mlc tickets
-
లోకేశ్ ‘లెక్కే’ వేరు..!
సాక్షి, అమరావతి: టీడీపీలో పదవులు ఒకప్పుడు చంద్రబాబు (Chandrababu) ఇష్ట ప్రకారం లభించేవి. రకరకాల సమీకరణలు, ప్రాధాన్యతలు, ఆర్థిక వ్యవహారాలను బట్టి పదవులను కట్టబెట్టేవారు. కానీ ఇప్పుడు ఆయన తనయుడు లోకేశ్ (Lokesh) ఆశీస్సులు ఉంటేనే పదవులు వస్తాయని టీడీపీలో కింది స్థాయి కార్యకర్తలు సైతం చెబుతున్నారు. ఆయన ఆశీస్సులు ఉండాలంటే ఆర్థికంగా బలవంతులై ఉండాలనే సూత్రం చాలాకాలం నుంచి అమలవుతోంది. గత ఎన్నికల్లో సీట్లు డబ్బు మూటలిచ్చిన వాళ్లకే ఇచ్చారని ఆ పార్టీలోనే బహిరంగంగానే ఆరోపణలు వినిపించాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మంత్రి పదవులకూ అదే సూత్రాన్ని పాటించినట్లు పార్టీ సీనియర్ నేతలు వాపోయారు.ఆయన కోటరీకే ఎమ్మెల్సీ పదవులు ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులోనూ అదే పరిస్థితి నెలకొన్నట్లు చెబుతున్నారు. టీడీపీకి మూడు పదవులు దక్కితే మూడు లోకేశ్‌కి అత్యంత విధేయులుగా ఉన్న వారికే లభించాయి. నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర లోకేశ్ కోటరీలో కీలక వ్యక్తి కావడంతోపాటు ఆర్థికంగా బలమైన వ్యక్తి. ఈ నేపథ్యంలోనే రవిచంద్రకు ఎమ్మెల్సీ పదవి వెతుక్కుంటూ వచ్చినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. బీటీ నాయుడు (BT Naidu) కూడా లోకేశ్‌కు దగ్గరి వ్యక్తి కావడంతోపాటు ఆర్థిక పరిపుష్టి కలిగిన నాయకుడే. కావలి గ్రీష్మ (Kavali Greeshma) లోకేశ్ కోటరీకి చెందిన నేతే. మహానాడులో బూతులు తిడుతూ తొడ కొట్టిన నాయకురాలు కావడంతో ఆమెకు ఎమ్మెల్సీ సీటు కేటాయించారు. ఉత్తరాంధ్రలో అనేక మంది సీనియర్ నేతలు, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన నేతలుంటే అంత చురుగ్గా పని చేయని గ్రీష్మకు ఎమ్మెల్సీ పదవి దక్కడానికి చినబాబు ఆశీస్సులు ఉండడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.రాజ్యసభ స్థానాల్లోనూ అంతేమూడు రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి రెండు దక్కగా ఆ రెండింటినీ ధన బలం ఉన్నా సానా సతీష్‌బాబు, బీద మస్తాన్‌రావుకి ఇచ్చారు. సానా సతీష్‌బాబు.. లోకేశ్ కోటరీలో ప్రస్తుతం అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చారు. బీద మస్తాన్‌రావు కూడా డబ్బు మూటలతో వచ్చిన వ్యక్తేనని టీడీపీ నేతలే చెబుతున్నారు. అధికారం కోసం పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు.చదవండి: యనమలకు బాబు 'షాక్' హ్యాండ్చినబాబు ఆశీస్సులు ఉంటే.. చింత అక్కర్లేదు..మరోవైపు నామినేటెడ్ పదవుల విషయంలోనూ లోకేశ్ చెప్పిన వారికే పదవులు వచ్చాయి. కార్పొరేషన్ చైర్మన్లు, సభ్యులు, ఇతర పదవులను ఆయన ఇచ్చిన జాబితా ప్రకారమే కేటాయించారు. పదవుల కోసం ఎవరైనా చంద్రబాబు వద్దకు వెళితే ఆయన తన కొడుకును కలవమని చాలామంది నేతలకు చెప్పినట్లు సమాచారం. దీంతో సీనియర్లు చంద్రబాబు మారిపోయాడని, ఆయన కొడుకును కలవాల్సిన అవసరం ఏమిటని భావించి వెళ్లలేదు. కొందరు వెళ్లి కలిసినా, ప్రయోజనం లేదని చెబుతున్నారు. మొత్తంమీద ఈ పరిణామాలు పార్టీలో సీనియర్లకు ఆందోళన కలిగిస్తున్నాయని సమాచారం. -
చంద్రబాబుపై డిప్యూటీ సీఎం అలక
-
చంద్రబాబుపై డిప్యూటీ సీఎం అలక
విజయవాడ: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అధికార టీడీపీలో అసంతృప్తి రాజేసింది. ఇప్పటికే చాలా జిల్లాల్లో టీడీపీ నాయకులు అసమ్మతి వ్యక్తం చేయగా.. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సైతం ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన తమ్ముడికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడంతో కేఈ అలకచెందారు. అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చారని, తన తమ్ముడికి ఎమ్మెల్సీ టికెట్ ఎందుకు ఇవ్వలేదని కేఈ ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తన తమ్ముడికి నచ్చజెప్పలేకపోతున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టికెట్ తమ కుటుంబానికి ఇస్తేనే అక్కడ టీడీపీ గెలుస్తుందన్నారు. రాయలసీమలో బీసీలకు ఒక్క ఎమ్మెల్సీ టికెట్ కూడా కేటాయించలేదని కేఈ విమర్శించారు. -
అసంతృప్తి సెగ
సాక్షి ప్రతినిధి, విజయవాడ : జిల్లాలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి చివరి క్షణంలో మొండిచేయి చూపడం యాదవ సామాజిక వర్గాన్ని అవమానించడమేనని ఆ వర్గ నేతలు భావిస్తున్నారు. దీనికి సామాజిక సమీకరణాలను సాకుగా చూపడంపై వారు మండిపడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఆశచూపి నిరాశకు గురిచేశారని గుర్తుచేస్తున్నారు. సామాజిక సమీకరణలు యాదవులకు పదవి ఇచ్చే సమయానికే అడ్డంకిగా మారుతున్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. మచిలీపట్నం, గుడివాడ, విజయవాడల్లో ఇటీవల బహిరంగంగా విమర్శలకు దిగారు. టీడీపీ అధిష్టానం తీరుపై దుమ్మెత్తిపోశారు. అనంతపురం జిల్లాలో యాదవ సామాజికవర్గానికి చెందిన తిప్పే స్వామి, బీదా రవీంద్రకు ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చామంటూ సాకుగా చూపి ఇక్కడ బచ్చులకు అన్యాయం చేశారని వారు చెబుతున్నారు. తనను కలవడానికి వచ్చిన వైవీబీ, బుద్దా వెంకన్న ఎదుట బచ్చుల అర్జునుడు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం, పార్టీ అధినేత చంద్రబాబు తనను మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేయడం తెలిసిందే. పదవులన్నీ ఒక సామాజిక వర్గానికేనా? జిల్లాలో విజయవాడ ఎంపీ, విజయవాడ మేయర్, జెడ్పీ చైర్పర్సన్, ఆప్కాబ్ చైర్మన్, గన్నవరం, మైలవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, కైకలూరు నియోజకవర్గాలతో పాటు ఇటీవల ఎమ్మెల్సీగా ఎంపికైన వైవీబీ రాజేంద్రప్రసాద్, జగ్గయ్యపేటకు చెందిన తొండెపు దశరథ జనార్దన్ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. వారంతా కీలక పదవుల్లో ఉన్నారు. జిల్లాలో ఒకే సామాజికవర్గానికి చెందిన ఇంతమందికి పదవులు ఇచ్చిన టీడీపీ నాయకత్వం యాదవులకు పదవులు ఇచ్చే సమయానికి సమీకరణలు అడ్డువస్తున్నాయంటూ సీలింగ్ విధించటం టీడీపీలోని యాదవ సామాజిక వర్గ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఒక వర్గానికే పదవులు ఇస్తున్నారని, వారికే ప్రాధాన్యత ఉంటోందని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉన్న ప్రాధాన్యత ఇక్కడేదీ? కాంగ్రెస్ పార్టీలో ఉండగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు, కొలుసు పార్థసారథికి టికెట్లు ఇవ్వడంతో పాటు సారథికి మంత్రి పదవికి కూడా ఇచ్చి సముచితం స్థానం కల్పించారని ఆ వర్గం నేతలు అంటున్నారు. వైఎస్సార్ సీపీలోనూ యాదవ సామాజిక వర్గానికి చెందిన కేపీ సారథికి మచిలీ పట్నం ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు ఆ తర్వాత ఆయనకు జిల్లా బాధ్యతలను కూడా అప్పగించారని గుర్తు చేస్తున్నారు. టీడీపీలోనే తమ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అడ్డుకున్నదెవరు? పార్టీలో అంతర్గత విభేదాలు కూడా బచ్చులకు సీటు రాకుండా అడ్డుకున్నట్లు మరో వాదన వినిపిస్తోంది. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు బచ్చుల అర్జునుడు బీసీ కావటం, ఆయన్ని ఎమ్మెల్సీ చేస్తే మచిలీపట్నంలో తన ప్రాబల్యం కొంత తగ్గుతుందనే భావనతో మంత్రి అడ్డుకున్నారని తెలుస్తోంది. ఇందుకు విజయవాడకు చెందిన పలువురు నేతలతో కలిసి ఆయన తెరవెనుక మంత్రాంగం నడిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బుద్దా వెంకన్నను తెరపైకి తెచ్చి బచ్చులకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని తెలుస్తోంది. బచ్చుల మంత్రి ఉమాతో సన్నిహితంగా ఉండటంతో ఆయన ఎమ్మెల్సీ టికెట్ ఇప్పిస్తారంటూ తొలుత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయవాడకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి కూడా ఓ చెయ్యి వేసి బచ్చులను పక్కన పెట్టించారనేది టీడీపీలో జరుగుతున్న చర్చ. పైకి చెబుతున్న కారణాలు ఏవైనా తమ సామాజిక వర్గానికి పార్టీలో అన్యాయం జరుగుతోందనేది వాస్తవమని, ఒక సామాజిక వర్గానికే అన్నింటా ప్రాధాన్యత దక్కుతోందని, తమను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని యాదవ సామాజిక వర్గం నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. -
అన్నా.. నిన్ను ఎమ్మెల్సీ చేస్తనే!!
అన్నా... నీకే టికె ట్టు ఇద్దామనుకున్నా... నీకు తెలుసు కదన్నా... రకరకాల ఈక్వేషన్స్... ఇవ్వలేకపోయినా... నువ్వేమీ ఫికర్ చేయకు... నిన్ను ఎమ్మెల్సీని చేస్తా... సర్... టికె ట్టు ఇవ్వడం ఈజీయే... కానీ ఎన్నికల్లో పోటీపడటం అంత ఈజీ కాదు... నా మాట విను... నన్ను నమ్ము... బాగా డబ్బులు ఖర్చవుతాయ్... నిన్ను ఎమ్మెల్సీని చేస్తా... మీ కులపోళ్లందరూ చెప్పారు... నీకిస్తే వాళ్లే గెలిపిస్తమన్నారు... కానీ పోటీ ఎక్కువై వర్కవుట్ కావడం లేదు... నిన్ను ఎమ్మెల్సీగా తీసుకుంటా... ఫస్ట్ పేరు నీదే... నాదీ పూచీ... మంచాల శ్రీనివాసరావు: తెలంగాణలోని ఏ పార్టీ శిబిరంలో చూసినా ఇలాంటి సంభాషణలే! టికెట్ల ఆశావహులకు, టికెట్లు ఆశించిన భంగపడిన వారికి, రెబల్స్‌గా రంగంలోకి దిగుతున్నవారికీ, అసంతృప్తి వీడి తిరిగి పార్టీ పనిచేయటానికి వీలుగా పార్టీల ముఖ్యులు ఇలా నాయకుల చెవుల్లో ఎమ్మెల్సీ పూలు పెడుతున్నారు. పార్టీలో చేర్చుకోవటానికి, పార్టీని వీడిపోకుండా ఉండటానికి, పార్టీకి మరింతగా పనిచేయటానికి, అసంతృప్త నేతలకు సర్దిచెప్పటానికి పార్టీల ముఖ్య నాయకులు నియోజకవర్గ స్థా యి నేతలకు ఇలా హామీ లు ఇస్తున్నారు... ప్రధాన పార్టీల్లో ఇలా ఎమ్మెల్సీ పదవులపై హామీలు పొం దిన నాయకుల సంఖ్య ఇప్పటికే 150 దాకా ఉం టుందని అంచనా. ప్రత్యేకించి టీఆర్ఎస్, కాంగ్రెస్ శిబిరాల్లో ఈ తతంగం ఎక్కువగా ఉంది... అందరికీ ఎమ్మెల్యే టికెట్లే కావాలి! నిజానికి ఎమ్మెల్యే టికెట్లు ఆశించే పార్టీ నాయకులను బుజ్జగించటానికి రకరకాల కార్పొరేషన్ పదవులు, ఇతరత్రా నామినేటెడ్ పదవుల్ని ఎరవేయడం పరిపాటిగా ఉండేది. కానీ ప్రస్తుతం రాష్ట్ర విభజనలో నిమగ్నమైన అధికారగణం నిష్కర్షగా సగం మేరకు కార్పొరేషన్లను, పనికిరాని ప్రభుత్వ సంస్థలను రద్దు చేసే పనిలో పడింది. నీకు ఫలానా కార్పొరేషన్ ఇస్తా, నిన్ను ఫలానా సంస్థకు అధ్యక్షుడిని చేస్తా అనే పాతరకం హామీలను ప్రస్తుతం నాయకులే నమ్మే పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులను ఎరవేస్తున్నారు! ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నడుమ విపరీతమైన పోటీ నెలకొన్న ఈ స్థితిలో ఈ రెండు శిబిరాల్లోనే ఎక్కువగా ఈ ఎమ్మెల్సీ పదవుల హామీలు వినిపిస్తున్నాయి. ఒక్కో స్థానంలో ఇద్దరేసి, ముగ్గురేసి అభ్యర్థులు పార్టీ కోసం పనిచేస్తుండటం, తెలంగాణ పోరాటంలో పనిచేశామని చెబుతూ టికెట్లు అడిగేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం, కొన్ని సీట్లు పొత్తుల్లో కేటాయించడం వల్ల కొందరు ఆశలు గల్లంతు కావడం వంటి కారణాలతో పార్టీల్లోని చాలా మంది నేతల్ని బుజ్జగించాల్సి వస్తోంది. నిజంగా ఇవ్వగలిగేది ఎన్ని? - తెలంగాణ శాసనమండలిలో ఉండేదే 40 సీట్లు - దీనిలో మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు, మరో మూడు ఉపాధ్యాయ నియోజకవర్గాలు వీటికి పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించగలవు. ఎవరైనా సరే ఎన్నికలో పోటీపడి గెలవాల్సిందే. - 14 స్థానాలకు శాసనసభ్యులు ఓట్లేసి ఎన్నుకుంటారు. ఇప్పుడు వాటిల్లో ఖాళీలే లేవు. ఏ రెండేళ్ల తరువాతో మూడో వంతు ఖాళీలు కొన్ని ఏర్పడినా... అప్పుడు పార్టీల వారీగా ఉండబోయే ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఒక్కో పార్టీ ఒకరికో, ఇద్దరికో మాత్రమే అవకాశం కల్పించగలవు. - 14 స్థానాలకు స్థానిక సంస్థల నుంచి ఎన్నుకోవాలి. ప్రస్తుత ఖాళీలు 5. వీటికీ పార్టీలు అభ్యర్థులను ప్రకటించగలవు. ఎవరైనా సరే ఎన్నికలో పోటీపడి గెలవాల్సిందే - 6 స్థానాలకు గవర్నర్ ద్వారా నామినేట్ చేయించవచ్చు. వీటిల్లో మూడు ఖాళీలున్నాయి. ఈ లెక్కను బట్టి ఒక పార్టీ ఎందరు నాయకులకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వగలదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు! జన తెలంగాణ అందరికీ రాజకీయావకాశాలు.. - కొత్త రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలి. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించాలి. పేదలందరికీ కూడు, గూడు, విద్య అవకాశాలు లభించేలా చూడాలి. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలి. అన్ని వర్గాల వారికి రాజకీయావకాశాలు కల్పించాలి. చేతి వృత్తుల వారికి రుణాలివ్వాలి. - మురహరి శ్రీధర్ నాయి, దూల్‌పేట, హైదరాబాద్. ఉద్యోగులే కీలకం నవ తెలంగాణ నిర్మాణం కలగా మిగలకూడదు. భౌగోళిక తెలంగాణగా మిగలకూడదు. బంగారు తెలంగాణగా ఏర్పడాలంటే ఉద్యోగులు కీలకపాత్ర పోషించాలి. కొన్ని ఇబ్బందులున్నా ప్రభుత్వానికి సహకరించాలి. అవసరమైతే ఎక్కువ సమయం పని చేయడానికి కూడా సిద్ధం కావాలి. కొత్త ప్రభుత్వం ఈ ప్రాంత మేధావుల సూచనలు, సలహాలను తీసుకోవాలి. నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో అన్ని జిల్లాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. - ఎం. రవళి, ఆదర్శ పాఠశాల, చిన్న కోడూరు, మెదక్ జిల్లా ఉపాధి చూపేలా విద్య... ఆర్థిక అసమానతలు లేని తెలంగాణ కావాలి. మూతపడిన అన్ని పరిశ్రమలను తెరిపించాలి. ప్రతి జిల్లాలో ఒక వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలి. మండలానికో పశువైద్యశాల ఉండాలి. ఉపాధి మార్గం చూపే విద్యావిధానాన్ని రూపొందించాలి. రవాణా సౌకర్యాలను మెరుగుపర్చాలి. సాగునీటివసతులను పెంపొం దించి అధిక దిగుబడులు సాధించేందుకు వీలుగా రైతులకు అవగాహన కల్పించాలి. - చింతపంటి కమలాకర్ , గాంధీనగర్, వేములవాడ