mental pressure
-
బర్త్‌డే రెండు రోజులనగా ఇన్ఫ్లూయెన్సర్,హెయిర్ బ్రాండ్ సీఈవో ఆత్మహత్య
ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్, హెయిర్ కేర్ బ్రాండ్, మిష్ కాస్మెటిక్స్ వ్యవస్థాపక సీఈవో ఆత్మహత్య కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మూడులక్షలకుపైగా అభిమానులను సొంతం చేసుకున్న మిషా సరిగ్గా తన 25వ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు ఆత్మహత్య చేసుకోవడం ఆమె అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది.కామెడీ స్కిట్లు, వీకెండ్ కామెడీ అంటూ కామెడీ కంటెంట్‌తో పాపులర్అయిన మిషా అగర్వాల్ ఆకస్మిక మరణం అందరినీ షాక్‌కు గురిచేసింది.మిషా సోదరి ముక్తా అగర్వాల్‌తోపాటు ఈ హృదయ విదారక వార్తను ఆమె కుటుంబ సభ్యులు మిషా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌లోని పోస్ట్ ద్వారా ధృవీకరించారు. మానసిక ఒత్తిడికారణంగానే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మిషా మానసిక ఆరోగ్యం బాగాలేదని సూచిస్తుందని కూడా ఆమె ఎత్తి చూపారు. లా చదువుకుని, ది మిషా అగర్వాల్ షో అనే కామిక్ షోను స్థాపించి తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.అసలేం జరుగుతుందో అర్థం కావడంలేదు.. ఆన్లైన్లో ఎపుడు యాక్టివ్‌గా ఉండే,ఏప్రిల్ 4 నుండి ఎలాంటి పోస్ట్ పెట్టలేదు, అసలు ఈ విషయాన్ని తాము గమనించనే లేదు, మిషా ఇక లేదంటే నమ్మశక్యంగా లేదు అంటూ మిషా ఫ్రెండ్ మీనాక్షి భెర్వానీ విచారం వ్యక్తం చేసింది.ఎవరీ మిషా అగర్వాల్2000 ఏప్రిల్ 26, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగర్జ్‌లో జన్మించింది మిషా. బిషప్ జాన్సన్ స్కూల్ , కాలేజీ, ప్రయాగర్జ్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. తరువాత లా డిగ్రీ పూర్తి చేసింది. 2017 నుంచి ఫేస్బుక్ , ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియో కంటెంట్ సృష్టికర్తగా, ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేయడం ప్రారంభించింది. అదే సంవత్సరంలో, ఆమె ది మిషా అగర్వాల్ షో అనే కామెడీ షో మొదలు పెట్టి స్టాండ్-అప్ కామెడియన్‌గా ఎదిగింది. షోలోని హాస్యభరితమైన కంటెంట్ ప్రధానంగా కామెడీతోపాటు, జీవనశైలి , ట్రెండింగ్ అంశాలపై దృష్టి పెట్టి కంటెంట్ ఇచ్చిఏది. ప్రతిసారీ, వీడియోలను ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.చదవండి: మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీహెయిర్ కేర్ బ్రాండ్, మిష్ కాస్మెటిక్స్ ఫౌండర్ కూడా డిజిటల్ కంటెంట్ సృష్టికర్త మాత్రమే కాదు, 2024లో తన హెయిర్ కేర్ బ్రాండ్, మిష్ కాస్మెటిక్స్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ సీఈవోగా తన కస్టమర్లకు వారి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అధిక-నాణ్యత గల హెయిర్ కేర్ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో మిషా ఈ బ్రాండ్‌ను, టీంను అభివృద్ధి చేసింది. ఐస్లే, గోయిబిబో, ఇన్ఫినిక్స్, సఫోలా, మై ఫిట్నెస్ మరియు మరిన్ని వంటి అనేక ప్రముఖ బ్రాండ్లకు సోషల్ మీడియా మార్కెటర్‌గా కూడా పనిచేసింది. చదవండి: సీమా హైదర్ పాక్ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్ సంచలన వీడియో -
టెన్షన్.. టెన్షన్!
కర్నూలు (హాస్పిటల్): వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక టెన్షన్ ఉంటోంది. పిల్లలకు చదువుపై టెన్షన్. ఇన్‌టైమ్‌లో హోమ్ వర్క్ చేయడం, చెప్పిన పాఠాలు అర్థం చేసుకోవడం, హోమ్‌వర్క్ చేయకపోతే టీచర్ కొడుతుందేమోనని భయం వారిది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం యువత టెన్షన్. ఉద్యోగం వస్తేనే అమ్మాయిని ఇస్తారనేది ఇంకో టెన్షన్. ఇలా ఉద్యోగం లేక, పెళ్లి కాని యువత చాలామందే ఉన్నారు. తీరా ఉద్యోగం వచ్చాక ఆయా సంస్థలు, ఉన్నతాధికారులు ఇచ్చే లక్ష్యాలు నెరవేర్చాలంటే మరో టెన్షన్. వీకెండ్ వస్తే ఇంట్లో భార్యాపిల్లల ఇష్టాలు తీర్చేందుకు అవసరమైన డబ్బు లేదనేది మరికొందరి టెన్షన్. పిల్లలు పెద్దయ్యాక వారికి వివాహాలు చేయడం మరో టెన్షన్. దీంతోపాటు ఇంట్లో పెద్దల ఆరోగ్య విషయాలు, వారి ఆలనాపాలనా చూసేవారు కరువు కావడం, అందరూ ఉన్నా అనాథలు కావడం ఇంకో టెన్షన్. ఇలా ఎవరి స్థాయిలో వారికి టెన్షన్ ఉంటోంది. ఈ క్రమంలో టెన్షన్‌తో పాటు ఆందోళన, డిప్రెషన్ వస్తున్నాయి. వీటిని తగ్గించుకునేందుకు ఇటీవల మానసిక వైద్యుల వద్దకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఓపీ పెరుగుతోంది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగం ఓపీకి ప్రతిరోజూ 75 నుంచి 90 మంది వరకు రోగులు వస్తుండగా.. అందులో 40 శాతం కొత్తవారు ఉండటం గమనార్హం. వీరిలో 40 నుంచి 50 శాతం వరకు ఆందోళన, కుంగుబాటు(డిప్రెషన్)కు గురై చికిత్స కోసం వస్తున్న వారే ఉంటున్నారు. వీరు గాక నగరంలోని ప్రైవేటు మానసిక వైద్యుల వద్దకు, జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల వద్దకు సైతం ప్రతిరోజూ 220 నుంచి 250 మంది దాకా రోగులు చికిత్స కోసం వస్తున్నారు. ఇందులో జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల వద్దకు సైకోసొమాటిక్ (శారీరక, మానసిక) జబ్బులతో బాధపడే వారే ఎక్కువ. దీంతోపాటు 30 శాతం మద్యం, సిగరెట్ అలవాట్లు, 20 నుంచి 30 శాతం మంది తీవ్రమైన మానసిక సమస్యలు (స్క్రిజోఫీనియా, మానియా, డిల్యూషన్ డిజార్డర్లు, బైపోలార్, సివియర్ డిప్రెషన్)తో వస్తున్నారు. వృద్ధుల్లో 5 శాతం మంది నిద్రలేమి, మతిమరుపు సమస్యలతో వస్తున్నారు. చిన్నపిల్లల్లోనూ 5శాతం మంది మానసిక సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. 2021లో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక జబ్బుల విభాగానికి ఓపీ 15,942, ఇన్పేషెంట్లుగా 92 మంది చికిత్స పొందగా.. 2022లో ఈ సంఖ్య ఓపీలో 19,475కి, ఇన్పేòÙంట్లు 175కి, 2023లో ఓపీ 20,323, ఇన్పేòÙంట్ల సంఖ్య 245కు పెరిగింది. నిద్ర లేకపోవడంతోనే సమస్యలు కొంతమంది కొద్దిపాటి సమయం లభించినా కూర్చున్న చోటే ఒక కునుకు తీస్తారు. మరికొందరు అర్ధరాత్రి దాటినా కళ్లు తెరుచుకుని అటూఇటూ చూస్తూనే ఉంటారు. ఇంకొందరు నిద్రపట్టక నిశాచర జీవుల్లా రాత్రిళ్లు ఊరంతా చుట్టేస్తుంటారు. పట్టణాల్లో అధికంగా రాత్రివేళ టీ స్టాల్స్ వద్ద ఇలాంటి వారే మనకు కనిపిస్తుంటారు. ఎప్పుడో తెల్లవారుజామున మూడు, నాలుగు సమయంలో వీరు ఇళ్లకు చేరుకుని నిద్రించి, మరునాడు ఉదయం 10 గంటల వరకు లేవడం లేదు. దీనికి మానసిక ఒత్తిళ్లు, డిప్రెషన్, ఆందోళనతో పాటు శారీరక వ్యాయామం లేకపోవడం, అధికంగా ఆహారం తీసుకోవడం, ఎక్కువగా మొబైల్ ఫోన్, టీవీ, కంప్యూటర్ స్క్రీన్లకు అతుక్కుపోవడమే కారణమని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మరుసటిరోజు శరీరం ఉత్సాహంగా గడిపేందుకు సహకరించడం లేదు. నిరుత్సాహం, నిస్సత్తువ ఆవహిస్తున్నట్టు ఉంటుంది. ఫలితంగా వీరికి గ్యాస్ట్రబుల్, గుండె దడ, ఊబకాయం, మలబద్దకం, బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు కొత్తగా తలెత్తుతాయి. మానసిక ఆరోగ్యానికి సూత్రాలు » ఇష్టమైన పనులు చేయాలి » బాధలు, కష్టాలను కుటుంబసభ్యులు, సన్నిహితులతో పంచుకోవాలి » భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకూడదు » ఉదయాన్నే వాకింగ్ చేయడం, ధ్యానం, యోగా చేయాలి. దీనివల్ల డిప్రెషన్, మానసిక ఒత్తిడి అదుపులోకి వస్తాయి. » వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర, సినిమాలు, షాపింగ్‌కు వెళ్లాలి. » అందుబాటులో ఉంటే రోజులో ఒక్కసారైనా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయాలి. చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు »తెలివి తక్కువ, బుద్దిమాంద్యంతో కూడిన మానసిక వ్యాధులు » చదువుపై ఏకాగ్రత లేకపోవడం, ఎక్కువగా బయట తిరగటం, బంధువులతో కలవలేకపోవడం, తనలోకంలో తానుండటం » చదువులో వెనుకబడటం, చెడు సహవాసాలు, చెడు అలవాట్లకు గురవడం నిద్రలో మల, మూత్ర విసర్జనాలు చేయడం తినకూడని పదార్థాలు తినడం (ఉదా: మట్టి, సున్నం మొదలైనవి)మానసిక వ్యాధుల లక్షణాలు» ఆందోళన, భయం, గుండెదడ, అధికంగా చెమట పట్టడం, కాళ్లు, చేతులు వణకడం » గుండె ఆగినట్లు అనిపించడడం, ఛాతినొప్పి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం, భయం, ఆందోళన » అనవసర ఆలోచనలు మళ్లీ మళ్లీ రావడం, అనవసర పనులు మళ్లీ మళ్లీ చేయడం, చేతులు అదే పనిగా కడగటం » అకస్మాత్తుగా మాట రాకపోవడం, కాళ్లు చేతులు పడిపోవడం, మూర్ఛలాగా రావడం » విచారంగా, పనిలో ఉత్సాహం లేకపోవడం » ఆకలి, నిద్ర లేకపోవుట, ఆత్మహత్య చేసుకోవాలనిపించడం » మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గటం, ప్రవర్తనలో మార్పు, సంధి ప్రేలాపనలు » అధికంగా ఆల్కహాల్, మాదకద్రవ్యాల అలవాటు » మూర్ఛ వ్యాధితో వచ్చే మానసిక, దీర్ఘకాక వ్యాధులతో బాధలు, పక్షవాతం తర్వాత వచ్చే మార్పులు » తనలో తాను నవ్వుకోవటం, మాట్లాడుకోవడం, చెవిలో మాటలు వినబడటం, ఇతరులను అనుమానించడం, భర్తలేక భార్య శీలాన్ని శంకించడం » ఎక్కువగా మాట్లాడటం, తిరుగుట, అతి ఆనందం, అతి ధైర్యం లేదా అతికోపం, అతిగా డబ్బు ఖర్చు చేయడం » పూనకాలు రావటం, తనకు తాను గుర్తుకు లేకుండా తిరుగుట » ముసలితనంలో వచ్చే అనారోగ్య సమస్యలు » అనవసరంగా భయాలు, అనుమానాలు పెంచుకోవడం » అకస్మాత్తుగా గతంలో జరిగిన ఘటనలు మరిచిపోవడం » బహిష్టు ముందు, తర్వాత వచ్చే మానసిక మార్పులు » కాన్పు ముందు, తర్వాత వచ్చే మానసిక మార్పులు »ఆకలి లేకపోవడం, నాజూకుతనానికై తినకపోవడం, అదుపు లేకుండా తినడం »కలత నిద్ర, నిద్ర పట్టకపోవడం, నిద్రలో నడవటం, మాట్లాడటం, మూత్రవిసర్జన చేయడం, భయంకర కలవరింతలు, అతి నిద్ర, నిద్రలో పళ్లు కొరకడం » నిగ్రహ శక్తి కోల్పోవడం, జూదానికి బానిసవటం, పరుల వస్తువులను అపహరించడం, అదే పనిగా షాపింగ్ చేయడం మానసిక రోగుల సంఖ్య పెరిగిందికొంతకాలంగా మానసిక వ్యాధుల విభాగానికి బాధితులు ఎక్కువగా వస్తున్నారు. ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్–19 పరిస్థితుల అనంతరం మానసిక వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరిగింది. తీవ్ర మానసిక ఒత్తిడి వల్ల, జన్యుపరంగా, వ్యక్తిగత సమస్యల వల్ల, సమాజంలో పలు కారణాల వల్ల స్క్రిజోఫీనియా, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. ప్రస్తుతం అన్నిరకాల మానసిక సమస్యలకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స అందిస్తున్నాం. అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తున్నాం. – డాక్టర్ గంగాధర్‌నాయక్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మానసిక వ్యాధుల విభాగం, జీజీహెచ్, కర్నూలు -
జీవితంలో చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నా.. సమంత షాకింగ్ కామెంట్స్
ఇటీవల కాలంలో సమంత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్.. వైరల్ అవుతుంది. నాగచైతన్యతో విడాకుల కంటే ముందు కూడా సామ్.. సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉండేది. కానీ అప్పుడు కేవలం ఫోటోలు మాత్రమే షేర్ చేస్తూ వ్యక్తిగత విషయాలను పంచుకునేది. కానీ ఇప్పుడు సామ్ ఎక్కువగా మోటివేషనల్ కొటేషన్స్ షేర్ చేస్తుంది. అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రేరణాత్మక ప్రసంగాలను ఇస్తుంది. తాజాగా సామ్ మరోసారి తనకు సంబంధించిన సంచలన విషయాలను బయటపెట్టింది. జీవితంలో తాను చాలా మానసిక సమస్యలను ఎదుర్కొన్నానని పేర్కొంది. ఇటీవల ఆమె రోష్ని ట్రస్ట్ ఏర్పాటు చేసిన సైకియాట్రి ఎట్ యువర్ డోర్ స్టెప్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా సామ్ మాట్లాడుతూ.. ‘నేను జీవితంలో చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నా. అలాంటి సమయంలో నా స్నేహితులు, వైద్యుల సహాయం తీసుకున్నా. నేను ఈరోజు ధైర్యంగా నిలబడటానికి.. జీవితంలో ముందుకు వెళ్లడానికి నా స్నేహితులు, కుటుంబం, కౌన్సిలర్ల సహయమే కారణం. శరీరానికి దెబ్బ తగిలితే వైద్యులను ఎలాగైతే కలుస్తామో అలాగే మనసుకు గాయం అయినప్పుడు కూడా వైద్యులను సంప్రదించాలి’ అని చెప్పుకొచ్చింది. ఇక సినిమా విషయానికొస్తే.. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది. ప్రస్తుతం యశోద సినిమా చేస్తుంది. వీటితో పాటు అటు బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇప్పటికే డ్రీమ్ వారియర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
మానసిక ఒత్తిడితో జాగ్రత్త!
-
సైకాలజిస్ట్నా? సైకియాట్రిస్ట్నా... ఎవరిని సంప్రదించాలి?
నా వయసు 32. నేనొక సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను. ఆఫీసులో పనిభారం వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడింది. దాంతో నేను ఇంటర్నెట్ను ఆశ్రయించాను. అయితే నాకు మరింత గందరగోళం ఏర్పడింది. సైకియాట్రిస్ట్‌ను పెద్ద పెద్ద మానసిక సమస్యలకు మాత్రమే సంప్రదించాలని, మందులు ఏళ్ల తరబడి మింగాల్సి ఉంటుందనీ, చిన్న చిన్న సమస్యలకు సైకాలజిస్టు సరిపోతారనీ ఉంది. నిజమేనా? ఇంతకీ నేను సైకాలజిస్టును కలవాలా? సైకియాట్రిస్ట్‌ను కలవాలా? అసలు తేడా ఏమిటి? - కె.సునీల్ కుమార్, హైదరాబాద్ ఇంటర్నెట్ అనేది సమాచారాన్ని తెలుసుకోవడానికే తప్పవ్యక్తిగత సమస్యల పరిష్కారానికి పనికిరాదు. అసలే మీరు మానసిక ఒత్తిడిలో ఉన్నారు. దానికితోడు ఇంటర్నెట్లో లభించిన సమాచారాన్ని చదివేసరికి మరింత అయోమయానికి గురయినట్లున్నారు. ముందుగా మీరు ఒక సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి, మీకున్న సమస్యలను వివరించి, వారి సలహా మేరకు మందులు వాడండి. ఈ సందర్భంగా మీతో బాటు చాలా మందిని కన్ఫ్యూజన్కు గురిచేసే సైకాలజిస్టు, సైకియాట్రిస్టు అనే పదాలకు మధ్య గల తేడాను వివరిస్తాను. సైకియాట్రిస్ట్ అంటే... ఎంబీబీఎస్ చేసి, మెదడు గురించి, దాని పనితీరు గురించి అధ్యయనం చేసిన మెడికల్ స్పెషలిస్ట్. మెదడు కూడా అన్నింటిలా శరీరంలోని భాగమే. దానికీ జబ్బులు వస్తాయి. నయం చేయకుంటే దాని ప్రభావం శరీరంలోని అన్ని భాగాల మీద పడుతుంది. సైకియాట్రిస్ట్ తనకుండే పరిజ్ఞానంతో రోగికి మందులతోబాటు అవసరమైతే కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. మీరు తెలుసుకోవలసిందేమిటంటే... ఒకేలా ఉండే ఏ ఇద్దరి జబ్బుకూ చికిత్స ఒకేలా ఉండదు. వారి శారీరక, మానసిక స్థితులని బట్టి, తీవ్రతను బట్టి ఎంతకాలం పాటు మందులు వాడాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఇక సైకాలజిస్ట్ అంటే నాన్ మెడికల్ స్పెషలిస్ట్. ఆర్ట్స్ లేదా సైన్స్ చదివి సైకాలజీలో పట్టా పుచ్చుకుని ఉంటారు. మీరు సైకాలజిస్ట్‌ను సంప్రదించవలసిన అవసరం వస్తే క్లినికల్ సైకాలజిస్న్టు సంప్రదించడం మంచిది. వీరు పేషెంట్ నుంచి, వారి కుటుంబ సభ్యుల నుంచి సమస్యను సమగ్రంగా తెలుసుకుని కేస్‌షీట్ తయారు చేస్తారు. అంతేకానీ మందులు మాత్రం ఇవ్వరు. రోగికి ఉపశమనం కలిగించే మాటల ద్వారానే వ్యాధిని నయం చేస్తారు. మెడిసిన్ చదివి, సైకియాట్రీలో నిపుణులైన వారి సహకారం తీసుకోవడమే అన్ని విధాలా శ్రేయస్కరం. మీరు నిపుణులైన సైకియాట్రిస్ట్‌ను సంప్రదించడం మంచిది. ఆల్ ది బెస్ట్.