rainwater
-
అకాల వర్షాన్ని ఒడిసిపడితే.. బోరులోనూ జలహోరు!
తెలుగు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లు నోరెళ్ల బెడుతున్నాయి. పంటలు, తోటలు కళ్లు తేలేస్తున్నాయి. మరో మూడు నెలలు ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతూనే ఉంది. ఈ కష్టకాలంలో అడపాదడపా పలకరించే అకాల వర్షాలు రైతులకు కొంత మేరకు ఉపశమనం కలిగిస్తున్నాయి. రెండు రోజులు గడిస్తే నీటికష్టాలు షరా మామూలే. అయితే, ఈ అకాల వర్షపు నీటిని పొలాల్లో ఎక్కడికక్కడే ఒడిసిపట్టి భూమిలోకి ఇంకింపజేసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎండిపోయిన /ఎండిపోతున్న బోర్ల చుట్టూ ఇంకుడు గుంతలు కట్టుకుంటే ఆ బోర్లు ఎండిపోకుండా ఉంటాయి. అవి తిరిగి జలకళను సంతరించుకుంటాయి. వర్షం కురిసిన రోజే ఆ బోర్లలో అప్పటికప్పుడే నీటిలభ్యత పెరుగుతుందని సీనియర్ హైడ్రాలజిస్ట్, సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాటర్ అండ్ లైవ్లీహుడ్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్వి.రాంమోహన్అనుభవపూర్వకంగా చెబుతున్నారు. పన్నెండేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో వేలాది బోర్లను రీచార్జ్ చేసిన అనుభవంతో ఆయన ‘సాక్షి సాగుబడి’కి అనేక విషయాలు చెప్పారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ఏమిటి?గ్రామీణ ప్రాంతాల్లో వేలాది వ్యవసాయబోర్లు ఎండిపోయి ఉన్నాయి. కొన్నిచోట్ల తక్కువ నీటిని పో స్తూ ఉన్నాయి. కొత్త బోర్లు తవ్వకుండా ఇప్పటికే ఉన్న ఎండిపోయిన లేదా ఎండిపోతున్న బోరుబా వుల చుట్టూ వాననీటి రీచార్జ్ కట్టడాలు నిర్మించాలి. తద్వారా చిన్న, సన్నకారు రైతులకు అందుబా టు ఖర్చుతోనే నీటి భద్రత కల్పించొచ్చు. ఎప్పుడు? బోరు లోపలికి ట్యాంకర్‌తో తెచి్చన నీటిని పోసి.. దానికి వాననీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యం ఉందో లేదో టెస్ట్ చేయాలి. దీన్నే ట్యాంకర్ టెస్ట్ అంటారు. కేవలం కొన్ని వందల రూపాయల ఖర్చుతో రైతులు సొంతంగా తమ బోరుబావులను పరీక్షించుకోవచ్చు. వానాకాలం ప్రారంభం కాక ముందు ఫిబ్రవరి–మే నెలల మధ్య రోజులు ఇందుకు అనువైన కాలం. ఎక్కడ?కొన్ని పొలాల్లో ఒకటి కన్నా ఎక్కువ బోర్లు ఉండొచ్చు. అలాంటప్పుడు అన్ని బోర్లకు ‘ట్యాంకరు టెస్ట్’చేయాలి. వాటి వాస్తవిక రీచార్జ్ సామర్థ్యం ఎంత అనేది కచ్చితంగా తెలుస్తుంది. లోతు తక్కువ ఉన్న బోరుబావిని రీచార్జ్ కోసం ఎంపిక చేసుకుంటే రీచార్జ్ కట్టడం ద్వారా ఆ పక్కనున్న ఇతర బోరుబావుల్లో కూడా నీరు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు? వర్షాధార వ్యవసాయ ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయిన ప్రతిసారీ కొత్త బోర్లు వేయటం ఆర్థికంగా కష్టంతో కూడుకున్న పని. అందుకని బోరుబావులకే వాననీటిని తాపే పనిచేయడం ఉత్తమం. ఇందుకోసం బోరుబావుల చుట్టూ వాన నీటి రీచార్జ్ కట్టడాలు నిర్మించుకోవాలి. ఇవి దీర్ఘకాలం (కనీసం 8–10 ఏళ్లు) పాటు రైతులకు ప్రయోజనాలు అందించగలుగుతాయి. బోరు రీచార్జ్ సాంకేతికతను ఉపయోగించి, రెండు వానాకాలపు సీజన్లలోనే ఎండిపోయిన బోరు బావులను పునరుద్ధరించుకోవచ్చు. ఎలా? బోరు రీచార్జ్ నిర్మాణానికి స్థానికంగా దొరికే రాళ్లు, ఇసుక, సిమెంట్ వంటి సామగ్రిని వాడుకొని 7–10 రోజుల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేయొచ్చు. కొత్తగా బోరుబావి తవ్వడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే.. తక్కువ ఖర్చులోనే ఎండిన బోరుబావులను పునరుద్ధరించొచ్చు. కొత్తగా తవ్వే బోరు పడకపోతే ఆ ఖర్చు అంతా వ్యర్థమే. ఎగువన ఉండే నీటి పరీవాహక ప్రాంతాల నుంచి సంగ్రహించే వాననీటిలో గరిష్టంగా 50% నీరు రీచార్జ్ అవుతుంది (చెక్‌డ్యాం, నీటికుంటల ద్వారా 10–15% నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతుంది). ఈ పద్ధతిలో వాననీటిని రీచార్జ్ చేస్తూనే ఆ బోరుబావి నుంచి నీటిని పంటలకు వాడుకునే వెసులుబాటు ఉంది. ఎవరు?బోరుబావి ద్వారా వాననీటిని నేలలోకి ఇంకించి భూగర్భ నీటిని మరింతగా రీచార్జ్ చేసే సాంకేతిక ప్రక్రియలో ఆర్వి.రాంమోహన్ది అందెవేసిన చేయి. 2012 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో నీటి కష్టాలకు పరిష్కారంగా బోరుబావుల చుట్టూ రాళ్లు రప్పలు, గులక రాళ్లు, ఇసుకతో ఇంకుడు గుంతలు నిర్మించుకోవటంలో రైతులకు, పట్టణవాసులకు చేదోడుగా ఉంటున్నారు. ఇప్పటికి వెయ్యి బోర్ల రీచార్జ్‌కు ఇంకుడుగుంతలను నిర్మించటంలో ప్రత్యక్షంగా తోడ్పాటునందించారు. మరో మూడు, నాలుగు వేల బోరు రీచార్జ్ పిట్ల నిర్మాణానికి పరోక్షంగా సాంకేతికతంగా సాయపడ్డారు. ఈ క్రమంలో రైతుల అభిప్రాయాలు, సలహాలు సూచనల మేరకు ఈ సాంకేతికతలో ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేశారు. ఈ అనుభవ జ్ఞానంతో ‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బోరుబావుల పునరుద్ధరణ (అక్విఫెర్ రీచార్జ్)’పేరిట శిక్షణ కరదీపికను ప్రచురించారు. -
ఈరోజు ఎన్ని లీటర్లు వాన పడింది??
ఏంటీ ఏదో తేడాగా ఉంది అని అనిపిస్తోందా.. అవును మరి.. ఎప్పుడూ ఇన్ని మిల్లీ మీటర్లు లేదా ఇన్ని సెంటీమీటర్లలో వర్షం పడింది అని మాత్రమే మనం వింటుంటాం కదా.. అయితే.. కచి్చతంగా ఎంత పడిందన్న విషయం ఎలా తెలుస్తుంది? సింపుల్‌గా చెప్పాలంటే.. వర్షం పడినప్పుడు ఒక చదరపు మీటర్ స్థలంలో ఒక లీటర్ నీళ్లు నిలిస్తే.. ఒక మిల్లీమీటర్ వాన పడినట్లు.. అదే పది లీటర్ల నీళ్లు నిలిస్తే.. ఒక సెంటీమీటర్ అన్నమాట. అసలు వానను శాస్త్రవేత్తలు ఎలా లెక్కేస్తారో తెలుసా?ప్రత్యేక పరికరాలతో.. సాధారణంగా వాన నీటి లెక్కలను తేల్చేందుకు ప్రత్యేకంగా పరికరాలు ఉంటాయి. వాటిని ఆరుబయట ప్రదేశాల్లో నిటారుగా ఉండేలా అమర్చుతారు. వాటిపై మిల్లీమీటర్లు, సెంటీమీటర్ల లెక్కలు ఉంటాయి. వర్షం పడినప్పుడు అందులో చేరే నీటి స్థాయిని చూసి.. ఎంత వాన పడిందో చెప్తారు. కానీ వానకు మామూలు లెక్క ఏమిటంటే.. సమతలంగా ఉన్న ఒక చదరపు మీటర్ స్థలంలో ఒక లీటర్ నీళ్లు నిలిస్తే.. ఒక మిల్లీమీటర్ వాన అన్నమాట. ఈ లెక్కకు కొన్ని రూల్స్ ఉన్నాయి. కాంక్రీట్, ప్లాస్టిక్, ఏదైనా లోహంతో చేసినది అయినా సరే.. కచి్చతంగా చదరపు మీటర్ విస్తీర్ణం ఉండాలి. ఎక్కువ తక్కువలు, వంపు లేకుండా కచ్చితంగా సమతలంగా ఉండాలి. చుట్టూ ఖాళీ ప్రదేశం ఉండాలి. వాన నీరు పడేందుకు ఎలాంటి అడ్డంకీ ఉండకూడదు.కురిసిన సమయాన్ని బట్టి తీవ్రత..ఎన్ని సెంటీమీటర్లు వాన అన్నది మాత్రమేకాకుండా ఎంత సమయంలో కురిసింది అన్నదాన్ని బట్టి.. వర్షం తీవ్రతను అంచనా వేస్తారు. ఉదాహరణకు ఒక రోజంతా అంటే 24 గంటల్లో ఆరు సెంటీమీటర్ల వానపడితే.. అది మోస్తరు వర్షం కిందే లెక్క. అదే ఒకట్రెండు గంటల్లోనే ఆరు సెంటీమీటర్లు పడితే కుంభవృష్టి కురిసినట్టే. ఇలా జరిగితే నీరంతా ఒక్కసారిగా చేరి వరదలు వస్తాయి. ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. -
టీచరమ్మగా రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము టీచర్‌గా మారారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా గురువారం ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. భూతాపం పర్యవసానాలు, తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. ప్రెసిడెంట్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయలో 9వ తరగతి చదువుకునే 53 మంది విద్యార్థులతో ఆమె సంభాషించారు. మొక్కల పెంపకం, వాననీటి సంరక్షణ అవసరాన్ని తెలియజెప్పారు. ముఖాముఖి సందర్భంగా వారి ఆకాంక్షలు, లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. చదువుకుని వైద్యులు, శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఉందంటూ వారు చెప్పిన లక్ష్యాలను విని సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా నేడు శాస్త్రవేత్తలు, పాలనాధికారులు, పాలకులు సభలు, చర్చాగోషు్టలు, సమావేశాలు చేపట్టి ఓ పెద్ద సమస్యపై చర్చలు జరుపుతున్నారు. అదేమిటో మీకు తెలుసా?’అని వారినడిగారు. వాతావరణ మార్పులు, భూతాపం, పర్యావరణ కాలుష్యం..అంటూ విద్యార్థులు బదులిచ్చారు. రాష్ట్రపతి ముర్ము బదులిస్తూ..‘ఇది వరకు ఏడాదిలో ఆరు రుతువులుండేవి కానీ, నేడు నాలుగే ఉన్నాయి. వీటిలో అత్యధిక కాలం కొనసాగుతూ మనల్ని ఇబ్బంది పెట్టే రుతువు ఎండాకాలం. రోజురోజుకూ ఎండలు మండిపోతుండటంతో మనుషులే కాదు, జంతువులు, మొక్కలు, పక్షులూ ఇబ్బంది పడుతున్నాయి. కరువులు కూడా ఏర్పడుతున్నాయి. భూతాపమే వీటికి కారణం’అని ఆమె వివరించారు. ‘భూతాపాన్ని ఎదుర్కోవాలంటే నీటిని పొదుపుగా వాడాలి. వర్షం నీటిని సంరక్షించాలి. చెట్లను విరివిగా పెంచాలి’అని వారికి సూచించారు. -
అసెంబ్లీలో వైఎస్ జగన్ ఛాంబర్ మళ్లీ జలమయం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనానికి ప్రభుత్వం ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా నాసిరకం పనుల డొల్లతనం బయట పడుతూనే ఉంది. పెథాయ్ తుపాను వల్ల రెండు రోజులుగా రాజధాని ప్రాంతంలో ఓ మోస్తరు వర్షం పడుతోంది. అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఛాంబర్లోకి సోమవారం పైకప్పు నుంచి వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో ఛాంబర్లోని ఫైళ్లన్నింటినీ మరో గదిలోకి మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది మే నెలలోనూ, అంతకుముందు కూడా పలుమార్లు కురిసిన చిన్నపాటి వర్షానికే అసెంబ్లీ తాత్కాలిక భవనంలోని ప్రతిపక్ష నేత ఛాంబర్లోకి నీరు చేరిన విషయం తెలిసిందే. మొదటిసారిగా ఈ ఛాంబర్లోకి వర్షం నీరు వచ్చినప్పుడు వైఎస్సార్సీపీకి చెందిన కొందరు కావాలనే పైపులు కోసేశారని ప్రభుత్వ పెద్దలు అప్పట్లో ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ సంఘటనను విద్రోహ చర్యగా అభివర్ణిస్తూ విచారణ కోసం ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఆ తర్వాత సీఐడీ నివేదిక ఏమైందో కూడా తెలియడం లేదు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఛాంబర్లోకి పలుమార్లు వర్షం నీరు చేరిన నేపథ్యంలో సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ పాటు ఇతర అధికారులు అసెంబ్లీ తాత్కాలిక భవనాన్ని తనిఖీ చేశారు. ఆ సమయంలో మీడియాను అనుమతించకుండా ఆంక్షలు విధించడం అప్పట్లో విమర్శలకు దారితీసింది. వారి వెంట మీడియా ప్రతినిధులు జగన్ ఛాంబర్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అధికారులు గేటు వద్దే అడ్డుకున్నారు. పెథాయ్ తుపాను ప్రభావంతో కురిసిన చిన్నపాటి వర్షానికే జగన్మోహన్రెడ్డి ఛాంబర్లోకి నీరు రావడం అసెంబ్లీ తాత్కాలిక భవనాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం జగన్ ఛాంబర్లోకి వర్షం నీరు వచ్చిందన్న విషయం తెలిసి అక్కడికి వెళ్లేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా అసెంబ్లీ సిబ్బంది మరోమారు అడ్డుకున్నారు. -
నీటిలో ప్రభుత్వ ఆస్పత్రి ; ఐసీయూలోకి చేపలు
పట్నా : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పట్నాలోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలోని రోడ్లనే కాకుండా నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ను కూడా వరద నీరు ముంచెత్తింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న జనరల్ వార్డుతో పాటు, ఐసీయూలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పెషేంట్లు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఐసీయూలోకి వచ్చిన నీటిలో చేపలు కూడా దర్శనం ఇవ్వడంతో వారు షాక్‌కు గరయ్యారు. వరద నీటితో పాటు విష సర్పాలు, ఇతర హానికర కీటకాలు వస్తే తమ పరిస్థితేంటని పెషేంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన నీటిని వెంటనే బయటకు పంపేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై పెషేంట్ల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆస్పత్రి సిబ్బంది ఒకరు మాట్లాడుతూ.. తాము కూడా పెషేంట్ల సేవలు అందించడం కష్టం మారిందన్నారు. ఆస్పత్రి పరిసరాల్లో పూర్తిగా వరద నీరు చేరిందని తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితిని ఈ ఘటన తెలియజేసేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రాజధానిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నీటిలో ప్రభుత్వ ఆస్పత్రి ; ఐసీయూలోకి చేపలు
-
ఎస్సారెస్సీలో పెరుగుతున్న వరద
సాక్షి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇన్‌ఫ్లో 9,342 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1055.00 అడుగులు (9.287 టీఎంసీలు) లుగా ఉంది. ఈ నెలలో 14 రోజుల్లో ప్రాజెక్టులోకి 2 టీఎంసీల వరద వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. -
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద
సాక్షి, నిజామాబాద్: మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో గోదావరికి జలకళ సంతరించుకుంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేశారు. దీంతో నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1052 అడుగులుగా ఉంది. -
బొట్టు.. బొట్టు.. ఒడిసి పట్టు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో వర్షపునీటిని సంరక్షించేందుకు జలమండలి మహోద్యమానికి శ్రీకారం చుడుతోంది. ‘జలం.. జీవం’ పేరిట అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ నీటి సంరక్షణ చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా అన్ని వర్గాల వారికి తేలిగ్గా అర్థమయ్యేలా బెంగళూరు తరహాలో ‘రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్‌పార్క్’ను ఏర్పాటు చేయనుంది. ఈ పార్కులో ఇళ్లు, ఆఫీసులు, విద్యాసంస్థలు.. ఇలా ఎక్కడైనా ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు వీలుండే 26 రకాల పిట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. రూ.1.6 కోట్లతో జూబ్లీహిల్స్ రోడ్‌నెం.25లోని విశ్వేశ్వరయ్య పార్క్‌లో రెండెకరాల్లో ఈ థీమ్‌పార్క్‌ను నెలకొల్పనున్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేసి జూన్ రెండోవారం నాటికి పార్క్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందులో ఏర్పాటు చేసే రిసోర్స్ కేంద్రం ద్వారా.. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, స్వచ్ఛంద సంస్థలు, కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వ, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు ఇలా అన్ని వర్గాలకు భిన్న రూపాల్లో ఇంకుడుగుంతలు నిర్మించుకోవడం, అందుకు సంబంధించిన సాంకేతిక వివరాలను అందజేస్తారు. 9% ఇంకుతోంది గ్రేటర్ పరిధిలో ఏటా కురుస్తున్న వర్షపాతంలో 9% నీరు నేల పైపొరలను తడుపుతుండగా.. మరో 9% భూగర్భంలోకి ఇంకుతోంది. ఇక 42% మేర నీరు ఆవిరవుతుండగా మరో 40 శాతం వృథాగా దారులపై పారుతోంది. ఈ 40 శాతం వరద నీటిని ఒడిసిపడితే చాలు గ్రేటర్లో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 7,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో ఏటా కురిసే 830 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతాన్ని ఒడిసిపడితే.. అది సుమారు 15 టీఎంసీల నీటికి సమానం. దీంతో కోటి జనాభా ఉన్న నగరానికి ఏడాదంతా తాగునీటి అవసరాలు తీరతాయని అధికారులు చెబుతున్నారు. రుణాలిప్పిస్తాం.. వడ్డీ భరిస్తాం గ్రేటర్ పరిధిలో వర్షపు నీటి సంరక్షణకు జలమండలి చేపట్టిన జలం.. జీవం కార్యక్రమానికి వివిధ వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్, మన పొరుగునే ఉన్న బెంగళూరు, లాతూర్ నగరాల్లో నీటి కరువు నేపథ్యంలో జలమండలి నగరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ప్రప్రథమంగా ఇంకుడు గుంతల నిర్మాణానికి తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి వినియోగదారులకు రుణాలు అందజేయడంతోపాటు వడ్డీ భారాన్ని జలమండలే భరిస్తోంది. అత్యుత్తమ ఇంకుడు గుంతలు నిర్మించిన వారికి జలపుర స్కారాలు ప్రదానం చేయడంతో పాటు ఈ కార్యక్రమంపై నగర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న మార థాన్ రన్లకు అన్ని వర్గాల నుంచి స్పందన కనిపిస్తోంది. ఈ పార్క్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తాం. – ఎం.దానకిశోర్, జలమండలి, ఎండీ -
22 ఏళ్లుగా ఆ ఇంటికి వాటర్ బిల్లే లేదు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ సీనియర్ శాస్త్రవేత్త గత 22 ఏళ్లుగా నీటి బిల్లు కట్టడం లేదు. ఎందుకంటే ఆయన ఇంటికి అసలు ప్రభుత్వ కుళాయి కనెక్షన్ కూడా లేదు. అదేమిటీ బెంగళూరులాంటి నగరంలో అసలు కుళాయి కనెక్షన్ లేకుండా ఎలా జీవితాన్ని గడుపుతున్నారని అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. ఏఆర్ శివకుమార్ అనే వ్యక్తి ఓ శాస్త్రవేత్త. అతడు కర్ణాటక స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆయన తన నివాసాన్ని హరిత గృహంగా నిర్మించారు. రోజుకు కనీసం 400 లీటర్ల వర్షపు నీటిని స్టోర్ చేసేలా కట్టుకున్నారు. ఈ విధంగా నీటి కష్టాలు మొత్తం రాష్ట్రం మొత్తం ఎదుర్కొంటున్నా తన ఇంట్లో మాత్రం ఎలాంటి సమస్య లేకుండా హాయిగా గడిపేస్తున్నారు. మొత్తం మీద ఆయన ఇంటికి దాదాపు 45వేల లీటర్ల నీటిని నిలువ చేసుకునే సామర్థ్యం ఉంది. శక్తివనరులు, వర్షపు నీటిని తిరిగి వినయోగించుకుకోవడం ఎలా అనే విభాగంలో పని చేస్తున్న ఆయన తన ఇంటికి ఏడాదికి మొత్తం 2.3లక్షల లీటర్ల నీరు సరిపోతుందని చెప్పారు. రోజుకు 400 లీటర్ల చొప్పున అవసరం అవుతుందని, 100 రోజులకు 40000 లీటర్ల నీరు అవసరం ఉంటుందని, కానీ తమకు 45వేల లీటర్ల నిలువ నీటి సామర్థ్యం ఉందని అన్నారు.