భారీ టార్గెట్ను ఛేదించిన రిలయన్స్ జియో | Reliance Jio Crosses 100 Million Customer Base: Mukesh Ambani | Sakshi
Sakshi News home page

భారీ టార్గెట్ను ఛేదించిన రిలయన్స్ జియో

Published Thu, Feb 16 2017 10:53 AM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

భారీ టార్గెట్ను ఛేదించిన రిలయన్స్ జియో

భారీ టార్గెట్ను ఛేదించిన రిలయన్స్ జియో

టెలికాం ఇండస్ట్రిలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో టార్గెట్గా పెట్టుకున్న భారీ లక్ష్యాన్ని ఛేదించేసింది.

ముంబై : టెలికాం ఇండస్ట్రిలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో టార్గెట్గా పెట్టుకున్న భారీ లక్ష్యాన్ని ఛేదించేసింది. జియో 10 కోట్ల మంది సబ్ స్కైబర్ బేస్‍ ను క్రాస్ చేసినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ బుధవారం ప్రకటించారు. '' జియో సేవలను ప్రారంభించిన సమయంలో అతితక్కువ సమయంలోనే 100 మిలియన్ కస్టమర్లను చేరుకోవాలని టార్గెట్గా పెట్టుకున్నాం. కానీ నెలల వ్యవధిలోనే లక్ష్యాన్ని చేరుకుంటామని మేము అంచనావేయలేదు. ఆధార్ ఆధారిత మమ్మల్ని మిలియన్ కస్టమర్లను చేరుకోవడానికి సహకరించింది'' అని ముఖేష్ అంబానీ చెప్పారు. నాస్కామ్ ఇండియా లీడర్ షిప్ ఫోరమ్ 2017 ఇంటరాక్టివ్ సెషన్ లో ఈ విషయాన్ని వెల్లడించారు.
 
2015 డిసెంబర్ 27 నుంచి కంపెనీ తొలుత తమ ఉద్యోగులకు ఉచితంగా 4జీ సర్వీసులు ఇవ్వడం ప్రారంభించిన సంగతి తెలిసింది. అనంతరం కస్టమర్లందరికీ 2016 సెప్టెంబర్ 5 నుంచి జియో ఉచిత సేవలను అందుబాటులోకి తెచ్చింది. కేవలం 83 రోజుల్లోనే జియో 50 మిలియన్ కస్టమర్లను చేరుకుంది. ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా జియోకు డిసెంబర్ 31 వరకు 72.4 మిలియన్ల సబ్స్రైబర్లు ఉన్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జియో 100 మిలియన్ సబ్స్కైబర్ బేస్ను చేధించినట్టు ముఖేష్ అంబానీ తెలిపారు.     
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement