SRK
-
ముగ్గురు ఖాన్‌లనూ మించిన కుబేరుడు!
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2025 ఎడిషన్ ఇటీవల విడుదలైంది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన బిలియనీర్లు 205 మంది ఉన్నారు. వీరిలో వినోదం, మీడియా ప్రపంచానికి చెందినవారు కొంతమంది ఉండగా ఇందులో బాలీవుడ్ నుంచి ఉన్న ఏకైక బిలియనీర్ రోనీ స్క్రూవాలా (Ronnie Screwvala). ఒకప్పుడు టూత్ బ్రష్‌లు అమ్మిన ఆయన ఇప్పుడు పరిశ్రమలోని అతిపెద్ద సూపర్ స్టార్ల కంటే ధనవంతుడైన పారిశ్రామికవేత్త.బాలీవుడ్ అపర కుబేరుడుఫోర్బ్స్ ప్రకారం.. హిందీ చిత్ర పరిశ్రమ నుండి ఒక బిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్న ఏకైక వ్యక్తి మూవీ మాగ్నెట్, పారిశ్రామికవేత్త రోనీ స్క్రూవాలా. ఫోర్బ్స్ కొత్త జాబితా ప్రకారం ఈ మీడియా మొఘల్ నికర విలువ 1.5 బిలియన్ డాలర్లు. దీంతో ఇండస్ట్రీలో సూపర్ స్టార్లుగా ఉన్న ఖాన్ త్రయం కంటే ధనవంతుడు. ఎలాగంటే షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) (770 మిలియన్ డాలర్లు), సల్మాన్ ఖాన్ (Salman Khan) (390 మిలియన్ డాలర్లు), అమీర్ ఖాన్ (Aamir Khan) (220 మిలియన్ డాలర్లు) మొత్తం నెట్‌వర్త్ 1.38 బిలియన్ డాలర్లు కాగా ఆ ముగ్గురి సంపద కంటే రోనీ స్క్రూవాలా సంపద అధికం. రోనీ వ్యాపార ప్రస్థానం1956లో బొంబాయిలో జన్మించిన స్క్రూవాలా 70వ దశకం చివర్లో టూత్ బ్రష్ ల తయారీ ద్వారా తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారు. 80వ దశకం ప్రారంభంలో ఆసియా క్రీడల పుణ్యమా అని కలర్ టీవీ దేశంలోకి ప్రవేశించినప్పుడు అ బూమ్‌ను స్క్రూవాలా అందిపుచ్చుకున్నారు. అలా ఎంటర్టైన్ మెంట్ రంగంలోకి ప్రవేశించి 1990లో యూటీవీని స్థాపించారు. అదే తరువాత యూటీవీ మోషన్ పిక్చర్స్‌గా మారింది. తరువాతి రెండు దశాబ్దాలలో ఈ నిర్మాణ సంస్థలు స్వదేశ్, రంగ్ దే బసంతి, ఖోస్లా కా ఘోస్లా, జోధా అక్బర్, ఫ్యాషన్, ఢిల్లీ బెల్లీ, బర్ఫీమ్ వంటి ఐకానిక్ చిత్రాలను అందించాయి. అలాగే శాంతి, హిప్ హిప్ హుర్రే, షకా లకా బూమ్ బూమ్, కిచిడి, షరారత్ వంటి టీవీ షోలను అందించాయి.తర్వాత రోనీ స్క్రూవాలా 2012లో యూటీవీని డిస్నీకి బిలియన్ డాలర్ల ఒప్పందంలో అమ్మేశారు. అనంతరం ఐదు సంవత్సరాలకు ఆర్ఎస్వీపీ మూవీస్ సంస్థను స్థాపించారు. అలా ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన కేదార్నాథ్, ఉరీ, ది స్కై ఈజ్ పింక్, సామ్ బహదూర్ చిత్రాలను నిర్మించారు. 2024లో స్క్రూవాలా షార్క్ ట్యాంక్ ఇండియాలో షార్క్‌లలో ఒకరిగా వెండితెర అరంగేట్రం చేశారు. రోనీ స్క్రూవాలాకు సినిమాలే ఏకైక ఆదాయ వనరు కాదు. అప్ గ్రాడ్, యూనిలాజర్, యూఎస్ స్పోర్ట్స్ వంటి పలు స్టార్టప్ లలో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా కొన్నింటిని స్థాపించారు. ఈ సంస్థల విజయం, తన సినిమా వ్యాపారం ఆయన భారీ సంపదను పోగుచేసుకోవడానికి దోహదపడ్డాయి. -
డైనోసార్ దెబ్బకు డంకీ వెనక్కి తగ్గుతాడా..
-
స్టార్ వారసుడి సినిమాపై రివ్యూ వచ్చేసింది!
మరో స్టార్ వారసుడు ఈ శుక్రవారం బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒకప్పటి టాప్ హీరో అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ ‘మీర్జ్యా’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. భారీ చిత్రాల దర్శకుడు ఓం ప్రకాశ్ మెహ్రా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో సయామీ ఖేర్ హీరోయిన్గా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నది. ‘రేయ్’ సినిమాతో ఈ సుందరి ఇప్పటికే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ‘మీర్జ్యా’ ప్రివ్యూను చూసిన బాలీవుడ్ ప్రముఖులు పలువురు ’కదిలే కవిత్వంలా’ ఈ సినిమా సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హర్షవర్ధన్ కపూర్‌కు శుభాకాంక్షలు తెలుపగా.. బిగ్ బీ అమితాబ్ ఈ సినిమా చూసి ఫిదా అయ్యారు. ఈ సినిమా గురించి బాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్లో ఇచ్చిన రివ్యూ ఇదే.. ‘మీర్జ్యా’ చూశాను. కదిలే కవిత్వం, అద్భుతమైన దృశ్యాలు, కథ చెప్పడంలో కొత్త దృక్పథం.. ఆకట్టుకుంది. - బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఊపిరి సలుపలేనంత అద్భుతంగా ఉంది. దర్శకుడు ఓం ప్రకాశ్ మెహ్రాకు జోహార్లు. అందరూ అద్భుతంగా పనిచేశారు. హర్షవర్ధన్ మరో స్టార్ కాబోతున్నాడు. - అనుపమ్ ఖేర్ సినిమా నిజంగా కదిలే కవిత్వం. మెహ్రా చిత్రకారుడైతే అతనికి హర్షవర్ధన్, సయామీ ఖేర్ కుంచెలు. కథ కన్వాసు. సినిమా ఎంతో అందంగా ఉంది. తమ్ముడు హర్షవర్ధన్ నన్ను గర్వపడేలా చేశావు. నువ్వు మరింతగా పనిచేసి.. అనిల్కపూర్లా పేరు తెచ్చుకోవాలి. సయామీ ఖేర్ కూడా అద్భుతంగా నటించింది. - అర్జున్ కపూర్, హీరో ‘మీర్జ్యా’ సౌందర్యం నన్ను కట్టిపడేసింది. ఎంతో తపనతో ఈ సినిమా తీశారు. అద్భుతమైన దృశ్యాలు, అసాధారణమైన సంగీతం. కలల తొలి సినిమా అంటే ఇలా ఉండాలి. - షబానా ఆజ్మీ తమ సహజ నటనతో హర్షవర్ధన్, సయామి ఖేర్ విస్మయ పరిచారు. - ఫర్హా ఖాన్ -
ఎమోషనల్ గా బందీనయిపోయా
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తాను నటిస్తున్న థ్రిల్లర్ మూవీ 'ఫ్యాన్' కి ఎమోషనల్ గా బౌండ్ అయిపోయాడట. ఈ సినిమా షూటింగ్ ఇంకా ఉంటే బావుండు అని బాద్ షా కు అనిపిస్తోందిట. ఫ్యాన్ సినిమాతో తన ప్రయాణం ఇంత తొందరగా ముగిసిపోతుందని ఎప్పుడూ అనుకోలేదంటూ సోషల్ మీడియాలో షారుక్ షేర్ చేశాడు. తాను మానసికంగా ఫ్యాన్ సినిమాకు బాగా బందీ అయినట్లు షారుక్ ఖాన్ పేర్కొన్నాడు. జీవితం, ప్రేమ, హాస్యం లాంటి మంచి సంగతులు తొందరగా ముగియడం విచారకరమంటూ శుక్రవారం ట్విట్ చేశాడు. కొన్ని సినిమాల్లో నటిస్తున్నపుడు షూటింగ్ లో మమేకమైపోతామని, ఇంకా షూటింగ్ ఉంటే బావుండు అనే ఫీలింగ్ కలుగుతుందన్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న ఫ్యాన్ చిత్రం కూడా అలాంటిదేనన్నాడు. కాగా మనీశ్ శర్మ దర్శకత్వంలో ఒక సూపర్ స్టార్ గా, ఆ సూపర్ స్టార్ కి సూపర్ గా షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో ప్రఖ్యాత మోడల్ వలుశ్చా డిసౌజా, మరో హీరోయిన్గా శ్రీయా పిల్గౌంకర్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫ్యాన్ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. 2016, ఏప్రిల్15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
షారూఖ్‌కు కోటిన్నర ఫాలోవర్లు
ముంబై: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ట్విటర్లోనూ తాను సూపర్‌స్టార్ అని నిరూపించుకున్నారు. ఆ సామాజిక వెబ్సైట్లో ఆయన్ను అనుసరించేవారి సంఖ్య కోటీ యాభై లక్షలకు చేరింది. దీంతో ఆయన భారత నటుల్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తర్వాతి స్థానంలో నిలిచారు. అమితాబ్‌ను ప్రస్తుతం కోటీ 67 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఈ సందర్భంగా షారూఖ్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 'నన్ను ఫాలో చేస్తున్న వాళ్లందరికీ కృతజ్ఞతలు. అది నేనేదో నేతృత్వం వహిస్తున్నందుకు కాదు. కానీ నేను దారి తప్పకుండా చూడటానికి మీరంతా ఉన్నామని భరోసా ఇచ్చినందుకు' అని షారూఖ్ ట్వీట్ చేశారు.