Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Putin calls PM Modi, condemns Pahalgam attack1
ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఫోన్‌

భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం భారత్‌-పాకిస్తాన్‌ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. భారత్‌ కు అండగా ఉంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం మోదీకి ప్రత్యేకంగా ఫోన్‌ చేసిన పుతిన్‌.. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో భారత్‌ కు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

YS Jagan Teleconference With Party Leaders Over Unseasonal Rains2
రైతులకు బాసటగా వైఎస్సార్‌సీపీ: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ఏపీలో అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం సరైన చర్యలేవీ చేపట్టలేదని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో అకాల వర్షాలపై పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనాయకులతో సోమవారం వైఎస్‌ జగన్‌ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించండి.. వారికి ధైర్యం చెప్పండి. రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక ధాన్యఙ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రబీ సీజన్‌లో కూడా కష్టాలు పడటం ఆవేదన కలిగిస్తోంది. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కళ్లాల్లో, పొలాల్లో రైతులవద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించడంలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అకాల వర్షాలవల్ల మరింతగా నష్టపోతున్నారు. యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి. రైతులకు బాసటగా నిలవాలి. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని కేడర్‌కు వైఎస్‌ జగన్‌ సూచించారు.

Waqf Act Petitions: petitioners response to govt Arguments in SC Updates3
వక్ఫ్‌ చట్టం చట్టబద్ధతపై కాసేపట్లో ‘సుప్రీం’ విచారణ

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్‌ చట్టం(Waqf Amendment Act) రాజ్యాంగ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లు ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు మరోసారి రానున్నాయి. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పిటిషన్లపై విచారణ జరపనుంది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఇవాళ వాదనలు వినిపించే అవకాశం ఉంది.వక్ఫ్‌ (సవరణ) చట్టం2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖయ్యాయి. ఇప్పటికే పలుసార్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) కేంద్రం విజ్ఞప్తి మేరకు నేటి వరకు గడువు ఇచ్చింది. గత విచారణ సమయంలో చట్టంలోని రెండు వివాదాస్పద నిబంధనలను తాత్కాలికంగా కేంద్రం నిలిపివేసింది. మే 5వ తేదీ వరకు వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపింది. గత వాదనల్లో.. వక్ఫ్‌ కౌన్సిల్, బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించొద్దని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. గత విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. అన్నిరకాలుగా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే చట్టాన్ని రూపొందించినట్లు పేర్కొంది. ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి వాదనలు వినకపోవడం సముచితం కాదని పేర్కొన్నారు. మరోవైపు.. వక్ఫ్‌గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్‌ జాబితా నుంచి తొలగించొద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్‌ బోర్డులు, కేంద్ర వక్ఫ్‌ మండలిలో ఎక్స్‌అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే అయ్యుండాలనీ చెప్పింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్‌ అఫీషియో సభ్యులను నియమించొచ్చని.. ఈ మేరకు వక్ఫ్‌(సవరణ) చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదించింది.

Vundavalli Aruna Kumar Reacts On PSR Anjaneyulu Arrest4
ఈనాడు పేపర్‌నే కూటమి సర్కార్‌ ఫాలో అయ్యేది: ఉండవల్లి

తూర్పుగోదావరి, సాక్షి: సీనియర్‌ పోలీస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్‌ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనాడు పత్రికకు ఆంజనేయులిపై చాలా కక్ష ఉండి ఉండొచ్చని.. ఈ అరెస్ట్‌ పోలీస్‌ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలని అన్నారాయన. ఈ కేసులో అసలు ముంబై నటి ని రేప్ చేసారన్న వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారు?. ఆంజనేయులు లాంటి అధికారులను వేధించడం సరికాదు. ఇలా అయితే పోలీసులు ఎలా పని చేస్తారు?. ముంబైలో నమోదైన కేసులో ఏం జరుగుతుందో?. ఈనాడు పేపర్‌కు ఆంజనేయులిపై కక్ష చాలా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈనాడు పేపర్‌లో ముందురోజు ఏమి వస్తుందో.. ఆ తర్వాతి రోజు ప్రభుత్వం అదే ఫాలో అవుతోంది అని ఉండవల్లి అన్నారు. ఆంధ్రా నుంచి ఎవరూ మాట్లాడరా?ఏపీ రీఆర్గనైజేషన్ చట్టానికి సంబంధించి 11 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేసిన రోజు ఇదేనని ఉండవల్లి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకూ అఫిడవిట్ ఫైల్ చేయలేదు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. నేనే 43 సార్లు పార్టీ ఇన్ పర్సన్ గా కోర్టుకు హాజరయ్యాను. విభజన చట్టంలో ఆంధ్రా కు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఒక ఆర్డర్ ఇవ్వండని కోర్టును కోరాం. ఆంధ్ర నుంచి ఈ విషయం ఎవరూ మాట్లాడరు. పబ్లిక్ మీటింగ్లో మాత్రం ఆంధ్రాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు..‌ కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా స్పందించారు.. అందుకే ఆయనకు లెటర్ రాశాను.. ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ ను తీసుకువచ్చి వాదన వినిపించమని కోరుతున్నా. ప్రజాస్వామ్యానికి అతి ప్రధానమైన ఆర్టికల్ 100 లోక్సభలో ఏపీ రిఆర్గనైజేషన్ చట్టం చేసే సమయంలో సక్రమంగా అమలు కాలేదు అని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

Team India Emerge As Top White Ball Team In ICC Annual Rankings5
వార్షిక ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న టీమిండియా

ఐసీసీ వార్షిక పరిమిత ఓవర్ల ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌ భారత పురుషుల క్రికెట్‌ జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ ర్యాంకింగ్స్ గతేడాది మే నుండి జరిగిన అన్ని మ్యాచ్‌లను 100 శాతంగా, గత రెండు సంవత్సరాల్లో జరిగిన మ్యాచ్‌లను 50 శాతంగా పరిగణలోకి తీసుకుని నిర్ణయించబడ్డాయి. ప్రస్తుత వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా.. వార్షిక ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌ ప్లేస్‌ దక్కించుకుంది. గడిచిన రెండేళ్లలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్న టీమిండియా.. గతేడాది టీ20 ప్రపంచకప్‌, ఈ ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌ రెండు పాయింట్లు మెరుగుపర్చుకుని పాయింట్ల సంఖ్యను 122 నుంచి 124కు పెంచుకుంది. భారత్‌ తర్వాత రెండో స్థానంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ రన్నరప్‌ న్యూజిలాండ్‌ ఉంది. న్యూజిలాండ్‌.. వన్డేల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను వెనక్కు నెట్టి రెండో స్థానానికి చేరుకుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆసీస్‌ మూడో స్థానానికి పడిపోయింది.ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ల్లో భారత్‌, ఆసీస్‌కు ఓడించిన శ్రీలంక ఐదు రేటింగ్‌ పాయింట్లు మెరుగుపర్చుకుని తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. పాకిస్తాన్‌, సౌతాఫ్రికా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. గత రెండేళ్లలో మెరుగైన ప్రదర్శనలు చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ రేటింగ్‌ పాయింట్లు పెంచుకుని ఏడో స్థానానికి ఎగబాకగా.. మాజీ వరల్డ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో ఉన్నాయి.మరోవైపు టీ20 ర్యాంకింగ్స్‌లోనూ భారత్‌ హవా కొనసాగింది. ప్రస్తుత టీ20 ఛాంపియన్స్‌ అయిన భారత్‌ టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. ఆసీస్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వరుస స్థానాల్లో నిలిచాయి.టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియాఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌లో ప్రస్తుత డబ్ల్యూటీసీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా టాప్‌ ప్లేస్‌ను దక్కించుకుంది. ఆసీస్‌ రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ కంటే 13 పాయింట్లు అధికంగా సాధించింది. ఈ దఫా డబ్ల్యూటీసీ ఫైనల్లో​ ఆసీస్‌ను ఎదుర్కోబోయే సౌతాఫ్రికా మూడో స్థానంలో నిలిచింది. ఇటీవల న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా చేతుల్లో పరాజయాల నేపథ్యంలో భారత్‌ నాలుగో స్థానానికి దిగజారింది. న్యూజిలాండ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌ టాప్‌-10లో ఉన్నాయి.

How Money Impacts Divorce Decisions6
‘మనీ మహిమ’తోనే చాలామంది విడాకులు!

మానవ సంబంధాల్లో డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేమగా మాట్లాడాలన్నా, అభిమానాన్ని ఎదుటివ్యక్తికి తెలియజేయాలన్నా డబ్బు అవసరం లేకపోవచ్చు.. కానీ ఆ ప్రేమను, అభిమానాన్ని కలకాలం నిలబెట్టుకోవాల​ంటే మాత్రం కచ్చితంగా డబ్బు కావాల్సిందే. ప్రస్తుత రోజుల్లో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతోంది. అందుకు చాలానే కారణాలుండొచ్చు.. అయితే దాంపత్య జీవితంలో భాగస్వామికి డబ్బు లేకపోవడం, అప్పులుండడం, ఖర్చు చేయలేకపోవడం.. వంటివి కూడా పచ్చని కాపురంలో చిచ్చు పెడుతోంది. కలకాలం సంతోషంగా జీవించాల్సిన జంటను ఈ డబ్బు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిస్తోంది. విడిపోయే జంటల జీవితాలను మనీ ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.రుణాలు..కొత్తగా పెళ్లయిన జంటను స్థిరమైన ఆర్థిక ఒత్తిళ్లు వేరు చేస్తున్నాయి. ఈ రోజుల్లో పెళ్లికి చాలా కుటుంబాలు భారీగానే ఖర్చు చేస్తున్నాయి. సంపన్నులకు డబ్బు ఖర్చయినా తిరిగి సంపాదిస్తారు. పేదవారు కూడా ఉన్నంతలో తూతూ మంత్రంగా పెళ్లి తంతు కానిస్తారు. కానీ సమస్య అంతా మధ్య తరగతి ప్రజలతోనే. బంధువుల్లో గొప్ప కోసమో.. మళ్లీ చేయని కార్యక్రమం అనో.. పెళ్లికి బాగానే డబ్బు ఖర్చు చేస్తారు. మధ్య తరగతివారికి సరైన సంపాదన ఉండకపోవడంతో దీనికోసం అప్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. వాటిని తీర్చేందుకు అదనపు కట్నం కోసం భాగస్వామిపై వేదింపులు సాగిస్తారు. అది చివరకు విడాకుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది.ఆర్థిక అస్థిరతపెళ్లైనప్పటి నుంచి వధువరులకు బాధ్యతలు పెరుగుతాయి. పెళ్లి తర్వాత పిల్లలు, వారి చదువులు, వాహనాల కొనుగోలు, ఆస్తులు కూడబెట్టడం.. వంటి కార్యకలాపాల కోసం చాలామంది అప్పులు చేస్తున్నారు. ఈఎంఐలు చెల్లించలేక మానసిక ఒత్తిడితో భాగస్వామితో సఖ్యతగా నడుచుకోకుండా చివరకు కాపురాన్ని కూల్చుకుంటున్నారు.దుబారా ఖర్చులు..పెళ్లికి ముందు చాలా మందికి దుబారాగా డబ్బు ఖర్చు చేసే అలవాటు ఉంటుంది. వివాహం తర్వాత కూడా అది కొనసాగితే అప్పులు తప్పవు. సంపాదన భారీ మొత్తంలో ఉన్న కుటుంబాలపై ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ మధ్య తరగతి కుటుంబాలపై ఈ వ్యవహార శైలి తప్పకుండా ప్రభావం చూపుతుంది. ఇది దంపతుల మధ్య గొడవలు జరిగేందుకు కారణమవుతుంది. ఇది కూడా విడాకులకు దారితీస్తుంది.ఇదీ చదవండి: వచ్చే మూడేళ్లలో ఒకే రంగంలో కోటిన్నర ఉద్యోగాలుమరేం చేయాలి..జల్సాలకు, దుబారా ఖర్చులకు అలవాటుపడే వారు, పెళ్లి కోసం అనాలోచితంగా చేసే భారీగా ఖర్చు చేసేవారు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది ఆ దంపతులు తమ వైవాహిక బంధాన్ని తెంచుకునేందుకు చాలాసార్లు కారణమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక సవాళ్లు అనివార్యమైనప్పటికీ సరైన ప్రణాళిక, పారదర్శకత, బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ వల్ల సమస్యలను గట్టెక్కవచ్చు. ఆ దిశగా దంపతులు ఆలోచించాలి. ఖర్చులు తగ్గించుకుని, అప్పులు చేయకుండా పెట్టుబడి, పొదుపుపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరెన్సీ నోటు కాపురాలను కలకాలం నిలబెడుతుంది.. అదే కాపురాలను చిదిమేస్తుందని గుర్తుంచుకోవాలి.

This Year Met Gala 2025 Menu These Foods Banned 7
Met Gala 2025: ఆ ఐదు ఆహార పదార్థాలపై నిషేధం.. రీజన్‌ తెలిస్తే!

మెట్ గాలా (Met Gala) అంటే మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (Metropolitan Museum of Art) కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ (Costume Institute). ఇది అత్యంత ప్రసిద్ధమైన ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటి. దీన్ని ప్రతి ఏడాది మే నెలలో న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో నిర్వహిస్తారు. దీన్ని కొత్త ఫ్యాషన్ ప్రదర్శనకు నిధులు సమకూర్చడం కోసం ప్రతి ఏటా నిర్వహిస్తారు. దీన్ని కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ వార్షిక ఫ్యాషన్ ప్రదర్శనకు సంబంధించిన వేడుకగా పేర్కొంటారు కూడా. ఈ కార్యక్రమానికి ఫ్యాషన్‌, సినీ, వ్యాపార, క్రీడల, రాజకీయ ప్రముఖులంతా విచ్చేస్తారు. ఈ ఏడాది మే5 సాయంత్రం ఆరు గంటలకు మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్, కియారా అద్వానీ, దిల్జిత్ దోసాంజ్ వంటి భారతీయ తారలు అరంగేట్రం చేయనున్నారు. దీన్ని వోగ్ ఎడిటర్-ఇన్-చీఫ్ అన్నా వింటౌర్ నిర్వహిస్తారు. ఇక ఈవెంట్‌లో అత్యంత ప్రసిద్ధి చెందింది పసందైన విందు మెనూ. ఈసారి ఈవెంట్‌లో ఎలాంటి వంటకాలు అందించనున్నారనేది వెల్లడి కాకపోయినా..ఆ ఫుడ్స్‌ని మాత్రం పూర్తిగా బ్యాన్‌ చేశారంట. అవేంటి, ఎందుకని నిషేధించారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.అన్నా వింటౌర్ నిర్వహించే ఈ వేడుకలో మెనూలో ఆ ఫుడ్స్‌ని ఆమె ఎందుకు నిషేధించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఏడాది మెట్ గాలా 2025(Met Gala 2025) డిన్నర్ నుంచి నిషేధించిన ఆహారాలు ఇవే..1. వెల్లుల్లి2. ఉల్లిపాయ3. చివ్స్4. పార్స్లీ5. బ్రూషెట్టాఎందుకు నిషేధించారంటే..ఈ ఐదింటిని ఎందుకు బ్యాన్‌ చేశారో లాస్ ఏంజిల్స్‌ గ్రేట్ టేస్ట్ క్యాటరింగ్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ జాక్సన్ పరేడ్‌ వివరించారు. తాము అందించే ఆహారం సెలబ్రిటీల శ్వాసను, దంతాలను ప్రభావితం చేసేలా ఉండకూడదనే ఇలా ఆ ఐదు ఆహారాలకు చోటు ఇవ్వలేదట. అంతేగాదు ఆ ఐదు ఆహారాల వల్ల కలిగే అసౌకర్యం ఏంటో కూడా తెలిపారు. ఉల్లి, వెల్లుల్లి అంటే అలెర్జీ ఉన్నవారు చాలామంది ఉన్నారట. అలాగే పార్సీ కచ్చితంగా దంతాల్లో ఇరుక్కుని ఇబ్బంది పెడుతుందట. అందుకని దాన్ని మెనూలోంచి తొలగించారు. బ్రూషెట్టా కూడా రాత్రిపూట ఇచ్చే విందులో అసౌకర్యంగా ఉంటుందట. ఇది మొత్తం ఆరోగ్యాన్ని ఇబ్బందిలో పెట్టేస్తుందట. కాగా, ఈ ఏడాది మెట్‌గాలా కోసం ఫుడ్‌ మోనూని 'సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్‌తో అతిథులకు సర్వ్‌ చేయనున్నారు. దీన్ని అందించేది సెలబ్రిటీ చెఫ్ క్వామే ఒన్వుచి. ఈ అవకాశం తనకు లభించడం ఓ గౌరవమని అన్నారు ఒన్వుచి. న్యూయార్క్‌ సంస్థలో భాగం కావడం అనే తన ప్రోఫెషన​ల్‌ కల ఇన్నాళ్లకు నిజమైందని ఆనందం వ్యక్తం చేశారు. ఓఫ్యాషన్‌ ప్రేమికుడిగా 'సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్‌కి అనుగుణంగా వంటకాలు సిద్ధం చేసేలా చెఫ్‌ బృందంలో భాగం కావడం అనేది మర్చిపోలేని అనుభూతి అని అన్నారు. (చదవండి: Water Fitness: నటుడు ధర్మేంద్ర వాటర్‌ వర్కౌట్లు చూస్తే మతిపోవాల్సిందే..! మంచి గేమ్‌ ఛేంజర్‌..)

Ambati Rambabu Complaint Against Seema Raja, Kiraak RP8
సీమ రాజా, కిర్రాక్‌ ఆర్పీలాంటోళ్లను చట్టం వదలదు: అంబటి

గుంటూరు, సాక్షి: తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని.. అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోషల్‌ మీడియాలో పార్టీ మీద, పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేసే వాళ్లను వదలబోమని, చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరతామని అన్నారాయన.సోమవారం పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ సోషల్‌ మీడియా వింగ్‌ వైఎస్సార్‌సీపీపై, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై, తనపైనా తప్పుడు ప్రచారం చేస్తోంది. అందుకే ఐటీడీపీపై ఫిర్యాదు చేశాం. అలాగే.. వైఎస్సార్‌సీపీ కండువా చేసి ప్రేలాపనలు చేసే సీమ రాజా అనే వ్యక్తిపైనా, మాజీ మంత్రి రోజా తదితరులపైనా వీడియోలు చేసే కిర్రాక్‌ ఆర్పీపైనా ఫిర్యాదు చేశాం.గతంలోనూ మేం ఫిర్యాదులు చేశాం. కానీ, పోలీసులు చర్యలు తీసుకోలేదు. అందుకే ఈసారి రసీదు తీసుకున్నాం. మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు. అందుకే టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీస్‌ వ్యవస్థ టీడీపీ గుప్పిట్లో ఉంది. పోలీసులు చర్యలు తీసుకోకుంటే కోర్టులకు వెళ్తాం.ఐటీడీపీ పేరుతో చంద్రబాబు, లోకేష్‌ ప్రొత్సహంతో వైఎస్సార్‌సీపీ నేతలపై ప్రేలాపనలు చేస్తున్నారు. పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తాం. దోషులను చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుంది. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం. పార్టీ ఇన్‌ పర్సన్‌గా నా ఆవేదనను నేనే స్వయంగా వినిపిస్తా. చట్టం సీమ రాజాను, కిర్రాక్‌ ఆర్పీ లాంటి వాళ్లను చట్టం వదలదు. ఎంత పెద్దవారు అయినా శిక్ష నుంచి తప్పించుకోలేరు.

Allu Aravind Visited To Sri Tej Who Recently Shifted To Rehabilitation Centre9
శ్రీతేజ్‌ను పరామర్శించిన నిర్మాత అల్లు అరవింద్‌, బన్నీవాసు

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌(Sri Tej )ను సోమవారం ఉదయం నిర్మాతలు అల్లు అరవింద్(Allu Aravind), బన్నీ వాసు పరామర్శించారు. కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్ ప్రస్తుతం ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న నిర్మాతలు, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.శ్రీతేజ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీ వాసు అతని యోగక్షేమాలను నిరంతరం అడిగి తెలుసుకుంటున్నారు. శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులతోపాటు, అతని కుటుంబానికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ ఆర్థిక సహాయం అందించారు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకొని, సాధారణ స్థితికి చేరే వరకు, భవిష్యత్‌లో అతనికి ఏ అవసరమైనా అతనికి, అతని కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నుంచి రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స వరకు, అల్లు అరవింద్, బన్నీ వాసుల ద్వారా శ్రీతేజ్ ఆరోగ్య వివరాలను అల్లు అర్జున్ నిరంతరం తెలుసుకుంటున్నారు.

KSR Comments Over PM Modi Amaravati Visit10
పవన్‌ మర్చిపోవచ్చు.. మోదీ కూడా యూటర్న్‌!

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎన్నికైన తొలి నాళ్లలో అందరికీ నరేంద్ర మోదీ అంటే బాగా గౌరవం ఉండేది. కానీ, కాలం గడిచే కొద్ది ఆయనలో రాజనీతిజ్ఞుడు బదులు ఫక్తు రాజకీయవేత్త కనిపిస్తున్నారు. సొంత అవసరాలకోసం అవకాశవాద రాజకీయాలు చేసే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ప్రధాని మోదీకి పెద్ద తేడా లేదేమో అన్న అభిప్రాయం కలిగేలా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది.అమరావతి పనుల పునః ప్రారంభానికి మోదీ ఏపీకి వచ్చిన సందర్భంలో జరిగిన సభ, ఆయనతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల స్పీచ్ గమనిస్తే, ప్రజలను మభ్య పెట్టడానికి ఒకరికొకరు పోటీ పడినట్లు కనిపిస్తుంది. దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఒక విధంగా తండ్రి పాత్రలో ఉన్నట్లు లెక్క. కుటుంబంలోని పిల్లలు ఎవరైనా తప్పుడు మార్గంలో ఉంటే తండ్రి ఏ రకంగా మందలిస్తారో, అదే రీతిలో మోదీ కూడా రాష్ట్రాలలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపి అలా చేయవద్దని చెప్పాలి. కానీ, దురదృష్టవశాత్తు, అందుకు విరుద్దంగా ఆయన కూడా అల్లరిచేసే పిల్లాడిని గారాబం చేసినట్లు వ్యవహరిస్తున్నారన్న సందేహం వస్తుంది.ఏపీలో ఇప్పటికే పలుమార్లు శంకుస్థాపనలు జరిగిన అమరావతిలో.. అందులోనూ తానే గతంలో ఒకసారి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి మళ్లీ వచ్చి అదేమీ తప్పు కాదన్నట్లు ఉపన్యసించి వెళ్లారు. దేశంలో కొత్తగా వచ్చిన రాష్ట్రాలలో ఏర్పడిన రాజధానులలో అవసరమైన భవనాల నిర్మాణాలకు ఎంత ఖర్చు అయింది మోదీకి తెలిసే ఉండాలి. ఎన్ని వేల ఎకరాల భూమి ఆ రాష్ట్రాలు సేకరించాయన్న సమాచారం ఆయన వద్ద ఉండి ఉండాలి. ఏపీ తప్ప మిగిలిన కొత్త రాష్ట్రాలలో లక్ష ఎకరాల భూమి సమీకరించలేదు. ఆ రాష్ట్రాలలో నేతలు తామే నగరాలు నిర్మిస్తామని చెప్పి, రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చలేదు. కానీ ఏపీలో మాత్రం తొలుత ఏభైమూడువేల ఎకరాలు సిద్దం చేసుకుని, తిరిగి ఇంకో 44వేల ఎకరాలు తీసుకుంటామని చెబుతుంటే మోదీ వారించనవసరం లేదా?.అసలు ఇంత భూమి తీసుకుని ఏమి చేస్తారు?. మూడు పంటలు పండే పచ్చటి పొలాలను ఎందుకు ఈ స్థాయిలో తీసుకుంటున్నారు? అని అడగాలా?లేదా?. తెలంగాణలో 400 ఎకరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో అభివృద్ది పనులు చేపట్టాలని తలపెడితే, పర్యావరణం దెబ్బతినిపోయిందని గగ్గోలు పెట్టిన ఆయన లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసానికి ఎందుకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా?. అలా చేయకపోగా తగుదునమ్మా అంటూ ఆ పర్యావరణ విధ్వంసంలో తాను కూడా భాగస్వామి అవడం మోదీ ప్రత్యేకత అనుకోవాలి. ఇదే అమరావతికి సంబంధించి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును ఏ స్థాయిలో మోదీ విమర్శించారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవినీతి కోసమే పధకాలను తయారు చేస్తున్నారని, రాజధాని నుంచి అన్నిటా అవినీతి రాజ్యమేలుతోందని చంద్రబాబుపై ధ్వజమెత్తిన మోదీ, ఇప్పుడు చంద్రబాబు గొప్ప పని చేస్తున్నారని మెచ్చుకోవడం అవకాశవాదం అవ్వదా?.అమరావతి ఏపీకి ఒక శక్తి అవుతుందని అన్నారు. నిజంగా అలా జరిగితే ఎవరూ కాదనరు. కానీ, అదెలా సాధ్యం?. అందుకోసం అయ్యే లక్షల కోట్ల వ్యయం ఎక్కడ నుంచి వస్తుందో మోదీ చెప్పాలి కదా!. ఏపీ ప్రభుత్వం సుమారు లక్ష కోట్ల పనులు చేపడుతోందని మంత్రి నారాయణ ప్రకటించారు. గతంలో 33వేల ఎకరాల భూమిలో మౌలిక సదుపాయాల కల్పనకు లక్షాతొమ్మిదివేల కోట్ల రూపాయలు అవసరం అని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. ఆ లేఖను మోదీ సర్కార్ చెత్తబుట్టలో పడేసినట్లుగా పక్కనబెట్టేసి కేవలం 2500 కోట్ల రూపాయలు మాత్రం మంజూరు చేసింది. తాజాగా 2024 ఎన్నికలలో మళ్లీ స్నేహం కుదిరింది కనుక మోదీ, చంద్రబాబు ఒకరినొకరు పొగుడుకుంటూ జనాన్ని పిచ్చోళ్లను చేస్తున్నారు. చంద్రబాబును యూటర్న్ బాబు అని, పోలవరం, అమరావతిలను ఏటీఎంల మాదిరి వాడుకుంటున్నారని గతంలో ధ్వజమెత్తిన మోదీ.. ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడంలో చంద్రబాబుకు అనుభవం ఉందని అంటున్నారు. మోడీ కూడా యూటర్న్ తీసుకున్నట్లే కదా!.ప్రస్తుతం లక్ష కోట్లు వ్యయం చేస్తామని చెబుతున్న ఏపీ ప్రభుత్వానికి ఆ మొత్తం కేంద్రం నుంచి వచ్చే అవకాశమే లేదు. అదంతా రుణమే. అంటే అమరావతిని అప్పుల చిప్పగా మార్చుతున్నారన్నమాట. అమరావతి సభలో ఒక్క నయాపైసా కూడా కొత్తగా ఇస్తున్నట్లు మోదీ చెప్పలేదు. ఇదంతా అయ్యే పని కాదని, లక్షల కోట్ల అప్పు భారం ఏపీ ప్రజలపై పడుతుందని తెలిసి కూడా మోదీ మాట మాత్రం కూడా హెచ్చరించకపోవడం దారుణంగా ఉంటుంది. ఇప్పటికే ఒక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు ఉన్నాయి కదా!. మళ్లీ ఆ స్థాయిలో నిర్మాణాలు చేపట్టవలసిన అవసరం ఏమిటి అని ప్రధాని హోదాలో ప్రశ్నించలేదు.అంతేకాదు.. కేవలం రెండువేల మంది పనిచేసే సచివాలయానికి ఏభై, నలభై అంతస్తుల టవర్లు దేనికి అని అడగలేదు. ఏపీలో కూటమి నేతలు కోరగానే వాటికి మరోసారి శంకుస్థాపన చేసేశారు. దీనిపై సోషల్ మీడియాలో చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ జరగాలన్న పిచ్చి కవిత్వాన్ని ప్రస్తావిస్తూ ఎద్దేవ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున కూడా చిన్న, చిన్న రోడ్ల విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేసి అవేదో చాలా పెద్ద పనులు అన్నట్లుగా పిక్చర్ ఇచ్చే ప్రయత్నం జరిగినట్లు అనిపిస్తుంది. మండుటెండలో లక్షల సంఖ్యలో జనాన్ని బలవంతంగా అధికార యంత్రాంగం ద్వారా తరలించి వందల కోట్లు ఖర్చు చేయడం మినహా ఏమీ ప్రయోజనం జరిగిందన్నది ప్రశ్నగా ఉంది.సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రజలను మోసం చేస్తున్న నేపధ్యంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలలో పెరుగుతున్న నిరసనను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు అనిపిస్తుంది. బీజేపీ కూడా కూటమిలో భాగస్వామి కనుక ప్రధాని కూడా ఒక పాత్ర పోషించారనుకోవాలి. చంద్రబాబు తన ప్రసంగంలో మోదీని ఆకాశానికి ఎత్తివేశారు. ఒకప్పుడు మోదీ అంత అవినీతిపరుడు లేడన్న నోటితోనే, మోదీ ప్రపంచంలోనే పవర్ పుల్ నేత అని, 2047 నాటికి వికసిత్ భారత్ ఆయన వల్లే సాధ్యమని చెబుతున్నారు. 2047 నాడికి మోదీకి 96 ఏళ్లు వస్తాయి. అప్పటి వరకు ఆయనే దేశానికి సారధ్యం వహించడం సాధ్యమేనా అని ఎవరు అడుగుతారు!. మరో పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పొగిడినట్లే ఇది కూడా ఉంది. మోడీ ఒకటి, రెండు అంశాలలో చంద్రబాబును పొగిడినా, మరీ అతి చేయలేదు.కానీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు మాత్రం హద్దులు లేకుండా పొగిడారు. ఒకరకంగా నమో సంకీర్తన చేశారనిపిస్తుంది. పోనీ ఇంతగా పొగిడితే పొగిడారులే.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, ఇతర హామీల విషయంలో మోదీకి ఏమైనా విజ్ఞప్తి చేస్తారేమోలే అని ఆశించినవారికి మాత్రం ఆశాభంగమే ఎదురైంది. అమరావతికి లక్ష కోట్ల అప్పు చేస్తున్నాం.. ఇందులో మీరు ఇంత శాతం భరించండి .. అని అడగలేదు. ప్రత్యేక హోదా ఊసే లేదు. అసలు ఈ నేతలెవ్వరూ లక్ష కోట్ల అప్పు చేస్తున్న విషయాన్నే ప్రజలకు చెప్పకుండా దాటవేయడంలోనే కుట్ర ఉందనిపిస్తుంది. ఒకపక్క భారీ ఎత్తున పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ, లక్షల కోట్లను కేవలం 30 గ్రామాలలో వ్యయం చేస్తూ ఆర్ధిక విధ్వంసానికి పాల్పడుతున్న చంద్రబాబు.. గత జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందని విమర్శించారు.చంద్రబాబు ప్రభుత్వం 2014 టర్మ్‌లో నిర్మించిన అసెంబ్లీ, సచివాలయం తదితర నీరు కారే భవనాలను ఏమైనా జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందా?. ఉన్నవాటిని వాడుకుందాం.. విశాఖ కార్యనిర్వాహణ రాజధాని అయితే పదివేల కోట్లతో గ్రోత్ ఇంజన్ అవుతుంది అని జగన్ చెబితే విధ్వంసం అని తప్పుడు ప్రచారం చేశారు. అప్పట్లో అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని ప్రచారం చేసిన చంద్రబాబు ఈ సభలో ఆ మాట ఎందుకు అనలేకపోయారు. ఖర్చుకు అవసరమైన నిధులు ఎలా సేకరిస్తున్నది, దాని భారం ప్రజలపై ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలను వివరించలేకపోయారు. పైగా మూడేళ్లలో లక్ష కోట్ల పనులు పూర్తి చేస్తామని అనడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. దానికి ఎంతో యంత్రాంగం అవసరం అవుతుంది. ఏ ప్రభుత్వం అయినా ఏడాదికి ఒక ప్రాజెక్టుకు ఐదువేల నుంచి పదివేల కోట్లు వ్యయం చేయగలిగితే గొప్ప. కానీ, ఏడాదికి 33 వేల కోట్ల చొప్పున ఖర్చు చేయడం అంటే అందులో మతలబు ఉన్నట్లే అవుతుంది. ఆయా పనుల రేట్లు డబుల్ చేసి కాంట్రాక్టర్లకు మేలు చేస్తారేమో తెలియదు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో రాజధానిపై ఏ విమర్శలు చేసింది మర్చిపోయి మాట్లాడారు. పనిలో పని చంద్రబాబును గొప్పగా పొగిడి మార్కులు తెచ్చుకున్నారు. లోకేష్ అయితే విభజన తర్వాత హైదరాబాద్ నుంచి తరిమేశారని చెప్పి నవ్వులపాలయ్యారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడి రాత్రికి రాత్రి చంద్రబాబు విజయవాడ వెళ్లిపోయిన సంగతిని అంతా గుర్తు చేసుకుంటున్నారు. విశేషం ఏమిటంటే బాబు, లోకేష్‌, పవన్లు పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించి తన నాయకత్వం గురించి విశేషంగా పొగిడినా, మోదీ మాత్రం ఆ ప్రస్తావనే తేలేదు.అలాగే జగన్ ప్రభుత్వాన్ని వారు విమర్శించినా, మోదీ మాత్రం అందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏతావాతా చెప్పవచ్చేదేమిటంటే, అమరావతి పనుల పునఃప్రారంభ సభ నిర్వహణకు, పబ్లిసిటీకి వందల కోట్లు ఖర్చు అయినా, ఆ మందం అయినా ఏపీ ప్రజలకు మేలు జరగలేదన్న భావనే కలుగుతుంది. కాకపోతే, పవన్‌కు మోదీ నుంచి ఒక చాక్లెట్ లభించింది. ఆయనకు అదే మంచి లడ్డూ అనుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement