Paris Fashion Week
-
LVFW25 అటు ఐఫిల్ టవర్, ఇటు దీపికా : భర్త కామెంట్ వైరల్
ప్యారిస్ ఫ్యాషన్ వీక్ 2025లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే తన మెస్మరైజింగ్ లుక్‌తో అందర్నీ ఆశ్చర్యపర్చింది. మార్చి 3-11వరకు ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్యారిస్ 2025-2026 (ఫాల్/వింటర్ విమెన్స్వేర్)లో క్లాసిక్ వింటేజ్ లుక్‌లో అదరగొట్టింది. ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన మార్క్‌ను చాటుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆమె లుక్‌ను 'ఐకానిక్' అంటూ తెగ పొగిడేశారు. ఐఫిల్ టవర్‌కు సమాంతరంగా దీపిక ఫోజులు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.'లూయిస్ విట్టన్ ఫాల్/వింటర్ 2025-2026 కలెక్షన్ ఆవిష్కరణ కోసం పారిస్‌కు వెళ్లిన ఈ కల్కి నటి మరోసారి హై ఫ్యాషన్ పట్ల తనకున్న అనుబంధాన్ని నిరూపించుకుంది. లూయిస్ విట్టన్‌లో క్లాసిక్ మోనోక్రోమ్ లుక్‌లో లగ్జరీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ గ్లోబల్ స్టార్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. దీపికా పదుకొణే దీనికి సంబంధించి ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఐకానిక్ లుక్, ఫ్యాషన్ స్టైల్‌కి ఫిదా అయిపోయారు. ఓర్రీ, సోఫీ చౌదరి "లవ్" ఎమోజీలతో తమ సంతోషాన్ని ప్రకటించారు. మరోవైపు దీపికా భర్త రణవీర్ సింగ్ ("Lord have mercy on me") చక్కటి మెసేజ్‌ను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) దీపికా ఐకానిక్ ఐఫిల్ టవర్‌కు ఎదురుగా ఫోజులిచ్చింది. తెల్లటి భారీ కోటు, స్టైలిష్ టోపీ, స్కార్ఫ్, డీప్ రెడ్ లిప్‌స్టిక్, బ్లాక్ హీల్స్, గ్లోవ్లతో పారిసియన్ గాంభీర్యానికి పరాకాష్టగా నిలిచింది. ఈ ఫోటోలు అటు ఫ్యాషన్ ఔత్సాహికులు, విమర్శకులు ప్రశంసలందుకున్నాయి. ఐకానిక్ భవనం ది కోర్ కారీ డు లౌవ్రేలో దీపిక ఎంట్రీ అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. దీపికా పదుకొనేతో పాటు, ఎమ్మా స్టోన్, జాడెన్ స్మిత్, జౌ డోంగ్యు, జెన్నిఫర్ కోన్నెల్లీ, అనా డి అర్మాస్ లాంటి అనేక గ్లోబల్ స్లార్లు ఈ షోలో కనిపించారు. కె-పాప్ స్టార్ లిసా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా?కాగా రణవీర్‌తో పెళ్లి, కుమార్తె దువాకు జన్మనిచ్చిన తరువాత ఈ సంవత్సరం ప్రారంభంలో, ప్రముఖ డిజైనర్ సబ్యసాచి షోలో అద్భుతమైన ప్రదర్శనతో రీఎంట్రీ ఇచ్చింది. దుబాయ్‌లో జరిగిన కార్టియర్ 25వ వార్షికోత్సవ వేడుకలకు అద్భుతమైన నల్లటి దుస్తులలో మెరిసిపోవడం దగ్గర్నుంచి గ్లోబల్ ప్లాట్‌ఫారమ్, అబుదాబిలో జరిగిన ఫోర్బ్స్ సమ్మిట్‌లో గోల్డెన్ గర్ల్‌గా గుర్తింపు పొందడం వరకు ఆమె ఫ్యాషన్ ఎంపికలు వార్తల్లో నిలుస్తూ వచ్చాయి. ప్రపంచ ఫ్యాషన్‌లో భారతీయ ప్రాతినిధ్యానికి, ఆమె సిగ్నేచర్ స్టైల్‌కు ఇది గొప్ప మైలురాళ్లు. లూయిస్ విట్టన్, కార్టియర్ రెండింటికీ గ్లోబల్ అంబాసిడర్‌గా సంతకం చేసిన తొలి భారతీయురాలు దీపికా. -
మోస్ట్ స్టైలీష్‌గా ఒకే ఫ్రేమ్‌లో తల్లి, కూతురు (ఫోటోలు)
-
Paris Fashion Week 2025: ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా కలెక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్
-
Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!
పారిస్ ఫ్యాషన్ వీక్ 2025లోభారతీయ ఫ్యాషన్ పరిశ్రమలో ప్రముఖుడైన డిజైనర్ గౌరవ్‌గుప్తా ప్రత్యేక కలెక్షన్‌తో అలరించాడు. ఢిల్లీకి చెందిన ఈ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జీవితంలో జరిగిన అత్యంత విషాదాన్నే థీమ్ గా మల్చుకుని ఫ్యాషన్ వీక్‌లో తన దుస్తులను ప్రదర్శించాడు. భార్య నవ్‌కిరత్ సోధి అగ్ని ప్రమాదాన్నే 'అక్రాస్ ది ఫైర్' థీమ్ గా కోచర్ కలెక్షన్‌ను ప్రదర్శించాడు. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో గౌరవ్ గుప్తా కలెక్షన్‌కు వ్యక్తిగత విషాదం ఎలా ప్రేరణనిచ్చింది తెలుసుకుందాం.ఒక చిన్న కొవ్వొత్తి గౌరవ్, నవ్‌కిరత్ జీవితాలను పెద్ద ప్రమాదంలోకి నెట్టేసింది. ఎనిమిది నెలల క్రితం అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో గౌరవ్ గుప్తా భార్య నవ్‌కిరత్ దాదాపు మరణానికి చేరువైంది. ఆమె శరీరం 55 శాతం కాలిపోయింది. ఆమె బతికే అవకాశం 50 శాతం అని వైద్యులు చెప్పారు. అయినా నెలల తరబడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుని విజేతగా నిలిచింది. ఈ ప్రమాదంలో మంటలను ఆర్పడానికి ప్రయత్నించి గౌరవ్ కూడా గాయపడ్డాడు. ఢిల్లీలోని అటెలియర్ ధ్వంసమైంది. కొంత ఆస్తినష్టం కూడా జరిగింది. కట్ చేస్తే..మొక్కవోని ధైర్యంతో, అద్భతమైన కలెక్షన్‌తో ప్యాషన్వీక్లో అబ్బుర పర్చారు. ఈ ప్రమాదం కారణంగానే గత సంవత్సరం పారిస్ ఫ్యాషన్ వీక్‌లో గౌరవ్ గుప్తా పాల్గొనలేకపోయాడు. కానీ ఈ సారి వేగంగా పుంజుకని తన స్టైల్‌తో అందరి అంచనాలను మించిపోయాడే. తన జీవితభాగస్వామి నవ్‌కిరత్ సోధి ద్వారా 2025 ఫ్యాషన్ వీక్ పూర్తి న్యాయం చేశాడని ఫ్యాషన్ నిపుణులు కొనియాడటం గమనార్హం. (కీర్తి సురేష్ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్)ఈ ఈవెంట్లో నవ్‌కిరత్ సోధి ప్రత్యేకంగా నిలిచింది. క్రీమ్-హ్యూడ్ డ్రెప్డ్ కార్సెట్ గౌనులో రన్‌వేపై వాక్ చేసింది. ఈ సమయంలో ఆమె శరీరంపై కాలిన గాయాల తాలూకు మచ్చలు కనిపించినపుడు అందరి కళ్లు గౌరవా భిమానాలతో చెమర్చాయి. నవకిరత్ కేవలం కలెక్షన్‌ను ప్రేరేపించడమే కాదు. ఆమె ఫీనిక్స్ పక్షిలా తిరిగి లేచి సాధికారత క్షణాలను ప్రపంచానికి చూపించి ప్రశంసలు అందుకుంది. View this post on Instagram A post shared by Gaurav Gupta (@gauravguptaofficial) "ఆమె ఒక పోరాట యోధురాలు . ప్రాణాలతో బయటపడినది... ఆమె ఒక దేవత" అని గౌరవ్ తన అధికారిక పేజీలో షేర్ చేసిన భావోద్వేగ వీడియోలో పేర్కొన్నాడు. నవ్‌కిరత్ సుదీర్ఘ ప్రయాణం తమ జీవితాలను మార్చడమే కాకుండా, ఒక సృజనాత్మక దృష్టిని మిగిల్చిందన్నాడు. View this post on Instagram A post shared by The Wedding Collective (@theweddingcollectiveofficial)దేశీయంగా అంతర్జాతీయ A-లిస్టెడ్ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్‌గుప్తా. తాజా ప్యారిస్ ఫ్యాషన్ వీక్ ఈవెంట్లో తన కలెక్షన్స్‌ను ప్రదర్శించాడు. జర్డోజీ, డబ్కా , నక్షి లాంటి ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఎక్కువ. రాహుల్ మిశ్రా ,వైశాలి ఎస్ తర్వాత ఈ కోచర్ వీక్‌లో ప్రజంట్ చేస్తున్న మూడవ డిజైనర్ గౌరవ్ గుప్తా కావడం విశేషం. 2004లో, అతను తన సోదరుడు సౌరభ్ గుప్తాతో కలిసి తన లేబుల్‌ని స్థాపించాడు. తరువాత ఇస్తాంబుల్‌లోని ఒక కంపెనీకి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. చివరికి భారతదేశానికి తిరిగి వచ్చి, 2006లో అధికారికంగా తన లేబుల్‌ను ప్రారంభించాడు.2006లో ఇండియా ఫ్యాషన్ వీక్‌లో "అత్యంత వినూత్న ప్రదర్శన"గా ప్రశంసలందుకున్నాడు.2009లో, తన తొలి స్టోర్‌ను న్యూఢిల్లీలో ప్రారంభించాడు. ముంబై,హైదరాబాద్, కోల్‌కతా లాంటి ముఖ్యమైన ప్రదేశాల్లో అతని ఫ్లాగ్షిప్ స్టోర్లున్నాయి.2017లో, భారతదేశపు మొట్టమొదటి AI-ఆధారిత వస్త్రాన్ని రూపొందించడానికి గౌరవ్ వోగ్ IBM కాగ్నిటివ్ సిస్టమ్ వాట్సన్‌తో కలిసి పనిచేశాడు. 2022లో, గౌరవ్ గుప్తా బ్రైడ్ - పెళ్లి దుస్తుల్లోకి ప్రవేశించాడు. లిజ్జో, మేగాన్ థీ స్టాలియన్ , దీపికా పదుకొనే , ప్రియాంక చోప్రా , మేరీ జె. బ్లిగే, జెన్నిఫర్ హడ్సన్, సావీటీ, థాలియా, కైలీ మినోచ్యుల్, వయోలెట్, ఒలిట్వియా, ఒలిట్వియా లాంటివి దేశవిదేశాల్లో ప్రజాదరణ పొందాయి. 2022లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్య రాయ్ బచ్చన్ కోసం డిజైన్ చేసిన దుస్తులు హైలైట్ అయ్యాయి.2023లో జరిగిన పారిస్ హాట్ కోచర్ వీక్‌లో గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన అద్భుతమైన లెమన్ గ్రీన్ గౌనును అమెరికన్ రాపర్ కార్డి బి,చైనీస్ నటుడు ఫ్యాన్ బింగ్‌బింగ్ ధరించడం విశేషం. ఇదీ చదవండి : పోషకాల పాలకూర పచ్చడి : ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్ -
Walk Your Pride: పారిస్ ఫ్యాషన్ వీక్ ఉమెన్స్వేర్.. (ఫోటోలు)
-
Paris Fashion Week: బ్లాక్ నెట్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఊర్వశి రౌతేలా (ఫోటోలు)
-
విదిశా టూ విదేశ్.. తొలి భారత ‘మహిళా డిజైనర్’గా ఘనత
భోపాల్: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చేసి చూపించారు ఓ యువతి. రోజుకు రూ.250 సంపాదించేందుకు ఇబ్బందులు పడిన స్థాయి నుంచి దేశం గర్వించే స్థితికి చేరుకున్నారు. తాను ఎంచుకున్న వృత్తినే నమ్ముకుని తన ప్రతిభతో.. విదిశా నుంచి విదేశాలకు భారత కళను తీసుకెళ్లారు. ఆమెనే మధ్యప్రదేశ్‌లోని విదిశా నగరానికి చెందిన వైశాలి షడంగులే. వైశాలి ఎస్ లేబుల్‌తో ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించారు. పారిస్ హాట్ కోచర్ వీక్‌లో తన డిజైన్లను ప్రదర్శించిన తొలి భారతీయురాలిగా నిలిచారు తన విజయంతో భారతీయ వస్త్రాలను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్.. వైశాలి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని తన ట్విట్టర్లో షేర్ చేశారు. విదిశా టూ విదేశ్ అంటూ వైశాలిపై ప్రశంసలు కురింపించారు మంత్రి. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన పారిస్ హాట్ కోచర్ ఫ్యాషన్ వీక్‌లో తన డిజైన్లను ప్రదర్శించిన తొలి భారతీయురాలిగా నిలిచారని కొనియాడారు. Vaishali from Vidisha to Videsh How her struggle to make Rs 250 led Vaishali Shadangule to become the first Indian female designer to reach the Milan fashion week and Paris Haute Couture Week, putting Indian textiles on global map. pic.twitter.com/CE0P0z3UYi — Piyush Goyal (@PiyushGoyal) July 18, 2022 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి బయటకు.. 17 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి బయటకు వచ్చిన వైశాలి.. హాస్టల్లో ఉంటూ పలు ఉద్యోగాలు చేశారు. ఈ క్రమంలో వస్త్రధారణ ఎలా ఉండాలి, స్టైల్ లుక్ కోసం తన స్నేహితులు, తెలిసినవారికి సూచనలు ఇచ్చేవారు. దీంతో ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని కొందరు సూచించారు. కానీ, ఆ పదమే ఆమెకు కొత్త. తన స్నేహితుడి సాయంతో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్కు వెళ్లి వివరాలు సేకరించారు. 2001లో సొంత లేబుల్‌తో మలాద్‌లో చిన్న బొటిక్ తెరిచారు వైశాలి. భారత వస్త్రాలతో ఆధునిక హంగులు జోడించి కొత్త కొత్త డిజైన్లు చేయటంపై దృష్టి సారించారు. విభిన్నమైన వస్త్రాలతో వినియోగదారులను ఆకట్టుకున్న వైశాలి.. మరో రెండు స్టోర్సు తెరిచారు. ఆ తర్వాత తన లేబుల్‌ను వివిధ ఫ్యాషన్ వీక్‌లలో ప్రదర్శించటం ప్రారంభించారు. అదే నా కల.. 2021, జులైలో జరిగిన పారిస్ హాట్ కోచర్ ఫ్యాషన్ వీక్‌లో తన డిజైన్లను తొలిసారి ప్రదర్శించారు వైశాలి. దాంతో భారత వస్త్రాలను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లారు.‘భారత వస్త్రాలను, డిజైన్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేదే నా కల. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇంటర్నేషనల్ డిజైనర్లను చూస్తాము. వారు మన నైపుణ్యాన్ని, డిజైన్లను ఉపయోగిస్తారు. ఆ డిజైన్లనే మనమెందుకు చేయలేమని ఆలోచిస్తుంటాను.’ అని పేర్కొన్నారు వైశాలి. సోనమ్ కపూర్, కల్కీ కోచ్లిన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు వైశాలి వద్దకు వస్తుంటారు. ఇదీ చదవండి: ఫైటర్ జెట్‌లో ‘బోరిస్’ సెల్ఫీ వీడియో.. నెటిజన్ల పైర్! -
పారిస్ ఓట్ కుట్యూర్ వీక్‌లో సుధారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పారిస్ ఫ్యాషన్ ఓట్ కుట్యూర్ వీక్‌లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఫిలాంథ్రపిస్ట్ సుధారెడ్డి పాల్గొంటున్నారు. మంగళవారం నుంచి 7 వరకు ఈ షో జరగనుంది. ఈ ఓట్ కుట్యూర్‌లో భారత్ నుంచి ఢిల్లీకి చెందిన డిజైనర్ రాహుల్ మిశ్రాతో పాటు సుధారెడ్డి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సినిమా రంగానికి సంబంధం లేకుండా దక్షిణ భారత దేశం నుంచి పాల్గొంటున్న మొట్టమొదటి సెలబ్రిటీ డిజైనర్ సుధారెడ్డి కావడం విశేషం. యూరోపియన్ లగ్జరీ, ఇండియన్ హెరిటేజ్ మధ్య సమతుల్యతను చాటుతూ క్రిస్టియన్ డియోర్, బాల్మైన్, చానెల్, అర్మానీ తదితర వస్త్ర శైలులను సుధ అక్కడ ప్రదర్శించను న్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘ప్రపంచంలోని సృజనాత్మక శైలులకు పట్టంగట్టే వేదిక పారిస్ కుట్యూర్ వీక్. మనదేశంలో వారసత్వంగా వస్తున్న కళలను ఇక్కడ హైలైట్ చేయడం నా ప్రధాన ఎజెండా. ఇది భారత దేశపు సంప్రదాయ హస్తకళకు దక్కిన గౌరవం అనుకుంటున్నాను’’ అని చెప్పారు. వ్యాపార వేత్త మేఘా కృష్ణారెడ్డి భార్య అయిన సుధారెడ్డి, మేఘా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ సామాజిక కార్యక్రమాలకూ నాయకత్వం వహి స్తున్నారు. ఫౌండేషన్ ద్వారా పేద మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ, విద్యపై దృష్టి సారిస్తు న్నారు. ఎలిజబెత్ హర్లీతో కలిసి బ్రెస్ట్ కేన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లల గురించి అవగాహన కల్పించడానికి అమెరికన్ నటి ఎవా లాంగారి యాతో కలిసి పని చేస్తున్నారు. 2022లో తెలంగాణ ప్రభుత్వం నుంచి చాంపియన్ ఆఫ్ చేంజ్’, 2021లో ఫిక్కీ నుంచి ‘యంగ్ ఇండియన్ ఉమెన్ అచీవర్’ అవార్డులను అందుకున్నారు. -
Anamika Khanna: నానమ్మ కుట్టే బట్టలను చూస్తూ పెరిగింది.. ఇప్పుడు టాప్ హీరోయిన్లకు
పెద్దపెద్ద ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులేవీ చేయలేదు, కానీ పాపులర్ సెలబ్రెటీలు.. సోనమ్ కపూర్, కరీనాకపూర్ ఖాన్, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, కియరా అద్వానీలను మరింత అందంగా కనిపించే డ్రెస్‌లను రూపొందించింది అనామిక ఖన్నా. జీవితంలో ఎదగాలన్న తపన, వినూత్నమైన ఆలోచనలు, కృషి, పట్టుదలతో శ్రమించే గుణం ఉండాలేగాని డిగ్రీలు చదవకపోయినప్పటికీ అత్యున్నత స్థాయికి ఎదగవచ్చని నిరూపించింది అనామిక. Anamika Khanna: Celebrity Designer Inspiring Story Facts In Telugu: ఇండియాలోనే పాపులర్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగి, విభిన్న డిజైన్లతో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకోవడమేగాక సరికొత్త డిజైన్లను ఎప్పటికప్పుడు తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో పోస్టుచేస్తూ.. లక్షలమందికి ఆదర్శంగా నిలుస్తోంది అనామిక. అప్పటి కలకత్తాలోని ఓ గ్రామంలో పుట్టింది అనామిక. నానమ్మ కుట్టే బట్టలను చూస్తూ పెరిగిన అనామిక.. పెద్దయ్యాక క్లాసికల్ డ్యాన్స్ చేర్చుకుని మంచి డ్యాన్సర్ అయ్యింది. అలా మొదలైంది.. డ్యాన్స్‌తోపాటు అనామికకు పెయింటింగ్స్ వేయడం అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ వివిధ రకాల స్కెచ్లను గీస్తుండేది. ఈ క్రమంలోనే ఆఫ్రికన్ టెక్స్టైల్స్ బుక్ చూసిన అనామికను..దానిలో ఫ్యాషన్ స్టైల్స్ ఎంతగానో ఆకర్షించాయి. దీంతో తను కూడా ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుంది. ఫ్యాషన్ డిగ్రీ చదవని అనామిక ఫ్యాషన్ డిజైనింగ్ గురించి తెలుసుకునేందుకు వర్క్‌షాపులు, ఫ్యాషన్ షోలకు క్రమం తప్పకుండా వెళ్లేది. అక్కడ చూసిన డిజైన్లకు తన సృజనాత్మకతతో సరికొత్త స్కెచ్‌లు గీసేది. ఇలా గీసిన స్కెచ్లను దమానియా ఫ్యాషన్ షోకు పంపింది. ఆ డిజైన్లు నచ్చడంతో దమానియా ఫ్యాషన్ వాళ్లు ఆరు డిజైనర్ పీస్‌లు పంపించమన్నారు. అప్పుడు మార్కెట్లో బట్టను కొని టైలర్ దగ్గరకు వెళ్లి కావాల్సిన విధంగా కుట్టించి వారికి పంపడంతో అనామిక డిజైన్స్ అవార్డుకు ఎంపికయ్యాయి. దీంతో అనామికకు డిజైనర్‌గా తొలిగుర్తింపు లభించింది. దమానియా కోసం డిజైన్ చేసిన వస్త్రాలను బెంగళూరుకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ యశోధరా షరాఫ్ చూసింది. అవి ఆమెకు నచ్చడంతో తన ఫోలియో బ్రాండ్ వాటిని విక్రయించడమేగాక, 2003లో పాకిస్థాన్‌లో జరిగిన బ్రైడల్ ఏషియా ఎగ్జిబిషన్లో పాల్గొనడానికి ఆహ్వానించింది. ఇలా యశోధరా షరాఫ్, ప్రసాద్ బిడప, రీతు కుమార్, మోనపలి వంటి ఫ్యాషన్ డిజైనర్ల గైడెన్స్ తీసుకుని ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగింది. అంతర్జాతీయంగా అనా–మిక.. ‘అనా–మిక’ పేరుతో 2004లో ప్రారంభించిన బ్రాండ్, అంతర్జాతీయంగా బాగా పేరొందిన ఇండియన్ బ్రాండ్స్‌లో ఒకటి. ల్యాక్మె ఇండియా ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనేందుకు 33 మంది డిజైనర్లను పిలవగా అందులో అనామిక ఒకరు. 2007లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌కు హాజరైన తొలి ఇండియన్ ఉమెన్ డిజైనర్ అనామిక. ఆ తరువాత 2010లో లండన్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్నారు. ఇక్కడ అనా–మిక డిజైన్లు నచ్చడంతో అతిపెద్ద బ్రిటిష్ రీటైల్ దిగ్గజ కంపెనీ హరాడ్స్ కాంట్రాక్ట్‌ను ఆఫర్ చేసింది. అంతేగాక బిజినెస్ ఆఫ్ ఫ్యాషన్–500 జాబితాలో అనామిక ఒకరు. 2015లో ప్రముఖ నటి టాక్ షో అతిథి ఐమీ గరేవాల్ లేడీ గగాకు పదికేజీల వెల్వెట్ లెహంగాను బహుమతిగా ఇచ్చారు. ఈ లెహంగా డిజైనర్ అనామికే. 2017లో ఎలిజిబెత్ –2 యూకే ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్‌కు అనామిక ప్రత్యేక ఆహ్వానితురాలు. ఏకే– ఓకే వర్క్‌షాపులు, లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం, పారిస్‌లోని ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్స్‌కు వెళ్లినప్పుడు అక్కడ డిజైనింగ్స్ టిప్స్‌తోపాటు, సన్నగా కనిపించేలా బట్టను ఎలా కట్ చేయాలి? ప్యాట్రన్ ఎలా తీసుకురావాలి వంటి అనేక విషయాలను అనామిక జాగ్రత్తగా పరిశీలించి పూర్తిస్థాయి ఫ్యాషన్ డిజైనర్ అయ్యింది. దీంతో తన అనామిక డిజైన్స్ పేరుతో సొంత బ్రాండ్, కోల్‌కతాలో తన డిజైనర్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. తన పిల్లలు విరాజ్ ఖన్నా, విశేష్ ఖన్నాలతో కలిసి రెడీ టు వేర్ స్ప్రింగ్, సమ్మర్ థీమ్‌తో ‘ఏకే–ఓకే’ పేరుతో ఏర్పాటు చేసింది. కొన్ని బాలీవుడ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. ఇవేగాక ‘టైమ్‌లెస్ ద వరల్డ్’ పేరిట ఈ ఏడాది మార్చిలో తన లేటెస్ట్ డిజైన్లను విడుదల చేశారు. కేవలం పదివేల రూపాయలతో ప్రారంభించిన అనామిక ఎథినిక్ బ్రైడల్ వేర్, కాంటెంపరరీ, వెస్ట్రన్ డిజైన్స్‌ను రూపొందిస్తూ, లక్షలమంది ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. చదవండి: Toy Bank: మీ పిల్లలు ఆడేసిన బొమ్మలను ఏం చేస్తున్నారు? View this post on Instagram A post shared by Anamika Khanna (@anamikakhanna.in) -
తెల్లటి దుస్తుల్లో అదరగొట్టిన అందాల ఐశ్యర్య రాయ్...
-
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిపోయిన ఐశ్యర్యా రాయ్
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ మరోసారి ర్యాంప్‌పై దేవతలా మెరిసిపోయింది. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో కాస్మెటిక్ బ్రాండ్ లోరియల్ అక్టోబర్ 3న నిర్వహించిన ఈవెంట్లో వైట్ కలర్ దుస్తుల్లో ర్యాంప్ వ్యాక్ చేసి అక్కడున్నవారినందరినీ మెస్మరైజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న సెలబ్రిటీ మహిళలతో ఈఫిల్ టవర్ దగ్గర నిర్వహించిన ఈవెంట్లో ఐశ్యర్య రాయ్ సందడి ట్రెండింగ్‌లో నిలిచింది. ‘లే డిఫైల్ లోరియల్ పారిస్ 2021 విమెన్స్ వేర్ సమ్మర్ 2022 షో’ పారిస్‌లో ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత, వేధింపులకు వ్యతిరేకంగా ప్రచారం థీమ్‌తో ఈ ఏడాది ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్టు ఎల్ ఓరియల్ పారిస్ గ్లోబల్ బ్రాండ్ ప్రెసిడెంట్ డెల్ఫిన్ విగుయర్-హోవాస్సే ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను లోరియల్ పారిస్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈఫిల్ టవర్ బ్యాక్ గ్రౌండ్లో ప్రముఖ యాక్టర్స్ హెలెన్ మిరెన్, కేథరీన్ లాంగ్‌ఫోర్డ్, గాయని కెమిలా కాబెల్లో, అంబర్ హర్డ్ తదితర ప్రపంచవ్యాప్త సూపర్ సూపర్ మోడల్స్ తో ఈ వేడుక జరుపుకోవడం విశేషం. ఈ ఈవెంట్ కోసం ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్ , కుమార్తె ఆరాధ్యతో కలిసి గత వారమే పారిస్ వెళ్లింది. ఈ క్రమంలో అభిషేక్ ఒక వీడియోను కూడా షేర్ చేశాడు. కాగా 2018, 2019 లో ఫ్యాషన్ వీక్‌లో కూడా ఐశ్వర్య మెరిసిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) When she walk around the corner looks like a diamond in the water 💧 I know this girl make me crazy this love is a natural love ❤️ #AishwaryaInParis #AishwaryaRaiBachchan #AishwaryaRai pic.twitter.com/xZwz7IuU4P — Aishwarya Rai (@my_aishwarya) October 3, 2021 View this post on Instagram A post shared by L'Oréal Paris Official (@lorealparis) -
బాటమ్ లైన్!
అందమా అందుమా అందనంటే అందమా... అంటూ అందాన్ని అపురూపంగా ఆరాధించే రోజులు పోయినట్టున్నాయి. వారు.. వీరు అని లేదు... అన్ని ‘వుడ్’ల భామలు మాకేంటి తక్కువంటూ ‘అందాంద’ ప్రదర్శనలో పోటీపడుతుంటే.. ఇక దాని కోసం పాట్లు పడాల్సిన పనేముంటుందంటున్నారు రసిక ప్రియులు! చెప్పొచ్చేదేమంటే... హాలీవుడ్ బ్యూటీ కేట్ హడ్సన్ రీసెంట్గా జరిగిన ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో అందాల విందు చేసిందట. బాటమ్లెస్లో దర్శనమిచ్చి టాప్ లేపిందట. బిగ్‌స్క్రీన్ సుందరి ఒక్కసారిగా ఇలా కళ్లముందుకొచ్చి అలా ‘బోల్డ్’గా వయ్యారాలు ఒలకబోస్తుంటే... అక్కడున్నవారంతా ‘కల కాదిది... నిజమైనది’ అంటూ ఆస్వాదించేశారనేది ఓ వెబ్సైట్ కథనం!