Crib
-
జూనియర్ సర్జాకు విలువైన బహుమతి
కన్నడ నటుడు చిరంజీవి సర్జా, మేఘనా రాజ్ బిడ్డ త్వరలోనే ఈ లోకానికి రానుంది. దీంతో చిరంజీవి సోదరుడు ధ్రువ సర్జా పండంటి బిడ్డ కోసం వెండితో తయారైన ఊయలను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. 10 లక్షల విలువైన ఈ ఊయలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడు, నటుడు అయిన చిరంజీవి సర్జా జూన్ 7న బెంగళూరులో మరణించిన విషయం విదితమే. 36 వయస్సులోనే గుండెపోటుతో ఆయన కన్నుమూయడం అందరినీ తీవ్ర వేదనకు గురిచేసింది. 2018లో చిరంజీవి సర్జా, కథానాయిక మేఘనా రాజ్ పెళ్లి చేసుకున్నారు. మరణించే నాటికే అతడి భార్య గర్భవతి. ఈ క్రమంలో చిరంజీవి సర్జా సతీమణి మేఘన సీమంతం వేడుక ఇటీవలె ఘనంగా జరిగింది. (నిన్ను ప్రేమిస్తూనే ఉంటా: మేఘనా రాజ్ ) భర్త జ్ఞాపకాలతో బ్రతుకుతున్న మేఘన చిరంజీవి స్టైల్‌గా నుంచున్నట్లు కటౌట్ తయారుచేయించి తన కుర్చీ పక్కనే పెట్టుకున్నారు. దూరం నుంచి చూస్తే చిరంజీవి నిజంగానే భార్య పక్కను నిలబడినట్లు ఉండటంతో కార్యక్రమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. అతి తక్కువ మంది కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘చిరంజీవి కటౌట్ చూస్తుంటే ఆయన నిజంగా వేడుకలో ఉన్నట్లే ఉంది’, ‘మేడమ్ మీకు అంతా మంచే జరగాలి. అలాగే మీరు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటున్నాం’ అని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. (మేఘనా సర్జా సీమంతం వేడుక) View this post on Instagram @chirusarja @megsraj @arjunsarjaa @shankar.prerana @surajsarjaofficial @aishwaryaarjun @anj204 @classycaptures_official jai hanuman 🙂👍 A post shared by Dhruva Sarja (@dhruva_sarjaa) on Oct 15, 2020 at 10:34pm PDT -
తమ్ముడికి అన్న ట్రైనింగ్: వైరల్ వీడియో
ఇద్దరు చిన్నారుల వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. డైలీ బంప్స్ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఆ వీడియోను సుమారు 4 కోట్ల మంది వీక్షించారు. అంతలా హల్చల్ చేస్తున్న ఆ వీడియోలో ఏముందంటే.. ఓ అన్న తన తమ్ముడికి జైలు లాంటి బెడ్ నుంచి ఎలా తప్పించుకోవాలో చెబుతుంది. ఆటలాడే సమయం అయిపోయిందంటూ ఇద్దరు పిల్లలు ఒలివర్, ఫిన్‌లను తల్లిదండ్రులు బెడ్ ఎక్కించేశారు. అయితే.. ఇంకా కలిసి ఆడుకోవాలని అనుకున్నారో ఏమో ఆ పిల్లలు అందుకోసం పెద్ద సాహసమే చేశారు. ఒలివర్ తన తమ్ముడికి బెడ్ నుంచి ఎలా బయటపడాలో పెద్ద డెమాన్స్ట్రేషన్తో చూపించి.. ఎట్టకేలకు తన తమ్ముడికి విముక్తి కల్పిస్తాడు. అంతేనా.. 'యూ కెన్ డూ ఇట్' అంటూ తమ్ముడిని ఒలివర్ ఎంకరేజ్ చేసిన విధానంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
దేవుడా.. ఎంతపనిచేశావయ్యా..
చిన్నారిని మింగిన సంపు సోమందేపల్లి మండలకేంద్రంలోని మారుతినగర్లో నివాసం ఉంటున్న రమేష్, లక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు రాహుల్(3). సోమవారం సాయంత్రం ఇంటిలో నుంచి ఆడుకునేందుకు చిన్నారి బయటకు వచ్చాడు. అయితే సంపుపై డోర్ వేయకపోవడంతో అటువైపుగా వెళ్లిన చిన్నారి అందులో పడిపోయాడు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు 15 నిమిషాల తర్వాత కుమారుడు కనిపించలేదని బయటకు వచ్చి వెతకడం ప్రారంభించారు. ఎక్కడా కనిపించలేదు. అనుమానం వచ్చి సంపులో పరిశీలించగా నీట మునిగిన చిన్నారిని గుర్తించి స్థానికులు బయటకు తీశారు. అయితే అప్పటికే రాహుల్ ఊపిరాడక చనిపోయాడు. ‘అయ్యోదేవుడా.. ఒక్కగానొక్క కుమారుడిని బలితీసుకుంటివా.. ఎంత పని చేశావయ్యా..ఏ పాపం చేశామని మాకీ శిక్ష వేశావంటూ’ కుమారుడిని ఒడిలో పెట్టుకుని తల్లి గుండెలవిసేలా రోదించింది. ఎస్ ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.