grand opening
-
కొత్తపేటలో హీరోయిన్ శ్రీలీల సందడి
-
జియో వరల్డ్ ప్లాజాలో.. ఈఎల్ & ఎన్ లండన్
ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన లైఫ్‌స్టైల్ అండ్ కేఫ్ బ్రాండ్ ఈఎల్ & ఎన్ లండన్.. జియో వరల్డ్ ప్లాజాలో తన మొదటి ఇండియన్ అవుట్లెట్ ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ప్రారంభమైన ఈ గ్లోబల్ సెన్సేషన్ భారతీయ మార్కెట్లో మొదటి వెంచర్ అని తెలుస్తోంది.2017లో అలెగ్జాండ్రా మిల్లర్ ప్రారంభించిన ఈఎల్ & ఎన్ (ఈట్, లైవ్ & నోరిష్) ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. ఈ బ్రాండ్ పింక్ ఇంటీరియర్స్, అద్భుతమైన ఫ్లోరల్ డెకర్ వంటి వాటితో కస్టమర్లను మాత్రమే కాకుండా.. ప్రేక్షకులను కూడా చాలా ఆకర్షించింది.ఈఎల్ & ఎన్ ఫ్యాషన్ ఫార్వర్డ్ డిజైన్, స్పెషాలిటీ కాఫీ వంటి వాటితో పాటు ప్రత్యేక ఫుడ్ కూడా అందిస్తుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం ప్యారిస్, మిలన్, దుబాయ్, కౌలాలంపూర్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 37 అవుట్లెట్లను నిర్వహిస్తోంది. ఇప్పుడు ముంబైలో అడుగుపెట్టి భోజన ప్రియులను, సోషల్ మీడియా ఔత్సాహికులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది.జియో వరల్డ్ ప్లాజా రెండవ అంతస్తులో ఉన్న ఈ కొత్త కేఫ్.. 2,130 చ.అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో ప్రత్యేకమైన మోటిఫ్‌లు, గులాబీ రంగు మెష్ షాన్డిలియర్, సిగ్నేచర్ ఏఎల్ & ఎన్ పుష్పాలు & పత్రాలు, నియాన్ కోట్లు వంటివి ఉన్నాయి. అంతే కాకుండా.. టెర్రాజో & మార్బుల్ ఫ్లోరిం, ఐకానిక్ కేక్, కాఫీ బార్ వంటివి ఉన్నాయి. -
నాగబంధం సినిమా గ్రాండ్ ఓపెనింగ్‌లో మెగాస్టార్ చిరంజీవి విజువల్స్
-
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
లండన్‌లో శ్రీ వేంకటేశ్వర బాలాజీ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
టెక్స్టైల్ మెషినరీ స్టోర్ ప్రారంభించిన తెలుగు 'బిగ్‌బాస్' లహరి షారి (ఫొటోలు)
-
'ప్రచండ తరుణం కాఠిన్య కావ్యం’ మూవీ షూటింగ్ షురూ
అశోక్ రాజ్, రితికా రాజ్, శ్రష్టి వర్మ, వినయ్ బిడ్డప్ప, ఉగ్రం మంజు, రవితేజ ప్రధాన పాత్రల్లో ‘ప్రచండ తరుణం కాఠిన్య కావ్యం’ అనే సినిమా షురూ అయింది. బాల పులిబోయిన దర్శకత్వంలో పులిచర్ల నాగరాజు, రామచంద్ర, కొల్లకుంట నాగరాజు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ప్రొడక్షన్ హెడ్ రాజ్యలక్ష్మి కెమెరా స్విచ్చాన్ చేయగా, కన్నడ హీరో సిద్ధార్థ్ మహేశ్ క్లాప్ కొట్టారు. రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్క్రిప్ట్‌ని అందించారు. ‘‘మన పురాణాలు, ఇతిహాసాలను సైన్స్ అండ్ టెక్నాలజీతో బ్యాలెన్స్ చేసి తయారు చేసిన స్క్రిప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్
సాక్షి: ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఎన్ఎంఏసీసీ’ (నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్) ఘనంగా లాంచ్ అయింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో శుక్రవారం రాత్రి జరిగిన ఎన్ఎంఏసీసీ ఆరంభోత్సవానికి పలువురు రాజకీయ, వ్యాపార వర్గాల, క్రీడా రంగ ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. ఈ వేడుకల్లోఅంబానీ కుటుంబసభ్యులు, కాబోయే జంట అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ సినీ పరిశ్రమలకు చెందిన తారలు మెరిసారు. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన కుమార్తె సౌందర్య, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్, కుమారుడు ఆర్యన్‌ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, సల్మాన్‌ఖాన్, వరుణ్ ధావన్, భార్య మీరాతో కలిసి షాహిద్ కపూర్ రాజ్‌పుత్ ఉన్నారు. ఇంకా దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్, ప్రియాంకా చోప్రా, నిక్ జొనాస్ జంటతోపాటు శ్రద్ధాకపూర్, జాన్వీకపూర్, సోనం కపూర్, అలియాభట్, కొత్త జంట సిద్ధార్థ్ మల్హోత్ర, కియారా తదితర అతిరధమహారథులంతా ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఇంకా టీవీ ప్రముఖులలో రాహుల్ వైద్య, దిశా పర్మార్ , తారక్ మెహతా కా ఊల్తా చష్మా, జెతలాల్ ఏకేఏ దిలీప్ జోషిగాయని శ్రేయా కూడా కనిపించారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుటుంబం, అమృత ఫడ్నవీస్‌తో దేవేంద్ర ఫడ్నవిస్, ఎస్బీఐ మాజీ మాజీ చీఫ్ అరుంధతి భట్టాచార్య,సద్గురు కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు. గ్రాండ్ ఓపెనింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కొత్త శకానికి నాంది: అంబానీ నీతా చిరకాల స్వప్నం నెరవేరడంపై స్పందించిన ముఖేశ్ అంబానీ స్పందిస్తూ ఇది భావి భారతానికి కళలు , సంస్కృతికి కొత్త శకానికి నాంది అని వ్యాఖ్యానించారు. నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ లేదా ఎన్ఎంఏసీసీ అని కూడా పిలుస్తారు. భారతీయ సంస్కృతి, అంతరించిపోతున్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. గ్రాండ్ లాంచ్‌కి పలువురు ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Priyanka Chopra and Nick Jonas at the grand opening of the #NitaMukeshAmbaniCulturalCentre#CultureAtTheCentre #NMACC@priyankachopra @nickjonas pic.twitter.com/6UveIg2XFX — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) March 31, 2023 -
Namrata shirodkar: ఏసియన్ నమ్రత ‘ప్యాలెస్ హైట్స్’ రెస్టారెంట్ ప్రారంభం ( ఫొటోలు)
-
'తలుక్' మనిపించిన మోడల్స్..
-
నిజామాబాద్‌లో సందడి చేసిన సినీ నటి తమన్నా
-
తారల తళుకులు
-
జిల్ జిల్ జిల్ జిగేల్ రాణి
సొట్ట బుగ్గల సుందరి పూజా హెగ్డే శనివారం గుంటూరులో సందడి చేసింది. కొంటె చూపులతో కుర్రకారును ఉర్రూతలూగిస్తూ హలో హాయ్ అంటూ చిలక పలుకులు పలికింది. లక్ష్మీపురంలో స్వాతి షాపింగ్ మాల్ ప్రారంభానికి వచ్చిన ఈ సొగసరి.. చిరుదరహాసంతో యువతను ఆకట్టుకుంది. గుంటూరు ఈస్ట్: లక్ష్మీపురం మెయిన్ రోడ్డులో స్వాతి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి శనివారం వివిచ్చేసిన సినీతారలు సందడి చేశారు. హీరోయిన్ పూజా హెగ్డే జ్యోతి ప్రజ్వలన గావించి మాట్లాడారు. అత్యాధునిక ఫ్యాషన్ దుస్తులు గుంటూరు నగర ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషకరమని చెప్పారు. అందులోనూ డిస్కౌంట్ ధరలకే అందిస్తున్నారని తెలిపారు. ఆమెతోపాటు బిగ్ బాస్ ఫేమ్‌లు కౌశల్, దీప్తి అభిమానులకు అలరించారు. అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ప్రారంభించారు. షాపింగ్ మాల్ అధినేత వీవీ రమణబాబు లక్కీ డ్రాలో విజేతను ఎంపిక చేశారు. విజేతకు లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తమ అభిమాన తారలను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
ఆసియా క్రీడల ప్రారంభ సంరంభం
జకార్త: ఇండోనేసియా వేదికగా 2018 ఆసియా క్రీడల సంరంభం మొదలైంది. నాలుగుసంవత్సరాలకొకసారి నిర్వహించుకునే పదహారు రోజుల సంగ్రామానికి తొలి వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. 18వ ఆసియా క్రీడలు ఇండోనేసియా రాజధాని జకర్తాలో అంగరంగ వైభవంగా మొదలైంది. ఇండియా నుంచి ఇండోనేసియా చేరుకున్న టార్చ్‌తో క్రీడాజ్యోతిని వెలిగించి బాడ్మింటన్ లెజండరీ ప్లేయర్ సుశి సుశాంత్ వేడుకులకు గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చారు. క్రీడాకారులు, కళాకారులతో గెలోరా బుంగ్ కర్నో స్టేడియం కన్నుల పండువగా నిలిచింది. స్థానిక సంప్రదాయ కళారూపాలతోపాటు, లైట్ షో ఆహూతులను విపరీతంగా అలరించాయి. జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా భారతీయ క్రీడా, అధికార బృందానికి పరేడ్‌లో నాయకత్వం వహించాడు. 45 దేశాల నుంచి 10 వేలకు మందిపైగా అథ్లెట్లు ఈ క్రీడల బరిలో ఉన్నారు. భారత్ నుంచి 572 మంది అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారు. పోటీలు ఆదివారం నుంచి ప్రారంభంకానున్నాయి. Susi Susanti lights the cauldron, and with this the torch completes its journey! The torch that has been brought from India and across Indonesia, has finally been placed in the cauldron! What a spectacular welcome! #OpeningCeremonyAsianGames2018 #OpeningAG2018 #AsianGames2018 pic.twitter.com/aPcXNEd7fj — Asian Games 2018 (@asiangames2018) August 18, 2018 Thank you for watching the #OpeningCeremonyAsianGames2018! Did you enjoy the show? See you at the games! #OpeningAG2018 #AsianGames2018 pic.twitter.com/lzlaZ0OVv6 — Asian Games 2018 (@asiangames2018) August 18, 2018 -
అట్టహాసంగా ఆరంభమైన ఆసియా గేమ్స్
-
ఎస్బీహెచ్ ఘనవిజయం
హడలెత్తించిన విశాల్, అశ్విన్ ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: విశాల్ శర్మ (4/15), అశ్విన్ యాదవ్ (4/38) హడలెత్తించడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) జట్టు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో కేంబ్రిడ్జ్ ఎలెవన్‌పై ఘనవిజయం సాధించింది. ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో శుక్రవారం 17/1 స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన కేంబ్రిడ్జ్ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ చేతులెత్తేసింది. 46.4 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. హైదర్ అలీ (111 బంతుల్లో 56, 10 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఎస్బీహెచ్ 353, కేంబ్రిడ్జ్ ఎలెవన్ 154 పరుగులు చేశాయి. ఇన్నింగ్స్ విజయంతో ఎస్బీహెచ్ 16 పాయింట్లు సంపాదించగా, కేంబ్రిడ్జ్కు 2 పాయింట్లు దక్కాయి. నగరంలోని వివిధ మైదానాల్లో వర్షం వల్ల రెండు ఇన్నింగ్స్‌ల పాటు ఆట సాధ్యపడని మిగతా మ్యాచ్‌లన్నీ డ్రాగా ముగిశాయి. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 202 (మహంతి 42, రాధాకృష్ణ 45; సీవీ మిలింద్ 3/53, షాదాబ్ తుంబి 3/59, రాజేంద్ర 3/52), డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 218/7 (అక్షత్ రెడ్డి 56, పార్థ్జాల 52 , పరాశర్ 3/81). కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 503/3 (ఆరోన్ పాల్ 151 నాటౌట్, వైభవ్ 101 నాటౌట్; ఇంద్రశేఖర్ 2/104), ఆర్. దయానంద్ తొలి ఇన్నింగ్స్: 189/8 (భగత్ వర్మ 50, విజయ్ గౌడ్ 43; వైభవ్ 3/22, చందన్ సహాని 2/30, సూర్యప్రసాద్ 2/37). ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 221, రెండో ఇన్నింగ్స్: 130 (విష్ణు తివారి 41, పెంటా రావు 48; శబరీష్ 2/48) బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 117 (సాయిచరణ్ 46; దివేశ్ 3/32, రితేశ్ నేగి 3/30, కోటేశ్వర్ రావు 2/10).