wheat crop
-
2025 ఆర్థిక సంవత్సరంలో గోధుమల దిగుమతి ఎంతంటే..
ఆహార ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు భారత ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్1, 2024 నుంచి మార్కి 31, 2025)లో మూడు మిలియన్ టన్నుల (ఎంటీ) గోధుమలను బహిరంగ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంది. ఆహార ధాన్యాల నిల్వల నిర్వహణ, మార్కెట్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ వ్యూహంలో భాగంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఈ చర్యలను అమలు చేసినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇటీవల కాలం వరకు మిగులు గోధుమ నిల్వలను బహిరంగ మార్కెట్లో విక్రయించారు. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (ఓఎంఎస్ఎస్) కింద 2024 ఆర్థిక సంవత్సరంలో బల్క్ కొనుగోలుదారులకు రికార్డు స్థాయిలో 10 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించడం విశేషం.లభ్యత తగ్గుదల2023-24 పంట సంవత్సరానికి భారతదేశ గోధుమ ఉత్పత్తి 113.29 మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. ఇది బలమైన సరఫరాను నిర్ధారిస్తుంది. అయితే మిగులు నిల్వలను మార్కెట్ డిమాండ్లతో సమతుల్యం చేసేందుకు ప్రభుత్వం గతంలో సవాళ్లు ఎదుర్కొంది. కానీ ఇటీవల దేశీయ గోధుమల లభ్యత తగ్గిపోవడంతో దిగుమతులపై ఆధారపడుతుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో మూడు మూడు మెట్రిక్ టన్నుల గోధుమలను దిగుమతి చేసుకోవడం ద్వారా తక్కువ కాలంలో ధాన్యం లభ్యతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.వేలంలో తగ్గిన ధరలుబల్క్ కొనుగోలుదారులు, ప్రాసెసర్లకు ధాన్యాన్ని విక్రయించడానికి ఇటీవల నిర్వహించిన వీక్లీ ఆక్షన్‌లో ఎఫ్‌సీఐ 0.49 మెట్రిక్ టన్నుల గోధుమలను విక్రయించింది. అంతకుముందు వారంకంటే క్వింటాలుకు కనీసం రూ.200 తక్కువకు అమ్ముడయ్యాయని వాణిజ్య వర్గాలు తెలిపాయి. కొత్త మార్కెటింగ్ సీజన్ (2025-26) కోసం మధ్యప్రదేశ్‌లో మార్చి 15న సేకరణ కార్యకలాపాలు ప్రారంభంకానున్నందున వీక్లీ ఇ-ఆక్షన్ కొనసాగే అవకాశం లేదని వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ అధికారికంగా ఎఫ్‌సీఐ, రాష్ట్ర ఏజెన్సీలు పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాల్లో ఏప్రిల్ 1 నుంచి రైతుల ద్వారా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు గోధుమలను కొనుగోలు చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోని మండీలకు తాజా పంట రావడం ప్రారంభమైందని, ఇది సరఫరాను పెంచుతుందని తెలిపాయి.బఫర్ కంటే అధికంగానే నిల్వలుగతేడాది ఏప్రిల్ 1న ఎఫ్‌సీఐ వద్ద 7.46 మెట్రిక్ టన్నుల గోధుమలు నిల్వ ఉండగా, ఈసారి 13.55 మెట్రిక్ టన్నుల వరకు నిల్వలు ఉన్నాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం గోధుమ నిల్వలు ఈ ఏడాది ఏప్రిల్ 1న 10-11 మెట్రిక్ టన్నుల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది బఫర్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. 2024-25 సీజన్లో కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2425 కంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో క్వింటాలుకు రూ.125 బోనస్ ప్రకటించించారు. దాంతో రాబోయే రెండు వారాల్లో పంట రాబడి పుంజుకున్న తర్వాత మండీ ధరలు క్వింటాలుకు రూ.2600 వరకు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.ఈసారి సేకరణ ఇలా..2025-26 రబీ మార్కెటింగ్ సీజన్ (ఏప్రిల్-జూన్)లో ఏజెన్సీల ద్వారా గోధుమల సేకరణ 31 మెట్రిక్ టన్నులుగా ఉంటుందని ఆహార మంత్రిత్వ శాఖ గత వారం అంచనా వేసింది. ఇది 2024-25 మార్కెటింగ్ సీజన్లో వాస్తవ కొనుగోలు 26.6 మెట్రిక్ టన్నులతో పోలిస్తే 26 శాతం అధికంగా ఉంది. 2021-22 సీజన్లో రికార్డు స్థాయిలో 43.3 మెట్రిక్ టన్నుల సేకరణను సాధించిన తరువాత ఎంఎస్పీ, తక్కువ ఉత్పత్తి కారణంగా 2022-23 సీజన్లో రికార్డు స్థాయిలో 18.8 మెట్రిక్ టన్నులకు పడిపోయాయి. అయితే 2023-24 సీజన్లో ఇది 40 శాతం పెరిగి 26.2 మెట్రిక్ టన్నులకు చేరుకుంది.ఇదీ చదవండి: 61 ఏళ్ల వయసులో నీతా అంబానీ ఫిటెనెస్ సీక్రెట్ ఇదే..2023-24 పంట సంవత్సరంలో గోధుమ ఉత్పత్తి 113.29 మెట్రిక్ టన్నులుగా అంచనా వేసినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాసెసింగ్ పరిశ్రమ అంచనాల ప్రకారం ప్రస్తుత పంట సంవత్సరంలో (2024-25) గోధుమ ఉత్పత్తి 110 మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరానికి (2024-25) ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2,275 ఉంది. -
గోధుమలు, బియ్యం, చక్కెర ఎగుమతులపై మంత్రి కీలక వ్యాఖ్యలు
దేశంలో పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో గోధుమలు, భాస్మతియేతర బియ్యం, చక్కెర ఎగుమతులను నిషేధించింది. ఈ మేరకు గతంలోనే నోటిఫికేషన్ జారీచేసింది. అయితే, అప్పటికే గోధుమల ఎగుమతి కోసం జారీ చేసిన లెటర్స్ ఆఫ్ క్రెడిట్‌ను అనుసరిస్తామని ప్రభుత్వం చెప్పింది. కొవిడ్, వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ యుద్ధం వల్ల తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్న కొన్ని దేశాలకు గోధుమలను ఎగుమతి చేస్తామని గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని కేంద్ర ప్రకటించిన సంగతి తెలిసిందే. గోధుమలు, బియ్యం, చక్కెరపై ఎగుమతి ఆంక్షలు ఎత్తివేసే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తాజాగా వెల్లడించారు. గోధుమలు, చక్కెరను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం గానీ, అలాంటి ప్రణాళిక కూడా తమ వద్ద లేదని పేర్కొన్నారు. ఇదీ చదవండి: కోట్ల రూపాయలు కావాలా..? స్థలం ఎక్కడ కొనాలంటే.. 2022 మే నుంచి భారత్ గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 2023 జులై నుంచి బాస్మతియేతర బియ్యం, 2023 అక్టోబరు నుంచి చక్కెర ఎగుమతులపైనా నియంత్రణలు విధించింది. ఆహార భద్రతా అవసరాలు ఉన్న ఇండోనేషియా, సెనెగల్, గాంబియా తదితర మిత్ర దేశాలకు మాత్రం భారత్ బియ్యం పంపిస్తోందని మంత్రి చెప్పారు. -
షాకింగ్ ఘటన: రాత్రికి రాత్రే రోడ్డుని మాయం చేసిన దొంగలు
దొంగలు డబ్బులు, నగలు దొంగతనం చేస్తారని విన్నాం. అంతేందుకు స్ట్రీట్ లైట్లు, మొక్కలను కూడా ఎత్తుకుపోవడం గురించి కూడా విని ఉంటాం. కానీ ఏకంగా రెండు కిలోమీటర్ల రహదారిని దొంగలించడం గురించి విన్నారా!. అదీ కూడా రెండు గ్రామాలను కలిపే రహదారిని రాత్రికి రాత్రే మాయం చేశారు. ఈ షాకింగ్ ఘటన బిహార్‌లోని బంకా జిల్లా, రాజౌన్ ప్రాంతంలోని ఖరౌనీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....ఐదు రోజులు క్రితం వరకు ప్రజలు ఏళ్ల తరబడి వినయోగించినా.. ఖాదంపూర్, ఖరౌనీ అనే రెండు గ్రామాలను కలిపే రహదారిని ఉపయోగించారు. ఒక రోజు ఉదయం ప్రజలు అటుగా వెళ్తున్నప్పుడూ...రోడ్డు మొత్తం మాయమై దాని స్థానంలో పంటలు వేసి ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గరయ్యారు గ్రామస్తులు. మొదట్లో వారు దారి తప్పాం అనుకున్నారు. ఆ తర్వాత గానీ వారికి అసలు విషయం అర్థం కాలేదు. ఖైరానీ గ్రామానికి చెందిన గూండాలు, రాత్రికి రాత్రే ట్రాక్టర్‌తో రహదారిని దున్ని గోధుమ పంటలను విత్తారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వ్యరేకించడంతో.. గుండాలు కొట్లాటకు దిగి కర్రలు, రాడ్లతో ప్రజలను బెదిరించారు. దీంతో ఖాదంపూర్ గ్రామానికి చెందిన దాదాపు 35 మంది ప్రజలు సర్కిల్ పోలీస్ అధికారి మహ్మద్ మెయినుద్దీన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి ఆక్రమణకు పాల్పడినట్లు తేలితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు పోలీసు అధికారి హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయానికి వినియోగిస్తున్న ఆక్రమిత భూమిని తొలగించి తిరిగి రోడ్డు వేస్తామని కూడా చెప్పారు. (చదవండి: ఆప్ ఎన్నికల అభ్యర్ధి తుపాకీతో డ్యాన్సులు.. వీడియో వైరల్) -
FCI data: ఐదేళ్ల కనిష్టానికి ఆహార ధాన్యాల నిల్వలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆహార ధాన్యం నిల్వలు ఏడాదిలో భారీగా తగ్గాయి. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సెంట్రల్ ఫూల్ కింద సేకరించి పెట్టిన గోధుమ, బియ్యం నిల్వలు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయినట్లు అక్టోబర్ గణాంకాలు చెబుతున్నాయి. ఐదేళ్ల క్రితం 2017లో బియ్యం, గోధుమల మొత్తం నిల్వలు 4.33 కోట్ల మెట్రిక్ టన్నుల కనిష్టానికి పడిపోగా, ప్రస్తుతం అదేరీతిన నిల్వలు 5.11 కోట్ల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. గత ఏడాది నిల్వలు 8.16 కోట్లతో పోల్చినా 37 శాతం నిల్వలు తగ్గడం, ఇందులో ముఖ్యంగా గోధుమల నిల్వలు ఏకంగా 14 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం కేంద్రానికి ఆందోళన కలిగిస్తోంది. ఉచితంతో బియ్యం.. దిగుబడి తగ్గి గోధుమలకు దెబ్బ.. దేశంలో కరోనా నేపథ్యంలో కేంద్రం 2020 ఏప్రిల్ నుంచి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద 81 కోట్ల జనాభాకు ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఇప్పటికే ఆరు విడతలుగా అమలు చేసిన బియ్యం పథకం కింద 11.21 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసింది. ప్రస్తుత అక్టోబర్ నుంచి మరో మూడు నెలలు ఉచిత బియ్యం పథకాన్ని కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం చేసింది. ఈ మూడు నెలల కాలానికి మరో 1.22 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరాలు ఉంటాయని అంచనా వేసింది. ఉచిత బియ్యం పథకం నేపథ్యంలో ఎన్నడూ లేనంతగా బియ్యం నిల్వలు కేంద్రం వద్ద తగ్గాయి. గత ఏడాది కేంద్రం వద్ద అక్టోబర్‌లో 3.47 కోట్ల బియ్యం నిల్వలు ఉండగా, అది ఈ ఏడాది 2.83 కోట్లకు పడిపోయింది. అయితే బియ్యం నిల్వలు తగ్గినంత మాత్రాన ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏం లేదని, కేంద్ర పథకాల కొనసాగింపునకు ఇదేమీ అడ్డుకాదని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే ఖరీఫ్ పంటల కోతలు ఆరంభం అయినందున వీటితో మళ్లీ నిల్వలు పెంచుకునే అవకాశం ఉందని అంటోంది. అయితే గోధుమల పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉంది. గోధుమల నిల్వలు గతంతో పోల్చితే తీవ్రంగా తగ్గాయి. 2017లో గోధుమల నిల్వలు 2.58 కోట్ల టన్నులు, 2018లో 3.56 కోట్లు, 2019లో 3.93 కోట్లు, 2020లో 4.37 కోట్లు, 2021లో 4.68 కోట్ల టన్నుల మేర నిల్వలు ఉండగా, అవి ఈ ఏడాది ఏకంగా 2.27 కోట్ల టన్నులకు తగ్గాయి. కరోనా పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా కరువు పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇతర దేశాలకు భారత్ నుంచి ఎగుమతులు పెరిగాయి. ఎగుమతులు పెరగ్గా, దేశంలో అతివృష్టి కారణంగా పంటలు దారుణంగా దెబ్బ తినడంతో దిగుబడులు తగ్గాయి. దీంతో కేంద్రం వద్ద నిల్వలు తగ్గాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ ఏడాది మే నెలలో గోధుమల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. అయినప్పటికీ మే నుంచి అధిక ఉష్ణోగ్రతల కారణంగా గోధుమ పంట దిగుమతులు తగ్గాయి. దీంతో అనుకున్న స్థాయిలో కేంద్రం నిల్వలు సేకరించలేకపోయింది. డిమాండ్‌ను గుర్తించి వ్యాపారులు ముందస్తు నిల్వలు చేశారు. ఈ ప్రభావం స్టాక్‌లపై పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపారుల గోధుమ నిల్వలను బహిర్గతం చేయాలని ఆదేశాలివ్వడం, దేశీయ లభ్యతను పెంచడానికి స్టాక్ పరిమితులను విధించడం వంటి చర్యలను కేంద్రం పరిగణించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
నాసా అంతరిక్ష గోధుమ పంట స్ఫూర్తితో..
మెల్బోర్న్: అంతరిక్షంలో గోధుమలు పండించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ చేపట్టిన ప్రయత్నాన్ని ఆదర్శంగా తీసుకుని ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు నూతన పద్ధతిని అభివృద్ధి చేశారు. ‘స్పీడ్ బ్రీడింగ్’ అనే ఈ పద్ధతి ద్వారా భూమిపై పంట దిగుబడిని సాధారణం కంటే మూడు రెట్లు పెంచడంతోపాటు పంట కోతకు వచ్చే సమయాన్ని కూడా 6 రెట్లు తగ్గించవచ్చని ప్రయోగ పూర్వకంగా నిరూపించారు. నాసా అంతరిక్షంలో గోధుమ పంట త్వరగా కోతకు వచ్చేందుకు పంటపై లైట్ ద్వారా నిరంతరాయంగా వెలుగును ప్రసరింపజేసింది. దీంతో పంట సాధారణం కంటే ముందుగానే కోతకు రావడంతోపాటు మరో పంటను వేసేందుకు వీలు కలుగుతుంది. ఈ పద్ధతిని స్ఫూర్తిగా తీసుకుని భూమిపై ప్రత్యేకంగా రూపొందించిన గ్లాస్ హౌస్‌ల్లో గోధుమ, బార్లీ, ఆవాలు, శెనగ వంటి పంటలపై నిరంతరాయంగా వెలుగును ప్రసరింపజేశామని క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీకి చెందిన సీనియర్ రీసెర్చ్ ఫెలో లీ హిక్కీ తెలిపారు. చాలా ఆశ్చర్యకరంగా ఈ పద్ధతిలో ఏడాదిలో ఆరు సార్లు గోధుమ, శెనగ, బార్లీ, నాలుగు సార్లు ఆవాల పంటలను ఉత్పత్తి చేశామని లీ అన్నారు. ఇదే సాధారణ గ్లాస్ హౌస్‌ల్లో అయితే రెండు సార్లు, పొలాల్లో అయితే ఏడాదికి ఒకసారి మాత్రమే పంట ఉత్పత్తి జరిగేదని వెల్లడించారు. -
లంచాలకు విసిగి...విసిగి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మురదాబాద్ జిల్లా అహ్లాద్‌పూర్ గ్రామానికి చెందిన అమీర్ హుస్సేన్ అనే 54 ఏళ్ల రైతు లంచాల కోసం చేతులు చాస్తున్న అధికారులను చూసి చూసి విసిగిపోయాడు. ఆ విసుగు నుంచి వచ్చిన కోపంతో బుధవారం రాత్రి తన పొలంలో గోధమ పంటను తగులబెట్టుకున్నాడు. అమీర్ తన పొలంలో గోధమ పంట వేశాడు. అది ఏపుగా పెరిగి కోతకొచ్చిన సమయంలో అకాల వర్షాలు పడి 70 శాతం పంట నాశనమైంది. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని ఎంతో మంది రైతులు నష్టపోయారు. రైతులను ఆదుకుంటామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు 500 కోట్ల రూపాయలను కూడా కేటాయించింది. ఈ విషయం తెలిసి నష్ట పరిహారం కోసం అమీర్ హుస్సేన్ కూడా జిల్లా యంత్రాంగానికి పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎవరూ పట్టించుకోలేదు. పంట నష్టాన్ని అంచనా వేయడం కోసం ప్రతి సీనియర్ అధికారి వద్దకు వెళ్లారు. వారు అందుకోసం తమ కింది అధికారులను పురమాయించారు. పొలం వద్దకు వచ్చిన ప్రతి అధికారి లంచం ఇస్తేగానీ పంట నష్టాన్ని అంచనా వేయమని చేయిచాచి మరీ చెప్పారట. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లినా వారూ పట్టించుకోలేదట. అధికారుల చుట్టూ తిరిగి..తిరిగి కాళ్లు అరిగాయే తప్ప, పని కాకపోవడంతో విసిగేసి మిగిలిన గోధుమ పంటను తగులబెట్టానని అతన్ని పొలాన్ని సందర్శించిన మీడియా ప్రతినిధులకు ఆయన వివరించాడు. ‘నా లాంటి రైతులను ఆదుకోవడానికి కాకపోతే 500 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది?’ అన్న ఆ రైతు ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే మీడియా ప్రతినిధులు వెనుదిరిగారు.