి క్యూకట్టి చెబితే, నమోదు చేసుకొని ఇక వెళ్లమన్నట్లు సూచిస్తారు. సార్ అనుమతిస్తే కార్యాలయ సిబ్బంది మీకు ఫోన్ చేస్తారు. అప్పుడు వచ్చి కలవండి అని చెప్పి పంపిస్తారు. .. ఇదీ రెగ్యులర్ కమిషనర్‌గా ప్రభుత్వం బాధ్యతలప్పగించాక, ఝార్ఖండ్ ఎన్నికల విధుల నుంచి తిరిగి వచ్చాక జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలవాలంటే సందర్శకులకు ఎదురవుతున్న అనుభవం. ఝార్ఖండ్ నుంచే వర్చువల్‌గా ఆదేశాలు జారీ చేస్తూ చురుగ్గా పనులు చేసిన కమిషనర్ శైలిని చూసిన నగర ప్రజలు అప్పుడు అహో అనుకున్నారు. ఇప్పుడు సార్‌ను కలవాలనుకుంటున్న ఫిర్యాదుదారులు అయ్యో ఇదేంటి? అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎస్పీఎఫ్తో భద్రత.. బహుశా జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కమిషనర్ పేషీలో విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఎస్ఐ, మహిళా పోలీసులు కూడా వీరిలో ఉన్నారు. కమిషనర్‌ను కలిసేందుకు వస్తున్నవారిలో కొందరు అక్కడున్న పోలీసులను చూసి వెనకడుగు వేస్తున్నారు. వెళ్లేందుకు ముందుకొచ్చేవారిని ఏం పని కోసం వచ్చారో తెలుసుకొని కమిషనర్ పేషీలోని అధికారుల వద్దకు పంపిస్తున్నారు. వారు విషయాన్ని బట్టి అపాయింట్మెంట్ కోసం వివరాల నమోదుకు కంప్యూటర్ ఆపరేటర్ వద్దకు పంపిస్తున్నారు. అపాయింట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే విషయాన్ని బట్టి ఒక రోజు నుంచి వారం వరకు పట్టవచ్చు. లేదా అసలు రాకపోవచ్చని చెబుతున్నారని కమిషనర్‌ను కలిసేందుకు వచ్చిన వారిలో శ్రీనివాస్ అనే అతను చెప్పాడు. తాను అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదు చేసేందుకు ఎల్బీనగర్ నుంచి వచ్చానని తెలిపాడు. మరో వ్యక్తి తాను కొన్ని రోజుల క్రితం వచ్చి వివరాలు ఇచ్చి వెళ్లానని, ఇంకా కాల్ రాకపోవడంతో కనుక్కునేందుకు వచి్చనట్లు చెప్పాడు. మంత్రులు ప్రజలను కలుస్తున్నా.. ఓవైపు తాము అధికారంలోకి వచ్చాక ప్రజలు సీఎం దాకా ఎవరినైనా కలిసే అవకాశం లభించిందని, ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చామని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు.. మంత్రులు సైతం గాందీభవన్ వేదికగానూ ప్రజా సమస్యలు స్వీకరిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు, ఇబ్బందులు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సమస్యలు పరిష్కారమవుతున్నాయని, ఎన్ని ఇబ్బందులెదురైనా ఆపబోమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం పేర్కొన్నారు. కోటిమంది సమస్యలు తీర్చే బాధ్యతల్లో ఉన్న జీహెచ్ఎంసీ కమిషనర్ మాత్రం ప్రజలు తనను కలిసేందుకు సుముఖంగా లేరు. సార్ బిజీగా ఇతర పనుల్లో ఉన్నారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. దీన్ని చూసి ప్రజాపాలన అంటే ఇదేనా? అని విస్తుపోతున్న వారూ ఉన్నారు. గతంలో బల్దియా కమిషనర్లుగా పనిచేసిన వారెవరూ ఇలా వ్యవహరించలేదు. మరి ప్రజాపాలన అంటున్న ప్రభుత్వంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఇలంబర్తికి స్ఫూర్తి ఎవరో ఆయనకే తెలియాలి. రాజకీయ అండ? జీహెచ్ఎంసీకి రాకముందు ఇలంబర్తి రవాణా శాఖలో పని చేశారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన వ్యవహారాల్లోనూ మంత్రిగా ఆయనే సమీక్షలు చేస్తున్నారు. కమిషనర్‌కు మంత్రి అండదండలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ప్రజలను కలవని వ్యవహార శైలితో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఆయన అలా.. ఈయన ఇలా ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న దానకిశోర్.. తాను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పని చేసిన కాలంలో తనను కలిసేందుకు వస్తున్న వారందరికీ కూర్చునేందుకు సరిపడా కుర్చీలు లేకపోవడం గుర్తించి.. వృద్ధులు తదితరులు ఎక్కువసేపు నిలబడి ఉండటం చూడలేక సందర్శకుందరికీ కూర్చునే సదుపాయం ఉండేలా ప్రత్యేక గది, కుర్చీలు ఏర్పాటు చేయించారు. ఇలంబర్తి మాత్రం సందర్శకులనే పేషీలోకి రానీయడం లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. -
సీఆర్ఎంపీ లేనట్టే..!
సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం (సీఆర్ఎంపీ) కింద గత అయిదేళ్లుగా నగరంలోని ప్రధాన రహదారుల నిర్వహణ బాధ్యతలు చూసిన కాంట్రాక్టు ఏజెన్సీల గడువు ముగిసిపోతోంది. కానీ.. ఈ బాధ్యతలను తిరిగి ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చే యోచనలో జీహెచ్ఎంసీకి లేదు. కనీసం ఆరుల నెలల నుంచి ఏడాది వరకు జీహెచ్ఎంసీయే నిర్వహించాక తిరిగి ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఏజెన్సీల ఒప్పంద గడువు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ముగిసిపోయి మిగతా ప్రాంతాల్లోనూ జనవరిలో ముగిసిపోనున్నప్పటికీ, ఇప్పటి వరకు రోడ్ల నిర్వహణ కోసం కొత్తగా టెండర్లు ఆహ్వానించలేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఏజెన్సీలకు పొడిగింపూ ఇవ్వలేదు. రీ కార్పెటింగ్ అవసరం లేదు ⇒ అయిదేళ్ల క్రితం ప్రధాన రహదారుల మార్గాల్లోని 811 కిలో మీటర్ల మేర నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. ఒప్పందం మేరకు తొలి ఏడాది 50 శాతం, రెండో సంవత్సరం 30 శాతం, మూడో సంవత్సరం మిగతా 20 శాతం రోడ్లను రీ కార్పెటింగ్ చేయడంతో పాటు మరో రెండేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలు చూడాలి. అంటే వర్షాలొచ్చి గుంతలు పడ్డా, ఎక్కడైనా దెబ్బతిన్నా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. వాటితో పాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం, స్వీపింగ్ మెషీన్లతో రోడ్లు ఊడ్చటం తదితర పనులు చేయాలి. ⇒ ఒప్పంద గడువు ముగిసినా, ఇప్పటికిప్పుడు రోడ్లను రీకార్పెటింగ్ చేయాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. అందుకే ఒప్పంద గడువు ముగుస్తున్న ప్రాంతాల్లో పనుల కోసం స్వీపింగ్ మెషిన్లు అద్దెకు తీసుకునేందుకు టెండర్లు పిలుస్తున్నారు. రోడ్ల నిర్వహణను జీహెచ్ఎంసీ ఇంజినీర్లే పర్యవేక్షించనున్నారు. స్వీపింగ్ మెషిన్లతో పనుల కోసం కనీసం ఆరు నెలల సమయమైనా లేనిదే కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆరు నెలల కాలానికి అద్దె స్వీపింగ్ మెషీన్లకు టెండర్లు పిలుస్తున్నారు. ఈలోగా రోడ్ల నిర్వహణ మొత్తం పనులకు టెండర్లు పిలిచేందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవచ్చున్నది అధికారుల ఆలోచన కావచ్చు. ⇒ ఇప్పటికే సీఆర్ఎంపీ కింద ఉన్న రోడ్లతోపాటు కొత్తవి కూడా అందులో చేర్చి అన్నింటి నిర్వహణ పనులకు అవసరమైన నిధుల్ని ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించి, టెండర్లు పిలిచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అది ఆరు నెలల తర్వాతా.. లేక ఏడాదికా? అన్నది వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈలోగా పాత ఏజెన్సీలు చేయకుండా మిగిలిపోయిన పనులుంటే వాటిని పూర్తిచేయించనున్నారు. లేదా కేవలం చేసిన పనుల వరకే బిల్లులు చెల్లించనున్నారు. తక్షణ మరమ్మతులకు టెండర్లు మరోవైపు వర్షాలొచి్చనప్పుడు పాట్‌హోల్స్ పడ్డా, ఇతరత్రా కారణాల వల్ల రోడ్లు దెబ్బతిన్నా వెంటనే వాటిని పూడ్చివేయడం, ప్యాచ్‌వర్క్స్ వంటి పనుల్ని కూడా ప్రైవేటు ఏజెన్సీల కిచ్చే ఆలోచనలో జీహెచ్ఎంసీ అధికారులున్నట్లు తెలుస్తోంది. -
తుది దశకు ‘అమృత్’ పనులు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మౌలిక సదుపాయా లు కల్పించేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ (ది అటల్ మిషన్ ఫర్ రిజెనువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్) కింద రాష్ట్రంలోని 12 పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. దేశంలోని ఎంపిక చేసిన పట్టణాల్లో తాగునీటి సరఫరాతోపాటు సీవరేజీ పైప్లైన్ల వ్యవస్థ, పట్టణ రవాణా, పచ్చదనం పెంపు, వరదనీటి కాలువల అభివృద్ధి ప్రధాన అంశాలుగా 2015 జూన్ 25న ‘అమృత్’ పథకం ప్రారంభమైంది. తొలి దశలో ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 500 నగరాలను కేంద్రం ఎంపిక చేయగా అందులో రాష్ట్రం నుంచి హైదరాబాద్ (జీహెచ్ఎంసీ), వరంగల్ (జీడబ్ల్యూఎంసీ), కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం నగరాలతోపాటు ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, సిద్దిపేట, సూర్యాపేట పట్టణాలను ఎంపిక చేశారు. ఈ 12 పురపాలికల్లో తాగునీరు, సీవరేజీ, పార్కుల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పనులు ప్రారంభించింది. కేంద్రం, రాష్ట్రం 50:50 ప్రాతిపదికన చేపట్టే ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ. 1,663.08 కోట్లు కాగా.. అందులో కేంద్ర సాయం రూ. 832.6 కోట్లు. 66 ప్రాజెక్టులు... తాగునీటికి అధిక మొత్తం...అమృత్ పథకం కింద 12 పురపాలికల్లో 66 ప్రా జెక్టులు ప్రారంభమయ్యాయి. రూ. 1,663.08 కోట్ల అంచనాతో ప్రారంభించిన ఈ పనులకు కేంద్రం తన వాటాగా రూ. 832.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అందులో రూ. 831.52 కోట్లను కేంద్రం విడుదల చేయగా రాష్ట్రం తన వాటాతోపాటు కేంద్రం వాటా లో రూ.806.21 కోట్లు వినియోగించుకుంది. తాగు నీటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ పట్టణాల్లో 27 నీటి సరఫరాల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందుకోసం 4,336.54 కిలోమీటర్ల పొడవైన నీటి సరఫరా పైప్లైన్లను నిర్మించారు. వాటి విలువ రూ. 1,424.09 కోట్లు. అందులో అత్యధికంగా వరంగల్‌కు రూ. 341.3 కోట్లు వెచ్చించడం విశేషం. ఈ పథకం కింద నిజామాబాద్, సిద్దిపేటల్లో రూ. 203.3 కోట్ల విలువగల నాలుగు మురుగునీటి శుద్ధి, సెప్టిక్ ట్యాంకు వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు లను చేపట్టారు. ఈ రెండు పురపాలికల్లో 278.53 కి.మీ. పొడవైన మురికినీటి పారుదల పైప్లైన్లను ఏర్పాటు చేశారు. 5.54 లక్షల నల్లా నీటి కనెక్షన్లు, 0.87 లక్షల మురుగునీటి పారుదల కనెక్షన్లను అ మృత్, కన్వర్జెన్సెస్లో భాగంగా సమకూర్చారు. రాష్ట్రంలోని 12 పురపాలికల్లో రూ. 35.69 కోట్లతో 35 హరిత స్థలాలు, పార్కులను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టులన్నీ దాదాపు పూర్తయినట్లు రాష్ట్ర ప్రభు త్వం కేంద్రానికి తెలిపింది. దీనికి అదనంగా రాష్ట్రంలో 18.25 ఎంఎల్డీ సామర్థ్యంగల సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు (ఎస్టీపీ)ను, 442.45 ఎకరాల విస్తీర్ణంలో హరిత క్షేత్రాలను ‘అమృత్’ కింద అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అమృత్ 2.0 కింద కొత్త ప్రతిపాదనలు కేంద్రానికి చేరాయి.సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చాలని కోరిన సీఎం రేవంత్2021లో మొదలైన అమృత్–2.0 (పథకం రెండో దశ)లో భాగంగా హైదరాబాద్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ఇటీవల విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ప్రతిపాదించిన సమగ్ర సీవరేజీ మాస్టర్‌ప్లాన్ (సీఎస్ఎంపీ)ని చేర్చాలని కోరారు. అమృత్ తొలి విడత ప్రాజెక్టులో జీహెచ్ఎంసీలో పచ్చదనం కోసం కేవలం రూ. 3.3 కోట్లు మాత్రమే కేటాయించిన నేపథ్యంలో సీఎస్ఎంపీని అమృత్లోకి తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌తోపాటు సమీప పురపాలక సంఘాలతో కలుపుకొని 7,444 కి.మీ. మేర రూ. 17,212.69 కోట్లతో సీఎస్ఎంపీకి డీపీఆర్ రూపొందించినట్లు ఖట్టర్‌కు సీఎం తెలిపారు. సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సాయం చేయడం లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. -
బీజేపీ కార్పొరేటర్ల నిరసన.. జీహెచ్ఎంసీ మీటింగ్ రసాభాస!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ అసంపూర్తిగానే ముగిసింది. ఇష్టానుసారం స్టాండింగ్ కమిటీలో నిర్ణయాలు తీసుకోవడంపై బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో, బడ్జెట్ ప్రతిపాదనలు సవరించి డిసెంబర్ 9 తర్వాత మరోసారి స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది.జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ అసంపూర్తిగా ముగిసింది. సమావేశంలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలపై స్టాండింగ్ కమిటీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాస్తవాలకు దూరంగా బడ్జెట్ గణాంకాలు ఉన్నాయరని కార్పొరేటర్ల విమర్శలు చేశారు. వివిధ శాఖలకు కేటాయింపులు సరిగా లేవని స్టాండింగ్ కమిటీ సభ్యులు మండిపడ్డారు. దీంతో, చేసేదేమీ లేక.. బడ్జెట్ ప్రతిపాదనలు సవరించి డిసెంబర్ 9 తర్వాత మరోసారి స్టాండింగ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారు. ఇక, స్టాండింగ్ కమిటీ సమావేశం ప్రారంభంలోనే బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. ఇష్టానుసారం స్టాండింగ్ కమిటీలో నిర్ణయాలు తీసుకోవడంపై కాషాయ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతీ డివిజన్లో విజిట్ చేసి సమస్యలపై చర్యలు చేపడతామని మేయర్ గద్వాల విజయలక్ష్మి హామీ ఇవ్వడంతో బీజేనీ కార్పొరేటర్లు నిరసన విరమించుకున్నారు. అంతకుముందు.. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి బల్దియాను లూటీ చేస్తున్నారంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. -
కుంచె గీసిన చిత్రం..
నగరంలోని పలు కూడళ్లు రంగులద్దుకుంటున్నాయి. విభిన్న కళాకృతులతో ఫ్లై ఓవర్ పిల్లర్లు, అండర్ పాస్ గోడలు కలర్ ఫుల్ పెయింటింగ్స్‌తో కళకళలాడుతున్నాయి. ఒక్కో సెంటర్‌కు ఒక్కో రకమైన థీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గత రెండు నెలలుగా కళాకారులు తమ ప్రతిభతో ఎంతో అందమైన కళాఖండాలను తీర్చిదిద్దుతున్నారు. ఆ దారిన పోయే ప్రయాణికులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణం, ఆరోగ్యం, నగర, గ్రామీణ ప్రజల జీవన శైలి, జంతువులు, పక్షులు, క్రీడలు ఇలా విభిన్న రంగాలకు చెందిన చిత్రాలు నడయాడినట్లు దర్శనమిస్తున్నాయి. ఇందులో కళాకారులతో పాటు, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు సైతం పాలుపంచుకుంటున్నారు. ఎల్బీనగర్ నుంచి లింగంపల్లి వరకూ.. మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకూ.. హైటెక్ సిటీ నుంచి ఉప్పల్ సచివాలయం వరకూ.. ఇలా ఎటు చూసినా వంతెనల పిల్లలర్ల మీద, వంతెనల గోడలపైనా ఇటీవల కాలంలో కొత్త సొబగులద్దుకుంటున్నాయి. రేవంత్ సర్కార్ వచ్చిన తరువాత వాల్ పెయింటింగ్స్‌తో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కార్యాచరణలోకి దిగారు. ప్రతి ఫ్లై ఓవర్ వంతెన, అండర్ పాస్ గోడలు, పిల్లర్లకు అందమైన ఆకృతుల్లో చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. ఒక్కో సెంటర్లో ఒక్కో రకమైన థీమ్‌తో చిత్రాలు వేస్తున్నారు. ఎల్బీ నగర్ కూడలిలో వంతెన పిల్లర్లకు ఓ వైపు సంప్రదాయ నృత్యాలు, మైరో వైపు పాప్ డ్యాన్సర్స్ చిత్రాలు తీర్చిదిద్దారు. ఫ్లెక్సీ ప్రింటింగ్‌తో ముప్పు..ఒకప్పుడు ఆర్టిస్టులకు చేతినిండా పని ఉండేది. దీంతో బ్యానర్లపై రాతలు రాయడం, గోడలపై చిత్రాలు వేయడం, రాజకీయ, సినీ ప్రముఖుల కటౌట్లను సిద్ధం చేయడం, వివిధ సందర్భాల్లో ఆరి్టస్టులకు చేతినిండా పని దొరికేది. దీంతో గతంలో ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే ఆలోచన ఎక్కువ మందిలో కనిపించేది. అయితే ఇటీవలి కాలంలో మార్కెట్లోకి డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ అందుబాటులోకి రావడంతో తక్కువ ఖర్చు, వేగంగా పని పూర్తవుతుండడంతో పలువురు దీనిపై మక్కువ చూపుతున్నారు. దీంతో పెయింటింగ్ ఆరి్టస్టులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని పలువురు కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం, ఉపాధి మార్గాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాపోతున్నారు.36 ఏళ్లుగా ఇదే వృత్తి..1988లో ఆరి్టస్టుగా ప్రయాణం మొదలు పెట్టాను. ప్రభుత్వం వాల్ పెయింటింగ్స్‌కు అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. కళాకారులకు పని దొరుకుతుంది. రోజుకు రూ.2 వేలు ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఏ రకమైన పెయింటింగ్స్ వేయాలని సూచిస్తే వాటినే చిత్రిస్తున్నాం. ఈ పని ఎన్నాళ్లు ఉంటుందో తెలీదు. పదేళ్ల క్రితం వరకూ చేతినిండా పని ఉండేది. ఫ్లెక్సీ ప్రింటింగ్ వచ్చిన తరువాత నెలలో కొన్ని రోజులు పనిలేక ఖాళీగా ఉండాల్సి వస్తోంది. – అశోక్, కళాకారుడు, హయత్నగర్ఆరు నెలలు పని కలి్పంచాలి.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని కల్పించినట్లు సంవత్సరంలో కళాకారులకు కనీసం ఆరు నెలలు పనికల్పించే విధంగా చట్టం చేయాలి. ఒకప్పుడు ఫైన్ ఆర్ట్స్ అంటే సమాజంలో డిమాండ్ ఉండేది. ఫ్లెక్సీలు వచ్చాక క్రమంగా పని తగ్గుతోంది. పదో తరగతి చదివి ఆరి్టస్టుగా స్థిరపడ్డాను. ఇప్పుడు నెలలో 20 రోజులు పని ఉంటే పది రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వమే కళాకారులను ఆదుకుని జీవనోపాధి చూపించాలి. – సత్యం, కళాకారుడు, హయత్‌నగర్ -
హైదరాబాద్ పాతబస్తీలో అతిపెద్ద ఫ్లై ఓవర్.. విశేషాలివే
హైదరాబాద్ పాతబస్తీలో అతిపెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులన్నీ ఈ నెల 30 వరకు పూర్తి చేసి డిసెంబర్లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే.. ఆరాంఘర్, శాస్త్రీపురం, కాలాపత్తర్, దారుల్ ఉల్ ఉలూం, శివరాంపల్లి, హసన్‌నగర్ తదితర ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి. బెంగళూర్ జాతీయ రహదారితో పాటు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే వారికి సౌకర్యంగా మారనుంది. ఇప్పటి వరకు బాటిల్ నెక్ రోడ్డుతో ఇబ్బందులకు గురైన స్థానిక బస్తీల ప్రజలతో పాటు దూర ప్రాంతాల వారికి ఈ ఫ్లై ఓవర్ ఎంతో అనుకూలంగా ఉంటుంది.ఎస్ఆర్డీపీ కింద.. నగరంలో ఇప్పటి వరకు 2– 7 కిలో మీటర్ల పొడవుతో షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. 4.04 కిలో మీటర్ల అతి పెద్ద ఫ్లైఓవర్ పాతబస్తీలో నిర్మాణమైంది. వచ్చే నెల మొదటి వారంలో వాహనదారులకు దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి జీహెచ్ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గ్రేటర్ కమిషనర్ కె.ఇలంబర్తితో పాటు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ఈ నెల 26న ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. చదవండి: కాలిపోయిన కలల సౌధం.. రెండు రోజుల క్రితమే గృహప్రవేశం.. అంతలోనే ఇలాసర్వీస్ రోడ్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇంకా 17 కట్టడాలను తొలగించాల్సి ఉందని జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ విభాగం చీఫ్ ఇంజినీర్ దేవానంద్, ఎస్ఈ దత్తు పంతు తదితరులు కమిషనర్‌కు వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్నను కమిషనర్ ఆదేశించారు. 2023 మార్చి నాటికే పూర్తి కావాల్సింది.. జూ పార్కు నుంచి ఆరాంఘర్ వరకు రూ.736 కోట్లతో స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ) కింద దాదాపు 4.04 కిలో మీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది. 2021లో పనులు చేపట్టారు. 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉండగా.. నత్తనడకన సాగడంతో ఈ ఏడాది నవంబర్ వరకూ కొనసాగాయి. ఇంకా 2 డౌన్ ర్యాంపులతో పాటు 2 అప్ ర్యాంపులు పూర్తి కావాల్సి ఉంది. ఇందులో మొత్తం 163 ప్రాపర్టీలను స్వాధీనం చేసుకోవడానికి రూ.336 కోట్లు ఖర్చు చేయగా.. మిగిలిన నిధులతో ఆరు లేన్ల మేర ఫ్లైఓవర్‌ను నిర్మించారు. -
GHMC మేయర్ Vs MIM ఎమ్మెల్సీ.. అధికారుల్లో టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో జీహెచ్ఎంసీ మేయర్ వర్సెస్ ఎంఐఎం ఎమ్మెల్సీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. చికెన్, మటన్ షాపులు విషయంలో వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ప్రస్తుతం మేయర్ వర్సెస్ ఎంఐఎం ఎమ్మెల్సీ వ్యవహారం జీహెచ్ఎంసీలో హాట్ టాఫిక్ అంశంగా మారింది.వివరాల ప్రకారం..‘కలుషిత, అపరిశుభ్రమైన, నాణ్యత లేని నాన్‌వెజ్ విక్రయాలు జరుపుతూ చికెన్ మార్కెట్ నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. భరించలేని దుర్వాసన, ఎలుకల సంచారం.. తక్షణమే చికెన్ మార్కెట్‌ను సీజ్ చేయండి’.. ఈ నెల 22న కోఠిలోని మోతీ మార్కెట్లో ఆకస్మిక పర్యటన సందర్భంగా మేయర్ అధికారులకు చేసిన ఆదేశాలివి.. మేయర్ ఆదేశాల మేరకు చికెన్ సెంటర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి సీజ్ చేసే ప్రయత్నం చేశారు.మరోవైపు.. మేయర్ ఆదేశాలు ఇచ్చి 24 గంటలు గడవక ముందే ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్ సీజ్ చేసిన చికెన్, మటన్ షాపులు తెరవకపోతే ఉద్యోగాలు పోతాయంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇంకోసారి తమ దుకాణాలపై దాడులు చేస్తే చర్యలు తప్పవంటూ మందలించారు. మేయర్ ఆదేశాలు డోంట్‌కేర్..ఇంట్లో ఎలుకలు ఉన్నాయని, ఇంటిని సీజ్ చేసుకుంటామా? అంటూ ఎమ్మెల్సీ బేగ్ మేయర్ తనిఖీల తీరును ఎండగట్టారు.దీంతో, మేయర్ వర్సెస్ ఎంఐఎం ఎమ్మెల్సీ వ్యవహారం జీహెచ్ఎంసీలో హాట్ టాఫిక్ అంశంగా మారింది. మేయర్ తీరుపై ఎంఐఎం ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడి క్యాంటీన్ విషయంలోనూ మేయర్ తరచూ జోక్యం చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్సీ బేగ్ మేయర్ ఆదేశాలకు ధీటుగా నిలబడి విమర్శలు గుప్పిస్తుండడంపై అటు అధికారుల్లో, ఇటు కార్పొరేటర్లలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. -
వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు సరికాదు: సుప్రీం
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆల్ ఇండియా సర్వీసు అధికారులు, జడ్జిలు, జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ 2008లో అప్పటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోలను సుప్రీం కోర్టు రద్దు చేసింది. అలాగే ఇళ్ల స్థలాల కేటాయింపు మార్గదర్శకాలపై 2005లో జారీ చేసిన జీవోలను సైతం రద్దు చేసింది. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారులు, జర్నలిస్టులను ‘ప్రత్యేక వర్గం’గా పేర్కొంటూ వారి హౌసింగ్ సొసైటీలకు నామమాత్రపు ధరకు ఇళ్ల స్థలాలు విరుద్ధమని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హౌసింగ్ సొసైటీలు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. హౌసింగ్ సొసైటీలు చెల్లించిన సొమ్మును రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీతో సహా వడ్డీతో కలిపి వెనక్కి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ సొసైటీలకు అనుకూలంగా లీజు డీడ్లు ఏవైనా ఇచ్చి ఉంటే అవన్నీ రద్దు అవుతాయని తెలిపింది. అలాగే సొసైటీలు చెల్లించిన డెవలప్మెంట్ చార్జీలను కూడా వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ పి.సంజయ్ కుమార్ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఎంపీలు, శాసన సభ్యులు, ఆల్ ఇండియా సర్వీసు అధికారులు, జడ్జిల సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ 2008లో అప్పటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోలను కొట్టేస్తూ 2010లో హైకోర్టు తీర్పునిచ్చింది. ఒకవేళ ప్రభుత్వం ఆ సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనుకుంటే వాటి సభ్యులకు అర్హతలు నిర్ణయించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, హౌసింగ్ సొసైటీలతో పాటు ఇళ్ల స్థలాల కేటాయింపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వీబీ చెలికాని తదితరులు సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన పలు తరగతులతో పోలీస్తే ఎంపీలు, శాసన సభ్యులు, ఆల్ ఇండియా సర్వీసు అధికారులు, జడ్జిలు మంచి స్థానంలో ఉన్నారని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపు అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని స్పష్టం చేసింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన సామాన్యులకు ఒకే రకమైన హక్కులను తిరస్కరించడం ఎంత మాత్రం సహేతుకం కాదంది. తాము ఎన్నో త్యాగాలు చేశామని, అందువల్ల తక్కువ ధరలకు ఇళ్ల స్థలాలు పొందే హక్కు ఉందన్న అఖిల భారత సర్వీసు ఉద్యోగుల వాదనను తోసిపుచ్చుతున్నట్లు ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు, చట్టసభలకు ఎన్నికైన వారు, సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిలు, ప్రముఖ జర్నలిస్టులు ‘వెనుకబడిన వర్గాల’కిందకు రారని స్పష్టం చేసింది. -
GHMC పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు
-
జీహెచ్ఎంసీలో హౌజింగ్ సొసైటీలపై సుప్రీం సంచలన తీర్పు
సాక్షి,ఢిల్లీ: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో హౌసింగ్ సొసైటీలపై సుప్రీంకోర్టు సోమవారం(నవంబర్ 25) సంచలన తీర్పిచ్చింది. హౌజింగ్ సొసైటీలకు ఇప్పటికే చేసిన భూ కేటాయింపులను సీజేఐ సంజీవ్‌ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. ఇంతేకాకుండా సొసైటీలు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.హౌజింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూ కేటాయింపులను సవాలు చేస్తూ రావు బి చెలికాని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ ఉద్యోగులు,జర్నలిస్టుల సొసైటీలకు ప్రభుత్వంలో గతంలో భూ కేటాయింపులు జరిపింది. ఇదీ చదవండి: సోషల్‌మీడియా అండతో తీర్పులను ప్రభావితం చేసే యత్నాలు -
జీహెచ్ఎంసీ అడ్డగోలు నోటీసులు}
సాక్షి, సిటీబ్యూరో: ‘తిమ్మిని బమ్మి చేసే సత్తా వారి సొంతం. వారు తల్చుకుంటే లక్షల రూపాయల ఆస్తిపన్ను వేలల్లోనే వస్తుంది. వందల్లో రావాల్సింది వేలల్లో కూడా అవుతుంది’.. జీహెచ్ఎంసీ బిల్కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ల గురించి సామాన్య జనానికి ఉన్న అభిప్రాయం ఇది. ఈ పరిస్థితిని నివారించేందుకే గతంలో ఆస్తిపన్ను అసెస్మెంట్ల కోసం ప్రజల ఇళ్ల వద్దకు ట్యాక్స్ సిబ్బంది వెళ్లవద్దని అప్పటి కమిషనర్ లోకేశ్‌కుమార్ ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఆ విధానం వల్ల ఏ డాక్యుమెంట్లు పెట్టినా ఆస్తిపన్ను గుర్తింపు నంబరు(పీటీఐఎన్) జనరేట్ కావడంతో పాటు చివరకు జీహెచ్ఎంసీ భవనాలను సైతం ఎవరైనా తమ ఆస్తిగా చూపించుకునే అవకాశం ఏర్పడటంతో దానికి స్వస్తి పలికారు. మరోవైపు.. జీహెచ్ఎంసీకి వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు హస్తిమశకాంతరం వ్యత్యాసం ఉండటంతో.. ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా తిరిగి అసెస్మెంట్ను ట్యాక్స్ సిబ్బంది ‘సుమోటో’గానే చేసేందుకు గత జూలైలో ఆదేశించారు. దీంతో ఎంతోకాలం చేతులు కట్టిపడేసినట్లున్న ట్యాక్స్ సిబ్బందికి ఒక్కసారిగా వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది. ఇంకేముంది? అసెస్మెంట్ చేసుకోవాల్సిందిగా కొత్త భవనాల వద్దకు, అసెస్మెంట్లలో వ్యత్యాసాలున్నాయంటూ అన్ని భవనాల ప్రజల వద్దకు వెళ్తున్నారు. వారి వైఖరికి ఆసరానిస్తూ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి ఆస్తిపన్ను ద్వారా ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా.. తేడాలున్నట్లు గుర్తించిన వాణిజ్య భవనాలను, అదనపు అంతస్తులు వెలసిన ఇతరత్రా భవనాలను గుర్తించి నిజమైన ఆస్తి పన్ను విధించాల్సిందిగా సంబంధిత ఉన్నతాధికారులు సూచించారు. ట్యాక్స్ సిబ్బంది మాత్రం నివాస, వాణిజ్య భవనం అన్న తేడా లేకుండా.. అదనపు అంతస్తులు నిర్మించినా, నిర్మించకున్నా జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 213 కింద నోటీసులిచ్చేస్తున్నారు. సదరు సెక్షన్ మేరకు సరైన ఆస్తిపన్ను నిర్ధారించేందుకు జీహెచ్ఎంసీ కోరిన వివరాల్ని భవన యజమానులు లేదా ఆక్యుపైయర్లు తెలియజేయాలి. లక్ష్యం ఒకటి.. పని మరొకటి నిజమైన ఆస్తిపన్ను కట్టకుండా లక్షలు, కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నవారి నుంచి సరైన ఆస్తిపన్ను వసూలు చేయడం, ఇప్పటికే ఉన్న భవనాల మీద కొత్తగా నిర్మించిన అదనపు అంతస్తులను ఆస్తిపన్ను పరిధిలోకి తేవడం ద్వారా ఆస్తిపన్ను ఆదాయం పెంచుకోవాలనేది ఉన్నతాధికారుల లక్ష్యం. దీంతోపాటు దశాబ్దం క్రితం జరిగిన కంప్యూటరీకరణ సందర్భంగా చాలా ఇళ్ల ప్లింత్ ఏరియా ఎంత ఉందో నమోదు చేయలేదు. అలాంటి వాటి ప్లింత్ ఏరియాను ఆన్లైన్లో నమోదు చేసేందుకు వివరాలు సేకరించాల్సి ఉండగా.. అన్ని ఇళ్లనూ ఒకే గాటన కట్టి నోటీసులిస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎక్కువ ఆస్తిపన్నును తక్కువ చేస్తామంటూ ట్యాక్స్ సిబ్బంది జేబులు నింపుకొంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేని పక్షంలో ఎక్కువ ఆస్తిపన్ను కట్టాలంటూ బెదరగొడుతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నోటీసులిలా.. భవనం లేదా స్థలం.. యజమానులు కానీ ఆక్యుపైయర్లు కానీ ఏడు రోజుల్లోగా దిగువ పత్రాలు, సమాచారం అందజేయాలని నోటీసుల్లో పేర్కొంటున్నారు. 1. సేల్ డీడ్ 2. లింక్ డాక్యుమెంట్ (ఏదైనా ఉంటే) 3. మంజూరు ప్లాన్/అనుమతి కాపీ 4. ఎప్పటి నుంచి ఉంటున్నారు ? 5.ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ 6. టాక్స్ రసీదు 7. రిజిస్టర్డ్ లీజ్ డీడ్(ఏదైనా ఉంటే) లేదా రెంటల్ అగ్రిమెంట్ 8. భవనం కలర్ ఫొటో దశాబ్దాల క్రితం నిర్మాణ అనుమతులు పొందిన వారిలో చాలామంది వద్ద పైన పేర్కొన్న డాక్యుమెంట్లన్నీ అందుబాటులో లేవు. కొన్ని భవనాలు చాలామంది చేతులు మారాయి. వాటన్నింటినీ ఇప్పుడెలా తేవాలో తెలియక వారు ఆందోళనకు గురవుతున్నారు. -
GHMCకి కొత్త ప్రాబ్లమ్స్..
-
ప్రపంచ స్థాయి వైద్యం నగరంలో దొరుకుతుంది : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్ : నగరంలో రోజురోజుకు మెడికో టూరిజం అభివద్ధి చెందుతున్నదని ఇది నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మంచి పరిణామమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం ఆమె మణికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాన్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం చిన్న చిన్న పిల్లలకు కూడా కళ్లద్దాలు పెట్టుకొని కనిపిస్తుంటే బాధగా ఉందని స్మార్ట్ ఫోన్లు వినియోగం వల్లనే వారి కళ్లు దెబ్బతింటున్నాయని ఆమె అన్నారు.తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అప్పుడే వారు కళ్ళద్దాలకు దూరమవుతారని అన్నారు. మన దేశంలోని వివిధ నగరాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రోగులను ప్రతియేటా నగరంలోని ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకొని వెళ్తున్నారని ఈ సంఖ్య ప్రతి యేటా పెరుగుతున్నదని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నిపుణులతో పాటు అదే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం నగరంలోని పలు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండటమే ఇందుకు గల కారణమని అన్నారు.అనంతరం ప్రాన్ కేర్ ఐకేర్ వైద్యురాలు అంజనీ ప్రతాప్ మాట్లాడుతూ ప్రస్తుతం చిన్న పిల్లల కంటి సమస్యలు దూరపు చూపు కనిపించకపోవడం వంటి సమస్యలు తీవ్రమయ్యాయని ఇది ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ప్రతి ఒక్కరు వారి ఇళ్ళల్లో పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం వల్ల స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల పిల్లల కళ్లు దెబ్బతింటున్నాయని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వవొద్దని సూచించారు. తమ ఆస్పత్రిలో 20 రోజుల పాటు 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితంగా స్రీనింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, డాక్టర్ జి. సుధాకర్ రెడ్డి, ప్రొఫెసర్ రాజలింగం, ప్రణవ్, సీఎం రావు తదితరులు పాల్గొన్నారు. -
పండుగవేళ.. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్త
హైదరాబాద్, సాక్షి: ఉద్యోగులకు జీహెచ్ఎంసీ దీపావళి శుభవార్త చెప్పంది. ఈరోజు సాయంత్రం వరకు జీతాలు విడుదల చేయనున్నట్లు ఫైనాన్స్ డిపార్టుమెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. జీహెచ్ఎంసీ రూ.120 కోట్ల నిధులను విడుదల చేయనుంది. అయితే.. జీహెచ్ఎంసీ గత నెల వారం రోజుల ఆలస్యంగా జీతాలు ఇచ్చింది. దసరాకు ఐదు రోజులు ఆలస్యంగా జీతాలు ఇవ్వడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఉద్యోగుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని రెండు రోజులు ముందుగానే జీహెచ్ఎంసీ జీతాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. -
బాణాసంచా దుకాణాలకు తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ ఫీజు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండగను పురస్కరించుకొని బాణాసంచా (పటాకుల) దుకాణాలు ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ తీసు కోవాలని జీహెచ్ఎంసీ పేర్కొంది. లైసెన్స్ లేకుండా దుకాణాల ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులివ్వబోమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి స్పష్టం చేశారు. రిటైల్ అమ్మకాల కోసం దుకాణాలు ఏర్పాటు చేసేవారు రూ.11 వేలు, హోల్‌సేల్ విక్రయాలకు రూ. 66వేలు ట్రేడ్ లైసెన్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు ఇలా.. బాణాసంచా దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్స్ పొంది నిబంధనలకనుగుణంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిర్ణీత ట్రేడ్ లైసెన్స్ ఫీజును చెల్లించి జీహెచ్ఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు. తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ కోసం సిటిజన్ సర్వీస్ సెంటర్/ జీహెచ్ఎంసీ వెబ్సైట్ (www.ghmc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డిమాండ్ డ్రాఫ్ట్, డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించవచ్చన్నారు. గుర్తింపు కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు ప్రతులు ఇవ్వాలని కోరారు. బాణాసంచా షాపులను ఫుట్‌పాత్‌లు, జనావాసాల మధ్య ఏర్పాటు చేయరాదని తెలిపారు. తగిన ఫైర్ సేఫ్టీ ఉండాలి.. కాలనీలు, బస్తీలకు దూరంగా ఓపెన్ గ్రౌండ్లో/ పెద్దహాల్లో తగిన ఫైర్‌సేఫ్టీతో ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుకోని ప్రమాదం జరిగితే మంటలను ఆర్పడానికి వీలుగా అగ్నిమాపక నిరోధక పరికరాలు సిద్ధంగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి స్టాల్ వద్ద, చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దుకాణాలకు దగ్గరగా ఎట్టి పరిస్థితుల్లోనూ బాణాసంచా కాల్చకూడదని, షాపులో ఏర్పాటు చేసే లైట్లు ఇతరత్రా కరెంటు పరికరాలకు నాణ్యమైన విద్యుత్ వైర్‌ను వినియోగించాలని సూచించారు. బాణాసంచా స్టాల్లో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినట్లయితే స్టాల్ హోల్డర్దే బాధ్యతని, చట్టపరమైన చర్యలకు బాధ్యుడని తెలిపారు. ఈ విషయాన్ని తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్లో పొందుపరచనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి పేర్కొన్నారు.చదవండి: స్వీట్ క్రాకర్స్.. మతాబుల రూపాల్లో చాక్లెట్ల తయారీ ప్రభుత్వ ఉత్తర్వులు పాటించాలి.. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఫైర్ క్రాకర్స్ అయిన సిరీస్ క్రాకర్స్/లడీస్ తయారీ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం ఉందని, వాటి అమ్మకాలకు అనుమతించరని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ యాక్ట్ 1955/న్యాయస్థానాలు/పీసీబీ/ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు. బాణాసంచా విక్రయ స్టాళ్లను సంబంధిత డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్‌తో పాటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి అధికారుల బృందం కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. -
కేబీఆర్ పార్కులో ‘ప్రజా సంబరాలు’ నగరవాసుల సందడి..(ఫొటోలు)
-
HYDRA: హైడ్రాకు హైపవర్.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు(హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి) బదలాయించింది. ఆర్డినెన్స్ అధికారాలను హైడ్రాకు బదలాయిస్తూ ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ కట్టడాలు డిజాస్టర్స్ అసెట్స్ ప్రొటెక్షన్‌లో హైడ్రాకు అధికారాలు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో జీహెచ్ఎంసీ పరిధి మొత్తంలో అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపించే అవకాశం హైడ్రాకు కల్పించింది ప్రభుత్వం.గవర్నర్ ఆమోదంఇప్పటికే హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ‘హైడ్రా’ చట్టబద్ధతపై హైకోర్టు పలుమార్లు ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో.. ప్రభుత్వం స్పందించి ఆర్డినెన్స్‌ను రూపొందించింది. ఇప్పటివరకు హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు ఉన్న పలు అధికారాలను ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌తో తన అధీనంలోకి తీసుకుంది. అయితే ‘హైడ్రా’ ఆర్డినెన్స్‌పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా.. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ నివృత్తి చేశారని, దీనితో గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. కొత్తగా ‘సెక్షన్ 374–బీ’ని చేరుస్తూ ఆర్డినెన్స్జీహెచ్ఎంసీ చట్టం-1955లో ఇప్పటి వరకు 374, 374-ఎ సెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు సెక్షన్ 374-బి చేర్చుతూ ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరించింది. అందులోని అంశాలకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సమకూరే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ ఇతర సంస్థకైనా అప్పగించవచ్చని ఆర్డినెన్స్ చెబుతోంది. ఆ ఆర్డినెన్స్‌కు అనుగుణంగానే..తాజాగా, ఆ అధికారాలను హైడ్రాకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. తద్వారా హైడ్రాకు అదనపు బలం సమకూరినట్లైంది.👉చదవండి : హైడ్రాకు బిగ్ రిలీఫ్ -
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఈటల భేటీ
ఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఎంపీ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. కంటోన్మెంట్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు కారుణ్య నియామకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.కరోనా సమయంలో పనిచేస్తూ దాదాపు 100 మందికి పైన పారిశుద్ధ్య కార్మికులు చనిపోయారు. చనిపోయిన కార్మికుల అంశాన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని కారుణ్య నియామకాలు చేపట్టాని కోరారు.కారుణ్య నియామకాలు ఐదు శాతం మించకూడదన్న నిబంధనను సడలించి , ఈ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
TG: ఆమ్రపాలికి కేంద్రం షాక్
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆమ్రపాలికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఆమ్రపాలితో పాటు తెలంగాణ కేడర్ కావాలన్న 11 మంది ఐఏఎస్‌ల విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. వీరందరినీ వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ 11 మంది ఐఏఎస్‌లలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో పాటు విద్యుత్ శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్ కూడా ఉన్నారు. వీరందరూ తమకు తెలంగాణ కేడర్ కావాలని కేంద్రంలోని డీవోపీటీ శాఖకు గతంలో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరి విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. ఇదీ చదవండి: ఉద్యోగాలిచ్చి కూడా చెప్పుకోలేకపోయాం: వినోద్‌కుమార్ -
లంచగొండి భార్య... పట్టించిన భర్త!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి అవినీతి బండారాన్ని కట్టుకున్న భర్తే అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. తన భార్య జ్యోతి ప్రతి రోజూ లంచం తీసుకుంటుందంటూ ఇంట్లో గుట్టలు గుట్టలుగా ఉన్న డబ్బుల వీడియోలను విడుదల చేశారు ఆమె భర్త. ఇంట్లో డబ్బుల్ని దాచిన ప్రతి చోటు చూపిస్తూ వీడియోల్ని విడుదల చేశారు.జ్యోతి నిత్యం లక్షల్లో లంచం తీసుకుంటుందని, ఏడేళ్ల నుంచి లంచం తీసుకోవద్దని వద్దని వారించినా భారీ మొత్తంలో డబ్బులు తీసుకోవడం తనని మనోవేదనకు గురి చేస్తుందంటూ విడుదల చేసిన వీడియోల్లో పేర్కొన్నారు.లంచం మంచిది కాదంటూ వార్నింగ్ ఇచ్చినా.. డబ్బులు తీసుకోకుండా ఇంటికి వచ్చేది కాదు. దాదాపూ రూ.80లక్షల విలువైన నోట్ల కట్టలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ దాచిపెట్టిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. తన భార్య తీసుకున్న లంచానికి ఇవే సాక్షాలంటూ వీడియోల్ని విడుదల చేశారు.మణికొండలోని కాంటట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుంటూ ఇంటికి భారీగా లంచాలు తీసుకువస్తుందంటూ ఆమె భర్తే ఆరోపించారు. ఇదే విషయంలో జ్యోతితో గొడవ పడ్డానని, అయినా తనలో మార్పురాలేదన్నారు. పైగా తాను లంచం తీసుకోకూడదు అని అనుకున్నా.. పై అధికారులు లంచం తీసుకోమని ప్రోత్సహిస్తున్నారని చెబుతూ వస్తుందని వాపోయారు. చివరికి భార్య చేస్తున్న తప్పును తట్టుకోలేక ఈ వీడియోలు తీసినట్లు జ్యోతి భర్త విడుదల చేసిన వీడియోలో తెలిపారు. మరోవైపు జ్యోతిపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడంతో రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీకి బదిలీ చేయించుకున్నారు. -
‘జీహెచ్ఎంసీ’పై మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని నాలుగు కార్పొరేషన్లుగా విభజించబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. ఈ విషయమై శనివారం(అక్టోబర్ 5) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘హైదరాబాద్ మహా నగరంలో జనాభా కోటిన్నరకు చేరింది.జీహెచ్ఎంసీని నాలుగు కార్పొరేషన్లుగా చేసిన తర్వాత నలుగురు మేయర్లు ఉంటారు.రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నలుగురు మేయర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది.ఈ నగరాన్ని ప్రపంచ పటంలో ఉంచేందుకు రూ.30వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)ను నిర్మిస్తాం.అమెరికా తర్వాత అత్యధికంగా ఎంఎన్సీ కంపెనీల హెడ్‌క్వార్టర్స్ హైదరాబాద్‌లోనే ఉండనున్నాయి’అని కోమటిరెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: హోం మంత్రి పదవి ఇవ్వాలని.. -
పెడల్ పవర్.. సైకిల్ ఫర్ ఎవర్
ఎటువైపు చూసినా ఆకాశమంత ఎత్తైన అద్దాల భవనాలు.. నిత్యం ట్రాఫిక్‌తో కిక్కిరిసిన రహదారులు.. కిలోమీటర్ల మేర బారులు తీరే వాహనాలు.. ఇది నగరంలోని రహదారుల పరిస్థితి.. దీంతో పాటు నగర శివారులోని టెక్ పార్కుల్లోనూ లక్షలాది మంది ఉద్యోగులతో ట్రాఫిక్ సమస్యలు తప్పడంలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇటీవల కొంత కాలంగా వీధుల్లో సైక్లింగ్ ట్రెండ్ నడుస్తోంది. రహదారులకు సమాంతరంగా సైక్లింగ్ ట్రాక్‌లను జీహెచ్ఎంసీ అభివృద్ధి చేసింది. దీంతో టెకీల్లో చాలా మంది సైక్లింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వారంలో కొన్ని రోజులైనా సైకిల్‌పై కార్యాలయానికి వెళ్లాలని కొంత మంది రూల్ పెట్టుకుంటున్నారు. క్లబ్‌లుగా ఏర్పడి వారాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలుకు శ్రీకారం చుడుతున్నారు. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడటం, ట్రాఫిక్‌లో సమయం, డబ్బు ఆదా, వాతావరణ కాలుష్య నివారణకు ఈ విధానం సహాయపడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టెక్కీలుగా స్థిరపడిన చాలా కుటుంబాల ఇళ్లల్లో కారు, మోటారు సైకిల్‌తో పాటు ఎలక్రి్టక్, గేర్, సాధారణ సైకిల్ తప్పనిసరిగా ఉంటోంది. మెట్రో స్టేషన్లకు, కూరగాయల మార్కెట్‌కు, వాకింగ్‌కో వెళ్లడానికి, ఐదు కిలో మీటర్ల లోపు పనులకు సైకిల్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. వివిధ సైక్లింగ్ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక టూర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక్కో వారం ఒక్కో రకమైన థీమ్ ఉండేలా సెట్ చేసుకుంటున్నారు. వందలాది కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణాలు చేస్తున్నారు. ఆపై ట్రెక్కింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే వారాంతంలో కుటుంబ సభ్యులతో కలసి టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా కారు వెనకన తమ సైకిల్ కట్టుకుని పోతున్నారు. రిసార్ట్, ఫాం హౌస్, ఇతర డెస్టినేషన్‌లో సైక్లింగ్ చేస్తున్నారు.డెడికేటెడ్ ట్రాక్స్ కోసం.. నగరంలోని సైక్లిస్టులంతా ప్రస్తుతం ఉన్న సైకిల్ ట్రాక్‌లను డెడికేటెడ్ ట్రాక్‌లుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. కేబీఆర్ పార్క్, హైటెక్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌లకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. అయితే సాధారణ వాహనాలు సైతం ఈ సైకిల్ ట్రాక్‌పై నడిపిస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ట్రాక్‌పై పదుల సంఖ్యలో వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌తో నిండిన రహదారిపై సైకిల్ తొక్కాలంటే భయమేస్తుదని పలువురు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సైక్లింగ్ ట్రాక్స్‌కు బారికేడ్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇలా చేయడంతో మోటారు సైకిళ్లు, ఇతర వాహనాలు సైకిల్ ట్రాక్‌పైకి వచ్చే అవకాశం ఉండదు. దీంతో సైక్లిస్టులు వేగంగా, ధైర్యంగా ముందకు సాగేందుకు వీలుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓఆర్ఆర్ సమీపంలో సోలార్ రూఫ్‌తో ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ దేశంలోనే ప్రత్యేకమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరహాలో నగరాన్ని సైక్లింగ్ సిటీగా తీర్చిదిద్దాలనే డిమాండ్ వినిపిస్తోంది.ఏడేళ్ల నుంచి సైక్లింగ్..చిన్న చిన్న ప్రయాణాలకు సైకిల్‌పైనే వెళతాను. ఏడేళ్ల నుంచి క్రమం తప్పకుండా సైక్లింగ్ చేస్తున్నాను. ప్రతి మహిళ సైక్లింగ్ చేయాలి. ఆరోగ్యం పరంగా చాలా ఉపయోగాలున్నాయి. ఇతరులపైఆధారపడకుండా స్వతహాగా బయటకు వెళ్లి కూరగాయలు, పాలు, ఇతర సామాగ్రి తెచ్చుకుంటా. ఆఫీస్‌కి వెళ్లేందుకు మెట్రో వరకూ సైకిల్‌పైనే వెళతాను. సరికొత్త మోడళ్లు..ప్రధానంగా టెక్ వీధుల్లో వివిధ మోడల్ సైకిళ్ల హవా కనిపిస్తోంది. మెట్రో స్టేషన్ల నుంచి తమతమ కార్యాలయాలకు వెళ్లేందుకు ఉద్యోగులు సైకిళ్లను వినియోగిస్తున్నారు. ఎత్తుపల్లాలు ఉన్నా సైక్లిస్టులకు ఇబ్బంది లేకుండా బ్యాటరీ, గేర్ సైకిళ్లు అందుబాటులో ఉంటున్నాయి. రహదారికి సమాంతరంగా ఉన్నపుడు సైకిల్ తొక్కడం, ఎత్తు ఉన్నపుడు బ్యాటరీతో నడిపిస్తున్నారు. ఈ విధానం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కొనుక్కోవడం ఇష్టం లేకుండా, తమకు నచ్చినప్పుడు సైకిల్ సవారీ చేయడానికి అద్దె ప్రాతిపదికన వందలాది సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. టైం పాస్ కోసం.. సైక్లింగ్ టైం పాస్ కోసం ప్రారంభించాను. 10 కిలో మీటర్లు సైకిల్‌పై వెళ్లడానికి కష్టంగా ఉండేది. క్రమంగా అసోసియేషన్ సభ్యులతో సంబంధాలు ఏర్పడ్డాయి. సైక్లింగ్ వల్ల లాభాలపై అవగాహన వచి్చంది. ఇప్పుడు 100 కిలో మీటర్ల వరకూ వెళ్లిపోతున్నాం. వీలైతే ట్రెక్కింగ్ చేస్తున్నాం. సొంతంగా ఎస్కేప్ అండ్ ఎక్స్ప్లోర్ క్లబ్ స్థాపించాను. వారాంతంలో టూర్ ప్లాన్ చేస్తుంటాం. – అశోక్, ఎస్కేప్ అండ్ ఎక్స్ప్లోర్ నిర్వాహకులు21 వేల మంది సభ్యులు.. 2011లోనే సైక్లింగ్ రివల్యూషన్ ప్రారంభించాము. సాఫ్ట్వేర్ కంపెనీల్లో పర్యావరణం, ఆరోగ్యం, సమయం, డబ్బు ఆదాపై అవగాహన కల్పించాం. హైదరాబాద్ బైస్కిల్ క్లబ్‌ను స్థాపించాం. ప్రస్తుతం ఇందులో 21 వేల మంది సభ్యులున్నారు. 60 ఏళ్ల వయసులో లండన్ నుంచి పారిస్ వరకూ 518 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లాను. మూడున్నర రోజులు పట్టింది. ఢిల్లీ, ఛంఢీఘర్, చెన్నైలోనూ సైక్లింగ్ అసోసియేషన్స్ స్థాపించాం. సుమారు 6 వేల సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఏడేళ్ల క్రితం ఓఆర్ఆర్ సమీపంలో సైకిల్ ట్రాక్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించాం. 23 కిలోమీటర్ల సోలార్ రూఫ్ ట్రాక్ సిద్ధమైంది. – మనోహర్, ప్రపంచ సైక్లింగ్ సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ -
Ghmc: పోస్టర్లు బ్యాన్..ఆమ్రపాలి కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో వాల్ పోస్టర్లు బ్యాన్ చేయాలని కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి శుక్రవారం(సెప్టెంబర్27) సర్క్యులర్ జారీ చేశారు. జీహెచ్ఎంసీలో వాల్ పోస్టర్లు,వాల్ పెయింటింగ్స్ పై సీరియస్‌గా వ్యవహరించాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.సినిమాల పోస్టర్లు కూడా ఎక్కడా అతికించకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.ఒకవేళ ఆదేశాలను పట్టించుకోకుండా పోస్టర్లు వేస్తే మాత్రం జరిమానా విధించాలని సర్క్యులర్‌లో తెలిపారు.ఇదీ చదవండి: మూసీకి వరద..జీహెచ్ఎంసీ హై అలర్ట్ -
మూసీకి వరద..జీహెచ్ఎంసీ హైఅలర్ట్
సాక్షి,హైదరాబాద్: భాగ్యనగరానికి తాగునీరందించే జంట జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్‌సాగర్‌లో నీరు ఫుల్‌ట్యాంక్‌లెవెల్ (ఎఫ్టీఎల్) స్థాయికి చేరింది. ఎగువ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు వరద నీరురావడంతో నీటి మట్టం పెరిగింది. జలాశయానికి ఇన్‌ఫ్లో 500 క్యూసెక్కులు అధికారులు తెలిపారు.జలాశయం నిండడంతో పాటు ఇన్‌ఫ్లో ఉండడంతో రెండు గేట్లు ఎత్తి ఉస్మాన్‌సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో పాటు మూసీకి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బందిని కమిషనర్ అమ్రపాలి అప్రమత్తం చేశారు.ఇదీ చదవండి: హైడ్రా ఎఫెక్ట్..మూసీ పరివాహక ప్రాంతంలో ఉద్రిక్తత -
Ganesh Immersion: ఆ అనుభవాల నుంచి పాఠాలు!
సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: నగరంలో గణేశ్ సామూహిక నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా గత ఏడాది ఎదురైన అనుభవాలను పాఠాలుగా తీసుకొని ఈసారి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా కసరత్తు చేస్తున్నారు. బందోబస్తు కోణంలో సామూహిక నిమజ్జనం నగర పోలీసులకు ఫైనల్స్ వంటివి. గత కొన్నేళ్లతో పోలిస్తే గత ఏడాది ఈ ప్రక్రియ చాలా ఆలస్యమైంది. 2023 సెప్టెంబర్ 28 తెల్లవారుజాము నుంచి 29 రాత్రి 10 గంటల వరకు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం జరిగింది. ఈ ఆలస్యానికి కారణాలను ఉన్నతాధికారులు విశ్లేషించి ఈసారి ఏ ఒక్కటీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ కొత్వాల్ సీవీ ఆనంద్ ఈ లోపాలను ప్రస్తావించారు. వీటిని జీహెచ్ఎంసీ సహా ఇతర విభాగాల దృష్టికీ తీసుకువెళ్లారు. రెండు క్రేన్ల మధ్య వంద అడుగుల దూరం... కొన్ని క్రేన్లలో ఇనుపతాళ్లకు బదులుగా బెల్ట్‌లు వాడారు. నిమజ్జనం సందర్భంలో ఇవి ఊడిపోవడంతో మరింత ఆలస్యమైంది. అత్యవసర పరిస్థితుల్లో ఆఖరి నిమిషంలో ట్యాంక్‌బండ్‌పై క్రేన్లు ఏర్పాటు చేయాల్సి వస్తే... ప్రతి రెండు క్రేన్ల మధ్య కనీసం 100 నుంచి 150 అడుగుల దూరం ఉండాలి. అలా చేస్తేనే నిమజ్జనానికి విగ్రహాలను తెచ్చిన లారీలు, ఖాళీ అయినవి తేలిగ్గా ముందుకు వెళ్తాయి. అయితే సరైన పర్యవేక్షణ లేని కారణంగా గత ఏడాది ప్రతి క్రేన్ మధ్య 30 నుంచి 40 అడుగుల దూరమే ఉంచారు. దీంతో విగ్రహాలను తీసుకొచ్చిన వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీ ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఫలితంగా నిమజ్జనానికి వచ్చే విగ్రహాల కోసం క్రేన్లు ఖాళీగా వేచి ఉండాల్సి వచ్చింది. అదేవిధంగా ట్యాంక్‌బండ్‌పై బయటి ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు అధికారులకు ఎక్కువగా డ్యూటీలు వేశారు. సరైన అవగాహన లేని వీళ్ళు సక్రమంగా తమ విధులను నిర్వర్తించలేకపోయారు. ఇదీ చదవండి: కీలక ఘట్టానికి వేళాయేపటిష్టంగా బారికేడింగ్ నిమజ్జనం చూడటానికి వచ్చే సందర్భకులు లారీల మధ్యలోకి, రోడ్డుపైకి రాకుండా ఇరువైపులా పటిష్ట బారికేడింగ్ ప్రతి ఏడాదీ ఏర్పాటు చేస్తుంటారు. ఇది గత ఏడాది సక్రమంగా జరగలేదు. దీంతో అనేకమంది లారీల మధ్యకు వస్తుండటంతో అవి చాలా ఆలస్యంగా కదిలాయి. మరోపక్క బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి లిబర్టీ వైపు వాహనాలను అనుమతించడం మరో ఇబ్బందికి కారణమైంది. విగ్రహాలు తీసుకువచ్చే లారీల వెనుక వచ్చే ద్విచక్ర వాహనాలు, ఇతరాలను గత ఏడాది పూర్తిస్థాయిలో అడ్డుకోలేదు. ఇది కూడా నిమజ్జనం ఆలస్యానికి కారణంగా మారింది. ఇవన్నీ విశ్లేషిస్తున్న ఉన్నతాధికారులు ఈసారి అవి పునరావృతం కాకుండా, గతం కంటే మెరుగైన ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇవీ లోపాలు... ముందుగా వచ్చే విగ్రహాలు నిమజ్జనం కాగానే బండ్ నుంచి 20 అడుగుల దూరం మేర నీటిలో పేరుకుపోయే వ్యర్థాలు, వస్తువులను వెంట వెంటనే తొలగించాలి. అలా జరగకపోవడంతో ఆ వెంటనే నిమజ్జనం చేసే విగ్రహాలు మునగడానికి చాలా సమయం పట్టింది. నిమజ్జనం సందర్భంగా సాగర్‌లో కనీసం నాలుగు, ఐదు ఫ్లోటింగ్ జేసీబీలను ఏర్పాటు చేయాలి. ఓ పక్క విగ్రహాలు నీటిలో పడుతుంటే, మరోపక్క వాటి వ్యర్థాలను తొలగించాలి. అయితే జీహెచ్ఎంసీ అధికారులు గత ఏడాది కేవలం ఒక్క ఫ్లోటింగ్ జేసీబీ మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ కారణాల వల్ల నిమజ్జనం ప్రక్రియ వేగంగా జరగడానికి తీసుకువచ్చిన అత్యాధునిక క్యూఆర్డీ హుక్స్ సరిగ్గా పనిచేయలేదు. క్రేన్ ప్లాట్‌ఫామ్‌కు ఉన్న నాలుగు మూలలు సమానంగా నీటిలోకి దిగితేనే ఇవి సక్రమంగా పని చేస్తాయి. అయితే సాగర్‌లో ఉన్న వ్యర్థాలు, విగ్రహాలు, ఇనుప సీకులకు తట్టుకుని నాలుగు వైపులా నీటిలో దిగక హుక్స్ వెంటనే రిలీజ్ కాలేదు. దీంతో కొన్ని విగ్రహాల నిమజ్జనానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టింది. -
నిమజ్జనానికి వచ్చే వారికి ఉచిత ఆహారం: అమ్రపాలి
సాక్షి,హైదరాబాద్:గణేష్ నిమజ్జనానికి జిహెచ్ఎంసి తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి చెప్పారు. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడారు‘17,18,19 తేదీల్లో మూడు రోజులపాటు 15వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది పనిచేస్తారు.శానిటేషన్ సిబ్బంది,ట్యాంక్ బండ్లో గజ ఈతగాళ్లనుఏర్పాటు చేశాం.నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్‌లలో మంచినీళ్లు,ఆహారం ఏర్పాటు చేస్తున్నాం.ఇప్పటికే రోడ్లు రిపేర్ చేశాం.స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశాం.అన్ని మేజర్ చెరువుల వద్ద క్రేన్లు ఉంచాం.జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చిన్న చిన్న చెరువుల వద్ద బేబీ పాండ్స్ ను ఏర్పాటు చేశాం.కాలనీలలో ఏర్పాటు చేసే చిన్న విగ్రహాలు అక్కడే నిమజ్జనం చేస్తారు.గణేష్ నిమజ్జనానికి జోనల్ కమిషనర్లతో పాటు పోలీసులు కోఆర్డినేషన్ చేసుకుంటూ పనిచేస్తారు’అని అమ్రపాలి తెలిపారు.ఇదీ చదవండి.. 17న నిమజ్జనం సెలవు -
హైడ్రా.. ఫ్లడ్ స్టడీ!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో శని, ఆదివారాల్లో కురిసిన భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పరిశీలించింది. వరద ప్రభావిత ప్రాంతాలు, అక్కడి పరిస్థితులు, అడ్డంకులను క్షేత్రస్థాయిలో గుర్తించింది. చెరువులు, నాలాల కబ్జా వల్ల కలిగే ఇబ్బందులను ఆయా ప్రాంతాల్లో నివసించే వారికి వివరించే ప్రయత్నం చేసింది. హైడ్రా ఏర్పడ్డాక తొలి ముసురు... జీహెచ్ఎంసీలో అంతర్భాగంగా ఉన్న డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్)ను వేరు చేయడంతోపాటు చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వం హైడ్రాకు రూపమిచ్చింది. ఈ మేరకు జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాతి రోజే హైడ్రా కమిషనర్‌గా ఏవీ రంగనాథ్ బాధ్యతలు స్వీకరించారు. వెంటనే చెరువుల ఆక్రమణలపై దృష్టిపెట్టి ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాల కూల్చివేతల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే గత 40 రోజుల్లో నగరంలో పలుమార్లు వర్షం కురిసినా శని, ఆదివారాల మాదిరిగా ముసురుపట్టి వివిధ ప్రాంతాలు మునకేసే పరిస్థితి కనిపించలేదు. ఈ రెండు రోజుల వర్షాలతో నగరంలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించడంతోపాటు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి వరద ప్రవేశించింది. రోడ్లపై భారీగా వర్షపునీరు నిలిచిపోవడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. షేక్‌పేట, టోలిచౌకి, బేగంపేటలలో పర్యటిస్తూ. ఈ పరిణామాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగారు. శని, ఆదివారాల్లో అనేక ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. షేక్‌పేట, టోలిచౌకి, బేగంపేట తదితర ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. నీళ్లు నిండిన రహదారులు, కాలనీల్లో తిరుగుతూ ఓపక్క డీఆర్ఎఫ్ సహాయ చర్యలను పర్యవేక్షిస్తూనే మరోపక్క ఆ ముంపునకు కారణాలను వారికి వివరించారు. చెరువులు, నాలాల కబ్జాల వల్లే ఈ విపత్కర పరిస్థితులు వస్తున్నాయని, దీని ప్రభావం కబ్జా చేసిన వారి కంటే ఎక్కువగా సామాన్యులపై ఉంటోందని చెప్పారు. ఎవరికి వారు బాధ్యతగా మెలిగేలా, కబ్జాలు, ఆక్రమణలపై వారు ఫిర్యాదు చేసేలా వారిని ప్రోత్సహించారు. ఆ వాదనకు తెరదించేలా... నగరంలో గతంలో వర్షాలు కురిసిన సందర్భంలోనూ రంగనాథ్ క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. అయితే అప్పట్లో జీహెచ్ఎంసీ ఈవీడీఎం (ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్) డైరెక్టర్‌గా వరద సహాయక చర్యలను పర్యవేక్షించారు. అందులో భాగంగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లను కూడా ప్రయోగించారు. తాజాగా ఆయన హైడ్రా పగ్గాలు చేపట్టగా ఓ వర్గానికి చెందిన వారు ఆ సంస్థ చర్యలపై దుష్ఫ్రచారం ప్రారంభించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు ఉన్నా ఇబ్బందుల్లేవని... కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వం హైడ్రాను ప్రయోగిస్తోందని ఆరోపించారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆయన శని, ఆదివారాల్లో క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా ఆ వర్గాల వాదన నిజం కాదని నిరూపించే ప్రయత్నం చేశారు. -
హుస్సేన్ సాగర్ ఫుల్.. జీహెచ్ఎంసీ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో.. నదులు, చెరువుల్లోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌కు వరద నీరు పోటెత్తుతోంది. నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది.హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం కారణంగా బంజారా హిల్స్, పికెట్, కూకట్పల్లి ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు హుస్సేన్ సాగర్‌లోకి చేరుతోంది. దీంతో, సాగర్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో తూముల ద్వారా వరద నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్‌లోని నీటిమట్టం 513.70 మీటర్లకు చేరుకుంది, అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ 515 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ ఇన్‌ఫ్లో 10270 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 9622 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.మరోవైపు.. ఎడతెరపి లేని వర్షాలతో జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. మూసీ నదికి వరద పోటెత్తింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసారంబాగ్ బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ, అందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. ఈ సందర్బంగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి. నగరంలో వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలి. ఏదైనా సహాయం కావాలంటే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 040-21111111 ను సంప్రదించాలి. మ్యానువల్ ఎమర్జెన్సీ బృందాలు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలి. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ అందరూ అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశించారు. -
హైడ్రాకు సవాల్.. జీహెచ్ఎంసీ ఆఫీసు కూల్చేస్తారా?: ఎంపీ అసద్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘హైడ్రా’ కూల్చివేతల అంశం హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ కట్టడాల కూల్చివేతలపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను ఏం చేయబోతున్నారని ఆయన నిలదీశారు.కాగా, హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలపై తాజాగా అసదుద్దీన్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన భవనాలను కూల్చి వేస్తున్న అధికారులు ఆ పరిధిలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా కూల్చివేస్తారా?. హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సంగతి ఏంటి?. అక్కడ నిర్మించిన ఆఫీసులను ఏం చేయబోతున్నారు. నెక్లెస్ రోడ్డును కూడా తొలగిస్తారా?. నెక్లెస్ రోడ్డు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కదా?. మరి దాన్ని కూడా తవ్వేస్తారా?. గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్యాలయం కూడా నీటి కుంటలో నిర్మించినదే. మరి జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూడా కూల్చేస్తారా? అంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు. దీంతో, అసద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.మరోవైపు.. అక్రమ కట్టడాల కూల్చివేతపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయాలనే నిర్ణయించాం. అలాగే, ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారి కట్టడాలను కూడా కూల్చివేస్తాం. చెన్నై, ఉత్తరాఖండ్, వయనాడ్‌లో ఏం జరిగిందో అందరూ చూశారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత భవిష్యత్ తరాల కోసం చేపట్టాం. ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయాలనే నిర్ణయించాం. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. అక్రమ నిర్మాణాలు వదిలేస్తే నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టే. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అందరూ సహకరించాలి. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేది లేదు. రాజకీయం కోసమో.. నాయకులపై కక్ష కోసం కూల్చివేతలు చేయడం లేదు. చెరువుల ఆక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారు కూడా ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండవచ్చు. హైడ్రా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. -
‘హైడ్రా’ ఉక్కుపాదం.. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత (ఫొటోలు)
-
ఆక్రమణదారులకు సింహస్వప్నం!
హైదరాబాద్ పరిధిలో అన్యాక్రాంతమైన అన్ని రకాల ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడా నికీ, కొత్తగా ఆక్రమణలకు గురికాకుండా చూడడానికీ ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా)ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి సరికొత్తగా ఆలోచన చేసి దీనిని ప్రత్యేక వ్యవస్థగా రూపుదిద్దారు. జీహెచ్ఎమ్సీ, హెచ్ఎమ్డీఏ పరిధిలోని వేలాది ఎకరాల ప్రభుత్వ, ఇనాం, వక్ఫు, దేవాదాయ భూములు, చెరువులు కబ్జాకు గురయ్యాయి. గత బీఆర్ఎస్ పాలనలో చెరువులను మాయం చేసి, కొండలు గుట్టలను ధ్వంసం చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి అమ్మేశారు. జీవో 59 ముసుగులో భూములను రక్షించాల్సిన వారే భక్షించారు. అధికారులు వారికి వంత పాడారు. రోజురోజుకూ కబ్జాలు పెరిగిపోతుండడంతో ముఖ్యమంత్రి ఇతర దేశాల్లో ప్రభుత్వాస్తుల రక్షణకు చేపట్టిన విధి, విధానాలపై అధ్యయనం చేశారు. అక్కడ సత్ఫలితాలు ఇస్తున్న విధానాన్ని హైదరాబాద్ లోనూ అమలు చేయడానికి హైడ్రాను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేశారు. దీని విధి విధా నాలు ఖరారు చేస్తూ ఇటీవల జీవో 99ని జారీ చేశారు. దీనికి ఐజీ స్థాయి సీనియర్ పోలీసు అధికారి ఏవీ రంగనాథ్‌ను కమిషనర్‌గా నియ మించారు.హైడ్రాను ఏర్పాటు చేసిన వెంటనే ప్రభుత్వం దానికి సంబంధించి రూ. 200 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అక్రమ నిర్మాణాల అంతు తేల్చడానికి ప్రభుత్వం ఎంత అంకితభావంతో ఉందో ఈ బడ్జెట్ కేటాయింపే నిదర్శనం. జీహెచ్ఎమ్సీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాలు హైడ్రా పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. సుమారు 2,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలను కలిపి స్వయం ప్రతిపత్తితో ఉండేలా హైడ్రాను అందుబాటులోకి తెచ్చారు. జీహెచ్ఎమ్సీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి,సంగారెడ్డి జిల్లాల్లోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) గా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఆ ప్రాంతం వరకు విపత్తు నిర్వహణ తదితర అధికారులతో హైడ్రాను ఏర్పాటు చేశారు. హైడ్రా పాలకమండలికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా, మున్సిపల్ మంత్రి, రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి; హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల ఇన్చార్జి మంత్రులు; హైదరాబాద్ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు.చెరువులు, పార్కుల పరిరక్షణ కోసం హైడ్రా త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నది. చెరువులు కుంటలు, నాళాలు, పార్కులు ప్రభుత్వ స్థలాల్లో జరిగిన అక్రమ కట్టడాలే కాకుండా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఏళ్ల క్రితమే అనుమతులతో వెలసిన భవనాలను చట్ట ప్రకారం కూల్చివేసేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ మేరకు రంగంలోకి దిగింది. అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపుతోంది. జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్, బంజారాహిల్స్‌లోని మిథిలా కాలనీ, గాజుల రామారం, భూమ్ రుఖా ఉద్ దవాల్ చెరువుల్లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఆక్రమణలపై హైడ్రాకు రోజుకు 40 నుంచి 50 ఫిర్యాదులు వస్తుండడం విశేషంగా చెప్పవచ్చు.ప్రభుత్వ స్థలాల్లో ఇప్పటికే ఇచ్చిన లే ఔట్లకు సంబంధించిన అనుమతులు రద్దు చేసే ఆలోచనతో హైడ్రా ముందుకు వెళ్తోంది. చెరువుల ఆక్రమ ణలు జరగకుండా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సాంకేతికంగా కూడా చర్యలు తీసు కుంటున్నది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచ నున్నది. ప్లాట్లు, ఇండ్లుకొనే వ్యక్తులు ఈ స్థలం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందా రాదా అన్నది తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందిస్తున్నారు.హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఈ పోలీస్ స్టేషన్ ద్వారానే ఎస్ఓటీ ఏర్పాటు చేసి కబ్జా దారులపై ఉక్కు పాదం మోపనున్నారు. హైడ్రాకు మొత్తం 3,500 మంది సిబ్బందిని త్వరలో నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. హైడ్రా కింద అసెట్ ప్రొటెక్షన్‌తో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు కూడా కొన సాగుతుంది. పట్టణ ప్రణాళిక– విపత్తుల నిర్వహణ విభాగాలు, ట్రాఫిక్ పోలీ సులతో సమన్వయం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో 72 టీమ్‌లు పనిచేస్తున్నాయి. త్వరలో కొన్ని జిల్లాల్లోనూ ఇటువంటి వ్యవస్థలను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం ఆలోచించడం ముదావహం.– వెలిచాల రాజేందర్ రావు, వ్యాసకర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, 9849 061481 -
అనుమతి పొందిన కట్టడాలను ఎలా కూలుస్తారు?: బీజేపీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: హైడ్రా ఆలోచన బాగున్నా ఆచరణలో మాత్రం సరైన తీరు లేదని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘సామాన్య ప్రజలకు శికం భూమా, బఫర్ జోన్లో ఉందా? అనేది తెలీదు. కష్టపడి సంపాదించిన సొమ్మంతా పెట్టి భూమి కొంటారు. అధికారులు చేసే పనుల వల్ల సామాన్య జనం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది’’ అని వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు.‘‘చెరువులను కాపాడాలి. అక్రమ కట్టడాలను కుల్చాలి కానీ అనుమతులు ఇచ్చిన అధికారులను ఏం చేస్తారు?. అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చితే మంచిదే.. కానీ హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అనుమతి పొందిన వాటిని ఎలా కూలుస్తారు? రాజకీయ నాయకులు, అధికారులు కలిసి సామాన్య ప్రజలది తప్పు అన్నట్లు చేస్తున్నారు. రంగనాథ్ లాంటి సిన్సియర్ ఆఫీసర్ ఉండటం తెలంగాణకు మంచిదే కానీ ఇలా ఎంతకాలం చేస్తారు?. నోటీసు ఇవ్వకుండా రాత్రికి రాత్రే కూలగొట్టడం మంచిది కాదు’’ అని వెంకటరమణారెడ్డి చెప్పారు.‘‘గత ప్రభుత్వ తప్పిదాలకు ప్రజలను బలి పశువు చేస్తారా..?. రేవంత్ రాత్రికి రాత్రి తీసుకునే నిర్ణయంతో సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. చెరువుల్లో కట్టడాలకు అనుమతి ఇచ్చిన వారికి బేడీలు వేసి జైల్లో వేయాలి అప్పుడే మిగతావారికి భయం వస్తుంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం పక్కకి పోయాయి ఇప్పుడు హైడ్రా కొన్నాళ్లు హడావుడి’’ అంటూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. -
Hyderabad: స్ట్రీట్ డాగ్స్‌కు.. ఫుడ్ పెట్టాలా?
సాక్షి, సిటీబ్యూరో: దయాగుణంతో వీధికుక్కలకు ఆహారం పెట్టేవారు తమ పేర్లను జీహెచ్ఎంసీ వద్ద నమోదు చేసుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అందుకుగాను bit.ly/GHMCdogfreederform లింక్ ద్వారా లేదా సంబంధిత క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపింది. తద్వారా జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో వీధి కుక్కలకు ఆహారం ఉంచేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు జీహెచ్ఎంసీతో కలిసి పనిచేయవచ్చని పేర్కొంది.దాంతో ప్రజలు కుక్కల బారిన పడే ప్రమాదాలు తగ్గుతాయని అభిప్రాయపడింది. పేర్లు నమోదు చేసుకున్న వారికి కుక్కలకు ఆహారం వేసే విధానం, జంతు సంరక్షణ మార్గదర్శకాలు తదితర అంశాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని తెలిపింది. స్టెరిలైజేషన్, వాక్సినేషన్ జరగని కుక్కల గురించి సమాచారమిచ్చి ఆ కార్యక్రమాల డ్రైవ్స్‌లో భాగస్వాములు కావొచ్చని పేర్కొంది. కార్యక్రమాలకు జంతు సంక్షేమ సంఘాలు కూడా సహకరించాలని కోరింది. తద్వారా నగరాన్ని సురక్షిత, ఆరోగ్యకర నగరంగా మార్చవచ్చని పేర్కొంది. వివరాలకు జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాల్లో వెటర్నరీ అధికారులను సంప్రదించాల్సిందిగా సూచించింది. -
మారని ఉద్యోగుల తీరు.. ఉదయం 11 దాటినా ఖాళీ కుర్చీలే దర్శనం
-
బల్దియాలో అంతే!.. మధ్యాహ్నం 12 గంటలైనా విధులకు రాని సిబ్బంది
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం... బుధవారం ఉదయం 10.35 గంటలు⇒ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఒకటో అంతస్తులోని ఒక కార్యాలయంలోకి వెళ్లారు. ఎంతమంది సిబ్బంది ఉన్నారో చూశారు. అవాక్కయ్యారు. 20 మందికి పైగా ఉండాల్సిన సెక్షన్లో ఐదుగురే ఉన్నారు. మిగతా వారేరీ? అంటే..ఇంకా రాలేదు అనే సమాధానం వచి్చంది.⇒ అలాగే ఒక్కో కార్యాలయం చూసుకుంటూ ఒక అంతస్తు తర్వాత మరో అంతస్తుకు జీహెచ్ఎంసీలో వివిధ విభాగాలున్న ఆరంతస్తుల వరకు వెళ్లారు. అన్ని చోట్లా దాదాపుగా అవే సీన్లు. ఉద్యోగులు 10.30 గంటలకే కార్యాలయాల్లో ఉండాల్సి ఉండగా, 11 గంటలు దాటినా లేరు. 11.30 గంటలవుతున్నా పూర్తిస్థాయిలో లేరు. ⇒ అప్పుడే వస్తున్నవారిని చూసి ఆఫీస్ టైమెప్పుడు? ఎప్పుడు వస్తున్నారంటే ఆలస్యమైందంటూ తడబడుతూ సమాధానమిచ్చారు. మ. 12 గంటలైనా ఇంకా వస్తున్న వారున్నా రు. ఆ తర్వాత వచి్చన వారు సైతం ఉన్నారు. మేయర్ ఆకస్మిక విషయం ఒక్కసారిగా గుప్పుమనడంతో చాలామంది హడావుడిగా వచ్చారు. అన్ని విభాగాల్లో దాదాపుగా ఇవే పరిస్థితులుండటంతో మేయర్ మండిపడ్డారు. ⇒ ప్రజాప్రభుత్వంలో ఇలా ఉంటే నడవదని, ‘ఉండాలనుకుంటే ఉండొచ్చు..లేకుంటే వెళ్లిపోవచ్చు’ అని సీరియస్ అయ్యారు. రేపట్నుంచి 10.35 గంటల వరకు మాత్రం హాజరు రిజిస్టర్లు కార్యాలయాల్లో ఉంచి, 10.40 గంటలకు తన కార్యాలయానికి పంపించాల్సిందిగా అధికారులకు సూచించారు. రాని వారికి మెమోలు జారీ చేయాల్సిందిగా అడిషనల్ కమిషనర్ (పరిపాలన) నళిని పద్మావతికి సూచించారు.‘ఫేస్ రికగ్నిషన్’ అమలు చేస్తాం.. తనిఖీల అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, క్రమశిక్షణ, సమయపాలన పాటించని వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమయానికి రానివారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులపై హెచ్ఓడీల పర్యవేక్షణ ఉండాలన్నారు. పలు విభాగాల్లో ఉద్యోగులు ఆలస్యంగా వస్తూ, సాయంత్రం 4 గంటలకే వెళ్తున్నట్లు తన దృష్టికి రావడంతోపాటు పలు ఫిర్యాదులందడంతో ఈ తనిఖీ నిర్వహించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఫేస్ రికగి్నషన్ అటెండెన్స్‌ను కూడా అమల్లోకి తెచ్చే ఆలోచన ఉందన్నారు. ఇది ఇక్కడ మామూలే.. మేయర్ తనకీ విషయం ఇప్పుడే తెలిసినట్లు చెప్పినప్పటికీ, బల్దియాలో అది సాధారణ తంతు. అందుకే ఒకసారి బల్దియాలో చేరిన వారు బదిలీలైనా పోకపోవడానికున్న కారణాల్లో ఇదీ ఒకటి. బల్దియా వ్యవహారాల గురించి బాగా తెలిసిన వారి సమాచారం మేరకు, మధ్యాహ్నం 12 గంటలైనా చాలామంది విధులకు రారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ‘లంచ్ టైమ్’ మొదలవుతుంది. బల్దియాలో సాధారణ లంచ్‌బ్రేక్ అంటూ లేదు. ఎవరిష్టం వారిది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ అది నడుస్తుంటుంది. 4 గంటలు దాటాక ఇళ్లకు తిరుగుముఖం ప్రారంభమవుతుంది. పై ఆదాయం వచ్చే వారు మాత్రం సీట్లలో సాయంత్రం 5.30 గంటలు దాటినా ఉంటారు. ఇక, కార్యాలయాల్లో ఉండేవారిలో సైతం అందరూ పనులు చేస్తున్నారని చెప్పలేం. కొందరు కంప్యూటర్లలో గేమ్స్ ఆడుతుంటారు. కొందరు ఎక్కువ సమయంలో ఫోన్లలో యూట్యూబ్ చిత్రాలు చూస్తుంటారు. బల్దియాలోని వైఫై సదుపాయంతో నిరి్వరామంగా ఫోన్లు, కంప్యూటర్లతో కాలం గడుపుతారు. అలాగని అంకితభావంతో పనిచేస్తున్నవారు లేరని చెప్పలేం. కాకపోతే వారి సంఖ్య స్వల్పం. ఉదయం సమయానికే వచ్చి పొద్దుపోయేంత వరకు తలమునకలుగా పనులు చేసే వారూ ఉన్నారు. అలాంటి వారివల్లే బల్దియా బతుకుతోంది. నిజంగా చర్యలుంటాయా ? మేయర్ హెచ్చరికల్ని ఎవరైనా ఖాతరు చేస్తారా అన్నది అనుమానమే. గతంలో ఆహార కల్తీ తనిఖీలకు సంబంధించి ఏ రోజు ఎన్ని తనిఖీలు జరిపారో, ఏం చర్యలు తీసుకున్నారో ఏ రోజుకారోజు సాయంత్రం తనకు నివేదికలు పంపాలని ఆదేశించారు. అది ఏమాత్రం అమలవుతుందో సంబంధిత విభాగానికి, మేయర్ కార్యాలయానికే తెలియాలి. బయోమెట్రిక్ ఉత్తుత్తిదేనా ? కారి్మకులతోపాటు కమిషనర్ దాకా బయోమెట్రిక్ హాజరు వేయాలని గతంలో చెప్పారు. ఒకరిద్దరు కమిషనర్లు సైతం దాన్ని పాటించారు. కనీసం ఉద్యోగులైనా బయోమెట్రిక్ హాజరును వినియోగిస్తున్నారో, లేదో తెలియని పరిస్థితి మేయర్ తనిఖీతో వెల్లడైంది. నిజంగా వినియోగిస్తే అంత ఆలస్యంగా ఎందుకు వస్తారు? ఒకవేళ ఆలస్యంగా వచ్చినా వారికి పూర్తి జీతాలెందుకు చెల్లిస్తున్నారు? అన్నవాటికి సంబంధిత అధికారులే సమాధానం చెప్పాలి. కొన్ని సీట్లు ఖాళీగా ఉండటం తనిఖీలో గుర్తించిన మేయర్..ఆ సీట్లు ఎవరివి అంటే వారి పేర్లు కూడా సహచరులు చెప్పలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొన్ని సెక్షన్లలో నాలుగైదు రోజులకోమారు వచ్చి ఒకేసారి అన్ని రోజులకూ సంతకాలు పెట్టుకుంటారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఇక బయోమెట్రిక్ ఎందుకు..దాని నిర్వహణకు లక్షలాది రూపాయల వ్యయమెందుకు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జోన్లు..సర్కిళ్లలో.. ప్రధాన కార్యాలయంలో పరిస్థితి ఇలా ఉంటే జోన్లు, సర్కిళ్లలోనూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ ఇంకో సదుపాయం కూడా ఉంది. లేని వారి గురించి సంబంధిత సెక్షన్లలో అడిగితే ప్రధాన కార్యాలయానికి పనిమీద వెళ్లారని టక్కున సమాధానం చెబుతారు. సర్క్యులర్ జారీ మేయర్ ఆదేశాల నేపథ్యంలో చర్యలకు సిద్ధమైన సంబంధిత అడిషనల్ కమిషనర్ (పరిపాలన) నళిని పద్మావతి ఆ మేరకు సర్క్యులర్ జారీ చేశారు. ఉద్యోగులంతా కార్యాలయ వేళల మేరకు ఉదయం 10.30 గంటలకల్లా హాజరు కావాలి. పది నిమిషాల గ్రేస్ సమయం మాత్రం ఉంటుంది. అంటే 10.40 గంటల వరకు మినహాయింపు ఇస్తారు. జిల్లా ఆఫీస్ మాన్యువల్ మేరకు మూడు పర్యాయాలు అంతకంటే ఆలస్యంగా వస్తే ఒక సీఎల్‌గా పరిగణిస్తారు. తరచూ ఆలస్యంగా హాజరయ్యే వారిపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. -
బల్దియాలో బదిలీలు నై?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ విభాగాల్లో బదిలీలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీలోనూ బదిలీల పర్వం ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు పదిమంది మున్సిపల్ కమిషనర్లు, ఇతర త్రా విభాగాల్లో ఒకరో, ఇద్దరివో బదిలీలు మాత్రమే జరిగాయి తప్ప కీలక విభాగాల్లో ఉన్న వారివి జరగలేదు. వారితో పాటు సీనియర్లుగా ఎంతోకాలంగా ఇక్కడే పాతుకుపోయిన ఉన్నతస్థాయిల్లోని వారి బదిలీలూ జరగలేదు. వారిలో చాలా మంది తామిక్కడే ఉంటామని, తమనెవరూ కదల్చలేరని సన్నిహితుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం మున్సిపల్ శాఖలో తమ హోదాకు తగిన పోస్టులు రాష్ట్రంలో ఇతర కార్పొరేషన్లలో ఖాళీ లేనందున తమను ఎక్కడికీ పంపలేరని చెబుతున్నారు. రాష్ట్రంలోని పెద్ద కార్పొరేషన్లకు ఐఏఎస్ అధికారులు కమిషనర్లుగా ఉన్నందున, తమను ఎక్కడికీ ఎవరూ కదల్చలేరని భరోసాగా ఉన్నారు. అంతేకాదు బదిలీలు 40 శాతానికి మించి జరగరాదనే నిబంధనతోనూ అన్ని స్థాయిల పోస్టులను పరిగణనలోకి తీసుకొని తమను కదల్చలేరని పదేళ్లకుపైగా పని చేస్తున్నవారు సైతం నమ్మకంగా ఉన్నారు. వారే కాదు.. ఎంటమాలజీ వంటి విభాగాల్లోని వారిది సైతం అదే ధీమా. సీనియర్ ఎంటమాలజిస్టు పోస్టు లు రాష్ట్రంలో చాలా స్వల్పంగా మాత్రమే ఉన్నందున తాము ఇక్కడే ఉంటామని ధీమాగా ఉన్నారు. కదలరు అంతే.. జీహెచ్ఎంసీలో దాదాపు రెండేళ్లు పనిచేసినా చాలు ఎవరైనే సరే ఇక్కడినుంచి ఇంకెక్కడికీ కదలరు. అందుకు కారణం ఇక్కడ లభించే సదుపాయాలు, పై ఆదాయాలు ఇంకెక్కడా లభించవు. అందుకే పదోన్నతులను సైతం కాదనుకొని ఇక్కడే ఉంటున్నవారు. ఉండేందుకు ప్రయతి్నస్తున్న వారూ ఉన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో కమిషనర్ స్థాయి వారికి, క్షేత్రస్థాయి పర్యటనలు ఉండేవారికి మాత్రమే వాహన సదుపాయం ఉంటుంది. ఇక్కడైతే సూపరింటెండెంట్లకు, అంతకంటే దిగువ స్థాయి వారికి సైతం వాహన సదుపాయం ఉంటుంది. అంతేకాదు.. కార్యాలయం నుంచి కాలు బయట పెట్టని వారికి సైతం వాహన సదుపాయం ఉంటుంది. దాన్ని మరోలా వినియోగించుకొని నెలవారీ ఆదాయం పొందుతున్న వారూ తక్కువేం లేరు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా వివిధ వై¿ోగాలకు అవకాశం ఉన్నందున, వాటికి అలవడిన వారు ఇక్కడి నుంచి కదలడం లేదు. వచ్చేవారే.. వెళ్లేవారు లేరు ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యుటేషన్లపై బల్దియాకు వచ్చిన వారు సైతం ఇక్కడి నుంచి కదలనే కదలరు. డిప్యుటేషన్లు ముగిసినా, ఏళ్లకేళ్లుగా తిష్టవేసిన ఎందరో ఉన్నారు. యూసీడీ విభాగం నుంచి మొదలు పెడితే ఇలాంటి వారికీ లెక్కేలేదు. బదిలీల సమయంలో సైతం వారిని కదల్చలేకపోతున్నారంటే వారి ‘పవర్’ ఏమిటో అంచనా వేసుకోవచ్చు. మున్సిపల్ శాఖకు చెందిన వారు ఎందరో కొందరు బదిలీ అవుతున్నప్పటికీ, ఇతర విభాగాల వారు మాత్రం కావడం లేదంటే వారి హవా ఎంతో ఊహించుకోవచ్చు. ఏళ్లకేళ్లుగా.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ హోదాలో కొనసాగుతున్న వారు ఎందరో ఉన్నారు. వీరిలో ఇరవయ్యేళ్లకుపైగా ఇక్కడే ఉంటున్నవారు ఎందరో ఉన్నారు. అంతేకాదు.. 30 నుంచి 40 ఏళ్లుగా నగరంలోనే ఉంటున్నవారు కూడా ఉన్నారంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. సీనియర్లయిన తమను ఎక్కడకూ పంపలేరని భావిస్తున్న వారు ఇతర ప్రాంతాల్లో తమ హోదాకు తగ్గ పోస్టుల్లేవంటున్నారు. కానీ.. ఇతర విభాగాల నుంచి ఇక్కడికి డిప్యుటేషన్‌పై వస్తుండగా లేనిది మున్సిపల్ శాఖ నుంచి ఇతర విభాగాలకు ఎందుకు డిప్యుటేషన్లపై వెళ్లడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. అన్నింటికీ ఒకటే సమాధానం. సదుపాయాలు.. పై ఆదాయం. ప్రత్యేక చాంబర్లు. అందుకే వచ్చేవారు తప్ప వెళ్లేవారు కనబడటం లేదు. గతంలో ఇద్దరు ముగ్గురు అధికారులు మాత్రం అలా ఇతర విభాగాలకు వెళ్లారు. అలా మిగతా వారెందుకు వెళ్లరో వారితోపాటు ఉన్నతాధికారులకే తెలియాలి. బల్దియాకు భారం.. స్టాఫింగ్ ప్యాటర్న్‌పై ప్రసాదరావు కమిటీ సిఫార్సుల మేరకు జీహెచ్ఎంసీలో ఆరుగురు అడిషనల్ కమిషనర్లు మాత్రమే ఉండాలి. కానీ ప్రస్తుతం డజను మంది ఉన్నారు. గతంలో ఐదారుగురు అడిషనల్ కమిషనర్లు మాత్రమే అన్ని విభాగాలనూ నిర్వహించేవారు. ప్రస్తుతం అధికారులు పెరిగారు. పనులు తగ్గాయి. పనులు తగ్గినందున సమర్థంగా పని చేస్తున్నారా అంటే అదీ లేదు. ఎస్టేట్స్, అడ్వర్టయిజ్‌మెంట్స్, ట్రేడ్‌లైసెన్స్‌ల వంటి విభాగాల ద్వారా జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయంలో ఇరవై శాతం కూడా రావడం లేదంటే పరిస్థితిని అంచనా వేసుకోవవచ్చు. సీనియర్లు, పెద్ద హోదాల వల్ల వారి జీతభత్యాలు, సదుపాయాల కల్పనతో జీహెచ్ఎంసీకి ఆర్థిక భారం పెరుగుతోంది. అయినా.. మేమింతే. ఇక్కడే ఉంటామంటున్న వారిని ఎవరైనా కదల్చగలరా? వేచి చూడాల్సిందే! ప్రసాదరావు కమిటీ సిఫారసుల మేరకు సర్కిల్ కార్యాలయాలను 12 నుంచి 30కి పెంచారు. అయిదు జోన్లను ఆరుగా చేశారు. ప్రధాన కార్యాలయంలో 11 మంది అడిషనల్ కమిషనర్లను 6కు తగ్గించాలని సిఫారస్ చేస్తే ప్రస్తుతం డజను మంది ఉన్నారు. బదిలీలపై వచ్చేవారితో ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. టౌన్ న్‌ప్లానింగ్, రెవెన్యూ, హెల్త్, ఎస్టేట్స్, అడ్వర్టయిజ్‌మెంట్స్ తదితర విభాగాలను బలోపేతం చేయాల్సి ఉందని కమిటీ సూచించింది. కానీ మెరుగవలేదు. -
ఎన్నాళ్ల నుంచో ఇబ్బంది పడుతున్నాం.. హీరో రాజశేఖర్ ట్వీట్
రోజువారీ జీవితంలో అందరికీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. సామాన్యుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చూపిస్తుంటారేమో గానీ ప్రముఖుల విషయంలో మాత్రం కాస్త త్వరగానే పని పూర్తి చేస్తుంటారు. కానీ ఇప్పుడు తెలుగు హీరో, ప్రముఖ నటుడు రాజశేఖర్ మాత్రం తన అసహనాన్ని బయటపెడుతూ ట్వీట్ చేశారు. డ్రైనేజీ లీక్ సమస్య వల్ల ఎన్నాళ్ల నుంచో ఇబ్బంది పడుతున్నామని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి)హైదరాబాద్ ఫరిదిలోని జూబ్లీహిల్స్ రోడ్ నం.70లో అశ్విని హైట్స్ దగ్గర డ్రైనేజీ లీకేజీ సమస్య ఎన్నాళ్ల నుంచో తమని వేధిస్తోందని, జీహెచ్ఎంసీ అధికారులకు ఎప్పుడో ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇప్పటికీ పరిష్కారం కాలేదని రాజశేఖర్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారించాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. లీకేజీ ఎలా ఉందో తెలియజేసే ఓ ఫొటోని కూడా పోస్ట్ చేశారు.చివరగా 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే సినిమాలో నటించిన రాజశేఖర్.. కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. ఈయన కుమార్తెలు శివాత్మిక, శివాని మాత్రం పలు సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వీళ్లిద్దరి కెరీర్ ఓ మాదిరిగా సాగుతోంది.(ఇదీ చదవండి: మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా)There has been a drainage leak at Ashwini heights, Road no 70, Jubilee Hills, 500033 since ages. We have been speaking to @GHMCOnline to fix it, which hasn’t been done yet. Requesting @CommissionrGHMC @gadwalvijayainc @GHMCOnline to please, immediately look into it. pic.twitter.com/IXK8MrumZE— Dr.Rajasekhar (@ActorRajasekhar) July 29, 2024 -
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీకీ సీఎం ప్రత్యేక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరానికి మంగళవారం(జులై 16) సాయంత్రం వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్‌గా ఉండాలని ప్రత్యేకంగా ఆదేశించారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.భారీ వర్షం కురిసేటపుడు 141 లాగిన్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ఉండి వెంటనే నీళ్లు క్లియర్ చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలన్నారు. వర్షం కురిసినప్పుడు విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం.. జీహెచ్ఎంసీ మేయర్ కీలక సూచన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. మరో గంటసేపు కూడా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉండటంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు.కాగా, నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి.. నగరంలో మరో గంటసేపు కుండపోత వర్షం కురిసే అవకాశముందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. వర్షానికి సంబంధించి అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. Had a Tele conference with all the Zonal Commissioners and EVDM Team. Instructed @GHMCOnline officials to be on high alert with out causing any inconvenience to public. Heavy rains are expected to continue over the city for 1 hour and later reduce. Citizens are advised to stay… pic.twitter.com/8DBj5BrvYQ— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@gadwalvijayainc) July 14, 2024 ఇక, కూకట్పల్లి, మూసాపేట, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, బాచుపల్లి, ప్రగతి నగర్,హైదర్‌నగర్, మల్కాజిగిరి, కుషాయిగూడ, దమ్మాయిపేట, చర్లపల్లి, కీసర, నిజాంపేట, నేరేడ్మెట్, అమీర్‌పేట్, ఈఎస్ఐ, ఎర్రగడ్డ, సనత్‌నగర్, బోరబండ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షం నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. #Hyderabad #Hyderabadrains pic.twitter.com/FP9wh1CvGQ— Jagadish (@Jagadish_M) July 14, 2024 #Hyderabadrains!!Now scattered heavy rains going in sanathanagar areas super rains for next 30min with gusty winds 🌧️ pic.twitter.com/JvHbX3iqmV— Telangana state Weatherman (@tharun25_t) July 14, 2024 -
పిల్లల ప్రాణాలు పోతున్నాయ్.. హైకోర్టు సీరియస్
హైదరాబాద్, సాక్షి: వీధి కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారని, ఉదాసీనంగా వ్యవహరించే అధికారుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హెచ్చిరించింది. ఈ అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై (PIL) బుధవారం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బాగ్ అంబర్‌పేటలో ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయాడు. అయితే ఈ ఉదంతాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. జీహెచ్ఎంసీ పరిధిలో తరచూ వీధి కుక్కల దాడి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విక్రమాదిత్య అనే న్యాయవాది హైకోర్టులో పిల్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఇవాళ వీధి కుక్కల నియంత్రణ చర్యలపై నివేదిక ఇచ్చింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో కుక్కల నియంత్రలకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తన కౌంటర్లో పేర్కొంది. అయితే.. ప్రభుత్వం దృష్టిసారించాల్సిన ఖరీదైన కాలనీలపై కాదని.. మురికివాడలపై అని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు ప్రభుత్వం చూపించిన లెక్కలపైనా స్పందిస్తూ.. తమకు గణాంకాలు అక్కర్లేదని.. చర్యలు తీసుకుంటే చాలని సూచించింది. అయితే ఇందుకు సంబంధించిన రూల్స్ రూపొందించామని జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేయగా.. .. రూల్స్ ఎప్పుడూ ఉంటాయని, కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారని సీజే బెంచ్ వ్యాఖ్యానించింది. ఉదాసీనంగా వ్యవహరించే అధికారుల్ని వదిలిపెట్టమని హెచ్చరించిన ధర్మాసనం.. ఈ వ్యవహారాన్ని ఓ కేసుగా కాకుండా మానవీయ కోణంలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని అభిపప్రాయపడింది. వీధి కుక్కల నియంత్రణకు నిపుణుల కమిటీని వారంలోగా ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జులై 18వ తేదీకి వాయిదా వేసింది. -
టాలీవుడ్ హీరో హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు
జీహెచ్ఎంసీతో కలిసి రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లలో కొద్దిరోజులుగా తనిఖీలు జరుపుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే వందల సంఖ్యలో హెటల్స్ను పరిశీలించారు. పరిశుభ్రత, ఫుడ్ నాణ్యత లేని హోటల్స్‌కు జరిమానా విధించి నోటీసులు కూడా జారీ చేశారు.ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. హైదరాబాద్‌లో ‘వివాహ భోజనంబు’ పేరుతో చాలా ఏళ్ల క్రితమే భాగస్వామ్యంతో ఒక రెస్టారెంట్‌ను సందీప్ ప్రారంభిచారు. సికింద్రాబాద్ బ్రాంచ్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా నాసిరకం పదార్ధాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో హోటల్‌పై అధికారులు కేసు నమోదు చేశారు.హోటల్లో 2022 నాటికే గడువు ముగిసిన 25 కిలోల చిట్టి ముత్యాల రైస్ బ్యాగును గుర్తించినట్లుఅధికారులు తెలిపారు. సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన కొబ్బెరను కూడా వారు గుర్తించారు. ముందుగా తయారు చేసి ఉంచిన ఫుడ్ ఎక్స్పైరీ తేదీ లేకుండానే ఉంచారు. కిచెన్‌లో ఉన్న డస్ట్బిన్లకు ఎక్కడే కానీ మూతల లేవు. ఫుడ్ తయారు చేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ లేవు. వంట తయారీ కోసం వారు ఏ నీరు ఉపయోగిస్తున్నారో తెలిపే రికార్డ్ అందుబాటులో లేదు. వంటపాత్రలను క్లీన్ చేసిన నీరు కూడా అక్కడే నిల్వ ఉండటం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. 𝗩𝗶𝘃𝗮𝗵𝗮 𝗕𝗵𝗼𝗷𝗮𝗻𝗮𝗺𝗯𝘂, 𝗦𝗲𝗰𝘂𝗻𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱08.07.2024* FSSAI license true copy was displayed at the premises.* Chittimutyalu Rice (25kg) was found with Best Before date as 2022 and 500gms of Coconut Grates found with synthetic food colours. Stock has been… pic.twitter.com/yY5yWkknk1— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) July 10, 2024 -
అసభ్య పోస్టులపై జీహెచ్ఎంసీ మేయర్ ఫిర్యాదు
హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వీడియోలు పోస్ట్ చేశారని హైదారబాద్ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా వీడియోలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు, తనను ట్రోల్స్ చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు ఎక్కడెక్కడ వీడియోలు పోస్ట్ చేశారో అన్న వివరాలతో ఆమె పోలీసులకు దృష్టికి తీసుకువెళ్లారు. అసభ్యకర వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. మేయర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
లాస్య నందిత మృతిపై కౌన్సిల్ సంతాపం
-
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస
-
మరికాసేపట్లో జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం
-
బీజేపీ కార్పొరేటర్లపై ఎంఐఎం సభ్యుల దాడి.. జీహెచ్ఎంసీ నిరవధిక వాయిదా
Updates..👉గలాట మధ్య జీహెచ్ఎంసీ కౌన్సిల్ నిరవధిక వాయిదా.👉కౌన్సిల్లో కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్ల గొడవ.👉బీజేపీ కార్పొరేటర్లపై ఎంఐఎం కార్పొరేటర్ల దాడి. 👉అధికారులు భాధ్యత తీసుకోవడం లేదు: బీజేపీ కార్పొరేటర్లు అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు.డిపార్ట్మెంట్ హెచ్ఓడీ కౌన్సిల్‌కు రాకుండా కింది ర్యాంక్ అధికారులను పంపుతున్నారు.ఎన్ని సార్లు అధికారుల దృష్టికి సమస్యలు తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదు వాటర్ బోర్డు ఎండీ కౌన్సిల్ సమావేశానికి రాకపోవడంపై బీజేపీ ఆందోళన మేయర్ పోడియం వద్ద బీజేపీ నిరసన వచ్చే జనరల్ బాడి సమావేశానికి ఎండీ రావాలని మేయర్ ఆదేశం 👉ప్రాపర్టీ టాక్స్ టార్గెట్ పెంచాలని జీహెచ్ఎంసీ ఆలోచన👉జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న డ్రోన్ సర్వే👉రెండు వారాల్లో ఇంటింటి సర్వే స్టార్ట్ అవుతుంది: స్నేహ షేబరిష్👉రంగనాథ్ ఐపీఎస్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్👉వాటర్ లాగింగ్పై ఈవీడీఎం కసరత్తు చేసింది. సమస్యలు లేకుండా చూస్తాం👉హైడ్రా పరిధి జీహెచ్ఎంసీ నుంచి హెచ్ఎండీఏ వరకు పెంచనున్నారు👉డిజాస్టర్ రెస్పాన్స్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది👉ప్రజలు, ప్రజాప్రతినిధులు రాబోయే రోజుల్లో ఈవీడీఎం, హైడ్రాకు సహకరించాలి కౌన్సిల్ కాసేపు వాయిదా.. 👉మరోసారి మేయర్ పోడియం వద్దకు వచ్చిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు👉మేయర్ పోడియం వద్దకు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు👉బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసనకు కౌంటర్ నిరసన చేస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్లు👉మేయర్ పోడియం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన వల్ల మరోసారి సభ వాయిదా👉15 నిమిషాల పాటు వాయిదా వేసిన మేయర్.👉మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కామెంట్స్..ఇప్పుడు హైదరాబాద్‌లో చాలా సమస్యలు ఉన్నాయి.వర్షాకాలం కావడంతో సమస్యల పరిష్కారం కోసం ఫైట్ చేయాలి.ఇది రాజకీయాలు చేసే సమయం కాదు.నాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మేయర్ ఛాంబర్ ముందు ధర్నా చేయవచ్చు.సభలో ప్రజల సమస్యల కోసం మాట్లాడాలి.మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలి అనడం కరెక్ట్ కాదు.👉ఎన్నికల కోడ్‌కు ముందే రోడ్ల మరమ్మత్తుల కోసం బడ్జెట్ కేటాయింపు జరిగింది- బీఆర్ఎస్ కార్పొరేటర్లు👉నిధులు కేటాయింపు జరిగినా ఎందుకు విడుదల చేయలేదు అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ కావాలని అధికారులు అంటున్నారు.👉అధికారులు కార్పొరేటర్లను పట్టించుకోవడం లేదు.👉కౌన్సిల్ సమావేశానికి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా..👉కౌన్సిల్ భేటీకి డుమ్మా కొట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి👉కౌన్సిల్ భేటీకి కచ్చితంగా హాజరుకావాలని అధిష్ఠానం నుంచి ఎమ్మెల్యేలకు ఆదేశం👉అధిష్ఠానం ఆదేశించినా హాజరు కానీ ఎమ్మెల్యేలు👉కార్పొరేటర్ చనిపోతే ఆరు నెలల్లో ఎన్నికలు పెట్టాలి - బీజేపీ కార్పొరేటర్ నరసింహ రెడ్డి👉మన్సూరాబాద్ కార్పొరేటర్ మరణించి ఏడాది గడుస్తున్నా ఎన్నికలు జరపలేదు. 👉లాస్య నదింత మృతిపై కౌన్సిల్లో సంతాపం.👉లాస్య నందిత మరణం బాధాకరం.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు👉ఆమె అకాల మరాణానికి సంతాపం తెలియజేస్తున్నాం👉లాస్య నందిత మరణం ఎంతో బాధకలిగించింది: బీజేపీ కార్పొరేటర్లు👉సాయన్న కుతురుగా లాస్య నందిత మంచి పేరును ప్రజల్లో తెచ్చుకున్నారుజ👉లాస్య నందిత మరణం బాధాకరం: ఎంఐఎం కార్పొరేటర్లు👉ఆమె పనితిరుతో ప్రజల మెప్పు పొందారు.👉అభివృద్ధి చేయలేక.. చేతకాక మేయర్ పార్టీ మారింది: బీజేపీ ఎల్పీ లీడర్ శంకర్ యాదవ్👉మేయర్ పోడియం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళన👉మేయర్ కామెంట్స్.. 👉సంతాపం పెడదామని మేయర్ చెప్పినా వినిపించుకొని బీఆర్స్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు👉ఆరు నెలల నుంచి జీహెచ్ఎంసీలో ఏమైనా పనులు అయ్యాయా? -మేయర్.👉అభివృద్ధిపై సభలో చర్చ జరగాలి.👉అన్ని పార్టీల నేతలు చర్చకు సహకరించాలి.👉అభివృద్ధిపై మేయర్ వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు.👉అభివృద్ధి చేసేది మేయర్ కాదా అని ప్రశ్నించి బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన.👉కార్పొరేటర్లు మేయర్ చైర్‌కు మర్యాద ఇవ్వాలన్న మేయర్. 👉 కౌన్సిల్లో కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం. 👉 బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరుపై మేయర్ ఆగ్రహం. 👉మేయర్ పోడియం ముందుకు వెళ్ళిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు. 👉పార్టీల ఫిరాయింపులపై బీఆర్ఎస్ నాయకుల నిరసన👉ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీనే- మేయర్👉బీఆర్ఎస్ నేతలకు ఫిరాయింపులపై మాట్లాడే హక్కు లేదు - మేయర్👉అభివృద్ధిని అడ్డుకోవడమే బీఆర్ఎస్ టార్గెట్.👉బీఆర్ఎస్ నేతల వద్ద సబ్జెక్టు లేదు.👉జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్లో జామర్స్ పెట్టిన అధికారులు👉జీహెచ్ఎంసీ కౌన్సిల్ 15 నిమిషాల పాటు వాయిదా👉జీహెచ్ఎంసీ కౌన్సిల్ సహా బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం.. 👉బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ను నెట్టివేసిన ఎంఐఎం కార్పొరేటర్లు.👉రాజ్యాంగం బుక్ తో కౌన్సిల్లోకి వచ్చిన కాంగ్రెస్ కార్పొరేటర్ ఫస్టుద్దీన్.👉పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ రాజ్యాంగం బుక్ తో రావడం ఏంటని ప్రశ్నించిన బీజేపీ👉జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. 👉జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు బీజేపీ కార్పొరేటర్ల నిరసన.👉డ్రైనేజీ నగరం హైదరాబాద్ అంటూ నిరసన చేస్తున్న కార్పొరేటర్లు.👉నాలాల కూడికతీత, మాన్ హోల్స్ సేఫ్టీ ఏర్పాటు చేయాలని డిమాండ్.👉జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి సర్వం సిద్ధమైంది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. దాదాపు నాలుగున్నర నెలల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్ని పార్టీలకు సంబంధించి 23 ప్రశ్నలతో సుదీర్ఘంగా చర్చ సాగేలా సభ సన్నద్ధమైంది. అయితే, ఈ సభ ప్రత్యేకతను సంతరించుకున్నది. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.👉ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కావాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ మారిన మేయర్ రాజీనామా డిమాండ్, అభివృద్ధి, ఆరు గ్యారంటీల అమలు ఎజెండాగా బీఆర్ఎస్ ముక్త కంఠంతో ప్రశ్నించేందుకు సిద్ధమైంది.అధికార పార్టీ కంటే బలంగా ఉన్న ప్రతిపక్షాలు..👉గడిచిన కొన్ని నెలలుగా జంపింగ్ జపాంగ్‌లు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో నేటికీ బీఆర్ఎస్ మాత్రమే బలంగా ఉంది. 150 మంది కార్పొరేటర్లలో ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా కాగా, మరో ఇద్దరు ఎర్రగడ్డ, గుడిమల్కాపూర్ కార్పొరేటర్లు చనిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్లు 47 మందితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఇక ఎంఐఎం 41, బీజేపీ 39, కాంగ్రెస్ 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. -
‘హైడ్రా’
విపత్తుల నిర్వహణకుచారిత్రక నిర్మాణాల పునరుద్ధరణసిటీలోని చారిత్రక ప్రాధాన్యమున్న కట్టడాలు, శిథిలమైన నిర్మాణాలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సిటీ లైబ్రరీ, చార్మినార్ సమీపంలోని ఆయుర్వేద హాస్పిటల్, నిజామిమా అబ్జర్వేటరీ, గుడిమల్కాపూర్ కోనేరు లాంటి వివిధ చారిత్రక ప్రదేశాలపై జీహెచ్ఎంసీ ప్రదర్శించిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ను చూసిన సీఎం వాటిని పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు ఉన్న వివిధ మార్గాలను అన్వేషించాలని సూచించారు. వీటిలో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అనుసంధానం చేసేందుకు వీలైన వాటిని గుర్తించి, అందులోనే కలపాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జీహెచ్ఎంసీ విజిలెన్స్ విపత్తు నిర్వహణ కమిషనర్ ఏవీ రంగనాథ్, హైదరాబాద్ వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగానికి అత్యంత కీలక బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అందుకు అనుగుణంగా వ్యవస్థాగత మార్పులతో పాటు, బాధ్యతల పంపిణీ జరగాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండీఏ, మూసీ డెవలప్మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ భౌగోళిక పరిధిని విస్తరించనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని కూడా ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు ఈ విభాగం సేవలు అందించేందుకు అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. ఇకపై ఈ విభాగాన్ని ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా)’ అని పేరు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. డీఐజీ స్థాయి అధికారి ఈ విభాగానికి డైరెక్టర్‌గా, ఎస్పీ స్థాయి అధికారులు అడిషనల్ డైరైక్టర్లుగా ఉండేలా చూడాలని చెప్పారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, సిటీ ట్రాఫిక్, వివిధ విభాగాల నుంచి ప్రత్యేక టీంలు ఈ విభాగంలో నియమించాలని సూచించారు. కేవలం వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా ఇకపై విపత్తుల నిర్వహణ విభాగం సిటీ ప్రజలకు నిరంతరం సేవలందించేలా పునర్వవస్థీకరణ జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నింటిలో ‘హైడ్రా’ క్రియాశీలంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు రెండువేల కిలోమీటర్ల మేర ఉన్న చెరువులు, కుంటలను పరిరక్షించటం, సిటీలోని నాలాలు, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురవకుండా కాపాడే కీలక బాధ్యతలను ఈ విభాగమే చేపట్టాలని నిర్ణయించారు. దీంతో పాటు హోర్డింగులు, ఫ్లెక్సీల నియంత్రణ, తాగునీటి పైపులైన్లు, విద్యుత్తు సరఫరా లైన్లు, డ్రైనేజీలు, వరద నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వ్యవహారాలన్నింటిలోనూ ఈ విభాగం సేవలందిస్తుంది. అందుకు వీలుగా ఈ విభాగం పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది, విధులు, నిధుల కేటాయింపు, బాధ్యతలపై ముసాయిదా సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. ఎంఆర్‌డీపీ పనులు, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎంఆర్‌డీపీ) పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ సిటీకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేలా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, సిటీ ట్రాఫిక్ విభాగాల నుంచి స్పెషల్ టీమ్స్ శివార్లలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల వరకు సేవలు విపత్తులప్పుడే కాకుండా నిరంతర సేవలు..నాలాలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ హోర్డింగులు, తాగునీరు, విద్యుత్తు సరఫరా లైన్లు, డ్రైనేజీలు తదితర అంశాల్లోనూ సేవలు సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి -
మారనున్న సభా దృశ్యం
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో వివిధ పనుల మంజూరు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకునే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం, అన్ని అంశాలపై చర్చలు జరిపే సర్వసభ్య సమావేశం..రెండూ కూడా ఈ వారంలోనే జరగనున్నాయి. ప్రతివారం జరగాల్సిన స్టాండింగ్ కమిటీ, మూడు నెలలకోమారు జరగాల్సిన సర్వసభ్య సమావేశాలు ఎన్నికల కోడ్ కారణంగా నిర్వహించలేదు. కోడ్ ముగిసిపోగానే జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న రోనాల్డ్‌రాస్ రెండు వారాల సెలవుతో విదేశీ పర్యటనకు వెళ్లారు. స్టాండింగ్ కమిటీ సమావేశం ప్రతి వారం జరిగేదే కాగా, సర్వసభ్య సమావేశానికి కమిషనర్ నిర్ణయం అవసరం. దాంతో ఎన్నికల కోడ్ జూన్ మొదటి వారంలోనే ముగిసినా సమావేశ తేదీని నిర్ణయించలేదు. రోనాల్డ్‌రాస్ సెలవు నుంచి వచ్చిన రోజే ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా ఆయన జీహెచ్ఎంసీ నుంచి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆమ్రపాలి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రతివారం యథావిధిగా జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశం ఈనెల 4వ తేదీన జరగనుండగా, 6వ తేదీన సర్వసభ్య సమావేశం జరగనుంది. మేయర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ.. ఈసారి సర్వసభ్య సమావేశంలో పార్టీల బలాబలాలు మారనున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు కేవలం రెండు కార్పొరేటర్ సీట్లు మాత్రం గెలిచిన కాంగ్రెస్ బలం ప్రస్తుతం ఇరవైకి చేరువగా ఉంది. అంతేకాదు..గత సర్వసభ్య సమావేశం వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరారు. గత సమావేశం వరకు బీఆర్ఎస్ మేయర్‌గా వ్యవహరించిన ఆమె జరగబోయే సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నేతగా వ్యవహరించనున్నారు. మేయర్ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ, ఆ పార్టీ సభ్యులు మాత్రం బీఆర్ఎస్, ఎంఐఎంల కంటే తక్కువే ఉన్నారు. దీంతో సర్వసభ్య సమావేశంలో విచిత్ర సన్నివేశాలు ఆవిష్కృతమయ్యే అవకాశముంది. మొన్నటి వరకు నగరంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు.. జరగబోయే సమావేశంలో పనులు జరగడం లేదని, ప్రజలు సమస్యలతో అల్లాడుతున్నారని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టనున్నారు. అలాగే గతంలో సమస్యలపై తీవ్ర ఆందోళనలు, నిరసనలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అందుకు భిన్నంగా వ్యవహరించనుంది. ఇక, బీజేపీ, ఎంఐఎంలు ఎప్పటిలాగే తమ వైఖరిని ప్రదర్శించనున్నాయి. -
Hyderabad: కీలకమైన మూడు పోస్టుల్లో కొత్త బాస్‌లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు ముఖ్య విభాగాలైన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డుల్లో ఉన్న బాస్‌లు మారారు. వారిస్థానే కొత్త బాస్‌లను నియమించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రేటర్ పరిధిలో భారీ స్థాయిలో అధికారుల బదిలీలు జరగడం ఇదే ప్రథమం. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ ఆయా విభాగాల చీఫ్‌లు మారతారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటిదాకా జరగలేదు. తాజాగా జరిగిన ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా నగరంలోని ముగ్గురు చీఫ్‌లతో పాటు మరికొందరు అధికారులను కూడా బదిలీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత బీఆర్ఎస్ హయాంలో కీలకశాఖల్లో ఉన్నవారిని వెంటనే మారుస్తారనుకున్నప్పటికీ, రాజకీయ పరిణామాలు, లోక్‌సభ ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో పూర్తిస్థాయిలో బదిలీలు జరగలేదు. పాలనలో, అభివృద్ధిలో తమదైన మార్కు చూపించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వాటిని అమలు చేయడం, నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు ఆయా సంస్థల్లో ప్రక్షాళనలో భాగంగా ఈ బదిలీలు జరిగినట్లు భావిస్తున్నారు. ప్రజా సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా.. నగరానికి సంబంధించినంత వరకు ఓఆర్ఆర్ వరకు యూనిట్‌గా పనులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఓఆర్ఆర్ వరకున్న శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయడం..ఒకటే పెద్ద కార్పొరేషన్ లేదా మూడు నాలుగు కార్పొరేషన్లుగా చేసే ఆలోచనలున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీయేల్లో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి భారీ అవినీతి జరిగిందనే అభిప్రాయాలున్నాయి. వాటిపై ఉన్న ఆ ముద్రను తొలగించడంతోపాటు పౌరులకు సకాలంలో సేవలు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ‘వైబ్రెంట్ హైదరాబాద్’ కోసం మెగా మాస్టర్‌ప్లాన్–2050తో ఆయా పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో ఆరి్థకాభివృద్ధితోపాటు మొబిలిటీ, బ్లూ, గ్రీన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ కీలకంగా ఉన్నాయి. ఓవైపు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు మరోవైపు పెరుగుతున్న జనావాసాలన్నింటికీ సురక్షిత నీరు, వందశాతం మురుగుజలాల శుద్ధి కోసం ఎస్టీపీల పనులు జరుగుతున్నాయి. ఓఆర్ఆర్ వరకు ఎలాంటి విపత్తులు జరిగినా వెంటనే ఆదుకునేలా ఉండేందుకు విపత్తు నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగానే ఈవీడీఎం విభాగంలోని డీఆర్ఎఫ్ టీమ్‌లను పెంచుతున్నారు. ఏడాది గడవకుండానే బదిలీ అయిన రోనాల్డ్‌రాస్ 👉 గత జూలై 5వ తేదీన జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రోనాల్డ్‌రాస్‌ను ఇంధనశాఖ సెక్రటరీగా బదిలీ చేశారు. 👉 జీహెచ్ఎంసీ కమిషనర్‌గా హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్)ఎండీ ఆమ్రపాలికి పూర్తిస్థా యి బాధ్యతలప్పగించారు. 👉 హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఈసీలో జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించారు. 👉 çహార్టికల్చర్ డైరెక్టర్ కె.అశోక్‌రెడ్డిని వాటర్‌బోర్డు ఎండీగా నియమించారు. 👉 మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్కు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం..కొత్తగా జాయింట్ ఎండీ పోస్టును సృష్టించి రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ పి.గౌతమిని నియమించింది. నాలుగు జోన్లకు కొత్త కమిషనర్లు.. జీహెచ్ఎంసీ జోన్ల ప్రక్షాళనే లక్ష్యంగా నాలుగు జోన్లలో కొత్త జోనల్ కమిషనర్లను నియమించారు. ఇటీవల ఖాళీ అయిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా అనురాగ్ జయంతిని, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా హైదరాబాద్ అడిషనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ను, కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా జోగులాంబ గద్వాల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్‌ను నియమించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్‌గా ఉన్న పి.ఉపేందర్‌రెడ్డిని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా నియమించారు. జోన్లలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ బదిలీలతో మొత్తం ఆరు జోన్లకు గాను మూడు జోన్లలో ఐఏఎస్ అధికారులున్నారు. ఇప్పటి వరకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌తో పాటు రెవెన్యూ, ఐటీ విభాగాల అడిషనల్ కమిషనర్‌గా ఉన్న స్నేహశబరీ ను జడ్సీ పోస్టు నుంచి బదిలీ చేశారు. ఈవీడీఎం ౖడైరెక్టర్‌గా రంగనాథ్ భారీ వర్షాలు, అగి్నప్రమాదాలు వంటి ఘటనలు జరిగినప్పుడు ఎదురవుతున్న విపత్తులను ఎదుర్కొనేందుకు తక్షణ స్పందనతో పనిచేస్తున్న ఈవీడీఎం డైరెక్టర్‌గా ఉన్న ప్రకాశ్‌రెడ్డిని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా బదిలీ చేసి, ఆయన స్థానంలో ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ను నియమించారు. డిప్యూటీ కలెక్టర్లు రిలీవ్ ఎన్నికల సందర్భంగా జీహెచ్ఎంసీకి వచి్చన డిప్యూటీ కలెక్టర్లలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు కె. శివకుమార్, డి. శ్రీధర్, ఎన్. విజయలక్షి్మలను ఐఏఎస్‌ల బదిలీ ఉత్తర్వులకు ముందే జీహెచ్ఎంసీ నుంచి రిలీవ్ చేశారు. వీరిలో శివకుమార్ సంతోష్ నగర్ సర్కిల్ డీసీగా పనిచేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు కూడా ముగిసినందున వీరికి పెద్దగా పనులేమీ లేకపోవడంతో రిలీవ్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్టైలే వేరు.. కీలకమైన శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా పి.ఉపేందర్‌రెడ్డిని నియమించడం జీహెచ్ఎంసీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆయన పనితీరు, ట్రాక్ రికార్డు ఆధారంగానే ప్రభుత్వం ఆయనను శేరిలింగంపల్లి జడ్సీగా నియమించినట్లు తెలుస్తోంది. గతంలో ఎల్బీనగర్ జడ్సీగా, బోడుప్పల్ కమిషనర్‌గా పనిచేసినప్పుడు ఆయన పలు అవార్డులు, రివార్డులు పొందారు. బోడుప్పల్లో పచ్చదనం పెంపు కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల నగదు రివార్డుఅందజేసింది. బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్లో ఆయన చేసిన పారిశుధ్య కార్యక్రమాలు చూసే అప్పటి మేయర్ బొంంతు రామ్మోహన్ ఆయన్ను జీహెచ్ఎంసీకి రప్పించారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా ఉన్నప్పుడు అక్కడ వరదనివారణకు ఆయన రూపొందించిన ప్రాజెక్టు రిపోర్టుతోనే నగరమంతటికీ ఆ విధానాన్ని వర్తింపచేస్తూ ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం)కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.టాస్‌్కఫోర్స్ డీసీపీగా సుదీంద్ర ప్రస్తుతం ఏసీబీలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నగర పోలీసు విభాగానికి గుండెకాయ వంటి హైదరాబాద్ కమిషనర్స్ టాస్‌్కఫోర్స్ డీసీపీగా నాన్–క్యాడర్ ఎస్పీ స్థాయి అధికారి వైవీఎస్ సుదీంద్రను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సుదీంద్ర అవినీతి నిరోధక శాఖలో (ఏసీబీ) జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌కే చెందిన ఈయన బంజారాహిల్స్‌లోని ముఫకంజా కాలేజీ నుంచి ఇంజినీరింగ్ పట్టా పొందారు. 2012లో గ్రూప్–1 ద్వారా డీఎస్పీగా ఎంపికై పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. సుదీంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ముగ్గురు మహిళా అధికారుల తర్వాత.. గడిచిన తొమ్మిది నెలల కాలంలో టాస్‌్కఫోర్స్‌కు ముగ్గురు మహిళా అధికారులు నేతృత్వం వహించారు. సుదీర్ఘకాలం టాస్‌్కఫోర్స్ డీసీపీగా పని చేసిన పి.రాధాకిషన్‌రావును గత ఏడాది అక్టోబర్‌లో ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అప్పట్లో తొలి మహిళా డీసీపీగా ఐపీఎస్ అధికారి నిఖిత పంత్ నియమితులయ్యారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి, కొత్త సర్కారు కొలువు తీరిన తర్వాత గత ఏడాది డిసెంబర్లో తొలిసారిగా పోలీసు బదిలీలు జరిగాయి. ఆ నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీగా నిఖిత పంత్ స్థానంలో నాన్–క్యాడర్ ఎస్పీగా ఉన్న శ్రీ బాల దేవి నియమితులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈమెను బదిలీ చేసిన ప్రభుత్వం సాధన రష్మి పెరుమాల్‌ను నియమించారు. ఇటీవల జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ఈమె హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా వెళ్లారు. -
GHMCలో వెలుగు చూసిన భారీ స్కామ్
-
జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ( జీహెచ్ఎంసీ) ఇన్చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ మూడు రోజుల పాటు లీవ్‌లో వెళుతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. -
Hyderabad: బయటి ఫుడ్ అంటే భయపడుతున్న భోజన ప్రియులు!
వారాంతపు రోజుల్లో..నగరంలోని కొన్ని రెస్టారెంట్లలో సీట్ దొరకాలంటే కనీసం గంట నుంచి 2 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే అంతటి రద్దీ ఇప్పుడు లేదు. వేళా పాళా లేకుండా ఐస్‌క్రీములూ, పేస్త్రీలూ లాగించే నగర యువత తమ అలవాటును కొనసాగించడానికి జంకుతున్నారు. నగరవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అధికారులు రెస్టారెంట్లపై నిర్వహిస్తున్న దాడుల్లో బయటపడుతున్న విషయాలే దీనికి కారణం. సాక్షి హైదరాబాద్: పేరుగొప్ప రెస్టారెంట్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు, సూపర్ మార్కెట్లు...ఒకటేమిటి? కాదేదీ కల్తీ కనర్హం కాదేదీ ఆరోగ్య కారకం..అన్నట్టుగా నగరంలో పరిస్థితి దిగజారిందని తాజాగా అధికారుల దాడుల్లో వెల్లడైంది. నగరంలో ఫుడ్ లవర్స్‌కి ఫేవరెట్ బిర్యానీ సెంటర్లు, బ్రాండెడ్ ఐస్‌క్రీమ్ పార్లర్లు సైతం ప్రమాణాలు పాటించడంలో దారుణంగా వెనుకబడి ఉన్నాయని తేలింది. సోషల్ మీడియాలో హల్చల్... ఈ దాడులలో వెల్లడైన ఆహార వ్యాపారుల నిర్వాకాలు అటు ప్రధాన మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి. మరోవైపు సోషల్ మీడియాలో కల్తీ ఉత్పత్తులు, నిల్వ ఆహారపదార్ధాల కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడం సిటిజనులపై తీవ్ర ప్రభావాన్ని చూపి ంచింది. అదే సమయంలో లక్డీకాపూల్‌లోని ద్వారకా హోటల్లో క్యారెట్ హల్వా తిన్న కస్టమర్ తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడని వార్తలు సంచలనం సృష్టించాయి. ఒకదానికి ఒకటి తోడైనట్టుగా జరిగిన పరిణామాలతో సిటీలోని ఫుడ్ బిజినెస్ ఢమాల్ అయింది. 25 నుంచి 35 శాతం పడిపోయిన వ్యాపారం... ప్రస్తుతం బయటి ఆహారం అంటేనే నగర వాసుల్లో భయం ఏర్పడిందని, దీనికి గత 3 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలే కారణమని జూబ్లీహిల్స్‌లోని ఓ రెస్టారెంట్ యజమాని అంగీకరించారు. తమ రెగ్యులర్ గెస్ట్స్ సంఖ్యలో భారీగా తేడా వచి్చందనీ, వచ్చినవారు కూడా..ఫుడ్ ఆర్డర్ చేస్తూనే సందేహాస్పదంగా చూస్తున్నారని, తరచి తరచి అడుగుతున్నారని ఆయన చెప్పారు. నగరవ్యాప్తంగా ఈ పరిస్థితుల వల్ల కనీసం 25 నుంచి 35 శాతం వరకూ ఫుడ్ బిజినెస్ దెబ్బతిన్నదని రెస్టారెంట్ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు. కొందరు చేసిన తప్పుకి ఎందరో బలవుతున్నారని వీరు వాపోతున్నారు. మరోవైపు స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ డెలివరీ యాప్స్‌కు వచ్చే ఆర్డర్లు సైతం గణనీయంగా తగ్గుముఖం పట్టినట్టు కొందరు డెలివరీ బాయ్స్ చెప్పారు. కొనసాగుతున్న దాడులు...వెల్లడవుతున్న నిర్వాకాలు... మరోవైపు జీహెచ్ఎంసీతో కలిసి రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం కూడా రెస్టారెంట్లపై తమ దాడులు కొనసాగించారు. మసాబ్ ట్యాంక్‌లోని ప్యారడైజ్ బిర్యానీ సెంటర్, అస్లీ హైదరాబాదీ ఖానాలో నిర్వహించిన దాడుల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్, నిల్వ ఆహారాన్ని గుర్తించారు. కీటకాలు రాకుండా వంటగది కిటికీలకు మెష్ సైతం ఏర్పాటు చేయలేదని, పెస్ట్ కంట్రోల్ రికార్డ్స్ లేవు తదితర ఉల్లంఘనలు తేల్చారు. అలాగే ప్యారడైజ్ బిర్యానీ సెంటర్లో ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్‌లో సరైన ప్రమాణాలు లేవని గుర్తించారు. గత 4 రోజులుగా సాగుతున్న దాడుల్లో 100కిపైగా రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ జాయింట్స్, ఫుడ్ సప్లై యాప్స్..వంటివి తనిఖీలు చేసి దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగు చూశాయి. ఇదే ప్రస్తుతం నగరవాసుల్లో బయటి తిండి అంటే భయపడేట్టుగా చేసింది. -
కిషన్ లీలలెన్నో..!
కుత్బుల్లాపూర్: పారిశుద్ధ్య విభాగం మహిళా కార్మికుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరికిన శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ వ్యవహార శైలి ఆది నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గతంలో ఆర్టీసీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా కండక్టర్ విధులు నిర్వర్తిస్తూ డబ్బులు కాజేయడంతో సర్వీసు నుంచి ఇతడిని తొలగించినట్లు తెలిసింది. రాజు కాలనీలో నివాసముండే కిషన్ కూకట్పల్లి ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తూ అక్కడి నుంచి అయిదేళ్ల క్రితం గాజులరామారం సర్కిల్‌కు బదిలీపై వచ్చి సూరారం కాలనీలో ఉంటున్నాడు. కాగా.. మహిళా కారి్మకులతో కిషన్ రాసలీలలు బయటపడడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అతడిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కిషన్‌తో పాటు రాసలీలల వీడియోను వైరల్ చేసిన పారిశుద్ధ్య కార్మికుడు ప్రణయ్‌ని సైతం సస్పెండ్ చేయాలని కూకట్పల్లి జడ్సీ అభిలాష అభినవ్‌కు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మూడు నెలల కిందటే వెలుగులోకి వచ్చినా.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వాటిని సెల్ఫోన్లో బంధించి మహిళలను లోబరుచుకునేవాడు. తనకు అనుకూలంగా ఉండే మహిళలతో ఒకలా.. లేనివారితో మరోలా వ్యవహరిస్తూ వచ్చేవాడని.. మొత్తం మూడు యూనిట్ల బాధ్యతలు నిర్వహిస్తూ 21 మంది పారిశుద్ధ్య కారి్మకుల హాజరు వేసే విషయంలో సైతం చేతివాటం ప్రదర్శించేవాడని ఆరోపణలున్నాయి. ఆయా అంశాలు మూడు నెలల క్రితమే షాపూర్‌నగర్ యూనిట్లో వెలుగులోకి వచి్చనా అధికారులు మాత్రం చర్యలు తీసుకోకుండా సూరారం ప్రాంతానికి బదిలీ చేసి చేతులు దులుపుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఎదుట వివరణ.. 👉 గ్రేటర్ పరిధిలో మహిళలపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ (ఐసీసీ) గతంలో ఏర్పాటు అయ్యింది. గురువారం వెలుగు చూసిన శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ వ్యవహార శైలిపై ఐసీసీ కమిటీ ముందు అదే రోజు రాత్రి 11 గంటల వరకు విచారణ చేశారు. ఉప కమిషనర్ మల్లారెడ్డి, వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్ రెడ్డితో పాటు కిషన్ సైతం హాజరయ్యారు. గతంలో బయోమెట్రిక్ మిషన్ ఎక్కడో పోగా.. పారిశుద్ధ్య కారి్మకులు పోగొట్టారని వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు కమిటీ ముందు స్పష్టం చేశారు. 👉 తన రాసలీలల వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులకు విషయం చెప్పిన కిషన్.. అది వైరల్ చేసే క్రమంలో మొత్తం 14 మందికి డబ్బులు ఇచ్చినట్లు తేలింది. వీడియో పలు గ్రూపుల వారీగా చక్కర్లు కొట్టడంతో వాటిని ఇతరులకు పంపకుండా 14 మందికి రూ. వేయి మొదలుకొని రూ.10 వేల వరకు ముట్ట చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరికొంత మంది బెదిరింపులు చేయడంతో కిషన్.. ఈ నెల 17న ఉప కమిషనర్ మల్లారెడ్డి, వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్‌రెడ్డికి విషయాన్ని చెప్పుకోవడంతో అతడిని విధుల నుంచి తప్పించారు. వీడియోల లీక్‌పై ఆరా.. గురువారం పలు సామాజిక మాధ్యమాల్లో కిషన్ వీడియోలు చక్కర్లు కొట్టడంతో అధికారులు అవాక్కయ్యారు. ఇవి ఎలా లీక్ అయ్యాయి అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఫార్వర్డ్ చేస్తున్న వారిపై సైతం కేసులు నమోదు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. కాళ్లు మొక్కి.. కవర్ చేసి.. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ తాను తీసుకున్న గోతిలో తానే పడడంతో.. వీడియో వైరల్ చేసిన ప్రతి ఒక్కరి కాళ్లు మొక్కుతూ కవర్ చేస్తూ వచ్చాడు.. కొంతమంది బెదిరించి డబ్బులు వసూలు చేయగా.. మరి కొంతమంది వదిలేశారు.. ఇలా మూడు నెలల పాటు ముప్పతిప్పలు పెట్టిన పలువురు కార్మికులు, తోటి శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎట్టకేలకు వీడియోను బయటకు పంపడంతో విషయం వెలుగులోకి వచి్చంది. శుభకార్యానికి వెళ్లి సాయి అనే కారి్మకునికి ఫోన్ ఇవ్వడం.. ప్రణయ్ అనే మరో కార్మికుడు ఈ వీడియోలను పలువురికి వైరల్ చేయడం.. ఆ తర్వాత మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కిషన్ కామలీలలు బయటపడడంతో ఆయనపై ఉన్నతాధికారులు వేటు వేయడం చకచకా జరిగిపోయాయి. -
తళుకుల మాటున కల్తీమాయ!
ఎవరైనా ఆహారం ఎందుకు తింటారు? బతకడానికి. ఆరోగ్యంగా జీవించడానికి. కానీ.. గ్రేటర్ నగరంలోని హోటళ్లలో తింటే ‘ఆహారంతోనే రోగం’ అన్నట్లుగా ఉంది పరిస్థితి. హోటళ్లతో పాటు బేకరీలు, రెస్టారెంట్లు, బార్లు, ఐస్‌పార్లర్లు అన్నింటా ఇదే దుస్థితి. ముడిసరుకుల నుంచి తినుబండారాల దాకా, ఫుట్ఫాత్ బండ్ల నుంచి స్టార్‌హోటళ్ల దాకా ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా కల్తీ జరుగుతోంది. దాదాపు గత 40 రోజులుగా అధికారుల తనిఖీల్లో కల్తీ.. శుభ్రత, నాణ్యతల లేమి బట్టబయలవుతున్నాయి. ఇప్పటి దాకా భారీ పెనాలీ్టలు, మూసివేతలు, తగిన శిక్షలు అమలు కాకపోవడం అందుకు ఓ కారణం కాగా, లంచాలకు మరిగిన అధికారులపై చర్యలు లేకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. నగరంలోని హోటళ్లలో లభించే ఆహార పదార్థాల్లో కల్తీకేదీ కాదు అనర్హం అన్న చందంగా మారింది. ఏ హోటల్ చూసినా ఏమున్నది గర్వకారణం.. అడుగడుగునా ఆహారం నకిలీమయం అన్నట్లు.. గ్రేటర్‌లోని హోటళ్లలో కల్తీ పదార్థాలపై ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. వీటిలో కల్తీ ఎక్కువ.. కల్తీ ఎక్కువగా జరిగేందుకు ఆస్కారమున్న వాటిలో టీ పొడి నుంచి నూనెల దాకా ఎన్నో ఉన్నాయి. పాలు, తేనె, మసాలా దినుసులు, ఐస్‌క్రీమ్స్, తృణధాన్యాలు, పిండి, కాఫీ, టొమాటో సాస్, వెజిటబుల్ ఆయిల్స్, నెయ్యి తదితరమైనవి. వీటిలోని కల్తీ వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు. మసాలా దినుసుల్లోని గసగసాలు, దాలి్చనచెక్క, లవంగాలు, యాలకులు వంటి వాటిలో 20 శాతం అసలువి కాగా 80 శాతం కల్తీవి కలుపుతారని సమాచారం. వీటితో పాటు జంతు కళేబరాలు, కొవ్వు, ఎముకల నుంచి తయారు చేస్తున్న కల్తీనూనె నగరంలో వినియోగంలో ఉంది.కల్తీ ఇలా.. మచ్చుకు..– తేనె పేరిట గ్లూకోజ్‌వాటర్‌లో పంచదార పాకం, వార్నిష్, డ్రైఫ్రూట్స్ మిశ్రమం కలిపి విక్రయిస్తున్నారు. రంగుల తయారీలో వాడే యాసిడ్లు, హానికర రసాయనాలతో సోంపు తయారు చేస్తున్నారు. రంగుల పరిశ్రమల్లో వాడే సల్ఫ్యూరిక్ యాసిడ్, వార్నిష్, కుళ్లిన ఆలుగడ్డలతో వెల్లుల్లి పేస్ట్.– ఓల్డ్‌సిటీలోని చావ్‌నీబస్తీలోని గోదాముల్లో జంతు కళేబరాల నుంచి నూనె తయారీని గతంలో గుర్తించారు. ఉప్పుగూడ, బహదూర్‌పురా, ఘాన్సీబజార్, బాలానగర్, మియాపూర్ ,మైలార్‌దేవ్‌పల్లి, టాటానగర్ , మల్లాపూర్, జల్పల్లి, శంకర్‌నగర్ తదితర ప్రాంతాల్లో కల్తీ జరుగుతుండటాన్ని గుర్తించినా పూర్తిగా నిలువరించలేకపోయారు.నిబంధనలకు నీళ్లు.. – ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ (ఎఫ్ఎస్ఎస్ఏ)మేరకు, అన్ని ఆహార విక్రయ కేంద్రాలు, ఉత్పత్తి కేంద్రాలు, వాటి లైసెన్సుల వివరాలు జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ఆన్లైన్లో అందుబాటులో ఉండాల్సి ఉండగా అమలు కావడం లేదు. తనిఖీలు జరిపి కల్తీని బట్టి చర్యలు తీసుకోవాలి. ఆహార పదార్థాల ఉత్పత్తి స్థానం నుంచి ప్యాకింగ్, రవాణా, విక్రయం, వినియోగం వరకు ఎక్కడా కల్తీ జరగకుండా ఉండాలంటే తగిన ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండాలి.కల్తీని వెంటనే నిర్ధారించేందుకు తగినన్ని పరీక్షల కేంద్రాలుండాలి కానీ ఏదీ లేదు.కాగితాల్లోనే యాప్.. – హోటళ్లలో పరిశుభ్రత నుంచి అన్నీ సవ్యంగా ఉండాలని, లేని పక్షంలో ఆటోమేటిక్‌గానే వేటికి ఎంత జరిమానానో పేర్కొంటూ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెస్తామన్న మాటలు కార్యరూపం దాల్చలేదు. స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల నుంచి ఆన్లైన్ ఆర్డర్లపై, క్లౌడ్ కిచెన్లు, హోటళ్ల టేక్అవే విండోల ద్వారా తీసుకుంటున్న ఆహారాల్లోనూ కల్తీపై పలు ఫిర్యాదులందుతున్నాయి. – ప్రతి హోటల్లోనూ ట్రేడ్ లైసెన్సు ఫుడ్ లైసెన్సు సర్టిఫికెట్లు కనిపించేలా ఉంచడంతో పాటు స్వచ్ఛమైన తాగునీరు ఉచితంగా సరఫరా చేయాలి. దాంతోపాటు వివిధ నిబంధనలున్నాయి. వాటిని పాటించకపోతే జీహెచ్ఎంసీ యాక్ట్ మేరకు జరిమానాలు విధించాలి.పకడ్బందీగా అమలు కాని పెనాల్టీలు.. తయారీకి సిద్ధం చేసిన, తయారైన ఆహార పదార్థాలపై దుమ్మూ ధూళి ఉన్నా, కిచెన్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు లేకపోయినా, కిచెన్ శుభ్రంగా లేకున్నా, సిబ్బంది చేతులకు గ్లౌజులు, తలకు టోపీ ధరించకున్నా, ఉద్యోగులకు నిరీ్ణత వ్యవధుల్లో హెల్త్ చెకప్‌లు చేయించకున్నా, అపరిశుభ్రత, పగిలిన పాత్రలు వినియోగించినా రూ. 500 నుంచి పెనాలీ్టలున్నాయి. కానీ పకడ్బందీగా అమలు కావడం లేదు.పేరు గొప్ప.. తీరు దయనీయం..దాదాపుగా 40 రోజులుగా జరుగుతున్న తనిఖీల్లో ఉల్లంఘనలు గుర్తించిన వాటిల్లో చిన్న వాటి నుంచి పెద్ద సంస్థల వరకున్నాయి. సీట్ల కోసం ప్రజలు వెయిట్ చేసే ప్రముఖ సంస్థలు కూడా వీటిల్లో ఉండటం ఆందోళన కలిగించే అంశం. క్రీమ్‌స్టోన్, నేచురల్స్ ఐస్‌క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్‌సీ, రోస్టరీ కాఫీ, హౌస్ రాయలసీమ, రుచుల షా, గౌస్ కామత్ హోటల్, 36 డౌన్‌టౌన్ బ్య్రూ పబ్, మకావ్ కిచెన్ అండ్ బార్, ఏయిర్ లైవ్, టాకో బెల్, ఆహా దక్షిణ్, సిజ్లింగ్ జోయ్, ఖాన్‌సాబ్, సుఖ్‌సాగర్ రెస్టారెంట్, జంబోకింగ్ బర్గర్స్, రత్నదీప్ రిటైల్ స్టోర్, అట్లూరి ఫుడ్స్ ప్రై వేట్ లిమిటెడ్(చట్నీస్ కాఫీహౌస్ అండ్ వెజ్ రెస్టారెంట్),షాన్‌బాగ్ హోటల్ డీలక్స్, గౌరంగ్ డిజైన్స్ ఇండియా ప్రై వేట్ లిమిటెడ్, కృతుంగ పాలేగార్స్ క్విజి, హెడ్‌క్వార్టర్స్ రెస్టో బార్, తదితరమైనవి వీటిల్లో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.Task force team has conducted inspections in the Madhapur area on 23.05.2024. The Rameshwaram Cafe* Urad Dal (100Kg) stock found expired in Mar'24 worth Rs. 16K* Nandini Curd (10kg), Milk (8L) worth Rs. 700 found expired Above items discarded on the spot.(1/4) pic.twitter.com/mVblmOuqZk— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) May 23, 2024 ఆరోగ్యం ఖతం.. కల్తీ వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. శరీరానికి అవసరమైన పదార్థాలు అందక శరీరం బలహీనమవుతుంది. తాము పోషకాహారం తీసుకుంటున్నామని ప్రజలు భావిస్తున్నప్పటికీ, కల్తీవల్ల జీవక్రియలు నిలిచిపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. కల్తీ ఆహారంతో అక్యూట్ డయోరియల్ డిసీజెన్ వస్తాయని ఫీవర్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు.రంగంలోకి టాస్‌్కఫోర్స్..వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులందుతుండటంతో స్టేట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన టాస్‌్కఫోర్స్ టీమ్స్ దాదాపు 40 రోజులుగా తనిఖీలు జరుపుతున్నాయి. దాదాపు వంద హోటళ్లు, ఇతరత్రా సంస్థల్లో జరిపిన తనిఖీల్లో 90 శాతం నిబంధనల కనుగుణంగా లేవు. కిచెన్, స్టోర్‌రూమ్స్ శుభ్రంగా లేవు, బొద్దింకలు, ఇతరత్రా క్రిమికీటకాలు సంచరిస్తున్నాయి.ఎక్స్పైర్డ్ ఐటంలు అమ్ముతున్నారు. బ్రాండ్ పేరు ఒకటైతే వేరే సరుకు అమ్ముతున్నారు. తనిఖీల్లో భాగంగా నిబంధనలు, చట్టాల మేరకు 24 కేసులు నమోదు చేశారు. – చెరుపల్లి వెంకటేశ్జరిమానాలు ఇలా (రూపాయలో)..ట్రేడ్ లైసెన్సు ఉన్న ఫొటో కనపడకుంటే - 520 తాగునీరు ఉచితంగా ఇవ్వకుంటే - 1000 వ్యర్థాలను తడి,పొడిగా వేరు చేయకుంటే - 1000 టాయ్లెట్లు శుభ్రంగా లేకుంటే - 5000 టాయ్లెట్లు లేకుంటే - 2000 మురుగునీటి వ్యవస్థ లేకుంటే - 5000 భూగర్భ డ్రై నేజీ లేకుంటే - 10,000 ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేకుంటే - 10.000 భవనం అక్రమ నిర్మాణమైతే - 10,000 పై అంతస్తుల్లో బట్టీలు ఏర్పాటు చేస్తే - 10,000 50 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ వాడితే - 10,000 కోల్డ్ చాంబర్లో నిర్ణీత ఉష్ణోగ్రత లేకుంటే - 500 వండిన ఆహారపదార్థాలు నిల్వ ఉంచితే - 5002023లో.. అందిన ఫిర్యాదులు : 2885 తనిఖీలు చేసినవి : 1685 జీహెచ్ఎంసీ పరిధిలో లేనివి : 1047 ఇతర కేటగిరీవి : 165 పెండింగ్ : 15 జీహెచ్ఎంసీలో ఉండాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు : 31 పనిచేస్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు : 23గత మూడేళ్లలో..లైసెన్సుల జారీ : 33251 వసూలైన ఫీజు : రూ.9,71,02,700 స్ట్రీట్ వెండర్స్ ‘రిజిస్ట్రేషన్లు : 36334 వచ్చిన ఫీజు : రూ.59,48,270 ఫేడ్‌సేఫ్టీపై శిక్షణలిచ్చి జారీ చేసిన సర్టిఫికెట్లు : 1570 ఫిర్యాదు చేసేందుకు..జీహెచ్ఎంసీ పరిధిలో - foodsafetywing.ghmc@gmail.com - Phone no - 04021 11 11 11 దెబ్బతింటున్న కిడ్నీలు..పెచ్చుమీరుతున్న కల్తీ ఆహారంతో క్యాన్సర్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇటీవలి కాలంలో కిడ్నీలు దెబ్బతింటున్నాయి. మనకు దొరికే ఉప్పు, పాలతో సహా రా మెటీరియల్ అంతా కల్తీనే. వీటిని రెస్టారెంట్లు, హోటళ్లలో మరింత కల్తీ చేస్తున్నారు. ఫుడ్ కలర్స్, కెమికల్స్ అన్నీ అనారోగ్యానికి దారి తీసేవే. ముఖ్యంగా బాయిల్డ్ అయిన ఆయిల్‌తో తయారు చేస్తున్న వంటకాలతో అనారోగ్యసమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. – హితశ్రీ రెడ్డి, డైటీషియన్, నిమ్స్కఠిన చర్యలుండాలి!తక్కువ మొత్తంలో పెనాల్టీలతో పరిస్థితి మారదు. కల్తీ నిర్ధారణ అయినప్పుడు చట్టం మేరకు కఠినచర్యలు తీసుకోవాలి. మొక్కుబడి తంతుగా ఏటా పదిరోజులో, నెల రోజులో కాకుండా తనిఖీలు నిరంతరం జరగాలి. వండిన ఆహారపదార్థాల్లోనే కాకుండా మసాలా దినుసుల్లోనూ కల్తీ జరుగుతోంది. విదేశాలకు పంపిస్తే వాటిని స్వీకరించకుండా వెనక్కు పంపిస్తున్నారు. ఫిర్యాదులకు ప్రత్యేక సెల్ ఉండాలి.– పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్నిబంధనలు పాటించాలి..హోటళ్లు, తినుబండారాల దుకాణాల నిర్వాహకులు, ఎఫ్ఎస్ఎస్ఏ, జీహెచ్ఎంసీ నిబంధనలు పాటించాలి. ఆరోగ్యానికి హాని కలిగించే రంగులు వాడొద్దు. పరిశుభ్రత పాటించాలి. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. కల్తీని గుర్తించినప్పుడు ప్రజలు ఫిర్యాదు చేయాలి.– కె. బాలాజీరాజు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్శిక్షణ ఉండాలి..ఇటీవలి కాలంలో హోటళ్ల గురించి తెలియని వారు సైతం పెట్టుబడి వనరుగా ఈ రంగంలోకి వస్తున్నారు. ఇంటీరియర్ల కోసం ఎంతో ఖర్చు చేస్తున్న వారు సిబ్బంది శిక్షణ గురించి పట్టించుకోవడం లేదు. రెస్టారెంట్ల ఓనర్లు, సిబ్బందికి అవగాహన ఉండాలి. ప్రతి ఇరవై మంది సిబ్బందికి ఒక ట్రైనర్ ఉండాలి. ఇటీవలి కాలంలో జీహెచ్ఎంసీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒక రోజు శిక్షణతో ఆన్‌లైన్‌పరీక్షతో సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు. శిక్షణలు వినియోగించుకోవాలి.– తుమ్మల సంపత్ శ్రీనివాస్, ప్రెసిడెంట్, నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ -
వీడియో రికార్డు చేస్తూ అధికారి లైంగిక వేధింపులు..
-
జీహెచ్ఎంసీలో కామ పిశాచి.. కమిషనర్ రియాక్షన్
హైదరాబాద్, సాక్షి: జీహెచ్ఎంసీ సర్కిల్ ఎసిఎఫ్ఏ (శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్) కిషన్ కీచక పర్వం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన కింద పనిచేసే కార్మికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ.. అదంతా వీడియోలు, పోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డా కీచకుడు. అయితే ఈ వ్యవహారం మీడియాకు ఎక్కడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రస్ స్పందించారు. కిషన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.వివరాల్లోకెళ్తే..కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామారం 25 సర్కిల్ పరిధిలో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్ఏఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే ఉద్యోగి అదే సర్కిల్లో పని చేసే ఓ పారిశుద్ధ్య కార్మికుకురాలిపై కన్నేసాడు. అధికార దర్పంతో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడే దుస్సాహసానికి వడిగట్టాడు. తాను చెప్పినట్లు వినాలని హుకూం జారీ చేశాడు. ఆఖరికి అతడి మాట వినకపోతే.. విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టడం వంటి దురాగతాలకు పాల్పడేవాడు. దీంతో బాధితురాలు కీచక కిషన్ వేధింపులకు తట్టుకోలేక ఎవరికీ చెప్పలేక నరక యాతన అనుభవించింది. పైగా వాటన్నింటిని ఫోన్లో రికార్డ్ చేసేవాడుఏం జరిగిందో కానీ.. కిషన్ వీడియోలు బయటకు రావడం సహ ఉద్యోగుల వరకు చేరిపోవడం జరిగింది. దీంతో వారంతా సదరు ఉద్యోగిని గట్టిగా ప్రశ్నించటంతో.. ఎవరికి చెప్పవద్దంటూ..రూ. 10 వేల చొప్పున దాదాపు 14 మందికి డబ్బులు ఇచ్చి కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అతడిపై చర్యలు తీసుకోవాలని సహోద్యోగులు, కార్మికులు డిమాండ్ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. -
నగరం ఓటెత్తాలని..
జీహెచ్ఎంసీ సిబ్బంది బస్తీలు, కాలనీల్లోని ఇళ్లకు వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి మీకు ఓటుందా అని అడిగి.. ఒకవేళ ఓటు ఉంటే.. తప్పకుండా ఓటేయాలంటూ పోలింగ్ కేంద్రం వైపు అడుగులేసేలా వారిని ఒప్పిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని జీవీకే వన్‌మాల్‌లో ఇటీవల ఓ ఫ్లాష్‌మాబ్‌లో భాగంగా మోడరన్, శాస్త్రీయ నృత్యాలూ ప్రదర్శించారు. ఎందుకిదంతా అని చూస్తే ‘నా ఓటు–నా హక్కు’ నినాదాలతో ప్లకార్డులు పట్టుకొని కనిపించారు. జీహెచ్ఎంసీలోని సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల సభ్యులు, రిసోర్స్‌పర్సన్స్ వారి పిల్లలతో నిర్వహించిన ఈ కార్యక్రమం మాల్‌కు వచ్చిన వారిని ఆకట్టుకుంది. ఓటుపై ఆలోచనలో పడేసింది. పరమపద సోపానం (వైకుంఠపాళి) ఆటలో స్వర్గానికి చేరుకునేందుకు మెట్లెక్కించే నిచ్చెనలు, పాతాళానికి పడిపోయేలా మింగేసే పాములు ఉండటం తెలిసిందే. ఆ ఆటలో ఎప్పుడు పాము మింగుతుందో, ఎప్పుడు నిచ్చెన ఎక్కుతామో తెలియదు కానీ.. ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటును సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం భవిష్యత్ అంధకారమవుతుంది అని చెబుతూ ఏ పనులు చేస్తే నిచ్చెన ఎక్కవచ్చో, ఏవి చేస్తే పాతాళానికి పడిపోతారో తెలియజేసేలా ఖైరతాబాద్ సర్కిల్లో పరమపద సోపానం ఆటతోనూ అవగాహన కల్పించారు.సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్షరాస్యతశాతం ఎక్కువగా ఉన్నా.. ఎన్నికలకు సంబంధించి నిరక్షరాస్యులుగా వ్యవహరిస్తూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం లేదు. తమ భవిష్యత్‌కు తగిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఎన్నికల అక్షరాస్యులుగానూ మలిచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 287 ఎన్నికల అక్షరాస్యత క్లబ్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్లబ్‌ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కూలీనాలీ చేసుకునే ప్రజలు, ప్రైవేట్ వ్యాపారాలు సాగిస్తున్న వారితోపాటు ఉద్యోగుల్లో సైతం ఇదే వైఖరి ఉంది. అందుకే వారికి కూడా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులతో 158 ఓటర్ అవేర్నెస్ ఫోరమ్స్ ఏర్పాటు చేసి వివిధ కార్యాలయాల్లో అవగాహన కల్పిస్తున్నారు. వీటితోపాటు 584 పోలింగ్ బూత్‌ల పరిధిలో అవేర్నెస్ గ్రూపులు ఏర్పాటు చేశారు. తమ బూత్ పరిధిలోని వారిని పోలింగ్ కేంద్రాల దాకా అడుగేసేలా చేయడం ఈ గ్రూపుల పని. ‘వాక్ టు పోలింగ్ స్టేషన్’ పేరిట కార్యక్రమాలు చేపడుతూ పోలింగ్ శాతం పెరిగేందుకు పనిచేస్తున్నాయి.ఇంకా ఏం చేస్తున్నారంటే.. 18 ఏళ్లలోపు విద్యార్థులకు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులందజేస్తున్నారు. ఓటరు చైతన్యం కోసం రూపొందించే వీడియోల్లో ఉత్తమమైన పది వీడియోలకు రివార్డులివ్వనున్నారు. బూత్‌లెవెల్ అధికారులు తమ బూత్‌లో పోలింగ్‌శాతాన్ని గతంలో కంటే పదిశాతం పెంచితే రూ. 5 వేలు రివార్డుగా ఇచ్చే యోచనలో ఉన్నారు. ఆదివారం నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 5కే రన్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో తాము ఓటు వేస్తామంటూ ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ బోర్డులపై ఎన్నికల సమాచారం తెలియజేస్తున్నారు. ఓటరు అవగాహనకు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను ఎక్స్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్లోనూ ఎన్నికలకు సంబంధించిన సమాచారం పొందుపరుస్తున్నారు. వారానికోమారు ఓటు వేయాల్సిందిగా సూచిస్తూ ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద నగరంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయ్లెట్ల వద్ద ఓటరు అవగాహన బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంటింటి నుంచి చెత్త సేకరించే స్వచ్ఛఆటోల మైకుల ద్వారానూ ప్రచారానికి సిద్ధమయ్యారు.ఇప్పటి వరకు..» స్వీప్(సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కింద నా ఓటు హక్కును వినియోగించుకుంటాను అనే ప్రతిజ్ఞతో ప్రసాద్స్ ఐమాక్స్‌లో, కొన్ని పార్కుల్లో భారీ తెరలపై సంతకాల సేకరణ చేపట్టారు. » జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో, పాతబస్తీలోని మక్కా మసీదులోనూ ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. » ఓటు వేస్తాననే సంకల్ప పత్రాలను విద్యార్థులకు అందజేస్తూవాటిపై వారి తల్లిదండ్రులు సంతకాలు చేశాక తిరిగి తీసుకుంటున్నారు. ఇప్పటివరకు అలా దాదాపు రెండు లక్షల సంకల్ప పత్రాలు సేకరించారు. » ఓటుహక్కు గురించి బస్తీల్లో, కాలనీల్లో క్విజ్లు, మెహందీలు, రంగోలి వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులందజేస్తూ ఆసక్తి కల్పిస్తున్నారు. » ఒక ఆదివారం హెరిటేజ్ వాక్ నిర్వహించిన సందర్భంగా దారుల్షిఫా నుంచి ఉస్మానియా ఆస్పత్రిలోని చింతచెట్టు వరకు ఓటు హక్కుకు సంబంధించిన బ్యానర్లు, పోస్టర్ల స్టాండ్లు ఏర్పాటు చేశారు. » పార్కులు, బస్స్టేషన్లు, గోడలపై రాతల ద్వారానూ, రేషన్‌షాపులు, సిటిజె¯న్ సర్వీస్ సెంటర్లు, కూరగాయల మార్కెట్లు తదితర ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. » ఓట్’ అనే అక్షరాల్లా కనిపించేలా విద్యార్థులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.ఎన్నికల దాకా..ఎన్నికలు జరిగేంత వరకు ఇలా వివిధ ప్రాంతాల్లో, వివిధ రూపాల్లో స్వీప్ కార్య క్రమాలు నిర్వహించనున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ తెలిపారు. బొటానికల్ గార్డెన్ వద్ద ఇప్పటికే నిర్వహించిన 2కే రన్లో సీఈఓ వికాస్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు. -
GHMC: మేయర్ విజయలక్ష్మి ఇంట్లో చొరబడిన రౌడీషీటర్..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి ఓ రౌడీ షీటర్ చొరబడటం తీవ్ర కలకలం సృష్టించింది. సదరు వ్యక్తి నేరుగా మేయర్ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం, పోలీసులు మేయర్ ఇంటికి వచ్చిన రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడకు చెందిన రౌడీ షీటర్ లక్ష్మణ్ మంగళవారం మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి చొరబడ్డాడు. నేరుగా వచ్చి ఆమె వ్యక్తిగత గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె సిబ్బంది అడ్డుకున్నారు. సిబ్బంది వారించినా అతను పట్టించుకోలేదు. దీంతో, అతడిని సిబ్బంది అడ్డుకుని బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఇక, ఆ సమయంలో మేయర్ ఇంట్లో లేరు.వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే, లక్ష్మణ్‌కు మతిస్థిమితం సరిగా లేనట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. లక్ష్మణ్ గత రెండు రోజులుగా మేయర్ ఇంటి చుట్టే తిరిగినట్టు పోలీసులు తెలిపారు. -
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
సాక్షి, హైదరాబాద్: వేసవి కాలం రావడంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీ, మోటర్ల వినయోగంతో విద్యుత్ డిమాండ్ ఎక్కువవుతోంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో వినియోగం జరిగింది. గురువారం రికార్డు స్థాయిలో 4,053 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మైలురాయిని అధిగమించిది. 2023 ఏప్రిల్ 18న గరిష్ఠ డిమాండ్ 3,471 మెగావాట్లు కాగా గతేడాదితో పోల్చితే ప్రస్తుతం 582 మెగావాట్ల డిమాండ్ పెరిగింది. అయితే విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ అధికారులు ఏలాంటి అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా చేశారు. వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తున్న విద్యుత్ శాఖ, సిబ్బందిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. మే నెలలో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ సిబ్బంది, అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే సేవలందించి వినియోగదారుల మన్ననలు పొందాలని సూచించారు. -
రోడ్డు స్వరూపం మార్చేశారు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ శివార్లలోని బుద్వేల్‌లో దళితులకు చెందాల్సిన 26 ఎకరాల భూమి కబ్జా చేశారనే కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన కొత్తగా వేస్తున్న వెంచర్ కోసం గతంలో నిర్మించిన విల్లాల్లోని ప్రైవేటు రోడ్డు పబ్లిక్ రోడ్డుగా స్వరూపం మార్చేశారు. అలాగే ఓ నాలాపై అనుమతుల్లేకుండానే వంతెన నిర్మించారు. ఈ అక్రమాలపై రామ్దేవ్గూడలోని వెస్సెల్లా మెడోస్ నివాసితులు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదై దర్యాప్తు మొదలవడంతో దిగివచ్చిన శివానందరెడ్డి... తన తప్పులు సరిదిద్దుకొనేలా జీహెచ్ఎంసీకి మరో దరఖాస్తు చేశారు. ఈ వ్యవహారం మొత్తంలో అధికారుల ఉదాశీనత, శివానందరెడ్డి లాబీయింగ్ స్పష్టంగా కనిపిస్తోందని వెస్సెల్లా మెడోస్ నివాసితులు చెబుతున్నారు. కొత్త వెంచర్‌కు రోడ్డు లేక... మాండ్ర శివానందరెడ్డి సీఈఓగా ఉన్న వెస్సెల్లా గ్రూప్ రామ్‌దేవ్‌గూడ ప్రధాన మార్గంలో తారామతి–బారాదరి ఎదురుగా 38 ఎకరాల్లో వెస్సల్లా మెడోస్ పేరుతో 295 త్రీ, ఫోర్, ఫైవ్ బీహెచ్‌కే విల్లాలు నిర్మించడానికి 2017లో జీహెచ్ఎంసీ నుంచి అనుమతి తీసుకుంది. అప్పట్లో ఈ విల్లాస్ లోపల రెండు అంతర్గత ప్రైవేటురోడ్లు ఉండేలా రూపొందించిన ప్లాన్‌కే అధికారులు అనుమతి ఇచ్చారు. కొన్నాళ్ల క్రితం వెస్సెల్లా గ్రూప్ పాత వెంచర్‌కు వెనుక వైపు నాలా పక్కన మరో 9 ఎకరాల్లో మరో వెంచర్ మొదలుపెట్టింది. ప్రధాన రహదారి నుంచి ఈ వెంచర్‌కు చేరుకోవాలంటే సమీప మార్గం లేదు. ఈ నేపథ్యంలోనే శివానందరెడ్డి మరో కుట్రకు తెరలేపారు. వెస్సెల్లా మెడోస్‌లో ఉన్న రెండు ప్రైవేట్ రహదారుల్లో ఒకదాన్ని పబ్లిక్ రోడ్డుగా అక్రమంగా మార్చేశారు. ఈ మేరకు రివైజ్డ్ ప్లాన్‌తో 2022లో జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని అధికారులు ఆమోదించడంతో వెస్సెల్లా మెడోస్‌లోని ప్రైవేట్ రోడ్డు పబ్లిక్ రోడ్డుగా మారిపోయి వెనుక ఉన్న 9 ఎకరాల వెంచర్‌ను ప్రధాన రహదారికి దగ్గర చేసింది. ఈ రెండు వెంచర్ల మధ్య ఓ నాలా ఉండటంతో ఇరిగేషన్ విభాగం సహా ఎవరి అనుమతి లేకుండానే ఆయన దానిపై వంతెన నిర్మించారు. బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి.. వెస్సెల్లా మెడోస్ శాంక్షన్డ్ ప్లాన్‌కు విరుద్ధంగా తమ ప్రైవేటు రోడ్డును పబ్లిక్ రోడ్డుగా శివానందరెడ్డి మార్చేసినట్లు నివాసితులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలిసింది. దీంతో 6 విల్లాలకు చెందిన యజమానులు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఐపీసీలోని 420, 406 సెక్షన్ల కింద అదే నెల 8న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు నమోదు కాకుండా చూసేందుకు శతవిధాలా శివానందరెడ్డి ప్రయత్నించినప్పటికీ ఉన్నతాధికారుల జోక్యంతో కేసు నమోదై దర్యాప్తు ప్రారంభం కావడంతో ఆయన హైకోర్డును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ వేశారు. తనపై కేసు కొట్టేయాల్సిందిగా కోరారు. దీనికి అంగీకరించని న్యాయస్థానం... నిందితులకు సీఆరీ్పసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించి కేసు దర్యాప్తు కొనసాగించాలని స్పష్టం చేసింది. దీంతో గత్యంతరం లేక శివానందరెడ్డి వెస్సెల్లా మెడోస్కు సంబంధించి తాను సమర్పించిన రివైజ్డ్ ప్లాన్‌ను రద్దు చేయాలంటూ జీహెచ్ఎంసీకి మరో దరఖాస్తు సమర్పించినట్లు తెలిసింది. కాగా, జీహెచ్ఎంసీ అధికారులను మోసం చేసి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఈ కేసులో శివానందరెడ్డిపై పోలీసులు అదనపు సెక్షన్లు జోడించాలని వెస్సెల్లా మెడోస్ నివాసితుడు ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ కోరారు. -
జీహెచ్ఎంసీలో అభయహస్తం దరఖాస్తుల మిస్సింగ్!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో అభయహస్తం దరఖాస్తుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం 14 లక్షల దరఖాస్తులు వస్తే 11 లక్షల మాత్రమే జీహెచ్ఎంసీ కంప్యూటరైజ్ చేసింది. లేని దరఖాస్తులకు ప్రైవేట్ ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించింది. జీహెచ్ఎంసీ పరిధిలోనీ అన్ని జోన్లలో అభయహస్తం దరఖాస్తుల్లో గందరగోళం నెలకొంది. మ్యానువల్ డాక్యుమెంట్స్‌ను కంప్యూటర్ చేసినట్లు లెక్కలు చూపి ప్రైవేట్ ఏజెన్సీలు నిధులు కాజేసినట్లు సమాచారం. ప్రైవేట్ ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సహకరించినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: హైకోర్టులో ప్రణీత్‌రావుకు చుక్కెదురు -
కలుషిత నీటితో కాయగూరలా?
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే కలుషిత నీటితో కాయగూరలు పండించడం, వాటి ని విక్రయించడంపై హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. పండించే వాళ్లు ఎవరైనా.. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఆక్షేపించింది. అలాంటి కాయగూరలు విక్రయించకుండా జీహెచ్ఎంసీ, సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అలాగే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 13 చెరువుల రక్షణకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) గాడి ప్రవీణ్‌కుమార్, రెవెన్యూ జీపీ శ్రీకాంత్‌రెడ్డి కమిటీ/అడ్వొకేట్ కమిషనర్లు అందించిన నివేదికపై చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం సూచించింది. ఆరు వారాలు సమయం ఇస్తున్నామని.. తదుపరి విచారణలోగా ఏం చర్యలు చేపట్టారన్న దానిపై కార్యాచరణ నివేదికను సమర్పించాలని చెప్పింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని, శిఖంను ఆక్రమించుకు ని నిర్మాణాలు చేపడుతున్నారని.. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ గమన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ సి.దయాకర్ 2007లో హైకోర్టుకు లేఖ రాశారు. దుర్గం చెరువు, సున్నం చెరువు, పెద్ద చెరువు, ఫీర్జాదిగూడ, దామర చెరు వు, దుండిగల్, చినరాయుని చెరువు, గంగారం పెద్ద చెరువు, మేడికుంట చెరువు, హస్మత్‌పేట, బావురుడ చెరువు ఆక్రమణలకు గురై పూర్తిగా కుంచించుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేఖను న్యాయస్థానం రిట్ పిటిషన్‌గా విచారణ స్వీకరించింది. గత విచారణ సందర్భంగా కమిటీని ఏర్పాటు చేసి.. 13 చెరువుల పరిస్థితిపై నివేదికను అందజేయాలని డీఎస్జీ, జీపీ కమిటీని ఆదేశించింది. ఈ పిటిషన్లపై ధర్మాసనం మరోసారి మంగళవారం విచారణ చేపట్టింది. కమిటీ నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. ఆక్రమణలు సహా ఇతర వివాదాల పరిష్కారానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని, ఎఫ్టీఎల్/బఫర్ నిర్ధారణ శాస్త్రీయంగా నిర్ణ యించాలని, శిథిలాలు, వ్యర్థాలు వేస్తే జరి మానా విధించే వ్యవస్థ ఉండాలని చెప్పింది. -
జీహెచ్ఎంసీ ప్రక్షాళన.. 14 మంది అధికారులపై వేటు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో అధికారుల ప్రక్షాళన మొదలైంది. రిటైర్డ్ ఉద్యోగులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీలో రిటైర్డ్ అయిన ఉద్యోగులను కమిషనర్ టర్మినెట్ చేశారు. 45 మంది రిటైర్డ్ ఉద్యోగుల్లో 37 మంది తమ విధుల నుంచి వైదొలిగారు. అక్రమాలకు పాల్పడిన 14 మంది అధికారులను విధుల నుంచి కమిషనర్ తొలగించారు. తప్పులు చేస్తున్న పలువురు అధికారులకు రోనాల్డ్ రోస్ మెమోలు జారీ చేశారు. జీహెచ్ఎంసీలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. కాగా, అక్రమాల కట్టడి కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇతరుల హాజరుకు వినియోగిస్తున్న ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ స్థానే ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఫేషియల్ రికగినషన్ బయోమెట్రిక్‌ను ఉపయోగించేందుకు సిద్ధమైంది. తద్వారా బోగస్ కార్మికులకు అడ్డుకట్ట వేయవచ్చని, ఫలితంగా ఏటా కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం కాకుండా నివారించవచ్చునని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఈ విధానాన్ని అమలు చేస్తుండటంతో జీహెచ్ఎంసీ కూడా రెడీ అయ్యింది. -
HMDA పరిధిలో ఒకే కార్పొరేషన్ లోకి తేవాలని ప్రభుత్వం యోచన
-
అటెండెన్స్ ఇక ఆధునికంగా..
సాక్షి, హైదరాబాద్: అక్రమాల కట్టడి కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పారిశుద్ధ్య కారి్మకులతో పాటు ఇతరుల హాజరుకు వినియోగిస్తున్న ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ స్థానే ఆరి్టఫియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఫేషియల్ రికగి్నషన్ బయోమెట్రిక్‌ను ఉపయోగించేందుకు సిద్ధమైంది. తద్వారా బోగస్ కారి్మకులకు అడ్డుకట్ట వేయవచ్చని, ఫలితంగా ఏటా కోట్ల రూపాయల నిధులు దురి్వనియోగం కాకుండా నివారించవచ్చునని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఈ విధానాన్ని అమలు చేస్తుండటంతో జీహెచ్ఎంసీ కూడా రెడీ అయ్యింది. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల పేరిట ఏటా కోట్ల రూపాయలు దారి మళ్లుతున్నాయి. గతంలో సాధారణ హాజరు అమల్లో ఉండటంతో అక్రమాలు జరుగుతున్నాయని భావించి దాదాపు ఆరేళ్ల క్రితం వేలిముద్రల బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయినా, అక్రమాలు జరుగుతుండటంతో ఆధార్‌తో అనుసంధానం చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. ఒక ఎస్ఎఫ్ఏ పరిధిలో ఉండే 21 మంది కారి్మకులకు గానూ సగటున 15 మందికి మించి ఉండరు. అయితే, వారి పేరిట ప్రతినెలా వేతనాల చెల్లింపులు మాత్రం జరుగుతున్నాయి. ఎస్ఎఫ్ఏల నుంచి సంబంధిత విభాగం ఏఎంఓహెచ్‌లు, సీఎంఓహెచ్‌కు సైతం వాటాలున్నాయని కారి్మకులు బహిరంగంగానే చెబుతారు. ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్ అమల్లోకి వచ్చాక నకిలీ సింథటిక్ ఫింగర్ ప్రింట్లను తయారు చేయడం నేర్చుకున్నారు. కొందరు ఎస్ఎఫ్ఏల వద్ద అలాంటి నకిలీ ఫింగర్ ప్రింట్లను గుర్తించి పోలీసులు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, అక్రమాలు మాత్రం ఆగలేదు. హాజరు తీసుకునే హ్యాండ్‌సెట్‌లో తమ ఫింగర్ ప్రింట్స్ నమోదు కావట్లేదంటూ సాధారణ హాజరునే నమోదు చేసుకుంటున్న వారు భారీసంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత ఫేషియల్ రికగి్నషన్ జరిగితే అక్రమాలకు ఆస్కారం ఉండదని భావించిన కమిషనర్ రోనాల్డ్‌రాస్ అందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ప్రత్యేక యాప్‌తో.. ఫేషియల్ రికగి్నషన్ను మొబైల్ ఫోన్‌తో వినియోగించగలిగే ప్రత్యేక యాప్ తయారు చేస్తారు. యాప్ రూపకల్పన, నిర్వహణ సైతం సదరు సంస్థే చేయాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో ఫేషియల్ రికగ్నిషన్‌తోనే హాజరు నమోదవుతుంది. హాజరు తీసుకునే సమయంలో కార్మికులున్న ప్రదేశాన్ని తెలిపేలా జియో ఫెన్సింగ్ సదుపాయం ఉంటుంది. సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు తమ పరిధిలోని సిబ్బంది వివరాలను ఫొటో, ఐడీలతో సహా యాప్‌లో రిజిస్టర్ చేస్తారు. 25 వేల మందికి వర్తింపు.. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కారి్మకులతో పాటు ఎంటమాలజీ, వెటర్నరీ విభాగాల్లోని కార్మికులు, అధికారులు వెరసి దాదాపు 25 వేల మంది ఉన్నారు. ఈ ప్రాజెక్టును ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) ద్వారా దక్కించుకునే సంస్థకు యాప్ రూపకల్పనకు ఖరారయ్యే ధర చెల్లిస్తారు. అనంతరం నిర్వహణకు రోజువారీ హాజరును బట్టి చెల్లిస్తారు. యాప్‌తో పాటు వెబ్‌పోర్టల్ కూడా ఉంటుంది. పారిశుద్ధ్య కారి్మకులు గ్రూపులుగా పనులు చేస్తారు. కాబట్టి క్షేత్రస్థాయిలో సైతం గ్రూపులుగానూ.. విడివిడిగానూ హాజరు నమోదయ్యే సదుపాయం కూడా ఉంటుంది. కారి్మకుల హాజరును బట్టి వారి వేతనాలను అనుగుణంగా వేతనం తదితర వివరాలు కూడా ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యేలా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. ఆర్ఎఫ్పీలను ఆహా్వనించిన జీహెచ్ఎంసీ ముందుకొచ్చే సంస్థల అర్హతలు, తదితరమైనవి పరిగణలోకి తీసుకొని ప్రాజెక్టు అప్పగించనుంది. రూ.కోట్ల నిధులు దారి మళ్లింపు.. 2017లో మే 21 తేదీ నుంచి జూన్ 20 వరకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు చెల్లించగా ఒక్క నెలలోనే రూ. 2,86,34,946 వ్యత్యాసం కనిపించింది. దీనిబట్టి పనిచేయకుండానే ఎంతమంది పేరిట నిధుల దుబారా జరిగిందో అంచనా వేయవచ్చు. ఫింగర్‌ప్రింట్స్ బయో మెట్రిక్ అమల్లోకి వచ్చాక కొంతకాలం వరకు అక్రమాలు జరగనప్పటికీ..అనంతరం నకిలీ ఫింగర్‌ప్రింట్స్ సైతం పుట్టుకొచ్చాయి. ఈ పరిణామాలతో జీహెచ్ఎంసీ తాజాగా ఫేషియల్ బయోమెట్రిక్‌కు సిద్ధమవుతోంది. -
ఆక్రమణలే అడ్డంకులు!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరికి వడ్డాణంలో వంకెలు తిరుగుతూ వయ్యారంగా ఉండే మూసీ నదిని సుందరీకరించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే, ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రధాన అడ్డంకులు మూసీ చుట్టూ ఉన్న ఆక్రమణలే. మూసీ నది పరివాహకం వెంబడి 8,500 ఆక్రమణలు ఉన్నట్లు తేలింది. చారిత్రక మూసీ నదికి ఇరువైపులా బఫర్ జోన్లో, నదీగర్భంలో కూడా భవన నిర్మాణాలు, ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ), రెవెన్యూ, నీటి పారుదల శాఖ సంయుక్తంగా డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) సాంకేతికతను ఉపయోగించి మూసీ నది వెంట విస్తృత సర్వే చేశారు. మూసీ వెంబడి ఉన్న గ్రామ పటాలపై ఆ చిత్రాలను స్పష్టంగా కనిపించేలా (సూపర్ఇంపోజ్) చేశారు. ఆక్రమణలే పెద్ద సవాల్.. మూసీని శుభ్రం చేయడం ఎంత పెద్ద సవాలో అంతకు రెట్టింపు మూసీ నదికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించడమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. నది పరివాహకం వెంబడి చాలా చోట్ల చిన్న గుడిసెలు, బస్తీలతో పాటు భవన నిర్మాణాలు ఉన్నాయి. నది గర్భంలో 1,700, బఫర్ జోన్లో 6,800 నిర్మాణాలు ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందిన దాదాపు 60 నుంచి 70 వరకు మతపరమైన కట్టడాలున్నాయి. వీటిలో చాలా వరకు గత రెండు దశాబ్ధాల కాలంలోనే నిర్మితమయ్యాయి. ముఖ్యంగా హైకోర్టు నుంచి చాదర్‌ఘాట్ మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. ప్రజల విశ్వాసాలకు సంబంధించిన ఈ మతపరమైన కట్టడాలను తొలగించడం చాలా అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంత నివాసితులకు 2 బీహెచ్‌కే గృహాలను కేటాయించి ఆక్రమణలను తొలగించాలని భావించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. భన్వర్‌లాల్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన తరుణంలో మూసీ ఒడ్డున నివసిస్తున్న కాలనీ వాసుల కోసం నందనవనంలో ప్రత్యేకంగా గృహా సముదాయం కట్టించి ఇచ్చినా.. నదీ గర్భంలో ఆక్రమణలు మాత్రం ఆగలేదు. మూసీకి మాస్టర్ ప్లాన్.. ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ భూ వినియోగం, ఇతర వివరాలు హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి. తాజాగా మూసీ నదిలో వరద స్థాయి, సరిహద్దులను గుర్తించేందుకు 55 కిలోమీటర్ల మేర డ్రోన్లతో సర్వే చేయాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) నిర్ణయించింది. హద్దుల లెక్క తేలిన తర్వాత గ్లోబల్ కన్సల్టెంట్ల సహాయంతో మూసీ నదీ గర్భంలో రిక్రియేషనల్ జోన్, ల్యాండ్ స్కేపింగ్, కమర్షియల్ జోన్లతో సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను అభివృద్ధి చేయనున్నారు. మూసీని సుందరీకరించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వ్యాపార కేంద్రాలకు నిలయంగా గ్లోబల్ సిటీ రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి కల. మూసీ అభివృద్ధికి అయ్యే వ్యయంలో కొంత బ్యాంకు నుంచి రుణం, మరికొంత పీపీపీ పద్ధతిలో చేయాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశాలను పరిశీలించాలని సీఎం మున్సిపల్ అధికారులను ఆదేశించారు. -
అటెండెన్స్ ఇక ఆధునికంగా..
సాక్షి, హైదరాబాద్: అక్రమాల కట్టడి కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇతరుల హాజరుకు వినియోగిస్తున్న ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ స్థానే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్‌ను ఉపయోగించేందుకు సిద్ధమైంది. తద్వారా బోగస్ కార్మికులకు అడ్డుకట్ట వేయవచ్చని, ఫలితంగా ఏటా కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం కాకుండా నివారించవచ్చునని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఈ విధానాన్ని అమలు చేస్తుండటంతో జీహెచ్ఎంసీ కూడా రెడీ అయ్యింది. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల పేరిట ఏటా కోట్ల రూపాయలు దారి మళ్లుతున్నాయి. గతంలో సాధారణ హాజరు అమల్లో ఉండటంతో అక్రమాలు జరుగుతున్నాయని భావించి దాదాపు ఆరేళ్ల క్రితం వేలిముద్రల బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయినా, అక్రమాలు జరుగుతుండటంతో ఆధార్‌తో అనుసంధానం చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. ఒక ఎస్ఎఫ్ఏ పరిధిలో ఉండే 21 మంది కార్మికులకు గానూ సగటున 15 మందికి మించి ఉండరు. అయితే, వారి పేరిట ప్రతినెలా వేతనాల చెల్లింపులు మాత్రం జరుగుతున్నాయి. ఎస్ఎఫ్ఏల నుంచి సంబంధిత విభాగం ఏఎంఓహెచ్‌లు, సీఎంఓహెచ్‌కు సైతం వాటాలున్నాయని కార్మికులు బహిరంగంగానే చెబుతారు. ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్ అమల్లోకి వచ్చాక నకిలీ సింథటిక్ ఫింగర్ ప్రింట్లను తయారు చేయడం నేర్చుకున్నారు. కొందరు ఎస్ఎఫ్ఏల వద్ద అలాంటి నకిలీ ఫింగర్ ప్రింట్లను గుర్తించి పోలీసులు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, అక్రమాలు మాత్రం ఆగలేదు. హాజరు తీసుకునే హ్యాండ్‌సెట్‌లో తమ ఫింగర్ ప్రింట్స్ నమోదు కావట్లేదంటూ సాధారణ హాజరునే నమోదు చేసుకుంటున్న వారు భారీసంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ జరిగితే అక్రమాలకు ఆస్కారం ఉండదని భావించిన కమిషనర్ రోనాల్డ్‌రాస్ అందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ప్రత్యేక యాప్‌తో.. ఫేషియల్ రికగ్నిషన్‌ను మొబైల్ ఫోన్‌తో వినియోగించగలిగే ప్రత్యేక యాప్ తయారు చేస్తారు. యాప్ రూపకల్పన, నిర్వహణ సైతం సదరు సంస్థే చేయాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో ఫేషియల్ రికగ్నిషన్‌తోనే హాజరు నమోదవుతుంది. హాజరు తీసుకునే సమయంలో కార్మికులున్న ప్రదేశాన్ని తెలిపేలా జియో ఫెన్సింగ్ సదుపాయం ఉంటుంది. సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు తమ పరిధిలోని సిబ్బంది వివరాలను ఫొటో, ఐడీలతో సహా యాప్‌లో రిజిస్టర్ చేస్తారు. 25 వేల మందికి వర్తింపు.. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఎంటమాలజీ, వెటర్నరీ విభాగాల్లోని కార్మికులు, అధికారులు వెరసి దాదాపు 25 వేల మంది ఉన్నారు. ఈ ప్రాజెక్టును ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) ద్వారా దక్కించుకునే సంస్థకు యాప్ రూపకల్పనకు ఖరారయ్యే ధర చెల్లిస్తారు. అనంతరం నిర్వహణకు రోజువారీ హాజరును బట్టి చెల్లిస్తారు. యాప్‌తో పాటు వెబ్‌పోర్టల్ కూడా ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికులు గ్రూపులుగా పనులు చేస్తారు. కాబట్టి క్షేత్రస్థాయిలో సైతం గ్రూపులుగానూ.. విడివిడిగానూ హాజరు నమోదయ్యే సదుపాయం కూడా ఉంటుంది. కార్మికుల హాజరును బట్టి వారి వేతనాలను అనుగుణంగా వేతనం తదితర వివరాలు కూడా ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యేలా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. ఆర్ఎఫ్పీలను ఆహ్వానించిన జీహెచ్ఎంసీ ముందుకొచ్చే సంస్థల అర్హతలు, తదితరమైనవి పరిగణలోకి తీసుకొని ప్రాజెక్టు అప్పగించనుంది. రూ.కోట్ల నిధులు దారి మళ్లింపు.. 2017లో మే 21 తేదీ నుంచి జూన్ 20 వరకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు చెల్లించగా ఒక్క నెలలోనే రూ. 2,86,34,946 వ్యత్యాసం కనిపించింది. దీనిబట్టి పనిచేయకుండానే ఎంతమంది పేరిట నిధుల దుబారా జరిగిందో అంచనా వేయవచ్చు. ఫింగర్‌ప్రింట్స్ బయో మెట్రిక్ అమల్లోకి వచ్చాక కొంతకాలం వరకు అక్రమాలు జరగనప్పటికీ..అనంతరం నకిలీ ఫింగర్‌ప్రింట్స్ సైతం పుట్టుకొచ్చాయి. ఈ పరిణామాలతో జీహెచ్ఎంసీ తాజాగా ఫేషియల్ బయోమెట్రిక్‌కు సిద్ధమవుతోంది. -
Hyderabad: ఆస్తిపన్ను బకాయిలపై రాయితీ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: వన్‌టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్)గా ఆస్తిపన్ను బకాయిల పెనాల్టీలపై 90 శాతం రాయితీ సదుపాయాన్ని మరోమారు కల్పించాల్సిందిగా జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి నివేదించింది. జీహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్నే. త్వరలో ముగియనున్న ఈ ఆరి్థక సంవత్సర ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం రూ. 2100 కోట్లు అయినప్పటికీ, గతనెల 20 వరకు రూ.1269 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఆరి్థక కష్టాల్లో ఉంది. నెలనెలా సిబ్బంది జీతభత్యాల చెల్లింపులకే కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో పలు పర్యాయాలు కల్పించిన ఓటీఎస్ సదుపాయాన్ని మరోమారు కల్పించాల్సిందిగా కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ స్కీమ్ అమల్లోకి వస్తే ఆస్తిపన్ను బకాయిదారులు అసలుతో పాటు బకాయిల వడ్డీలపై కేవలం 10 శాతం పెనాల్టీ చెల్లిస్తే సరిపోతుంది. అది ఎందరికో వెసులుబాటుగా ఉండటమే కాక జీహెచ్ఎంసీ ఆరి్థక కష్టాల నుంచి గెట్టెక్కేందుకూ ఉపకరిస్తుంది. ఈ అంశాన్ని వివరిస్తూ లేఖ రాశారు. పరిశీలనలోకి తీసుకుని ప్రభుత్వం అవకాశం కల్పించగలదని ఆశిస్తున్నారు. ఆస్తిపన్ను బకాయిలు (వడ్డీలపై పెనాల్టీలతో సహా).. ► 4,95,628 ప్రైవేట్ యజమానుల భవనాలకు సంబంధించి బకాయిలు రూ.1887.59 కోట్లు కాగా, వడ్డీల పెనాల్టీలతో కలిపి అవి రూ.4522.18 కోట్లకు పేరుకుపోయాయి. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 1800 భవనాల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను బకాయిలు రూ. రూ.1622.16 కోట్లు కాగా, వడ్డీల పెనాలీ్టలతో సహ అవి రూ.5281.21 కోట్లకు పేరుకుపోయాయి. ► అన్నీ వెరసి పేరుకు పోయిన మొత్తం బకాయిలు రూ.9803.39 కోట్లు. -
Ghmc: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ మాజీ డిప్యూటీ మేయర్
సాక్షి,హైదరాబాద్: బోరబండ ప్రస్తుత కార్పొరేటర్, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. రాజీనామాకు సంబంధించి బాబా పార్టీ చీఫ్ కేసీఆర్‌కు లేఖ రాశారు. ‘బీఆర్ఎస్ పార్టీ కోసం 22 ఏళ్లు సైనికుడిగా పనిచేశా. పార్టీలో ఉద్యమకారుడికి రక్షణ కరువైంది’ అని లేఖలో బాబా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో బాబా కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో ఉన్న విభేదాల కారణంగానే బాబా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు సమాచారం. ఇదీ చదవండి.. సీఎం రేవంత్ చిట్‌చాట్.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు -
75 గజాల్లోపు ఉన్నా.. అనుమతి తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 75 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం ప్లాట్‌లో ఎలాంటి నిర్మాణాన్ని చేపట్టాలనుకున్నా.. భవన యజమానులు మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని పొందడం తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది. 75 చదరపు గజాల కంటే తక్కువ ఉన్నా.. ఎక్కువ ఉన్నా అధికారుల నుంచి ధ్రువీకరణ, పని ప్రారంభ ఉత్తర్వును పొందాలని, దీనికి ఎలాంటి మినహాయింపు లేదని తేల్చిచెప్పింది. తమ ప్లాట్లలో నిర్మాణ పనులను ఆపివేయాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ నేరేడ్మెట్ వినాయకనగర్‌కు చెందిన ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్లలో తండ్రీ కొడుకులు, ప్లాట్‌ను రెండు భాగాలుగా విభజించారు. టీఎస్ బీపాస్ చట్టం–2020 ప్రకారం నిర్మాణాలకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్కటి 40 చదరపు గజాల్లో నిర్మాణాన్ని ప్రారంభించారు. మరొక పిటిషనర్ 54 చదరపు గజాలలో నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే వీరి నిర్మాణాలపై పొరుగు వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాణాలను ఆపివేయాలంటూ జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. అయితే టీఎస్ బీపాస్ చట్ట ప్రకారం నిర్మాణాలను ప్రారంభించామని.. జీహెచ్ఎంసీ ఇచి్చన నోటీసులను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ తడకమళ్ల వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు. జీహెచ్ఎంసీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే సరిపోదని, దాని పరిశీలన తర్వాతే నిర్మాణంపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని టీఎస్ బీపాస్ చట్టంలోని సెక్షన్ 7 చెబుతోందని చెప్పారు. రిజిస్ట్రేషన్ తర్వాత అధికారులు నిర్ణయం తీసుకోవడానికి 21 రోజుల సమయం ఉంటుందని, ఆ తర్వాత ఎలాంటి కారణం చూపకుండా దరఖాస్తును ఆపితే పిటిషనర్లు ముందుకు వెళ్లవచ్చని తెలిపారు. కానీ, పిటిషనర్లు జనవరి 9న రిజిస్ట్రేషన్ చేసి, వెంటనే నిర్మాణం ప్రారంభించారని పేర్కొన్నారు. దీంతో అదే నెల 18న జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసిందని వెల్లడించారు. టీఎస్ బీపాస్ నిబంధనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. జీహెచ్ఎంసీ వాదనలను సమర్థించారు. 75 చదరపు గజాల కంటే తక్కువ ప్లాట్లలో నిర్మాణానికి ప్రారంభ అనుమతి సర్టీఫికెట్ అవసరమని స్పష్టం చేశారు. అయితే వీటికి రూ.1 మాత్రమే నామమాత్రపు రుసుము ఉంటుందని, నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టీఫికెట్ పొందవలసిన అవసరం ఉండదని తేల్చిచెప్పారు. -
సికింద్రాబాద్ క్లాక్ టవర్.. ఆగిపోయిన టిక్ టిక్
సాక్షి,హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో ఉన్న చరిత్రాత్మక క్లాక్ టవర్ టిక్ టిక్ అనడం ఆగిపోయింది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ హిస్టారికల్ గడియారంలో టైమ్ ఆగిపోయి ఐదు రోజులు గడుస్తున్నా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) సిబ్బంది పట్టించుకోవడం లేదు. అయితే తాము సోమవారం క్లాక్‌ను రిపేర్ చేస్తామని జీహచ్ఎంసీ సిబ్బంది చెబుతున్నారు. సాధారణంగా క్లాక్ పనిచేయడం ఆగిపోతే స్థానికులు తమకు సమాచారమిస్తారని, ఈసారి అలాంటి ఫిర్యాదు ఏదీ రాకపోవడం వల్లే రిపేర్ ఆలస్యమైందని జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చెప్పారు. ఇదీచదవండి.. కిటికీలు తొలగించి చొరబాటు -
‘పార్లమెంట్’ సన్నాహాలతో..బీఆర్ఎస్ శ్రేణుల్లో చైతన్యం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ శ్రేణులు విచిత్ర పరిస్థితుల్లో ఉన్నాయి. గ్రేటర్‌లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 16 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులే గెలిచినా, అంతటా ఉన్నది తమ ఎమ్మెల్యేలే అయినా రాజకీయంగా ఊపు లేక ఉనికిపైనే అనుమానాలు నెలకొనే పరిస్థితులేర్పడ్డాయి. అందుకు కారణం నగరంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీ మెజారీ్టలతో గెలిచినప్పటికీ పార్టీ అధికారంలోకి రాకపోవడమే. పార్టీ అధికారంలోకి వస్తే తమకు నామినేటెడ్ పోస్టులు దక్కగలవని ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూసిన వారు డీలా పడ్డారు. గ్రేటర్ నగరంలో ఎమ్మెల్యేలతో పాటు దాదాపు 60 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ వారే అయినా పార్టీ శ్రేణుల్లో గెలుపు ఉత్సాహమే కనిపించలేదు. మరోవైపు ఎంతమంది కార్పొరేటర్లు ఇతర పారీ్టల్లోకి వెళ్తారోననే చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక చర్యల్లో భాగంగా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. జిల్లాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాంతాల్లో స్వల్ప మెజారిటీతో మాత్రమే గెలిచిందని, గ్రేటర్లో గెలిచిన మన ఎమ్మెల్యేలు భారీ మెజారీ్టతో గెలిచారంటూ వారికంటే మన బలమే ఎక్కువన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో మన పార్టీ అభ్యరి్థని భారీ మెజారీ్టతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అలా జరిగితేనే మనమంటే కాంగ్రెస్‌కు భయం ఉంటుందని, మన బలం తగ్గలేదని తెలుస్తుందని అన్నారు. మనకు అధికారం లేకపోవడం తాత్కాలిక బ్రేక్ మాత్రమేనని, ప్రజాభిమానం మనకే మెండుగా ఉందని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో కార్యకర్తల్లో కొంత ఊపు కనిపించింది. జీహెచ్ఎంసీలో ఏం జరగనుంది? ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీలో పరిస్థితులు ఎలా మారనున్నాయో అంతుపట్టడం లేదు. పోటీ చేసినప్పుడు అధికార పార్టీ అభ్యర్థులుగా గెలిచారు. ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రతిపక్షంగా మారింది. మూడు నెలలకోమారు జరగాల్సిన సర్వసభ్య సమావేశాలు ఆగస్టు తర్వాత ఇంతవరకు తిరిగి జరగలేదు. అంతేకాదు, పదవీకాలం ముగిసిపోయిన స్టాండింగ్ కమిటీకి సైతం కొత్త కమిటీ ఎన్నిక కాలేదు. కొత్త ఆరి్థక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ తొలుత స్టాండింగ్ కమిటీ సమావేశంలో, తర్వాత సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందాక ప్రభుత్వానికి పంపించాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఏ సమావేశమూ జరగలేదు. సంప్రదాయానికి భిన్నంగా జీహెచ్ఎంసీ పాలకమండలి ఆమోదం పొందకుండానే అధికారులే నేరుగా ప్రభుత్వానికి పంపిస్తారా ?అనే అనుమానాలు సైతం నెలకొన్నాయి. ఏం చేయనున్నారనేదానిపై అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. మొత్తానికి ప్రభుత్వమార్పుతో జీహెచ్ఎంసీలోనూ విచిత్ర పరిస్థితులేర్పడ్డాయి. -
3 వేల కోట్లుంటేనే.. ముందుకు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం మారడం.. జీహెచ్ఎంసీ ఖజానాలో నిధులు లేకపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో గ్రేటర్లో అభివృద్ధి పనులు కుంటుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్సార్డీపీ)తొలిదశ కింద చేపట్టిన పనుల్లో దాదాపు రూ.800 కోట్ల మేర పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో పనులు మందకొడిగా జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.100 కోట్లకుపైగా నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో ఎస్సార్డీపీ పనులు ఆగకుండా కొనసాగేందుకు బాండ్ల జారీతో పాటు బ్యాంకు రుణాలు తీసుకున్నారు. పనులు జరుగుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు నేరుగా కాంట్రాక్టర్ల బ్యాంకు ఖాతాల్లోకే నిధులు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. దాంతో పనులు ఆగలేదు. గత ఏడాది కాలంగా కొత్త అప్పులు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఏ పనీ చేయలేని దుస్థితి నెలకొంది. మరోవైపు గతంలో ఉన్న బీఆర్ఎస్ స్థానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చంది. ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలేమిటో స్పష్టం కాలేదు. దీంతో అధికారులు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. పురోగతిలోని పనులకే నిధుల్లేకపోవడంతో కొత్త పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో దాదాపు రూ.3వేల కోట్లుంటే కానీ జీహెచ్ఎంసీ యథావిధిగా ముందుకు సాగుతుందని సమాచారం. ఇంజినీరింగ్ నిర్వహణ పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు వెయ్యి కోట్లకుపైగా పేరుకుపోవడంతో వారు తరచూ ధర్నాలు చేస్తున్నారు. ఎస్సార్డీపీ తొలిదశలోని పనులు పూర్తయ్యేందుకు రూ. 800 కోట్లు కావాలి. వీటితో పాటు కొత్తగా ప్రాజెక్టులు, నిర్వహణ తదితర పనులు చేసేందుకు వెయ్యికోట్లకు పైగా నిధులు అవసరమవుతాయి. దీంతో దాదాపు రూ.3వేల కోట్లుంటే కానీ యథావిధిగా పనులు జరుగుతాయి. లేదంటే ఎక్కడి పనులక్కడే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమకు కనీసం రూ.2వేల కోట్లయినా ఇచ్చి ఆదుకోవాల్సిందిగా అధికారులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నట్లు తెలిసింది. గతంలో ఫ్లై ఓవర్ల వంటి పనులకు జీహెచ్ంసీ నిధులిచ్చేది కాదు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జీహెచ్ఎంసీనే అప్పులు చేసుకొని, తిరిగి చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది. అలా అందినకాడికి దాదాపు రూ.6వేల కోట్ల మేర అప్పులు చేశారు.వాటికి వడ్డీలు,ఈఎంఐల చెల్లింపుల వంటి వాటితో నెలనెలా సిబ్బంది జీతాల చెల్లింపులకే ఇబ్బందులెదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమకు కనీసం రూ.2వేల కోట్లయినా ఇచ్చి ఆదుకోవాలని జీహెచ్ఎంసీ ఆశపడుతోంది. ఆ మేరకు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిసింది. ఒక సంవత్సరంలో ప్రాజెక్టుల పనుల కోసం దాదాపు రూ.800 కోట్లు, ఇతర ఇంజినీరింగ్ పనులకు రూ.1200 కోట్లు ఖర్చు చేయవచ్చుననేది వారి ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. ఆస్తిపన్ను, టౌన్‌ప్లానింగ్ విభాగం ఫీజుల రూపేణా వచ్చే నిధులు సిబ్బంది జీతభత్యాలకు పోను మిగిలేవాటిని ఇతరత్రా పనులకు వినియోగించుకునేందుకు వీలవుతుంది. ప్రభుత్వం కరుణిస్తుందా ? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతియేటా జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు పంపడం తప్ప ప్రభుత్వం నుంచి నిధులందలేదు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోపాటు స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిధిలోనే జీహెచ్ఎంసీ ఉన్నందున ఈసారి నిధులందగలవని అధికారులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు ఏమేరకు ఫలిస్తాయో తెలియాలంటే కొద్దిరోజులాగాల్సిందే. -
ఆన్‌లైన్‌లోకి ఎక్కించేశారు!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల హామీ ‘అభయహస్తం’ కింద ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులను జీహెచ్ఎంసీ కంప్యూటరీకరించింది. ఈ నెల 17వ తేదీలోగా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి కావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు మంగళవారం రాత్రి వరకే ఈ పని పూర్తి చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 635 కేంద్రాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తం దరఖాస్తుల్లో పాతబస్తీ నుంచే అత్యధికంగా అందగా, అక్కడి ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట సర్కిళ్ల నుంచి అత్యధిక కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. రామచంద్రాపురం–పటాన్చెరు సర్కిల్ చిన్న సర్కిల్ కావడంతో అక్కడి నుంచి కూడా తక్కువ దరఖాస్తులందాయి. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన కింద ‘అభయహస్తం’ దరఖాస్తులతో పాటు రేషన్‌కార్డులు, ఇతరత్రా అవసరాలకు సంబంధించిన దరఖాస్తుల్ని సైతం అధికారులు స్వీకరించారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజైన ఈ నెల 6వ తేదీ వరకు సదరు అర్జీలు 5,73,069 అందినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. అభయహస్తం కింద అప్పటి వరకు 19,01,256 దరఖాస్తులు అందినట్లు ప్రకటించినప్పటికీ.. ఆన్లైన్ ప్రక్రియ ముగిసేటప్పటికి వాటిని 19,06,137గా తేల్చారు. స్వీకరణ చివరి రోజున ఆలస్యంగా అందిన అర్జీలు అప్పడు లెక్కలోకి రాకపోవడమో.. ఆ తర్వాత ఆయా కార్యాలయాల్లో స్వీకరించిన వినతులు కూడా ఆన్లైన్లో నమోదు చేయడం వల్లనో ఈ సంఖ్య పెరిగి ఉంటుందని చెబుతున్నారు. గాలిలో దరఖాస్తులతో ఆందోళన గ్యారంటీల దరఖాస్తుల్ని బయటి వ్యక్తులతో తరలిస్తుండగా అవి గాల్లోకి ఎగిరి పోవడంతో ఎవరి దరఖాస్తులైనా పోయాయేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అధికారులు మాత్రం ఏ ఒక్క దరఖాస్తూ పోలేదని ప్రకటించారు. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో ఆ తర్వాత తగిన శ్రద్ధ చూపారు. ఆన్లైన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఐదువేల మందికి పైగా ఆపరేటర్లతో కంప్యూటరీకరణ పూర్తి చేయించారు. రేషన్‌కార్డులు, ఇతరత్రా ఫిర్యాదులకు సంబంధించిన దరఖాస్తులు సర్కిల్, జోన్ల వారీగా అధికారులు వెల్లడించలేదు. వీటిలో రేషన్ కార్డులవే అత్యధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గ్యాస్, పెన్షన్ల కోసం అభయహస్తం కింద ఐదు పథకాలకు దరఖాస్తులు స్వీకరించగా, వాటిలో మహాలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్ల కోసం ఎక్కువ మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏ స్కీమ్‌కు ఎందరు దరఖాస్తుచేసుకున్నారనేది వెల్లడయ్యేందుకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రాసెసింగ్ పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నందున ఆయన తిరిగి వచ్చాక ఈ దరఖాస్తులకు సంబంధించిన తదుపరి ప్రక్రియపై స్పష్టత రానుందని జీహెచ్ఎంసీ అధికారులు అధికారులు చెబుతున్నారు. జోన్ల వారీగా.. ఆన్లైన్ నమోదు పూర్తయిన దరఖాస్తులు జోన్ల వారీగా ఇలా ఉన్నాయి. జోన్ ఆన్లైన్ ఎల్బీనగర్ 242579 చార్మినార్ 508772 ఖైరతాబాద్ 325641 శేరిలింగంపల్లి 170811 కూకట్పల్లి 314685 సికింద్రాబాద్ 300051 కంటోన్మెంట్ 43598 మొత్తం 1906137 -
తెలంగాణలో మరోసారి తెరపైకి నియోజకవర్గాల పునర్విభజన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లాలను పునర్విభజన చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించడంతో పాటు ఆ దిశగా కసరత్తు కూడా ప్రారంభమైన నేపథ్యంలో జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్లలోనూ మార్పు చేర్పులు ఉంటాయా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీలో గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఐదు జోన్లు (ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్) ఉండేవి. వాటిలో 18 సర్కిళ్లు ఉండేవి. 18 సర్కిళ్లను తొలుత 24 సర్కిళ్లుగా మార్చారు. తర్వాత వాటిని 30 సర్కిళ్లుగా చేశారు. ఐదు జోన్లను ఆరు జోన్లుగా మార్చారు. ఆరు జోన్లకు చార్మినార్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్ జోన్లుగా పేర్లు పెట్టారు. 12 జోన్లు.. 48 సర్కిళ్లు.. పరిపాలన సౌలభ్యం కోసమంటూ గత ప్రభుత్వం జిల్లాల సంఖ్యను పెంచినట్లే జీహెచ్ఎంసీ జోన్లను సైతం 12 జోన్లుగా చేయాలని.. ఒక్కో జోన్లో నాలుగు సర్కిళ్ల వంతున 48 సర్కిళ్లను ఏర్పాటు చేయాలని భావించింది. ఆమేరకు జీఓ కూడా వెలువడింది. కానీ.. ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. జోన్లను పదికి, సర్కిళ్లను యాభైకి పెంచాలని 2018లో స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించగా, 12 జోన్లు.. 48 సర్కిళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం జీఓ వెలువరించింది. కానీ అంతకుముందే ఏర్పాటైన ఆరు జోన్లే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాల పునరి్వభజన తెరపైకి రావడంతో జీహెచ్ఎంసీలోనూ జోన్లు, సర్కిళ్లు మారతాయా అనేది జీహెచ్ఎంసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ ప్రస్తుతమున్న సర్కిళ్లు, జోన్లలో సమస్యలున్నాయి. ఖైరతాబాద్ జోన్ షేక్‌పేట దాకా విస్తరించి ఉంది. శేరిలింగంపల్లి ఒకే జిల్లా పరిధిలో లేదు. ఇలా వివిధ అంశాల్లో వ్యత్యాసాలున్నాయి. గతంలో ఇలా.. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వాటిని 12 జోన్ల పరిధిలోకి తేవాలని భావించారు. ఒక్కో జోన్లో రెండు నియోజకవర్గాలు, నాలుగు సర్కిళ్లు ఉండేలా పునర్వ్యవస్థీకరించాల్సిందిగా జీవో జారీ చేశారు. ఆమేరకు కమిషనర్‌ను ఆదేశించారు. కానీ ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలోనూ మార్పుచేర్పులు జరగవచ్చననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ బాధ్యతలు కమిషనర్‌కు.. జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు జిల్లాలున్నాయి. అన్ని జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ కలెక్టర్లది కాగా హైదరాబాద్ జిల్లాది మాత్రం కమిషనర్‌కు అప్పగించారు. దీంతో ఎన్నికలొచ్చినా ప్రతిసారీ జీహెచ్ఎంసీలో పనులు నిలిచిపోతున్నాయి. కోటిమందికి పైగా సేవలందించే జీహెచ్ఎంసీ కమిషనర్‌కు జిల్లా ఎన్నికల అధికారి బాధ్యతలున్నాయి. గ్రేటర్ పరిధిలోనే ఉన్న ఒక జిల్లాలో ఐదు నియోజకవర్గాలుంటే, ఒక జిల్లాలో 15 నియోజకవర్గాలున్నాయి. ఒక ఎమ్మెల్యే పరిధిలో తక్కువ వార్డులుంటే.. మరో ఎమ్మెల్యే పరిధిలో ఎక్కువ వార్డులున్నాయి. ఇలా వివిధ అంశాల్లో వ్యత్యాసాలున్నాయి. దీంతో నియోజకవర్గాలతో పాటే జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్లు, వార్డుల్లోనూ మార్పుచేర్పులుంటాయా ? అనేది చర్చనీయాంశంగా మారింది. -
పడకేసిన పాలన!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో పనులు పడకేశాయి. కోటి మందికి పైగా ప్రజలకు సేవలందించాల్సిన జీహెచ్ఎంసీలో సేవలందడం లేదు. చెత్త సమస్యల నుంచి రోడ్ల అవస్థల దాకా.. ప్రాపర్టీట్యాక్స్ ఫిర్యాదుల నుంచి దోమల నివారణ దాకా ప్రజా సమస్యల పట్టింపు లేకుండా పోయింది. మూడు నెలలుగా అసెంబ్లీ ఎన్నికల పేరిట పనులు కుంటుపడగా.. ప్రస్తుతం ‘ప్రజా పాలన’ పేరిట పనులు జరగడం లేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం జీహెచ్ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు అవస్థలు పడుతున్నారు. తమ సమస్యలు తీర్చే అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ► నవంబర్ నెలాఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అంతకు ముందునుంచే ఎన్నికల నిబంధనల పేరిట పనులు కుంటుపడ్డాయి. పలువురు అధికారులు సైతం ఎన్నికల విధుల్లోనే ఉండటంతో తమ విభాగాలకు సంబంధించిన పనులు పట్టించుకోలేదు. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రభుత్వ ప్రాధాన్యతలేమిటో తెలియదని పనుల జోలికి వెళ్లలేదు. ప్రభుత్వ ప్రాధాన్యతలు తెలిశాక చేయాలనే తలంపుతో పనులు చేయడం లేరు.దానికి తోడు నిధుల లేమితోనూ శ్రద్ధ చూపడం లేదు. ► ప్రాజెక్టులకు సంబంధించిన పనులను అలా వదిలివేయగా, ప్రజల నిత్య సమస్యలను సైతం పట్టించుకోవడం లేదు. ఎన్నికలు ముగిసేంత దాకా ఎన్నికల విధుల సాకుతో సమస్యలను వినిపించుకోలేదు. ప్రస్తుతం ‘ప్రజాపాలన’ పేరిట మిగతా విషయాలను పట్టించుకోవడం లేదు. వివిధ విభాగాల అధికారులను, కిందిస్థాయి ఉద్యోగుల నుంచి విభాగాధిపతుల దాకా ప్రజాపాలనలో భాగస్వాములను చేశారు. కార్యక్రమం పకడ్బందీగా, త్వరితగతిన నిర్వహించాలనే తలంపుతో టీమ్‌లీడర్లు, స్పెషలాఫీసర్లు, తదితర పేర్లతో నియమించారు. దాంతో వారు తమ రెగ్యులర్ విధులు నిర్వహించడం లేదు. ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. వివిధ స్థాయిల్లోని అధికారుల మధ్య సమన్వయం కోసమని స్పెషలాఫీసర్లను నియమించినా సమన్వయం కనిపించడం లేదు. ఎందరున్నా.. ఎందరిని నియమించినా తగిన పర్యవేక్షణ, సమన్వయం లేకే ప్రజాపాలన దరఖాస్తుల్ని బజారు పాల్జేసి అభాసుపాలయ్యారు. అందుకు కారకులైన వారందరిపై చర్యలు తీసుకోలేకపోయారు. డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లనుంచి వివిధ విభాగాల అధికారులందరూ ‘ప్రజాపాలన’ విధుల్లోనే ఉన్నారంటున్నారు. సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేరని కొందరు బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు.ఆయా విభాగాల అధికారులతోపాటు కమిషనర్ సైతం ‘ప్రజాపాలన’ పనుల కోసం ఇతర జోన్లకు వెళ్లారనడంతో నిస్సహాయంగా వెనుదిరిగారు. ‘ప్రజావాణి’కి వెళ్లాల్సిందేనా.. ఈ నేపథ్యంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం జరిగే ‘ప్రజావాణి’కి హాజరు కావాల్సిందేనా ? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గుడ్డిలో మెల్ల చందంగా కనీసం సర్కిల్, జోనల్‌స్థాయిల్లో ‘ప్రజావాణి’ని ఇటీవలే ప్రారంభించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులనైనా వెంటనే పరిష్కరిస్తారో లేదో?! -
TGO అధ్యక్షురాలు మమతకు షాక్..బదిలీ వేటు.!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపైనే దృష్టి సారించిన కొత్త ప్రభుత్వం రాజధాని నగరంలో కీలకమైన జీహెచ్ఎంసీలోనూ బదిలీలు చేపట్టింది. అడిషనల్ కమిషనర్‌గా పని చేస్తున్న జె.శంకరయ్యను ఇప్పటికే టీఎస్టీఎస్ ఎండీగా పంపించిన సర్కారు... తాజాగా కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు జోనల్ కమిషనర్లను బదిలీ చేసింది. వారి స్థానంలో ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులను నియమించింది. దీంతో గ్రేటర్‌లోని ఆరు జోన్లకుగాను మూడు జోన్లలో ముగ్గురు జోనల్ కమిషనర్లు మహిళలే కావడం గమనార్హం. ఎన్నాళ్లకు.. ఎట్టకేలకు.. ఇప్పటి వరకు తాను కోరుకున్న ప్రాంతాల్లో తప్ప ఎక్కడికీ కదలబోననే విధంగా వ్యవహరించిన కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమతను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (ఎన్ఐయూఎం)కు బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఇటీవల జీహెచ్ఎంసీకి బదిలీపై వచి్చన అభిలాష అభినవ్‌ను కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా నియమించారు. మరో ఐఏఎస్ అధికారి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ (రెవెన్యూ,ఐటీ)గా ఉన్న స్నేహ శబరీ ను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా మార్చారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా జీహెచ్ఎంసీలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న బి.శ్రీనివాసరెడ్డిని ఆయన మాతృసంస్థ అయిన హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్‌కు బదిలీ చేశారు. ► వీరితో పాటు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ)లో ఎస్ఈగా ఉన్న వెంకటరమణను మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎంఆర్డీసీ)కు బదిలీ చేశారు. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఊహించినట్లుగానే దీర్ఘకాలికంగా జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న వారిని, డిప్యుటేషన్‌పై వచ్చి కీలక స్థానాల్లో ఉన్నవారిని ప్రభుత్వం బదిలీ చేసింది. వీరి ని పంపించేందుకు సమయం పట్టవచ్చనే అభిప్రాయాలు వెలువడినప్పటికీ జాప్యం లేకుండా బదిలీలు చేసింది. త్వరలోనే మరికొన్ని బదిలీలు జరిగే అవకాశం ఉంది. అంతర్గత బదిలీలు సైతం ఎన్నికల స్పెషలాఫీసర్‌గా పని చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ వై. శ్రీనివాసరెడ్డిని ఫలక్‌నుమా డిప్యూటీ కమిషనర్ (డీసీ)గా నియమించారు. అక్కడ డీసీగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న లావణ్యను ఫలక్‌నుమా ఏఎంసీగా అక్కడే ఉంచారు. సంతోష్ నగర్ డీసీగా ఉన్న వి.నరసింహను కుత్బుల్లాపూర్ డీసీగా బదిలీ చేశారు. కుత్బుల్లాపూర్ డీసీ ఎ. నాగమణిని సంతోష్ నగర్ డీసీగా బదిలీ చేశారు. డీసీ (ఫైనాన్స్)గా ఉన్న ఎల్.శ్రీలతను చారి్మనార్ డీసీగా బదిలీ చేశారు. చారి్మనార్ డీసీగా ఉన్న ఢాకు నాయక్‌ను కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. మరిన్ని మార్పులు.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో త్వరలోనే పలు మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. అధికారుల బదిలీలతో పాటు పనుల్లోనూ మార్పులు చోటు చేసుకునే వీలుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలేమిటో స్పష్టత వచ్చాక ఆమేరకు మార్పులు జరగనున్నాయి. మున్సిపల్ పరిపాలన శాఖను స్వయంగా తానే పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మూసీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. నగరానికి సంబందించి మొదటి సమీక్ష సమావేశాన్ని ఈ నది గురించే నిర్వహించడం.. ఆ తర్వాత నిర్వహించిన సమీక్షలోనూ మూసీని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. -
స్పీడ్ పెంచిన సీఎం రేవంత్.. ఇక GHMC, HMDA వంతు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలు శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సమీక్షలు నిర్వహించారు. ఇక, తాజాగా కొత్త ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌పై ఫోకస్ పెట్టింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏపై సమీక్ష చేపట్టనుంది. అయితే, గ్రేటర్ హైదరాబాద్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెల 25వ తేదీ తరువాత జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏపై కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏ పరిధిలో రిపోర్టు తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్, పెండింగ్ పనుల లిస్ట్‌పై బల్దియా కసరత్తు మొదలు పెట్టింది. ఇక, హెచ్ఎండీఏ పరిధిలో ఓఆర్ఆర్ టెండర్లు, భూముల వేలంతో పాటు పెండింగ్ పనుల లిస్ట్‌ను అధికారులు సిద్దం చేస్తున్నారు. మరోవైపు, ఆదాయ మార్గాల్లో భాగంగా రెండింటిపై ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి వద్దే మున్సిపల్ శాఖ ఉన్న విషయం తెలిసిందే. -
ఓటేద్దాం రండి!
ఓటు ఎంతో విలువైనది.. వెలకట్టలేనిది. రాష్ట్ర భవిష్యత్, ప్రజల తలరాతను నిర్దేశించే శక్తివంతమైన ఆయుధం ఓటే. ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయండి. వచ్చే ఐదేళ్లలో మీ ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చగలిగే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. ఐదేళ్లకోసారి మాత్రమే ప్రజాక్షేత్రంలోకి వచ్చే నేతలకు మీ శక్తియుక్తులను తెలియజేయండి. ఓటరుకు 21 సెకన్లు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఒక్కో ఓటరు ఓటేసేందుకు సగటున 21 సెకన్ల సమయం కేటాయించనున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. మొత్తం 10 గంటల పాటు పోలింగ్ జరుగుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,550 మంది, మిగిలిన చోట్లలో గరిష్టంగా 1,500 మంది ఓటర్లు ఓటేసేందుకు ఏర్పాట్లు చేశారు. 36,000 సెకన్ల పాటు పోలింగ్ పోలింగ్ కేంద్రంలో మొత్తం 36 వేల సెకన్ల పాటు పోలింగ్ జరగనుండగా, ఒక్కో ఓటరు ఓటేసేందుకు సగటున 21 సెకన్ల చొప్పున మొత్తం 31,500– 32,550 సెకన్ల సమయం పట్టనుంది. ఓటరు పోలింగ్ కేంద్రంలో ప్రవేశించిన వెంటనే తొలుత అతడి పేరు ఓటరు జాబితాలో ఉందా లేదా అని ఓ పోలింగ్ అధికారి పరిశీలించి నిర్థారిస్తారు. ఆ తర్వాత మరో అధికారి ఓటరు ఎడమచేతి చూపుడు వేలుకు సిరా చుక్క పెడతారు. అనంతరం మరో అధికారి ఈవీఎం కంట్రోల్ యూనిట్‌ను సిద్ధం చేసి ఓటరు ఓటేసేందుకు బ్యాలెట్ యూనిట్ ఉండే కంపార్ట్మెంట్లోకి పంపిస్తారు. ఈ మూడు ప్రక్రియలు 14 సెకన్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. జాబితాలో పేరు ఉందా? లేదా? ఎలా తెలుసుకోవాలి ? కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వెబ్సైట్ https://electoralsearch.eci.gov.in/ ద్వారా ఓటరు వివరాలు/ ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్)/ మొబైల్ నంబర్ ఆధారంగా జాబితాలో పేరును సెర్చ్ చేయడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తోంది. మొబైల్ ఫోన్ నంబర్, ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా జాబితాలో పేరు సెర్చ్ చేయడం చాలా సులువు. గతంలో ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారు మాత్రమే మొబైల్ ఫోన్ నంబర్ ఆధారంగా పేరును సెర్చ్ చేయడానికి వీలుంటుంది. ఓటరు పేరు, తండ్రి పేరు/ వయసు ఇతర వివరాలను కీ వర్డ్స్‌గా వినియోగించి సెర్చ్ చేసినప్పుడు అక్షరాల్లో స్వల్ప తేడాలున్నా జాబితాలో పేరు కనిపించదు. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌తో సకల సదుపాయాలు ఓటర్స్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఓటర్లకు సకల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఓటర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవడం, ఓటర్ల జాబితాలో పేరు వెతకడం, పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవడం, బీఎల్ఓ/ఈఆర్వోతో అనుసంధానం కావడం, ఈ– ఎపిక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం వంటి సేవలను పొందవచ్చు. పోలింగ్ కేంద్రంలో సెల్ఫోన్లపై నిషేధం ! పోలింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్లు, కార్డ్ లెస్ ఫోన్లు, వైర్ లెస్ సెట్లతో ప్రవేశంపై నిషేధం ఉంది. పోలింగ్ కేంద్రానికి చుట్టూ 100 మీటర్ల పరిసరాల పరిధిలోకి ఇలాంటి పరికరాలు తీసుకెళ్లకూడదు. పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తూ సెల్ఫీలు తీసుకోవడానికి సైతం వీలు లేదని గతంలో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కేవలం ఎన్నికల పరిశీలకులు, సూక్ష్మ పరిశీలకులు, ప్రిసైడింగ్ అధికారులు, భద్రత అధికారులు మాత్రమే ఎన్నికల కేంద్రంలో మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లవచ్చు. అయితే వాటిని సైలెంట్ మోడ్‌లో ఉంచాల్సిందే. ఓటర్లు పోలింగ్ బూత్‌లో ప్రవేశించి ఓటు ఎవరికి వేశారో మొబైల్ ఫోన్ కెమెరాల్లో చిత్రీకరించే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. వీవీ ప్యాట్ యంత్రాల డిస్ప్లే స్క్రీన్‌పై ఓటు ఎవరికి వేశారో ఏడు క్షణాల పాటు కనిపించనుంది. దీనిని ఫోన్‌తో ఫొటో తీసే అవకాశం ఉండటంతో మొబైల్ ఫోన్లపై నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. నిర్ణీత సమయం దాటిన తర్వాత లైనులో ఉంటే ఓటుహక్కు కల్పిస్తారా? రాష్ట్రంలోని 13 వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రం ముందు లైనులో నిలబడిన వారికి ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. పోలింగ్ సమయం ముగిసిన వెంటనే లైనులో ఉన్న వారికి పోలింగ్ అధికారులు టోకెన్లు ఇస్తారు. ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు ! పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేకంగా అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్(ఏఎస్డీ) ఓటర్ల జాబితా రూపొందించి సంబంధిత పోలింగ్ కేంద్రం ప్రిసైడింగ్ అధికారికి అందజేస్తారు. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తి పేరు ఓటరు జాబితాలో లేకపోతే, ఆ వ్యక్తి పేరును ఏఎస్డీ ఓటర్ల జాబితాలో వెతకాలి. ఏఎస్డీ ఓటర్ల జాబితాలో ఆ వ్యక్తి పేరుంటే ఓటరు గుర్తింపు కార్డు/ లేదా ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి గుర్తింపును ప్రిసైడింగ్ అధికారి ముందుగా నిర్ధారించుకుంటారు. అనంతరం ఆ వ్యక్తి పేరును ఫారం 17ఏలో నమోదు చేసి సంతకంతో పాటు వేలిముద్ర తీసుకుంటారు. ఈ క్రమంలో తొలి పోలింగ్ అధికారి సదరు ఏఎస్డీ ఓటరు పేరును పోలింగ్ ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు. సదరు ఓటరు నుంచి నిర్దిష్ట ఫార్మాట్లో డిక్లరేషన్ తీసుకోవడంతో పాటు ఫొటో, వీడియో తీసుకుంటారు. అనంతరం అతడికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. వికలాంగులు, వృద్ధులు ఓటేసేందుకు వాహన సదుపాయం కోసం ఎవరిని సంప్రదించాలి. స్థానిక బూత్ లెవెల్ అధికారి (బీఎల్ఓ)ని సంప్రదిస్తే ఆటో ద్వారా ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి తరలించనున్నారు. పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో.. ఎలా తెలుసుకోవాలి ? రాష్ట్రంలోని ఓటర్లందరికీ ఎన్నికల సంఘం ఫొటో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు జారీ చేసింది. ఈ ఓటర్ స్లిప్పుల వెనకభాగంలో పోలింగ్ కేంద్రం రూటు మ్యాప్‌ను పొందుపరిచింది. ఈ రూట్ మ్యాప్‌తో సులువుగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవచ్చు. కొత్త ఎపిక్ కార్డు నంబర్ ఎలా తెలుసుకోవాలి? గతంలో కేంద్ర ఎన్నికల సంఘం 13/14 అంకెల సంఖ్యతో ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేయగా, గత కొంత కాలంగా 10 అంకెల సంఖ్యతో కొత్త ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేస్తోంది. పాత ఓటరు గుర్తింపు కార్డు నంబర్ ఆధారంగా మీ కొత్త ఓటరు గుర్తింపు కార్డు నంబర్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయం రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్ https:// ceotserms2. telangana. gov. in/ ts& search/ Non& Standard& Epic. aspx ను సందర్శించి మీ పాత ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా కొత్త ఎపిక్ కార్డు నంబర్‌ను తెలుసుకోవచ్చు. మీ ఓటును వేరేవాళ్లు వేసేశారా? అయితే.. టెండర్ ఓటేయవచ్చు! ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సరికి మీ ఓటు వేరేవారు వేసేశారా? అయితే దిగులుపడాల్సిన అవసరం లేదు. మీకు టెండర్ ఓటు వేసే హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం) ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తారు. టెండర్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారులు ఫారం–17బీలో రికార్డు చేస్తారు. ఈ ఫారంలోని 5వ కాలమ్‌లో ఓటరు సంతకం/వేలి ముద్రను తీసుకున్న తర్వాత వారికి బ్యాలెట్ పత్రం అందజేస్తారు. ప్రత్యేక ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ఓటరు బ్యాలెట్ పత్రాన్ని తీసుకెళ్లి తాము ఓటెయదలచిన అభ్యర్థికి చెందిన ఎన్నికల గుర్తుపై స్వస్తిక్ ముద్రను వేయాల్సి ఉంటుంది. ఓటేవరికి వేశారో బయటకు కనబడని విధంగా బ్యాలెట్ పత్రాన్ని మడిచి కంపార్ట్మెంట్ బయటకి వచ్చి ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలి. ఆ బ్యాలెట్ పత్రాన్ని టెండర్ ఓటుగా ప్రిసైడింగ్ అధికారి మార్క్ చేసి ప్రత్యేక ఎన్వలప్లో వేరుగా ఉంచుతారు. చాలెంజ్ ఓటు అంటే ..? ఓటేసేందుకు వచ్చిన వ్యక్తి గుర్తింపును అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు రూ.2 చెల్లించి సవాలు చేయవచ్చు. ఓటరు గుర్తింపును నిర్ధారించడానికి ప్రిసైడింగ్ అధికారి విచారణ జరుపుతారు. ఓటరు గుర్తింపు నిర్ధారణ జరిగితే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. దొంగ ఓటరు అని నిర్ధారణ అయితే సదరు వ్యక్తిని ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు అప్పగించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అక్కడ భారీగా బందోబస్తు 119 స్థానాల్లోని 27 శాసనసభ నియోజకవర్గాల్లో 614 పోలింగ్ కేంద్రాలపై వామపక్ష ప్రభావం ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే మూడు దఫాలుగా పోలింగ్ ముందు, పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత చేపట్టాల్సిన బందోబస్తుపై ప్రత్యేక ప్రణాళిక చేపట్టారు. ఓటింగ్ రోజు పక్కాగా 144 సెక్షన్ అమలు, పోలింగ్ తర్వాత చీకటి పడకముందే ఈవీఎంలను భద్రంగా స్ట్రాంగ్‌రూంకు తరలించడం, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా రక్షణ కల్పించనున్నారు. మావోయిస్టుల తీవ్ర ప్రభావమున్న 13 నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగించనున్నారు. అనుచితంగా ప్రవర్తిస్తే పోలింగ్ బూత్ నుంచి గెంటివేతే స్పష్టం చేస్తున్న నిబంధనలు పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలో అనుచితంగా ప్రవర్తించిన లేదా చట్టపర ఆజ్ఞలను పాటించడంలో విఫలమైన వ్యక్తులను ప్రిసైడింగ్ అధికారి బయటకు పంపించవచ్చు అని కేంద్ర ఎన్నికల సంఘం గతంలో స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 కింద ఈ మేరకు అధికారాలు ప్రిసైడింగ్ అధికారికి ఉన్నాయని పేర్కొంది. మద్యం సేవించినా లేదా మాదక ద్రవ్యాలను వినియోగించిన వ్యక్తులను పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించకుండా నిలువరించేందుకు అనుమతి కోరుతూ గత శాసనసభ సాధారణ ఎన్నికల సందర్భంగా నాటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్ రాసిన లేఖకు స్పందిస్తూ అప్పట్లో ఈ మేరకు స్పష్టతనిచ్చింది. మద్యం సేవించి పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తుల ఓటు హక్కును నిరాకరించడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. మద్యం లేదా మాదక ద్రవ్యాల మత్తులో విచక్షణ కోల్పోయి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే వ్యక్తులను మాత్రం పోలీసుల సహాయంతో బయటకు పంపించేందుకు నిబంధనలు అనుమతిస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి. వెబ్‌కాస్టింగ్‌తో ప్రత్యక్ష ప్రసారం ఓటు హక్కు వినియోగించుకునే దృశ్యం ప్రత్యక్ష ప్రసారం కానుంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా 3.26 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే దృశ్యాలు పోలింగ్ కేంద్రాల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఓటర్లే కాదు.. ఎన్నికల విధుల్లో పాల్గొననున్న పోలింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, భద్రత సిబ్బంది, పోలింగ్ ఏజెంట్ల ప్రతి కదలికను ఎన్నికల సంఘం లైవ్‌గా వీక్షించనుంది. పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 27,094 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించనున్న పోలింగ్ ప్రక్రియను ఆద్యంతం ‘లైవ్ వెబ్‌కాస్ట్’ చేయనున్నారు. ఎక్కడ ఎలాంటి అపశ్రుతి చేసుకున్నా, ఎవరైనా ఆటంకం సృష్టించినా, ఏమైనా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నా క్షణాల్లో ఎన్నికల సంఘం సంబంధిత పోలింగ్ కేంద్రంలోని పరిస్థితులను లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా వీక్షిస్తుంది. వెంటనే స్థానిక పోలింగ్ అధికారులకు సూచనలు జారీ చేస్తుంది. ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు, హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ), జిల్లా కేంద్రాల నుంచి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, నియోజకవర్గ కేంద్రాల నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా టీవీ తెరలపై ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. సాంకేతికంగా ప్రత్యక్ష ప్రసారం సాధ్యం కాని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు కానుంది. ప్రతి కదలిక ప్రత్యక్ష వీక్షణ ♦ లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు చూసేందుకు ఏర్పాట్లు ♦ పోలింగ్ కేంద్రంలో ప్రవేశించిన ఓటరును పోలింగ్ అధికారి గుర్తించే ప్రక్రియ. ♦ ఓటరు వేలి మీద సిరా చుక్క రాయడం ♦ ఓటరును గుర్తించిన అనంతరం ఈవీఎంకు సంబంధించిన కంట్రోల్ యూనిట్‌ను ప్రిసైడింగ్ అధికారి స్టార్ట్ చేయడం ♦ ఓటు వేసేందుకు పోలింగ్ కంపార్ట్మెంట్లో ఓటరు ప్రవేశించే దృశ్యం. అయితే, ఓటు ఎవరికి వేశారన్న రహస్యాన్ని కాపాడేందుకు ఈవీఎం బ్యాలెట్ యూనిట్ కనిపించని విధంగా కెమెరా ఏర్పాట్లు చేస్తారు. ♦ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఏజెంట్ల కదలికలు ♦ పోలింగ్ ముగింపు సమయంలో ఇంకా ఓటేసేందుకు వరుసలో నిలబడిన ఓటర్లకు టోకెన్లు/స్లిప్పులు అందించే ప్రక్రియ. ♦ పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు(బ్యాలెట్ యూనిట్/కంట్రోల్ యూనిట్), వీవీ ప్యాట్లను సీల్ వేసే దృశ్యంతో పాటు పోలింగ్ ఏజెంట్లకు 17సీ కాపీలు అందజేసే దృశ్యం. ♦ కనీసం 7–8 అడుగులకు మించిన ఎత్తులో కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ♦ కెమెరాను గోడకు స్టాండ్ ఆధారంగా, లేదా స్థిరంగా ఉండే విధంగా ఓ చోట బిగిస్తారు. ♦ వెబ్ కెమెరా/సీసీటీవీ నిఘా పరిధిలో మీరు ఉన్నారని పోలింగ్ కేంద్రం వద్ద హెచ్చరిక నోటీసులు అతికిస్తారు. పోలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది ? పోలింగ్ కేంద్రంలో ప్రవేశించిన వ్యక్తికి ఆ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరు ఉందా? లేదా ? అన్న విషయాన్ని ఏదైనా గుర్తింపుకార్డు ఆధారంగా తొలి పోలింగ్ అధికారి పరిశీలిస్తారు. రెండో పోలింగ్ అధికారి ఆ ఓటరు ఎడుమ చేతి చూపుడు వేలుకు సిరా చుక్క అంటించి, ఓ స్లిప్పు అందజేస్తారు. ఫారం–17ఏలో వివరాలు నమోదు చేసి ఓటరు సంతకం తీసుకుంటారు. మూడో పోలింగ్ అధికారి వద్ద ఆ స్లిప్పును డిపాజిట్ చేసి, సిరా చుక్క అంటించిన వేలును చూపిస్తే ఓటేసేందుకు పోలింగ్ బూత్‌లోకి పంపిస్తారు. అక్కడ మూడో పోలింగ్ అధికారి ఓటు వేసేందుకు సాంకేతికంగా ఈవీఎంను సిద్ధం చేసి పెడతారు. ఈవీఎంలో ఓటు ఎలా వేయాలి ? ఈవీఎంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ పరికరాలుంటాయి. ప్రిసైడింగ్ అధికారి నియంత్రణలో కంట్రోల్ యూనిట్ ఉంటుంది. బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ మాత్రం ఓటరు ఓటువేసే కంపార్ట్మెంట్లో ఉంటాయి. బ్యాలెట్ యూనిట్‌పై ఓటరు తనకు నచ్చిన అభ్యర్థి పేరు పక్కన ఉన్న నీలిరంగు మీటను నొక్కగానే..ఆ అభ్యర్థి పేరు, మీట మధ్యలో ఉండే రెడ్‌లైట్ వెలుగుతుంది. ఆ వెంటనే ఓటు ఎవరికి పడిందో తెలిపేందుకు అభ్యర్థి పేరు, క్రమసంఖ్య, ఎన్నికల గుర్తుతో ఓ స్లిప్పు వీవీప్యాట్‌పై ప్రింట్ అవుతుంది. 7 సెకండ్ల పాటు వీవీప్యాట్ డిస్ప్లే విండోపై ఈ స్లిప్ ఓటరుకు ప్రదర్శితమవుతుంది. ఆ తర్వాత వీవీప్యాట్‌లోని డ్రాప్ బాక్స్‌లోకి స్లిప్ పడిపోతుంది. ఆ వెంటనే ఓటు విజయవంతంగా పడినట్టు బీప్ శబ్దం వినిపిస్తుంది. ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు! ♦ ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డులుంటే ఓకే ♦ ఎపిక్ కార్డులో స్వల్ప తేడాలున్నా ఓటేయవచ్చు ♦ ఎపిక్‌తో గుర్తింపు ధ్రువీకరణ కాకుంటే ప్రత్యామ్నాయ గుర్తింపు తప్పనిసరి ♦ ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పును గుర్తింపుగా పరిగణించరాదు ♦ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈసీ కొత్త మార్గదర్శకాలు ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్)లోని వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్ధారణ అయితే ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వేరే నియోజకవర్గానికి సంబంధించిన ఓటరు గుర్తింపు కార్డును చూపించి, మరో నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చే వారికి సైతం ఓటు హక్కు కల్పించాలని సూచించింది. అయితే, ఆ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరు ఉంటేనే ఈ సదుపాయం కల్పించాలని కోరింది. ఓటరు గుర్తింపు నిర్ధారణ విషయంలో ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఎపిక్‌లో లోపాలుంటే వేరే గుర్తింపు తప్పనిసరి.. ఓటరు గుర్తింపు కార్డులో ఫొటోలు తారుమారుకావడం, ఇతర లోపాలతో ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యంకానప్పుడు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాల్లో(కింద జాబితాలో చూడవచ్చు) ఏదైనా ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ప్రవాస భారత ఓటర్లు తమ పాస్‌పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపింది. పోలింగ్‌కు కనీసం 5 రోజుల ముందు పోలింగ్ కేంద్రం పేరు, తేదీ, సమయం, ఇతర వివరాలతో ఓటర్లకు పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను జారీ చేయాలని ఆదేశించింది. అయితే, వీటిని ఓటరు గుర్తింపుగా పరిగణించరాదని స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేనిపక్షంలో, ఉన్న గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానిపక్షంలో పోలింగ్ రోజు ఈ కింది జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో ధ్రువీకరణ పత్రాలను తీసుకువస్తే ఓటు హక్కు కల్పించాలని ఆదేశించింది. ♦ ఆధార్‌కార్డు ♦ ఉపాధి హామీ ♦ జాబ్‌కార్డు ♦ బ్యాంకు/తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్ ♦ కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు ♦ డ్రైవింగ్ లైసెన్స్ ♦ పాన్‌కార్డు ♦ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా(ఆర్జీఐ).. నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రార్(ఎన్పిఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు ♦ భారతీయ పాస్‌పోర్టు ♦ ఫొటో గల పెన్షన్ పత్రాలు ♦ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్‌యూలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డులు ♦ ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు ♦కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు(యూడీఐడీ) - ముహమ్మద్ ఫసియొద్దీన్ -
అందుకే నాంపల్లి ప్రమాదం జరిగింది: అగ్నిమాపక శాఖ
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాద ఘటనపై అగ్నిమాపక శాఖ అధికారిక ప్రకటన చేసింది. బిల్డింగ్‌లో ఫైర్ సేఫ్టీ లేదని పేర్కొన్న ఫైర్‌శాఖ.. కెమికల్ డ్రమ్ముల వల్లే అగ్నిప్రమాదం జరిగిందని తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ‘‘అగ్నిప్రమాదం నవంబర్ 13 సోమవారం ఉదయం 9గం.30 నిమిషాలకు జరిగింది. ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. ప్రమాదం నుంచి 21 మందిని రక్షించగలిగాం. అక్రమంగా సెల్లార్లో కెమికల్ డ్రమ్ములు పెట్టారు. ఆ డ్రమ్ముల వల్లే అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్‌లో ఫైర్ సేఫ్టీ లేకపోవడం గుర్తించాం అని అగ్నిమాపక శాఖ ప్రకటించింది. #WATCH | Daring rescue of a child and woman amid massive fire in a storage godown located in an apartment complex in Bazarghat, Nampally of Hyderabad pic.twitter.com/Z2F1JAL8wa — ANI (@ANI) November 13, 2023 స్థానికుల మౌనం సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ కెమికల్ నిల్వలను రమేష్ జైశ్వాల్ అనే వ్యక్తి నిల్వ ఉంచినట్లు తేలింది. పెద్ద పెద్ద డ్రమ్ముల్లో నిల్వ ఉంచి అపార్ట్మెంట్ సెల్లార్లో వ్యాపారం చేస్తున్నాడు రమేష్ జైశ్వాల్. అయితే ఇది చాలారోజులుగా నడుస్తున్న వ్యవహారమని అధికారులకు తెలిసింది. దీంతో స్థానికుల్ని ప్రశ్నించారు వాళ్లు. భారీగా కెమికల్ నిల్వలు ఉంచినప్పుడు తమకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అపార్ట్మెంట్ వాసులను అడిగారు అగ్నిమాపక శాఖ అధికారులు. అయితే స్థానికులు ఆ ప్రశ్నకు మౌనం వహించారు. మరోవైపు తనిఖీలు చేపట్టని విజిలెన్స్ అధికారులు, సేఫ్టీ పరిశీలనలో విఫలమైన జీహెచ్ఎంసీ తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఒక పార్టీనుంచి గెలిచి.. మరో పార్టీ నుంచి పోటీ చేయొచ్చు
హైదరాబాద్: జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్లుగా గెలిచిన ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు టికెట్లు లభించాయి. వీరిలో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఇటీవలే బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి చాలాకాలం క్రితమే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వీరిద్దరికీ కాంగ్రెస్ పార్టీ టికెట్లుచింది. పోటీ చేసేందుకు వీరు తమ కార్పొరేటర్ల పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. వీరితో పాటు కాంగ్రెస్ నుంచే టికెట్ పొందిన జీహెచ్ఎంసీని ఆనుకునే ఉన్న మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేందర్ సైతం చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిన పనిలేదు. ఆయన పార్టీ కూడా మారలేదు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారినా, మారకపోయినా రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లుగా కొనసాగుతున్న వారు ఎమ్మెల్యే వంటి ఇతర పదవులకు పోటీ చేయడానికి ముందే తమ పదవులకు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. మున్సిపల్ యాక్ట్, నియమ నిబంధనల మేరకు స్థానిక సంస్థల్లో సభ్యులుగా కొనసాగుతున్న వారు రాజీనామా చేయకుండానే ఎమ్మెల్యే, ఇతరత్రా పదవులకు పోటీ చేయవచ్చని మున్సిపల్ చట్టాల నిపుణులు తెలిపారు. పోటీ చేసి, గెలిచాక మాత్రం పాత పదవిని వదులుకోవాల్సి ఉంటుందన్నారు. ఏకకాలంలో రెండు పదవుల్లో ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఓడిపోతే పాత పదవిలోనే యథాతథంగా కొనసాగవచ్చు. కార్పొరేటర్లకు వర్తించదు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించే ఎమ్మెల్యేల విషయంలోనే సవ్యంగా అమలు కావడం లేదు. ఆ చట్టం ఉన్నప్పటికీ దాని వల్ల ఆశించిన ఫలితం కనిపించడం లేదు. ఇక ఎలాంటి చట్టమూ లేని కార్పొరేటర్లకు ఎలాంటి నిబంధనలు వర్తించవు. పార్టీలు మారితే ఆమేరకు పాత పారీ్టకి రాజీనామా చేయాల్సి ఉంటుంది. – పద్మనాభరెడ్డి, ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక్క పదవిలోనే ఉండాలి జీహెచ్ఎంసీ యాక్ట్‌లోని సెక్షన్ 5–డి మేరకు కార్పొరేటర్ కంటే ఉన్నతమైన పదవిని పొందినవారు పదిహేను రోజుల్లోగా తాను కొత్త పదవిలో చేరనున్నట్లు కమిషనర్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. అప్పటి నుంచి ఆయనకు కార్పొరేటర్ పదవి రద్దవుతుంది. ఎమ్మెల్యే పదవనే కాదు.. మరే ఇతర పదవైనా సరే రెండో పదవిలో ఉండటం చెల్లదు. ఏకకాలంలో ఒకే పదవిలో మాత్రమే ఉంటారు. ఎమ్మెల్యేగా పోటీచేసేవారు గెలవని పక్షంలో యథావిధిగా తమ కార్పొరేటర్ పదవిలో కొనసాగవచ్చు. సాంకేతికంగానూ ఎలాంటి విధివిధానాలంటూ లేవు. – జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అధికారి మారిన వారెందరో.. జీహెచ్ఎంసీలో ఇప్పటికే పలువురు పారీ్టలు మారారు. ఆమేరకు వారు సాంకేతికంగా ఆచరించాల్సిన విధానాలంటూ ఏమీ లేకపోవడంతో సర్వసభ్య సమావేశాలప్పుడు మాత్రం మారిన పార్టీ సభ్యులతో కలిసి కూర్చుంటున్నారు. అంతకుమించి పాటించిన విధానాలేమీ లేవు. -
వరద రాకముందే పసిగట్టొచ్చు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : భాగ్యనగరంలో ఏటా వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతుండటం, ఒక్కోసారి ప్రమాదవశాత్తూ మ్యాన్‌హోల్స్ లేదా నాలాల్లో పడి పలువురు దుర్మరణం పాలవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ సమస్యకు వినూత్న పరిష్కారం కనుగొనేందుకు ఐఐటీ హైదరాబాద్ ముందుకొచ్చింది. ప్రజలపై వరద ప్రభావాన్ని వీలైనంత తగ్గించేందుకు, నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం వివరాలను ముందుగానే కచ్చితత్వంతో అంచనా వేసేందుకు వీలుగా పట్టణ వరద సమాచార వ్యవస్థ (అర్బన్ ఫ్లడ్ ఇన్ఫ్ర్మేషన్ సిస్టం–యూఎఫ్ఐఎస్)ను అభివృద్ధి చేస్తోంది. తద్వారా నగరవాసులను ముందే అప్రమత్తం చేయడంతోపాటు వరద సన్నద్ధత చర్యల్లో వివిధ ప్రభుత్వ విభాగాలకు తోడ్పాటు అందించనుంది. ఐఐటీహెచ్ సివిల్ ఇంజనీరింగ్, క్లైమేట్ చేంజ్ విభాగానికి చెందిన అసోసియేట్ ఫ్రొఫెసర్ డాక్టర్ రేగొండ సతీష్‌కుమార్ నేతృత్వంలోని పరిశోధన బృందం ఈ దిశగా కసరత్తు ప్రారంభించింది. విశ్లేషించి.. అంచనా వేసి.. ఇందుకోసం జీహెచ్ఎంసీలోని విపత్తుల నిర్వహణ విభాగంతోపాటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (హైదరాబాద్), తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం తదితర సంస్థలతో ఐఐటీ హైదరాబాద్ పరిశోధన బృందం సమన్వయం చేసుకోనుంది. ఆయా సంస్థలు అందించే వాతావరణ గణాంకాల ఆధారంగా నగరంలో ఎక్కడెక్కడ ఎంత మేర వర్షం కురిసే అవకాశం ఉందో విశ్లేషించనుంది. లోతట్టు ప్రాంతాలు, వరద వ్యాప్తిని సిములేషన్ మోడలింగ్ టెక్నిక్‌ల సాయంతో కచ్చితత్వంతో అంచనా వేయనుంది. అలాగే స్నాప్ఫ్లడ్ టీఎం అనే సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫాం ద్వారా నగరవాసుల నుంచి ఎప్పటికప్పుడు రియల్‌టైంలో వరద వివరాలను సేకరించాలని ఐఐటీ హైదరాబాద్ ప్రణాళికలు రచిస్తోంది. దీనికి అదనంగా ఫ్లడ్ హాట్స్పాట్లను గుర్తించేందుకు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సంస్థల సహకారం సైతం తీసుకోనుంది. రెయిన్‌ఫాల్–రన్ఆఫ్ అనాలసిస్ మోడలింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ టూల్స్ (రాఫ్ట్) పేరుతో ఈ పరిశోధన బృందం పనిచేయనుంది. నగరాలకు ఎంతో ఉపయోగం అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టం అనేది ఒక్క హైదరాబాద్ నగరానికే కాకుండా దేశంలోని ఇతర వరద పీడిత నగరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి తెలిపారు. తాము చేపట్టే పరిశోధనలు నిత్యం సమాజంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతాయన్నారు. ప్రొఫెసర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ భారీ వర్షాలతో వచ్చే వరదల ప్రభావాన్ని తగ్గించేందుకు అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ఇవీ ప్రయోజనాలు.. ♦ అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా వరద ముంచెత్తే ప్రాంతాలను ముందే గుర్తించొచ్చు. తద్వారా ఆ ప్రాంతాలవైపు ప్రజలు వెళ్లకుండా అప్రమత్తం చేయొచ్చు. ♦ వరద నీరు ఎటువైపు పారుతోంది.. ఏయే ప్రాంతాల్లో ఎంత మేర నిలిచి ఉంది... వరద హాట్స్పాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి వంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకొనేందుకు వీలు కలుగుతుంది. -
బల్దియాలో పనులకు బ్రేక్
హైదరాబాద్: జీహెచ్ఎంసీలో ప్రాజెక్టుల పరిధిలోని పనులు మినహా ఇంజినీరింగ్ పనుల్ని కాంట్రాక్టర్లు చాలా ప్రాంతాల్లో నిలిపివేశారు. ఇప్పటికే రూ.800 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పాటు మంజూరైన పనులు మరో రూ. 3వేల కోట్లున్నాయని కాంట్రాక్టర్ల అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఎంతోకాలంగా బిల్లులు చెల్లించాల్సిందిగా మంత్రి నుంచి చీఫ్ సెక్రటరీ, కమిషనర్‌దాకా అందరినీ కలిసి విన్నవించినా తమ బాధలు ఎవరూ పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పనులు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచే పనులు నిలిపివేయనున్నట్లు ఇప్పటికే ఎన్నో పర్యాయాలు తెలిపినా, అధికారుల నుంచి స్పందన రాలేదన్నారు. ఒకటి, రెండు తేదీల్లో జీహెచ్ఎంసీ కార్యాలయాలకు సెలవులు కావడంతో మంగళవారం జోనల్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించారు. తమ బిల్లుల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. శ్రీనో పేమెంట్– నోవర్క్శ్రీ స్లోగన్లు చేశారు. బ్యానర్లు ప్రదర్శించారు. వెయ్యికోట్లే చెల్లించలేకపోతున్న వారు రూ. 4వేల కోట్ల పనులు చేస్తే వాటినిచ్చేందుకు ఎన్నేళ్లు కావాలని ప్రశ్నించారు. వీటిని వివరిస్తూ తుది దశలో ఉన్న పనుల్ని మాత్రం పూర్తిచేసి, మిగతా పనుల్ని చేయవద్దని, కొత్త టెండర్ల జోలికి అసలే పోవద్దని కాంట్రాక్టర్ల అసోసియేషన్ సభ్యులు జీహెచ్ఎంసీలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లందరినీ కోరారు. ఐక్యత చూపించకపోతే అందరూ ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించారు. గత కమిషనర్ లోకేశ్‌కుమార్ ఫిబ్రవరి వరకు బిల్లుల్ని మార్చి వరకు చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ చెల్లింపులు జరగలేదని తెలిపారు. ఆర్నెల్లుగా కోరుతున్నా ఎవరూ తమ బాధలు పట్టించుకోవడం లేదని అసోసియేషన్ వేదన వ్యక్తం చేసింది. ఇంజినీరింగ్ పనులు నిలిపివేసి ప్రజలకు తెలిసేలా ౖసైట్లలో బిల్లులు రానుందున పనులు నిలిపివేసినట్లు బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేయాల్సిందిగా అసోసియేషన్ సభ్యులు కాంట్రాక్టర్లను కోరారు. ఆమేరకు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బ్యానర్లు ఏర్పాటు చేశారు. -
డేంజర్ హోర్డింగ్! ఎప్పుడు కూలునో..?
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ఎప్పుడు గాలి వీస్తే ఏ హోర్డింగు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సీజన్లతో సంబంధం లేకుండా వర్షాలతో పాటు ఈదురుగాలులు సైతం వీస్తున్నాయి. శిథిల భవనాలపై, సామర్థ్యం లేని పిల్లర్లపై సైతం హోర్డింగులున్నాయి. జీహెచ్ఎంసీ యంత్రాంగం యాడ్ ఏజెన్సీల ఒత్తిళ్ల వల్లనో, దిగువస్థాయి సిబ్బంది ఆమ్యామ్యాల వల్లనో కానీ చూసీ చూడనట్లు వదిలేసింది. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఎక్కడ లేని హడావుడి చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించి, అనంతరం ఆ విషయం మరచిపోతోంది. దాదాపు ఏడేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో యూనిపోల్ కూలి పలు కార్లు ధ్వంసమయ్యాయి. అనుమతి లేని హోర్డింగులు, యూనిపోల్స్‌ను తొలగించడంతో పాటు.. అనుమతి పొందినవైనా సరే కూలితే వాటిని ఏర్పాటు చేసిన ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలు జారీ చేసింది. నగరంలో గంటకు 100–150 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈదురు గాలులకు పెద్ద చెట్లే నేలకూలుతున్నాయి. ఇటీవలే హిమాయత్‌నగర్‌లో చెట్టు కూలి ఆటోపై పడటంతో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అంతకంటే ప్రమాదకరంగా ఉన్న, అక్రమంగా వెలసిన హోర్డింగులు మాత్రం నగరంలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. చర్యలకు సిద్ధం గ్రేటర్ నగరంలో అక్రమంగా వెలసిన హోర్డింగులతో పాటు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కోసం అక్రమంగా ఏర్పాటు చేసిన యూనిపోల్స్, బస్షెల్టర్లు, గ్లో సైన్‌బోర్డులు, లాలీపాప్స్, ఆర్చీలు తదితర ప్రాంతాల్లో ప్రకటనలున్న నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చి వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈమేరకు టెండర్లు కూడా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. అక్రమంగా ఏర్పాటైన వాటినన్నింటినీ త్వరలోనే తొలగించనున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ జోన్ల వారీగా ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు చెల్లించేదేమీ ఉండదు. వాటిని తొలగించే కాంట్రాక్టర్లే సదరు ఇనుప సామగ్రిని తీసుకుంటాయని, జీహెచ్ఎంసీకే అవి నిర్ణీత ధరను చెల్లించాల్సి ఉంటుందని, ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికి కాంట్రాక్టు పనులు అప్పగించనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్లు వాటిని స్క్రాప్‌గా విక్రయించుకోవడం ద్వారా వారికి లాభముంటుందన్నారు. -
విశ్వనగరమే ధ్యేయంగా ముందుకు..
మాదాపూర్: కొండాపూర్ డివిజన్ పరిధిలోని దుర్గం చెరువు వద్ద 7.0 ఎంఎల్డీ సామర్థ్యంతో రూ.15 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మురుగునీటి శుద్దికేంద్రం(ఎస్టీపీ)ను సోమవారం మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్టీపీతో దుర్గంచెరువు ప్రాంత ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుందన్నారు. అలాగే మురుగు నీటి నుంచి చెరువులకు విముక్తి లభిస్తుందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. మురుగునీటి శుద్ధిలో హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 772 ఎల్ఎండీ సీవరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అనుమతి ఇచ్చిందన్నారు. దీనికోసం రూ. 3866.21 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, హెచ్ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు హమీద్ పటేల్, నార్నే శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సింధు ఆదర్శ్‌రెడ్డి, మంజుల రఘునాథ్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సాయిబాబా, మాధవరం రంగారావు పాల్గొన్నారు. దుర్గం చెరువులో వాటర్ ఫౌంటెన్లు ప్రారంభం సందర్శకులను ఆకట్టుకునేందుకు దుర్గం చెరువులో ఏర్పాటు చేసిన మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్లను స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రారంభించారు. దాదాపు 60 మీటర్లు పొడవులో..మ్యూజిక్‌కి అనుగుణంగా రంగులు వెదజల్లుతున్న ఫౌంటెన్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ పనిచేస్తుందని అధికారులు తెలిపారు. -
కేబీఆర్ పార్కులో యాచకుల బెడదపై ‘ఎక్స్’లో ఫిర్యాదు
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌పార్కు జీహెచ్ఎంసీ వాక్ వేలో యాచకుల బెడద వాకర్లకు ఇబ్బందిగా మారుతున్నదని, ఇక్కడ యాచించేందుకు ఎవరు అనుమతులు ఇచ్చారని భానుమూర్తి అనే వాకర్ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా ఆదివారం ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ తక్షణమే తనిఖీలు చేపట్టి వాక్‌వేలో యాచిస్తున్న వారిని కుటుంబ సభ్యులకు అప్పగించాలని జీహెచ్ఎంసీ సర్కిల్–18 యూసీడీ విభాగం అఽధికారులను ఆదేశించారు. దీంతో సర్కిల్–18 యూసీడీ విభాగం అఽధికారులు ఆదివారం రాత్రి వాక్‌వేలో తనిఖీలు నిర్వహించారు. ఓ మహిళ ఇక్కడకు వస్తున్న వాకర్లతో పాటు పక్కనే ఉన్న హోటల్‌వద్ద టీ తాగేందుకు వచ్చిన కస్టమర్ల వద్ద యాచిస్తున్నట్లు గుర్తించారు. స్థానిక పోలీసుల సహకారంతో ఆమెను బంజారాహిల్స్‌రోడ్ నెం.2లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వెనుక నివాసం ఉంటున్న కుమారుడి వద్దకు చేర్చారు. అయితే ఆమె బెగ్గర్ కాదని, సరుకులు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లిందని కుమారుడు ఽఅధికారులకు చెప్పారు. మరోసారి బయటకు రాకుండా చూసుకోవాలని, ఇది మంచి పద్ధతి కాదని తల్లీకొడుకులకు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. -
గణేష్ నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాలను హుస్సేన్ సాగర్, చెరువుల్లో నిమజ్జనం చేయవద్దని స్పష్టం చేసింది. పీవోపీ విగ్రహాలన్నింటిని జీహెచ్ఎంసి ఏర్పాటు చేసిన కృత్రిమ తాత్కాలిక నీటి కుంటలలో నిమజ్జనం చెయ్యాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులను యధాతథంగా అమలు చేయాలని నగర సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. గత వాదనల సమయంలోనే(సెప్టెంబర్ 8).. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ)తో తయారు చేసిన గణేశ్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయరాదని .. ఈ విషయమై గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొంది హైకోర్టు. ఎవరెవరి వాదనలు ఎలాగంటే.. ఇదిలా ఉంటే.. పీవోపీ విగ్రహాల తయారీపై నిషేధం ఎత్తేయాలని.. సీపీసీబీ నిబంధనలను కొట్టేయాలని పేర్కొంటూ గణేశ్‌మూర్తి కళాకారుల సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ కొనసాగించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది.. ధూల్‌పేట్ వాసులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపకుండా ప్రస్తుత ఉపాధిపై దెబ్బకొట్టడం సరికాదని పేర్కొన్నారు. మరో న్యాయవాది వేణుమాధవ్ వాదనలు వినిపిస్తూ గత ఏడాది హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయలేదని.. తాత్కాలిక కొలనుల్లో నిమజ్జనం చేశామని పేర్కొన్నారు. -
జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ
-
నిమజ్జనం నిరుటి మాదిరే
సాక్షి, సిటీబ్యూరో: వినాయకచవితి పండగ సమీపిస్తుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కడి వారు అక్కడే తమకు దగ్గరి ప్రాంతాల్లో నిమజ్జనాలు చేసేందుకు వీలుగా కొలనులు సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా జీహెచ్ఎంసీ నిమజ్జనాల కోసమే నిర్మించిన కొలనులతోపాటు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పోర్టబుల్ కొలనులు, తాత్కాలికంగా నిర్మించే కొలనుల్ని నిమజ్జనాల కోసం వినియోగించనున్నారు. నిమజ్జనాల కోసమే నిర్మించిన కొలనుల్ని బేబీపాండ్స్గా వ్యవహరిస్తున్నారు. నిర్వహణలేక వ్యర్థాలతో నిండిపోయిన బేబిపాండ్స్‌ను శుభ్రం చేయడంతోపాటు, తాత్కాలిక చెరువుల పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి గణేష్ మట్టి విగ్రహాలు మేయర్ పంపిణీ చేశారు. -
ఎవరిది తప్పు.. ఎవరికి ముప్పు ?
ఈ నాలాను చూస్తే ఇందులో ఎవరూ జారిపడకుండా తగిన రక్షణ చర్యలు ఉన్నట్లు కనిపిస్తోందా ? హైదరాబాద్: వర్షాకాలంలోనూ ఎలాంటి ప్రమాదాలు జరగవని అనిపిస్తోందా?... ఇక్కడ నివసిస్తున్న ప్రజలతోపాటు జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగానికీ, రాజకీయ నేతలకు మాత్రం అలా కనిపిస్తున్నట్లు.. అనిపిస్తున్నట్లే ఉంది. అందుకే ఎంతోకాలంగా పరిస్థితి ఇలాగే ఉన్నా ఎవరూ శ్రద్ధ చూపలేదు. నాలాను ఆనుకునే జీవిస్తున్న వారు రక్షణ కోసం కనీసం కంచె వంటివి ఏర్పాటు చేసుకోలేదు. నాలా సేఫ్టీ ఆడిట్లో భాగంగా నాలా ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన రక్షణ ఏర్పాట్లు చేస్తామన్న జీహెచ్ఎంసీ యంత్రాంగం సైతం ఆ పనిచేయలేదు. భారీ వర్షాలొచ్చినా ఎక్కడా కూడా ప్రజలు నాలాల్లో పడిపోయే పరిస్థితులుండరాదని, చెత్త, ఇతరత్రా వ్యర్థాలు వేయకుండా ఏర్పాట్లుండాలని, ఓపెన్ నాలాలకు ఫెన్సింగ్ ఉండాలని ఉన్నతాధికారులు హెచ్చరించినప్పటికీ.. ఎందుకనోగానీ ఎవరూ పట్టించుకోలేదు. ప్రజలకు కూడా తగిన అవగాహన కల్పిస్తామన్న ప్రకటనలు మాటలకే పరిమితమయ్యాయి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తోందంటే కవాడిగూడ దామోదర సంజీవయ్య బస్తీకి చెందిన లక్ష్మి అనే మహిళ ఈ నాలాలో పడటం వల్లే మరణించింది. శిథిల భవనాల్లో ఉంటున్న వారిని సైతం వాటినుంచి ఖాళీ చేయిస్తున్న జీహెచ్ఎంసీ ఇంత ప్రమాదకర పరిస్థితులున్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు విస్మరించింది. అందుకు కారణం రాజకీయ నేతలే కారణమన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. నాలా రక్షణ చర్యలు చేపట్టాలంటే విస్తరణ పనులు చేయాలి. అందుకు ఆస్తులు సేకరించాలి. ఇళ్లనుంచి ప్రజలను ఖాళీ చేయించాలి. అందుకు ససేమిరా అంటున్న ప్రజల్ని ఖాళీ చేయిస్తే తమ ఓటుబ్యాంకుకు గండి పడితుందన్న ఆలోచనతో తగిన చర్యలు తీసుకోలేదన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ప్రజల ప్రాణాలు నాలాల్లో కలుస్తున్నాయి. -
హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలో వర్షం మళ్లీ మొదలైంది. హైదరాబాద్‌లో రానున్న రెండు గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే నిన్నటి కుండపోత నుంచి నగరవాసులు ఇంకా తేరుకోలేదు. ఈలోపు మళ్లీ వర్షం కురుస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోతగా కురిసిన వర్షం హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించింది. జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయాయి. బాచుపల్లి ప్రగతినగర్ కాలనీ వద్ద ఉన్న నాలాలో పడి బాలుడు మృతి చెందాడు. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. రెజిమెంటల్ బజార్లో పురాతన భవనం కూలిపోయింది. అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చదవండి: ఇంకెన్నాళ్లు నాలా మరణాలు? రోడ్లు చెరువులను తలపించాయి. మ్యాన్ హోళ్లు ఓపెన్ చేసినా.. పై నుంచి భారీ ఎత్తున వస్తున్న నీళ్లతో.. ప్రధాన రహదారిపైనే మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆరాంఘర్ జాతీయ రహదారిపై, శ్రీనగర్ సమీపంలో ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకుపోయాయి. డీఆర్ఎఫ్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు అతికష్టం మీద ఆ బస్సులను వరద నుంచి బయటకు తీశారు. మొత్తమ్మీద మంగళవారం రికార్డు స్థాయిలో సుమారు 20 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. తెల్లవారు జామున నుంచి ఉదయం 8 గంటల వరకు 14.7 సెం.మీ.. తిరిగి మధ్యాహ్నం వరకు మరో 5.9 సెం.మీ మేర వర్షం కురిసినట్లు వాతావరణశాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. Moderate - Heavy downpours expected today in North, Central, East Telangana today and light - moderate rains ahead in South Telangana Moderate rains expected in Hyderabad city today but yesterday type huge rains not expected — Telangana Weatherman (@balaji25_t) September 6, 2023 జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు సికింద్రాబాద్ జోన్లో పలు చోట్ల నీరు నిలిచిన ప్రాంతాలను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ బుధవారం ఉదయం పరిశీలించారు. నీరు వెంటనే తొలగించాలని, మ్యాన్ హోల్స్ వద్ద మట్టి, చెత్తచెదారాన్ని వెంటవెంటనే తీసేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారాయన. మయూర మార్గ్ అల్లం తోట బావి, ద్వారక దాస్ నగర్ కాలనీ, ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్, యస్ పి రోడ్డు పెట్రోల్ పంప్, అల్లాగడ్డ బావి రైల్వే అండర్ బ్రిడ్జి, లాలా పేట్ సత్య నగర్ లలో నాలాలను సైతం ఆయన పరిశీలించారు. -
HYD: అత్యవసరమైతేనే బయటకు రావాలి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ సూచనలు, రేపటి వరకు అతిభారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జోనల్ కమిషనర్లతో మంగళవారం కాన్ఫరెన్స్ నిర్వహించారామె. లోతట్టు ప్రాంతాల్లో అస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ అధికారులను ఆదేశించారు. అలాగే.. పోలీస్, జీహెచ్ఎంసీ శాఖల సమన్వయంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రేపటి వరకు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని. దీంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారామె. ► ప్రజలు అత్యవసరం పని ఉంటేనే బయటి రావాలని తెలిపారు. హిమాయత్, ఉస్మాన్ సాగర్ జంట జలయాలు గేట్లు ఎత్తి వేసిన నేపథ్యంలో మూసి నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జోనల్ కమిషనర్ లను ఆదేశించారు. హెల్ప్ లైన్ కు వచ్చిన పిర్యాదులకు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులకు మేయర్ సూచించారు. ఇప్పటికే నగరం, శివారుల్లోని పలు కాలునీలు నీట మునిగి చెరువుల్ని తలపిస్తున్నాయి. జలాశయాలకు నీరు పోటెత్తడంతో గేట్లు వదిలి.. దిగువనకు విడుదల చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముందస్తుగానే ఖాళీ చేయాలని కోరుతున్నారు అధికారులు. లోతట్టు ప్రజల్ని అప్రమత్తం చేయండి భారీ వర్షాలకు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ సూచించారు. జంట జలాశయాల గేట్లు తెరిచినందున మూసీ పరివాహక ప్రాంతాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారుల్ని కోరారాయన. ప్రజలు కూడా ఏదైనా సమస్య ఎదురైతే జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్ 040-2111 1111 డయల్ 100 ఈవీడీఎం కంట్రోల్ రూం నెంబర్ 9000113667 ► మరోవైపు మంత్రి తలసాని సైతం హైదరాబాద్ వర్ష పరిస్థితులపై అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లపై నీరు నిలిచిపోకుండా చూడాలని, కూలిన చెట్లు, కొమ్మలను వెంటనే తొలగించాలని, హుస్సేన్‌సాగర్.. ఉస్మాన్ సాగర్ నీటి స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రత్యేకించి నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపైనా తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సేవలకు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంను సంప్రదించాలని ప్రజలను కోరారు. ► ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. వీలును బట్టి వర్క్‌ఫ్రమ్ చేసుకోవాలని సూచించారు. అలాగే.. ఆఫీస్‌లకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ రద్దీ దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. -
చెట్టు కూలడానికి అధికారుల నిర్లక్షమే కారణమా?
అధికారుల నిర్లక్ష్యం... పాలకుల అలసత్వం ఓ అమాయకుడి ప్రాణాలు పోయేందుకు కారణమైంది. ఎంతో మందికి నీడనిచ్చే భారీ వృక్షానికి జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం చుక్క నీరు పీల్చే అవకాశం ఇవ్వకుండా మొదళ్లల్లో కాంక్రీట్‌తో కప్పేశారు. మరో పక్క బిల్డింగ్ యజమాని బిల్డింగ్ మరమ్మతుల సమయంలో ఈ భారీ వృక్షాన్ని కూల్చేందుకు విశ్వప్రయత్నాలు చేసిన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. బిల్డింగ్ యజమాని, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం, హార్టికల్చర్ల నిర్లక్ష్యమే భారీ వృక్షం కుప్పకూలడానికి.. ఆటోడ్రైవర్ మహ్మద్ గౌస్ మరణానికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్: హైదర్‌గూడ సిగ్నల్ వద్ద శనివారం భారీ వృక్షం కూలడంతో ఒక్కసారిగా వాహనదారులు, స్థానికులు ఆందోళన చెందారు. చెట్టు కూలిన ప్రాంతంలో ఉన్న బిల్డింగ్ మూడేళ్ల క్రితం మరమ్మతులు చేశారు. అప్పట్లోనే ఈ చెట్టును ఇక్కడ నుంచి తరలించేందుకు కాంట్రాక్టర్ స్థానిక రాజకీయ నేతలతో కలసి విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. గత ఏడాది ఫుట్‌పాత్ నిర్మాణాల్లో భాగంగా సర్కిల్–16కు సంబంధించిన ఇంజినీరింగ్ విభాగం హిమాయత్‌నగర్ వైజంక్షన్ నుంచి హైదర్‌గూడ చెట్టు కూలిన ప్రాంతం వరకు ఫుట్‌పాత్‌లను నిర్మించారు. కాసులకు కక్కుర్తి పడ్డ జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం బిల్డింగ్ యజమానుల మాటలు విని చెట్టు మొదళ్లల్లో మొత్తం కాంక్రీట్ వేసి పూడ్చేశారు. ఒక్క చుక్క నీరు చెట్టు వేర్లుకు తగలకుండా చేశారు. దీనికారణంగా ఏడాదికి పైగా ఒక్క బొట్టు నీటిని పీల్చుకోని ఆ చెట్టు శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇదే కోవలో మరిన్ని చెట్లు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయనడం ఏమాత్రం సందేహం లేదు. శనివారం కూలిన చెట్టుపక్కనే మరో చెట్టును కూడా కాంక్రీట్‌తో కూల్చేయడం జరిగింది. దీనితో పాటు మరికొన్ని చెట్లు ఇదేతరహాలో ఉన్నాయి. మొద్దునిద్రలో హార్టికల్చర్ విభాగం... చెట్లను సంరక్షించాల్సిన హారి్టకల్చర్ డిపార్ట్మెంట్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. బిల్డింగ్ నిర్మాణాలకు భారీ వృక్షాలు అడ్డు వస్తున్న తరుణంలో కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బుకు దాసోహం అవుతున్న హారి్టకల్చర్ ఆయా ప్రాంతాల్లోని చెట్లను కూల్చేస్తున్నారు. సీసీ ఫుటేజీలకు చెట్ల కొమ్మలు అడ్డొస్తున్నాయి. ట్రాఫిక్‌కు విఘాతం కలిగే వాటిని తొలగించాలంటూ పలుమార్లు నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పట్టించుకునే నాథుడు హారి్టకల్చర్ శాఖలో లేకపోవడం గమనార్హం. -
కుప్పకూలిన భారీ చెట్టు.. మా.. ముజే.. బచావో అంటూ ఓ ఆటో డ్రైవర్..
హైదరాబాద్: మృత్యువు ఎప్పుడు.. ఏ రూపంలో వచ్చి కబళిస్తుందో చెప్పలేమనడానికి ఈ దుర్ఘటనే నిదర్శనం. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో రెడ్ సిగ్నల్ పడటంతో వాహనాలు ఆగి ఉన్నాయి. ఇంతలోనే రోడ్డు పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం 3 ఆటోలపై కుప్పకూలింది. ఇందులో ఉన్న ఓ ఆటో డ్రైవర్.. తనను కాపాడంటూ వేడుకుంటూనే అసువులు బాసిన విషాద ఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌కు చెందిన మహ్మద్ గౌస్ (36) నారాయణగూడ నుంచి హిమాయత్‌నగర్ తెలుగు అకాడమీ మీదుగా బషీర్‌బాగ్ వెళ్తున్నాడు. సిగ్నల్ వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో సరిగ్గా చెట్టు కింద ఆగాడు. మరో 18 సెకన్లలో గ్రీన్ లైట్ పడేలోపే మృత్యువు చెట్టు రూపంలో అతడిని కబళించింది. నాలుగు సెకన్ల వ్యవధిలో చెట్టు కుప్పకూలి దాని కొమ్మ ఆటోపై పడింది. ఆటోలోనే గౌస్ ఒరిగిపోయాడు. కనీసం కదలడానికి కూడా వీలు లేకుండా ఉండటంతో ‘మా.. ముజే బచావో’ అంటూ ప్రాణాలు విడిచాడు. అతడి మూ లుగు విన్న తోటి వాహనదారులు రక్షించేందుకు ప్రయత్నించడానికి సైతం వీల్లేకుండా పోయింది. చేయీ.. చేయీ.. కొమ్మను జరిపి.. మృతుడు గౌస్ ఉన్న ఆటో ముందూ వెనకా ఆటోలు ఉన్నాయి. మరో రెండు ఆటోలపై చెట్టు కొమ్మలు పడుతున్న సమయంలో ఆ ఇద్దరు డ్రైవర్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెనక ఉన్న ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ముందున్న మరో ఆటో పాక్షికంగా దెబ్బతిన్నది. స్థానికులు, వాహనదారులు కలిసి చెట్టుకొమ్మను ఆటోల మీదనుంచి పక్కకు జరపడంతో గౌస్ మృతదేహాన్ని బయటకి తీసి 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చెట్టు కూలడంతో నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు తెలుగు అకాడమీ రోడ్డును బ్లాక్ చేశారు. దీంతో హిమాయత్‌నగర్ లిబర్టీ, బషీర్‌బాగ్, నారాయణగూడ, కింగ్‌కోఠి, నల్లకుంట, చే నంబర్ వరకు వేలాది వాహనాలతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. హిమాయత్‌నగర్ ప్రాంతంలో సుమారు 19 భారీ వృక్షాలు కూలిపోయే స్థితిలో ఉన్నాయని జనవరిలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్ ఆరోపించారు. వారు పట్టించుకున్నట్లైతే శనివారం నాటి ప్రమాదం జరిగేది ఉండేది కాదన్నారు. -
ఓటమి భయంతోనే బీజేపీ జమిలి ఆలోచనలు
సాక్షి, హైదరాబాద్: ఓటమి భయంతోనే కేంద్రంలోని బీజేపీ జమిలి ఎన్నికల ఆలోచనలు చేస్తోందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు తమదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తాజా సర్వేల్లో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ గెలిచే అవకాశా ల్లేవని పేర్కొన్నారు. డబుల్బెడ్రూమ్ ఇళ్లపంపిణీకి సంబంధించి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలకు సంబంధించి విలే కరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, ఉన్నట్లుండి వేవ్ మార్చితే ఫలితాలు మారతాయని భ్రమ పడుతోందన్నారు. ఎన్నికలు ఎప్పుడైనా కేసీఆర్ సర్కార్ సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను నియమించిన పార్టీ తమదన్నారు. త్వర లో జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ‘వన్ నేషన్– వన్ ఎలక్షన్’బిల్లు పెడతారనే ప్రచారం జరుగుతోందన్నారు. దేశంలో మోదీ క్రేజ్ పడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే నివేదికలు ఆ పార్టీ వద్ద ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ రెంటికీ కలిపి ఎన్నికలు పెడితే తమకేమైనా లాభం కలుగుతుందనే యోచనలో బీజేపీ ఉందన్నారు. జమిలి ఎన్నికలంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. నిర్ణీత షెడ్యూలు మేరకే ఎన్నికలు నిర్వహించాల్సిందిగా తాము ఈసీని కోరతామన్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. -
హైదరాబాద్‌లో విషతుల్యంగా నల్లానీరు!
హైదరాబాద్: భాగ్యనగరంలో ‘జలం’ విషతుల్యంగా మారింది. నల్లా నీరు తాగడానికి సురక్షితం లేనట్లుగా ‘నీటి నమూనా పరీక్షల’ ఫలితాల నివేదికలు వెల్లడిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నగరానికి మంచినీటిని సరఫరా చేసేందుకు వందల కిలో మీటర్ల దూరంలోని గోదావరి, కృష్ణా, మంజీరా, సింగూరు నదుల నుంచి జలాల తరలింపు, నీటి శుద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం నగరవాసుల పాలిట ప్రాణసంకటంగా తయారైంది. కనీసం నల్లా ద్వారా సరఫరా జరుగుతున్న నీరు తాగేందుకు సంతృప్తికరం కాదని వెల్లడవుతున్న నీటి శాంపిల్స్ పరీక్షల నివేదికలను సైతం ఎక్కడికక్కడే తొక్కిపెట్టి గోప్యత ప్రదర్శించడం మరింత విస్మయానికి గురిస్తోంది. నీటి నాణ్యత అంశంలో ప్రజల నుంచి ఫిర్యాదుతో పాటు ఒత్తిడి వస్తే తప్ప అధికారులు స్పందించని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రస్తుతం నల్లా ద్వారా సరఫరా జరుగుతున్న నీటిని వేడి చేసి చల్లార్చి వడపోస్తే తప్ప తాగే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. నల్లా నీటిని నేరుగా తాగితే జ్వరం, దగ్గు, వాంతులు, విరేచనాలు ఇతరత్రా వ్యాధుల బారిన పడుతున్నట్లు నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలమండలి మాత్రం ప్రజలకు శుద్ధమైన నీరు అందించేందుకు ఐఎస్ఓ నిబంధనల ప్రకారం శాసీ్త్రయంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకున్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నా... క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు థర్ట్ పార్టీ నిర్వహించిన నీటి నమూనా పరీక్షలు వెల్లడించడం ఆందోళనకు గురిచేస్తోంది. నాలుగు విభాగాలుగా.. ఇంటింటికీ సరఫరా చేస్తున్న నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు నిత్యం నాలుగు విభాగాలుగా నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జలమండలి యంత్రాంగం పేర్కొంటోంది. జలమండలి, క్యూఏటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, స్వయం సహాయక బృందాల సభ్యుల ద్వారా వేర్వేరుగా నీటి శాంపిళ్లను సేకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సరఫరా అయ్యే నీటిలో క్లోరిన్న్ శాతం 0,5 పీపీఎం కంటే తక్కువగా ఉన్నా, కలుషితంగా ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించినా తక్షణమే నీటి సరఫరా నిలిపివేసి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుంది. కానీ.. ఎక్కడా ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. ఇటీవల జలమండలి యంత్రాంగం సరికొత్త సంస్కరణలో భాగంగా వినియోగదారుల సమక్షంలో ఇంటి వద్దనే నీటి పరీక్షలు నిర్వహించే విధంగా లైన్మెన్ల ఫోన్లలో ‘నాణ్యత’ పేరుతో ప్రత్యేక యాప్ ఇన్స్టాల్ చేసి అందుబాటులోకి తెచ్చినా.. లైన్‌మన్ ఇంటికి వచ్చి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు మాత్రం లేవని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం కేవలం నాణ్యత యాప్ ద్వారానే ప్రతి రోజు సుమారు 15వేల శాంపిళ్లు సేకరించి పరీక్షిస్తున్నట్లు పేర్కొంటున్నారే తప్ప.. వాటి పరీక్షల నివేదికలు బహిర్గతం చేసేందుకు వెనుకాడటం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. ఇదిగో నాణ్యతలేమి.. నల్లా ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిలో నాణ్యతలేమి ఆందోళ కలిగిస్తోంది. సరఫరా చేస్తున్న నీటిలో తగిన మోతాదులో క్లోరిన్ శాతం ఉండేలా చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల తీరును థర్ట్‌పార్టీ నిర్వహించిన నీటి శాంపిల్ పరీక్ష ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్ధ అయిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, జలమండలి క్యూఏటీ విభాగాలు సంయుక్తంగా నగర వ్యాప్తంగా సరఫరా అవుతున్న నల్లా నీటిలో ర్యాండమ్‌గా శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. నమూనా పరీక్షల్లో అసంతృప్తిగా వచ్చిన ఫలితాల నివేదికలను ఎప్పటికప్పుడు జలమండలి సంబంధిత ల్యాబ్‌కు సిఫారస్ చేస్తోంది. గత నెల (జులై)లో సేకరించిన నల్లా నీటి నమూనా పరీక్ష ఫలితాల నివేదిక ‘సాక్షి’ చేతికి చిక్కింది. వాటిని పరిశీస్తే.. నల్లా నీటిలో నాణ్యత ప్రమాణాల స్థితి బెంబేలెత్తిస్తోంది. ► మొత్తమ్మీద సుమారు 38 ప్రాంతాల్లో సరఫరా జరిగిన నీరు తాగడానికి ఆమోదయోగ్యం కానట్టు నీటి నమూనా పరీక్షల నివేదికలో వెల్లడైంది. అమీర్‌పేట్, అంబర్‌పేట, ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్ గూడ, ఇమామ్‌గూడ, రెడ్‌హిల్స్, బన్సీలాల్‌పేట, బోయగూడ, సంతోష్‌నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన నీటి సరఫరాలో కోర్లిన్ శాతం అసలు లేనట్లు పరీక్షలో తేలింది. ► మిగతా ప్రాంతాలు ఘాన్సీబజార్, ఆసిఫ్‌నగర్, రేతిబౌలి, షేక్‌పేట, లంగర్‌హౌస్, ఉస్మాన్‌గంజ్, చార్మినార్, వెంగళ్రావు నగర్, హుస్సేనీ ఆలం, ఖిల్వాత్, ఖైరతాబాద్, ముషీరాబాద్, రామ్‌నగర్, చంచలగూడ, కవాడిగూడ, సైదాబాద్, మలక్‌పేట, ఈదీబజార్, వనస్థిలిపురం తదితర ప్రాంతాల్లో జరిగిన నీటి సరఫరాలో కోర్లిన్్ శాతం 0. 5 నుంచి 1.0 పీపీఎం వరకు ఉన్నప్పటికీ.. నీరు కలుషితం, ఇతరత్రా కారణంగా తాగడానికి యోగ్యం కాదని వెల్లడైంది. గడిచిన ఆరు నెలల నివేదికలు సైతం పరిశీలిస్తే ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు బయటపడింది. అంతా గోప్యంగానే.. నల్లా ద్వారా సరఫరా చేసే నీటిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు జాతీయ స్థాయి సంస్ధల నుంచి అవార్డులపై అవార్డులు అందుకుంటున్న జలమండలి యంత్రాంగం నీటి శాంపిల్ పరీక్షల నివేదికలపై మాత్రం అత్యంత గోప్యత ప్రదర్శించడం విస్మయానికి గురిచేస్తోంది. నగరవాసులకు సురక్షిత జలాలు అందించేందుకు నిత్యం సరఫరా జరిగే నీటి నాణ్యత పరిశీలన కోసం నాలుగు వేర్వేరు విభాగాల బృందాలతో నీటి శాంపిల్స్ సేకరిస్తున్నట్లు ప్రకటిస్తున్నా.. వాటి పరీక్షల నివేదికలు మాత్రం బహిర్గతం కాకుండా సంస్థ ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి వరకు జాగ్రత్త పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. సాక్షాత్తూ సంబంధిత విభాగం డైరెక్టర్ అధికారికంగా నీటి నాణ్యత పరీక్షల నివేదికలు ఇచ్చేందుకు నిరాకరించడం విస్మయానికి గురిచేస్తోంది. ఇక నీటి నమూనాలు పరీక్ష కేంద్రం అధికారి నివేదికలు ఇచ్చేందుకు తాను ఆథరైజ్ కాదని, ఉన్నతాధికారికి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొనడం మరింత అనుమానాలకు తావిస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికురాలి మృతి
హిమాయత్‌నగర్: ప్రైవేట్ కాలేజీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. రోడ్డుపై పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికురాలిని వేగంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్ను మూసింది. నారాయణగూడ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా, కళ్లెం గ్రామానికి చెందిన సునీత(42) జీహెచ్ఎంసీ సర్కిల్–15లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. ఆమెకు భర్త గోవర్దన్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త గోవర్దన్ గ్రామంలోనే వ్యవసాయం చేస్తుండగా సునీత సీతాఫల్‌మండీలో పిల్లలతో కలిసి ఉంటోంది. సోమవారం ఉదయం డ్యూటీకి వచ్చిన ఆమె బయోమెట్రిక్ అనంతరం రోడ్డు ఊడ్చే పనిలో నిమగ్నమైంది. ఇదే సమయంలో మొయినాబాద్‌కు చెందిన ‘ఆయాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకుని రాంకోఠి నుంచి కింగ్‌కోఠి వైపు వెళుతుంది. నాంపల్లి, బజార్‌ఘాట్‌కు చెందిన డ్రైవర్ మహ్మద్ మోమిన్ అతి వేగంగా బస్సు నడుపుతూ పిస్తాహౌజ్ సమీపంలో రోడ్డు శుభ్రం చేస్తున్న సునీతను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆమె తలకు, చేయి, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. తోటి కార్మికులు ఆమెను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. నారాయణగూడ పోలీసులు డ్రైవర్ మహ్మద్ మోమిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేయర్ దిగ్భ్రాంతి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సునీత మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సునీత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామ ని హామీ ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నిర్ధేశించిన ఆర్థిక సాయాన్ని తక్షణం అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరో పక్క యూనియన్ నాయకులు పోలీసుస్టేషన్‌కు చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థికపరమైన చేయూత అందించాలంటూ ఇనిస్టిట్యూట్ యాజమాన్యాన్ని కోరారు. విద్యార్థులకు గాయాలు అతి వేగంగా వచ్చిన బస్సు సునీతను ఢీకొట్టిన అనంతరం చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న విద్యార్థులు ముందు సీట్లకు గుద్దుకోవడంతో గాయాలపాలయ్యారు. తన వల్ల ఓ నిండుప్రాణం బలైన విషయాన్ని కూ డా డ్రైవర్ మహ్మద్ మోమిన్ గుర్తించకపోగా ‘క్యాహువా’ అంటూ సంబోధించడాన్ని చూసిన తోటి పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. సునీత తల్లి కొన్నేళ్ల క్రితం మృతి చెంద డంతో ఆమె ఉద్యోగాన్ని సునీత చేస్తున్నట్లు తెలిసింది. అతి వేగం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసింది. నారాయణగూడ ప్రాంతంలో ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు ఢీకొని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందగా, బేగంపేటలో కారు ఢీ కొని ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందింది. వివరాలిలా ఉన్నాయి.. -
రణరంగమైన జీహెచ్ఎంసీ
హైదరాబాద్: బల్దియా సర్వసభ్య సమావేశం రణరంగమైంది. ప్రతిపక్షాల నిరసనలు, ధర్నాలతో దద్దరిల్లింది. బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం 9 గంటలకే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ పరిసరాల్లో వందలాది పోలీసులు పహారా కాశారు. తమను పర్మనెంట్ చేయాలంటూ కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్న బల్దియా ఔట్ సోర్సింగ్ కార్మికులను బీజేపీ కార్పొరేటర్లు తమ వెంట తీసుకుని జీహెచ్ఎంసీ కార్యాలయానికి ర్యాలీగా వస్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. కొందరు కార్మికులను ఈడ్చి వాహనాల్లో పడేశారు. చెత్త ఊడ్చి నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న తమను ప్రభుత్వం అత్యంత హీనంగా చూస్తోందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయనిపక్షంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మేయర్ చాంబర్ వద్ద బైఠాయింపు.. ► సమావేశాన్ని తొందరగా ముగించడంతో బయటకు వచ్చిన బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ చాంబర్ వద్ద బైఠాయించారు. వీరి నినాదాలతో జీహెచ్ఎంసీ ప్రాంగణం హోరెత్తింది. ధర్నా చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మేయర్ ఒక డమ్మీ అంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆకుల శ్రావణి, మహాలక్ష్మిగౌడ్, ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్‌లు ఆరోపించారు. తాము కొత్త హామీలను నెరవేర్చాలని అడగట్లేదు. ఔట్సోర్సింగ్ కార్మికులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సీఎం గతంలో ప్రకటించారని, ఆయన ప్రకటనను అమలు చేయాలని కోరితే కౌన్సిల్‌ని రద్దు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా మేయర్ రద్దు చేయడం దారుణమంటూ విమర్శించారు. వారం రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే మేయర్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అమెరికాలో ఉన్న మంత్రి కేటీఆర్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తూ కౌన్సిల్‌ను అర్ధంతంగా రద్దు చేయించారంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. పోలీసులు రంగప్రవేశం చేసి బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లను అక్కడినుంచి పంపించారు. ఈ క్రమంలో పోలీసులకు కార్పొరేటర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ప్రొటోకాల్ రగడ జీహెచ్ఎంసీలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని రాజకీయాల కతీతంగా అన్ని పార్టీలూ కోరాయి. అభివృద్ధి పనుల శిలాఫలకాలపై కార్పొరేటర్ల పేర్లు వేయడం లేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని.. ముఖ్యంగా వాటర్ బోర్డు పనుల్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని కార్పొరేటర్లు మండిపడ్డారు. వీధి దీపాలు, చెత్త సమస్యలు, డీసిల్టింగ్, నాలాల సమస్యలు తదితర సమస్యలపై ధ్వజమెత్తారు. ఎప్పటిలాగే అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర వాదోపవాదోలతో సభను మేయర్ విజయలక్ష్మి త్వరితంగా ముగించారు. అందుకు నిరసనగా మేయర్ కార్యాలయం ఎదుట ప్రతిపక్షాలు ధర్నా నిర్వహించాయి. కార్మికుల సమస్యలు తెలిసేలా బీజేపీ సభ్యులు చెత్త తరలింపు కార్మికుల వేషధారణలతో ఆందోళన నిర్వహించారు. మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ముఖ్యాంశాలు ఇలా.. ► తెలంగాణ రాష్ట్రం వచ్చాక జీహెచ్ఎంసీ ఔట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి వారిని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని అమలు చేయాలని సభ్యులు మధుసూదన్‌రెడ్డి (బీజేపీ), రాజశేఖర్‌రెడ్డి (కాంగ్రెస్), సలీంబేగ్ (ఎంఐఎం)లు కోరారు. బీఆర్ఎస్ సభ్యుడు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ సమర్థించారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచింది కూడా కేసీఆరే అన్నారు. ఆర్టీసీ కార్మికుల మాదిరిగానే సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి తప్పకుండా చేస్తారని బీఆర్ఎస్ సభ్యులు అన్నారు. అందుకు ఎవరు అడ్డుపడ్డారో తెలుసునన్నారు. ఈ మేరకు తీర్మానం చేయాలని ప్రతిపక్ష సభ్యులు కోరారు. ఈ అంశంపై మేయర్ సూచన మేరకు కమిషనర్ రోనాల్డ్‌రాస్ మాట్లాడుతూ.. మేయర్‌తో చర్చించి సభ్యుల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరిస్తామని చెప్పారు. నిబంధనలు పాటించడం లేదు.. ► ఆయా పనుల సందర్భంగా అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని, శిలాఫలకాలపై కార్పొరేటర్ల పేర్లు వేయడం లేరని, ప్రారంభోత్సవాలకు చివరి నిమిషంలో సమాచారమిస్తున్నారని, ప్రారంభోత్సవాలకు వస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ డివిజన్ నాయకుల ఫొటో లేనందున వెళ్లిపోయిన సంఘటనలున్నాయని సభ దృష్టికి తెచ్చారు. వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేసినా పంద్రాగస్టు నాడు జెండా ఎగురవేసే దిక్కు లేకుండా పోయిందని, ప్రభుత్వ పథకాలైన కళ్యాణలక్ష్మి, దళితబంధువంటి వాటి పంపిణీ సందర్భంగా తమను ఆహ్వానించడం లేరని, అక్కడా ఎమ్మెల్యేల పెత్తనమే సాగుతోందన్నారు. ప్రొటోకాల్ పాటించడం లేదని మేయర్ అంగీకరించారు. ఇంటర్నల్ రాజకీయాల వల్లేనని అధికారి తెలపడంతో ఇకపై ఇలాంటి పరిస్థితి ఎదురవకుండా తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ రోనాల్డ్ రాస్ హామీ ఇచ్చారు. ►వీధిదీపాలు, చెత్త, నాలాలు, వీధికుక్కలు తదితర సమస్యల్ని సభ్యులు ప్రస్తావించారు. ► కార్పొరేటర్లకు గౌరవమివ్వకున్నా భరిస్తున్న మీరు బానిసలంటూ బీఆర్ఎస్ సభ్యులనుద్దేశించి బీజేపీ సభ్యులు వ్యాఖ్యానించారు. కిషన్‌రెడ్డి చెప్పులు మోసేవారంటూ ఒకరు, కేసీఆర్ చెప్పులు మోసేవారంటూ ఒకరు రెండు పార్టీల వారు పరస్పరం వాదించుకున్నారు. ► జడ్సీలు కార్పొరేటర్లతో నెలకోసారి సమావేశం పెడితే స్థానికంగానే సమస్యలు పరిష్కారమవుతాయని బీజేపీ సభ్యులు ప్రస్తావించారు. ► పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.500 నుంచి అన్ని ప్రభుత్వాలు పెంచుతూవచ్చాయని, చరిత్ర తెలియనందున మేయర్ బీఆర్ఎస్సే పెంచిందన్నారని కాంగ్రెస్ సభ్యురాలు అనడంతో, మేయర్‌ను అవమానించారని, క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ► మేయర్ అన్ని అంశాలను చర్చించకుండా సభను త్వరితంగా ముగించడంపై బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు మేయర్ చాంబర్ ఎదుట బైఠాయించి మేయర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పార్కింగ్ ప్రదేశానికి తరలించారు.అక్కడా ధర్నాకు దిగడంతో పోలీస్ వ్యాన్లలోకి ఎక్కించారు. ► కార్మికులను పర్మనెంట్ చేయాలంటూ అన్ని పార్టీలూ కోరినా మేయర్ తీర్మానం చేయకపోవడంపై వారు మండిపడ్డారు. ► మీడియాను కౌన్సిల్హాల్లోకి అనుమతించలేదు. నిరసనగా విషయాన్ని మేయర్‌కు తెలియజేయాలనుకున్న ప్రతినిధులను పట్టించుకోకుండా మేయర్ కౌన్సిల్ హాల్లోకి వెళ్లిపోయారు. ► ప్రజాధనంతో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో ప్రజాసమస్యలను పట్టించుకోకుండా త్వరగా ముగించారని బీజేపీ, కాంగ్రెస్ విమర్శించాయి. ఇక పోలీస్స్టేషన్ల వద్ద నిరసనలు పార్టీలకతీతంగా జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో మొదటి అంశంగా ఔట్సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ అంశాన్ని లేవనెత్తి, విషయాన్ని ప్రభుత్వానికి పంపేలా చేసిన కార్పొరేటర్లకు జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు,గోపాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఇకనుంచి జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో కాకుండా పోలీస్స్టేషన్ల వద్ద నిరసన తెలియజేయాల్సిందిగా గోపాల్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఉదయం 5 గంటల నుంచి పోలీస్స్టేషన్ల వద్ద ఉంటూ శాంతియుతంగా సమస్యలపై నిరసన తెలియజేయాలని సూచించారు. సీఐ, ఎస్ఐలకు కార్మికుల సమస్యల గురించి వివరించాలని కోరారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం ఆగవద్దన్నారు. -
జీహెచ్ఎంసీ సమావేశంలో గందరగోళం..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. కౌన్సిల్ హాల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య పోటాపోటీ వాగ్వాదం నెలకొంది. పలు సమస్యలపై ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్ల నిరసన మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన సమావేశంలో ఎస్ఆర్డీపీ రెండోదశ, మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి, జిహెచ్ఎంసి బకాయిలని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్ల నిరసన వ్యక్తం చేశారు. శానిటేషన్ పై చర్చ జరపాలని పట్టుబట్టారు. మరోవైపు జీహెచ్ఎంసీ కార్మికులకు, గ్రేటర్ ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కార్మికుల ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మేయర్ ఆగ్రహం బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల పై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్ల నిరసనను తప్పుబట్టిన మేయర్.. ఏదైనా ఉంటే ప్రశ్నోత్తరాల్లో అడగాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ జరగకుండా అడ్డుపడితే మార్షల్‌తో బయటకు పంపాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజల కోసం కౌన్సిల్‌ను సజావుగా నడవాలని కోరారు. ప్రజా సమస్యలపై చర్చించి 6 నెలలు గడుస్తోందని, మళ్లీ ఇప్పటి వరకు చర్చించలేదేని తెలిపారు. కార్మికుల అంశం పెద్ద సమస్యేనని, చర్చలు జరిపిన తరువాత కార్మికులపై ప్రకటన చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలకు బానిసలుగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువైందని బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. గ్రేటర్ సిటీలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కార్పొరేటర్లను లెక్కచేయడం లేదని దుయ్యబట్టారు. ప్రోటోకాల్ లేకున్నా ఎమ్మెల్యేకు నచ్చిన వాళ్ళు రావాలి.. ఎమ్మెల్యేకు నచ్చకపోతే ప్రోగ్రాం క్యాన్సల్ అవుతోందని తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలకు బానిసలుగా తయారు అయ్యాదని విమర్శించారు. డివిజన్ కార్యాలయాల్లో కనీసం జాతీయ జెండా ఎగరేసే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త కమిషనర్ రోడ్లపై తిరుగుతున్నారని, మేయర్ కూడా సిటీలో పర్యటించాలని సూచించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ హల్లో తమ నేతల పేర్లపై బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల పోటీపోటీగా నినాదాలు చేశారు. గ్రేటర్ సిటీ అభివృద్ధి కేటీఆర్, కేసీఆర్ వల్లే జరిగిందని బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెప్పగా.. గ్రేటర్ సిటీలో కేంద్రం పాత్ర, కిషన్ రెడ్డి పాత్ర ఉందని బీజేపీ కార్పొరేటర్లు పేర్కొన్నారు. పేర్లను తీసుకోవద్దని మేయర్ ఇరువుకి సూచనలు చేశారు. మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు నిరసన ఆపాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ సమస్య జీహెచ్ఎంసీ పరిధిలో ప్రోటోకాల్ సమస్య అందరికీ ఉందని మేయర్ విజయలక్ష్మీ పేర్కొన్నారు. ప్రోటోకాల్ సమస్యపై కార్పొరేటర్లు లేవనెత్తిన అంశాలను నోట్ చేసుకున్నామని తెలిపారు. త్వరలోనే దీనిపై అధికారులతో రివ్యూ చేస్తామని చెప్పారు. ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా కార్పొరేటర్ పేరు ఉండాలని తెలిపారు. మేయర్ Vs విజయారెడ్డి జీహెచ్ఎంసీ కౌన్సిల్ హల్లో మేయర్ వర్సెస్ విజయారెడ్డిగా మారింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్పొరేటర్ విజయారెడ్డి అడ్డుపడ్డారు. కార్మికులకు జీతాలు పెంచితే విజయారెడ్డి పాలాభిషేకం చేశారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెప్పగా.. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని విజయారెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల ఎందుకంత ద్వేషం అని ప్రశ్నించారు. కార్మికులను పర్మినెంట్ చేయాలని అడగటం చైర్‌ను అవమానించినట్లు కాదని, మేయర్ చైర్‌ను తాను అవమానించలేదని తెలిపారు. కొత్త కాంట్రాక్టు ఇవ్వడం వల్ల స్ట్రీట్ లైట్ల సమస్య ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. గత నెల రోజుల్లో 6వేల కొత్త లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోజుకు 6 దల నుంచి వెయ్యి లైట్ల ఫిట్టింగ్ చేస్తున్నామన్నారు. సరైన విధంగా లైట్ల మెంటనెన్స్ లేనందున ఆయా సంస్థలకు 6కోట్ల ఫైన్స్ వేశామని తెలిపారు. కార్మికుల సమస్యలపై కార్పొరేటర్లు లేవనెత్తిన అంశాలను నోట్ చేసుకున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. మేయర్‌తో మాట్లాడిన తరువాత త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు. -
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం బుధవారం జరగనుంది. ఔట్సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజేషన్‌తో పాటు ఇతరత్రా డిమాండ్ల సాధన కోసం జీహెచ్ఎంఈయూ ఆధ్వర్యంలో కార్మికుల సమ్మె నిరవధికంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు వారికి మద్దతు తెలపనున్నాయి. ఈ నేపథ్యంలో జరిగే సమావేశం సజావుగా సాగనుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. గత సమావేశం రసాభాసగా ముగియడం తెలిసిందే. ఈసారి సమావేశానికి కౌన్సిల్ హాల్లోకి మీడియాకు ఆహ్వానం లేదు. నగరంలో తీవ్ర సమస్యలుగా మారిన దోమల స్వైరవిహారం, విద్యుత్, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సభ్యులు ప్రశ్నించనున్నారు. కమిషనర్ రోనాల్డ్ రాస్ బాధ్యతలు స్వీకరించాక జరుగుతున్న తొలి సర్వసభ్య సమావేశం ఇది. ఇప్పటికే స్టాండింగ్కమిటీలో ఆమోదం పొందిన అంశాలతో సహ 40 అంశాలకు పైగా అజెండాలో ఉన్నాయి. -
జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లలో అసంతృప్తి సెగలు
-
వారం రోజుల్లో తొలి విడుత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపీణీ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రగతి భవన్లో బుధవారం జరిగిన ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ పరిధిలోని నగర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 70 వేల ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ప్రక్రియను జీహెచ్ఎంసీ మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే 70వేల ఇండ్లు నిర్మాణం పూర్తిచేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం వేగంగా నడుస్తుందని అధికారులు మంత్రులకు తెలియజేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ పక్రియ కూడా దాదాపు పూర్తి కావచ్చిందని తెలిపారు. లక్ష ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే 75 వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ పూర్తి అయిందని పేర్కొన్నారు. ఇందులో సుమారు 4,500 కు పైగా ఇండ్లను ఇన్ సిట్యూ లబ్ధిదారులకు అందించామని తెలిపారు. నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న సూమారు 70 వేల ఇండ్లను 5 లేదా 6 దశల్లో వేగంగా అందిస్తామని తెలిపారు. వచ్చే వారంలోనే తొలి దశ డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందదన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రక్రియ పంపిణీ పైన మంత్రులు పలు సూచనలను తెలియజేశారు. డఇండ్ల పంపిణీకి సంబంధించి నగర ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని పూర్తిగా అధికార యంత్రాంగమే క్షేత్రస్థాయి పరిశీలన కూడా పూర్తిచేసి అర్హులను గుర్తిస్తుందని మంత్రులు తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం గుర్తించిన లబ్ధిదారులందరినీ వాటి కేటాయించనున్న ఇండ్ల వద్దనే అప్పజెప్పేలా పంపిణీ కార్యక్రమం ఉండాలని ఈ సందర్భంగా మంత్రులు సూచించారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక, పథకాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లే విషయాన్ని కూడా మంత్రుల సమావేశంలో చర్చించారు. -
జీహెచ్ఎంసీ ఆఫీసులోకి కాంగ్రెస్ నేతలు.. లోపల కూర్చుని నిరసన
Updates.. ► జీహెచ్ఎంసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఆఫీసు లోపల బైఠాయించి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వినతి పత్రం ఇస్తే జీహెచ్ఎంసీ కమిషనర్ అమర్యాదగా ప్రవర్తించారంటూ నిరసనలు తెలిపారు. ► జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆఫీసు వద్దకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ► జీహెచ్ఎంసీ ఆఫీసు ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ► దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ► ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. వరదల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పూర్తిగా విఫలమైంది. మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. జీహెచ్ఎంసీ గేట్లు ఎక్కే ప్రయత్నం చేశారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. పలుచోట్ల రికార్ఢు స్థాయిలో వర్షం కురువడంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఇటు, భారీ వరదల కారణంగా చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో పలువురు గల్లంతు కాగా, కొంతమంది మృత్యువాతపడ్డారు. మరోవైపు.. హైదరాబాద్‌లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో వర్షాలపై అప్రమత్తం కానందుకు అధికార బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) జీహెచ్ఎంసీ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. వరద బాధితులకు రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో, తెలంగాణ పోలీసులు శుక్రవారం ఉదయం నుంచే జీహెచ్ఎంసీ ఎదుట భారీగా మోహరించారు. జీహెచ్ఎంసీకి ఉన్న మూడు గేట్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇది కూడా చదవండి: గోదావరి ఉగ్రరూపం.. అధికారులు అలర్ట్ -
వర్షాల్లో ప్రజలు... పార్టీ చేరికల్లో మీరు బిజీ!
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం రాజకీయ ఫిరా యింపులకు పాల్పడుతూ ఇతర పారీ్టల నాయకులను బీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ తన పుట్టినరోజు తర్వాత జనానికి దూరంగా ఉంటూ ప్రజలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో వరదలు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులతో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రేతో కలిసి రేవంత్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతోపాటు పీఈసీ సభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొని సలహాలిచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ వరదల్లో ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రజలను పట్టించుకోని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శుక్రవారం జీహెచ్ఎంసీ కార్యాలయ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వరదలతో ఉపాధి కోల్పోయిన పేదలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వరద సహాయం వచ్చేలా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని సూచించారు. కొల్లాపూర్‌లో 30న ప్రి యాంకాగాంధీ పాల్గొనాల్సిన సభను భారీ వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. కేటీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ వర్షాలతో గల్లీలు ఏరులై.. కాలనీలు చెరువులై ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని రేవంత్‌రెడ్డి నిలదీశారు. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంటే ప్రజల గోసను పట్టించుకోకుండా పత్తా లేకుండా పోయారంటూ కేటీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ రాశారు. -
అతి భారీ వర్షాలు.. ట్యాంక్‌బండ్ వద్ద వరద ఉధృతి పరిశీలించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో హైదరాబాద్ తాజా పరిస్థితిపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి పురపాలకశాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదే విధంగా హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని మంత్రి పరిశీలించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలని సూచించారు. అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వరద నీరు నిలిచిన పట్టణాల్లో మరిన్ని సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే తరలించాలని ఆదేశించారు. గత ఏడాదితో పోలిస్తే ఆయా ప్రాంతాల్లో వరద సమస్య తగ్గిందన్నారు. మూసీ వరదను మానిటర్ చేస్తున్నాం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. పురపాలకశాఖ అధికారులతోనూ కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారని తెలిపారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మూసీ వరదను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని తెలిపారు. వరద ప్రభావం కొంత తగ్గింది కుంభవృష్టిగా, ఎడతెరిపి లేకుండా వర్షం పడటం వలన ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవుతుందని, పలు కాలనీల్లో మాత్రం తాత్కాలికంగా వరదనీరు వచ్చి చేరిందని అన్నారు. నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గిందన్నారు. తమ ప్రధాన లక్ష్యం ప్రాణ నష్టం జరగకుండా చూడమేనని స్పష్టం చేశారు. వాళ్ల సెలవులు రద్దు హైదరాబాద్ నగరంలోనూ జీహెచ్ఎంసీ కమిషనర్ సహా ఇతర ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్న కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ పనిచేస్తున్నారని తెలిపారు. పురపాలక ఉద్యోగుల అన్ని సెలవులు రద్దు చేసినట్లు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సాధ్యమైన ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 135 చెరువులకు గేట్లు బిగించాం హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. హైదరాబాద్ నగరంలో డిసిల్టింగ్ కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేశాం. దీంతోపాటు చెరువుల బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాము. 135 చెరువులకు గేట్లు బిగించాం. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అధికారులు సిబ్బంది కూడా విస్తృతంగా పనిచేస్తున్నారు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది గతంలో ఇలాంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేది. అయితే ఈసారి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గింది. ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని . భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు వర్షాన్ని ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయి. వారి మనో ధైర్యం దెబ్బతినకుండా నాయకులు మాట్లాడితే బాగుంటుంది. చెరువులకు గండి పడే ప్రమాదం వరద పెరిగే ప్రాంతాల్లో ఉన్న పౌరులను అలర్ట్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నాం. చెరువులకు గండి పడే ప్రమాదం ఉంటే వాటిని కూడా సమీక్షిస్తున్నాం. వర్షాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటాం. వరంగల్ నగరానికి వెళ్లాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించాము. అవసరమైతే రేపు నేను కూడా స్వయంగా వెళ్తాను’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. -
హైదరాబాద్‌లో భయంకరమైన పరిస్థితుల్లేవ్: మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: నగర పరిధిలో వర్షాలతో ప్రజలకు ఏ ఇబ్బంది కలగలేదని.. జీహెచ్ఎంసీ అద్భుతంగా పని చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో నగర వర్షాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. భయంకర పరిస్థితులు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసినప్పటికి ప్రజలకు ఇబ్బంది కలుగలేదు. మంత్రి కేటీఆర్ దూరదృష్టితో SNDP వర్క్ ఫలితం ప్రజలను ఇబ్బందుల నుంచి తప్పించింది. జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తోన్న అన్ని శాఖలను నేను అభినందిస్తున్నా. GHMC కంట్రోల్ రూమ్ మూడు షిఫ్ట్‌ల్లో పనిచేస్తోంది. గత ప్రభుత్వాలు వర్షాల సమస్యలను తప్పించుకొని పారిపోయాయి.కానీ, బీఆర్ఎస్ మాత్రం సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. మరోవైపు.. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు పోలీస్ కృషి చేస్తోంది. గాజుల రామరంలో లే అవుట్ సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. నాలా పనుల్లో 36కుగానూ.. 30 పూర్తి అయ్యాయి. నగరంలో ఎడతెరిపిలేని వర్షాలతో ఏదో జరిగిపోతోందని.. భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ప్రచారం ఉత్తదే అని తేల్చేశారాయన. హైదరాబాద్ ప్రజల కోసం ప్రభుత్వం, జిహెచ్ఎంసి పనిచేస్తున్నాయని.. ఏదైనా సమస్య ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్స్‌కు ఫిర్యాదు చేయాలని కోరారాయన. అలాగే.. భారీ వర్ష సూచన ఉన్నప్పుడు ప్రజలు రోడ్ల మీదకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఎప్పటికప్పుడు సెల్ఫోన్లకు EVDM ద్వారా అప్రమత్తం చేస్తున్నామని.. అసలు ఈ కాన్సెప్ట్ దేశంలో ఎక్కడా లేదని మంత్రి తలసాని పేర్కొన్నారు. ట్రాఫిక్ వల్లే ఇబ్బంది జీహెచ్ఎంసీ పరిధిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ తెలిపారు. ‘‘వచ్చిన ఫిర్యాదులను అదే రోజు క్లియర్ చేస్తున్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో 2వేలకు పైగా సిబ్బంది ఫీల్డ్ పై ఉన్నారు అని తెలిపారామె. అయితే.. ట్రాఫిక్ సమస్య వల్ల కొంత ఇబ్బంది అవుతోంది. వర్షం కురిసిన తరువాత రెండు గంటల సమయం పడుతుందని వెల్లడించారు. అలాగే.. జీహెచ్ఎంసీ పరిధిలో 11సెంటిమిటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని.. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని కోరారామె. పాత భవనాలకు నోటీసులిచ్చాం జీహెచ్ఎంసీ పరిధిలో జులై నెలలో పడాల్సిన వర్షం కంటే.. 60శాతం ఎక్కువగా పడిందని జీహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. ‘‘జీహెచ్ఎంసి పరిధిలో 455 టీమ్స్ పనిచేస్తున్నాయి. 399 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. DRF టీమ్స్ 30 ఉన్నాయి. 197 మోటార్లు నీళ్లను తీసివేయ్యడానికి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నాయి. 9 టీమ్స్ గార్బేజ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసాము. చుట్టుపక్కల 185 చెరువులు ఉన్నాయి.. 35 చెరువులు FTL వరకు వచ్చాయి. అన్ని చెరువులను మానిటరింగ్ చేస్తున్నాం. 238 వాటర్ లాగింగ్ పాయింట్స్ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నాయని తెలిపారాయన. సర్కిల్ వారిగా వర్షపాతంను జిహెచ్ఎంసి మానిటరింగ్ చేస్తోందని.. శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి...నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారాయన. అలాగే.. నగరంలో సెల్లార్స్ తవ్వడంపై నిషేధం ఉడడంతో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారాయన. ప్రస్తుతం నగరంలో 130 రిలీఫ్ సెంటర్స్‌ను సిద్ధం చేసుకున్నామని, ప్రజలకు సమస్యలు వస్తే గనుక అక్కడికి తరలిస్తామని తెలిపారు. -
HYD: మూసీకి భారీగా వరద.. జీహెచ్ఎంసీ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట్)లకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ రెండు రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే గత శుక్రవారం మొదటి సారిగా హిమాయత్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అయితే.. నేడు ఎగువ ప్రాంతం నుంచి ఎక్కువగా వరద నీరు రావడంతో తాజాగా ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లు ఒక ఫీటు మేర ఎత్తి నీరు దిగువకు వదులుతున్నారు. వాతావరణ శాఖ మరో రెండు రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ముందస్తు చర్యగా గండిపేట్ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తారు. దీంతో మూసీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చదవండి: తెలంగాణకు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీ హై అలర్ట్ గతేడాది ఇదీ పరిస్థితి.. హిమాయత్ సాగర్: గతేడాది భారీగా వర్షాలు కురవడంతో రెండు రిజర్వాయర్లకు భారీగా వరద నీరు వచ్చింది. దీంతో ఇరు జలాశయాల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. 2022 జులై 10 న మొదటి సారి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. తర్వాత వర్షాభావ పరిస్థితుల్ని బట్టి అక్టోబరు 26 న మొత్తం గేట్లు మూసివేశారు. ఈ ఏడాది జులై 21 న మొదటి సారి రెండు గేట్లు ఎత్తారు. ప్రస్తుతం రిజర్వాయర్ కు 1200 క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతోంది. రెండు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి 1350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ (గండిపేట్): గతేడాది ఉస్మాన్ సాగర్ జలాశయం రిజర్వాయర్ నీటి మట్టం 1785.80 అడుగులు ఉండగా జులై 10న మొదటి సారి గేట్లు ఎత్తారు. చివరిసారిగా అక్టోబరు 26 వ తేదీ నాటికి మొత్తం గేట్లు మూసివేశారు. ఈ ఏడాది ఈ రోజు మొదటిసారి రెండు గేట్లు ఎత్తారు. ప్రస్తుతం రిజర్వాయర్ కు 800 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. 216 క్యూసెక్కుల నీటిని దిగువనున్న మూసీలోకి వదులుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని ఎండీ ఆదేశం: జంట జలాశయాల గేట్లు (హిమాయత్ సాగర్-2, ఉస్మాన్ సాగర్-2 గేట్లు) ఎత్తడంతో దాదాపు 1566 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న మూసీ నదిలోకి విడుదల చేస్తున్నందున ఎండీ దానకిశోర్ సంబంధిత జలమండలి అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వివరాలు: (సాయంత్రం 6 గంటల వరకు) పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 1761.20 అడుగులు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు ప్రస్తుత సామర్థ్యం : 2.472 టీఎంసీలు ఇన్ ఫ్లో : 1200 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 1350 క్యూసెక్కులు మొత్తం గేట్ల సంఖ్య : 17 ఎత్తిన గేట్ల సంఖ్య : 02 ఉస్మాన్ సాగర్ (గండిపేట్) రిజర్వాయర్ వివరాలు: పూర్తి స్థాయి నీటి మట్టం : 1790.00 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 1787.15 అడుగులు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 3.900 టీఎంసీలు ప్రస్తుత సామర్థ్యం : 3.253 టీఎంసీలు ఇన్ ఫ్లో :: 800 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 216 క్యూసెక్కులు మొత్తం గేట్ల సంఖ్య : 15 ఎత్తిన గేట్ల సంఖ్య : 02 -
తెలంగాణకు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీ హై అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు భారీ వర్షం పడే అవకాశముందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. ఐటీ కారిడార్‌లో లాగౌట్ పొడిగింపు నగరంలో భారీ వర్ష సూచన నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో ఆగస్టు 1 వరకు లాగౌట్ను పొడిగిస్తూ సైబరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పరకుండా.. 3 దశలుగా విధుల ముగింపు వేళలు ఉండాలని పేర్కొంది. యాదాద్రి, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, భద్రాద్రి, జగిత్యాల, కరీంనగర్, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. ఎడతెరిపిలేని వానలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. ఆకాశం చిల్లులు పడిందా అన్నట్టుగా వానలు పడుతున్నాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఇప్పుడీ వానలు మరింత ముదురుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు కుండపోత వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చదవండి: ఆర్టీసీ కొత్త టికెట్! రూ.50 చెల్లించు.. 12 గంటలపాటు బస్సుల్లో ప్రయాణించు ఈ మేరకు రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లాలో అయితే రికార్డు స్థాయిలో వానలు పడ్డాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌నూ వాన వణికిస్తోంది. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనాల ట్రాఫిక్ ఇబ్బందిగా మారింది. -
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఆరెంజ్ అలెర్ట్ జారీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే గత వారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండగా మరో రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈమేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేయగా.. హైదరాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో కుంభవృష్టి హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్-పంజాగుట్ట, బేగంపేట- సికింద్రాబాద్, గచ్చిబౌలి ఐకియా రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైటెక్ సిటీ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు వాహనాలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు .. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ► కంట్రోల్ రూం నంబర్లు: 040-2111 1111, 9000113667, సోమవారం ఉదయం వానలు నుంచి కాస్త ఉపశమనం పొందామని నగర వాసులు అనుకున్నారో లేదో.. సాయంత్రం నుంచి భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడలిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని తెలిపారు. #malakpet ⛈️⛈️⛈️⛈️⚡⚡⚡⚡@HiHyderabad @balaji25_t @HYDmeterologist @Hyderabadrains @Hydbeatdotcom @TS_AP_Weather @Z9Habib @MalakpetD @Rajani_Weather @metcentrehyd #hyderabad @Ilovehyderabad #HYDERABADRAINS @kbiqbal777 pic.twitter.com/ynO1cpfbOY — Younus Farhaan (@YounusFarhaan) July 24, 2023 కాగా దక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ అల్పపీడనం జూలై 26వ తేదీన వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. మేడ్చల్ జిల్లాలోని కాప్రా, ఏ.ఎస్.రావు నగర్, ఈసీఐఎల్ చౌరస్తా, కుషాయిగూడ, హెచ్.బి.కాలనీ, చర్లపల్లి, చక్రీపురం, ఎల్లారెడ్డిగూడ, వంపుగూడ, జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం, రాంపల్లి, కీసర, నేరెడ్మెట్ తో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం. .#Hyderabadrains pic.twitter.com/l6THASqAoy — Minhaj Hussain Syeed (@MinhajHussains) July 24, 2023 నగరం.. జలమయం ►అంబర్పేట్ నుండి దిల్సుఖ్ నగర్ కు వెళ్లే ప్రధాన రహదారి మూసారాంబాగ్ బ్రిడ్జిపై వర్షం నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నారు. ప్రత్యామ్నాయ రహదారి గోల్నాక నుంచి వెళ్ళాలంటున్న పోలీసు వాహనదారులకు సూచిస్తున్నారు. ►నిజాంపేట....కేపీహెచ్‌బీ. ....కూకట్ పల్లి....మూసాపేటలలోనూ భారీ వర్షం కురుస్తోంది. వానల కారణంగా పలు చోట్ల రోడ్లపై భారీగా నీరు చేరడంతో చెరువును తలపిస్తోంది. ►రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ గండిపేట్ కిస్మత్పూర్ అత్తాపూర్ పలు ప్రాంతాలలో గంట ఒక పైగా భారీ వర్షం కురవడంతో రోడ్లంతా జలమయం అయిపోయాయి. ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో పలు కాలనీలో హైవే రోడ్లపై కూడా భారీ ట్రాఫిక్ జామ్ తో పాటు భారీ వర్షం కురుస్తుంది. చదవండి: ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్ఏలు.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం -
హైదరాబాద్‌లో ఏకధాటిగా వర్షం.. జీహెచ్ఎంసీ హెచ్చరికలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో ఈరోజు గురువారం రాత్రి కూడా భారీ వర్షం కురవనుందని, కొన్ని ప్రాంతాల్లో 120 మిల్లీ మీటర్ల వర్షపాతం కంటే ఎక్కువ పడే అవకాశం ఉందని, నగరవాసులు మరీ అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని మేయర్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 426 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల ఏర్పాటు చేశారు. అధికారులతో ఎప్పటి కప్పుడు మేయర్ సమీక్షిస్తున్నారు. రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చదవండి: వాన అప్పుడే అయిపోలేదు.. మరో ఐదు రోజులు దంచికొట్టుడే! 157 స్టాటిక్ టీమ్‌లను ఏర్పాటు చేశాం. 339 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాం. నగరంలోని 185 చెరువులు, కుంటలలో నీటి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం. చెరువుల్లో నీటిని అవసరమైతే ముందస్తుగా వదులుతున్నాం. శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. నగరంలోని అన్ని కీలక ప్రాంతాల్లో ఈవీడీఎం బృందాలను మోహరించాయి’’ అని మేయర్ వెల్లడించారు. -
నిధులు విడుదలవ్వక.. నాలాల, చెరువుల విధులంతే !
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో వానొస్తే వరదలు.. రోడ్లు చెరువులుగా మారడం తెలిసిందే. అందుకు కారణం వరదనీరు సాఫీగా పారే నాలాలు కబ్జాలపాలై కొన్ని చోట్ల.. వ్యర్థాలతో నిండి చాలాచోట్ల నీరు పారే దారి లేక పోవడమే అందుకు ప్రధాన కారణమని తెలుసు. వాటితోపాటు నగరంలోని చాలా చెరువులు సైతం కబ్జాల పాలై నీరు నిలిచే పరిస్థితి లేకపోవడం కూడా ముంపునకు మరో కారణం. ముంపు సమస్యల పరిష్కారానికి రెండు దశాబ్దాల నుంచి రెండేళ్ల క్రితం వరకు వివిధ పనులు చేపట్టారు. అవి ఇప్పటికీ పూర్తికాలేదు. సమస్య గుర్తించినా.. వరద సమస్యల పరిష్కారానికి నాలాల విస్తరణ, ఆధునికీకరణే శరణ్యమని రెండు దశాబ్దాల క్రితమే గుర్తించారు. కిర్లోస్కర్, వాయెంట్స్ కమిటీల సిఫార్సుల మేరకు విస్తరణ పనులు కొంత మేర చేపట్టి.. ఆ తర్వాత నిలిపి వేశారు. వరద సమస్యల పరిష్కారానికి వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకాన్ని (ఎస్ఎన్డీపీ) రెండేళ్ల క్రితం చేపట్టారు. ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. వాటికంటే ముందు దాదాపు రూ. 452 కోట్లతో నాలాల విస్తరణ పనులు చేపట్టారు. అవి సైతం ఇంతవరకు పూర్తికాలేదు. కొత్తవి, పాతవి ఏవీ పూర్తికాకపోవడంతో వానొస్తే నగరంలో ముంపు సమస్యలు తప్పేలా లేవు. చెరువుల పనులూ కాలేదు.. జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులుండగా, వివిధ పథకాల ద్వారా పూడికతీత, మరమ్మతులు, పునరుద్ధరణ, అలుగు, తూముల ఏర్పాటు వంటి పనులు చేస్తున్నారు. వీటితోపాటు మురుగునీటి మళ్లింపు, చెరువుకట్టల ఆధునీకరణ, ఫెన్సింగ్ తదితర పనులు చేపట్టారు. తద్వారా ముంపు సమస్యలు తగ్గుతాయని భావించారు. అలా 355 పనులకు రూ.345 కోట్లు మంజూరు కాగా, రూ.108.29 కోట్లతో 191 పనులు మాత్రం పూర్తయ్యాయి. 144 పనులు పురోగతిలో ఉన్నాయి. 20 పనులు వివిధ కారణాలతో పెండింగ్‌లో పడ్డాయి. ఇవి కాక రాష్ట్రప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ కోసం 19పనులకు రూ.282.63 కోట్లు మంజూరు చేయగా, వాటిల్లో రూ.132.21 కోట్లతో 8 పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి కాలేదు. నిధుల విడుదల కాకపోవడమే ఇందుకు కారణం. పూర్తి కాని పనుల్లో.. పూర్తికాని నాలాల పనులు పాతవాటిలో కిషన్‌బాగ్ నాలా రిటైనింగ్ వాల్, సన్నీగార్డెన్ – శివాజీనగర్ వరకు ముర్కి నాలా రిటైనింగ్ వాల్ ఆధునీకరణ, నూరమ్మచెరువు నుంచి మీరాలం ట్యాంక్ వరకు (వయా శివరాంపల్లి చెరువు, ఊర చెరువు, ప్రభాకర్జీ కాలనీ) కల్వర్టులు, ఉందాసాగర్ నుంచి పల్లెచెరువు వరకు రిటైనింగ్ వాల్, బహదూర్‌పురా నాలా కల్వర్టు, రిటైనింగ్ వాల్ తదితరమైనవి ఉన్నాయి. వీటితో పాటు పలు ప్రాంతాల్లో పనులు పూర్తి కాలేదు. ఓవైపు నాలాలు, మరోవైపు చెరువుల పనులు పూర్తి కాకపోవడంతో నగరంలో వానా కాలం సమస్యలు తీరలేదు. -
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. కేటీఆర్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా వ్యాపించాయి. ఇక, ఇప్పటి వరకు తెలంగాణవ్యాప్తంగా ఓ మోస్తరు వానలు మాత్రమే కురిశాయి. మరోవైపు.. ఈ వారాంతం నుంచి పలు జిల్లాలు, హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో, మంత్రి కేటీఆర్.. జీహెచ్ఎంసీ అధికారులను హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల ప్రారంభించిన వార్డు కార్యాలయాల వ్యవస్థపై మంత్రి కేటీఆర్ బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న స్పందనను అధికారుల ద్వారా మంత్రి తెలుసుకున్నారు. ఈ సమావేశంలోనే వర్షాలపై కూడా కేటీఆర్ సమీక్షించారు. ఈ క్రమంలో వర్షాకాలం నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. వారాంతం నుంచి హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అంతర్గత విభాగాలతో పాటు ఇతర శాఖలతో కలిసి వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను కోరిన కేటీఆర్.. అత్యంత కీలకమైన పారిశుద్ధ్య కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. -
జాతీయస్థాయి పురస్కార గ్రహీత.. హైదరాబాద్ నయా బాస్‌గా రోనాల్డ్ రాస్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా డి.రోనాల్డ్‌రాస్ నియమితులయ్యారు. రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న డీఎస్ లోకేశ్కుమార్ను గతవారమే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అడిషనల్ సీఈఓగా నియమించగా, అందుకనుగుణంగా రాష్ట్రప్రభుత్వం తాజాగా ఉత్వర్వులు జారీ చేసింది. రోనాల్డ్‌రాస్ గతంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (టౌన్‌ప్లానింగ్)గా, సెంట్రల్ జోన్ (ఖైరతాబాద్)కమిషనర్‌గా పని చేశారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో, కూల్చివేయడంలో చురుగ్గా వ్యవహరించేవారు. రోనాల్డ్‌రాస్ 2006 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో శిక్షణ తీసుకున్న ఆయన నర్సాపూర్ సబ్‌కలెక్టర్‌గా, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా, డ్వాక్రా డైరెక్టర్‌గా, గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రాజెక్టు అడిషనల్ సీఈఓగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆర్థికశాఖతో పాటు సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా, గనులు, భూగర్భశాఖ కార్యదర్శిగా కూడా ఉన్నారు. బుధవారం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం జరుగుతున్న బదిలీల్లో భాగంగానే ఈ బదిలీలు చోటు చేసుకున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమితులైన రోనాల్డ్‌రాస్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడంలో చేసిన కృషికి ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. ఆయా జిల్లాల్లో పని చేసినప్పుడు చిన్నారుల చదువు కోసం, విద్యాశాఖ ప్రక్షాళనకు, అవినీతి నిర్మూలనకు కృషి చేశారు. ఇసుక అక్రమ రవాణాను నిలువరించారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి కాల్‌సెంటర్ వంటివి ఏర్పాటు చేశారు. పేదల బాగుకోసం తపించే అధికారిగా పేరుంది.