దేవుడా.. ఎంతపనిచేశావయ్యా.. | Child swallowed strike | Sakshi
Sakshi News home page

దేవుడా.. ఎంతపనిచేశావయ్యా..

Published Tue, Apr 18 2017 12:04 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

దేవుడా.. ఎంతపనిచేశావయ్యా.. - Sakshi

దేవుడా.. ఎంతపనిచేశావయ్యా..

  • చిన్నారిని మింగిన సంపు
  • సోమందేపల్లి మండలకేంద్రంలోని మారుతినగర్‌లో నివాసం ఉంటున్న రమేష్, లక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు రాహుల్‌(3). సోమవారం సాయంత్రం ఇంటిలో నుంచి ఆడుకునేందుకు చిన్నారి బయటకు వచ్చాడు. అయితే సంపుపై డోర్‌ వేయకపోవడంతో అటువైపుగా వెళ్లిన చిన్నారి అందులో పడిపోయాడు.

    ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు 15 నిమిషాల తర్వాత కుమారుడు కనిపించలేదని బయటకు వచ్చి వెతకడం ప్రారంభించారు. ఎక్కడా కనిపించలేదు. అనుమానం వచ్చి సంపులో పరిశీలించగా నీట మునిగిన చిన్నారిని గుర్తించి స్థానికులు బయటకు తీశారు. అయితే అప్పటికే రాహుల్‌ ఊపిరాడక చనిపోయాడు. ‘అయ్యోదేవుడా.. ఒక్కగానొక్క కుమారుడిని బలితీసుకుంటివా.. ఎంత పని చేశావయ్యా..ఏ పాపం చేశామని మాకీ శిక్ష వేశావంటూ’ కుమారుడిని ఒడిలో పెట్టుకుని తల్లి గుండెలవిసేలా రోదించింది. ఎస్‌ ప్రసాద్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement