బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ చెరుకు రైతులు ఆందోళనకు దిగారు.
మెట్‌పల్లి: బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ చెరుకు రైతులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. మంగళవారం ఉదయం రైతులు పెద్ద సంఖ్యలో మెట్‌పల్లికి చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ముత్యంపేట కర్మాగారంలోనే చెరుకు క్రషింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరుపుతున్నారు.