Customer Base
-
Paytm: 50 కోట్ల మంది టార్గెట్
న్యూఢిల్లీ: సాంకేతికత ఆధారిత ఆర్థిక సేవల ద్వారా 50 కోట్ల మంది భారతీయులను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నట్టు పేటీఎం గ్రూప్ సీఎఫ్‌వో, ప్రెసిడెంట్ మధుర్ డియోరా తెలిపారు. ‘పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) కోసం ఇటీవల పలు బ్యాంకులతో భాగస్వామ్యం ప్రకటించాం. హెచ్‌డీఎఫ్‌సీతోపాటు ఇతర బ్యాంకులతో చేతులు కలిపాం. ఇది పెద్ద ఫార్మాట్ రిటైలర్ మార్కెట్లో విస్తరణకు దోహదం చేస్తోంది. పోటీ సంస్థల కస్టమర్లూ మా ప్లాట్‌ఫాంకు మళ్లుతున్నారు. చెల్లింపు ఉత్పత్తులతో మధ్యస్థాయి మార్కెట్, స్టార్టప్ రంగాన్ని ఆక ర్శించడంలో అవకాశాలను చూస్తున్నాం. డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు నిక్షిప్తం చేయాల్సిన అవసరం లేకుండా పేటీఎం టోకెన్ గేట్‌వే కోసం మింత్రా, ఓయో, డామినోస్ తదితర సంస్థలు పేటీఎంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి’ అన్నారు. -
సోషల్ మీడియా.. మీకు కావాల్సింది ఇదేనా?
సోషల్ మీడియా అంటే ఒకప్పుడు మనకు సంబంధించిన సమాచారాన్ని వర్చువల్‌గా మరొకరితో పంచుకోవడం కోసం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీగా పరిగణించాం. ఆ తర్వాత వ్యక్తులుగా దూరంగా ఉన్నా.. చాలా దగ్గరగా ఉన్న అనుభూతిని అందించే గొప్ప మాధ్యమాలుగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి మనం ఏం కొనాలో ఎప్పుడు కొనాలో ఎవరి దగ్గర కొనాలో అనే విషయాలను కూడా ప్రభావితం చేసే శక్తులుగా ఎదిగాయి. విపత్తుతో వచ్చిన మార్పు అనుకోకుండా వచ్చిన కోవిడ్ విపత్తు, అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో వ్యాపార రంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పౌడర్ డబ్బా నుంచి ఫోన్ల వరకు ఏది కొనుగోలు చేయాలన్నా ఆన్లైన్నే ఆశ్రయిస్తున్నారు. దీంతో ల్యాప్‌ట్యాప్, డెస్క్‌టాప్, మొబైల్‌ఫోన్లే వర్చువల్ షాపింగ్‌మాల్స్‌గా మారుతున్నాయి. ఇక్కడ ఏ వస్తువులు కొనాలనేది మనకు తెలియకుండానే సోషల్ మీడియా ఖాతాలే డిసైడ్ చేస్తున్నాయి. మన అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా మార్కెట్‌ను మన ముందుకు తెస్తున్నాయి. సోషల్ మీడియాలో 50 కోట్ల మంది కోవిడ్ సంక్షోభం కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆన్లైన్ షాపింగ్‌కి షిఫ్ట్ అయ్యారు. కరోనా కష్టాలు మొదలయ్యాక కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే ఈ కామర్స్ రంగం 94 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇదే కాలంలో 4.7 కోట్ల మంది కొత్తగా బేసిక్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్లకు షిఫ్ట్ అయ్యారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ యూజర్ల సంఖ్య 7.8 కోట్లు పెరిగింది. అంటే పాత వారితో పాటు కొత్తగా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారిలో చాలా మంది యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం దేశ జనాభాలో 33 శాతం మంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అంటే కనీసం యాభై కోట్ల మంది జనాభా నిత్యం సామాజిక మాధ్యమాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. స్థిర వ్యాపారాన్ని మించి సాధారణంగా గల్లీ చివర కిరాణా కొట్టు మొదలు బడా షాపింగ్ మాల్ వరకు వ్యాపారం స్థిరమైన నిర్మాణాలు ఉన్న చోటే జరుగుతుంది. అక్కడ లభించే వస్తువులు, ఉత్పత్తుల గురించి వేర్వేరు చోట్ల ప్రచారం చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఆన్లైన్ బిజినెస్‌లో ఈ కష్టాలు ఉండవు. కస్టమర్ ఎక్కడుంటే ప్రొడక్ట్ అక్కడే కనిపిస్తుంది. ఆయా ప్రొడక్టుకు సంబంధించిన సమాచారం, ప్రకటనలు కూడా కస్టమర్‌కి అతి దగ్గర ఇంచుమించు అతని నీడలా వెన్నంటి ఉంటాయి. దీంతో కస్టమర్‌కి చేరువ కావడం అమ్మకాలు జరిపించడం ఆన్లైన్లో తేలికగా మారింది. కీలకంగా సోషల్ మీడియా స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ ద్వారా వేల కొద్ది వస్తువులు మన చెంతనే ఉన్నా అందులో మనకు ఏదీ అవసరం, ఎప్పుడు అవసరం అనే విషయాలు సెర్చ్ చేయడమనేది సాధారణ విషయమేమీ కాదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారి అభిరుచులు, అవసరాలను ఎప్పటికప్పుడు మెషిన్ లెర్నింగ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలిసి పోతుంది. దానికి అనుగుణంగా వారికి అవసరమైన వస్తువులు, ఉత్పత్తులే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫార్మ్‌లలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో కస్టమర్‌కి అతి దగ్గరగా వెళ్లే అవకాశం ఈ కామర్స్‌కి ఉంటోంది. తాజా నివేదికల ప్రకారం ఒక వ్యక్తి కొనుగోలులో సోషల్ మీడియా ప్రభావం 34 శాతం ఉంటోంది. రెండూ ఉంటేనే ప్రజలు వేగంగా ఈ కామర్స్ రంగానికి మారుతున్న వైనం, కొనుగోలు విషయంలో సోషల్ మీడియా ప్రభావాన్ని గమనించిన అనేక బడా సంస్థలు తమ బిజినెస్ మాడ్యుల్లో మార్పులు చేసుకుంటున్నాయి. షాప్ లేదా బడా మాల్స్‌ను నిర్వహించడంతో పాటు వాటికి అనుబంధంగా ఈ కామర్స్ ఫ్లాట్ఫార్మ్ని కూడా అందుబాటులోకి తెస్తున్నాయి. ఇలాంటి మార్పులు చేసిన సంస్థల వ్యాపారం గతం కంటే బాగుండగా కేవలం సంప్రదాయ వ్యాపారానికే పరిమితమైన చోట వృద్ధి రేటు తక్కువగా ఉంటోంది. -
Zoom: లక్ష కోట్లతో జూమ్ భారీ డీల్...! అందుకోసమేనా..!
వీడియో కాన్ఫరెన్సింగ్ దిగ్గజం జూమ్ కీలక ఒప్పందాన్నికుదుర్చుకోనుంది. ప్రముఖ క్లౌడ్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ ఫైవ్9 ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. జూమ్ తన కస్టమర్లకు మరింత సేవలను అందించడం కోసం సుమారు 14.7 బిలియన్ డాలర్ల( సుమారు రూ. లక్ష కోట్ల)తో ఫైవ్9 ను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫైవ్9 క్లౌడింగ్ సాఫ్ట్వేర్ జూమ్‌కు ఆపరేటింగ్ యూనిట్‌గా మారనుంది. అంతేకాకుండా ఫైవ్9 కంపెనీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ రోవాన్ ట్రోలోప్ జూమ్ సంస్థకు ప్రెసిడెంట్ కానున్నారు. రెండు కంపెనీల మధ్య ఒప్పందం 2022 మొదటి అర్ధభాగంలో ముగుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఒప్పందం ప్రకారం..రెండు కంపెనీల బోర్డులచే ఆమోదం పొందిన తరువాత, ఫైవ్ 9 కంపెనీ ప్రతి వాటాకు ఫైవ్ 9 స్టాక్ హోల్డర్లు క్లాస్ ఎ కామన్ స్టాక్ ఆఫ్ జూమ్ 0.5533 షేర్లను అందుకుంటారు. అంతర్జాతీయ మార్కెట్లో ఫైవ్ 9 షేర్లు శుక్రవారం 0.6 శాతం పెరిగి 177.60 డాలర్లకు చేరుకున్నాయి. జూమ్ 1.4 శాతం పెరిగి 361.97 డాలర్ల వద్ద స్థిర పడింది. జూమ్ కంపెనీ విలువ సుమారు 106 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,92,450 కోట్లు). ఈ భారీ డీల్ అందుకోసమేనా..! ఫైవ్ 9 కంపెనీ క్లౌడ్-బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో మేటి. దీని అత్యంత స్కేలబుల్ , సురక్షితమైన క్లౌడ్ కాంటాక్ట్ సెంటర్. అనేక రకాల ఛానెళ్లలో కస్టమర్ ఇంటరాక్షన్ల నిర్వహణ, ఆప్టిమైజేషన్‌ను అనుమతించే సులభమైన యాప్. ఈ క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో జూమ్ ఆన్లైన్ సమావేశాల్లో పంచుకునే వివిధ అంశాలకు చెందిన డాక్యుమెంట్లు మరింత సురక్షితంగా ఉంటాయని తెలుస్తోంది. -
ఎస్బీఐ ట్వీట్ : నెటిజనుల సెటైర్లు
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 2019-20 వార్షిక నివేదిక ప్రకారం తన ఖాతాదారుల సంఖ్య అమెరికా జనాభాకంటే ఎక్కువ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అమెరికా జనాభా 33.2 కోట్లు.. దేశవ్యాప్తంగా 22,141 శాఖలలో 44.89 కోట్ల కస్టమర్లు తమ సొంతమని ట్వీట్ చేసింది. తమ కస్టమర్ల సంఖ్య మొత్తం అమెరికా జనాభా కంటే ఎక్కువగా ఉందంటూ ఉత్సాహంగా, గర్వంగా ప్రకటించింది. దీంతో నెటిజన్లు ఎస్బీఐ పనితీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఎస్బీఐ సేవలకు సంబంధించి తమకెదురైన చేదు అనుభవాలు, అనుభవించిన ఫ్రస్ట్రేషన్‌ను ప్రకటించేందుకు యూజర్లు ఈ అవకాశాన్ని భలే ఉపయోగించుకున్నారు. కస్టమర్లకు పేలవమైన సేవను అందించడానికి కారణం అదేనా? ఎస్బీఐ సిబ్బంది మొరటు ప్రవర్తన, అసమర్థత.. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో.. అంటూ ఒక యూజర్ ఘాటుగానే స్పందించారు. దయచేసి ఎన్‌పీఏఎ గురించి కూడా మాట్లాడమని కొందరు, ఖచ్చితంగా మంచి జోకు పేల్చారు అని మరికొందరు వ్యాఖ్యానించడం విశేషం. అటు అమెరికా జనాభాను మించిన యూజర్లు అంటూ టెలికాం రంగ దిగ్గజం రిలయన్స్ జియో కూడా ఇలాంటి సమాచారాన్ని ట్విటర్లో వెల్లడించింది. జియో కస్టమర్ల సంఖ్య 2020 నాటికి 40 కోట్లతో మొత్తం అమెరికన్ జనాభాను అధిగమించిందని ట్వీట్ చేసింది. ఈ క్రమంలో ఎస్బీఐ కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అయింది. 🇺🇲: Population in 2020 was 33.2 crore 🇮🇳: SBI has 44.89 crore customers #USvsIndia *As per SBI annual report of 2019-20. — State Bank of India (@TheOfficialSBI) January 5, 2021 🇺🇲: Transaction has been completed 🇮🇳: UPI services are down for SBI — Ⓢⓤⓝⓝⓨ (@Sunny____123) January 5, 2021 🇺🇸 : 332 million 🇮🇳 : 400 million #OnJio — Reliance Jio (@reliancejio) January 4, 2021 -
భారీ టార్గెట్‌ను ఛేదించిన రిలయన్స్ జియో
-
భారీ టార్గెట్‌ను ఛేదించిన రిలయన్స్ జియో
ముంబై : టెలికాం ఇండస్ట్రిలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో టార్గెట్‌గా పెట్టుకున్న భారీ లక్ష్యాన్ని ఛేదించేసింది. జియో 10 కోట్ల మంది సబ్ స్కైబర్ బేస్ ను క్రాస్ చేసినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ బుధవారం ప్రకటించారు. '' జియో సేవలను ప్రారంభించిన సమయంలో అతితక్కువ సమయంలోనే 100 మిలియన్ కస్టమర్లను చేరుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నాం. కానీ నెలల వ్యవధిలోనే లక్ష్యాన్ని చేరుకుంటామని మేము అంచనావేయలేదు. ఆధార్ ఆధారిత మమ్మల్ని మిలియన్ కస్టమర్లను చేరుకోవడానికి సహకరించింది'' అని ముఖేష్ అంబానీ చెప్పారు. నాస్కామ్ ఇండియా లీడర్ షిప్ ఫోరమ్ 2017 ఇంటరాక్టివ్ సెషన్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. 2015 డిసెంబర్ 27 నుంచి కంపెనీ తొలుత తమ ఉద్యోగులకు ఉచితంగా 4జీ సర్వీసులు ఇవ్వడం ప్రారంభించిన సంగతి తెలిసింది. అనంతరం కస్టమర్లందరికీ 2016 సెప్టెంబర్ 5 నుంచి జియో ఉచిత సేవలను అందుబాటులోకి తెచ్చింది. కేవలం 83 రోజుల్లోనే జియో 50 మిలియన్ కస్టమర్లను చేరుకుంది. ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా జియోకు డిసెంబర్ 31 వరకు 72.4 మిలియన్ల సబ్స్రైబర్లు ఉన్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జియో 100 మిలియన్ సబ్‌స్కైబర్ బేస్‌ను చేధించినట్టు ముఖేష్ అంబానీ తెలిపారు.