Top Stories
ప్రధాన వార్తలు

కేంద్ర సంస్థలకు రూ.కోట్లలో..'ఉర్సాకు ఊరికే'!
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేంద్ర సంస్థలకైతే ఎకరా రూ.4 కోట్లు.. ఆర్మీకైనా సరే కోటికి తగ్గేది లేదు..! ఉర్సాకైతే ఊరికే! ఒక్క రూపాయికి కనీసం ఓ ఇడ్లీ కూడా రాదు..! మరి 99 పైసలకు రూ.3,000 కోట్ల భూములు ఎలా..? ఊరూ పేరు లేని కంపెనీపై ఔదార్యం వెనుక గుట్టు ఏమిటి? ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలు ఏర్పాటవుతుంటే ఏ ప్రభుత్వమైనా స్వాగతించి వీలైనన్ని వెసులుబాట్లు కల్పించి భూముల కేటాయింపులో ఉదారంగా వ్యవహరిస్తుంది! కానీ.. ప్రముఖ కేంద్ర సంస్థల నుంచి ఎకరా రూ.నాలుగు కోట్ల చొప్పున వసూలు చేస్తూ.. ఊరూ పేరు లేని ఓ డొల్ల కంపెనీకి మాత్రం రూ.3,000 కోట్లకుపైగా విలువ చేసే అత్యంత విలువైన దాదాపు 60 ఎకరాలను ఎకరా 99 పైసలకే కట్టబెట్టడం నాకింత.. నీకింత లాంటి లాలూచీ వ్యవహారాలకు పరాకాష్ట! పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలకు గతంలో చంద్రబాబు సర్కారు అమరావతిలో ఎకరా రూ.4 కోట్లు చొప్పున భూములను కేటాయించింది. హడ్కో, ఎల్ఐసీ, గెయిల్, ఎఫ్‌సీఐ, ఆర్బీఐ, ఎస్బీఐ, విజయా బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్ ఇండియా టెక్నికల్ ఎకనమిక్ సర్వీస్ లాంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు ఎకరా రూ.నాలుగు కోట్లు చొప్పున భూ కేటాయింపులు చేశారు. చివరకు దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్ ఆర్మీకి సైతం ఎకరా రూ.కోటి చొప్పున భూమిని కేటాయించడం గమనార్హం. ఇలా కేంద్ర, జాతీయ సంస్థలకు భూములిచ్చినందుకు భారీగా వసూలు చేస్తూ ఊరూ పేరు లేని అనామక ఉర్సా కంపెనీకి మాత్రం రూ.3,000 కోట్ల విలువైన 59.86 ఎకరాల ఖరీదైన భూమిని అత్యంత కారు చౌకగా కట్టబెడుతూ తన బంధువులు, బినామీలు, సన్నిహితులకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయడంలో చేతికి ఎముకే లేదని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు భూములు కేటాయించేటప్పుడు మాత్రం మార్కెట్ ధరను తెరపైకి తేవడం.. బంధుగణం, బినామీలకు మాత్రం కారుచౌకగా ప్రభుత్వ భూములను రాసిచ్చేయడం సీఎం చంద్రబాబుకు రివాజు అని పారిశ్రామికవేత్తలు, అధికార వర్గాలే స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలోనూ చంద్రబాబు 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తరహాలో వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. 2004లో ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ తనకు అత్యంత సన్నిహితుడైన బిల్లీ రావుకు చెందిన బోగస్ కంపెనీ ఐఎంజీ భారత్‌కు గచ్చిబౌలిలో 400 ఎకరాలు.. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో 450 ఎకరాల భూమిని కేటాయించడం చంద్రబాబు భూ సంతర్పణకు పరాకాష్టగా పేర్కొంటున్నారు. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథాను కొనసాగించారని ప్రస్తావిస్తున్నారు. భూ పందేరానికి ఆధారాలివిగో.. నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ తండ్రి ఎం.పట్టాభిరామారావుకు చెందిన వీబీసీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌కు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఏపీఐఐసీకి చెందిన 498.93 ఎకరాల భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున కేటాయిస్తూ 2015 జూలై 15న నాటి చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెంబరు 269) జారీ చేసింది. బహిరంగ మార్కెట్ ప్రకారం ఆ భూముల విలువ అప్పట్లోనే రూ.498 కోట్లు. ఆ తర్వాత ఆ భూములను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) పరిధిలోకి తెస్తూ 2015 సెపె్టంబరు 22న ఉత్తర్వులు (జీవో ఎంస్ నెంబరు 207) జారీ చేయడం ద్వారా వాటి విలువను మరింతగా పెంచుకున్నారు. సత్తా లేని సంస్థకు సంతర్పణ..! జనసేన, బీజేపీతో జట్టుకట్టి 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన బంధువులు, సన్నిహితులు, బినామీలకు ప్రభుత్వ భూములను ఇష్టారీతిన ధారాదత్తం చేస్తున్నారు. ఊరూ పేరూ లేని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విశాఖలోని ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు.. ఎకరం కేవలం 99 పైసలకే కేటాయించడమే అందుకు నిదర్శనం. వాస్తవంగా ఆ భూముల విలువ రూ.3 వేల కోట్లకుపైగా ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేవలం రెండు నెలల క్రితం ఏర్పాటైన కంపెనీకి రూ.5,278 కోట్ల పెట్టుబడి పెట్టి డేటా సెంటర్ ప్రాజెక్టును నెలకొల్పే సామర్థ్యం ఉందా.. లేదా? అన్నది పరిశీలించుకోకుండా భూ కేటాయింపులు చేశారంటే.. ఆ సంస్థ ఎవరి బినామీలదో అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కేంద్ర సంస్థలకు మార్కెట్ ధరకే.. విశాఖలో గతంలో టీడీపీ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మార్కెట్ ధరకే భూమిని కేటాయించారు. కీలకమైన నావికాదళ స్థావరం ఏర్పాటుకు ఇండియన్ నేవీతో పాటు ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంటుకు కూడా మార్కెట్ ధరకే భూమి ఇచ్చారు. దీనికి భిన్నంగా ఉర్సాకు విశాఖలో అత్యంత ఖరీదైన ఐటీ పార్కులో 3.5 ఎకరాలతో పాటు కాపులుప్పాడలో ఏకంగా 56.36 ఎకరాలను కేటాయించేందుకు టీడీపీ కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఉర్సా కంపెనీ గత ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని నివాస ప్రాంతంలో ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాటు అడ్రస్‌తో ఏర్పాటు కాగా ‘ఎక్స్’ ఖాతాలో ఇప్పటివరకూ కేవలం ఒకే ఒక పోస్టు పెట్టింది. అది కూడా భూ కేటాయింపులపై విమర్శల నేపథ్యంలో వివరణ ఇస్తూ చేసిన పోస్టు మాత్రమే. ఇక ఈ ఖాతాను కేవలం ఒకే ఒక్కరు ఫాలో అవుతుండటం గమనార్హం. దేశాభివృద్ధిలో కీలకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు రక్షణ వ్యవస్థలో భాగస్వామిగా ఉన్న ఇండియన్ నేవీకి కూడా మార్కెట్ ధరకే భూమిని కేటాయించిన టీడీపీ ప్రభుత్వం.. ఉర్సాకు మాత్రం నామమాత్ర ధరకే సంతర్పణ చేయడం వెనుక భారీ వ్యవహారమే ఉందనే ఆరోపణలున్నాయి. విశాఖలోని కీలకమైన ఏపీ సెజ్‌లో ఎకరా ధర లీజు రూ.35 లక్షల మేర పలుకుతోంది. ఏ సంస్థకు భూమి కావాలన్నా ఇదే ధర చెల్లించి భూమిని లీజుకు తీసుకోవాల్సి ఉంటుంది. కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సంస్థ కార్యాలయం నిర్మాణం కోసం అనకాపల్లిలోని రాజుపాలెం వద్ద మార్కెట్ ధర మేరకు ఎకరా రూ.80 లక్షల చొప్పున సర్వే నెంబరు 75/3లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ 25 జనవరి 2016న టీడీపీ సర్కారు 326/2016 జీవోను జారీ చేసింది. నిబంధనలు ఏం చెబుతున్నాయి?2012లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు (జీవో నెంబరు 571– 14–9–2012) ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే సమయంలో.. మార్కెట్ విలువ మీద వార్షిక లీజు రెంటల్ పది శాతం కంటే తక్కువ ఉండకూడదు. లీజును ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మార్కెట్æ ధర ఆధారంగా సవరించాలి. విశాఖలో టీసీఎస్‌తో పాటు ఉర్సాకు ఇవ్వనున్న భూమి రిజిస్ట్రేషన్ ధరల మేరకే చదరపు గజం రూ. 30 వేల వరకు ఉంది. ఇక మార్కెట్ ధరను గనుక తీసుకుంటే రూ.లక్ష వరకూ పలుకుతోంది. ఇంత విలువైన భూమిని ఊరూ పేరు లేని ఉర్సాకు ఎకరం 99 పైసలకే ఇచ్చేందుకు టీసీఎస్‌ను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చి కథ నడిపినట్లు స్పష్టమవుతోంది.

కాంగ్రెస్ అన్నిట్లోనూ ఫెయిల్: కేసీఆర్
మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం, దగా చేశారు. ఇవాళ అప్పు పుడత లేదని మాట్లాడుతుండ్రు. నా మనసు కాలుతోంది. బాధ పడుతోంది.దుఃఖం వస్తోంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏ మాయ రోగం వచ్చె.. ఏం బీమారి వచ్చె.. ఏమేం చెప్పిరి.. ఎన్నెన్ని చెప్పిరి.. గోల్మాల్ దింపుట్ల,అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్‌ను మించినోళ్లు లేరు. అప్పుడు చెరువుల పూడిక తీసిన బుల్డోజర్లు, ఇప్పుడు ఇళ్లు కూలగొడుతున్నయి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నరు. ఓట్లెప్పుడు వస్తయా అని చూస్తున్నరు.ఎల్కతుర్తి నుంచి సాక్షి ప్రతినిధి: అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా చేసుకుంటే, ఏడాదిన్నర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని, అన్నిట్లోనూ ఫెయిల్ అయ్యిందని భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. మా అంత సిపాయిలు లేరు..కేసీఆర్‌కు మించి ఇస్తాం.. ఆరు చందమామలు తెచ్చి ఇస్తాం.. ఏడు సూర్యుళ్లు పెడతాం అని నమ్మబలికి ఓట్లు వేయించుకుని ప్రజలను దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 420 హామీలిచ్చి ఏమీ చేయలేదని, మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించారని విమర్శించారు. రైతుబంధు లాంటి పథకాలు కావాలని తననెవరూ అడగలేదని, మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము పడగొట్టబోమని, ప్రజలే వీపులు సాపు చేస్తారని వ్యాఖ్యానించారు. ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు కాంగ్రెస్సే నంబర్ వన్ విలన్ అని అన్నారు. కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు ఇక తాను బయటకు వస్తానని ప్రకటించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. బుక్కులు పంచిండ్రు.. బాండ్లు రాసిచ్చిండ్రు హామీలు ఇచ్చుడు కాదు.. పెద్ద పెద్ద బుక్కులు ఊరూరా పంచిండ్రు. సిగ్గు లేకుండా బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు..యేడికెళ్లి ఇస్తారని కాంగ్రెస్ నేతలను అడిగితే.. చేసి చూపిస్తాం.. మాది పెద్ద పార్టీ.. మమ్మల్ని మించిన సిపాయిలు లేరని ఇప్పుడు ఆర్థికమంత్రిగా ఉన్నాయన జబ్బలు చరిచాడు.. ఒకడు మెడలు చరిచాడు. డైలాగులు మీద డైలాగులు కొట్టారు. మధ్యలో ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి.. నాకు కాలు విరిగింది.. అయినా నేను బయల్దేరాను.. దీంతో తెలంగాణలో ఎంత మంది దేవుళ్లు ఉంటే అంతమంది దేవుళ్ల మీద ఒట్లు పెట్టిండ్రు. ఇన్ని మాటలు చెప్పి మోసం చేసిన్రు. ఉచిత బస్సు అని పెడితే జుట్లు పట్టుకుని కొట్టుకునేందుకు పనికి వస్తోంది తప్ప ఉపయోగం లేదు. ఈ ఉచిత బస్సు మాకు అవసరం లేదు అని ఆడబిడ్డలు అంటున్నరు. ఊ అంటే ఆ అంటే అబద్ధాలు చెబుతున్నారు. నమ్మి బోల్తా పడ్డం..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. అప్పుడెంత బాగుండె.. ఇప్పుడెట్లయింది? ‘ఒక ఊరిలో నాట్లు వేసే టైమ్ వస్తే వడ్లు ఓ రైతు అలుకుతున్నడు. మొలకకు అలుకుడు చేస్తం కదా.. పెద్ద మొగోడు అని ఒకర్ని మొలక అలికేందుకు పిలిస్తే.. ఎలుక పిల్లను చూసి ఎల్లెలకల పడ్డడట. అట్లనే మా అంత సిపాయిలు లేరు.. మేం తెచ్చి ఇస్తాం అన్నరు. ఇవాళ మమ్మల్ని నమ్ముతలేరు.. అప్పు పుడుతలేదని మాట్లాడుతుండ్రు. ఎక్కడికెళ్లి తెచ్చి చేయాలని అంటున్నరు. అపారమైన అనుభవం ఉందని అప్పుడు అన్నరు.. ఇప్పుడేమో ఎల్లెలకల పడుతుండ్రు. నా ప్రసంగం టీవీల్లో వినే కోట్లాను కోట్ల మందిని అడుగుతున్నా.. ఇంత మోసం ఉంటదా.. ఇంత దగా ఉంటదా..? ఎంత వరకు ఇది కరెక్ట్..? తెలంగాణను బొందల పడగొట్టిండ్రు.. ఎంత ఘోరమైన ఫలితం చూస్తున్నాం. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి ఎంత బాగుండె. ఇప్పుడెట్లయింది? నా మనసు కాలుతుంది. బాధయితంది. దుఃఖం వస్తోంది. కేసీఆర్ పక్కన పోంగనే ఇంత ఆగమయితదా? ఎందుకు ప్రజల గోస పోసుకుంటున్నరు? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు భూముల ధరలు ఎట్లుండె. కొనేటోళ్లు ఎక్కువుండె. అమ్మేటోళ్లు తక్కువుండే. నేను 24 గంటలు కరెంటు ఇయ్యలేదా? ఇప్పుడు ఎందుకు ఇయ్య శాతనయిత లేదు? మళ్లీ తెల్లందాక కరెంటు పెట్టడానికి పోవాల్నా..? మంచినీళ్లు కూడా ఇయ్య శాతనయితలేదు. కానీ మేం ఇంత సిపాయిలం, అంత సిపాయిలం అంటున్నరు..’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.ఎన్నెన్ని చెప్పిరి.. ఏమన్నా చేసిన్రా? ‘కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏ మాయ రోగం వచ్చె..ఏం బీమారి వచ్చె.. ఏమేం చెప్పిరి.. ఎన్నెన్ని చెప్పిరి.. గోల్మాల్ దింపుట్ల, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్‌ను మించినోళ్లు లేరు. ఇక్కడ ఉన్నోళ్లు చాలరని చెప్పి ఉన్న గాంధీలు, లేని గాం«దీలు, డూప్లికేట్ గాం«దీలు ఢిల్లీకెళ్లి దిగిరి. స్టేజీల మీద డ్యాన్స్‌లు చేసిన్రు. కేసీఆర్ రైతుబంధు కింద ఏం ఇస్తుండు..రూ.10 వేలు ఇస్తుండు.. మేం రూ.15 వేలు ఇస్తమని చెప్పిన్రు. పెన్షన్లు రూ.2 వేలు ఇస్తుండు మేం వస్తే రూ.4 వేలు ఇస్తమని చెప్పిరి. ఇద్దరు ఉంటే కేసీఆర్ ఒక్కరికే ఇస్తుండు.. మేం ముసలిది ముసలోడికి ఇద్దరికీ ఇస్తమనిరి. దివ్యాంగులకు రూ.4 వేలు ఇస్తుండు.. మేం రూ.6 వేలు ఇస్తమన్నరు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తమన్నరు. విద్యార్థులకు ఐదు లక్షల గ్యారంటీ కార్డు ఇస్తమని చెప్పిరి. ఇక ఒకరెనుక ఒకరు ఉరికి.. రూ.2 లక్షల లోన్ తెచ్చుకోండి.. డిసెంబర్ 9న ఒక్క కలం పోటుతో ఖతం చేస్తం అన్నరు. కల్యాణలక్ష్మి కింద కేసీఆర్ లక్షా నూటపదహార్లు ఇస్తున్నడు.. మేం తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పిండ్రు. 420 హామీలు ఇచ్చిన్రు. ఏమన్నా చేసిన్రా .. ఏం చేయలేదు. మాట్లాడితే బీఆర్ఎస్, కేసీఆర్ మీద నిందలు వేస్తున్నారు.తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చారు ‘ఆనాడైనా, ఏనాడైనా, ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు.. ప్రజలు వద్దంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే.. 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం.. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. 2001 నుంచి గులాబీ పార్టీ పెట్టి విజృంభిస్తే.. నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి.. మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇస్తమని నమ్మబలికిన్రు. మళ్లీ ఎగ్గొట్టే ప్రయత్నం చేసిన్రు. 14 సంవత్సరాలు ఏడిపించిన్రు. జయశంకర్ సార్‌తో కలిసి పార్లమెంట్లో ప్రతిపక్షాలు కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే.. అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన్రు. మళ్లీ వెనక్కి వెళ్లారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావొచ్చు. సాగర హారాలు కావొచ్చు. వంటావార్పులు కావొచ్చు.. అనేక రూపాల్లో విజృంభించి భీకరమైన పోరాటం చేశాం. మూడేళ్ల తర్వాత రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు మళ్లీ తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. వారికి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించిన సుడి గాడుపులు తట్టుకోలేమని తెలంగాణ ఇచ్చిన్రు..’ అని మాజీ సీఎం గుర్తు చేశారు.

పాక్ వెళ్లేందుకు ముగిసిన గడువు
చండీగఢ్/న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశం వీడేందుకు పాకిస్తానీలకు భారత్ నిర్దేశించిన గడువు ఆదివారంతో ముగిసింది. వారికి అన్ని రకాల వీసాలనూ రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. దాంతో గత నాలుగు రోజుల్లో అటారీ–వాఘా సరిహద్దు గుండా తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 537 మంది పాకిస్తానీలు తిరుగుముఖం పట్టినట్టు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో 14 మంది భారత దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారత్‌కు తిరిగి వచ్చినట్టు పేర్కొన్నారు. కొందరు పాకిస్తానీలు తిరిగి వెళ్లేందుకు వాయుమార్గాన్ని ఎంచుకున్నారు. వ్యాపారం, సినిమాలు, జర్నలిజం, రవాణా, సదస్సులు, ట్రెక్కింగ్, విద్య, బృంద పర్యాటకం, పుణ్యక్షేత్రాల సందర్శన ఇలా పాకిస్తానీలకు మంజూరుచేసిన 12 రకాల వీసాల గడువును భారత్ రద్దుచేయడం తెల్సిందే. దాంతో కొద్ది రోజులుగా పాకిస్తానీలు అటారీ–వాఘా బోర్డర్ వద్ద వందలాదిగా బారులు తీరుతున్నారు. ఆ దారంతా వాహనాలు కని్పంచాయి. వారిని సాగనంపేందుకు వచ్చిన భారత బంధువులు ఉద్వేగంతో వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలు కనిపించాయి. మెడికల్ వీసాపై వచ్చిన వారికి మాత్రం భారత్ వీడేందుకు మంగళవారం దాకా గడువుంది. కాగా, గడువు తీరిన నేపథ్యంలో ఇంకా భారత్‌లోనే ఉన్న పాకిస్తానీలను అరెస్టు చేస్తామని కేంద్రం తెలిపింది. వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తారు. ఈ నెల 4న అమల్లోకి వచ్చిన వలసలు, విదేశీయుల చట్టం ప్రకారం చర్యలు తప్పవని కేంద్రం పేర్కొంది. ఢిల్లీలో 5,000 మంది ఢిల్లీలో 5,000 మంది పాకిస్తానీలున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. ఆ జాబితాను పోలీసులకు అందజేసింది. అక్రమంగా ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి సమాచారమివ్వాలని ఢిల్లీ హోం మంత్రి ఆశిష్ సూద్ ప్రజలను కోరారు. వారిని తిప్పి పంపేలా కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. దీర్ఘకాల వీసాలతో వచ్చిన పాకిస్తానీలు మహారాష్ట్రలోనూ 5,050 దాకా ఉంటారని అధికారులు తెలిపారు. తమ రాష్ట్రంలోని పాకిస్తానీలంతా వెళ్లిపోయారని బిహార్ ప్రకటించింది. కేరళలో 104 మంది ఉన్నట్లు గణాంకాల వెల్లడిస్తున్నాయి. తమ రాష్ట్రం నుంచి 228 మంది వెళ్లిపోయారని మధ్యప్రదేశ్ సర్కార్ తెలిపింది.

పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడ?
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్ సయీద్ ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారని స్థానిక మీడియాలో ఆదివారం వార్తలొచ్చాయి. ‘‘తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించారు. తర్వాత తానూ పాక్ వీడారు’’ అన్నది వాటి సారాంశం. కొద్ది రోజులుగా, ఆ మాటకొస్తే పహల్గాం దాడి జరిగినప్పటి నుంచీ మునీర్ బయట ఎక్కడా కని్పంచడం లేదని ఆ కథనాలు చెబుతున్నాయి. మునీర్‌కు తీవ్ర భారత విద్వేషిగా పేరుంది. కొద్ది రోజులుగా భారత వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. పాక్‌కు కశ్మీర్ జీవనాడి అని, దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని, హిందువులు, ముస్లింలు భిన్న జాతులని ఇటీవలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తర్వాత రెండు రోజులకే పహల్గాం ఉగ్ర దాడి జరిగింది. ‘‘దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్ తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యుడిని అవుతానని మునీర్ భయపడ్డారు. అందుకే దేశం నుంచి జారుకున్నట్టు కనిపిస్తోంది’’ అని కథనాలు పేర్కొంటున్నాయి. మునీర్ పాక్‌లోనే ఉన్నారని, రావలి్పండి బంకర్లో తలదాచుకున్నారని మరికొందరు చెబుతున్నారు. ఈ పుకార్లలో సైన్యం మనోబలం దెబ్బ తింటుందని గ్రహించిన పాక్ ప్రభుత్వం నష్ట నివారణకు దిగింది. ప్రధాని షహబాజ్ షరీఫ్, ఉన్నత సైనికాధికారులతో శనివారం మునీర్ దిగిన గ్రూప్ ఫొటో అంటూ పాక్ పీఎంఓ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దాన్ని నమ్మలేమని, శనివారం సైనిక కాలేజీ ఉత్సవాల్లో ప్రధానితో పాటు మునీర్ పాల్గొన్నట్టుగా వచి్చన వార్తలూ నమ్మశక్యంగా లేవని మీడియా అభిప్రాయపడింది. మరోవైపు పాక్ సైన్యంలోని జనరల్స్, ఉన్నతాధికారులు తమ కుటుంబాలను ఉన్నపళంగా దేశం దాటిస్తున్నట్టు చెబుతున్నారు.

పాక్‌కు ఏది సరిపోయే శిక్ష?
పహల్గామ్లో 26 మంది పౌరులను కాల్చి చంపిన భయంకర ఉగ్రదాడి తర్వాత భారత్ లో పాకిస్తాన్ పై ఆగ్రహం పెరుగుతోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) కటువైన ప్రకటన విడుదల చేసింది. దాడి చేయడంలో ఉగ్రవాదులు ప్రదర్శించిన క్రూరత్వాన్ని చూస్తే ఆ ఆగ్రహం ఆశ్చర్యం కలిగించదు. పాక్ మీడియా వ్యాఖ్యాతలు ఇస్లామాబాద్‌ను ఇరికించడానికి భారతదేశమే ఈ దాడిని నిర్వహించిందని దారుణమైన ఆరోపణ చేస్తున్నారు. స్పష్టంగా, వారు ఘోరమైన పరిణామాన్ని ఆశిస్తున్నారు.భద్రతా కేబినెట్ కమిటీ ప్రకటన కావలసిన అన్ని అంచనాలను తీర్చింది. న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ లోని ఛార్జ్ డి’అఫైర్ సహా 14 మంది సిబ్బంది ఇంకా మిగిలి ఉన్నప్పటికీ, పాక్ సైనిక సలహాదారులు, ఇతర సహాయక సిబ్బందిని భారత్ విడిచి వెళ్ళమని ఆదేశించారు. ఇది పాక్ సైనిక సంస్థపై పూర్తిగా నిందను మోపుతుంది. అటారీ చెక్‌పోస్ట్ మూసివేయడం, మిగిలిన వీసా ప్రోటోకాల్స్‌ని నిలిపివేయడం కూడా ఊహించినదే. పాక్‌పై తీవ్రమైన ప్రభావం కలిగించడానికి భారత్ కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యం కలిగించలేదు. గత సంవత్సరం చివర్లో, సింధునదీ జలాల ఒప్పందంపై తిరిగి చర్చలు జరిగే వరకు సింధునదీ జలాల కమిషన్ సమావేశాలను నిర్వహించడానికి కూడా భారత్ నిరాకరించింది.కేవలం నిలిపేసింది!భారత్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆలస్యం చేయడానికి పాకిస్తాన్ అతి స్వల్ప కారణాలను చూపుతూ సింధు జలాల ఒప్పందాన్ని ఉపయోగించుకుంటోంది. ఒప్పందంలో ఇరు దేశాల కమిషనర్లు సహా మూడు అంచెల వివాద యంత్రాంగం ఉంది. అది విఫలమైనప్పుడు, 1960లో ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ప్రపంచ బ్యాంకు ఒక తటస్థ నిపుణుడిని నియమిస్తుంది. అది కూడా పని చేయకపోతే, మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయవచ్చు. 1970లలో, భారతదేశం సలాల్ (జమ్ము–కశ్మీర్) ఆనకట్ట ఎత్తును తగ్గించి, దాని అవుట్లెట్లను తెరిచి వేయవలసి వచ్చింది. దీనివలన ఆనకట్ట ఉపయోగం తగ్గి భారీగా బురద చేరి, కోతకు గురైంది. మరొక సందర్భంలో, బాగ్లిహార్ ఆనకట్ట (జమ్ము–కశ్మీర్) 14 ఏళ్ల ఆలస్యాన్ని ఎదుర్కొంది. కిషన్‌గంగా ప్రాజెక్టు మరింత ఇబ్బందులకు గురైంది. ప్రపంచ బ్యాంక్ నియమించిన తటస్థ నిపుణుడు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడే పాక్ మధ్యవర్తిత్వ స్థాయికి వెళ్లింది. ప్రపంచంలోనే అత్యంత నీటి కొరత ఉన్న దేశాలలో పాకిస్తాన్ 15వది. భారతదేశం ప్రస్తుతం జలాల ఒప్పందాన్ని కేవలం ‘నిలిపివేసింది’. సరిహద్దుకు అవతలి వైపు ఉన్న బాధ్యతాయుతమైన మనుషులు ఈ స్వల్పభేదాన్ని అర్థం చేసుకోవాలి.అయితే, ఇవేవీ భారతదేశ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చలేవు. భద్రతా కేబినెట్ కమిటీ ప్రకటన ‘ఇటీవల తహవ్వుర్ రానాను వెనక్కి రప్పించినట్లే, ఉగ్రవాద చర్యలకు పాల్పడిన లేదా వాటిని సాధ్యం చేయడానికి కుట్ర పన్నిన వారిని వెంబడించడంలో భారతదేశం అవిశ్రాంతంగా ఉంటుంది’ అని పేర్కొంది. ఉగ్రదాడి తర్వాత ప్రధాని బిహార్‌లో ఉద్దేశపూర్వకంగానే ఇంగ్లీషులో మాట్లాడుతూ, ‘భారతదేశం ప్రతి ఉగ్రవాదినీ, వారికి మద్దతు ఇచ్చేవారినీ గుర్తించి, వెంబడించి, శిక్షిస్తుంది. మేము వారిని భూమ్మీద ఎక్కడున్నా దొరికించుకుంటాం’ అన్నారు. ఉగ్రవాదాన్ని శిక్షించే చర్యలు దీర్ఘకాలంపాటు కొనసాగుతాయని ఈ ప్రకటన సూచిస్తుంది.ఎలా దాడి చేయొచ్చు?కాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఏమి సాధ్యమవుతుంది అంటే కచ్చితంగానే బాలకోట్ తరహా దాడి సాధ్యం కాదు. ఈసారి, పాక్ సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉంది. స్పష్టమైన ప్రత్యామ్నాయం ఏమిటంటే, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలను గుర్తించే లక్ష్యంతో భారత భూభాగం నుంచే 290 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించడం. అది భారత్ తనదని చెప్పుకొంటున్న ప్రాంతం కాబట్టి ఇది సాంకేతికంగా పాకిస్తాన్‌పై దాడి కాదు. మరింత కావాల్సిన లక్ష్యం లష్కర్–ఎ–తొయిబా కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న మురిద్కే. ఇది లాహోర్‌కు దగ్గరగా, భారత సరిహద్దు నుండి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉంది. సాయుధ డ్రోన్ లను ఉపయోగించి కూడా దీనిపై దాడి చేయవచ్చు. దీని వలన కచ్చితత్వంతోపాటు ఎటువంటి ఆనుషంగిక నష్టం ఉండదు.కానీ ఏదైనా సరే, ఎంత సమర్థనీయమైనా సరే, అది యుద్ధ చర్యే. పాకిస్తాన్ సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. బాలకోట్ తరువాత, అది జాగ్రత్తగా దాడి చేసింది. పెద్దగా నష్టం కలిగించకుండా ప్రతిస్పందనను నమోదు చేసింది. దానికి ప్రధానంగా అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ బాజ్వా కారణం. ఆయన దేశ సొంత ప్రయోజనం కోసం పాక్ అంతటా భారతదేశానికి వాణిజ్యాన్ని ప్రతిపాదించిన వాస్తవికవాది. కానీ, యుద్ధం, దాని అన్ని తీవ్రతరమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకుంటే ప్రస్తుత చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ వివేకవంతమైన వ్యూహకర్త కాదు. భారతదేశం ఈ యుద్ధాన్ని భరించగలదు. అయినప్పటికీ ముఖ్యంగా ఆయుధాల కోసం దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పుడు ఇది అత్యంత వ్యర్థమైన ఖర్చు.ముక్కలుగా కత్తిరిస్తే!భారత్ యుద్ధాన్ని కాకుండా, ఆర్థిక వృద్ధిని కోరుకుంటోంది. పాక్ నిజంగా యుద్ధాన్ని భరించలేదు. పైగా అంతర్జాతీయ ద్రవ్య నిధి అటువంటి ఖర్చులను దయతో చూస్తుందా లేదా అనేది విషయం కాదు... వాస్తవం ఏమిటంటే, ఆ దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు సంక్షోభంలో ఉన్నాయి. ఇది జెట్ ఇంధనం విషయంలో తీవ్రమైన కొరతకు దారితీస్తుంది. గత తొమ్మిది నెలల్లో ఆరు ప్రధాన శుద్ధి కర్మాగారాలలో ఏవీ చమురు పంపిణీ చేయలేదు. కనీస జ్ఞానం ఉన్న ఏ దేశమైనా, కీలకమైన ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో యుద్ధం ప్రారంభించదు. అయినా భారత్‌ను పాక్ యుద్ధంలోకి లాగాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. దానికి పోయేది ఏమీ లేదు. అందుకే తక్కువ ‘ఆడంబర’ ప్రత్యామ్నాయం ఏమిటంటే, ఎల్ఓసి అంతటా ఫిరంగి కాల్పులు జరపడం. కానీ మన వైపు పౌరులకు కూడా నష్టాలు ఉంటాయి. పైగా ఈ మొత్తం విన్యాస ప్రయోజనమే ప్రశ్నార్థకం అవుతుంది. ఏమైనప్పటికీ ఉగ్రవాదులు చొరబడతారు. ఏమైనా పాక్ కోరుకుంటున్న దిశలో ఇండియా కొట్టుకుపోకుండా జాగ్రత్త వహించాలి. బదులుగా, చాలా నైపుణ్యంతో పాక్‌ని శిక్షించడాన్ని ఎంచుకోవాలి.చాలా కాలంగా, పాకిస్తాన్ రెండు వైపులా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని అందరూ గుర్తించారు. పాకిస్తాన్ ను మోకరిల్లేలా చేసేవరకు సంబంధిత దేశాలు ఆంక్షలు విధించాలని డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఆంక్షలనేవి పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోవాలి. ఇకపై పాక్ సైన్యాధికారులు సౌకర్యవంతమైన విదేశాల పర్యటనలు చేయకుండా చూడాలి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి వచ్చే అన్ని బాహ్య నిధులకు అడ్డుకట్ట వేయాలి.అవును, చాలా దేశాలు పాక్‌ను శిక్షించే కార్యక్రమంలో చేరవు. ఉగ్రవాదాన్ని ఎంత ఇష్టపడకపోయినా, పాక్‌ని శిక్షించని దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే పాక్ కోరుకోని విధంగా, దీర్ఘకాలంగా అణచివేతకు గురైన బలూచ్‌లు, పష్తూన్లకు బహిరంగ మద్దతు ప్రకటించే సమయం ఇదే కావచ్చు. ఇది పాక్ రహస్య వ్యూహాల అనుకరణ కాకూడదు. ఇది ప్రపంచాన్ని ముందుకు రావాలని పిలుపునిచ్చే బహిరంగ మద్దతుగా ఉండాలి. ఇక జరిగింది చాలు, పాక్‌కు దాని స్థాయేమిటో తెలియజెప్పాలి.తారా కార్థా వ్యాసకర్త డైరెక్టర్ (పరిశోధన), సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)

‘ఫూలే’ను ఎందుకు ఆపాలని చూశారు?
మొదటిసారి మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే మీద ఒక హిందీ సినిమా వచ్చింది. దాన్ని ప్రఖ్యాత సినిమా డైరెక్టర్ అనంత్ మహాదేవన్ తీశారు. ప్రతీక్ గాంధీ, పత్రలేఖా పాల్ అనే ఇద్దరు యాక్టర్లు ఫూలే, సావిత్రిగా నటించారు. ఆ సినిమా నిజానికి ఫూలే 198వ జయంతి అయిన 2025 ఏప్రిల్11న విడుదల కావలసి ఉంది. కానీ దేశంలోని కొన్ని బ్రాహ్మణ సంఘాలు సినిమా విడుదలను వ్యతిరేకించి ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్’ (సీబీఎఫ్సీ)కి ఎన్నో ఫిర్యాదులు పంపారు. సీబీఎఫ్సీ అతివేగంగా స్పందించి, విడుదల కావాల్సిన సినిమాను ఆపేసి కొన్ని మార్పులు సూచించింది. ఎన్నో ఇబ్బందుల అనంతరం చివరికి ఏప్రిల్ 25న సినిమా విడుదలయ్యింది.‘ఫూలే’ సినిమా ఊహాజనిత కథపై ఆధారపడి తీసింది కాదు. ఫూలే, సావిత్రిపై రాసిన ఇంగ్లిష్, మరాఠీ, హిందీ భాషల్లోని చాలా జీవిత చరిత్రలపై ఆధారపడి తీసింది. కానీ సీబీఎఫ్సీ బలమైన చారిత్రక ఆధారాలతో సినిమాలో పెట్టిన ఘటనలను, కొన్ని పేర్లను తొలగించాలని సూచించింది. ముఖ్యంగా ఫూలే కాలంలో కూడా దళితులు గ్రామ వీధుల్లోకి వస్తే మూతికి ముంత, నడుముకు తాటాకు కట్టుకోవలసి ఉండింది. ఈ ఘోరమైన అంటరానితనాన్ని ఆ ప్రాంతాన్ని పరిపాలించిన బ్రాహ్మణ రాజులైన పీష్వాలు కఠినంగా అమలుచేశారు.ఫూలే స్వయంగా చదువు చెప్పి సావిత్రీబాయిని దేశంలోనే మొదటి మహిళా టీచర్ని చేశాక, పుణె పట్టణ సమీపంలోని దళితవాడలో ఆడపిల్లలకు స్కూలు పెట్టారు. ఏ కులానికి చెందిన అమ్మాయిలైనా వచ్చి చదువుకోవచ్చని ప్రకటించారు. సావిత్రీబాయితోపాటు చదువుకున్న ముస్లిం స్త్రీ ఫాతిమా షేక్ ఆమెకు అండగా ఉండేది. సావిత్రీబాయి ఈ దేశం మొత్తం చరిత్రలో భర్త సహాయంతో చదువుకొని టీచరై, ఆడపిల్లలకు బడి పెట్టిన మొదటి మహిళ. ఫూలే దంపతులు బ్రాహ్మణులతో తగువు పెట్టుకోలేదు. కొట్టినా, తిట్టినా ఈ దేశ రైతాంగ జీవితాన్ని, కూలీల జీవితాన్ని, వృత్తిపనివారి జీవితాన్ని, ముఖ్యంగా స్త్రీ సమాజ జీవితాన్ని మార్చిన ఏకైక ఆదర్శ భార్యాభర్తల జంట అది. ఆ జంట అహింసకు మారుపేరు.ఈ సినిమాలో పీష్వాల కాలం నాటి ఘోర అంటరానితనం, మనుషులను జంతుప్రాయంగా చూసిన పీష్వా రాజ్య న్యాయ వ్యవస్థను ఈనాటి సమాజానికి చెప్పకుండా, సినిమా రూపంలో చూపించకుండా ఎందుకుండాలి? చుట్టూ బ్రిటిష్ పరిపాలన ఉన్నా, పీష్వా రాజులు పుష్యమిత్రశుంగుని క్రూరాతిక్రూరమైన వర్ణధర్మ రాజ్యాన్ని నడిపింది చరిత్ర కదా! మొత్తం రైతాంగాన్ని – అంటే ఇవాళ పై శూద్ర కులంగా ఉన్న మరాఠాలు, కుంబీలు (ఫూలే కులస్థులు) సైతం చదువు నేర్చుకునే హక్కు లేని కట్టుబానిసలు కదా! అందుకే ‘గులాంగిరీ’ పుస్తకంలో ఫూలే వ్యవసాయ ఉత్పత్తిదారులను బానిసత్వం నుండి విముక్తి చెయ్యకుండా దేశం అభివృద్ధి కావడం అసంభవం అని రాశారు.ఆనాటి శూద్ర బానిసలకు తాము బానిసలమనే సోయి కూడా లేదు. ఈ వ్యవస్థ వ్యవసాయ ఉత్పత్తిని పెంచలేదు. ఉన్న పంటలో అదిరించి, బెదిరించి, స్వర్గం–నరకం సిద్ధాంతం చెప్పినవాళ్లు మాత్రమే కాస్త మంచి తిండి తిన్నారు. వీళ్ళకు ఆనాడు జాతీయ భావం లేదు. కుల భావం మాత్రమే ఉంది. జాతీయ భావన సమానత్వంతో ముడిపడి ఉంది.ఈ దేశంలో అన్ని కులాల వారికి జాతీయ భావాన్ని నేర్పిన మొట్టమొదటి దైవసమాన జంట ఫూలే–సావిత్రీబాయి. వారిని మించిన జంట ఈ భూమి మీద ఆనాటికి పుట్టలేదు. ఈనాటికీ వెతికినా దొరికే స్థితి లేదు. పిల్లలు లేని ఈ జంట... విధవలుగా జీవిస్తున్న ఇద్దరు (బ్రాహ్మణ, ఇతర కులాలకు చెందిన) స్త్రీలను... ఇంట్లో పెట్టుకొని, ఒక బ్రాహ్మణ విధవకు పుట్టిన యశ్వంత రావును పెంచుకొని, మొదటి డాక్టరును చేశారు. ఆనాటి వరకు బ్రాహ్మణ పురుషులు కూడా అలోపతి మెడిసిన్ చదవడం లేదు. సముద్రాలు దాటడం లేదు. ఈ దంపతులను ఈనాటి బ్రాహ్మణులైనా, ఏ కులస్థులైనా ఎలా చూడాలి? ఈ భూమి మీద నడిచిన దేవ–దేవతా దంపతులుగా చూడాలి కదా! వారి జీవిత చరిత్ర చిత్రీకరణను వ్యతిరేకించడమేమిటి?సావిత్రీబాయి ఈ దేశ మొదటి మహిళా టీచరయ్యారు నిజమే. ఆమెపై ఆనాటి సంప్రదాయ యువకులు పేడ కొట్టింది నిజమే. కొంతమంది బ్రాహ్మణులు ఆ దంపతులకు మద్దతిచ్చిందీ నిజమే. సీబీఎఫ్సీ పేడకొట్టే సీను సినిమాలో తీసెయ్యాలని ఎలా అన్నది? ఈ సీబీఎఫ్సీలో ఒక్క శూద్ర వ్యక్తిగానీ, దళిత వ్యక్తిగానీ లేకుండా ఎలా చేశారు బీసీ ప్రధానమంత్రి? ఈ సీబీఎఫ్సీ కశ్మీర్ మీద, గుజరాత్ మీద, కేరళ మీద ముస్లింలపై సినిమా తీసినప్పుడు వాళ్ళు ట్రైలర్లు చూసి ఎన్ని అభ్యంతరాలు పెట్టినా ఒక్క సీన్‌గానీ, ఒక్క పదంగానీ కట్ చెయ్యలేదు. ఇప్పుడు సీబీఎఫ్సీ అధ్యక్షుడు ప్రసూన్ జోషీ ఈ దేశ జాతీయతను ఏం చెయ్యదలచుకున్నారు?ఆ సినిమాలు ప్రధానమంత్రి చూశారు. పొగిడారు. మరి ‘ఫూలే’ సినిమాను ప్రధానమంత్రి చూస్తారా? ఒక బీసీగా ప్రధానమంత్రి అయి, ముఖ్యంగా శూద్ర బీసీల ఓట్లతో గెలిచి ఫూలే వ్యతిరేకులను సమర్థిస్తారా అనేది చాలా ముఖ్యమైన అంశం.ఈ సినిమా భారతదేశపు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త మలుపు. మన సంఘ సంస్కర్తల జీవిత చరిత్రలు పుస్త కాలుగా వచ్చాయి. కానీ వారిపై పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సినిమాలు తీసే ప్రయత్నం చెయ్యలేదు. అందులో ముఖ్యంగా ప్రపంచ ఆధునిక చరిత్రలో ఎక్కడా లేని ఒక ఫూలే జంట లాంటి జంట మీద సినిమా తీయడం, వారి జీవితాలను ఇంటింటికీ ఆదర్శవంతం చేయడం నిజానికి జాతీయ లక్షణాలు కలిగిన సినిమా ఇండస్ట్రీకి ఉండాలి. కానీ అదెక్కడా కనిపించలేదు. ఈ సినిమాతో అది మొదలయింది.ఒక సినిమా మంచిదా, కాదా అనేది అది ఎన్ని కోట్లు సంపాదిస్తుంది అనే మార్కెట్ విలువను బట్టి ఈ రోజుల్లో, మార్కెట్లో కూడా ఈ సినిమా విలువను పెంచాల్సి ఉంది. ప్రభుత్వాలు ఈ సినిమాకు పన్ను తగ్గిస్తాయా, మాఫీ చేస్తాయా అనేది అంత ముఖ్యం కాదు. ఎంతమంది ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఈ సినిమాను చూస్తారు అనేది ముఖ్యం. అమెరికాలో రేసిజాన్ని అంతం చేసిన ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ 1865లో ‘అవర్ అమెరికన్ కజిన్’ డ్రామాను థియేటర్లో చూస్తూ హత్యకు గురయ్యారు. మంచిని నేర్చుకోవడానికి ఆయన చూపిన శ్రద్ధ అది. ఈ సమాజం సమానత్వం వైపు పయనిస్తేనే ప్రజాస్వామ్యం బతికి ఉంటుంది. లేకపోతే ఫూలేలు నేర్పిన శ్రమ గౌరవ పాఠాలు ఇసుక దిబ్బల మీద రాసిన రాతలయ్యే ప్రమాదముంది.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెఫర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు

డేట్ ఫిక్స్ చేయండి..అసెంబ్లీకి రండి: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రజతోత్సవ సభ పేరుతో ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీపై ఆక్రోశంతో విషం కక్కారని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అద్భుతాలు జరిగినట్టు, ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ జరగనట్టు ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో..కాంగ్రెస్ టైంలో ఏం జరిగిందో చర్చించేందుకు సిద్ధం కావాలని చాలెంజ్ చేశారు. ‘మీరు డేట్ ఫిక్స్ చేయండి. అసెంబ్లీకి రండి. మీరే సరి్టఫికెట్ ఇచ్చిన మీ బచ్చాగాళ్లతో మాట్లాడేది లేదు. మీరు రండి. మీ పాలనలో అద్భుతాలు, మీరు చేసిన ఘనకార్యాలను ప్రజలకు వివరిద్దాం. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి కూడా మాట్లాడదాం. డేట్ మీరే చెప్పండి. చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సభ ముగిసిన అనంతరం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసం వద్ద మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో కలిసి పొంగులేటి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు తనను గద్దె దింపారనే ఆక్రోశంతో కేసీఆర్ మాట్లాడారని విమర్శించారు. కడుపునిండా కాంగ్రెస్ పార్టీపై విషం పెట్టుకొని మమ్మల్ని విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు విలన్ అయ్యిందో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు విలన్ అయ్యిందా? హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఏర్పాటు చేసినందుకు విలన్ అయ్యిందా అని ప్రశ్నించారు. రజతోత్సవ సభలో తన హయాంలో జరిగిన మంచి పనులను చెప్పుకోవచ్చు.. అదేవిధంగా లోపాలను కూడా మాట్లాడి ఉంటే ఎవరూ అభ్యంతరం చెప్పరన్నారు. రైతుల గుదిబండగా మారిన ధరణి పోర్టల్ గురించి, కుప్పకూలిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆ సభలో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అసలు కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తామేదో బీఆర్ఎస్ సభను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశామని చెబుతుంటే నవ్వు వస్తుందన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండగా, కాంగ్రెస్ సభలకు బస్సులు ఇవ్వలేదని, టూవీలర్లు కూడా రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, కానీ తాము ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించామని, వారు ఎన్ని బస్సులకు డబ్బులు కడితే అన్ని బస్సులు ఇచ్చామని తెలిపారు. నిజంగా కాంగ్రెస్ అడ్డుకొని ఉంటే బీఆర్ఎస్ సభ జరిగేదా అని నిలదీశారు. తామేదో వర్సిటీ భూములు అమ్మినట్టు కేసీఆర్ చెప్పారని, ఏ యూనివర్సిటీ భూముల అమ్మామో ప్రజలకు చెప్పాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును తనకు కావాల్సిన వారికి లీజుకు ఇచ్చుకుంది.. వైన్ షాపుల టెండర్లు ముగియక ముందే డబ్బులు వసూలు చేసుకుంది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. తాము కమీషన్లు తీసుకున్నామని కేసీఆర్ అంటున్నారని, ఎక్కడ తీసుకున్నామో చూపించాలని డిమాండ్ చేశారు. ఏ కమీషన్లు తీసుకోకుండానే దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఎలా ఎదిగిందని, రూ.1,500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చబోమని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని, ఆయన కూలిస్తే కూలిపోవడానికి ప్రభుత్వమేమైనా బొమ్మరిల్లా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన నాయకుడు... ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ లేదన్నారు. తెలంగాణ వచ్చాక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చేయలేదని, ఇప్పుడైనా ఆ పార్టీ శాసనసభ పక్ష పదవిని దళితుడికి ఇస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీకి ఇవ్వగలరా అని వ్యాఖ్యానించారు. వీటన్నింటిపై మాట్లాడేందుకు కేసీఆర్ డేట్‌ఫిక్స్ చేస్తే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించేందుకు సిద్ధం కావాలని మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ నేతలను సవాల్ చేశారు. అధికారం పోయినా గర్వం పోలేదు: మంత్రి జూపల్లి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజలు ఉద్యోగం ఊడగొట్టినా కేసీఆర్‌కు గర్వం పోలేదని.. చింత చచ్చినా పులుపు చావనట్టు ఆయన మాట్లాడుతున్నారన్నారు. ఒక్కో గ్రామానికి రూ. 3 లక్షలు ఖర్చు చేసి ఈ సభ నిర్వహించారని, ఆ డబ్బులు ఎక్కడివని నిలదీశారు. తాము కూడా రాజకీయాల్లోనే ఉన్నామని, తమకు ఏమీ తెలియదని అనుకోవడం పొరపాటని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తానని కేసీఆర్ పగటి కలలు కంటున్నాడని, అసలు ఆయన ఉద్యోగం ఎందుకు ఊడిందో..ప్రజలు ఎందుకు ఓడించారో ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకోవాలని హితవు పలికారు. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: మంత్రి పొన్నం కాంగ్రెస్ పార్టీని విలన్ అంటూ కేసీఆర్ మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీనే లేకుంటే కేసీఆర్ మూడు చెరువుల నీళ్లు తాగినా, వంద మంది కేసీఆర్‌లు వచ్చినా తెలంగాణ వచ్చేది కాదని చెప్పారు. ఎల్కతుర్తి సభకు జనం రాకపోతే అదేదో తాము అడ్డుకున్నట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అగ్గిపెట్టి రాజకీయానికి బలైన ఉద్యమకారులు, అమరవీరులకు ఆ సభలో ఎందుకు నివాళులరి్పంచలేదని మంత్రి పొన్నం ప్రశ్నించారు. నియంత మాట్లాడినట్టుంది: మంత్రి సీతక్క మంత్రి సీతక్క మాట్లాడుతూ ఒక నియంత అధికారాన్ని కోల్పోయిన తర్వాత మాట్లాడినట్టు కేసీఆర్ ప్రసంగం ఉందని చెప్పారు. అధికారం పోయాక కుటుంబం, ఆస్తులు చీలికలు,పీలికలు అయ్యాయన్న ఆవేదనతో ఆయన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బిడ్డ మంచి కార్లలో తిరగొచ్చు గానీ.. పేద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో తిరగవద్దా అని ప్రశ్నించారు. కేసీఆర్ అంత దరిద్రంగా పోలీసులను ఎవరూ ఉపయోగించుకోలేదని చెప్పారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చౌక్ తీసేశారని, ఇప్పుడు మళ్లీ తాము ధర్నాచౌక్ తెరిస్తే సిగ్గు లేకుండా అక్కడకు వచ్చి ధర్నాలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో సొల్లు కబుర్లు మాట్లాడుతున్నారని చట్టసభను అవమానించిన కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే అర్హత ఉందా అని ప్రశ్నించారు.

నాని నా అంచనాలను మించిపోయాడు: దర్శకుడు రాజమౌళి
‘‘నాని ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతుంటుంది. కానీ తన దగ్గర్నుంచి ఇంకా కావాలని ఓ ఫంక్షన్లో అన్నాను. అయితే నా అంచనాలను మించి నాని చాలా ముందుకెళ్లిపోయాడు. కానీ నానీ... మేం ఇంకా కోరుకుంటూనే ఉంటాం. నువ్వు ఇంకా ముందుకు వెళ్లు’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. నాని హీరోగా నటించిన చిత్రం ‘హిట్ 3: థర్డ్ కేస్’. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్ . శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు రాజమౌళి, అతిథులుగా ‘హిట్ 1’లో హీరోగా నటించిన అడివి శేష్, ‘హిట్ 2’లో హీరోగా నటించిన విశ్వక్ సేన్ హాజరయ్యారు. ఈ వేదికపై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ – ‘‘అ!, హిట్ 1, హిట్ 2, కోర్ట్’... ఆల్ సక్సెస్. వంద శాతం సక్సెస్ అయిన నిర్మాత ప్రశాంతి. ఇండస్ట్రీలో హిట్ మిషన్ అని పిలుచుకుంటుంటాం. ఇప్పుడు ‘హిట్ 3’ సక్సెస్ అవుతుందని నా గట్టి నమ్మకం. ఓ ఫ్రాంచైజీని స్టార్ట్ చేసినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. కానీ ‘హిట్ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్... చాలా కేస్లు ఉండొచ్చు. శైలేష్ ఏడు సినిమాలే అనుకుని ఉండొచ్చు. కానీ ఈ ఫ్రాంచైజీ ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నాను. ‘హిట్ 3’ ప్రమోషనల్ కంటెంట్ చూశాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అనే వైబ్‌ని క్రియేట్ చేసింది. మే1 థియేటర్స్‌లో... అబ్ కీ బార్ అర్జున్ సర్కార్. హిట్ ది థర్డ్ కేస్’’ అని రాజమౌళి అన్నారు.కాగా.. ఈ వేదికపై ‘‘మీరు తీయబోతున్నటు వంటి ‘మహాభారతం’ సినిమాలో నానీగారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాం... నిజమేనా’’ అని యాంకర్ సుమ అడిగితే ‘‘నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్’’ అని రాజమౌళి చెప్పారు. నాని మాట్లాడుతూ– ‘‘నా ప్రతి కొత్త సినిమాకు మార్నింగ్ షోకి ప్రసాద్ ఐమ్యాక్స్‌కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారా? అని చెక్ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్ అడిగేవాడిని. ప్రేమగా హగ్ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. ‘చాలా బాగుంది. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాం’ అంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్‌కి వెళ్లకపోవడంతో కాస్త బ్రేక్ వచ్చింది.ఈసారి ‘హిట్ 3’ సినిమా చూసి, ఆయన (రాజమౌళి) నాకు ఆ మార్నింగ్ షో ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాజమౌళిగారు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఒక థ్రిల్లర్, ఒక మాస్ కమర్షియల్ ఫిల్మ్ కలిస్తే అది ‘హిట్ 3’. మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను నానిప్రామిస్ చేస్తున్నాడు’’ అన్నారు. ‘హిట్ 3’ సక్సెస్ అవ్వాలనే ఆకాంక్షను అడివి శేష్, విశ్వక్ సేన్ వ్యక్తం చేశారు. శైలేష్ కొలను, శ్రీనిధీ శెట్టి, కోమలీ ప్రసాద్ తదితరులు మాట్లాడారు.

ప్రాధాన్యాలకు కొత్త జట్టు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పాలనా యంత్రాంగంలో భారీగా బదిలీలు జరిగాయి. ఆదివారం తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావును నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ వెంటనే పలు కీలక శాఖలు, విభాగాలకు కొత్త బాస్‌లను నియమించింది. పెట్టుబడుల ఆవిష్కరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, హైదరాబాద్ నగరాభివృద్ధి, పట్టణాభివృద్ధి వంటి ప్రభుత్వ ప్రాధాన్యాంశాలకు అనుగుణంగా కొత్త జట్టును సిద్ధం చేసింది. ఈ మేరకు 18 మంది ఐఏఎస్‌లు, ఇద్దరు నాన్ కేడర్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కీలకమైన ఐటీ, పరిశ్రమలు, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేశ్ రంజన్‌ను సీఎంఓలోని ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్, స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫీషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/సీఈఓగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో పరిశ్రమలు, ఐటీ, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, కర్మాగారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ స్థానచలనం పొందారు. ఇక గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేవిధంగా ‘ఎక్స్’లో పోస్టులను షేర్ చేసిన యువజన అభ్యుదయ, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి, పురావస్తు శాఖ డైరెక్టర్ స్మితా సబర్వాల్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆమెను రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యకార్యదర్శిగా మళ్లీ ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసింది. ఆమె స్థానంలో యువజన అభ్యుదయ, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి, పురావస్తు శాఖ డైరెక్టర్‌గా జయేశ్ రంజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆ శాఖ ఆధ్వర్యంలోనే హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగా, శాఖాధిపతిని మార్చడం గమనార్హం. సీనియారిటీ ప్రకారం సీఎస్ రేసులో ముందంజలో ఉన్న శశాంక్ గోయల్‌ను ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ పోస్టు నుంచి మరో ప్రాధాన్యత లేని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ పోస్టుకు ప్రభుత్వం బదిలీ చేసింది. రెండుగా పురపాలక శాఖ విభజన పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌ను ప్రభుత్వం కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, కర్మాగారాల శాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ శాఖను రెండుగా విడగొట్టి ఇద్దరు కార్యదర్శులను నియమించింది. పురపాలక శాఖ డైరెక్టర్, కమిషనర్ టీకే శ్రీదేవిని పురపాలక శాఖ (హెచ్ఎండీ వెలుపలి ప్రాంతం) కార్యదర్శిగా బదిలీ చేసింది. హెచ్ఎండీఏ వెలుపలి ప్రాంతాల్లోని పురపాలికలు మాత్రమే ఈ పోస్టు పరిధిలోకి రానున్నాయి. మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్మెంట్ శాఖ (హెచ్ఎండీఏ పరిధి) పేరుతో కొత్త శాఖను సృష్టించి దాని కార్యదర్శిగా జీహెచ్ఎంసీ కమిషనర్ కె.ఇలంబర్తిని బదిలీ చేసింది. ఇక ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఒకటైన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఆథారిటీ(ఎఫ్‌సీడీఏ) కమిషనర్‌గా కె.శశాంకను నియమించింది. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) సీఎండీగా అదనపు బాధ్యతల నుంచి సందీప్‌కుమార్ సుల్తానియాను తప్పించింది. జెన్కో సీఎండీగా సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఎక్స్అఫిషియో స్పెషల్ సెక్రటరీ ఎస్.హరీశ్‌ను నియమించింది. సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఎక్స్అఫిషియో స్పెషల్ సెక్రటరీగా, రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శిగా హరీశ్ అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు.

బెంగళూరు ప్రతీకారం
దాదాపు రెండు వారాల క్రితం బెంగళూరు వేదికగా ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్... 163 పరుగులు చేసిన ఆర్సీబీ ఓటమి పాలైంది. అద్భుత ప్రదర్శనతో గెలిపించిన ‘లోకల్ ప్లేయర్’ కేఎల్ రాహుల్ మ్యాచ్ ముగిశాక ‘ఇది నా అడ్డా’ అన్నట్లుగా కాంతారా స్టయిల్లో సంబరం చేసుకున్నాడు. ఇప్పుడు అవే రెండు జట్ల మధ్య వేదిక ఢిల్లీకి మారింది. మ్యాచ్‌పై చర్చ కూడా కోహ్లి వర్సెస్ రాహుల్‌గానే సాగింది. ఈసారి ఆర్సీబీ విజయలక్ష్యం అదే 163 పరుగులు... 26/3తో బెంగళూరు కష్టాల్లో పడినట్లు కనిపించినా... కోహ్లి, కృనాల్ పాండ్యా శతక భాగస్వామ్యంతో ఆర్సీబీ ఘన విజయాన్ని అందుకొని బదులు తీర్చుకుంది. ఈసారి బ్యాటింగ్‌లో పరుగులు చేసేందుకు రాహుల్ తీవ్రంగా ఇబ్బంది పడగా... ‘దిల్లీవాలా’ కోహ్లి చక్కటి ఆటతో బెంగళూరు విజయానికి బాటలు వేశాడు. మ్యాచ్ ముగిశాక ప్రతీకార శైలిలో కోహ్లి విజయనాదం చేశాడు. న్యూఢిల్లీ: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య సమరం 1–1తో సమంగా ముగిసింది. సొంతగడ్డపై గత మ్యాచ్‌లో ఓడిన బెంగళూరు ఈసారి ప్రత్యర్థి మైదానంలో విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 41; 3 ఫోర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే ఫర్వాలేదనిపించగా, భువనేశ్వర్ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అనంతరం బెంగళూరు 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (47 బంతుల్లో 51; 4 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 84 బంతుల్లో 119 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బ్యాటింగ్ తడబాటు... అభిషేక్ పొరేల్ (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్ కలిసి 29 బంతుల్లో 62 పరుగులు చేయగా... మిగతా బ్యాటర్లంతా కలిసి 92 బంతుల్లో 96 పరుగులు మాత్రమే సాధించడం ఢిల్లీ బ్యాటింగ్ పరిస్థితిని చూపిస్తోంది. భువనేశ్వర్ ఓవర్లో 2 సిక్స్‌లతో ధాటిని ప్రదర్శించిన పొరేల్ ఎక్కువ సేపు నిలవలేకపోగా, కరుణ్ నాయర్ (4) విఫలమయ్యాడు. పవర్‌ప్లేలో జట్టు 52 పరుగులు చేసింది. అయితే ఆపై ఆర్సీబీ స్పిన్నర్లు సుయాశ్, కృనాల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల రాక కష్టంగా మారిపోయింది. ఈ ఇద్దరు బౌలర్లు కలిసి 8 ఓవర్లలో 2 ఫోర్లు, 1 సిక్స్ సహా 50 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఒత్తిడిలో డుప్లెసిస్ (22), అక్షర్ పటేల్ (15) వెనుదిరగ్గా... రాహుల్ కూడా షాట్లు ఆడేందుకు బాగా ఇబ్బంది పడ్డాడు. భువీ ఒకే ఓవర్లో రాహుల్, అశుతోష్ (2)లను అవుట్ చేయడంతో ఢిల్లీ 17 ఓవర్లలో 120/6 వద్ద నిలిచింది. అయితే స్టబ్స్ దూకుడుగా ఆడటంతో తర్వాతి రెండు ఓవర్లలో 36 పరుగులు వచ్చి స్కోరు 150 దాటింది. కీలక భాగస్వామ్యం... ఛేదనలో బెంగళూరుకు సరైన ఆరంభం లభించలేదు. ఆరు పరుగుల వ్యవధిలో బెథెల్ (12), పడిక్కల్ (0), పాటీదార్ (6) వెనుదిరగడంతో స్కోరు 26/3 వద్ద నిలిచింది. ఈ దశలో కోహ్లి, కృనాల్ కలిసి చక్కటి సమన్వయంతో జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా... నిలదొక్కుకున్న తర్వాత కృనాల్ ధాటిని పెంచాడు. 8 ఓవర్లలో 85 పరుగులు చేయాల్సిన సమయంలో తర్వాతి 3 ఓవర్లలో బెంగళూరు 36 పరుగులు రాబట్టడంతో పని సులువైంది. ఈ క్రమంలో సిక్సర్లతో చెలరేగిన కృనాల్ 38 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. 2016 సీజన్లో తన ఏకైక హాఫ్ సెంచరీని సాధించిన కృనాల్ ఇన్నేళ్లకు మళ్లీ ఆ మార్క్‌ను దాటడం విశేషం. ఆ తర్వాత కోహ్లి కూడా 45 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. విజయానికి 18 పరుగుల దూరంలో కోహ్లి అవుటైనా... కృనాల్, టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి 9 బంతుల ముందే మ్యాచ్‌ను ముగించారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పొరేల్ (సి) జితేశ్ శర్మ (బి) హాజల్‌వుడ్ 28; డుప్లెసిస్ (సి) కోహ్లి (బి) కృనాల్ 22; కరుణ్ నాయర్ (సి) భువనేశ్వర్ (బి) దయాళ్ 4; రాహుల్ (సి) బెథెల్ (బి) భువనేశ్వర్ 41; అక్షర్ (బి) హాజల్‌వుడ్ 15; స్టబ్స్ (సి) హాజల్‌వుడ్ (బి) భువనేశ్వర్ 34; అశుతోష్ (బి) భువనేశ్వర్ 2; విప్రాజ్ (రనౌట్) 12; స్టార్క్ (నాటౌట్) 0; చమీరా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–33, 2–44, 3–72, 4–102, 5–118, 6–120, 7–158, 8–162. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–3, యశ్ దయాళ్ 4–0–42–1, హాజల్‌వుడ్ 4–0–36–2, సుయాశ్ శర్మ 4–0–22–0, కృనాల్ పాండ్యా 4–0–28–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: బెథెల్ (సి) నాయర్ (బి) అక్షర్ 12; కోహ్లి (సి) స్టార్క్ (బి) చమీరా 51; పడిక్కల్ (బి) అక్షర్ 0; పాటీదార్ (రనౌట్) 6; కృనాల్ (నాటౌట్) 73; డేవిడ్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–26, 4–145. బౌలింగ్: అక్షర్ పటేల్ 4–0–19–2, స్టార్క్ 3–0–31–0, ముకేశ్ కుమార్ 3.3–0–51–0, విప్రాజ్ 1–0–12–0, కుల్దీప్ 4–0–28–0, చమీరా 3–0–24–1. ఐపీఎల్లో నేడురాజస్తాన్ X గుజరాత్ వేదిక: జైపూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఓరుగల్లు.. గులాబీ జల్లు
అనుభవాలే పాఠాలుగా...
మరో విజయంపై గురి
అసీఫా ప్రపంచ రికార్డు
మనుశ్–దియా జోడీ సంచలనం
14 స్వర్ణాల వేటలో...
వివాదం ఇంకా ఉంది!
భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో పరాజయం
పరాజయంతో ప్రారంభం
బెంగళూరు ప్రతీకారం
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
జైలు శిక్ష విధిస్తావా..చంపేస్తాం
వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి.. నాకు బాధేస్తోంది: కోటి
బంగారం భారీగా పడిపోతుంది!
'ఇక్కడి వారికి హృదయం ఉంది'.. అందుకే..! పాక్ తండ్రి కంటతడి
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ప్లేయర్‌గా
పహల్గాం దాడి.. చెట్టుపై కూర్చుని కెమెరాలో బంధించి..
వాళ్ల మధ్య వేలెందుకు పెట్టార్సార్!
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
పాక్‌కు ఏది సరిపోయే శిక్ష?
మార్చి రిపోర్ట్: నిండా మునిగిన నిర్మాతలు.. 15 సినిమాల్లో ఒక్కటే హిట్టు!
'డ్రాగన్'తో హిట్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కాయదు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఇల్లు తుడిచిన హీరో.. ఎవరో తెలుసా?
సీఎం సార్.. మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
నాని నా అంచనాలను మించిపోయాడు: దర్శకుడు రాజమౌళి
రక్తం పారిస్తావా.. సింధు జలాల్లో ఒక్కసారి దూకి చూడు!
ముంబై ఓపెనర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్‌లో అఘోరీ అరుపులు, కేకలు!
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
‘హిట్’ డైరెక్టర్‌తో నాగార్జున కొత్త సినిమా
పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్ నిర్వాహకుడి అరెస్ట్
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు!
హైదరాబాద్‌లో హై అలర్ట్
మళ్లీ ఉగ్ర కాండ!
‘ఫూలే’ను ఎందుకు ఆపాలని చూశారు?
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
కాంగ్రెస్ సర్కార్‌కు కేసీఆర్ వార్నింగ్
ఇంట్లో పాముల కలకలం
భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
భారత్ దెబ్బ అదుర్స్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎమర్జెన్సీ!
ప్రపంచంలోని 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు: లేటెస్ట్ రిపోర్ట్
కృనాల్ ఆల్‌రౌండ్ షో.. ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మెలిక
ప్రభుత్వ సంస్థగా ‘వొడా’?.. కేంద్రమంత్రి స్పష్టత
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
టైటానిక్ మృత్యుంజయుడు రాసిన లేఖ.. రూ.3 కోట్లు పలికింది
బాధాతప్త హృదయాలతో వీడ్కోలు.. పాక్ సరిహద్దులో భావోద్వేగ దృశ్యాలు
డేట్ ఫిక్స్ చేయండి..అసెంబ్లీకి రండి: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
‘మీ భార్య పాకిస్తాన్ జీతం తీసుకోవట్లేదా?’
ఏఐ జాబ్ మార్కెట్ బూమ్.. టాప్ 10 స్కిల్స్ ఇవే..
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
వివాహేతర సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని..
మామకు తగ్గ కోడళ్లు.. బిజినెస్‌లో చక్రం తిప్పుతున్నారు
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు
ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
'జాను లిరి ఎవరో కూడా నాకు తెలియదు'.. అది తలచుకుంటే బాధేసింది!
IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
ఇది ఫేక్ న్యూస్ కాదయ్యా! రియల్ న్యూస్!!
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
యంగ్ హీరోయిన్ కి అనుకోని సమస్య.. పోస్ట్ వైరల్
తాగుడు అలవాటు.. ఎంత చెప్పినా మానలేదు.. అందుకే విడాకులు: నటి
తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు
వామ్మో... ఆపిల్ స్టోరా...
అయ్యో దేవుడా..ఏమిటీ ఘోరం
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
'యానిమల్'తో పెద్ద స్టార్ అయిపోయాననుకున్నా.. కానీ ఆ రోజు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
భారీ సెంచరీతో కదంతొక్కిన స్టార్ క్రికెటర్ కొడుకు
తీరంలో తూటా.. సీటీలో బాంబు
ఊరంతా తెలిసిన సీక్రెట్...
భారత్‌పై దాడి కోసం 130 అణు బాంబులు.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
IPL 2025 MI Vs LSG: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న రోహిత్ శర్మ
సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్
INDw Vs SLw: శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా..
జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా
ఆ నలుగురిని వదిలేస్తేనే సీఎస్కే బాగుపడుతుంది: సెహ్వాగ్
ట్రైలర్: సీరియల్స్ చూస్తున్నంతసేపు దెయ్యంగా.. కాపాడనున్న సమంత!
పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు
పెరిగిన అద్దెలు.. హైదరాబాద్‌లో అక్కడే ఫుల్ డిమాండ్!
ఇంట్లోని రూ.3.20 కోట్ల నగదు, బంగారం తీసుకెళ్లిన భార్య
విశాఖలో దంపతుల దారుణహత్య
త్రీడీలో జగదేక వీరుడు అతిలోక సుందరి
IPL 2025: విరాట్ 30కి పైగా స్కోర్ చేశాడా, ఆర్సీబీ గెలిచినట్లే..!
Visakha: జంట హత్యల కేసులో ఏం జరిగింది..?
IPL 2025: ఇదేమి ఆట బ్రో.. పంత్ నీవు ఇక మారవా? ఫ్యాన్స్ ఫైర్
ఆపరేషన్ అనంతరం వెకేషన్లో యాంకర్ రష్మీ.. దేవుడిలాగే చేస్తాడేమో!
ఐటీఆర్ ఫైలింగ్‌కు వేళాయే..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
మే 9.. మెగా ఫ్యాన్స్ కి రెండు ట్రీట్స్
భారత్ భద్రతకు ‘ఇస్రో’ భరోసా..!
టెన్షన్ వద్దు పెన్షన్ కావాలి
కూటమి ఎమ్మెల్యేకు షాక్.. అందరిలో నిలదీసిన మహిళ
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
Festival: జనాల్లోకి దూసుకొచ్చిన కారు.. 9 మంది దుర్మరణం
పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. పది మంది సైనికులు మృతి
తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే: కేసీఆర్
'నా హైట్‌తో సమస్య.. నాతో ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు'.. మీనాక్షి చౌదరి
నువ్వాదరిని... నేనీదరిని... ఉగ్రవాది విడగొట్టె ఇద్దరినీ..!
2025 హంటర్ 350 బైక్ ఇదే: ధర ఎంతంటే?
బెంగళూరు ప్రతీకారం
ఓరుగల్లు.. గులాబీ జల్లు
అనుభవాలే పాఠాలుగా...
మరో విజయంపై గురి
అసీఫా ప్రపంచ రికార్డు
మనుశ్–దియా జోడీ సంచలనం
14 స్వర్ణాల వేటలో...
వివాదం ఇంకా ఉంది!
భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో పరాజయం
పరాజయంతో ప్రారంభం
బెంగళూరు ప్రతీకారం
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
జైలు శిక్ష విధిస్తావా..చంపేస్తాం
వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి.. నాకు బాధేస్తోంది: కోటి
బంగారం భారీగా పడిపోతుంది!
'ఇక్కడి వారికి హృదయం ఉంది'.. అందుకే..! పాక్ తండ్రి కంటతడి
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ప్లేయర్‌గా
పహల్గాం దాడి.. చెట్టుపై కూర్చుని కెమెరాలో బంధించి..
వాళ్ల మధ్య వేలెందుకు పెట్టార్సార్!
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
పాక్‌కు ఏది సరిపోయే శిక్ష?
మార్చి రిపోర్ట్: నిండా మునిగిన నిర్మాతలు.. 15 సినిమాల్లో ఒక్కటే హిట్టు!
'డ్రాగన్'తో హిట్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కాయదు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఇల్లు తుడిచిన హీరో.. ఎవరో తెలుసా?
సీఎం సార్.. మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
నాని నా అంచనాలను మించిపోయాడు: దర్శకుడు రాజమౌళి
రక్తం పారిస్తావా.. సింధు జలాల్లో ఒక్కసారి దూకి చూడు!
ముంబై ఓపెనర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్‌లో అఘోరీ అరుపులు, కేకలు!
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
‘హిట్’ డైరెక్టర్‌తో నాగార్జున కొత్త సినిమా
పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్ నిర్వాహకుడి అరెస్ట్
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు!
హైదరాబాద్‌లో హై అలర్ట్
మళ్లీ ఉగ్ర కాండ!
‘ఫూలే’ను ఎందుకు ఆపాలని చూశారు?
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
కాంగ్రెస్ సర్కార్‌కు కేసీఆర్ వార్నింగ్
ఇంట్లో పాముల కలకలం
భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
భారత్ దెబ్బ అదుర్స్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎమర్జెన్సీ!
ప్రపంచంలోని 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు: లేటెస్ట్ రిపోర్ట్
కృనాల్ ఆల్‌రౌండ్ షో.. ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మెలిక
ప్రభుత్వ సంస్థగా ‘వొడా’?.. కేంద్రమంత్రి స్పష్టత
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
టైటానిక్ మృత్యుంజయుడు రాసిన లేఖ.. రూ.3 కోట్లు పలికింది
బాధాతప్త హృదయాలతో వీడ్కోలు.. పాక్ సరిహద్దులో భావోద్వేగ దృశ్యాలు
డేట్ ఫిక్స్ చేయండి..అసెంబ్లీకి రండి: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
‘మీ భార్య పాకిస్తాన్ జీతం తీసుకోవట్లేదా?’
ఏఐ జాబ్ మార్కెట్ బూమ్.. టాప్ 10 స్కిల్స్ ఇవే..
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
వివాహేతర సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని..
మామకు తగ్గ కోడళ్లు.. బిజినెస్‌లో చక్రం తిప్పుతున్నారు
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు
ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
'జాను లిరి ఎవరో కూడా నాకు తెలియదు'.. అది తలచుకుంటే బాధేసింది!
IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
ఇది ఫేక్ న్యూస్ కాదయ్యా! రియల్ న్యూస్!!
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
యంగ్ హీరోయిన్ కి అనుకోని సమస్య.. పోస్ట్ వైరల్
తాగుడు అలవాటు.. ఎంత చెప్పినా మానలేదు.. అందుకే విడాకులు: నటి
తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు
వామ్మో... ఆపిల్ స్టోరా...
అయ్యో దేవుడా..ఏమిటీ ఘోరం
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
'యానిమల్'తో పెద్ద స్టార్ అయిపోయాననుకున్నా.. కానీ ఆ రోజు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
భారీ సెంచరీతో కదంతొక్కిన స్టార్ క్రికెటర్ కొడుకు
తీరంలో తూటా.. సీటీలో బాంబు
ఊరంతా తెలిసిన సీక్రెట్...
భారత్‌పై దాడి కోసం 130 అణు బాంబులు.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
IPL 2025 MI Vs LSG: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న రోహిత్ శర్మ
సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్
INDw Vs SLw: శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా..
జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా
ఆ నలుగురిని వదిలేస్తేనే సీఎస్కే బాగుపడుతుంది: సెహ్వాగ్
ట్రైలర్: సీరియల్స్ చూస్తున్నంతసేపు దెయ్యంగా.. కాపాడనున్న సమంత!
పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు
పెరిగిన అద్దెలు.. హైదరాబాద్‌లో అక్కడే ఫుల్ డిమాండ్!
ఇంట్లోని రూ.3.20 కోట్ల నగదు, బంగారం తీసుకెళ్లిన భార్య
విశాఖలో దంపతుల దారుణహత్య
త్రీడీలో జగదేక వీరుడు అతిలోక సుందరి
IPL 2025: విరాట్ 30కి పైగా స్కోర్ చేశాడా, ఆర్సీబీ గెలిచినట్లే..!
Visakha: జంట హత్యల కేసులో ఏం జరిగింది..?
IPL 2025: ఇదేమి ఆట బ్రో.. పంత్ నీవు ఇక మారవా? ఫ్యాన్స్ ఫైర్
ఆపరేషన్ అనంతరం వెకేషన్లో యాంకర్ రష్మీ.. దేవుడిలాగే చేస్తాడేమో!
ఐటీఆర్ ఫైలింగ్‌కు వేళాయే..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
మే 9.. మెగా ఫ్యాన్స్ కి రెండు ట్రీట్స్
భారత్ భద్రతకు ‘ఇస్రో’ భరోసా..!
టెన్షన్ వద్దు పెన్షన్ కావాలి
కూటమి ఎమ్మెల్యేకు షాక్.. అందరిలో నిలదీసిన మహిళ
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
Festival: జనాల్లోకి దూసుకొచ్చిన కారు.. 9 మంది దుర్మరణం
పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. పది మంది సైనికులు మృతి
తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే: కేసీఆర్
'నా హైట్‌తో సమస్య.. నాతో ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు'.. మీనాక్షి చౌదరి
నువ్వాదరిని... నేనీదరిని... ఉగ్రవాది విడగొట్టె ఇద్దరినీ..!
2025 హంటర్ 350 బైక్ ఇదే: ధర ఎంతంటే?
బెంగళూరు ప్రతీకారం
సినిమా

వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి.. నాకు బాధేస్తోంది: కోటి
గత కొన్నిరోజులుగా 'పాడుతా తీయగా' షో వివాదం నడుస్తోంది. ప్రవస్తి ఆరాధ్య అనే సింగర్.. జడ్జిలైన కీరవాణి, సునీత, చంద్రబోస్ లపై షాకింగ్ ఆరోపణలు చేసింది. తనని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారని చెప్పుకొచ్చింది. దీనిపై పలువురు సింగర్స్ తమ తమ అభిప్రాయలు వ్యక్తం చేశారు. గీతాకృష్ణ అనే దర్శకుడు కీరవాణిపై సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఆయన్ని ఇక ఆపమని చెబుతూ సంగీత దర్శకుడు కోటి ఓ వీడియో రిలీజ్ చేశారు.'గీతాకృష్ణ.. మీరు నా ఫేవరెట్ డైరెక్టర్. అప్పట్లో కొత్త రకమైన ఆలోచనలతో సినిమాలు చేశారు. కె.విశ్వనాథ్ దగ్గర శిష్యరికం కూడా చేశారు.కానీ ఈ మధ్య మీకు కొంచెం మ్యాటర్ ఎక్కువవుతోంది. కీరవాణి, చంద్రబోస్, సునీత గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మనందరం ఓ ఫ్యామిలీ. ఇక్కడ తప్పేం జరిగిపోలేదు. తప్పు జరిగిందా లేదా అనేది మీడియా చూసుకుంటుంది'(ఇదీ చదవండి: మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు) 'కానీ ఇలా వ్యక్తిగతంగా మనుషులపై కామెంట్స్ చేస్తూ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించండి. ప్రతి దానిలో చిన్న అవాంతరాలు వస్తుంటాయి. నేను చేసిన వాటిలోనూ వచ్చాయి. అక్కడితో మర్చిపోతారు. వాళ్లు వాళ్లు హ్యాపీగా ఉంటారు. దీనికి ఇంత రచ్చ అవసరం లేదు. దయచేసి వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి. నాకు బాధేస్తోంది''ప్లీజ్.. ఇక ఈ విషయంలో ఏదీ మాట్లాడకండి. నాకు బాధగా ఉంది. ఇంకా ఏం చెప్తారో, ఏం వినాల్సి వస్తుందోనని నాకు భయమేస్తోంది' అని కోటి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి)

మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో మన దేశానికి చెందిన 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటికే ఇక్కడికి టూర్ కోసం వచ్చినవాళ్లు, త్వరలో వెళ్దామని అనుకున్నవాళ్లు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ నటుడు పహల్గామ్ వెళ్లారు.బాలీవుడ్ సీనియర్ నటుడు అతుల్ కులకర్ణి.. ఆదివారం పహల్గామ్ వెళ్లారు. అందరూ కశ్మీర్ తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. తాను ధైర్యంగా వచ్చానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఇన్ స్టాలో ఫొటో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) 'ఇది హిందుస్థాన్ గడ్డ. ఇక్కడ భయం కంటే ధైర్యం ఎక్కువ. ఇది హిందుస్థాన్ గడ్డ. ఇక్కడ ద్వేషాన్ని ప్రేమ ఓడిస్తుంది. కశ్మీర్ పోదాం పదండి. సింధు, జీలం నదుల్ని సందర్శిద్దాం పదండి. నేను వచ్చాను. మీరు కూడా రండి' అని అతుల్ కులకర్ణి చెప్పుకొచ్చారు.జయం మనదేరా, ఆంధ్రావాలా, చంటి, గౌరీ, లీలా మహల్ సెంటర్, పంజా, ద ఘాజీ, మజిలీ, వైల్డ్ డాగ్ తదితర తెలుగు సినిమాల్లో ఈయన నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్, ఒరియా, మరాఠీ భాషల్లో తీసిన పలు చిత్రాల్లోనూ ఈయన నటించడం విశేషం.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by Atul Kulkarni (@atulkulkarni_official)

అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
శేఖర్ మాస్టర్ తో అనసూయ ఫన్నీ పోజులుసితారకు అక్కలా అనిపిస్తున్న తల్లి నమ్రతపట్టుచీరలో ముచ్చటైన నవ్వుతో మీనాక్షి చౌదరిబంధువుల పాపతో శ్రీలీల ముద్దు మురిపెంచీరలో తెగ సిగ్గుపడిపోతున్న పూజా హెగ్డేజలకన్య తరహా డ్రస్సులో రకుల్ ప్రీత్ అందాల జాతరటామ్ బాయ్ లా మారిపోయిన రష్మిక మందన్నా View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by HT City Showstoppers (@htcityshowstoppers) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Hariprriya Simha (@iamhariprriya)

'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
బాహుబలి 2 సినిమా చూశారా? అందులో కుంతల రాజ్యానికి అనుష్క అలియాస్ దేవసేన యువరాణిగా ఉంటుంది. ఆమెకు వదినగా చేసిన నటి కూడా మీకు గుర్తుండే ఉంటుంది. ఆమెనే ఆశ్రిత వేమగంటి. చూస్తే వయసు మళ్లినట్లు కనిపిస్తుంది కానీ ఈ మూవీ చేసేటప్పటికీ ఆమెకు 27 ఏళ్లే. స్వయానా ఆమెనే ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇంతకీ ఏం చెప్పిందంటే?'బాహుబలి సినిమా చేసేటప్పటికి నా వయసు 27 ఏళ్లే. కానీ కాస్త పెద్దదానిలా చూపించారు. దీంతో ఇప్పటికీ ఎవరైనా నన్ను కలిస్తే మీరు బయట చాలా యంగ్ గా ఉన్నారని అంటుంటారు. అవును ఇదే నేను అని వాళ్లతో చెబుతుంటాను. చాలామంది నన్ను స్క్రీన్ పై చూసి నాది పెద్ద వయసు అనుకున్నారు. ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడేసుకుంటున్నారు'(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) 'ఇలా కాస్త ప్లస్ సైజులో ఉండటం వల్ల నాకు నచ్చిన పాత్రలు దాదాపు నేను చేయలేను. ఎందుకంటే ప్లస్ సైజులో ఉంటే గౌరవప్రదమైన రోల్స్ కోసం మాత్రమే తీసుకుంటారు. సదరు దర్శకులకు నా నిజమైన వయసు గురించి చెప్తే.. పాత్రకు వయసు ఎక్కువున్నా సరే చాలా పవర్ ఫుల్ అదీ ఇదీ అని చెప్పి నన్ను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తారు' అని ఆశ్రిత చెప్పుకొచ్చింది.స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఈమె.. బాహుబలి 2 సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత మహర్షి, MCA, క్రాక్, డియర్ కామ్రేడ్, యాత్ర, యానిమల్ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర'లో కీలక పాత్ర చేస్తోంది.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్)
న్యూస్ పాడ్‌కాస్ట్

రెండోరోజూ కాల్పుల హోరు. సరిహద్దు వెంట కాల్పులు కొనసాగించిన పాకిస్తాన్. దీటుగా బదులిచ్చిన భారత బలగాలు

ఆంధ్రప్రదేశ్ రాజధానిలో దోపిడీ ఐకానిక్... ఐదు టవర్ల నిర్మాణ వ్యయం అనూహ్యంగా పెంపు...

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు... తీవ్రస్థాయికి చేరిన ఉద్రిక్తతలు

పాకిస్తాన్‌కు భారత్ పంచ్. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్. దౌత్య సంబంధాలకు కత్తెర. సింధూ ఒప్పందం సస్పెన్షన్. ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం

ఆంధ్రప్రదేశ్‌లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్‌రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
క్రీడలు

వివాదం ఇంకా ఉంది!
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐ–లీగ్ చాంపియన్‌షిప్‌లో చర్చిల్ బ్రదర్స్ ఫుట్‌బాల్ క్లబ్‌ను విజేతగా అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ప్రకటించడంపై అంతర్జాతీయ స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్టు (సీఏఎస్) స్టే విధించింది. కేసులో విచారణ ముగిసేవరకు టైటిల్ చాంప్‌పై ఓ నిర్ణయానికి రావొద్దని సీఏఎస్ డివిజన్ డిప్యూటీ ప్రెసిడెంట్ మధ్యంతర తీర్పు ఇచ్చారు. ఈ సీజన్ ఐ–లీగ్‌లో రెండో స్థానంలో నిలిచిన ఇంటర్ కాశీ జట్టు తమకు సంబంధించిన ఒక మ్యాచ్ ఫలితంపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించకుండానే ఏఐఎఫ్ఎఫ్ ఏకపక్షంగా చర్చిల్ బ్రదర్స్ జట్టును విజేతగా ప్రకటించడం అసంబద్ధమని కోర్టుకెక్కింది. దీనిపై ఆదివారం విచారించిన సీఏఎస్ డివిజన్ ఏఐఎఫ్ఎఫ్కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. జట్టు సభ్యులకు పతకాలు గానీ, ట్రోఫీని గానీ బహూకరించరాదని స్పష్టం చేసింది. ప్రతివాదులైన విజేత జట్టు చర్చిల్ బ్రదర్స్ యాజమాన్యం, ఏఐఎఫ్ఎఫ్లకు కౌంటర్ దాఖలు చేసేందుకు ఈ నెల 29 వరకు గడువిచ్చింది. కానీ జరగాల్సిన తంతు ఆదివారమే జరిగిపోవడంతో ఇప్పుడు ఏఐఎఫ్ఎఫ్ నవ్వులపాలైంది. వివాదం ఉన్న సంగతిని ఏమాత్రం పట్టించుకోని ఏఐఎఫ్ఎఫ్ అత్యుత్సాహానికి పోయి ఆదివారం విజేత జట్టుకు ట్రోఫీని, పతకాలను బహూకరించింది. అయితే తుదితీర్పుకు లోబడే తమ నిర్ణయముంటుందని, అప్పుడు ట్రోఫీని, పతకాలను వెనక్కి తీసుకుంటామని ముక్తాయించిన తీరు సర్వత్రా విమర్శల పాలైంది. ఏమిటీ వివాదం! ఐ–లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో నాకౌట్ పోటీలు, ఫైనల్ మ్యాచ్ అనేవి ఉండవు. మొత్తం పాల్గొన్న జట్లలో సాధించిన విజయాలు, కొట్టిన గోల్స్, ఇచ్చిన గోల్స్ ఆధారంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటించారు. దీంతో 40 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న చర్చిల్ బ్రదర్స్‌ను ఏఐఎఫ్ఎఫ్ విజేతగా ప్రకటించింది. కానీ 39 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఇంటర్ కాశీ జట్టుకు అంతకుముందు నాంధారి జట్టుతో జరిగిన మ్యాచ్ ఫలితం వివాదం రేపింది. ఈ మ్యాచ్‌లో ఇంటర్ కాశీ జట్టు 2–0తో నాంధారి జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో అనర్హతకు గురైన ఆటగాడితో మ్యాచ్ ఆడించినందు వల్ల నాంధారి జట్టుపై పెనాల్టీ విధించి ఫలితాన్ని తమకు అనుకూలంగా ఇవ్వాలని ఇంటర్ కాశీ కోరింది. ఒకవేళ తీర్పు ఇంటర్ కాశీ జట్టుకు అనుకూలంగా వస్తే ఆ జట్టు 42 పాయింట్లతో ఐ–లీగ్ చాంపియన్‌గా అవతరిస్తుంది.

భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో పరాజయం
పెర్త్: ఆ్రస్టేలియా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో సలీమా టెటె నాయకత్వంలోని భారత జట్టు 2–3 గోల్స్ తేడాతో పరాజయం చవిచూసింది. భారత్ తరఫున జ్యోతి సింగ్ (13వ నిమిషంలో), సునెలితా టొప్పో (59వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుకు ఇవీ స్టాన్స్బై (17వ నిమిషంలో), డేలీ డాల్కెన్స్ (48వ నిమిషంలో), జేమీ లీ సుర్హా (52వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. తొలి క్వార్టర్ చివర్లో లభించిన పెనాల్టీ కార్నర్‌ను జ్యోతి సింగ్ గోల్‌గా మలచడంతో భారత్ ఖాతా తెరిచింది. నాలుగు నిమిషాల తర్వాత ఆసీస్ స్కోరును సమం చేసింది. ఒకదశలో మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగుస్తుందనిపించింది. అయితే నాలుగు నిమిషాల వ్యవధిలో ఆసీస్ రెండు గోల్స్ చేసింది. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా భారత్ రెండో గోల్ చేసినా పరాజయాన్ని తప్పించుకోలేకపోయింది.

పరాజయంతో ప్రారంభం
జియామెన్ (చైనా): స్టార్ జోడీలు లేకుండానే ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన భారత జట్టుకు నిరాశ ఎదురైంది. గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 1–4 తేడాతో డెన్మార్క్ చేతిలో ఓడిపోయింది. ఈ పరాజయంతో భారత జట్టు నాకౌట్ దశకు చేరుకోవాలంటే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాయాల కారణంగా పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ఈ మెగా ఈవెంట్‌కు దూరంగా ఉన్నాయి. దాంతో భారత జట్టు విజయావకాశాలన్నీ రెండు సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడ్డాయి. అయితే ఈ రెండింటిలోనూ భారత స్టార్స్ ఆకట్టుకోలేకపోయారు. వెరసి ఈ టోర్నీని భారత జట్టు పరాజయంతో మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జంట 13–21, 14–21తో జెస్పెర్ టాఫ్ట్–అమెలీ మేగ్లండ్ జోడీ చేతిలో ఓటమి పాలైంది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో భారత రెండో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ 15–21, 16–21తో ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో హరిహరన్–రూబన్ కుమార్ ద్వయం 7–21, 4–21తో ప్రపంచ నంబర్‌వన్ ఆండెర్స్ స్కారప్–కిమ్ అస్ట్రుప్ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖరారైంది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ పీవీ సింధు 20–22, 21–23తో లినె హోమార్క్ జార్స్‌ఫెల్డ్ చేతిలో ఓడిపోయింది. రెండు గేముల్లోనూ సింధు ఒకదశలో ఆధిక్యంలో ఉన్నా దానిని సది్వనియోగం చేసుకోలేకపోయింది. చివరిదైన ఐదో మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో–శ్రుతి మిశ్రా ద్వయం 13–21, 18–21తో నటాషా–అలెగ్జాండ్రా బోయె జంటను ఓడించి భారత్ క్లీన్‌స్వీప్ కాకుండా కాపాడింది. మంగళవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ ఇండోనేసియాతో భారత్ ఆడుతుంది.

బెంగళూరు ప్రతీకారం
దాదాపు రెండు వారాల క్రితం బెంగళూరు వేదికగా ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్... 163 పరుగులు చేసిన ఆర్సీబీ ఓటమి పాలైంది. అద్భుత ప్రదర్శనతో గెలిపించిన ‘లోకల్ ప్లేయర్’ కేఎల్ రాహుల్ మ్యాచ్ ముగిశాక ‘ఇది నా అడ్డా’ అన్నట్లుగా కాంతారా స్టయిల్లో సంబరం చేసుకున్నాడు. ఇప్పుడు అవే రెండు జట్ల మధ్య వేదిక ఢిల్లీకి మారింది. మ్యాచ్‌పై చర్చ కూడా కోహ్లి వర్సెస్ రాహుల్‌గానే సాగింది. ఈసారి ఆర్సీబీ విజయలక్ష్యం అదే 163 పరుగులు... 26/3తో బెంగళూరు కష్టాల్లో పడినట్లు కనిపించినా... కోహ్లి, కృనాల్ పాండ్యా శతక భాగస్వామ్యంతో ఆర్సీబీ ఘన విజయాన్ని అందుకొని బదులు తీర్చుకుంది. ఈసారి బ్యాటింగ్‌లో పరుగులు చేసేందుకు రాహుల్ తీవ్రంగా ఇబ్బంది పడగా... ‘దిల్లీవాలా’ కోహ్లి చక్కటి ఆటతో బెంగళూరు విజయానికి బాటలు వేశాడు. మ్యాచ్ ముగిశాక ప్రతీకార శైలిలో కోహ్లి విజయనాదం చేశాడు. న్యూఢిల్లీ: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య సమరం 1–1తో సమంగా ముగిసింది. సొంతగడ్డపై గత మ్యాచ్‌లో ఓడిన బెంగళూరు ఈసారి ప్రత్యర్థి మైదానంలో విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 41; 3 ఫోర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే ఫర్వాలేదనిపించగా, భువనేశ్వర్ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అనంతరం బెంగళూరు 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (47 బంతుల్లో 51; 4 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 84 బంతుల్లో 119 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బ్యాటింగ్ తడబాటు... అభిషేక్ పొరేల్ (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్ కలిసి 29 బంతుల్లో 62 పరుగులు చేయగా... మిగతా బ్యాటర్లంతా కలిసి 92 బంతుల్లో 96 పరుగులు మాత్రమే సాధించడం ఢిల్లీ బ్యాటింగ్ పరిస్థితిని చూపిస్తోంది. భువనేశ్వర్ ఓవర్లో 2 సిక్స్‌లతో ధాటిని ప్రదర్శించిన పొరేల్ ఎక్కువ సేపు నిలవలేకపోగా, కరుణ్ నాయర్ (4) విఫలమయ్యాడు. పవర్‌ప్లేలో జట్టు 52 పరుగులు చేసింది. అయితే ఆపై ఆర్సీబీ స్పిన్నర్లు సుయాశ్, కృనాల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల రాక కష్టంగా మారిపోయింది. ఈ ఇద్దరు బౌలర్లు కలిసి 8 ఓవర్లలో 2 ఫోర్లు, 1 సిక్స్ సహా 50 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఒత్తిడిలో డుప్లెసిస్ (22), అక్షర్ పటేల్ (15) వెనుదిరగ్గా... రాహుల్ కూడా షాట్లు ఆడేందుకు బాగా ఇబ్బంది పడ్డాడు. భువీ ఒకే ఓవర్లో రాహుల్, అశుతోష్ (2)లను అవుట్ చేయడంతో ఢిల్లీ 17 ఓవర్లలో 120/6 వద్ద నిలిచింది. అయితే స్టబ్స్ దూకుడుగా ఆడటంతో తర్వాతి రెండు ఓవర్లలో 36 పరుగులు వచ్చి స్కోరు 150 దాటింది. కీలక భాగస్వామ్యం... ఛేదనలో బెంగళూరుకు సరైన ఆరంభం లభించలేదు. ఆరు పరుగుల వ్యవధిలో బెథెల్ (12), పడిక్కల్ (0), పాటీదార్ (6) వెనుదిరగడంతో స్కోరు 26/3 వద్ద నిలిచింది. ఈ దశలో కోహ్లి, కృనాల్ కలిసి చక్కటి సమన్వయంతో జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా... నిలదొక్కుకున్న తర్వాత కృనాల్ ధాటిని పెంచాడు. 8 ఓవర్లలో 85 పరుగులు చేయాల్సిన సమయంలో తర్వాతి 3 ఓవర్లలో బెంగళూరు 36 పరుగులు రాబట్టడంతో పని సులువైంది. ఈ క్రమంలో సిక్సర్లతో చెలరేగిన కృనాల్ 38 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. 2016 సీజన్లో తన ఏకైక హాఫ్ సెంచరీని సాధించిన కృనాల్ ఇన్నేళ్లకు మళ్లీ ఆ మార్క్‌ను దాటడం విశేషం. ఆ తర్వాత కోహ్లి కూడా 45 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. విజయానికి 18 పరుగుల దూరంలో కోహ్లి అవుటైనా... కృనాల్, టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి 9 బంతుల ముందే మ్యాచ్‌ను ముగించారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పొరేల్ (సి) జితేశ్ శర్మ (బి) హాజల్‌వుడ్ 28; డుప్లెసిస్ (సి) కోహ్లి (బి) కృనాల్ 22; కరుణ్ నాయర్ (సి) భువనేశ్వర్ (బి) దయాళ్ 4; రాహుల్ (సి) బెథెల్ (బి) భువనేశ్వర్ 41; అక్షర్ (బి) హాజల్‌వుడ్ 15; స్టబ్స్ (సి) హాజల్‌వుడ్ (బి) భువనేశ్వర్ 34; అశుతోష్ (బి) భువనేశ్వర్ 2; విప్రాజ్ (రనౌట్) 12; స్టార్క్ (నాటౌట్) 0; చమీరా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–33, 2–44, 3–72, 4–102, 5–118, 6–120, 7–158, 8–162. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–3, యశ్ దయాళ్ 4–0–42–1, హాజల్‌వుడ్ 4–0–36–2, సుయాశ్ శర్మ 4–0–22–0, కృనాల్ పాండ్యా 4–0–28–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: బెథెల్ (సి) నాయర్ (బి) అక్షర్ 12; కోహ్లి (సి) స్టార్క్ (బి) చమీరా 51; పడిక్కల్ (బి) అక్షర్ 0; పాటీదార్ (రనౌట్) 6; కృనాల్ (నాటౌట్) 73; డేవిడ్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–26, 4–145. బౌలింగ్: అక్షర్ పటేల్ 4–0–19–2, స్టార్క్ 3–0–31–0, ముకేశ్ కుమార్ 3.3–0–51–0, విప్రాజ్ 1–0–12–0, కుల్దీప్ 4–0–28–0, చమీరా 3–0–24–1. ఐపీఎల్లో నేడురాజస్తాన్ X గుజరాత్ వేదిక: జైపూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
బిజినెస్

ఏఐ జాబ్ మార్కెట్ బూమ్.. టాప్ 10 స్కిల్స్ ఇవే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగ మార్కెట్ అనూహ్యమైన వృద్ధిని సాధిస్తోంది. యునైటెడ్ స్టేట్స్లో 2024లో ఏఐ జాబ్ పోస్టింగ్‌లలో 20% పెరుగుదల నమోదైందని లైట్కాస్ట్ నిర్వహించిన 2025 AI ఇండెక్స్ రిపోర్ట్ తెలిపింది. 109 బిలియన్ డాలర్ల ప్రైవేట్ పెట్టుబడులతో ఊపందుకున్న ఈ మార్కెట్, ప్రత్యేక ఏఐ నైపుణ్యాల డిమాండ్‌ను పెంచుతూ ఉద్యోగ రంగాన్ని పునర్నిర్మిస్తోంది.పైథాన్ అత్యంత డిమాండ్ ఉన్న నైపుణ్యంగా నిలిచింది. గత సంవత్సరం దాదాపు 200,000 ఉద్యోగ పోస్టింగ్‌లలో ఈ నైపుణ్యాన్ని అడిగారు. రిపోర్ట్ ప్రకారం.. పైథాన్, ప్రోగ్రామింగ్, డేటా సైన్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌తోపాటు అధిక డిమాండ్ ఉన్న టాప్ 10 ఏఐ ఉద్యోగ నైపుణ్యాలు ఇవే..👉పైథాన్ (199,213 పోస్టింగ్‌లు, 2012-2014తో పోలిస్తే 527% వృద్ధి)👉కంప్యూటర్ సైన్స్ (193,341 పోస్టింగ్‌లు, 131% వృద్ధి)👉డేటా అనాలిసిస్ (128,938 పోస్టింగ్‌లు, 208% వృద్ధి)👉SQL (119,441 పోస్టింగ్‌లు, 133% వృద్ధి)👉డేటా సైన్స్ (110,620 పోస్టింగ్‌లు, 833% వృద్ధి)👉ఆటోమేషన్ (102,210 పోస్టింగ్‌లు, 361% వృద్ధి)👉ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ (101,127 పోస్టింగ్‌లు, 87% వృద్ధి)👉అమెజాన్ వెబ్ సర్వీసెస్ (100,881 పోస్టింగ్‌లు, 1,778% వృద్ధి)👉అజైల్ మెథడాలజీ (88,141 పోస్టింగ్‌లు, 334% వృద్ధి)👉స్కేలబిలిటీ (86,990 పోస్టింగ్‌లు, 337% వృద్ధి)కింగ్ ‘పైథాన్’పైథాన్ బహుముఖ ప్రజ్ఞ, విస్తృత లైబ్రరీలు దీనిని ఏఐ అభివృద్ధిలో కీలకమైన అంశంగా మార్చాయని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో డేటా సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎమిలీ చెన్ అన్నారు. "మెషిన్ లెర్నింగ్ నుండి ఆటోమేషన్ వరకు, పైథాన్ అనివార్యం" ఆమె తెలిపారు.డేటా సైన్స్ (833% వృద్ధి), అమెజాన్ వెబ్ సర్వీసెస్ (1,778% వృద్ధి) వంటి నైపుణ్యాలు అత్యధిక వృద్ధిని సాధించాయి, ఇవి సంక్లిష్ట డేటాసెట్ల నుండి సమాచారాన్ని సంగ్రహించే, స్కేలబుల్ ఏఐ సిస్టమ్‌లను నిర్మించే నైపుణ్యాల అవసరాన్ని సూచిస్తున్నాయి. అజైల్ మెథడాలజీ (88,141 పోస్టింగ్‌లు) సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఇటరేటివ్ విధానాలకు ఉన్న ప్రాధాన్యతను హైలైట్ చేస్తుంది.ఈ డిమాండ్ విస్తరణ టెక్ దిగ్గజ కంపెనీల నుండి స్టార్టప్‌ల వరకు వివిధ రంగాలలో అవకాశాలను సృష్టిస్తోంది. "కంపెనీలు AIని సమగ్రపరచడానికి పోటీపడుతున్నాయి, దీనికి నైపుణ్యం కలిగిన నిపుణులు అవసరం," అని సిలికాన్ వ్యాలీలో టెక్ రిక్రూటర్ మార్క్ రివెరా అన్నారు. అయితే, ఈ వేగవంతమైన వృద్ధి నైపుణ్యాల అంతరాన్ని గురించి ఆందోళనలను లేవనెత్తింది. కొందరు నిపుణులు విద్యా సంస్థలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కరికులమ్‌ను సవరించాలని సూచిస్తున్నారు.ఏఐ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో డిమాండ్ ఉన్న ఈ స్కిల్స్‌లో నైపుణ్యం కలిగిన ఉద్యోగార్థులు ఏఐ జాబ్ బూమ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి పైథాన్, డేటా సైన్స్‌లో నైపుణ్యం సాధించడం ఏఐలో లాభదాయకమైన కెరీర్‌కు కీలకంగా మారవచ్చు.

బంగారం భారీగా పడిపోతుంది!
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ తారాస్థాయికి చేరాయి. భారత్‌లో అయితే 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.లక్ష దాటి తర్వాత కాస్త తగ్గింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న బంగారం ధరలతో ఆందోళన చెందుతున్న వారికి ఉపశమనం కలిగించే వార్తొకటి వచ్చింది. వచ్చే 12 నెలల్లో బంగారం ధర భారీగా పడిపోయే అవకాశం ఉందని కజకిస్థాన్ గోల్డ్ మైనింగ్ సంస్థ సాలిడ్ కోర్ రిసోర్సెస్ పీఎల్సీ సీఈఓ చెబుతున్నారు.12 నెలల్లో బంగారం ధరలు (ఒక ఔన్స్) 2,500 డాలర్లకు చేరుకుంటుందని సాలిడ్ కోర్ రిసోర్సెస్ సీఈఓ 'విటాలీ నేసిస్' రాయిటర్స్‌తో చెప్పారు. అయితే 1,800 - 1,900 డాలర్ల స్థాయికి చేసే అవకాశం లేదు. సాధారణంగా బంగారంపై ఓ స్థాయి వరకు ప్రతిస్పందన ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నది (ధరలు పెరగడం) ఓవర్ రియాక్షన్' అని కజకిస్థాన్ రెండో అతిపెద్ద గోల్డ్ మైనర్ సాలిడ్‌కోర్ నేసిస్ అంటున్నారు.ఎంతకు తగ్గొచ్చు? నేసిస్ చెబుతున్నదాని ప్రకారం.. ఒక ఔన్స్ అంటే 28.3495 గ్రాముల బంగారం ధర 2,500 డాలర్లకు తగ్గుతుంది. అంటే 10 గ్రాముల ధర దాదాపు రూ. 75,000 లకు దిగొస్తుంది. సాంప్రదాయకంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులకు వ్యతిరేకంగా రక్షణ కవచంగా భావించే బంగారం ధర ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 26 శాతం పెరిగింది. ఎందుకంటే యూఎస్ సుంకాలు మాంద్యం భయాలను రేకెత్తించాయి. ఈ క్రమంలో గత మంగళవారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఔన్స్ బంగారం రికార్డు స్థాయిలో 3,500.05 డాలర్లను తాకింది.👉ఇదీ చదవండి: చూశారా.. ‘బంగారమే డబ్బు’!ప్రస్తుతం ధరలు ఇలా..అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 26 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,310- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,170ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

పహల్గామ్ బాధితులకు సులువుగా బీమా క్లయిమ్
పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు బీమా చెల్లింపులు సులభతరం చేసేందుకు దేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ లైఫ్ ముందుకు వచ్చింది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పాలసీదారుల కుటుంబ సభ్యులు / నామినీల క్లెయిమ్ సమర్పణ కోసం సరళీకృత ప్రక్రియను ప్రకటించింది.ఈ ఉగ్రదాడిలో చనిపోయినవారికి హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో బీమా పాలసీ ఉన్నట్లయితే వారి నామినీ / చట్టపరమైన వారసులు డెత్ క్లెయిమ్ సమర్పించవచ్చు. ఇందుకోసం ఉగ్రవాద దాడి కారణంగా సంభవించిన పాలసీదారు మరణానికి రుజువును స్థానిక ప్రభుత్వం, పోలీసు, ఆసుపత్రి లేదా సంబంధిత అధికారుల నుండి సమర్పించాలి.డెత్ క్లెయిమ్ కోసం నామినీలు కాల్ సెంటర్ నంబర్ 022-68446530, service@hdfclife.com అనే ఈమెయిల్ ద్వారా హెచ్డీఎఫ్సీ లైఫ్‌ను సంప్రదించవచ్చు. లేదా ఏదైనా బ్రాంచ్ కార్యాలయాలను సందర్శించవచ్చు. బాధిత కుటుంబాలకు క్షేత్రస్థాయిలో సహాయ, సహకారాలు అందించడానికి అన్ని ప్రదేశాలలోనూ కంపెనీ స్థానిక బ్రాంచ్ సిబ్బంది అందుబాటులో ఉంటారని హెచ్డీఎఫ్సీ లైఫ్ తెలిపింది.ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని హెచ్డీఎఫ్సీ లైఫ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సమీర్ యోగీశ్వర్ తెలిపారు. బాధితులకు జరిగిన నష్టాన్ని ఏదీ భర్తీ చేయలేనప్పటికీ, ఈ సరళీకృత ప్రక్రియ ద్వారా క్లెయిమ్ సమర్పణకు ప్రయాసలను మాత్రం తగ్గించగలమని ఆయన పేర్కొన్నారు.

హెచ్‌పీ నుంచి 9 కొత్త ఏఐ ల్యాప్‌టాప్‌లు
న్యూఢిల్లీ: కృత్రిమ మేథకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కంప్యూటర్స్ తయారీ దిగ్గజం హెచ్‌పీ తాజాగా తొమ్మిది ల్యాప్‌టాప్ మోడల్స్‌ను ఆవిష్కరించింది. వీటి ధర రూ. 78,999 (16 అంగుళాల హెచ్‌పీ ఆమ్నిబుక్5 నుంచి రూ. 1.86 లక్షల వరకు (హెచ్‌పీ ఆమ్నిబుక్ అల్ట్రా 14 అంగుళాలు) ఉంటుంది.మరోవైపు, భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీని 2031 నాటికి రెట్టింపు చేసుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. దీనితో భారత్‌లో విక్రయించే ప్రతి మూడు హెచ్‌పీ పీసీల్లో ఒకటి ఇక్కడ తయారు చేసినదే ఉంటుందని సంస్థ భారత విభాగం సీనియర్ డైరెక్టర్ వినీత్ గెహానీ తెలిపారు.2025లో భారత్‌లో తాము విక్రయించే మొత్తం పీసీల్లో 13 శాతం దేశీయంగా ఉత్పత్తి చేసినవే ఉంటాయని వివరించారు. 2024లో దేశీ పీసీ మార్కెట్లో 30.1 శాతం వాటాతో హెచ్‌పీ అగ్రస్థానంలో నిల్చింది. కంపెనీ తమ ల్యాప్‌టాప్‌ల కోసం ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల కంపెనీలు డిక్సన్, వీవీడీఎన్తో జట్టు కట్టింది.
ఫ్యామిలీ

కుందనపు బొమ్మ నటి మేఘా ఆకాశ్ ఇష్టపడే ఆభరణాలు ఇవే..!
‘బొమ్మోలె ఉందిరా పోరీ..’ అంటూ చీర కట్టినా, జీన్స్ వేసినా అచ్చం కుందనపు బొమ్మలాగే ఉంటుంది నటి మేఘా ఆకాశ్. ఇప్పుడు ఆ రెండింటి కలయికలోనూ అద్భుతంగా ట్రెడిషన్ విత్ కాంటెంపరరీ లుక్ ట్రై చేసింది. ఆ ఫ్యాషన్ వివరాలే ఇక్కడ చూద్దాం.. వెండి వెలుగులుఆభరణాల విలువల పోటీలో బంగారం తర్వాతి స్థానమే వెండిది అయినా, మగువ అందాన్ని పెంచడంలో మాత్రం ఈ ఆభరణాలు తగ్గేదేలే అంటూ పోటీ పడతాయి. ఎందుకంటే, వెండి ఆభరణాలను ధరిస్తే వచ్చే లుక్కే వేరు. తక్కువ ధరలో లభించడంతో వీటికి అభిమానులు కూడా ఎక్కువే. సాధారణంగా వెండిని కాళ్ల పట్టీలు, కంకణాలు, మెట్టెలు వంటి ఆభరణాలకే ఉపయోగించేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టు వెండిని కూడా మెడలో హారాలు, చెవి పోగులకు, వివిధ ఆభరణాల రూపంలోకి మార్చేస్తున్నారు. అయితే, ధగధగ మెరిసే వెండి వస్తువుల మాదిరి కాకుండా ఈ వెండి ఆభరణాల రంగు కాస్త డల్‌గా ఉన్నా, ఇవి స్టయిలిష్ అండ్ బ్రైట్ లుక్‌ను తెప్పిస్తున్నాయి. వీటని మెయింటైనెన్స్ కూడా పెద్ద కష్టమైన పని కాకపోవడంతో ప్రతి ఒక్కరూ కాంట్రాస్ట్ లుక్ కోసం వీటినే ప్రిఫర్ చేస్తున్నారు. అలాంటి లుక్ కోసమే నటి మేఘా ఆకాశ్ కూడా ఈ సిల్వర్ జ్యూలరీని ఎంచుకున్నారు చూడండి. ఇక్కడ మేఘా జ్యూలరీ.. బ్రాండ్: ఆమ్రపాలీ జ్యూలరీ చౌకర్ ధర: రూ. 5,800నెక్ పీస్ ధర: రూ. 41,612, ఉంగరం ధర: రూ. 3,399. ఇక మేఘాకి లిప్‌స్టిక్ ఎక్కువ ఇష్టం ఉండదట. అందుకే, తన బ్యాగులో ఎప్పుడూ చాలా రకాల లిప్ బామ్స్ ఉంటాయని చెబుతోంది. (చదవండి: పండ్లు, కూరగాయలతో ఆరోగ్యమే కాదు..ఇంటి అలంకరణలోనూ అదుర్స్..)

పండ్లు, కూరగాయలతో ఆరోగ్యమే కాదు..ఇంటి అలంకరణలోనూ అదుర్స్..
వేసవిలో పండ్లు, కూరగాయల జ్యూస్‌ల వాడకం సహజంగానే ఎక్కువ. ఆరోగ్యం గురించే కాదు, వీటిని ఇంటి అలంకరణలోనూ వాడచ్చు. సహజమైన పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కాబట్టి కృత్రిమమైన పండ్లు, కూరగాయలు, వనమూలికలతో ఇంటిని అలంకరించవచ్చు. ఇంటి వాతావరణం చల్లగా, సహజత్వానికి దగ్గరగా ఫామ్‌హౌస్ వాతావరణాన్ని సృష్టించాలనుకున్నా, సమృద్ధిగా పంటల థీమ్‌ను సృష్టించాలనుకున్నా, వనమూలికల ఉపయోగాలు తెలుసుకుంటూ ఆరోగ్యాన్ని పెంచుకోవాలన్నా, ఫ్రూట్ అండ్ వెజిటబుల్ డెకర్ ఈ సీజన్‌కి సరైన ఎంపిక అవుతుంది.కిచెన్ డెకర్గిన్నెల్లో, వంటగది కౌంటర్‌టాప్ లేదా డైనింగ్ టేబుల్‌పై పండ్లబుట్ట ఉంచి, వాటిలో కృత్రిమ పండ్లు, కూరగాయలను ప్రదర్శించవచ్చు. ఆర్టిఫిషియల్ పండ్లు, కూరగాయలు, మూలికలు, పువ్వులు లేదా పచ్చదనంతో సెంటర్ టేబుల్‌పైన సెంటర్ పీస్‌ను క్రియేట్ చేయండి. మరింత అందంగా కనిపించడానికి ఓ వెదురు బుట్ట లేదా జాడీ ఉంచండి. ఫామ్‌హౌస్ శైలిపట్టణవాసులు ఇటీవల ఫామ్ హౌస్‌లను బాగా ఇష్టపడుతున్నారు. అందుకని, ఫామ్‌హౌస్ అలంకరణను మన ఇంట్లోకి తీసుకురావచ్చు. వెదురు లేదా తీగలతో అల్లిన బుట్టలు, జ్యూట్ బ్యాగుల్లో మీకు నచ్చిన చెర్రీ, బెర్రీ, నిమ్మ, ఆరెంజ్, అరటి, మామిడి.. వంటి కృత్రిమ పండ్లు, కూరగాయలు, మూలికలను చేర్చండి. హెర్బల్ గార్డెన్కృత్రిమ మూలికలతో ఇండోర్ హెర్బల్ గార్డెన్‌ను సృష్టించవచ్చు. తాజా అనుభూతి కోసం వంటగదిలో కుండలు లేదా వేలాడే బుట్టలనూ ఉంచవచ్చు. నిమ్మ, నారింజ చెట్లు వంటి కృత్రిమ పండ్ల చెట్లను పెద్ద కుండలలో ఉంచి ప్రదర్శించవచ్చు. ఎన్.ఆర్(చదవండి: వేసవి అంటే సెలవులేనా?)

వేసవి అంటే సెలవులేనా?
వేసవి కాలం వచ్చిందంటే చాలామంది టీనేజర్లు మెల్లగా మధ్యాహ్నం లేచి, తాపీగా రీల్స్ చూసుకుంటూ, సాయం కాలం క్రికెట్ ఆడుతూ కాలం గడిపేస్తుంటారు. కాని, కాస్తంత మనసు పెడితే ఈ వేసవిని మీ మైండ్‌సెట్‌ను మార్చుకునే అద్భుత అవకాశంగా మలచుకోవచ్చు. మెరుగైన ఫోకస్, స్పష్టమైన లక్ష్యాలు, కొత్త స్కిల్స్, నిజమైన ఆత్మవిశ్వాసం గల మీ బెస్ట్ వెర్షన్‌గా మారవచ్చు. అందుకోసం ‘ఎస్.టి.ఏ.ఆర్’ను ఫాలో అయితే సరి.సిట్యుయేషన్ వేసవి సెలవుల వాస్తవంవేసవి అనేది తెల్లవారుఝాము వరకు నెట్‌ఫ్లిక్స్ చూస్తూ, మధ్యాహ్నం వరకు నిద్రపోయే టైమ్ మాత్రమే కాదు. మీ జీవితాన్ని మార్చుకునే టర్నింగ్ పాయింట్ కూడా! వేసవి అంటే మూడు అద్భుతమైన అవకాశాలు:రీచార్జ్: ఎనర్జీ లెవల్స్‌ని తిరిగి రీచార్జ్ చేసుకునే అవకాశంరిఫ్లెక్ట్: మీ అభిరుచులు, ఆలోచనలు గురించి అర్థం చేసుకునే అవకాశంరీ ఇన్వెంట్: మీరు కొత్తగా రూపుదిద్దుకునే అవకాశంథాట్ నిన్ను నీవు తెలుసుకోవడంఈ వయస్సులో మీ మనస్సు ఐడెంటిటీ కోసం వెతుకుతుంది. ‘నేనెవరు?’, ‘ఏం చేస్తే నా జీవితానికి అర్థం వస్తుంది?’ అన్న ప్రశ్నలు రోజూ మనసులో తిరుగుతుంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు ఈ వేసవిని ఉపయోగించుకోండి. అందుకోసం ఐదు విషయాల్లో క్లారిటీ తెచ్చుకోవాలి.ప్యాషన్స్: నాకు నిజంగా ఏది ఇష్టం? ఫియర్స్: నన్ను వెనక్కి లాగుతున్న భయాలు ఏవి?స్ట్రెంగ్త్స్: నా మానసిక బలాలేంటి?హ్యాబిట్స్: నేను రోజూ చేసే పనులు నన్ను ముందుకు నడిపిస్తున్నాయా? నాశనం చేస్తున్నాయా?విజన్: వచ్చే రెండు మూడేళ్లలో నేను ఎలా ఉండాలనుకుంటున్నాను?యాక్షన్ ఐదు వారాల చాలెంజ్ఈ వేసవిలో వారానికో చాలెంజ్ చొప్పున ఐదు వారాలు ఐదు చాలెంజŒ లు స్వీకరించండి. ఇవేవీ స్కూల్లో, కాలేజీలో కనిపించేవి కావు, బోధించేవీ కావు. కానీ మీ జీవితాన్ని సంతోషమయం చేస్తాయి. మొదటివారం డిజిటల్ డీటాక్స్. అంటే స్క్రీన్ టైమ్‌ను రోజుకు మూడు గంటలకే పరిమితం చేయడం. నిద్రకు గంట ముందు, నిద్రలేచాక గంటపాటు స్మార్ట్‌ఫోన్ ముట్టుకోకుండా ఉండటం. రోజూ 15 నిమిషాలు డీప్ బ్రీతింగ్ లేదా ధ్యానం ప్రాక్టీస్ చేయడం. దీనివల్ల మీ మెదడులో డోపమైన్ బ్యాలెన్స్ అవుతుంది. క్లారిటీ, మోటివేషన్ పెరుగుతుంది. రెండో వారం మీకు నచ్చిన సబ్జెక్ట్ లేదా హాబీని ఎంచుకుని, రోజుకో రెండు గంటలపాటు దానిపై పనిచేయండి. ఇలా డీప్ వర్క్ చేయడం వల్ల మీ ఫోకస్, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మూడోవారం రాత్రి నిద్రకు ముందు పదినిమిషాలు డైరీ రాయండి. ఈరోజు హైలైట్స్ ఏమిటి? నన్ను ఏది ఇన్స్పైర్ చేసింది? రేపు ఏం మెరుగుపరచుకోవాలి? ఇలా రాయడం వల్ల మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ని పెంచుతుంది.నాలుగోవారం ఐదు బేసిక్ లైఫ్ స్కిల్స్ నేర్చుకునేందుకు ఉపయోగించండి. మనీ మేనేజ్మెంట్కనీసం రెండు మూడు వంటలు నేర్చుకోవడంఒక లోకల్ ట్రిప్ ప్లాన్ చేయడంప్రాథమిక చికిత్స నేర్చుకోవడంమీకు నచ్చిన సబ్జెక్ట్‌పై మూడు నిమిషాలు మాట్లాడటంఐదోవారం కనెక్షన్ వీక్. ఒక రోజంతా కంప్లయింట్ చేయకుండా గడపండి. కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడండి. మీ అవ్వాతాతలతో కూర్చుని మాట్లాడండి, వాళ్లు చెప్పేది వినండి. అలాగే దగ్గరలో ఉన్న పిల్లలకు మీకు తెలిసింది నేర్పించండి. ఇలా చేయడం మీ బంధాలను బలపరచడమే కాకుండా, మీకు నిజమైన ఆనందాన్నిస్తుంది.రిజల్ట్ కొత్త నువ్వుఈ వ్యాసంలో చెప్పినవన్నీ పాటిస్తే ఈ వేసవి ముగిసేసరికి నీ గురించి నీకు స్పష్టత వస్తుంది. చిన్న చిన్న లక్ష్యాలు పూర్తి చేయడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది. మెదడులో డోపమైన్ వ్యసనం తగ్గి, ఫోకస్ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో బంధం బలపడుతుంది. నిన్ను నువ్వే మెచ్చుకునేలా మారిపోతావు. ఆల్ ది బెస్ట్!సైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com(చదవండి: సివిల్స్‌లో సక్సెస్ కాలేదు.. కానీ బిజినెస్‌లో ఇవాళ ఆ ఇద్దరూ..!)

ఈ వారం కథ: సమయానికి తగు..
‘నేను ఆఫీసుకి వెళుతున్నా. మన పుత్రరత్నం స్టేడియం నుంచి రాగానే, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి రవీంద్ర వాళ్ళ ఆఫీస్ ఇంటర్వ్యూ గుర్తు చేసి పంపండి’ ఆఫీస్‌కు వెళుతూ భర్తతో చెప్పింది భార్గవి. అప్పుడు సమయం ఉదయం ఎనిమిదిన్నర అవుతోంది.‘సర్లే, పంపిస్తాను’ చెప్పాడు భర్త శ్యామలరావు.‘ఈరోజు ఒక్కరోజు ప్రాక్టీస్ లేకపోయినా ఏమీ కాదు అంటున్నా, త్వరగానే వస్తా అంటూ వెళ్ళాడు. ఇది రవీంద్ర రిఫరెన్స్ తో వచ్చిన అవకాశం. పోగొట్టుకుంటే నాకు నామర్దా. మరోసారి ఎవరినీ అడగలేం కూడా’ చెప్పుల్లో కాళ్ళు పెడుతూ అన్నది భార్గవి.‘నువ్వేం టెన్షన్ పడకు. నే పంపిస్తాగా వాడిని. నువ్వు ఎక్కువ అలోచిస్తావు అనవసరంగా’ చదువుతున్న పేపర్ మడిచి అన్నాడు శ్యామలరావు.‘నేనా ఎక్కువ ఆలోచించేది?’ అన్నట్లు భర్త వైపు ఒక చూపు చూసి ఇంటి గేట్ వైపు నడిచింది భార్గవి. చాలాసార్లు ఆమె కళ్లే మాట్లాడతాయి.శ్యామలరావు ఓ ప్రభుత్వరంగ బ్యాంకులో పనిచేసి సంవత్సరం క్రితం ఉద్యోగ విరమణ పొందాడు. వచ్చే ఏడాది భార్గవి కూడా తను చేసే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం నుంచి బయటపడి విశ్రాంత జీవితపు సుఖాన్ని పొందబోతోంది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు– మొదటి సంతానం ఆడపిల్ల ధన, ఏడేళ్ల తర్వాత పుట్టిన మగపిల్లాడు సంతోష్! ధన తొంభై దశకం మొదట్లో పుట్టడంతో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల నీడ పడక ముందే బిట్స్ పిలానీలో చదువు, మంచి ఉద్యగం, తదుపరి పెళ్లి అన్నీ నల్లేరు మీది నడకగా సాగినాయి. ఇప్పుడు కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది.సంతోష్ చదువు డిగ్రీ కాలేజ్ స్థాయికి రాకుండానే ఆండ్రాయిడ్ ఫోన్ చేతికి రావడం, సోషల్ మీడియా వానమబ్బులా కమ్మేయడం జరిగిపోయాయి. అతని ఆలోచనలు, భావాలు పాతతరం మూసకొట్టుడు విద్యార్థిలాగా కాక, ప్రత్యేక మార్గం వైపు వెళ్లసాగాయి. అందుకే అతను ఇంజనీరింగ్ డిగ్రీ వైపు కాకుండా తన చదువును క్రియేటివ్ ఆర్ట్స్ వైపు సాగించాడు. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, యానిమేషన్ రంగాలలో చదువును సాగిస్తూ, వ్యక్తిత్వ వికాస రంగంలోనూ, అదనంగా బ్యాడ్మింటన్ ఆటలోనూ ప్రావీణ్యం పొందసాగాడు. స్నేహితులు, వాళ్ళతోనే ఎక్కువ సమయం గడిపే కొడుకును చూసి భార్గవి, అతని భవిష్యత్తు గురించి చింత పడసాగింది. తనయుడిలోని చురుకుతనం, స్నేహ గుణం, బాధ్యతాయుత ప్రవర్తన చూసిన శ్యామలరావు అతని గురించి దిగులు లేకపోగా గర్వపడతాడు. తనకో సుందర సౌఖ్య ప్రపంచాన్ని సంతోష్ ఏర్పరచుకోగలడని శ్యామలరావు విశ్వాసం.మరో అరగంటకి సంతోష్ ఇంటికి వచ్చాడు. వస్తూనే శ్యామలరావు భార్గవి చెప్పమన్నది అంతా ఆమె చెప్పినట్టే చెప్పాడు. చెప్పి, ‘ఈ ఇంటర్వ్యూ సంగతి ఏమవుతుందో ఏమో కానీ, అమ్మ దాన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది’ అన్నాడు.‘అటెండ్ అవగానే వచ్చేస్తాయా ఉద్యోగాలు? ఆమె ఇప్పించిన చా¯Œ ్సతో ఉద్యోగం తెచ్చుకోకపోతే నేనొక పనికిమాలిన వాడినని, అసమర్థుడినని ప్రూవ్ అయినట్టా? నా ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఇది ఏర్పాటు చేసింది. నిజానికి ఆ కంపెనీ మంచిదే. వాళ్ళు తీసుకునేది అకడమిక్ రికార్డ్స్ కూడా చూసి. నేను ఆ కోవలో లేను. నాదంతా ఎక్స్ట్రా వ్యాపకాలే! అమ్మ ఇది తెలుసుకోవడం లేదు’ అన్నాడు సంతోష్. మధ్యలో ధన కల్పించుకొని ‘నువ్వు ముందు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకో, నచ్చకపోతే చెయ్యడం మానెయ్. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు’ చెప్పింది.‘నువ్వు ఎప్పుడైనా నన్ను సపోర్ట్ చేశావటే! నీకూ నాకూ మధ్య ఒక జనరేషన్ తేడా ఉంది తెలుసుకొని మాట్లాడు’ అక్కని దెప్పాడు సంతోష్.‘అది నిజమే కాని, నువ్వు ఒక రోడ్ మ్యాప్ లేకుండా, నాలుగింటిలో వేళ్ళు పెడుతుంటే ఏమనుకోవాలి?’ సంతోష్‌ను నిలదీసింది ధన.‘ఇప్పుడు ఇంటర్వ్యూకు వెళ్ళేముందు ఈ వాదనలొద్దు’ ఇద్దరికీ అడ్డువచ్చాడు శ్యామలరావు.‘నాన్నా! అమ్మతో ఇబ్బంది ఏంటో తెలుసా? తాను పెర్ఫెక్ట్ పేరెంట్ అనిపించుకోవాలని. కాని, నాకు అన్నీ టైమ్ టేబుల్ గీసుకొని చేస్తుండే పర్ఫెక్ట్ చైల్డ్ అన్పించుకోవాలని మాత్రం లేదు. ఇది అమ్మకి అర్థం కావడం లేదు. మీ ఆలోచనలతో నేను బతకను. నా ఆలోచనలతోనే నేను బతకాలి. కష్టమైనా నష్టమైనా నేనే దానికి బాధ్యుడిని’ చేతిలోని కప్పు బద్దలు కొట్టినట్టు డైనింగ్ బల్లమీద పెడుతూ చెప్పాడు సంతోష్. చెప్పడమే కాకుండా చివాలున లేచి తన రూంలోకి వెళ్ళి తలుపు వేసేశాడు.మరో గంటకి బయటకు వచ్చి ఇంటర్వ్యూకి వెళుతున్నట్టు శ్యామలరావుకి చెప్పి వెళ్ళాడు.∙∙ అది హై టెక్ సిటీ– గచ్చిబౌలిలకు వెళ్ళే మార్గం. ఉదయం ఆఫీసులు మొదలయ్యే వేళల్లో రోడ్లన్నీ ఒకవైపు కిక్కిరిసి పోతాయి. పెరిగిన వాహన రద్దీని క్రమబద్ధీకరించే ప్రయత్నాలలో భాగంగా కట్టే ఫ్లై–ఓవర్లలో ఒకటి ఆ మార్గంలో కూడా కడుతున్నారు. కట్టేటప్పుడు దారంతా పరుచుకుపోయిన సామాన్లతో ఆ దారిన పోయే వాహనాలకు అటు వెళ్ళడమే నరకప్రాయం. అది తప్పించుకోవడానికి అడ్డదారులు పడుతుంటారు వాహనదారులు. ఆ అడ్డదారుల్లో రద్దీని క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఉండరు. ఆ దారులు ప్రతివాడి ఇష్టారాజ్యం. ఇంటర్వ్యూకి ఆలస్యం అవకూడదని సంతోష్ అటువంటి అడ్డదారినే ఎంచుకున్నాడు. అది మట్టి రోడ్డు దారి. ఆ దారి మధ్యలో ఒకచోట పైనుండి రైలు వెళ్ళే వంతెన ఒకటి వస్తుంది. ఆ దారంతా, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద రోడ్డును కలిసే వరకూ, చాలా సన్నగా, అడ్డంగా మూడు కార్లు పట్టేంత స్థలం కలిగి ఉంటుంది. ముందురోజు రాత్రి వర్షం పడడంతో అక్కడక్కడా నీటి మడుగులు ఏర్పడ్డాయి. రైలు వంతెన కొద్ది దూరంలో ఉందనగా ట్రాఫిక్ జామ్ అయి ఉంది. వంతెనకు అటూ ఇటూ వాహనాలు నిలిచి ఉన్నాయి. అక్కడకు వచ్చిన సంతోష్ ముందుకు వెళ్ళలేకపోయాడు. ఐదు నిమిషాలలో సర్దుకుంటుందిలే అని తన మోటార్ సైకిల్ ఇంజన్ ఆపాడు. చూస్తుండగానే తన వెనక చాలా బండ్లు వచ్చి చేరినయ్. ఐదు నిముషాలు గడిచినా ఎక్కడి బండ్లు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. అసహనపు మానవులు కొంతమంది హారన్లు మోగిస్తున్నారు అదేపనిగా! తను ఇప్పుడు వెనక్కి కూడా వెళ్ళలేక పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడయ్యాడు.సంతోష్ మొబైల్ తీసి టైమ్ చూశాడు– ఇంకా ఇరవై నిముషాలే ఉంది తన ఇంటర్వ్యూకి. బండ్లు అస్తవ్యస్తంగా ఇరుక్కుండి పోయాయి. ఆ మార్గం ఎంచుకున్నందుకు తనను తాను తిట్టుకున్నాడు.∙∙ వాహన రద్దీని అంచనా వేయకుండా అదే మార్గం ఎంచుకు వచ్చిన చంద్రకాంత్ కారు వెనక సీటులో అసహనంగా కదులుతున్నాడు ఇరుక్కుపోయిన వాహనాలను తిట్టుకుంటూ. చంద్రకాంత్ ఒక ఐటీ కంపెనీ యజమాని. అతను గచ్చిబౌలిలో ఉన్న ఒక నక్షత్ర హోటల్‌కి వెళ్లి అక్కడి నుంచి ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకొని విమానాశ్రయం వెళ్ళాలి. ఆ వ్యక్తులు చంద్రకాంత్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ముందు జరిపే పరిశీలనలు చెయ్యడానికి వచ్చారు ముంబై నుంచి. వారిని విమానాశ్రయానికి సమయానికి చేర్చలేకపోతే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా పావుగంటలో తను హోటల్ చేరాలి.ఒక వరుస పాటించకుండా కొన్ని కార్లు పక్క నుంచి ముందుకు వెళ్ళి అడ్డంగా ఆగిపోతూ ట్రాఫిక్ నియంత్రణను మరింత జటిలం చేస్తున్నాయి. కొంచెం సందు దొరికిన వైపు ద్విచక్ర వాహనాలు దూరిపోతున్నాయి. చంద్రకాంత్ డ్రైవర్ని ‘వేరే దారి లేదా’ అని అడిగాడు అనాలోచితంగా. అది తనక్కూడా తెలుసు వేరే దారి లేదని. డ్రైవర్ నుంచి కూడా అదే సమాధానం. చంద్రకాంత్ కారు దిగి చూశాడు. ముందు వైపు కంటే వెనకవైపు భారీగా ఆగినయ్ వాహనాలు. అంటే తను ముందుకే వెళ్ళాలి తప్ప, వెనక్కి తిరిగి అస్సలు వెళ్ళలేడు. చంద్రకాంత్ మనసులో అలజడి మొదలైంది– ఇప్పుడు ఎలా బయటపడడం అన్నదాని గురించి.ఇంతలో తన కారు వెనక నుంచి ఒక యువకుడు నోటిలో వేళ్ళు పెట్టి ఈల వేసుకుంటూ వాహనాల మధ్యగా ముందుకు నడవ సాగాడు. మధ్యలో జనాన్ని ఉద్దేశించి పెద్దగా అంటున్నాడు ‘ప్లీజ్ రండి. ట్రాఫిక్ క్లియర్ చేద్దాం! అందరం అట్లా కూర్చుని ఉంటే ఇవాళంతా ఇక్కడే ఉంటాం. మనలో కొందరు వెహికల్స్ వదిలి రండి’– అలా అంటూ చంద్రకాంత్‌ను దాటుతూ, అతను ‘సార్! ప్లీజ్ రండి సార్!’ అంటూ పిలిచాడు. చంద్రకాంత్ తన డ్రైవర్ని ఆ యువకుడి సహాయానికి పంపి, తను స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. చూస్తుండగానే, తమ స్కూటర్ రోడ్డు పక్కన పార్క్ చేసి ఇద్దరు యువతులు ఆ యువకుడికి సహాయంగా ఉండడానికి వచ్చారు. యువతులను చూసి మరో ముగ్గురు ముందుకొచ్చారు. అతను విజిల్ వేస్తూ వాళ్ళకి సూచనలు ఇవ్వసాగాడు. అతణ్ణి అనుసరిస్తూ మిగిలిన వాళ్ళు ముందుగా అడ్డదిడ్డంగా ముందుకొచ్చిన ద్విచక్ర వాహనదారులకు చోటు కల్పించసాగారు. ఇంకొకళ్ళు వెళ్లి, వెనకవున్న వాళ్ళు సందు చేసుకొని ముందుకు రాకుండా ఆపసాగారు. ఆ యువకుడు తొందర పడుతున్న వాళ్ళని ఓపిక పట్టమని బతిమిలాడుతున్నాడు. ఇదంతా చూస్తున్న చంద్రకాంత్ ముచ్చటపడి తన మొబైల్ ఫోన్లో ఆ దృశ్యాన్ని చిత్రీకరించసాగాడు.ద్విచక్ర వాహనాల తర్వాత దారికి అడ్డుపడుతున్న బండ్లను నియంత్రించసాగారు. అందులో భాగంగా ముందుగా గచ్చిబౌలి వైపు వెళ్లే బండ్లను వదలసాగారు. దానికి ఆ యువకుడు చెప్పిన కారణం– ఆఫీసులకు, ఎయిర్‌పోర్టుకు, హాస్పిటల్లకు వెళ్ళవల్సిన వాళ్లు అటే వెళ్ళాలి గనక. అందుకోసం రెండోవైపు వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి, వాళ్ళని ముందుకు రాకుండా ఆపగలిగాడు అతను. అతని సమయస్ఫూర్తికి చంద్రకాంత్ సంతోషపడ్డాడు, ఎందుకంటే తను వెళ్లాల్సిన హోటల్ కూడా అటే ఉండడంతో.మరికొద్ది సేపటికి చంద్రకాంత్ కారు మెల్లగా ముందుకు సాగడానికి వీలు కలిగింది. చంద్రకాంత్ వంతెన దాటుతూ ఆ యువకుడిని దగ్గరకు పిలిచి అతను చేస్తున్న సహాయానికి ధన్యవాదాలు తెలిపి ‘మే ఐ హావ్ యువర్ నంబర్ ప్లీజ్’ అన్నాడు. అతను చంద్రకాంత్‌ను అడిగి మొబైల్ తీసుకొని ముందుకు సాగుతున్న కారుతో నడుస్తూ తన వివరాలు నింపి ఇచ్చాడు. వంతెన దాటుతూనే డ్రైవర్ రావడంతో చంద్రకాంత్ తిరిగి అతనికి స్టీరింగ్ ఇచ్చి తను వెనక సీటులోకి మారాడు. చంద్రకాంత్ మనసుకు మెల్లగా ప్రశాంతత చేకూరింది. మేఘావృతమైన ఆకాశం ఒక్కసారిగా వర్షించసాగింది.వర్షం కూడా తగ్గి వాహనాలు సాఫీగా ముందుకు సాగుతూండడంతో సంతోష్ తన మోటర్ సైకిల్ ఎక్కి టైం చూశాడు. అప్పటికే తను గంట ఆలస్యంగా ఉన్నాడు. అక్కడి నుంచి మరో పదిహేను నిముషాలు ఇంటర్వ్యూ జరిగే ఆఫీస్ చేరడానికి, ఏ సమస్యా లేకపోతే. కానీ అలా జరగలేదు, మార్గమధ్యంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ రెండూ తన సమయాన్ని మరికొంత మింగేయడం వల్ల! ఆఫీసు చేరి కనుక్కుంటే, అప్పటికే గ్రూప్ డిస్కషన్ ప్రక్రియ ముగియడంతో తనకు అవకాశం లేదని చెప్పడంతో వెనుదిరిగాడు.ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడిన చంద్రకాంత్ హోటల్‌కి వెళ్లి, అక్కడి నుంచి ఆ ఇద్దరు వ్యక్తులను విమానాశ్రయంలో సకాలంలో దింపేవరకు కుదుటపడలేకపోయాడు. తర్వాత తిరిగి వస్తూ మొబైల్లో ట్రాఫిక్ జామ్ సమయంలో తను తీసిన వీడియో చూడసాగాడు. ఆ యువకుడు సమయానికి ముందుకు వచ్చి రద్దీని సడలించక పోయుంటే? ఆ వ్యక్తులకు ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళలేకపోతే తన గురించి, తన కంపెనీ గురించి ఎంత చెడ్డ అభిప్రాయం కలిగేది? అది ఆలోచిస్తూనే చంద్రకాంత్‌కి పరంపరగా తప్పిపోయిన ముప్పు తాలూకు సంఘటనలు తారాడినయ్! వెంటనే చంద్రకాంత్ తను తీసిన వీడియోను, వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో – ‘సాంఘిక బాధ్యత! ఆపద్బాంధవుడు’ శీర్షికతో పోస్ట్ చేశాడు. ఆ వెంటనే ఆ యువకుడి నంబర్‌కి ఫోన్ చేశాడు. ఫోన్ ఒక రింగ్ రాగానే కాల్ కట్ అయ్యింది. మళ్ళీ చేశాడు, ఈసారి రింగ్ వెళ్ళలేదు. బహుశా తీరుబడిగా లేడేమో అనుకుని, ‘వీలయితే తిరిగి కాల్ చెయ్యండి’ అని సందేశం పంపాడు.∙∙ సూర్యుడికి వీడ్కోలు చెప్పి చీకటి దుప్పటి కప్పుకుంటున్న సంధ్యలో, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే కూతురు ధనని అడిగింది భార్గవి ‘సంతోష్ వచ్చాడా? ఉన్నాడా?’‘మధ్యాహ్నం వచ్చి లంచ్ చేసి బయటకెళ్ళాడు. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయి ఇంటర్వ్యూ మిస్ అయ్యానని చెప్పాడు’ చెప్పేటప్పుడు తల్లి ముఖంలో మారుతున్న రంగులు ధన దృష్టిని దాటిపోలేదు. ‘2019లో బ్రేక్ కావాలి అని పీజీ చదవడం పక్కన పెట్టాడు. తర్వాత రెండేళ్ళు కరోనా అన్నింటినీ, అందరినీ పక్కన పడేసింది, ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు పక్కన పడేస్తున్నారు వీడిని’ అంటూ భార్గవి తన గదిలోకి విసురుగా వెళ్లి తలుపు వేసుకుంది.మరికాసేపట్లో బయటి నుంచి వచ్చిన శ్యామలరావు భార్గవి ఉన్న తమ గది మూసి ఉండడంతో కూతురు ధన గదిలోకి వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ కూర్చున్నాడు. సంతోష్ ఇంటర్వ్యూ అటెండ్ అవలేకపోయిన సంగతి వాళ్ళ మాటల్లోని ప్రధాన అంశంగా మారింది కాసేపటికి. ‘వీడు మెయిన్ రోడ్లో వెళ్లి ఉన్నా బాగుండేది. షార్ట్ కట్ అంటూ అటుపోయి ట్రాఫిక్ జామ్ వల్ల అసలుకే మోసం తెచ్చుకున్నాడు. నేను వాడిని పల్లెత్తు మాట అననని భార్గవికి ముందే కోపం. ఇవాళ జరిగిన దానికి వాడినెలా సమర్థించగలను?’ నిట్టూర్చాడు శ్యామలరావు.‘మీరెందుకు మధ్యలో మాట్లాడడం? వాడే చెప్పుకుంటాడు అమ్మకు’ ధన తండ్రికి ఉపశమనం కలిగించే సలహా ఇచ్చింది.ఇంట్లో ఏర్పడుతున్న అసౌకర్య సందర్భాలు ఎలా, ఎంత త్వరగా ముగుస్తాయా అని శ్యామలరావు ఆలోచించసాగాడు. మొబైల్లో ఏదో సందేశం వచ్చిన శబ్దం రావడంతో తెరిచి చూశాడు శ్యామలరావు. తమ పరివారం గ్రూప్‌లో సంతోష్ పెట్టిన సందేశం– ‘నాకు ఉద్యోగం వచ్చిందోచ్! వివరాలు ఇంటికొచ్చాక!’ధన, భార్గవి కూడా ఆ సందేశం చూశారు. భార్గవి గదిలో నుంచి బయటకు వస్తూ,‘వీడు ఇంటర్వ్యూకే వెళ్ళలేదు, ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది?’ అంటూ ధన, శ్యామలరావు ఉన్న గదిలోకి వచ్చింది.‘విందాం వాడి నోటి నుండే’ అంది ధన.మరో పావుగంట తర్వాత చేతిలో ఐస్‌క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్‌తో ఇంటికి వచ్చిన సంతోష్ దాన్ని భార్గవి చేతికిస్తూ్త, ‘అమ్మా! నీకు ఇష్టమైన ఫ్లేవర్. నీ కోరిక తీరినందుకు’ అన్నాడు.‘ఎక్కడ ఉద్యోగం? ఏ కంపెనీ?’ అడిగింది ధన.‘అమ్మా వాళ్ళ ఫ్రెండ్ కొడుకు రవీంద్ర వాళ్ళ కంపెనీలోనే’ సంతోష్ సమాధానం.‘ఇంటర్వ్యూ మిస్ అయ్యావుగా? ఆసక్తిగా ప్రశ్నించాడు శ్యామలరావు. భార్గవి మాత్రం పెదవి విప్పక – నేను వినడానికే ఉన్నాను – అన్నట్లు నిలబడి ఉంది.సంతోష్ చెప్పిన వివరం– నాకు మధ్యాహ్నం ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక కాల్ వచ్చింది. నేను తీయలేదు. తర్వాత నేనే చేశాను. అది మీ ఫ్రెండ్ కొడుకు రవీంద్ర వాళ్ళ సీఈవో నంబర్. ఇంటర్వ్యూకి ఎందుకు రాలేదు అని అడిగారు. ట్రాఫిక్ జామ్ గురించీ, తర్వాత వచ్చిన వర్షం గురించి చెప్పాను. ‘దగ్గర్లో ఉన్న కాఫీ షాప్‌కి వస్తే అక్కడ ఇంటర్వ్యూ చేస్తాను రాగలరా? ఇది మీకు మరో అవకాశం, మీరు ట్రాఫిక్ జామ్‌లో ఉండిపోయారు గనక, అందులో మీ తప్పు ఏమీ లేదని నేను నమ్మడం వలన!‘ అన్నాడు ఆయన. ఎగిరి గంతేసి సరే అన్నాను. సాయంత్రం ఆరు గంటలకు మీటింగ్ నిర్ణయించారు. నేను ఐదు నిమిషాల ముందే వెళ్లి ఒక పక్కన వేచి వున్నాను. మరో రెండు నిముషాలకి సూట్ వేసుకున్న ఒకాయన నా దగ్గరకు వచ్చి, చెయ్యి కలిపి నన్ను పేరుపెట్టి పిలుస్తూ రవీంద్ర వాళ్ళ కంపెనీ సీఈవోగా పరిచయం చేసుకున్నాడు. ఎక్కడో చూసినట్లు అంపించినా గుర్తురాక, ‘నా పేరు మీకెలా తెలుసు?’ అన్నాను ఆశ్చర్యంగా.‘మీ అప్లికేషన్లో ఉందిగా’ అంటూ కోటు జేబులోంచి నా అప్లికేషన్ తీసి చూపిస్తూ, ఒక టేబుల్ వైపు నడిచాడు. ఆయన వెనకాలే నేను వెళ్లి కూర్చున్నాను. ఆయన చెప్పాడు, ‘పొద్దున అదే ట్రాఫిక్ జామ్‌లో నేను కూడా ఇరుక్కుపోయా! చాలా అర్జెంట్ పనిమీద వెళుతున్నాను. ఆ రద్దీలో దేవుడు పంపినట్టు సమయానికి మీరు వచ్చి చొరవ తీసుకొని ట్రాఫిక్‌ను నియంత్రించి ఉండకపోతే, నా కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం నేను చేసే ప్రయత్నంలో ఫెయిల్ అయి ఉండేవాడిని. మీ సాంఘిక బాధ్యతా ప్రవృత్తి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా పేరు చంద్రకాంత్. మీ నంబర్ నా ఫోన్లో మీరే ఫీడ్ చేశారు. అప్పుడు సూట్లో లేను. అందుకేనేమో ఇప్పుడు గుర్తుపట్టలేక పోయారు. సంతోష్, మిమ్మల్ని మా కంపెనీలో సామాజిక బాధ్యతా విభాగానికి అధిపతిగా నియమిస్తున్నా! మీకు ఇష్టమైతే రేపే జాయిన్ అవ్వచ్చు. ఇంకొక మాట, నేను షూట్ చేసి పోస్ట్ చేసిన మీ ట్రాఫిక్ కంట్రోల్ ఇనీషియేటివ్ వీడియో వైరల్ అయ్యింది. వేలలో లైక్స్ వచ్చాయి. మిమ్మల్ని మా ఉద్యోగిగా చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది’.చెప్పడం ముగించిన సంతోష్‌ని శ్యామలరావు, భార్గవి, ధన ముగ్గురూ చుట్టేసి ఆ సమయాన్ని ఒక ఫొటోగా ఘనీభవించారు!
ఫొటోలు


డాక్టర్ బాబు ఇంట్లో వేడుక.. కొడుక్కి మంగళస్నానం (ఫొటోలు)


అనారోగ్యం నుంచి కోలుకున్న యాంకర్ రష్మీ.. అప్పుడే బాలీ దీవుల్లో చిల్! (ఫొటోలు)


హీరో సూర్య ‘రెట్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


బుల్లితెర డాక్టర్‌బాబు నిరుపమ్ ఇంట్లో శుభకార్యం.. గ్రాండ్‌గా కుమారుడి ధోతి వేడుక (ఫొటోలు)


Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 27-మే 04)


20 ఏళ్ల తర్వాత కలిసి డ్యాన్స్.. కొరియోగ్రాఫర్ ఆనందం (ఫొటోలు)


డైమండ్ నగలు, రాయల్ బ్లూ కలర్ డ్రెస్‌లో రాయల్‌గా సమంత లుక్ (ఫొటోలు)


'కోర్ట్' జ్ఞాపకాలు.. మర్చిపోలేకపోతున్న జాబిలి (ఫొటోలు)


పట్టు చీరలో పుత్తడిబొమ్మలా మెరిసిపోతున్న అనసూయ (ఫొటోలు)


కన్నీటి సుడుల నడమ.. బాధాతృప్త హృదయాలతో వీడుతూ. సరిహద్దులో భావోద్వేగ దృశ్యాలు (చిత్రాలు)
అంతర్జాతీయం

అంతా భారత్ ఇష్టమేనా?.. దేనికైనా రెడీ.. పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు అంటూ కామెంట్స్ చేశారు.జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ పౌరులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని, నదుల విషయంలో కూడా నీటిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీష్ స్పందించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ ఇటీవల భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై షరీఫ్ పరోక్షంగా స్పందించారు.Prime Minister Shehbaz Sharif has offered India cooperation in an impartial investigation of the Pahalgam incident, stating that there will be no compromise on Pakistan's security and dignity.#ShehbazSharif #Pakistan #India #Pahalgam #PakistanArmy #TOKReports pic.twitter.com/5vh6y1O63T— Times of Karachi (@TOKCityOfLights) April 26, 2025ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడుతూ..‘మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోం. ఎలాంటి ముప్పును ఎదుర్కోడానికైనా సంసిద్ధంగా ఉన్నాం. పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యం. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశం కరెక్ట్ కాదు. భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. ఈ చర్యతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అంటూ భారత్‌ను నిందించే ప్రయత్నం చేశారు. చివరగా.. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ చెప్పుకొచ్చారు. పహల్గాం దాడి (Pahalgam)పై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు.Pakistan's PM Shehbaz Sharif says the country’s armed forces are "prepared to defend the country’s sovereignty" after Delhi accused Islamabad of being linked to the attack on tourists in Kashmir. #RUKIGAFMUpdates pic.twitter.com/qtJic92uZU— Rukiga F.M (@rukigafm) April 26, 2025

పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. పది మంది సైనికులు మృతి
ఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది. బెలుచిస్తాన్లో పాక్ ఆర్మీపై దాడి జరిగింది. పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(Baloch Liberation Army-BLA)దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌కు చెందిన బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం. ఆర్మీ కాన్వాయ్‌లోని ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది. కాగా, ఇది బెలూచ్ విప్లవకారుల తాజా యుద్ధ ప్రకటనగా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీఎల్ఏ స్వయంగా విడుదల చేసింది. ఈ వీడియోలో పేలుళ్లు, కాల్పుల శబ్దాలు, నాశనమైన పాక్ ఆర్మీ వాహనాలు కనిపిస్తున్నాయి.🚨 The Baloch Liberation Army (BLA) has taken responsibility for an improvised explosive device (IED) attack on a Pakistani Army convoy in Margat, near Quetta, on April 25, 2025. According to BLA spokesperson Jeeyand Baloch, the attack was carried out using a remote-controlled… pic.twitter.com/9SmHRfTcyr— The Tradesman (@The_Tradesman1) April 26, 2025ఇక, ఈ దాడితో పాటు బీఎల్ఏ మరోసారి పాకిస్తాన్ ఆర్మీకి భారీ హెచ్చరిక జారీ చేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. పాక్ ఆర్మీకి ఇకపై భద్రత ఉండదు. మేం మా హక్కుల కోసం చివరి వరకు పోరాడతాం.. అంటూ వారు ప్రకటించారు. అయితే, పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ఘటన తర్వాత సైనిక వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బెలూచిస్థాన్లో భద్రతా వ్యవస్థ మరింత కఠినంగా అమలు చేయబోతున్నట్టు సమాచారం.Always a big fan of video editing skills of Baloch Liberation Army 😉https://t.co/LFu7OiouoD— Kriti Singh (@kritiitweets) April 25, 2025ఇదిలా ఉండగా.. ఎన్నో దశాబ్దాలుగా స్వతంత్ర బెలూచిస్థాన్ కోసం బీఎల్ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం తమ హక్కులు దూరం చేస్తున్నదని ఆరోపిస్తూ వరుస దాడులకు పాల్పడుతోంది. గత కొన్ని నెలలుగా BLA కార్యకలాపాలు మరింత ఉధృతంగా మారాయి. ఈ దాడి తర్వాత పాక్‌లో పరిస్థితి అత్యంత అస్థిరంగా మారింది. తాజా దాడి నేపథ్యంలో ప్రజల్లో భయం, భద్రతా వర్గాల్లో ఆందోళన నెలకొంది.10 🐖 s gone! Well done Baloch Liberation Army #Pakistan #PahalgamTerroristAttack #TerrorAttack #Baloch #Kashmir pic.twitter.com/ZavhIoEBjx— Adri chatterjee (@stay_fit_mate) April 26, 2025

ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు విదేశీ విద్యార్థుల బహిష్కరణపై ట్రంప్ వెనక్కి తగ్గారు. తమ వీసాలు రద్దు చేయడంతో విదేశీ విద్యార్థులు అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో, విద్యార్థులకు అనుకూలంగా తీర్పులు రావడంతో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.వివరాల ప్రకారం.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు ఊరట లభించింది. అయితే, అమెరికాలో విదేశీ విద్యార్థులపై ట్రంప్ బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా (Student Visa) లేదా వారి చట్టబద్ధ హోదాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమ వీసాల రద్దుపై విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.అనంతరం.. కాలిఫోర్నియా, బోస్టన్ కోర్టుల్లో విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ఆయా న్యాయస్థానాలు.. విద్యార్థుల వీసా రద్దును ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రంప్ యంత్రాంగం చర్యలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్.. ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరించింది. ఈమేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ న్యాయవాది తాజాగా వెల్లడించారు. దీంతో ఆయా విద్యార్థులకు చట్టబద్ధ హోదా లభిస్తుందన్నారు.ఇదిలా ఉండగా.. విదేశీ విద్యార్థులపై బహిష్కరణ వేటు కారణంగా డిపోర్టేషన్, నిర్బంధం ముప్పు పొంచి ఉండటంతో ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికే అమెరికాను వీడగా.. కొందరు రహస్య ప్రదేశాల్లో తల దాచుకున్నారు. తాజాగా కోర్టు వ్యాఖ్యలతో ట్రంప్ (Donald Trump) సర్కారు వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బాధాతప్త హృదయాలతో వీడ్కోలు.. పాక్ సరిహద్దులో భావోద్వేగ దృశ్యాలు
న్యూఢిల్లీ: పహల్గాం దాడికి పాల్పడింది ఉగ్రవాదులు. ఆ దాడికి మాకు ఏంసంబంధం అండి? ప్రాణాలు రక్షించుకునేందుకు చికిత్స కోసం వచ్చిన మేం. పాక్ వైపు తరలి పోతున్నాం. ఇంతకాలం మాకు స్థానికులు ఇచ్చే అతిథ్యం మా జీవితాల్లో మరిచిపోలేం. కానీ, గత రెండు రోజులుగా వాళ్లు మాతో సరిగ్గా వ్యవరించడంలేదు’’ అని కొందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ‘‘ దాడికి పాల్పడింది ఉగ్రవాదులు. శిక్షించాల్సింది వాళ్లనే. కానీ, ఏం తప్పు చేయని మమ్మల్ని ఎందుకు శిక్షిచడం? అని పాక్ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్‌లో పుట్టడమే మేం చేసిన నేరమా? అంటూ పలువురు భావోద్వేగంగా మాట్లాడుతున్నారు. దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతి చర్చలకు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు. పాక్ నుంచి ప్రతీ నెలా వందల మంది చికిత్స కోసం భారత్‌కు ప్రత్యేక వీసా మీద వస్తుంటారు. ఇందులో వివిధ రకాల జబ్బులు, అనారోగ్య కారణాలతో వచ్చేవాళ్లే ఎక్కువ. మరీ ముఖ్యంగా పసిపిల్లల చికిత్స కోసం భారత్ ఎక్కువ వీసాలు మంజూరు చేస్తుంటుంది.ఇప్పటికే పాక్ పౌరులు భారత్‌ను విడిచిపెట్టిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంకు ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వీలైనంత త్వరగా వాళ్లను గుర్తించి వెనక్కి పంపించేయాలని ఆదేశించారు.ఇదిలా ఉంటే.. పాక్ భారత్‌ల మధ్య ఉద్రికత్తలను తగ్గించడానికి.. దౌత్యానికి తాము సిద్ధమంటూ ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో.. ఐక్యరాజ్య సమితి కూడా సమయమనం పాటించాలని ఇరు దేశాలకు పిలుపు ఇచ్చింది.
జాతీయం

పహల్గాం ఉగ్రదాడికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు.. 19 మంది అరెస్ట్
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి సానుభూతి పరుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా,పహల్గాం ఉగ్రదాడిపై నోరుపారేసుకున్న సుమారు 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ 19మంది అస్సాం,మేఘాలయా,త్రిపురకు చెందిన వారేనని పోలీసులు వెల్లడించారు.పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్రం సోషల్ మీడియాపై దృష్టిసారించింది. పహల్గాం ఉగ్రదాడికి మద్దుతు పలికేలా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది.ఈ తరుణంలో పహల్గాం దాడికి మద్దతు పలికేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ స్లోగన్‌ను వినిపించిన అస్సాం, మేఘాలయా, త్రిపురకు చెందిన మొత్తం 19మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 19 మందిలో 14 మంది అస్సాంకు చెందిన వారేనని పోలీసులు గుర్తించారు. Assam | A woman named Dadhichi Dimple alias Dimple Baruah from Golaghat district of Assam was detained by the Crime Branch from Guwahati for making controversial and anti-national comments on the #PahalgamTerrorAttack.At least 19 people have been arrested in Assam, Meghalaya,… pic.twitter.com/MgJp6TehmC— OTV (@otvnews) April 27, 2025వారిపై కఠిన చర్యలు తప్పవ్అయితే, ఈ అరెస్టులు,సోషల్ మీడియా పోస్టులపై అస్సాం సీఎం హేమంత్ బిశ్వశర్మ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. పహల్గాం ఉగ్రదాడి లేదంటే దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అవసరమైతే, వారిపై జాతీయ భద్రతా చట్టంలోని నిబంధనలను విధిస్తామన్నారు. భారత్,పాకిస్తాన్ మధ్య ఎటువంటి సారూప్యతలు లేవు. రెండు దేశాలు శత్రు దేశాలు. మనం అలాగే ఉండాలి’ అని సీఎం హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు.

ED: ఈడీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం
ముంబై: దక్షిణ ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాలార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) కార్యాలయం ఖైసర్ ఏ హిందు భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.ఈ భారీ అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది 12 ఫైరింజన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశాయి. ఆదివారం తెల్లవారు జామన ఈడీ ఆఫీస్‌లో ప్రమాదం జరగడంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. #WATCH | Maharashtra | Firefighting continues at Kaiser-I-Hind building, which houses Mumbai's ED office in Ballard Pier.The fire broke out at around 2:30 am. 12 fire engines rushed to the spot. The cause of the fire is not clear yet: Mumbai Fire Department pic.twitter.com/YtT8QaITM8— ANI (@ANI) April 27, 2025పీటీఐ కథనం ప్రకారం.. కారింభోయ్ రోడ్డుపై ఉన్న గ్రాండ్ హోటల్ సమీపంలోని కైసర్ ఐ హింద్ అనే భవనంలో ఆదివారం ఉదయం 2:31 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు ఫైర్ బ్రిగేడ్‌కు సమాచారం అందింది.అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ బ్రిగేడ్ బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నాయి. మొదట మామూలు మంటగా కనిపించినా, ఉదయం 3:30 గంటల సమయంలో మంటలు తీవ్రంగా మారడంతో దాన్ని లెవల్-2 (భారీ అగ్ని ప్రమాదం) గుర్తించారు. ఇక ఈ భవనంలోని నాలుగు,ఐదు అంతస్తులలో అగ్ని ప్రమాదం జరిగినట్లు మున్సిపల్ అధికారి తెలిపారు. ఘటన స్థలానికి 12 ఫైరింజన్లు, ఆరు జంబో వాటర్ ట్యాంకర్లు, ఒక ఎరియల్ వాటర్ టవర్ టెండర్, ఒక బ్రెతింగ్ అపారాటస్ వాన్, రెస్క్యూ వాన్, క్విక్ రెస్పాన్స్ వాహనం, అలాగే అంబులెన్స్ సైతం అందుబాటులో ఉంచారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

మరో ఉగ్రవాది ఇంటిని బాంబు పెట్టి లేపేశారు
జమ్మూ: పహల్గాం ఉగ్ర దాడితో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదల ఏరివేతే లక్ష్యంగా కార్యకలాపాల్ని ముమ్మరం చేస్తోంది ఇందులో భాగంగా అనుమానిత ఉగ్రవాదుల స్థావరాల్ని గుర్తించి, బాంబులతో నేలమట్టం చేస్తోంది. శనివారం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ తడ్వా ఇంటిని భద్రతా బలగాలు బాంబులతో ధ్వంసం చేశాయి. గత మంగళవారం (ఏప్రిల్22న) పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడికి పాల్పడ్డ ముష్కరులు, వారి మద్దతు దారుల్ని గుర్తించే పనిలో పడ్డాయి భారత భద్రతా బలగాలు. పనిలో పనిగా ఉగ్రవాదుల ఇళ్లను, స్థావరాల్ని గుర్తిస్తున్నాయి. ఈ తరుణంలో 48 గంటల నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న కీలక ఆపరేషన్‌లో భారత భద్రతా బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురు ఉగ్రవాదులు, వారికి ఆశ్రయం కల్పించిన వారి స్థావరాల్ని గుర్తించాయి. #BREAKING: House of Lashkar-e-Taiba terrorist Farooq Ahmed Tadwa destroyed. Tadwa a resident of Narikoot Kalaroos, Kupwara (North Kashmir) is, now in Pakistan and works with the Pakistan Army to target innocent civilians in Kashmir. pic.twitter.com/O5v4Xnrio5— Tejinder Singh Sodhi (@TejinderSsodhi) April 26, 2025 పీవోకేలో ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ తడ్వాశనివారం సముద్రమట్టానికి 5,300 మీటర్ల ఎత్తులో ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతమైన కుప్వారా జిల్లా కలరూస్ ప్రాంతాన్ని భద్రతాబలగాలు జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ తడ్వా ఇంటిని గుర్తించాయి. బాంబులతో ధ్వంసం చేశాయి. 60 ప్రాంతాల్లో దాడులు అటూ శ్రీనగర్‌లోనూ ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం శ్రీనగర్‌లో ఏకకాలంలో 60కి పైగా ప్రాంతాల్లో జమ్మూకశ్మీర్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు జమ్మూకశ్మీర్ పోలీస్ విభాగ అధికార ప్రతినిధులు వెల్లడించారు. తాము జరిపిన దాడుల్లో వెపన్స్ సీజ్ చేయడం,కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం, డిజిటల్ డివైజ్‌ల గుర్తింపు, దేశ భద్రతకు విఘూతం కలిగించేందుకు వినియోగించే వస్తువుల్ని, వాటి ఆధారాల్ని సేకరించినట్లు చెప్పారు. అలాంటి వారిని ఉపేక్షించబోంఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ పోలీసులు ఉగ్రవాదానికి మద్దతిచ్చే అన్నీ వ్యవస్థల్ని గుర్తించి వాటిని నిర్విర్యం చేస్తున్నాం. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వారికి, దేశ భద్రతకు విఘూతం కలిగించే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించారు.

సుఖనిద్రకు ‘స్లీప్ డైవోర్స్’.. భారతీయ భార్యాభర్తలపై సర్వే ఇలా..
సాక్షి, స్పెషల్ డెస్క్: ‘‘నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే / అండనే బంటు నిద్ర అదియునొకటే..’ అని రాశారు అన్నమయ్య. రాజు పోయే నిద్ర, బంటు పోయే నిద్ర... రెండూ ఒక్కటే , నిద్రలో తేడాలు ఉండవు అని అర్థం. రాజు, బంటు వేర్వేరుగా ఎవరి నిద్రలో వారు ఉంటారు కనుక తేడాలు ఉండకపోవచ్చు కానీ, ఒకే పరుపుపై పవళించే భార్యా భర్తల నిద్రల్లో మాత్రం తేడాలు ఉంటాయి. ఇద్దరిలో ఒకరు గురక పెడుతుంటే రెండో వారి నిద్ర పాడవుతుంది. ఏసీ ఎక్కువ తక్కువలు ఇద్దరిలో ఒకరి నిద్రను కబళిస్తాయి. ఫ్యాను స్పీడు, పరుపు గట్టితనం ఇద్దరికీ ఒకే రకంగా అనుకూలంగా లేకుంటే ఇద్దరిలో ఒకరికి నిద్ర కరువవుతుంది. ఇద్దరిలో ఒకరు తెల్లవార్లూ నిద్రలో భంగిమలు మారుస్తుంటే రెండో వారికి కలత నిద్రే మిగులుతుంది.నయా ట్రెండ్... స్లీప్ డైవోర్స్‘‘ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరగదు’’ అనే మాట... కలిసి పడుకునే భార్యాభర్తల విషయంలో మాత్రం నిజం కాదు. నిద్ర పోవటానికి అన్నీ సౌఖ్యంగా ఉన్నప్పటికీ.. ఒకరి సౌఖ్యం ఇంకొకరికి అసౌకర్యం కావచ్చు. నిద్ర సుఖమెరగదు అనే మాట అర్థం లేనిదవచ్చు. అప్పుడిక ఎవరికి వారుగా, వేర్వేరు పడకలపై నిద్రించటమే.. సుఖనిద్రకు మార్గం. ఇలా వేర్వేరుగా పడుకోవటాన్నే ‘స్లీప్ డైవోర్స్’ అంటున్నారు!కాపురాలను నిలబెడుతుందిభారతీయ దంపతులలో 78 శాతం మంది ‘స్లీప్ డైవోర్స్’కు మొగ్గు చూపుతున్నారని ‘రెస్‌మెడ్’ గ్లోబల్ స్లీప్ తాజా సర్వే వెల్లడించింది. ఆ సర్వే ప్రకారం ప్రపంచంలోనే ఇది అత్యధిక శాతం. తర్వాతి రెండు స్థానాల్లో చైనా (67 శాతం), దక్షిణ కొరియా (65 శాతం) ఉన్నాయి. నిద్రలో గురకపెడుతున్న జీవిత భాగస్వామి నుండి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయిస్తున్న వారికి సైతం, మొదట ఈ ‘స్లీప్ డైవోర్స్’ను సూచించి కాపురాలను నిలబెడుతున్నారు లైఫ్ కోచ్‌లు, సైకో థెరపిస్టులు, ఆధునిక కౌన్సెలర్లు. అంటే.. విడాకులను నివారించటం కోసం ‘నిద్ర విడాకులి్న’ తీసుకోవటం! బాగుంది కదా. కళకళలాడుతూ నిద్ర లేస్తారునిద్ర ఎంత పెద్ద సమస్యో నిద్రాభంగాన్ని అనుభవించేవారికి గానీ తెలియదు. నిద్రలేమి అలసటను కలిగిస్తుంది. క్రమంగా నిరాశ, నిస్పృహల్లోకి నెట్టేస్తుంది. చివరికి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దంపతుల మధ్య సాన్నిహిత్యం కూడా తగ్గుముఖం పడుతుంది. అందుకే నిద్రకు ముఖం వాచిన దంపతుల కంటే, కంటి నిండా నిద్రపోయే దంపతులు కళకళలాడుతూ ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. కలిసి ఉండేందుకే విడిపోవటంఎంత భార్యాభర్తలైనా, ఏ ఇద్దరు మనుషుల శరీర స్వభావాలు, వారి సమయా సమయాలు ఒకటి కాదు కనుక... ఒకే మంచంపై ఇబ్బందిగా, ఇరుకుగా అనిపించినప్పుడు వేర్వేరు గదుల్లో, లేదా వేర్వేరు పడకలపై నిద్రించటమే మంచిదని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. స్లీప్ డైవోర్స్ నిద్ర నాణ్యతను మెరుగు పరుస్తుంది. నిద్రకు అంతరాయాలను తొలగిస్తుంది. మనసుకు, మెదడుకు ప్రశాంతనిస్తుంది. ఎవరికి కావలసి విధంగా వారు గది వాతావరణాన్ని, గదిలోని వెలుతురును అమర్చుకోవటం వల్ల తేలిగ్గా నిద్రపట్టి, దీర్ఘనిద్రలోకి జారి, శరీరానికి సత్తువ లభిస్తుంది.చిన్న చిన్న సమస్యలూ ఉన్నాయి!స్లీప్ డైవోర్స్‌తో చక్కగా నిద్ర పట్టి రీచార్జ్ అవుతున్నప్పటికీ, ఇలా వేరుగా పడుకోవటం అన్నది మానసికమైన ఎడబాటుకు దారి తీసే ప్రమాదం లేకపోలేదని మనో వైజ్ఞానిక నిపుణులు అంటున్నారు. పిల్లలు ఉన్న దంపతులకు ఇంకో సమస్య ఎదురౌతుంది. తల్లిదండ్రులు నిద్ర కోసం విడి విడిగా పడుకుంటున్నారని వారు అనుకోరు. ఒకరంటే ఒకరికి ఇష్టం లేదా ఏంటి అని ఊహించుకుంటారు! ఏకాంతంగా ఉండేందుకు దొరికే ఆ కొద్ది గంటల్లో భార్యభర్తలు తమ నిద్రకోసం ఒకరికొకరు దూరంగా ఉండటం వల్ల వారి మధ్య సంభాషణ కూడా తగ్గిపోతుంది. తద్వారా ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన దాంపత్య అనుబంధానికి అవరోధం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా కాస్త జాగ్రత్త పడితే చాలు. ఏమైనా, నిద్రలేమి ముందు మిగతావన్నీ చిన్న విషయాలు కనుక నిరభ్యంతరంగా ‘స్లీప్ డైవోర్స్’ను పాటించవచ్చనీ, పాటిస్తూనే ఒకరి అవసరాలను ఒకరు కనిపెట్టుకుంటూ కుటుంబ జీవనాన్ని సాఫీగా కొనసాగింవచ్చునని థెరపిస్టులు అభయం ఇస్తున్నారు.
ఎన్ఆర్ఐ

New York Plane Crash : భారతీయ సంతతి వైద్యురాలి కుటుంబం దుర్మరణం
న్యూయార్క్ (New York)లో శనివారం కుప్పకూలిన విమాన ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వారాంతపు సెలవుల్లో, పుట్టిన రోజు వేడుకలను ఆనందంగా జరుపుకునేందుకు వెళుతున్న న్యూయార్క్‌లోని ఒక ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.కొలంబియా కౌంటీ అండర్షెరీఫ్ జాక్వెలిన్ సాల్వటోర్ ఈ విషయాన్ని ధృవీకరించారు.కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ట్విన్ ఇంజిన్ (MU-2B)విమానం ఒక పొలంలో కుప్పకూలింది. కొలంబియా కౌంటీ అండర్షెరీఫ్ జాక్వెలిన్ సాల్వటోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. మిత్సిబిషి ఎమ్‌యూ-2బీ విమానం కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి బయలుదేరింది. వాతారవణ అననుకూల పరిస్థితుల కారణంగా కోపాకేకు 30 మైళ్ల దూరంలో ఉండగానే ఒక పొలంలో కుప్పకూలింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు, పైలట్ కొలంబియా కౌంటీ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను రేడియో ద్వారా తాను ప్రమాదంలో ఉన్నట్టు, కొత్త విధానాన్ని అభ్యర్థించారని కూడా జాతీయ రవాణా భద్రతా బోర్డు అధికారులు ఆదివారం జరిగిన బ్రీఫింగ్లో తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు పరిశీలిస్తున్నారు. బాధితులు వివరాలుభారతదేశానికి చెందిన యూరోజినెకాలజిస్ట్ డాక్టర్ జాయ్ సైని, ఆమె భర్త, కొడుకు, కోడలు, కుమార్తె అల్లుడు ఉన్నారు. సైనీ భర్త న్యూరో సైంటిస్ట్, డాక్టర్ మైఖేల్ గ్రాఫ్, కుమార్తె, 2022లో NCAA ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన మాజీ MIT సాకర్ క్రీడాకారిణి కరెన్నా గ్రాఫ్ ఆమె భర్త, ఇంకా సైనీ కుమారుడు జారెడ్ గ్రాఫ్, పారాలీగల్గా పనిచేసిన ,జారెడ్ గ్రాఫ్ భాగస్వామి అలెక్సియా కౌయుటాస్ డువార్టే ఉన్నారు.డా. జాయ్ సైని ఎవరంటే..!మిడ్ హడ్సన్ న్యూస్ ప్రకారం డాక్టర్ జాయ్ సైని భారతదేశంలోని పంజాబ్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు కుల్జిత్ , గుర్దేవ్ సింగ్‌లతో అమెరికాకు వలస వెళ్లారు. డా. సైనీ నిష్ణాతులైన పెల్విక్ సర్జన్‌గా పేరొందారు. అలాగే బోస్టన్ పెల్విక్ హెల్త్ అండ్ వెల్నెస్ వ్యవస్థాపకురాలు కూడా.పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదువుతుండగా, మైఖేల్ గ్రాఫ్‌ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. మైఖేల్ ప్రముఖ న్యూరో సర్జన్, అనుభవజ్ఞుడైన పైలట్ కూడా. ఈ దుర్వార్తతో సైనీ మరో కుమార్తె అనికా గ్రాఫ్, మైఖేల్ తల్లిదండ్రులు స్టీఫెన్, గెబెనా గ్రాఫ్; జాయ్ తల్లి కుల్జిత్;,తోబుట్టువులు రిన్నే గ్రాఫ్, య్రామ్ గ్రాఫ్, , ప్రశాంత్ సైని తీరని విషాదంలో మునిగిపోయారు.

పిట్స్‌బర్గ్‌లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్‌కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్‌కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్‌లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్‌ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్‌లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు)
క్రైమ్

ఆస్తి కోసం.. కన్న కొడుకే కాలయముడై..!
పూసపాటిరేగ( విజయనగరం జిల్లా): కడుపున పుట్టిన కొడుకే ఆస్తికోసం తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో గుద్దించి హతమార్చిన ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాండ్రింకి అప్పలనాయుడు (55), పాండ్రింకి జయమ్మ (53)కు రాజశేఖర్, రాధ ఇద్దరు పిల్లలు. కుమార్తె రాధను ఆనందపురం మండలం నేలతేరుకు చెందిన వ్యక్తితో వివాహం చేశారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలం తరువాత ఆమె మృతిచెందింది. తమకు ఉన్న 80 సెంట్లు పొలంలో వివాహ సమయంలో 20 సెంట్లు భూమిని రాధ పేరిట తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై కుమారుడు రాజశేఖర్ తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు. భూమి విషయమై వారితో కొంత కాలంగా గొడవపడుతున్నాడు. తల్లిదండ్రుల నుంచి విడిపోయి తన భార్య, కుమార్తెతో కలిసి వేరుగా నివసిస్తున్నాడు. సొంతంగా ట్రాక్టర్ నడుపుతున్నాడు. వ్యసనపరుడు కావడంతో అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోని నడుపూరి కల్లాల వద్ద రాధకు ఇచ్చిన భూమిని విక్రయించేందుకు సిద్ధపడ్డాడు. ఇందులో భాగంగా జేసీబీ, ట్రాక్టర్ సాయంతో చదునుచేసే పనులను సాయంత్రం చేపట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లి కుమారుడిని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారిపై ఆగ్రహంతో ఊగిపోతూ ట్రాక్టర్‌తో ఢీకొట్టి హతమార్చాడు. వారు మృతి చెందినట్టు నిర్ధారణ అయ్యాక అక్కడ నుంచి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు.

కొడుకులారా.. కొరివైనా పెట్టరా?
మానకొండూర్(కరీంనగర్ జిల్లా): కొడుకులు పుట్టారని సంబరపడితే.. కొరివి పెట్టకుండా కొట్టుకుంటున్నారు. కని, పెంచి, ప్రయోజకులను చేస్తే అనాథ శవంగా అంత్యక్రియలు జరపకుండా శవజాగరణ చేయించారు. దీంతో వృద్ధుడి మృతదేహం మూడ్రోజులు జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉండగా.. శనివారం పోలీసులు, గ్రామస్తుల జోక్యంతో అంత్యక్రియలు పూర్తిచేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వన్నారం గ్రామానికి చెందిన జంగిలి కొమురయ్య (74), రాజకొమురవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు జంగిలి ఓదెలు, జంగిలి రవి, ఇద్దరు కూతుళ్లు సంతానం. రాజకొమురవ్వ కొంతకాలం కిందటే చనిపోయింది. ఓదెలు, రవి మధ్య చాలా రోజులుగా భూ తగాదాలు జరుగుతున్నాయి. ఈనెల 24న ఇంటి వద్ద జంగిలి కొమురయ్య చనిపోయాడు. అంత్యక్రియలు నిర్వహించాల్సిన కొడుకులిద్దరూ.. తన తండ్రి మృతిపై అనుమానం ఉందని, ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులు మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. శనివారం బ్లూకోల్ట్స్ సిబ్బంది వెంకట్రామయ్య ఫిర్యాదుతో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద కొడుకు తలకొరివి పెట్టాడు. కొమురయ్యది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మానకొండూర్ సీఐ బి.సంజీవ్ తెలిపారు.

బంజారాహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
బంజారాహిల్స్(హైదరాబాద్): నైజీరియా నుంచి డ్రగ్స్‌ను కొనుగోలుచేస్తూ గోవాతో పాటు ముంబయ్, హైదరాబాద్‌లలో విక్రయిస్తున్న అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్‌తో పాటు సహకరించిన మరో వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. గోవాకు చెందిన లివియో జోసఫ్ అల్మిడా అలియాస్ ప్యూషా (41) గోవాకు తరచూ పర్యాటకులుగా వచ్చే నైజీరియన్లతో ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. డ్రగ్స్ విక్రయాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించవచ్చని, నైజీరియా నుంచి తాము దిగుమతి చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా నైజీరియా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకుంటూ విక్రయిస్తున్న జోసఫ్ కదలికలపై నగర పోలీసులు దృష్టిసారించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని కమలాపురికాలనీ ప్రాంతంలో జోసఫ్ ఓ వ్యక్తికి కొకైన్ విక్రయిస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన నుంచి 11 గ్రాములు ఎండీఎంఏ, 10 గ్రాముల కొకైన్, రూ.1.97 లక్షల నగదు, ఒక బైక్, మూడు సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. గోవా నుంచి మూడు రోజుల క్రితం జోసఫ్ హైదరాబాద్‌కు రాగా ఇక్కడ ఓ వ్యక్తి ఆశ్రయమిస్తున్నట్లుగా గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని ఇందిరానగర్‌లో నివసించే ఉబలంక శంకర్ (48) అనే వ్యక్తి షెల్టర్ ఇవ్వడమే కాకుండా బైక్ కూడా సమకూర్చి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు. ఆయనను కూడా బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో కూడా జోసఫ్ హైదరాబాద్‌లోనే డ్రగ్స్ విక్రయిస్తుండగా అప్పుడు కూడా వీరిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌లో పలువురికి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. నగరంలో ప్రతి నెలా రెండు సార్లు సంజయ్, లోకేష్ సతీష్‌వర్మ, అమిత్, సిద్దార్ధ, రుద్రరాజు తదితర కస్టమర్లకు విక్రయిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. హైదరాబాద్‌కు వచ్చినప్పడల్లా పాత కేసులో భాగంగా కోర్టుకు హాజరవుతూ వచ్చేటప్పుడే గోవా నుంచి డ్రగ్స్ తీసుకువస్తూ తెలిసిన కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది. గోవా నుంచి హైదరాబాద్‌కు రావడానికి బస్సులోనే వస్తుంటాడని, బస్సులో అయితే ఎలాంటి చెకింగ్లు ఉండవన్న ఉద్దేశ్యంతో తన మాజీ భార్యతో టికెట్ బుక్ చేయిస్తుంటాడని తేలింది.

భారీ అగ్ని ప్రమాదం.. 300 గుడిసెలు దగ్ధం
హయత్‌నగర్: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరులోని వివాదాస్పద స్థలంలోని గుడిసెల్లో శనివారం అగ్ని ప్రమాదం జరిగి సుమారు 300 పైగా గుడిసెలు అగ్ని ఆహుతయ్యాయి. మంటలు ఎగిసి పడుతూ విస్తరిస్తుండడంతో బాధితులు గుడిసెల నుంచి బయటికి పరుగులు తీశారు. ఐదు అగ్ని మాపక వాహనాలతో మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలా జరిగిందంటే. ? కుంట్లూరు సర్వేనెంబర్ 214 నుంచి 224 వరకు ఉన్న సుమారు 100 ఎకరాలు భూమిపై కొంత కాలంగా వివాదం కొనసాగుతుంది. ఈ భూమి తమకు చెందుతుందని ప్రైవేటు వ్యక్తులు వాదిస్తుండగా ఇది భూదాన భూమి అని సీపీఐ నాయకులు వాదిస్తున్నారు. ఈ వివాదం కోర్టులో కొనసాగుతుండగా సీపీఐ ఆధ్వర్యంలో రెండేళ్ళ క్రితం వేలాది మంది పేదలు ఇక్కడ గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. కోర్టు వివాదం ఉన్న భూమిలోని గుడిసెలలో అగ్రి ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా తగలబెట్టారా... ప్రమాద వశాత్తు జరిగిందా... అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ ప్రవీణ్‌కుమార్, సీఐ నాగరాజుగౌడ్, ట్రాఫిక్ సీఐలు శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు సందర్శించారు.ఈ ప్రమాదంపై అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. గుడిసెలు తగులబడి సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకుంటామన్నారు. నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపుతామన్నారు.
వీడియోలు


క్యాడర్ కు కేసీఆర్ ఇచ్చే ముఖ్య సందేశం ఇదే


ఆ ఒక్క నిర్ణయంతో మూడో ప్రపంచ యుద్ధం!


కూటమికి కొమ్ము కాస్తే ఇబ్బందులు తప్పవు.. అధికారులకు వైఎస్సార్ సీపీ హెచ్చరిక


Watch Live: ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ..


ఇన్ స్టాల్మెంట్ లో తల్లికి వందనం.. బాబు వ్యాఖ్యలకు మేరుగు నాగార్జున కౌంటర్


నాగచైతన్య, సుకుమార్ తో మీనాక్షి


సూపర్ సిక్స్ కు డబ్బుల్లేవ్.. అమరావతికి మాత్రం లక్షల కోట్లు..


కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి పీఏ అరాచకం


వరంగల్ వెళ్తూ మధ్యలో డ్యాన్స్ చేసిన MLA మల్లారెడ్డి


ద్విజాతి సిద్ధాంతం అనే విద్వేషపు విత్తనంతో మొలకెత్తిన పాకిస్తాన్