షారూఖ్‌కు కోటిన్నర ఫాలోవర్లు | SRK reaches 15 million followers mark on Twitter | Sakshi
Sakshi News home page

షారూఖ్‌కు కోటిన్నర ఫాలోవర్లు

Published Fri, Sep 4 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM

షారూఖ్‌కు కోటిన్నర ఫాలోవర్లు

షారూఖ్‌కు కోటిన్నర ఫాలోవర్లు

ముంబై: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ట్విటర్‌లోనూ తాను సూపర్‌స్టార్ అని నిరూపించుకున్నారు. ఆ సామాజిక వెబ్‌సైట్లో ఆయన్ను అనుసరించేవారి సంఖ్య కోటీ యాభై లక్షలకు చేరింది. దీంతో ఆయన భారత నటుల్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తర్వాతి స్థానంలో నిలిచారు. అమితాబ్‌ను ప్రస్తుతం కోటీ 67 లక్షల మంది అనుసరిస్తున్నారు.

ఈ సందర్భంగా షారూఖ్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 'నన్ను ఫాలో చేస్తున్న వాళ్లందరికీ కృతజ్ఞతలు. అది నేనేదో నేతృత్వం వహిస్తున్నందుకు కాదు. కానీ నేను దారి తప్పకుండా చూడటానికి మీరంతా ఉన్నామని భరోసా ఇచ్చినందుకు' అని షారూఖ్ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement