Shivaratri arrangements
-
Maha Kumbh: ఆఖరిరోజు పుణ్య స్నానాలకు ఎంత మంది అంటే..
ప్రయాగ్‌రాజ్: ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవంగా పేరొందిన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినంతో ముగియనుంది. మహా కుంభమేళా చివరి అమృత స్నానంలో కోటి మందికి పైగా భక్తులు పాల్గొంటారని స్థానిక అధికారులు అంచనా వేశారు. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత రీతిలో భద్రతా ఏర్పాట్లు చేసింది.జనవరి 13న మహా కుంభమేళా(Maha Kumbh) ప్రారంభమైనది మొదలు ఇప్పటివరకు దాదాపు 64 కోట్ల మంది భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. రైళ్లు, విమానాలు, రోడ్డు మార్గాలలో కోట్లాదిమంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నారు. శివరాత్రి( Mahashivratri) సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు నగరంలోనికి ఎటువంటి వాహనాలను అనుమతించరు. అయితే వాటి పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు.ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే అన్ని ప్రధాన రహదారులలో మోటార్‌బైక్‌లపై 40 పోలీసు బృందాలను మోహరించారు. కుంభమేళా చివరి రోజు మహాశివరాత్రి ఒకరోజు అయినందున ప్రయాగ్‌రాజ్‌లోని శివాలయాలను సందర్శించేందుకు భక్తులకు అనుమతినివ్వనున్నారు. ఆయా శివాలయాలలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఇప్పుటికే అదనపు పోలీసు సిబ్బందిని నియమించారు. కాగా మహా కుంభమేళా ప్రారంభంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP Chief Minister Yogi Adityanath) ఈ కార్యక్రమానికి 45 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. ఈ సంఖ్య ఫిబ్రవరి 11 నాటికే నమోదయ్యింది. తరువాతి మూడు రోజుల్లో ఆ సంఖ్య 50 కోట్లు దాటింది. తాజాగా.. 60 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారని ప్రభుత్వం ప్రకటించింది. మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేయడం వలన జీవన్మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘ఆ గోధుమలతోనే జుట్టూడింది’ -
రేపు శివరాత్రి ఏర్పాట్లకు టెండర్లు
మహానంది, న్యూస్‌లైన్ : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానంది క్షేత్రంలో చేపట్టాల్సిన ఏర్పాట్ల కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జ్ ఈఓ, డీసీ కేవీసాగర్‌బాబు తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ నెల 7, 18 తేదీల్లో రెండు విడతలుగా టెండర్లు పిలుస్తామని ఆయన చెప్పారు. దేవస్థానం కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భక్తులకు కల్పించాల్సిన వసతులు, ఇతర ఏర్పాట్లకు సంబంధించి ఈ నెల 7న టెండర్లు నిర్విహ స్తామన్నారు. మహాశివరాత్రి, ఉగాది పర్వదినాల సందర్భంగా విద్యుత్ దీపాలంకరణ ఏర్పాట్ల టెండర్లలో పాల్గొనేవారు రూ. 25వేల డిపాజిట్ చెల్లించాలన్నారు. చలువపందిళ్లు, షామియానాల ఏర్పాటు, సున్నపుపూత పనులు, తాగునీటి వసతి కల్పన, స్వామివారి కల్యాణవేదిక, స్వాగతతోరణం, వేదిక ముందు కూర్చునేందుకు పందిరి, క్యూలైన్లు, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, జంగిల్ క్లియరెన్స్, ఇతర పనులకు ఇదే రోజు టెండర్లు నిర్వహిస్తామన్నారు. నవగ్రహాల వద్ద దీపారాధనకు కావాల్సిన సామగ్రి సరఫరా, అభిషేక సామగ్రి విక్రయ కేంద్రం, పూలదుకాణం ఏర్పాటు, తలనీలాల సేకరణ, నందివిగ్రహం వద్ద ఫొటోలు తీసుకునే హక్కు తదితరవాటికి సంబంధించి ఈ నెల 18వతేదీన టెండర్లుంటాయని సాగర్‌బాబు తెలిపారు. స్థల పరిశీలన.. క్షేత్రంలో ఓ కమ్యూనిటికి చెందిన అన్నసత్రం నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని ఈఓ ఆదివారం పరిశీలించారు. సూపరింటెండెంట్ మధు, వీఆర్ఓ శ్రీకాంతరావు, రెవెన్యూ సిబ్బందితో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఆయన పూర్తి వివరాలు తెలుసుకున్నారు.