Hyderabadi company
-
రూ.1,000 కోట్లు టార్గెట్.. హైదరాబాద్‌లో తయారీ కేంద్రం
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ఉత్పత్తుల సంస్థ ‘మివి’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) రూ.1,000 ఆదాయాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. మరిన్ని విభాగాల్లో ఉత్పత్తులను ఆవిష్కరించడంతోపాటు మరిన్ని ప్రాంతాలకు కార్యకలాపాలను విస్తరించడం, కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, మార్కెటింగ్ వ్యూహాల అమలు ద్వారా దీన్ని సాధించనున్నట్టు మివి సహ వ్యవస్థాపకులు మిధుల దేవభక్తుని, విశ్వనాథ్ కందుల ప్రకటించారు.ఈ సంస్థ 2024–25లో రూ.300 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయడం గమనార్హం. 1,500 మందికి ఉపాధి కల్పిస్తోంది. కంపెనీ విస్తరణ ప్రణాళికల గురించి ఓ వార్తా సంస్థతో సహ వ్యవస్థాకులు వివరాలు పంచుకున్నారు. ఐవోటీ డివైజ్‌లు, స్మార్ట్ వేరబుల్స్, స్మార్ట్ సీసీటీవీ కెమెరాలు, స్పీకర్లలోని ప్రవేశించనున్నట్టు చెప్పారు. అలాగే, ప్రస్తుత ఆడియో, మొబైల్ యాక్సెసరీల కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్టు తెలిపారు. ఇయర్ బడ్స్‌ను విడుదల చేయడం ద్వారా తొలుత ఇయర్ఫోన్లలోకి ప్రవేశించనున్నట్టు మిధుల ప్రకటించారు.ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్ ‘మివి ఏఐ’ని కంపెనీ ఇటీవలే ఆవిష్కరించడం గమనార్హం. తన ఉత్పత్తులకు ఏఐ టెక్నాలజీని జోడించడం ద్వారా కస్టమర్లకు మెరుగైన అనుభవం ఇచ్చే లక్ష్యంతో ఉంది. ఈ ఏఐ ప్లాట్‌ఫామ్ సాయంతో తమ ఆదాయాలను రెట్టింపు చేసుకోనున్నట్టు కంపెనీ వ్యవస్థాపకులు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్రజల నుంచి నిధులు (ఐపీవో) సమీకరించనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంలో కార్యకలాపాలు...హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న తయారీ కేంద్రం జూన్ నాటికి కార్యకలాపాలు మొదలు పెడుతుందని మివి ప్రమోటర్లు ప్రకటించారు. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ సదుపాయం ద్వారా విడిభాగాల తయారీపై దృష్టి సారిస్తామని, అంతర్జాతీయ బ్రాండ్లతో భాగస్వామ్యాలను కుదుర్చుకోనున్నట్టు తెలిపారు. యూఎస్, మధ్యప్రాచ్యం, యూరప్ మార్కెట్లలోకి విస్తరించనున్నట్టు చెప్పారు. -
హైదరాబాద్ కంపెనీ ఒలెక్ట్రాకు రూ. 424 కోట్ల డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (హెచ్ఆర్టీసీ) నుంచి 297 బస్సుల సరఫరా, నిర్వహణకు భారీ ఆర్డరు లభించింది. కాంట్రాక్ట్ ప్రకారం లెటర్ ఆఫ్ అవార్డ్ (ఎల్వోఏ) తేదీ నుంచి 11 నెలల్లో బస్సులను అందించాల్సి ఉంటుంది.ఈ డీల్ విలువ సుమారు రూ. 424.01 కోట్లని కంపెనీ వివరించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాల్లో నడిపేందుకు ప్రత్యేకంగా రూపొందిన ఈ బస్సులు 30 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో ఉంటాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 180 కి.మీ. వరకు ప్రయాణిస్తాయి.ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇన్ని విద్యుత్ బస్సులను నేరుగా కొనుగోలు చేయడం దేశీయంగా ఇదే తొలిసారని ఒలెక్ట్రా సీఎండీ కేవీ ప్రదీప్ చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి దేశీయంగా అతి పెద్ద ఆర్డరును అందుకోవడం తమకు గర్వకారణమని తెలిపారు. -
ఐపీవోకు హైదరాబాద్ కంపెనీ
హైదరాబాద్: ఇంజినీరింగ్ సంబంధ సేవలందించే హైదరాబాద్ కంపెనీ ఆర్డీ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 80 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లలో ఒకరైన చంద్ర శేఖర్ మోటూరు విక్రయానికి ఉంచనున్నారు.కంపెనీ సమీకృత డిజైన్, ఇంజినీరింగ్, మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసులు సమకూర్చుతోంది. ప్రధానంగా ప్రీఇంజినీర్డ్ బిల్డింగ్స్(పీఈబీ), మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్(ఎంహెచ్ఎస్), ఇంజినీరింగ్ సర్వీసెస్ పేరుతో మూడు విభాగాలలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 280 కోట్లు తెలంగాణలో కొత్తగా రెండు తయారీ యూనిట్ల ఏర్పాటుకు, మరో రూ. 45 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లోని పరవాడలో సమీకృత తయారీ యూనిట్ ఏర్పాటుకు వెచ్చించనుంది.రుణ చెల్లింపులకు రూ. 65 కోట్లు వినియోగించనుంది. 2008లో ఏర్పాటైన కంపెనీ క్లయింట్లలో ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా(ఏఎంఎన్ఎస్), జేకే సిమెంట్, నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ, ఉదయ్‌పూర్ సిమెంట్ వర్క్స్ తదితరాలున్నాయి. గతేడాది(2023–24) రూ. 620 కోట్ల ఆదాయం, రూ. 29 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
హైదరాబాద్‌లో స్టాండర్డ్ గ్లాస్ భారీ ప్లాంట్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా, కెమికల్ పరిశ్రమలకు ప్రత్యేక ఇంజనీరింగ్ పరికరాలను తయారు చేస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ 10వ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ సమీపంలోని బొంతపల్లి వద్ద 36 ఎకరాల్లో ఇది రానుంది. రూ.130 కోట్ల వ్యయంతో తొలి దశ 15 నెలల్లో పూర్తి అవుతుందని కంపెనీ ఎండీ నాగేశ్వర రావు కందుల వెల్లడించారు. 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుందని అన్నారు.జనవరి 6న ప్రారంభం అవుతున్న ఐపీవో వివరాలను వెల్లడించేందుకు శనివారమిక్కడ జరిగిన సమావేశంలో కంపెనీ ఈడీ కాట్రగడ్డ మోహన రావు, సీఎఫ్‌వో పాతూరి ఆంజనేయులుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అయిదేళ్లలో అన్ని దశలు పూర్తి చేసుకుని ప్లాంటు మొత్తం 9 లక్షల చదరపు అడుగుల స్థాయికి చేరుతుందని చెప్పారు. ఇందుకు మొత్తం రూ.300 కోట్ల పెట్టుబడి అవసరమని వెల్లడించారు. నతన కేంద్రంలో చమురు, సహజ వాయువు, భారీ పరిశ్రమలు, వంట నూనెల రంగ సంస్థలకు అవసరమైన ఇంజనీరింగ్ పరికరాలను తయారు చేస్తామని నాగేశ్వర రావు వివరించారు.అయిదేళ్లలో ఎగుమతులు సగం..కంపెనీ ఆదాయంలో గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల వాటా 0.5 శాతమే. 2024–25లో ఇది 15 శాతానికి చేరుతుందని నాగేశ్వర రావు వెల్లడించారు. ‘అయిదేళ్లలో ఎగుమతుల వాటా 50 శాతానికి చేరుస్తాం. యూఎస్‌కు చెందిన ఐపీపీ కంపెనీతో చేతులు కలిపాం.ఆ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1.5 లక్షలకుపైగా కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. ఐపీపీ సహకారంతో ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకుంటాం. అలాగే జపాన్‌కు రెండు నెలల్లో ఎగుమతులు ప్రారంభిస్తున్నాం. కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక్క భారత్ నుంచే రూ.15,000 కోట్లు ఉంటుంది’ అని వివరించారు.ఆర్డర్ బుక్ రూ.450 కోట్లు..ప్రస్తుతం స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ 65 రకాల ఉత్పత్తులను తయారు చేస్తోంది. 15 కొత్త ఉత్పత్తులు అభివృద్ధి దశలో ఉన్నాయని నాగేశ్వర రావు వెల్లడించారు. ‘నెలకు 300 యూనిట్లు తయారు చేసే సామర్థ్యం ఉంది. రెండు నెలల్లో ర.40 కోట్ల మూలధన వ్యయం చేస్తాం. రెండేళ్లలో మరో ర.60 కోట్లు వెచ్చిస్తాం. 2023–24లో ర.549 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ర.700 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం. ఏటా టర్నోవర్‌లో 50 శాతం వృద్ధి నమోదు చేస్తున్నాం. ఆర్డర్ బుక్ రూ.450 కోట్లు ఉంది’ అని పేర్కొన్నారు.జనవరి 6న ఐపీవో..స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీవో జనవరి 6న ప్రారంభమై 8న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ ర.123 కోట్లు అందుకుంది. ఒక్కొక్కటి ర.140 చొప్పున 87,86,809 ఈక్విటీ షేర్లను కేటాయించింది. అమన్సా హోల్డింగ్స్, క్లారస్ క్యాపిటల్–1, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ ఎంఎఫ్, కోటక్ మహీంద్రా ట్రస్టీ కో లిమిటెడ్ ఏ/సీ కోటక్ మాన్యుఫ్యాక్చర్ ఇన్ ఇండియా ఫండ్, టాటా ఎంఎఫ్, మోతిలాల్ ఓస్వాల్ ఎంఎఫ్, 3పీ ఇండియా ఈక్విటీ ఫండ్–1, కోటక్ ఇన్ఫినిటీ ఫండ్–క్లాస్ ఏసీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐటీఐ లార్జ్ క్యాప్ ఫండ్ వీటిలో ఉన్నాయి.ఇక ఐపీవోలో భాగంగా ర.210 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. 1,42,89,367 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు విక్రయిస్తారు. షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేస్తారు. ప్రైస్ బ్యాండ్ ర.133–140గా నిర్ణయించారు. ఇన్వెస్టర్లు కనీసం 107 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
కావాల్సిన ఫర్నిచర్... ఆన్లైన్లో!
⇒ గదిని బట్టి మనమే ఫర్నీచర్‌ను ఎంచుకునే వీలు ⇒ కస్టమ్ఫర్నిష్.కామ్ సరికొత్త సేవలు ⇒ రూ.16 కోట్ల పెట్టుబడులు పెట్టిన సంస్థలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటికి ఫర్నిచర్ ఎలా ఉండాలి? తెలుసుకోవటానికి నాలుగు షాపులు తిరగటం... తక్కువ మోడల్స్ ఉంటాయి కనక ఎక్కువ చోట చూడటం... చివరికి ఎక్కడో ఒక చోట రాజీపడటం!!. చాలామంది చేస్తున్నదిదే. ఇపుడు ఆ అవసరం లేకుండా నచ్చిన ఫర్నిచర్‌ను మన టేస్ట్‌కు తగ్గట్టుగా మనమే సెలక్ట్ చేసుకునే అవకాశాన్ని... అది కూడా ఇంట్లో నుంచే కొనుక్కునే అవకాశాన్ని ఆన్లైన్ సంస్థలు అందిస్తున్నాయి. ఇంటికి కావలసిన బెడ్స్, వార్డ్ రోబ్స్, డైనింగ్ టేబుల్, కిచెన్... ఇలా ఏ ఫర్నిచర్ కావాలన్నా ఆర్డరిచ్చేయొచ్చు. ఇంట్లోని గది సైజులకు సరిగ్గా సరిపోయేలా నచ్చిన రంగు, నచ్చిన మెటీరియల్.. ఇలా మన అభిరుచికి అనుగుణంగా ఏం కావాలంటే అది ‘కస్టమ్ఫర్నిష్.కామ్’ ద్వారా మనమే ఎంచుకోవచ్చు. ఈ హైదరాబాదీ సంస్థలో రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు పెట్టుబడులు పెట్టారు. దీనికి సంబంధించి సంస్థ వ్యవస్థాపక సీఈఓ డాక్టర్ మధుకర్ గంగాడీఏమంటారంటే... - సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అభిరుచికి తగ్గ ఫర్నీచర్ ఉండాలనుకోవటం తప్పేంకాదు. కానీ రిటైల్ షాపులు ఆ కోరికను తీర్చట్లేదు. వారు తయారు చేసిన ఫర్నీచర్‌లో మనకు నచ్చింది ఎంచుకుంటున్నాం. అంతే!!. కానీ, కస్టమ్ఫర్నిష్.కామ్‌లో మనకు నచ్చిన ఫర్నీచర్‌ను మనమే ఎంచుకునే వీలుంది. కస్టమ్ఫర్నిష్.కామ్ వెబ్‌సైట్‌కు వెళ్లగానే వార్డ్రోబ్స్, మాడ్యులర్ కిచెన్స్, సోఫాలు, ఫుల్ హౌజింగ్ ఫర్నీషింగ్ అనే విభాగాలు కన్పిస్తాయి. కావాల్సిన విభాగాన్ని ఎంచుకొని ఇంట్లోని గది సైజులను, నచ్చిన రంగు, మెటీరియల్.. అంతేకాదండోయ్ ఆయా ఫర్నీచర్ల మీద మనకు నచ్చిన ఫొటోలు, థీమ్‌లు ఇలా ఇలా ఎలా కావాలంటే అలా తయారు చేయించుకోవచ్చు. 7-15 రోజుల్లో డెలివరీ.. ఫర్నిచర్ ఎంచుకున్నాక ధర కూడా పక్కనే డిస్ప్లే అవుతుంటుంది. 50 శాతం అడ్వాన్స్ చెల్లించిన తర్వాత.. 7-15 రోజుల్లో ఇంటికి డెలివరీ చేస్తాం. ప్రతి ఫర్నీచర్‌పైనా గ్యారంటీ ఇస్తాం. కస్టమ్ఫర్నిష్.కామ్‌లో కొనే ప్రతి ఫర్నీచర్ రిటైల్ షాపులో కంటే 30 శాతం తక్కువ ధరకే వస్తుంది. ఇతర ఆన్లైన్ పోర్టళ్ల కంటే 40 శాతం తక్కువ ధరకు లభిస్తుంది. ఏడాదిన్నరలో 10 ఫ్యాక్టరీలు ప్రస్తుతం మూసాపేట్లో 30 వేల చ.అ. విస్తీర్ణంలో ఫర్నీచర్ తయారీ యూనిట్ ఉంది. నెల రోజుల్లో 60 వేల చదరపు అడుగుల్లో మరో యూనిట్‌ను ప్రారంభిస్తాం. వచ్చేనెల్లో బెంగళూరు, చెన్నై నగరాలకు, ఆరు నెలల్లో ఢిల్లీ, కోల్కత్తా, ముంబై నగరాలకు విస్తరిస్తాం. ఏడాన్నరలో దేశవ్యాప్తంగా 10 ఫ్యాక్టరీలను నెలకొల్పుతాం. ఒక్కో ఫ్యాక్టరీపై రెండున్నర కోట్ల పెట్టుబడులు పెడతాం. రూ.16 కోట్ల పెట్టుబడులు.. తొలిసారిగా హైదరాబాద్‌లో మా సంస్థకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ (సిడ్బీ) రూ.3 కోట్ల రుణం మంజూరు చేసింది. అలాగే డీఆర్ఎల్ చైర్మన్ సతీష్ రెడ్డి, పీపుల్ కేపిటల్ శ్రీని రాజు, హైదరాబాద్ ఏంజిల్స్ ఫౌండర్ శ్రీని కొప్పోలు, గ్రీన్కో గ్రూప్ అనిల్ చలమశెట్టి వ్యక్తిగతంగా రూ.16 కోట్ల పెట్టుబడులను పెట్టారు. త్వరలోనే మ రో రూ.100 కోట్ల పెట్టుబడుల కోసం రౌండ్స్ నిర్వహిస్తాం. ఫర్నీచర్ పరిశ్రమ 20 బిలియన్ డాలర్లు.. దేశంలో ఫర్నీచర్ మార్కెట్ విలువ 20 బిలియన్ డాలర్లు. దీన్లో 15 శాతం వాటా సంఘటిత రంగానిది. 2-3 శాతం వాటా మాత్రమే ఆన్లైన్ ఫర్నీచర్ కంపెనీలది. ఇది చాలు దేశంలో ఆన్లైన్లో ఫర్నిచర్ అమ్మకాలకు ఎంత అవకాశముందో చెప్పడానికి. అసంఘటిత రంగ ఉత్పత్తులు ఎక్కువగాఉండటం, రవాణా ఛార్జీలు కలిసి రిటైల్ షాపుల్లో ఎక్కువ ధరకు కారణమవుతున్నాయి. ఇది కూడా ఆన్‌లైన్‌కు కలిసొచ్చేదే.