Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Govt current scam with Axis Energy Venture India Private Limited1
‘యాక్సిస్‌’తో అడ్డగోలు ఒప్పందం.. ప్రజలకు పాతికేళ్ల 'షాక్‌'

సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్తు అవసరాలకు దాదాపు 30 ఏళ్ల పాటు ఢోకా లేకుండా రైతులకు పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో ఏడువేల మెగావాట్ల విద్యుత్తు ఒప్పందాన్ని కారుచౌకగా యూనిట్‌ రూ.2.49కే అందించేలా కుదుర్చుకోవడం ద్వారా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.లక్ష కోట్లకుపైగా ఆదా చేశారు. దీన్ని అభినం­దిం­చాల్సింది పోయి.. కుంభకోణంగా వర్ణించిన కూటమి సర్కారు ఇప్పుడు యూనిట్‌ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధమైంది. తద్వారా దేశ విద్యుత్తు రంగ చరిత్రలోనే కనీవిని ఎరుగని స్కామ్‌కు తెర తీసింది! ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలిని సెక్షన్‌ 108 పేరుతో బెదిరించి మరీ ఈ ఒప్పందానికి ఆమోద ముద్ర వేయించుకోవడం, ఇలా బరి తెగించి భారీ ధరకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం ఎన్నడూ చూడలేదని విద్యుత్తు రంగ నిపుణులు, అధికారులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు ఒప్పందాల్లో దీన్ని అతిపెద్ద స్కామ్‌గా అభివర్ణిస్తున్నారు. గత ప్రభుత్వం అత్యంత చౌకగా, ఐఎస్‌టీఎస్‌ చార్జీలు లేకుండా కేంద్ర సంస్థ సెకీ నుంచి సోలార్‌ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుంటే బురద జల్లి దేశమంతా రాద్దాంతం చేసిన కూటమి సర్కారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందం సహేతుకమేనని ఇప్పటికే విద్యుత్తు నియంత్రణ మండలి నిర్థారించిందని, తద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనం ఆదా అయిందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్తు ఒప్పందాల్లో నిజానిజాలను ఒకసారి పరిశీలిద్దాం.. ఏడాదిగా హామీల అమలు ఊసు లేకుండా.. టీడీపీ కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి కావస్తోంది. ఈ తరుణంలో కనీసం ఇప్పుడైనా ఓ అమ్మ ఒడి, అన్నదాతా సుఖీభవ గురించో.. సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేస్తారని రాష్ట్ర ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తుంటే మరో పిడుగు పడింది! ఇప్పటికే రూ.15 వేల కోట్లకుపైగా బిల్లుల బాదుడుతో చుక్కలు చూపిస్తుండగా ఈసారి అడ్డగోలు విద్యుత్తు ఒప్పందాలతో బాదేశారు! 25 ఏళ్ల పాటు ప్రజలను పీల్చి పిప్పి చేసే ఖరీదైన విద్యుత్తు ఒప్పందానికి పచ్చ జెండా ఊపారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా గతంలో ఏపీఈఆర్సీ తిరస్కరించిన ఈ అడ్డగోలు ఒప్పందాన్ని మెడపై కత్తి పెట్టి ఆమోదించుకోవడం ద్వారా సర్కారు లాలూచీ వ్యవహారాలు మరోసారి నిరూపితమయ్యాయని, ఇదో పెద్ద కుంభకోణమని విద్యుత్తు రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సోలార్, రాత్రి పూట అంతా పవన విద్యుత్తు అందుబాటులో ఉంటుందని.. ఎప్పుడో కొద్ది రోజులు డిమాండ్‌ ఉంటుందంటూ ఆ పేరుతో యూనిట్‌ రూ.4.60 చొప్పున పాతికేళ్ల పాటు చెల్లించేందుకు సిద్ధం కావటాన్ని తప్పుబడుతున్నారు. పీక్‌ అవర్స్‌లో డిమాండ్‌ 3 – 4 గంటలు మాత్రమే ఉంటుందని.. అలాంటప్పుడు అన్ని గంటలకూ ఒకే ధర చెల్లించడం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆలస్యం ఉచిత ఇసుక పేరుతో పచ్చముఠాల దోపిడీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. వర్షాకాల అవసరాల కోసం గత ప్రభుత్వం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇక నూతన మద్యం విధానం పేరుతో టీడీపీ నేతలు సిండికేట్‌గా మారి పోలీసుల అండతో దౌర్జన్యంగా షాపులు దక్కించుకున్నారు. ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండతో గనుల యజమానులను బెదిరిస్తూ కప్పం వసూలు చేస్తున్నారు. ఇక రాజధాని అమరావతి పనుల్లో టెండర్లలో ముఖ్యనేతలు అంచనాలను ఎడాపెడా పెంచేశారు. ఐకానిక్‌ టవర్లు పేరుతో అవినీతికి గేట్లు తెరిచారు. అంచనాలు పెంచేసి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్సుల ముసుగులో పనుల విలువలో పది శాతం చెల్లించి తిరిగి 8 శాతం కమీషన్ల రూపంలో వసూలు చేసుకుంటున్నారు. విశాఖలో లూలూకు భూ పందేరంతోపాటు రూ.3,000 కోట్ల అత్యంత ఖరీదైన భూమిని ఊరూ పేరు లేని అనామక సంస్థ ఉర్సాకు ఎకరం 99 పైసలకే కేటాయిస్తూ క్యాబినెట్‌లో ఆమోద ముద్ర వేయించారు. గత 11 నెలలుగా ఇలా విచ్చలవిడి అవినీతి వ్యవహారాలతో చంద్రబాబు సర్కారు ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘మేం వస్తే విద్యుత్తు చార్జీలను పెంచం.. ఇంకా తగ్గిస్తాం..! గత ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని నాశనం చేసింది. ఐదేళ్లలో రూ.1.29 లక్షల కోట్లకుపైగా నష్టం జరిగింది..’’ అంటూ ఎన్నికల ముందు, ఆ తరువాత శ్వేతపత్రంలో విమర్శలు చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. పాతికేళ్ల పిడుగు.. యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) శనివారం ఆమోదించింది. యాక్సిస్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వెంచర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పవన–సౌర హైబ్రీడ్‌) 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులను స్థాపించి వాటి నుంచి ఏపీఎస్పీడీసీఎల్‌ పాతికేళ్ల పాటు యూనిట్‌ కు రూ.4.60 చొప్పున చెల్లించి కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. 25 ఏళ్ల పాటు ఈ ధర తగ్గించటానికి వీల్లేకుండా ఒప్పందంలో ‘సీలింగ్‌’ షరతు విధించడం గమనార్హం. అంటే భవిష్యత్తులో పవన, సౌర విద్యుత్తు రేట్లు తగ్గినా ఒప్పందంలో చెప్పిన ధర తగ్గించకుండా మెలిక పెట్టారు. ఒకపక్క మార్కెట్‌లో సగానికిపైగా తక్కువ ధరకు దొరుకున్నప్పటికీ రెట్టింపు ధర ఇచ్చి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడంపై అంతా విస్తుపోతున్నారు. ఎక్కువ ధరకు ఎందుకు కొనాలి? డిస్కమ్‌ల పిటిషన్‌పై కర్నూలులో ఇటీవల జరిగిన బహిరంగ విచారణలో నేరుగా, ఆన్‌లైన్‌ ద్వారా వివిధ వర్గాల ప్రజలు, పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని యాక్సిస్‌తో ఒప్పందాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయడం వల్ల అంతిమంగా ఆ భారం ప్రజలపైనే ట్రూఅప్‌ చార్జీల రూపంలో వేస్తున్నారని.. ఇప్పటికే రూ.15,485 కోట్లు భారం మోపి వసూలు చేస్తున్నారని ఈ విచారణలో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా మార్కెట్‌లో ఇప్పుడు పునరుత్పాదక విద్యుత్‌ తక్కువ ధరకే లభిస్తున్నందున యాక్సిస్‌ నుంచి అంత రేటు పెట్టి విద్యుత్‌ కొనాల్సిన అవసరం లేదంటూ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ వారి వాదనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తాననుకున్నదే చేసింది. యాక్సిస్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలుకు అనుమతిస్తూ ఏపీఈఆర్సీ జారీ చేసిన ఆదేశాలు మంచి చేస్తే అభినందించాల్సింది పోయి..గాడి తప్పిన విద్యుత్‌ రంగాన్ని అభివృద్ధి పథం పట్టించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టింది. వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు రాయితీతో విద్యుత్‌ అందించింది. డిస్కంలకు 2019–24 మధ్య ఏకంగా రూ.47,800.92 కోట్లను అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే చెల్లించడం గమనార్హం. రైతులకు ఉచిత విద్యుత్‌ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగవేసింది. వాటిని కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. 2019–2023 మధ్య గత ప్రభుత్వం రెండు లక్షలకు పైగా అగ్రికల్చరల్‌ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేసింది. ఇప్పుడేమంటావు కరపత్రమా ? కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అతి తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే ఈనాడు అడ్డగోలుగా రాసిన అసత్య కథనాలు గతంలో చంద్రబాబు పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో 6,663 ఫీడర్లను 9 గంటలు వ్యవసాయానికి పగటి పూట విద్యుత్‌ సరఫరా చేసేలా రూ.1,700 కోట్లతో వాటి సామరŠాధ్యన్ని వైఎస్‌ జగన్‌ పెంచారు. విద్యుత్‌ రంగానికి ఆయన ఇంత మంచి చేస్తే.. సెకీ విద్యుత్‌ ఒప్పందంలో లంచాలు తీసుకున్నారని, ధర ఎక్కువని, ఐఎస్‌టీఎస్‌ చార్జీలు కట్టాల్సి వస్తుందంటూ కూటమి నేతలు, కరపత్రికలు తప్పుడు ఆరోపణలు చేశాయి. అదే కూటమి సర్కారు ఇప్పుడు యాక్సిస్‌తో అధిక ధరకు ఒప్పందం చేసుకుని అసలు సిసలైన అవినీతికి గేట్లు తెరిచింది. నేడు సెక్షన్‌ 108తో మండలిని బెదిరించి.. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా గతంలో ఏపీఈఆర్సీ తిరస్కరించిన ఈ అడ్డగోలు ఒప్పందాన్ని మెడపై కత్తి పెట్టి కూటమి ప్రభుత్వం ఆమోదించేలా చేసింది. విద్యుత్‌ చట్టం 2003 సెక్షన్‌ 108 ప్రకారం యాక్సిస్‌తో పీపీఏలను అంగీకరించాలంటూ గతేడాది సెప్టెంబర్‌ 24న ప్రభుత్వం లేఖ రాసిందని ఏపీఈఆర్సీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంటే దీన్ని తిరస్కరించడానికి వీల్లేదని, ఒకవేళ ఏపీఈఆర్సీ తిరస్కరిస్తే ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ఒప్పందంపై ముందుకు వెళుతుందని పరోక్షంగా బెదిరించినట్లు తేటతెల్లమవుతోంది. 400 మెగావాట్ల విద్యుత్తు కోసం ఈ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ బెదిరించాల్సిన అవసరం చంద్రబాబు సర్కారుకు ఎందుకు వచ్చింది? ఈ ఒప్పందం వెనుక కేవలం కుంభకోణం మినహా రాష్ట్ర ప్రజల ప్రయోజనం ఎక్కడుందని విద్యుత్తు రంగ నిపుణులు నిలదీస్తున్నారు. సెక్షన్‌ 108 ప్రకారం.. యాక్సిస్‌ పీపీఏలను ఆమోదించాలంటూ ప్రభుత్వం చెప్పిందని ఏపీఈఆర్సీ ఆదేశాల్లో పేర్కొన్న భాగం నాడు స్వయంగా ప్రతిపాదించిన ‘సెకీ’ రైతులకు పగటి పూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేసేందుకు సెకీ నుంచి 17 వేల మిలియన్‌ యూనిట్ల (7 వేల మెగావాట్లు) సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం గత ప్రభుత్వంలో జరిగింది. అది కూడా అత్యంత చౌక ధరతో.. యూనిట్‌ కేవలం రూ.2.49కే అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. 2022–23లో యూనిట్‌ రూ.5.13గా ఉన్న సగటు విద్యుత్‌ సేకరణ ఖర్చుతో పోల్చితే ఇది రూ.2.64 తక్కువ. అదీగాక ఏపీకి సౌర విద్యుత్‌ను అతి తక్కువ ధరకే సరఫరా చేస్తామన్న ప్రతిపాదన స్వయంగా సెకీ నుంచే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా యూనిట్‌ ధర రూ.2.80కి పెరిగినప్పటికీ మనకు మాత్రం ఒప్పందం మేరకు యూనిట్‌ రూ.2.49కే ఇచ్చేందుకు నాడు సెకీ అంగీకరించింది. అంతేకాకుండా ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ (ఐఎస్‌టీఎస్‌) చార్జీల నుంచి పూర్తి మినహాయింపు కల్పించారు. ఇదే విషయం కేంద్ర విద్యుత్‌ శాఖ, సెకీ లేఖ, ఒప్పందంలోనూ స్పష్టంగా ఉంది. ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను అభినందించాల్సిందిపోయి చంద్రబాబు, టీడీపీ అనుబంధ కరపత్రికలు బురద చల్లేందుకు యత్నించారు. అయితే సెకీతో ఒప్పందం సక్రమమేనని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) తేల్చి చెప్పడంతో ఈ కుట్రలన్నీ పటాపంచలయ్యాయి. ఇప్పుడు పవన, సౌర హైబ్రీడ్‌ విద్యుత్‌ మార్కెట్‌లో యూనిట్‌ రూ.2.90కి అంతకన్నా తక్కువకే దొరుకుతోంది. అలాంటప్పుడు ఓ ప్రైవేట్‌ డెవలపర్‌ నుంచి యూనిట్‌ రూ.4.60 చెల్లించి కొనాల్సిన అవసరం ఏమిటో, దాని వెనుక అసలు కారణాలేమిటో చెప్పే ధైర్యం చంద్రబాబు సర్కారుకు, ఈ కుంభకోణాలపై నిలదీసే ధైర్యం ఎల్లో మీడియాకు ఉందా?

Waqf Act Petitions: petitioners response to govt Arguments in SC Updates2
వక్ఫ్‌ చట్టం చట్టబద్ధతపై కాసేపట్లో ‘సుప్రీం’ విచారణ

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్‌ చట్టం(Waqf Amendment Act) రాజ్యాంగ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లు ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు మరోసారి రానున్నాయి. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పిటిషన్లపై విచారణ జరపనుంది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఇవాళ వాదనలు వినిపించే అవకాశం ఉంది.వక్ఫ్‌ (సవరణ) చట్టం2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖయ్యాయి. ఇప్పటికే పలుసార్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) కేంద్రం విజ్ఞప్తి మేరకు నేటి వరకు గడువు ఇచ్చింది. గత విచారణ సమయంలో చట్టంలోని రెండు వివాదాస్పద నిబంధనలను తాత్కాలికంగా కేంద్రం నిలిపివేసింది. మే 5వ తేదీ వరకు వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపింది. గత వాదనల్లో.. వక్ఫ్‌ కౌన్సిల్, బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించొద్దని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. గత విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. అన్నిరకాలుగా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే చట్టాన్ని రూపొందించినట్లు పేర్కొంది. ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి వాదనలు వినకపోవడం సముచితం కాదని పేర్కొన్నారు. మరోవైపు.. వక్ఫ్‌గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్‌ జాబితా నుంచి తొలగించొద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్‌ బోర్డులు, కేంద్ర వక్ఫ్‌ మండలిలో ఎక్స్‌అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే అయ్యుండాలనీ చెప్పింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్‌ అఫీషియో సభ్యులను నియమించొచ్చని.. ఈ మేరకు వక్ఫ్‌(సవరణ) చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదించింది.

Trump slaps 100% tariff on foreign films3
దయలేని ట్రంప్‌.. ఈసారి సినిమాపై సుంకం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలపై సుంకాలు విధించారు. అమెరికా గడ్డపై షూటింగ్‌ జరగని సినిమాలపై ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారాయన.కొందరు నిర్మాతల తీరుతో హాలీవుడ్ తీవ్రంగా నష్టపోతోందన్న ట్రంప్‌.. విదేశాల్లో చిత్రీకరణ జరిగి.. అమెరికాలో రిలీజ్‌ అయ్యే చిత్రాలపై వెంటనే 100 శాతం సుంకాలను విధించాలని యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌(USTR)కు ఆదేశాలు జారీ చేశారాయన. అమెరికా చలన చిత్ర పరిశ్రమను పునరుద్ధించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన.చాలా దేశాలు అమెరికన్ స్టూడియోలు, చిత్రనిర్మాతలను ఆకర్షించడానికి లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఇది అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పు కలిగించడమేనని అన్నారాయన. అమెరికన్ సినిమా ఇండస్ట్రీ చాలా వేగంగా మరణిస్తోందన్న ట్రంప్‌.. మళ్లీ అమెరికా గడ్డపై సినిమాలు చిత్రీకరణ జరగాల్సిన రోజులు రావాలని ఆశిస్తున్నట్లు ట్రూత్‌ సోషల్‌ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద చిత్ర మార్కెట్‌ ఉంది చైనాకే. అలాంటి దేశం కిందటి నెలలో ‘టారిఫ్‌ వార్‌’లో భాగంగా హాలీవుడ​ చిత్రాల విడుదలపై పరిమితి విధించింది. ఈ క్రమంలో ఇప్పుడు ట్రంప్‌ విదేశాల్లో చిత్రీకరణ చేసుకునే చిత్రాలపై 100 శాతం సుంకాలను విధించడం గమనార్హం. బెడిసికొట్టే అవకాశం?ట్రంప్‌ తాజా ప్రకటపై విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. ఇది హాలీవుడ్‌ను పునరుద్ధరించకపోగా.. నష్టం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డిస్నీ, పారామౌంట్‌, వార్నర్‌ బ్రోస్‌ లాంటి స్టూడియోలు కరోనా దెబ్బ నుంచి ఇంకా కొలుకోలేదు. ఇప్పటికీ చాలా వరకు అమెరికా చిత్రాలు బయటి దేశాల్లో షూటింగులు చేసుకుంటున్నాయి. పన్ను మినహాయింపులు, సినిమాకు పని చేసే టెక్నీషియన్లకు తక్కువ ఖర్చులు అవుతుండడమే అందుకు ప్రధాన కారణం.

Security Tight At Jammu And Srinagar Jails4
బోర్డర్‌ టెన్షన్‌.. జమ్ముకశ్మీర్‌లో జైళ్లకు భద్రత పెంపు

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉన్న జైళ్లపై ఉగ్ర దాడికి కుట్ర జరుగుతున్నట్టు సమాచారం. జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌, శ్రీనగర్‌లో భద్రతను ప్రభుత్వం పెంచింది. జైళ్ల భద్రతపై ఉన్నతాధికారులతో సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. కాగా, 2023 నుంచి CISF జైళ్ల భద్రతను పర్యవేక్షిస్తోంది. కాగా, కశ్మీర్‌ జైళ్లలో ఉన్న హైప్రొఫైల్‌ ఉగ్రనాయకులను విడిపించేందుకు భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయి. ఈక్రమంలో శ్రీనగర్‌ సెంట్రల్‌ జైల్‌, కోట్‌ బాల్వాల్‌ జైల్‌, జమ్మూలోని జైళ్లకు భారీఎత్తున భద్రత కల్పించారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలామంది స్లీపర్‌ సెల్స్‌, ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైళ్లలో ఉంచారు. వీరితోపాటు ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్‌, ముష్తాక్‌ సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ఈనేపథ్యంలో జైళ్లపై దాడి జరగొచ్చనే సమాచారం నిఘా వర్గాలకు చేరింది.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాక్‌ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. దాయాది కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం వరుసగా కాల్పులకు తెగబడింది. జమ్ము కశ్మీర్‌లో కుప్వారా, పూంచ్, రాజౌరీ, మేంధార్, నౌషేరా, సుందర్బనీ, అఖ్తర్‌ తదితర 8 ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. వాటిని సైన్యం గట్టిగా తిప్పికొట్టింది.దీర్ఘకాల సెలవులు రద్దుఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల సిబ్బందికి దీర్ఘకాల సెలవులు రద్దు చేస్తూ మ్యునీషియన్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఐఎల్‌) ఆదేశాలు జారీ చేసింది. ఎంఐఎల్‌ పరిధిలో 12 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలున్నాయి. సైన్యానికి అవసరమైన ఆయుధాలు వాటిలో తయారవుతాయి. ఆయుధ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికే సెలవులు రద్దు చేసినట్లు ఎంఐఎల్‌ అధికారి ఒకరు చెప్పారు.

IPL 2025: Sunrisers Hyderabad Sign Harsh Dubey As Injury Replacement For Smaran Ravichandran5
IPL 2025: సన్‌రైజర్స్‌ జట్టులో చరిత్ర సృష్టించిన బౌలర్‌

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో నిష్క్రమణకు అంచుల్లో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఇవాళ (మే 5) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగబోయే డు ఆర్‌ డై మ్యాచ్‌కు ముందు కీలక ప్రకటన చేసింది. గాయపడిన స్మరణ్‌ రవిచంద్రన్‌ స్థానంలో విదర్భ లెఫ్డ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హర్ష్‌ దూబేను జట్టులోకి తీసుకుంది. హర్ష్‌ను బేస్‌ ధర రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. కొద్ది రోజుల ముందే స్మరణ్‌ ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాకు ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చాడు. స్మరణ్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే గాయంతో సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. అంతకుముందు జంపా రెండు మ్యాచ్‌లు ఆడి ప్రాక్టీస్‌ సందర్భంగా గాయపడ్డాడు.Harsh Dubey joins the squad as a replacement for Smaran, who is ruled out due to injury.#PlayWithFire pic.twitter.com/Bd4vnLanGF— SunRisers Hyderabad (@SunRisers) May 5, 2025ఎవరీ హర్ష్‌ దూబే..?పూణేలో జన్మించి, విదర్భ తరఫున దేశవాలీ క్రికెట్‌ ఆడుతున్న 22 ఏళ్ల హర్ష్‌ దూబే.. తాజాగా ముగిసిన రంజీ సీజన్‌లో (2024-25) రికార్డు స్థాయిలో 10 మ్యాచ్‌ల్లో 69 వికెట్లు (7 ఐదు వికెట్ల ప్రదర్శనలతో పాటు రెండు 10 వికెట్ల ప్రదర్శనలు) తీసి, రంజీ చరిత్రలోనే ఓ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. హర్ష్‌ విదర్భ తరఫున 18 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 21 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, 16 టీ20లు ఆడి 128 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో దాదాపు 100 పరుగులు చేశాడు. హర్ష్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 7 అర్ద సెంచరీలు, లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 2 అర్ద సెంచరీలు సాధించాడు.హర్ష్‌ అద్బుత ప్రదర్శన కారణంగా గత రంజీ సీజన్‌లో విదర్భ ఛాంపియన్‌గా నిలిచింది. విదర్భ రంజీ టైటిల్‌ గెలవడం ఇది మూడో సారి. ఫైనల్లో విదర్భ కేరళపై విజయం సాధించి, ఛాంపియన్‌గా అవతరించింది.నిష్క్రమణ అంచుల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో గత సీజన్‌ రన్నరప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేలవ ప్రదర్శనలు చేస్తూ నిష్క్రమణ అంచుల్లో ఉంది. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 పరాజయాలు చవిచూసి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు గెలిచినా సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరడం అసంభవం. టెక్నికల్‌గా ఆ జట్టు ఇంకా ఎలిమినేట్‌ కాలేదు కానీ, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ పని అయిపోయింది. ఇవాళ (మే 5) ఆ జట్టు సొంత మైదానంలో (ఉప్పల్‌ స్టేడియం) టేబుల్‌ ఫిఫ్త్‌ టాపర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

Differences across the lifespan between females and males: GBD Study6
అనారోగ్య మరణాల్లో.. పురుషులే అధికం!

పురుషులతో పోలిస్తే మహిళల ఆయుర్దాయం ఎక్కువగా ఉంటోంది. అనారోగ్యంతో మరణిస్తున్న వారిలో పురుషులే అధికంగా ఉంటున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇదే పరిస్థితి ఉంది. అధిక రక్తపోటు, మధుమేహం, ఎయిడ్స్‌ వంటివాటితో అస్వస్థతకు గురై మరణిస్తున్న వారిలో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువని గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌ (జీబీడీ) తాజా అధ్యయనం తెలిపింది. ఆధిపత్య ధోరణి, ఆరోగ్య సంరక్షణకు అంతగా సుముఖత చూపించకపోవడం, వైద్యానికి ఎక్కువగా ఖర్చు చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా వెల్లడైంది. పురుషుల్లో అధిక ధూమపానం, మహిళల్లో ఊబకాయం, అరక్షిత శృంగారం ప్రధాన అనారోగ్య హేతువులని తెలిపింది. హెచ్‌ఐవీతో పాటు కరోనా సమయాల్లోనూ కూడా నివారణ చర్యలు మొదలుకుని రోగ నిర్ధారణ, చికిత్స వంటి అన్ని విషయాల్లోనూ మహిళలతో పోలిస్తే పురుషులు బాగా వెనుకబడి ఉన్నారని అధ్యయనం వెల్లడించింది. 200 దేశాల్లో అధిక రక్తపోటుకు తీసుకునే చికిత్సలో కూడా పురుషులు, మహిళల్లో చాలా వ్యత్యాసముంది. 56 శాతం దేశాల్లో ఎయిడ్స్, 30 శాతం దేశాల్లో మధుమేహం, 4 శాతం దేశాల్లో హై బీపీ రేటు పురుషుల్లోనే ఎక్కువగా ఉంది. 14 శాతం దేశాల్లో ఎయిడ్స్, ఐదు శాతం దేశాల్లో మధుమేహం, భారత్‌లో హై బీపీ పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా ఉన్నాయి. 131 దేశాల్లో ఎయిడ్స్, 107 దేశాల్లో హై బీపీ, 100 దేశాల్లో మధుమేహ మృతుల్లో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ. ఎయిడ్స్‌తో 25 దేశాల్లో, డయాబెటిస్‌తో 9 దేశాల్లో, హై బీపీతో యూఏఈలో పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా మరణిస్తున్నారని అధ్యయనం తేల్చింది. వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్స దిశగా పురుషులను ప్రోత్సహించడం, అందరికీ సమానంగా ఆరోగ్యం అందించే వ్యవస్థలను రూపొందించడం చాలా అవసరమని బ్రిటన్‌కు చెందిన గ్లోబల్‌ 50/50 సహవ్యవస్థాపకుడు కెంట్‌ బస్‌ తెలిపారు.(చదవండి: First Women Rescuer: ఆపదలో ఆమె సైతం..!)

Babil Khan Slams Director Sai Rajesh Criticising His Statement on Crying video7
సారీ చెప్పమన్న 'బేబీ' డైరెక్టర్‌.. రెండేళ్ల జీవితం ధారపోశానన్న హీరో

బాలీవుడ్‌లో కనీస మర్యాద ఇవ్వరు.. ఇంత నకిలీ ఇండస్ట్రీ మరొకటి ఉండదు అంటూ హిందీ చిత్రపరిశ్రమపై ఫైర్‌ అయ్యాడు ఇర్ఫాన్‌ ఖాన్‌ తనయుడు, హీరో బాబిల్‌ ఖాన్‌ (Babil Khan). అర్జున్‌ కపూర్‌, అనన్య పాండే, షనయా కపూర్‌, అర్జిత్‌ సింగ్‌.. ఇలా ఇండస్ట్రీతో సంబంధం లేని చాలామంది ఉన్నారని, బాలీవుడ్‌ పని చేయడానికి మంచి ప్రదేశం కాదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.అసలు ఏమనుకుంటున్నావ్‌?కొన్ని గంటల తర్వాత తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చాడు. అర్జున్‌, అనన్య, షనయా, అర్జిత్‌లను తాను విమర్శించలేదని, సపోర్ట్‌ చేశానని పేర్కొన్నాడు. దీనిపై తెలుగు డైరెక్టర్‌ సాయి రాజేశ్‌ (Sai Rajesh) స్పందించాడు. అంటే ఇప్పటివరకు నీకు సపోర్ట్‌ చేసిన మేము ఇప్పుడు సైలెంట్‌గా ఈ టాపిక్‌ను వదిలేయాలంటావ్‌.. అసలు మా గురించి ఏం అనుకుంటున్నావ్‌? అంటే.. నువ్వు వీడియోలో పేర్కొన్న వారికి మాత్రం గౌరవం ఇస్తే సరిపోతుందా? సారీ చెప్పాల్సిందే!నీకు సపోర్ట్‌ చేసిన మేమంతా పిచ్చివాళ్లమా? నీకు నిజంగా వాళ్లను పొగడాలి, గౌరవం ఇవ్వాలి.. అనిపిస్తే ఇచ్చుకో.. కానీ నీకోసం నిల్చున్న మా అందరినీ లైట్‌ తీసుకోవడం కరెక్ట్‌ కాదు. నువ్వు మాకు క్షమాపణలు చెప్పాల్సిందే అని పోస్ట్‌ పెట్టాడు. ఇది చూసిన బాబిల్‌.. నువ్వు నా మనసు ముక్కలు చేశావ్‌.. నీకోసం నేను చేయాల్సిందంతా చేశాను. రెండేళ్ల జీవితాన్ని నీ ముందు ధారపోశాను.మణికట్టు కోసుకున్నాఒళ్లు హూనం చేసుకుని నా శరీరాన్ని పాత్రకు తగ్గట్లుగా మలుచుకున్నాను. కానీ ఏం చేసినా అన్నీ తిరస్కరించావ్‌. ఎంత బాధున్నా దిగమింగుకుని నవ్వుతూ కనిపించాను. మురికిగుంటలో బొర్లాను. నీకోసం నా చేయి కోసుకున్నాను అని కామెంట్స్‌ చేశాడు. తర్వాత ఈ కామెంట్స్‌ డిలీట్‌ చేశాడు.బేబీ రీమేక్‌లో బాబిల్‌?బేబీ సినిమా (Baby Movie)తో రూ.100 కోట్ల హిట్‌ అందుకున్నాడు దర్శకుడు సాయి రాజేశ్‌. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయాలనుకున్నాడు. ఇందుకోసం నటుడు బాబిల్‌ ఖాన్‌ను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రెండేళ్లగా అతడిని తిప్పించుకున్న సాయి రాజేశ్‌ చివరకు అతడిని రిజెక్ట్‌ చేశాడని తెలుస్తోంది. Babil reacts to filmmaker Sai Rajesh’s criticism: “I slit my wrist for him”byu/Normal_Weather8827 inBollyBlindsNGossip చదవండి: బాలీవుడ్‌ అంతా కాపీనే: నవాజుద్దీన్‌ సిద్దిఖీ

Rajasthan MLA Arrested By ACB For This Reason8
అసెంబ్లీలో ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’?.. ఎమ్మెల్యే అరెస్ట్‌!

ఆయనో యువ ఎమ్మెల్యే. అవినీతి మీద చట్ట సభలో ప్రశ్నలు సంధించారు. ఆనక.. నోరు మెదపకుండా ఉండేందుకు లంచం డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో డబ్బు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబట్టాడు. రాజస్థాన్‌లో ఓ సిట్టింగ్‌ ఎమ్మెల్యేను ఏసీబీ ఆదివారం అరెస్ట్‌ కావడం సంచలనంగా మారింది. జైపూర్‌: భారత్‌ ఆదివాసీ పార్టీ (బీఏపీ) ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్‌ జైపూర్‌ జ్యోతి నగర్‌లోని తన అధికార నివాసంలో ఒక మైనింగ్‌ కంపెనీ యజమాని నుంచి రూ 20 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు ఆ రాష్ట్ర ఏసీబీ వెల్లడించింది. కరౌలి జిల్లాలోని తోడభీమ్‌ బ్లాక్‌లోని కొన్ని మైనింగ్‌ లీజులకు సంబంధించిన మూడు ప్రశ్నలను గత అసెంబ్లీ సమావేశాల్లో అడిగారు. అయితే ఆ ప్రశ్నలను ఉపసంహరించుకునేందుకు మైనింగ్‌ యజమాని నుంచి ఎమ్మెల్యే మొత్తంగా రూ.10 కోట్లను డిమాండ్‌ చేశారు. అయితే చివరకు డీల్‌ రూ.2.5 కోట్లకు కుదరడం, కొంత కొంతగా చెల్లించేందుకు ఎమ్మెల్యే ఒప్పుకోవడం జరిగిపోయిందట. అదే సమయంలో ఈ ఏప్రిల్‌లోనే ఏసీబీకి ఆయన సమాచారం అందించాడట.ఈ క్రమంలో.. ఇప్పటికే లక్ష చెల్లించగా.. ఆదివారం మరో రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఓ యజమాని ప్రయత్నించాడు. దీంతో.. ఏసీబీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ, స్పీకర్‌ వాసుదేవ్‌కి తెలియజేసి అరెస్ట్‌కు ముందస్తుగానే అనుమతి పొందారు. సరిగ్గా డబ్బు తీసుకుంటున్న సమయంలో ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేసినట్లు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ రవి ప్రకాష్‌ మెహర్దా మీడియాకు తెలియజేశారు. అంతేకాదు.. ఎమ్మెల్యే కృష్ణ పటేల్‌ డబ్బు తీసుకుంటున్న టైంలో ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఎమ్మెల్యే అనుచరుడొకరు డబ్బు సంచితో ఉడాయించినట్లు, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారాయన. లోక్‌ సభ ఎన్నికలతో పాటు కిందటి ఏడాది జరిగిన బగిడోరా నియోజవర్గం(బంస్వారా జిల్లా) ఉప ఎన్నికల్లో కృష్ణ పటేల్‌(38) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఫస్ట్‌ టైం ఎమ్మెల్యే. భారత్‌ ఆదివాసీ పార్టీకి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అరెస్టు తరువాత ఎమ్మెల్యేను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఇదిలా ఉంటే.. ఈ పరిణామంపై భారత్‌ ఆదివాసీ పార్టీ కన్వీనర్‌, బం‌స్వారా ఎంపీ రాజ్‌కుమార్‌ రావోత్‌ స్పందించారు. ఇది బీజేపీ కుట్ర అయ్యి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ కృష్ణపటేల్‌ హస్తం ఉన్నట్లు తేలితే చర్యలు ఉంటాయని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్‌ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయాల్లో అవినీతి పనికి రాదని ఆ పార్టీ కీలక నేత సచిన్‌ పైలట్‌ అన్నారు. అదే సమయంలో దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ చేస్తున్న రాజకీయాలపైనా చర్చ జరగాలని కోరారాయన. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించాల్సి ఉంది.

Market uncertainties inevitable but smart strategies help investors9
అనిశ్చితిని ఎలా ఎదుర్కోవాలి?

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయపన్ను నిబంధనలు అమల్లోకి వచ్చాయని విన్నాను. ఆదాయపన్ను శ్లాబుల్లో, టీడీఎస్‌ పరిమితుల్లోనూ మార్పులు చేసినట్టు తెలిసింది. సీనియర్‌ సిటిజన్‌గా (60 ఏళ్లకు పైన) నాకు డెట్‌ సాధనాలపై వస్తున్న వడ్డీ ఆదాయమే ప్రధానంగా ఉంది. కాబట్టి ఆదాయపన్ను మార్పుల ప్రభావం నాపై ఏ మేరకు ఉంటుంది? – వినోద్‌ బాబుకొత్త విధానం కింద ఆదాయపన్ను శ్లాబుల్లో, టీడీఎస్‌లో మార్పులు చోటుచేసుకున్నాయన్నది నిజమే. టీడీఎస్‌ పరిమితిని సీనియర్, నాన్‌ సీనియర్‌ సిటిజన్లకూ (60 ఏళ్లలోపు) తగ్గించారు. సీనియర్‌ సిటిజన్స్‌కు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ మినహాయింపు ఉంది. ఇప్పుడు ఈ పరిమితి రూ.లక్షకు పెరిగింది. ఆదాయం ఈ లోపు ఉంటే టీడీఎస్‌ వర్తించదు. నాన్‌ సీనియర్‌ సిటిజన్స్‌కు రూ.40,000గా ఉన్న పరిమితి రూ.50,000కు పెరిగింది. అంటే వడ్డీ ఆదాయం రూ.50వేలు మించినప్పుడే టీడీఎస్‌ వర్తిస్తుంది. అద్దె ఆదాయంపై టీడీఎస్‌ అమలును రూ.2.4 లక్షల పరిమితి నుంచి రూ.6లక్షలకు పెంచారు. ఇది పన్ను చెల్లింపుదారులందరికీ వర్తిస్తుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి వచ్చే డివిడెండ్‌ ఆదాయం రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచారు. అంటే ఫండ్స్‌ నుంచి డివిడెండ్‌ ఆదాయం రూ.10,000 మించినప్పుడే టీడీఎస్‌ అమలవుతుంది. కొత్త పన్ను విధానంలో ఆదాయపన్ను శ్లాబుల్లోనూ మార్పులు జరిగాయి. మొత్తం ఆదాయం రూ.12లక్షల వరకు ఉంటే సెక్షన్‌ 87ఏ కింద రాయితీ ప్రయోజనంతో ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. స్టాక్స్, ఈక్విటీ ఫండ్స్‌ నుంచి వచ్చే మూలధన లాభాలు కూడా రూ.12 లక్షల ఆదాయంలోపే ఉన్నప్పటికీ.. మూలధన లాభాలపై విడిగా పన్ను చెల్లించడం తప్పనిసరి. ఇదీ చదవండి: రేట్ల తగ్గింపు ప్రతికూలం!మార్కెట్లు అస్థిరతంగా ఉన్నాయి. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు ఎలా ఎదుర్కోవాలి? – ఉషమార్కెట్లలో అస్థిరతలు సహజమే. ఇప్పుడనే కాదు.. గతంలోనూ ఎన్నో సందర్భాల్లో ఇలాంటి ఆటుపోట్లను చూశాం. భవిష్యత్తులో మరింత ఎక్కువగా ఉండొచ్చు. గడిచిన ఐదు, పదేళ్ల కాలంలో ఇదే ధోరణి కనిపిస్తోంది. వీటిని ఎదుర్కొనే విధంగా ఇన్వెస్టర్ల పెట్టబడుల ప్రణాళిక ఉండాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాల్సి ఉంటుంది. ముందుగా లైఫ్‌ ఇన్సూరెన్స్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో కుటుంబానికి ఆర్థిక, ఆరోగ్య రక్షణ కలి్పంచుకోవాలి. ఊహించని అవసరాలు ఏర్పడితే ఈక్విటీ పెట్టబడులపై ఆధారపడకుండా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు నుంచి పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికి అయి ఉండాలి. దీంతోపాటు క్రమం తప్పకుండా మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అస్థిరతల నుంచి గరిష్ట ప్రయోజనాన్ని పొందొచ్చు. రెగ్యులర్‌గా ఇన్వెస్ట్‌ చేసే వారికి మార్కెట్‌ కరెక్షన్లలో మంచి పెట్టుబడుల అవకాశాలు వస్తుంటాయి. వీటిని అనుకూలంగా మలుచుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌక ధరల వద్ద కొనుగోలు చేసుకోవచ్చు. తద్వారా దీర్ఘకాలంలో రాబడులను పెంచుకోవచ్చు.ధీరేంద్ర కుమార్‌సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

UN Security Council Discuss India Pak Tensions After Pahalgam10
ఐరాసలో నేడు పాక్‌-భారత్‌ పంచాయితీ

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితిలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. భద్రతా మండలి(UN Security Council)లో భారత్‌-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి చర్చించబోతున్నారు. తద్వారా.. అంతర్జాతీయ సమాజం ముందు ఇరు దేశాల తమ తమ వాదనలు వినిపించే అవకాశం దక్కింది.ఏప్రిల్‌ 22న జమ్ము కశ్మీర్‌ అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాం పట్టణంలోని బైసరన్ లోయలో 26 మంది పర్యాటకుల్ని ఉగ్రవాదులు బలిగొన్నారు. ఇది పాక్‌పనేనని నిర్ధారించుకున్న భారత్‌.. అన్ని రకాల ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో.. పాక్‌ కూడా కౌంటర్‌ ఆంక్షలు విధిస్తోంది. మరీ ముఖ్యంగా భారత్‌ సింధు జలాలను నిలిపివేయడాన్ని ‘‘యుద్ధం’’గానే పాక్‌ భావిస్తోంది.ఈ క్రమంలో ఈ పరిణామాలపై ఆదివారం పాక్‌ విదేశాంగ ప్రతినిధి ఒకరు స్పందించారు. భారత్‌ దూకుడుగా వ్యవహరిస్తూ తమను(పాక్‌)ను ఇబ్బంది పెడుతోందని, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోందని అన్నారు. మరీ ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్‌ అక్రమంగా వ్యవహరిస్తోందని, ఈ విషయాలన్ని భద్రతా మండలి సమావేశంలో లేవనెత్తుతామని అన్నారాయన.మరోవైపు.. భద్రతా మండలి పహల్గాం దాడిని ఖండించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నాటి సమావేశానికి ముందు మండలి ప్రతినిధులు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తామని.. అదే సమయంలో ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన చెందుతున్నామని అన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement