యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది
యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ధారావత్ రమేష్(22) అనే యువకుడు ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య కూతురు ఉంది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు అంటున్నారు.