government companies
-
కంపెనీల బాండ్ బాజా!
ఎఫ్ఐఐల అమ్మకాలు ఆగటం లేదు. మార్కెట్లు పడిపోతున్నాయి. దీంతో చాలా కంపెనీల షేర్లు ఏడాది కనిష్టానికి వచ్చేశాయి. మిగిలిన పెట్టుబడి సాధనాల్లో... బంగారం పెరుగుతున్నా... ధరల్లో ఊగిసలాట తప్పదు. రియల్ ఎస్టేట్ అంతంత మాత్రంగానే ఉంది. బ్యాంకు డిపాజిట్లు సురక్షితమే కానీ... వడ్డీ రేట్లు తక్కువ. మరి వీటికన్నా ఎక్కువ వచ్చే ప్రభుత్వ బాండ్లు బెటరా? లేకపోతే అంతకన్నా కాస్త ఎక్కువ గిట్టుబాటయ్యే ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల బాండ్లు బెటరా? రాబోయే వారం పది రోజుల్లో పలు ప్రభుత్వ కంపెనీలు సైతం బాండ్లు జారీ చేయటానికి ముందుకొస్తున్న నేపథ్యంలో... వాటి లాభనష్టాలు, రిసు్కల గురించి తెలుసుకుందాం...వడ్డీ రేట్లు పెంచుతూ లిక్విడిటీని రిజర్వు బ్యాంకు కట్టడి చేస్తోంది. దీంతో అప్పుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా పలు కంపెనీలు బాండ్ల జారీకి వస్తున్నాయి. ఈ తాకిడి ఎంతలా అంటే... ఈ ఒక్కవారంలోనే కంపెనీలు రూ.30 వేల కోట్ల విలువైన బాండ్లు జారీ చేస్తున్నాయి. వీటిలో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఇరెడా) 7.40 శాతం వడ్డీతో 11 ఏళ్ల కాలానికి రూ.820 కోట్లు సమీకరించగా... నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) ఏడేళ్ల కాలానికి 7.35 శాతం వడ్డీ రేటుతో రూ.4,800 కోట్లు సమీకరించింది. ఇక ఆర్ఈసీ 7.99 శాతం వడ్డీతో నిరవధిక బాండ్లను జారీ చేసింది. రూ.2,000 కోట్లు సమీకరించాలనుకున్నా రూ.1,995 కోట్లే చేయగలిగింది. ఇక రాబోయే రోజుల్లో నాబార్డ్ పదేళ్ల కాలానికి రూ.7,000 కోట్లు, సిడ్బి నాలుగేళ్ల కాలానికి రూ.6,000 కోట్లు, పీఎఫ్సీ నాలుగేళ్లకు రూ.4 వేల కోట్లు సమీకరించనున్నాయి. జనవరిలో ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన, భౌగోళిక అనిశి్చతుల నేపథ్యంలో బాండ్ మార్కెట్ భయపడింది. వడ్డీ రేట్లు పెరిగాయి. ఆర్బీఐ సైతం వడ్డీ రేట్లు పెంచి లిక్విడిటీని కట్టడి చేసింది. దీంతో ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్‌లు (రాబడి) 0.5 శాతం వరకూ పెరిగాయి. దీంతో కార్పొరేట్లు మరింత ఎక్కువ వడ్డీని ఆఫర్ చేయాల్సి వచి్చంది. ప్రస్తుతం ప్రభుత్వ బాండ్ల ఈల్డ్ 7.1 శాతం నుంచి 7.3 శాతం మధ్య ఉండగా... ప్రైవేటు కంపెనీలు అంతకన్నా ఎక్కువ కూపన్ రేటును ఆఫర్ చేయాల్సి వస్తోంది. నిరవధిక బాండ్లు అంటే..సాధారణంగా పెర్పెట్యువల్ బాండ్లుగా పిలిచే ఈ బాండ్లకు నిర్ణీత కాలమంటూ ఏదీ ఉండదు. ఒక కంపెనీ ఈ రకమైన బాండ్లను జారీ చేస్తే... కాలపరిమితి ఉండదు కనుక ఏడాదికోసారి చొప్పున నిరవధికంగా వడ్డీని చెల్లిస్తూ పోతాయి. ఒకవేళ వాటిని బైబ్యాక్ చెయ్యాలని భావిస్తే అప్పుడు ప్రకటన ఇచి్చ... తమ బాండ్ల ప్రిన్సిపల్ మొత్తాన్ని చెల్లించి వెనక్కి తీసుకుంటాయి. అప్పటిదాకా వడ్డీ మాత్రం చెల్లిస్తుంటాయి. ప్రిన్సిపల్ మొత్తాన్ని తిరిగి పొందటానికి కాలపరిమితి ఉండదు కనుక వీటికి వడ్డీ రేటు కూడా ఎక్కువే ఉంటుంది. గమనించాల్సింది ఏంటంటే...బాండ్లలో ఇన్వెస్ట్ చేసేవారు గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే... ఆ బాండ్లకు బాగా రేటింగ్ ఉండి, చురుగ్గా ట్రేడయితేనే సెకండరీ బాండ్ మార్కెట్లో వెంటనే విక్రయించగలం. రేటింగ్ తక్కువగా ఉన్న బాండ్లయినా, నిరవధిక బాండ్లయినా విక్రయించటం అంత ఈజీ కాదు. పైపెచ్చు విక్రయించేటపుడు వాటి ధర అప్పటి వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. మీరు కొన్నపుడు వడ్డీరేట్లు తక్కువ ఉండి ఆ తరవాత పెరిగాయనుకోండి. మీ బాండ్ల ధర కూడా తగ్గుతుంది. అదే రివర్స్‌లో మీరు కొన్నాక వడ్డీ రేట్లు తగ్గితే.. మీ బాండ్లకు ఎక్కువ వడ్డీ వస్తుంది కనక వాటికి గిరాకీ ఉంటుంది. ఈ అంశాలు దృష్టిలో పెట్టుకుంటే బాండ్లలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు.ప్రభుత్వ సావరిన్ బాండ్లు→ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తాయి కనుక చాలా తక్కువ రిస్కు ఉంటుంది. → సురక్షితం కనుక... తక్కుక వడ్డీని ఆఫర్ చేస్తాయి. కానీ బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే వడ్డీ కాస్తంత ఎక్కువ ఉంటుంది. → డిపాజిట్ల మాదిరి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకోలేరు. కానీ బాండ్ మార్కెట్లో ట్రేడవుతాయి కనుక అప్పటి ధరకు విక్రయించుకోవచ్చు. → ఏడాదికోసారి వడ్డీ మన ఖాతాలో ఠంచనుగా పడుతుంది. ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీల బాండ్లు→ కంపెనీలు తమ సొంత పూచీకత్తుపై జారీ చేస్తాయి. వాటి పనితీరుపై ఆధారపడి ఉంటాయి కనుక రిస్కు కాస్తంత ఎక్కువ. → రిస్కు ఎక్కువ కనుక ప్రభుత్వ బాండ్ల కన్నా వడ్డీ కాస్త ఎక్కువే. → వీటిని కూడా ప్రభుత్వ బాండ్ల మాదిరి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాండ్ మార్కెట్లో విక్రయించుకునే అవకాశం ఉంటుంది. → వీటి రేటింగ్‌ను బట్టి వడ్డీ ఉంటుంది. ట్రిపుల్ ఏ బాండ్లకు కాస్త తక్కువగా... రేటింగ్ తగ్గుతున్న కొద్దీ వడ్డీ పెరిగేలా ఉంటాయి. → కాకపోతే తక్కు రేటింగ్ ఉన్న బాండ్లకు రిస్కు కూడా ఎక్కువని గమనించాలి. – సాక్షి, బిజినెస్ ప్రతినిధి -
‘లెక్క’లేని నిరుద్యోగులు!
సాక్షి, హైదరాబాద్: యువజనులు ఎక్కువ సంఖ్యలో ఉన్న మన రాష్ట్రంలో ఉపాధి ఎంతమందికి ఉంది.. నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారన్న దానిపై ప్రభుత్వ శాఖలవద్ద స్పష్టమైన లెక్కలు లేవని తెలుస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారనే దానిపై ప్రభుత్వ శాఖల్లో గందరగోళం నెలకొంది. ఉపాధి కల్పన, శిక్షణ విభాగం వద్ద గణాంకాలున్నప్పటికీ, వాటికీ వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన కుదరడంలేదు. దీంతో ఉపాధి కల్పనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే దానిపై స్పష్టత కొరవడింది. అధికారిక లెక్కల్లో 9.26 లక్షలే.. సాధారణంగా నిరుద్యోగిగా ఉన్న ప్రతి వ్యక్తి ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకుంటారు. ప్రస్తుతం ఎంప్లాయిమెంట్ కార్డు పొందే వారి సంఖ్య భారీగా తగ్గింది. వివిధ కోర్సులు పూర్తి చేసిన వారిలో కనీసం పావువంతు కూడా ఈ కార్డులకోసం దరఖాస్తు చేసుకోవడంలేదు. ఉపాధి కల్పనలో ఈ కార్డుల ప్రాధాన్యం తగ్గిపోవడంతో అభ్యర్థులు వీటిపై దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం ఉపాధి కల్పన శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 9,26,289 మంది నిరుద్యోగులున్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వారు 4,57,481. రాష్ట్రం ఏర్పాటై నాలుగేళ్లు కావస్తుండటంతో ఏటా సగటున లక్ష మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. కార్డులు పొందిన వారిలో అత్యధికంగా పదోతరగతి పూర్తి చేసినవారు 3.28 లక్షలు ఉండగా, ఇంటర్మీడియెట్ చదివినవారు 1.71లక్షలు, గ్రాడ్యుయేట్లు 1.53లక్షలు ఉన్నారు. ఆన్లైన్లో కార్డులు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల లెక్కలపై అంచనాల కోసం కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ విభాగం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. ఎంప్లాయిమెంట్ కార్డుల కోసం ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించి.. దాని ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ ప్రక్రియకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నారు. ఆన్లైన్ దరఖాస్తు విధానంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు.. వారి అర్హతలు, వయసు తదితర పూర్తిస్థాయి సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు. ఉపాధికల్పన శాఖ నిరుద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోపు కార్డును పొందే వీలు కల్పిస్తోంది. అదనపు కోర్సులు చేసిన తర్వాత దాన్ని అప్డేట్ చేసుకునే వీలుంటుంది. ఒక వ్యక్తికి ఒకే ఎంప్లాయిమెంట్ ఐడీ ఉండేలా ఉపాధి కల్పన శాఖ చర్యలు చేపట్టింది. కాగా, అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యం ఆధారంగా జాబ్‌మేళాలు నిర్వహించి ఉపాధి కల్పించేందుకు వీలుంటుంది. నేషనల్ పోర్టల్‌తో వివరాలన్నీ అనుసంధానం.. ఎంప్లాయిమెంట్ వెబ్‌సైట్‌ను అత్యాధునికంగా రూపొందించాం. ఇది కేవలం నిరుద్యోగ నమోదు ప్రక్రియకే పరిమితం కాదు. ఈ వెబ్‌సైట్‌ను నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌తో అనుసంధానం చేస్తాం. నిరుద్యోగుల నమోదు ప్రక్రియలో వారి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీలను తీసుకుంటాం. కొత్తగా ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో ఉపాధి అవకాశాలున్నప్పుడు అర్హతల ఆధారంగా ఆటోమేటిక్‌గా ఆయా అభ్యర్థులకు ఎస్సెమ్మెస్‌లు, ఈమెయిల్స్ వస్తాయి. స్థానికంగా ఉన్న పరిశ్రమలు, సంస్థలకు నియామకాల ప్రక్రియకు ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. - కె.వై. నాయక్, సంచాలకుడు, కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ విభాగం -
జల మార్గానికి పోల‘వరం’
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ బ తుకులు ఛిద్రం అవుతాయని ఆందోళన చెం దుతున్న ముంపు ప్రాంతాల ప్రజలకు అలాం టి బెంగ అవసరం లేదని.. ప్రాజెక్ట్ నిర్మిస్తే అక్కడి వారికి ప్రయోజనాలు చేకూరతాయని ప్రభుత్వరంగ సంస్థలు తేల్చారుు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తరుుతే.. ఆదివాసీలకు.. ముం పు ప్రాంతాల్లోని ప్రజలకు వృత్తి, వ్యాపా రం, రవాణా రంగాలు అభివృద్ధి చెందుతాయ ని స్పష్టం చేస్తున్నారుు. అక్కడి ప్రజల జీవితా ల్లో వెలుగులు నిండుతాయని నిగ్గుతేల్చారుు. కుక్కునూరు : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గోదావరి పై ఏర్పడే జలమార్గం వల్ల ముంపు ప్రాంతాల ప్రజలకు ప్ర యోజనాలు ఉన్నాయని ప్రభుత్వ రంగ సంస్థలు చెబుతున్నారుు. ప్రాజెక్టు వల్ల ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి రాజ మండ్రితోపాటు వివిధ పట్టణాలకు వెళ్లే దూరం తగ్గుతుందని పేర్కొంటున్నారుు. గత ఏడాది నోయిడాలోని ప్రభుత్వరంగ సంస్థ అరుున ఐడబ్ల్యూఏఐ (ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా), హైదరాబద్‌కు చెందిన ఐఐసీ (ఇంటలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కన్వర్షన్) సంస్థలు గోదావరిపై సర్వే నిర్వహించాయి. వరదల సమయంలో తప్ప గోదావరిలో నీటిమట్టం తక్కువగా ఉంటుందని, నీటిలోతు వందమీటర్లు ఉంటేనే లాంచీ ప్రయా ణం సాధ్యమవుతుందని తేల్చారుు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే నదిలో నీటిలోతు పెరుగుతుందని, దానివల్ల జల రవాణా సాధ్యమవుతుందని స్పష్టం చేశారుు. రోడ్డు, రైలు మార్గంతో పోలిస్తే జల మార్గం ద్వారా రాజమండ్రికి వెళ్లే ప్రయూణికులు, యాత్రికులకు దూ రం, ఖర్చు, సమయం తగ్గుతాయి. భద్రాచలం, రాజమండ్రి మధ్యలో ఉన్న పేరంటాలపల్లి, పాపికొండలు వంటి పర్యాటక ప్రాంతాలను చూసే వీలు కలుగుతుంది. భద్రాచలం బ్రిడ్జి నుంచి రాజమండ్రి కాటన్ బ్యారేజీ వరకు గోదావరి నది పొడవు 157 కిలోమీటర్లు ఉండగా.. నది ఒడ్డు 171 కిలోమీటర్లు ఉందని సర్వే సంస్థలు నిర్థారించాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని పోచవరం, పాపికొండలు వద్ద 59 మీటర్లు, కచ్చులూరు వద్ద గోదావరిలో 60 మీటర్లు నీటిలోతు ఉండగా, కుక్కునూరు మండల పరిధిలోని వింజరం రేవులో ఆరు మీటర్లే లోతు ఉందని గుర్తించారుు. పోలవరం ప్రాజెక్టు పూర్తరుుతే నీటిలోతు సుమారు వందమీటర్లు ఉండవచ్చని సర్వే అధికారులు అంచనా వేశారు. భద్రాచలం నుంచి చింతూరు మీదుగా రాజమండ్రికి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 209 కిలోమీటర్ల దూరం ప్రయూణించాలి. భద్రాచలం నుంచి కుక్కునూరు మీదుగా రాజమండ్రికి 185 కిలోమీటర్ల దూరం ఉంది. జలమార్గం ద్వారా ఆ దూరం 157 కిలోమీటర్లకు తగ్గుతుంది. రాజ మండ్రి, కాకినాడ వెళ్లే ప్రయాణికులకు సమయం, ఖర్చు, దూరం కలసి వసా ్తరుు. జలరవాణా వ్యవస్థ ఏర్పాటైతే ముంపు మండలాలు అభివృద్ధి చెందుతారుు. ప్రజలకు ఉపాధి లభిస్తుంది.