టెలికాం ఇండస్ట్రిలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో టార్గెట్గా పెట్టుకున్న భారీ లక్ష్యాన్ని ఛేదించేసింది. జియో 10 కోట్ల మంది సబ్ స్కైబర్ బేస్ ను క్రాస్ చేసినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ బుధవారం ప్రకటించారు. '' జియో సేవలను ప్రారంభించిన సమయంలో అతితక్కువ సమయంలోనే 100 మిలియన్ కస్టమర్లను చేరుకోవాలని టార్గెట్గా పెట్టుకున్నాం. కానీ నెలల వ్యవధిలోనే లక్ష్యాన్ని చేరుకుంటామని మేము అంచనావేయలేదు. ఆధార్ ఆధారిత మమ్మల్ని మిలియన్ కస్టమర్లను చేరుకోవడానికి సహకరించింది'' అని ముఖేష్ అంబానీ చెప్పారు. నాస్కామ్ ఇండియా లీడర్ షిప్ ఫోరమ్ 2017 ఇంటరాక్టివ్ సెషన్ లో ఈ విషయాన్ని వెల్లడించారు.