ఏడాదిగా సుబేదార్కు అనుష్కతో ఆర్థిక లావాదేవీలు | subedar patan kumar has transactions since one year, says police | Sakshi

ఏడాదిగా సుబేదార్కు అనుష్కతో ఆర్థిక లావాదేవీలు

Published Thu, Aug 7 2014 2:30 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఏడాదిగా సుబేదార్కు అనుష్కతో ఆర్థిక లావాదేవీలు - Sakshi

ఏడాదిగా సుబేదార్కు అనుష్కతో ఆర్థిక లావాదేవీలు

ఏడాది కాలం నుంచి అపరిచిత వ్యక్తితో పతన్కుమార్కు ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయని సీసీఎస్ పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఫేస్బుక్ పరిచయంతో సైనిక రహస్యాలను విదేశీయులకు చేరవేసిన ఆర్మీ అధికారి పతన్కుమార్ పొద్దార్ నాయక్ (40)ను తమకు ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు ఏడాది కాలం నుంచి అపరిచిత వ్యక్తితో పతన్కుమార్కు ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయని, మూడు నాలుగు నెలల నుంచి వీరిమధ్య ఫేస్బుక్లో చాటింగ్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

పతన్‌కుమార్ నుంచి రెండు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నామని, వాటన్నింటినీ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించామని సీసీఎస్ పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే.. ఇంతకీ అసలా అపరిచిత వ్యక్తి పాకిస్థాన్‌ వ్యక్తా, ఇండియా వ్యక్తా అనేది తేలాల్సి ఉందన్నారు. కాగా ఎన్ఐఏ, ఐబీ, ఆర్మీ, ఇంటెలిజెన్స్, సీఐఎస్ఎఫ్లు కూడా పతన్ కుమార్ను తమకు అప్పగించాలని ఇప్పటికే కోరుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement