అప్పులబాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మలహర్రావు మండలం కొయ్యూరు గ్రామంలో జరిగింది.
కాటారం (కరీంనగర్) : అప్పులబాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మలహర్రావు మండలం కొయ్యూరు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన వంశీకృష్ణ(30) తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో గత రెండు సంవత్సరాలుగా పంటలు సరిగా పండక అప్పులు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపం చెంది శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.