సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ అసంపూర్తిగానే ముగిసింది. ఇష్టానుసారం స్టాండింగ్ కమిటీలో నిర్ణయాలు తీసుకోవడంపై బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో, బడ్జెట్ ప్రతిపాదనలు సవరించి డిసెంబర్ 9 తర్వాత మరోసారి స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది.
జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ అసంపూర్తిగా ముగిసింది. సమావేశంలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలపై స్టాండింగ్ కమిటీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాస్తవాలకు దూరంగా బడ్జెట్ గణాంకాలు ఉన్నాయరని కార్పొరేటర్ల విమర్శలు చేశారు. వివిధ శాఖలకు కేటాయింపులు సరిగా లేవని స్టాండింగ్ కమిటీ సభ్యులు మండిపడ్డారు. దీంతో, చేసేదేమీ లేక.. బడ్జెట్ ప్రతిపాదనలు సవరించి డిసెంబర్ 9 తర్వాత మరోసారి స్టాండింగ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారు.
ఇక, స్టాండింగ్ కమిటీ సమావేశం ప్రారంభంలోనే బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. ఇష్టానుసారం స్టాండింగ్ కమిటీలో నిర్ణయాలు తీసుకోవడంపై కాషాయ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతీ డివిజన్‌లో విజిట్ చేసి సమస్యలపై చర్యలు చేపడతామని మేయర్ గద్వాల విజయలక్ష్మి హామీ ఇవ్వడంతో బీజేనీ కార్పొరేటర్లు నిరసన విరమించుకున్నారు. అంతకుముందు.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి బల్దియాను లూటీ చేస్తున్నారంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment