Frisco
-
రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు. -
అమెరికాలో కాంగ్రెస్ గెలుపు సంబురాలు
-
తెలుగింటి సంస్కృతి మ్యూజిక్ వీడియోకి అద్భుత స్పందన
-
టీపీఏడీ ఆధ్వర్యంలో ఘనంగా బొడ్డెమ్మ పండుగ
ప్రిస్కో : బొడ్డెమ్మ.. బొడ్డెమ్మ కోల్ బిడ్డాలెందరో కోల్.. అంటూ బొడ్డెమ్మ పాటలు ఫ్రిస్కోలో మార్మోగాయి. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (టీపీఏడీ) ఆధ్వర్యంలో బొడ్డెమ్మ పండగను ఘనంగా జరిపారు. చిన్న బతుకమ్మ పండుగకు ముందే బొడ్డెమ్మ వేడుకలు మొదలవుతాయి. పీటపై మట్టితో చేసిన బొడ్డెమ్మను పెట్టి.. పూలతో అలంకరించి.. ఎర్రమట్టి(జాజు)తో చుట్టూ అలికి.. ఆడపడుచులు బొడ్డెమ్మ పాటలు పాడారు. ఈ వేడుకల్లో 100మందికి పైగా మహిళలు, యువతులు పాల్గొన్నారు. బతుకమ్మ టీమ్ ఛైర్ మాధవి లోకిరెడ్డి, కో ఛైర్ మంజూల తోడుపునూరి, టీపీఏడీ వాలంటీర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డల్లాస్‌లోని వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను నిర్వహించాలని టీపీఏడీ అధ్యక్షులు శ్రీని గంగాధర, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్ శారదా సింగిరెడ్డి, ఫౌండేషన్ కమిటీ ఛైర్ రఘువీరా బండారు, టీపీఏడీ నాయకులు రమణ లష్కర్, చంద్రా పోలీస్‌లు ప్రణాళికలు సిద్దం చేశారు. కొపెల్‌లో అక్టోబర్ 8న ఎంగిలిపూలు బతుకమ్మ, అక్టోబర్ 13న అల్లెన్ ఈవెంట్ సెంటర్లో సద్దులు బతుకమ్మ నిర్వహించనున్నట్టు తెలిపారు. -
టీపీఏడీ ఆధ్వర్యంలో రక్తదానానికి విశేష స్పందన
డల్లాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. 'బ్లడ్ డ్రైవ్- లైఫ్ సేవింగ్' నినాదంతో టీపీఏడీ మూడో ఏడాది రక్తదాన శిబిరాన్ని డల్లాస్‌లోని ఫ్రిస్కోలో ఏర్పాటు చేసింది. కార్టల్ బ్లడ్ కేర్, వైబ్రంట్ డల్లాస్ ఫోర్ట్ వర్త్ కమ్యూనిటీలతో కలిసి టీపీఏడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 200 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి రిజిస్టర్ చేసుకున్నా, పరిధిదాటడంతో 100 మంది దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అనే ముఖ్య ఉద్దేశ్యంతో టీపీఏడీ ఈ రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టింది. 2016లో నిర్వహించిన రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తంతో 78 మంది ప్రాణాలు కాపాడగలిగింది. ఈ ఏడాదిలో మే 13న వనభోజనాలు, జూలై 8న ఫుడ్ డ్రైవ్, సెప్టెంబర్ 23న బతుకమ్మ, దసరా సంబరాలు, నవంబర్11న షామ్-ఈ-మెహ్ఫిల్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడానికి టీపీఏడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. టీపీఏడీ ప్రెసిడెంట్ కరణ్ పోరెడ్డి, సెక్రటరీ రమణ లష్కర్, చంద్ర పోలీస్, లింగారెడ్డి అల్వ, రవికాంత్ మామిడి, టీపీఏడీలో ఫౌండేషన్ కమిటీ అధ్యక్షులు ఉపేందర్ తెలుగు, వైస్ ఛైర్మన్ మహేందర్ కామిరెడ్డి, అజయ్ రెడ్డి, రావు కల్వల, రఘువీర్ బండారు, జానకి రామ్ మందాడి, రాజ్వర్ధన్ గోందీ, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్మన్ అశోక్ కొండాల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వైస్ ఛైర్మన్ మనోహర్ కోసాగ్ని, మాధవి సుంకిరెడ్డి(కో ఆర్డినేటర్), రామ్ అన్నాడీ, గంగదేవర, పవన్ గంగాధరా, ప్రవీణ్ బిల్ల, రాజేందర్ తొడిగాల, ఇంద్రాణి పంచార్పుల, శ్రీనివాస్ వేముల, శ్రీని దర, సత్య పెర్కారి, సతీష్ జనుంపల్లి, సురేందర్ చింతల, రోజా ఆడెపు, రూపాకన్నయ్యగరి, శరత్ యెర్రం, టీపీఏడీ సలహాదారులు వేణు భాగ్యనగర్, విక్రం జనగం, నరేష్ సుంకిరెడ్డి, రవి శంకర్ పటేల్, జయ తెలకలపల్లి, సంతోష్ కోరె, అర్వింద్ ముప్పిడి, మాధవి లోకిరెడ్డి, సతీష్ నాగిల్లలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమవంతుగా కృషి చేశారు.