
ఇటీవల కాలంలో సమంత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్.. వైరల్ అవుతుంది. నాగచైతన్యతో విడాకుల కంటే ముందు కూడా సామ్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉండేది. కానీ అప్పుడు కేవలం ఫోటోలు మాత్రమే షేర్ చేస్తూ వ్యక్తిగత విషయాలను పంచుకునేది. కానీ ఇప్పుడు సామ్ ఎక్కువగా మోటివేషనల్ కొటేషన్స్ షేర్ చేస్తుంది. అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రేరణాత్మక ప్రసంగాలను ఇస్తుంది.
తాజాగా సామ్ మరోసారి తనకు సంబంధించిన సంచలన విషయాలను బయటపెట్టింది. జీవితంలో తాను చాలా మానసిక సమస్యలను ఎదుర్కొన్నానని పేర్కొంది. ఇటీవల ఆమె రోష్ని ట్రస్ట్ ఏర్పాటు చేసిన సైకియాట్రి ఎట్ యువర్ డోర్ స్టెప్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా సామ్ మాట్లాడుతూ.. ‘నేను జీవితంలో చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నా. అలాంటి సమయంలో నా స్నేహితులు, వైద్యుల సహాయం తీసుకున్నా. నేను ఈరోజు ధైర్యంగా నిలబడటానికి.. జీవితంలో ముందుకు వెళ్లడానికి నా స్నేహితులు, కుటుంబం, కౌన్సిలర్ల సహయమే కారణం. శరీరానికి దెబ్బ తగిలితే వైద్యులను ఎలాగైతే కలుస్తామో అలాగే మనసుకు గాయం అయినప్పుడు కూడా వైద్యులను సంప్రదించాలి’ అని చెప్పుకొచ్చింది.
ఇక సినిమా విషయానికొస్తే.. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది. ప్రస్తుతం యశోద సినిమా చేస్తుంది. వీటితో పాటు అటు బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇప్పటికే డ్రీమ్ వారియర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment