ఫేస్బుక్ పరిచయంతో సైనిక రహస్యాలను విదేశీయులకు చేరవేసిన ఆర్మీ అధికారి పతన్ కుమార్ పోద్దార్ కేసుకు సంబంధించి ...
హైదరాబాద్ : ఫేస్బుక్ పరిచయంతో సైనిక రహస్యాలను విదేశీయులకు చేరవేసిన ఆర్మీ అధికారి పతన్ కుమార్ పోద్దార్ కేసుకు సంబంధించి రెండో నిందితుడు అసిఫ్ అలీని ...సీసీసీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీటీ వారెంట్పై అతడిని చంచల్గూడ జైలుకు తరలించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ యూనిట్‌లో ఆసిఫ్ అలీ ఆర్మీ జవాన్. కాగా పతన్ కుమార్ పోద్దార్‌ను అనుష్క అగర్వాల్ మహిళ పేరుతో నమ్మించి, మోసం చేసింది ఆసిఫ్ అలీయేనని పోలీసుల విచారణలో తేలిన విషయం విదితమే. పోద్దార్‌తో ఫోన్లో మాట్లాడే మహిళ ఆసిఫ్‌అలీ భార్య అని విచారణలో వెల్లడి అయ్యింది. ఆసిఫ్ అలీ భార్య పాకిస్తాన్‌కు చెందిన మహిళగా విచారణలో తేలింది. దాంతో అసిఫ్ అలీని యూపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.