హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం బుధవారం జరగనుంది. ఔట్‌సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజేషన్‌తో పాటు ఇతరత్రా డిమాండ్ల సాధన కోసం జీహెచ్‌ఎంఈయూ ఆధ్వర్యంలో కార్మికుల సమ్మె నిరవధికంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు వారికి మద్దతు తెలపనున్నాయి. ఈ నేపథ్యంలో జరిగే సమావేశం సజావుగా సాగనుందా అనే అనుమానాలు నెలకొన్నాయి.
గత సమావేశం రసాభాసగా ముగియడం తెలిసిందే. ఈసారి సమావేశానికి కౌన్సిల్ హాల్‌లోకి మీడియాకు ఆహ్వానం లేదు. నగరంలో తీవ్ర సమస్యలుగా మారిన దోమల స్వైరవిహారం, విద్యుత్, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సభ్యులు ప్రశ్నించనున్నారు. కమిషనర్ రోనాల్డ్ రాస్ బాధ్యతలు స్వీకరించాక జరుగుతున్న తొలి సర్వసభ్య సమావేశం ఇది. ఇప్పటికే స్టాండింగ్‌కమిటీలో ఆమోదం పొందిన అంశాలతో సహ 40 అంశాలకు పైగా అజెండాలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment