tricycle
-
పుట్టగొడుగుల్ని ఇంటికి తెచ్చే ట్రైసైకిల్!
తాజా పుట్టగొడుగులను నగర, పరిసర ప్రాంతాల వినియోగదారులకు వారి ఇంటి దగ్గరకే తీసుకెళ్లి అందించే లక్ష్యంతో సౌర విద్యుత్తుతో పుట్టగొడుగులను ఉత్పత్తి చేసే ట్రైసైకిల్ సాంకేతికతను బెంగళూరులోని బారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) రూపొందించింది. వేరే చోట పుట్టగొడుగులను పెంచి, తీసుకెళ్లి విక్రయించడటం వల్ల అవి తాజాదనాన్ని కోల్పోతుంటాయి. కోసిన తర్వాత వినియోగదారులకు చేరటం ఆలస్యమైతే రెండు, మూడు రోజుల్లో పుట్టగొడుగులు రంగు మారి వృథా అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించటంతో పాటు పౌష్టికాహారాన్ని ప్రజలకు తాజాగా అందించటం ద్వారా ఉపాధి పొందగోరే యువతకు ఆదాయ వనరుగా ఈ మష్రూమ్ సోలార్ ట్రైసైకిల్ సాంకేతికతను ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు రూపొందించారు. చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!పెరట్లో, మేడపైన కొద్ది ఖాళీలోనే అవుట్డోర్ సోలార్ మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్‌ను ఇంతకుముందే ఐఐహెచ్ఆర్ రూపొందించింది. ఈ యూనిట్లో పెరిగిన పుట్టుగొడుగులతో కూడిన గ్రోబాగ్స్‌ను సోలార్ ట్రైసైకిల్లోకి మార్చుకొని... వినియోగదారుల ఇళ్ల దగ్గరకు తీసుకు వెళ్లి విక్రయించడానికి ట్రైసైకిల్ ద్వారా అవకాశం కలిగిస్తోంది. తద్వారా పోషకవిలువలతో కూడిన పుట్టగొడుగులను ప్రజల దైనందిన ఆహారంలో భాగం చేసుకోగలుగుతారని ఐఐహెచ్ఆర్ ఆశిస్తోంది. చదవండి: beat the heat ఇండోర్ ప్లాంట్స్‌తో ఎండకు చెక్ఈ ట్రైసైకిల్ ఛాంబర్ 1.5“1“1 మీటర్ల సైజులో ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్‌లలో పుట్టగొడుగులు పెరిగే బ్యాగులను అమర్చుకోవచ్చు. గాలి ఆడటం కోసం, పురుగులు, ఈగలు వాలకుండా నైలాన్ 40 మెష్‌ను, గోనె సంచులను చుట్టూతా ఏర్పాటు చేశారు. కిలో/2 కిలోల పుట్టగొడుగులతో కూడిన 36 బ్యాగ్‌లు ఇందులో పెట్టుకోవచ్చు. 30 వాట్స్ డిసి మిస్టింగ్ డయాఫ్రం పంప్ నిరంతరం గోనె సంచులపై నీటి తుంపర్లను చల్లుతూ చల్లబరుస్తూ ఉంటుంది. ఇది విద్యుత్తుతో లేదా సౌర విద్యుత్తుతో నడుస్తుంది. 300 వాట్స్ ΄్యానల్, ఇన్వర్టర్, 12వి స్టోరేజ్ బ్యాటరీ, టైమర్ ఇందులో అమర్చారు. ట్రైసైకిల్కి 48వి, 750 వాట్స్ డిసి గేర్డ్ మోటార్ అమర్చారు. వోల్టేజి కంట్రోలర్, సౌర విద్యుత్తును నిల్వ చేయటానికి 24ఎహెచ్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఇతర వివరాలకు.. ఐఐహెచ్ఆర్ మష్రూమ్ లాబ్ (బెంగళూరు) – 070909 49605. -
ఇది ఈ-ట్రైక్! మూడుచక్రాల ఈ-సైకిల్.. తొక్కొచ్చు.. తోలొచ్చు!
పట్టణాలు, నగరాల్లో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. మార్కెట్లో దొరుకుతున్న ఈ–సైకిళ్లు, ఈ–మోపెడ్స్, ఈ–స్కూటర్స్‌కు భిన్నంగా కాలిఫోర్నియాకు చెందిన ‘సిక్స్త్రీజీరో’ ఇటీవల మూడుచక్రాల ఈ–సైకిల్‌ను ‘ఎవ్రీజర్నీ’ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 250 వాట్ రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఏడుస్థాయిల్లో దీని వేగాన్ని మార్చుకోవచ్చు. రోడ్డు బాగుంటే, పవర్ ఆఫ్ చేసుకుని మామూలు సైకిల్ మాదిరిగానే పెడల్స్ తొక్కుకుంటూ కూడా పోవచ్చు. ఒకసారి దీని బ్యాటరీని చార్జ్ చేసుకుంటే, 50 కిలోమీటర్ల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణించగలదు. ముందువైపు ఒక చక్రం, వెనుకవైపు రెండు చక్రాలు, వెనుక ఉన్న రెండు చక్రాల మధ్య సరుకులు పెట్టుకోవడానికి అనువైన బుట్టతో చూడటానికి ఆకర్షణీయంగా కనిపించే ఈ మూడుచక్రాల ఈ–సైకిల్ ధర 3,999 డాలర్లు (రూ.3.27 లక్షలు) మాత్రమే! -
ట్రైసైకిల్‌తో ట్రాఫిక్‌లోకి బుడ్డోడు!
-
ట్రైసైకిల్‌తో ట్రాఫిక్‌లోకి బుడ్డోడు!
బీజింగ్ : మూడేళ్ల బాలుడు తన మూడు చక్రాల సైకిల్‌తో ఆడుకుంటూ రోడ్డెక్కేశాడు. వీడియో గేమ్‌లా ఫీల్ అయ్యాడో ఏమో తెలియదుగానీ రోడ్డుపై వస్తున్న వాహనాలకు వ్యతిరేకంగా వెళ్లడం మొదలు పెట్టాడు. అసలే అది ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయం. రోడ్డు మీద ఎదురుగా వాహనాలు వస్తూనే ఉన్నాయి. అన్నీ వాహనాలు చిన్నారి పక్కనుంచే వెళ్తున్నా, బాబుని పక్కకు తీసుకెళ్దామని ఎవరు ప్రయత్నించలేదు. తూర్పు చైనాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తొలిసారి ఈ వీడియో చూసేవారికేవరికైనా ఒక్క క్షణం ఆ బాబుకి ఏమవుతుందో అనే ఆందోళన కలగక మానదు. కానీ చివరకు అటుగా వెళ్తున్న ఒక జంట తమ కారుని ఆపి బాలున్ని రోడ్డుపై నుంచి పక్కకు తీసుకొచ్చి, పోలీసులకు అప్పగించారు. తర్వాత ఆ బాలున్ని పోలీసులు అతని తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చారు. చైనాలో రోడ్డు ప్రమాదాల వల్ల 10వేలమంది చిన్నారులు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన తెలియజేస్తుంది. . -
సైకిల్ దొరికింది.. స్వాతి మురిసింది!
పాన్‌గల్ మండలం మల్లాయపల్లికి చెందిన 11ఏళ్ల స్వాతి పుట్టుకతోనే దివ్యాంగురాలు. అమ్మానాన్నలు నిరుపేద కూలీలు.. తల్లి తోడు లేనిదే బయటికి రాలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా అమ్మ చంకనెక్కాల్సిందే..! బిడ్డకు ట్రైసైకిల్ మంజూరు చేయాలని ఆమె తల్లి సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో డీఆర్వో చంద్రయ్యకు విన్నవించింది. ఆయన ఆదేశాల మేరకు డీడబ్ల్యూఓ వరప్రసాద్ ఆమెకు అరగంటలోనే ట్రై సైకిల్‌ను సమకూర్చారు. జేసీ నిరంజన్, డీఆర్వో చంద్రయ్య తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా స్వాతికి మోములో చిరునవ్వు వెల్లివిరిసింది. – ఎం.యాదిరెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, వనపర్తి -
వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన జగన్
-
స్నేహమంటే ఇదేరా..!
దివ్యాంగుడికి ట్రైసైకిల్ ఇప్పించిన స్నేహితులు విజయనగరం కంటోన్మెంట్: ఆపదలో ఆదుకునే నిజమైన స్నేహితుడు అన్న నానుడిని అక్షరాలా నిజం చేశారు ఓ దివ్యాంగుని స్నేహితులు. ఆ దివ్యాంగుడికి ట్రైసైకిల్ ఇచ్చేందుకు అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో వారంతా చలించి దివ్యాంగుడైన స్నేహితుడితో కలిసి కలెక్టరేట్‌కు వచ్చి ట్రైసైకిల్ సాధించి మిత్రుడి కళ్లలో ఆనందం చూసి సంతోషంగా ఇళ్లకు వెళ్లారు. వివరాలిలా ఉన్నారుు. డెంకాడ మండలం గొడ్డుపల్లి గ్రామానికి చెందిన ఎర్రా రమేష్ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. రోజూ స్కూల్‌కు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇతను ట్రైసైకిల్ కోసం ఎన్నిమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోరుుంది. దీంతో అతని స్నేహితులు నేరుగా కలెక్టర్‌ను కలిసేందుకు సోమవారం నిర్వహించిన గ్రీవెన్‌ససెల్‌కు తీసుకువచ్చారు. కలెక్టర్ వివేక్ యాదవ్‌ను కలిసి సమస్యను వివరించారు. దీంతో స్పందించిన కలెక్టర్ వెంటనే మూడు చక్రాల సైకిల్‌ను మంజూరు చేశారు. ఈ మేరకు రమేష్‌ను విభిన్న ప్రతిభావంతుల శాఖ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ సైకిల్ ఇవ్వడంతో స్నేహితులంతా అమితానందంగా ఇంటికెళ్లారు.