సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో అధికారుల ప్రక్షాళన మొదలైంది. రిటైర్డ్ ఉద్యోగులపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీలో రిటైర్డ్ అయిన ఉద్యోగులను కమిషనర్ టర్మినెట్ చేశారు.
45 మంది రిటైర్డ్ ఉద్యోగుల్లో 37 మంది తమ విధుల నుంచి వైదొలిగారు. అక్రమాలకు పాల్పడిన 14 మంది అధికారులను విధుల నుంచి కమిషనర్ తొలగించారు. తప్పులు చేస్తున్న పలువురు అధికారులకు రోనాల్డ్ రోస్ మెమోలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
కాగా, అక్రమాల కట్టడి కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇతరుల హాజరుకు వినియోగిస్తున్న ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ స్థానే ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఫేషియల్ రికగినషన్ బయోమెట్రిక్‌ను ఉపయోగించేందుకు సిద్ధమైంది. తద్వారా బోగస్ కార్మికులకు అడ్డుకట్ట వేయవచ్చని, ఫలితంగా ఏటా కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం కాకుండా నివారించవచ్చునని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఈ విధానాన్ని అమలు చేస్తుండటంతో జీహెచ్‌ఎంసీ కూడా రెడీ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment