Top Stories
ప్రధాన వార్తలు

ఊరూపేరు లేని 'ఉర్సా'
సాక్షి, అమరావతి : రూ.10,000 కోట్లు పెట్టుబడులు పెట్టే కంపెనీ అంటే దాని స్థాయి ఎంత గొప్పగా ఉండాలి..? నిత్యం వేలాది మంది ఉద్యోగుల కోలాహలంతో పాటు పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు ఉండాలి కదా..? కానీ రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చిన ఆ కంపెనీలో కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేడు. ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు చేసిన దాఖలాలు కూడా లేవు. అంతెందుకు..? అసలది ఆఫీసే కాదు! వాడుకునేది కూడా గృహ విద్యుత్తే. కనీసం కార్యాలయం కూడా లేని కంపెనీకి ఎకరం 99 పైసలకే అత్యంత ఖరీదైన భూమిని ఉరుకులు పరుగులపై అప్పగించడం నీకింత.. నాకింత! దోపిడీకి పరాకాష్ట. ప్రపంచ చరిత్రలో ఇది వింతల్లో వింత! ఊరు పేరు లేని ‘ఉర్సా క్లస్టర్స్’కు విశాఖలో దాదాపు రూ.3,000 కోట్ల విలువైన భూమిని టీడీపీ సర్కారు అప్పనంగా కట్టబెట్టడం తాజాగా అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కేవలం రెండు నెలల వయసు, కనీసం ఓ ఆఫీసు, ఫోన్ నెంబర్, వెబ్సైట్ కూడా లేని ఓ ఊహల కంపెనీకి మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన అనంతరం రూ.వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేయడం పట్ల అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.రెండు నెలలు తిరగక ముందే.. టీసీఎస్‌ని తెరపైకి తెచ్చి ఆ ముసుగులో..! సొంత కార్యాలయం.. కనీసం ఫోన్ నెంబరు కూడా లేని ఓ అనామక కంపెనీ ఏర్పాటై రెండు నెలలు తిరగక ముందే తెలుగు రాష్ట్రాల్లో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామనడం.. ఆ ప్రతిపాదనకు ముచ్చట పడి చంద్రబాబు సర్కారు విశాఖలో కారు చౌకగా అత్యంత ఖరీదైన భూములు కేటాయించేయడం, ఇందుకోసం టీసీఎస్‌ని తెరపైకి తెచ్చి ఆ ముసుగులో ఎకరం 99 పైసలకే అంటూ ప్రత్యేకంగా పాలసీ తెస్తుండటంపై రాష్ట్ర ఐఏఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యనేతలు తమ కుట్ర అమలులో భాగంగా తొలుత టీసీఎస్‌కు ఎకరా 99 పైసలకే కేటాయించి, అదే ధరకు ఉర్సా కస్టర్స్‌కు విలువైన భూములు ధారాదత్తం చేసేలా పావులు కదిపారు. ‘ఉర్సా క్లస్టర్స్’ పేరుతో విశాఖలో డేటా సెంటర్, ఐటా క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించడమే తడవుగా చౌకగా భూములు కేటాయించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించడం.. ఆ వెంటనే క్యాబినెట్లో భూ కేటాయింపులు చేయడంపై అనుమానాలు బలపడుతున్నాయి. కనీసం ఓ ఆఫీసు, ఫోన్ నెంబర్ కూడా లేని కంపెనీ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఎలా ఆమోదించిందో అర్థం కావడం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భూ కేటాయింపులకు పచ్చజెండా.. ఉర్సా క్లస్టర్స్ రూ.5,728 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, ఐటాక్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం విశాఖ మధురవాడలోని ఐటీ హిల్ నెంబర్ 3లో ఐటా క్యాంపస్‌కు 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో డేటా సెంటర్‌కు 56.36 ఎకరాలు కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు చేసుకున్న ఉర్సా కంపెనీ గురించి ‘సాక్షి’ పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.రెండు నెలల క్రితం పుట్టిన ఉర్సాకుమారుడేమో సాధారణ ఉద్యోగి తండ్రేమో కంపెనీకి డైరెక్టరట.. ఇంకో డైరెక్టర్ కథ ఇదీ.. తెలుగు రాష్ట్రాల్లో రూ.10 వేల కోట్లు పెట్టుబడులు పెడుతుందని చెబుతున్న ఉర్సా క్లస్టర్స్ మార్చి నెల కరెంటు బిల్లు ఇది. హైదరాబాద్‌లో కార్యాలయమే లేదు..! కేరాఫ్ అడ్రస్ ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టే సంస్థ కార్యాలయం ఎంత పెద్దగా ఉంటుందో..? వందలాది మంది ఉద్యోగులతో కోలాహలంగా ఉంటుందని ఊహించుకుంటే పప్పులో కాలేసినట్లే. టీడీపీ కూటమి సర్కారు భూ కేటాయింపులు చేయడానికి కేవలం రెండు నెలల ముందు అంటే 2025 ఫిబ్రవరి 12న ఉర్సా క్లస్టర్స్ హైదరాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన పెందుర్తి విజయ్‌కుమార్, అమెరికాలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న సతీష్ అబ్బూరి డైరెక్టర్లుగా ఈ కంపెనీ ఏర్పాటైంది. ప్లాట్ నెంబర్ 705, ఏక్తా బాసిల్ హైట్స్, కొత్తగూడ, హైదరాబాద్, తెలంగాణ– 500084 చిరునామాతో దీన్ని నెలకొల్పారు. అయితే ఆ చిరునామాకు వెళ్లి పరిశీలించగా... అది పూర్తిగా నివాస ప్రాంతమని తేలింది. పెందుర్తి విజయ్‌కుమార్‌కు అత్యంత దగ్గరి బంధువైన పెందుర్తి పద్మావతికి చెందిన త్రీ బెడ్ రూమ్ నివాస ఫ్లాట్‌ను ఉర్సా ఆఫీసు కార్యాలయంగా పేర్కొన్నారు. అది పూర్తిగా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. ఒక్కో అంతస్తుకు నాలుగు ఫ్లాట్ల చొప్పున మొత్తం 28 ఫ్లాట్లున్నాయి. ఉర్సా కార్యాలయంగా పేర్కొన్న ఒక ఫ్లాట్‌లో ఓ కుటుంబం నివాసం ఉంటోందని, అసలు అక్కడ ఐటీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు జరగడం లేదని స్థానికులు వెల్లడించారు. ఇక రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటున్న ఉర్సా క్లస్టర్స్ వాణిజ్య విద్యుత్ కాకుండా గృహ విద్యుత్తు కనెక్షన్‌ను వినియోగి స్తోంది. ఆర్వోసీలో నమోదుకు సమర్పించిన ఫ్లాట్ నెంబర్ 705 విద్యుత్ బిల్లే దీనికి నిదర్శనం. ఉర్సా క్లస్టర్ కంపెనీకి కనీసం ఓ ఫోన్ నెంబరు గానీ వెబ్‌సైట్‌గానీ లేకపోవడం గమనార్హం. పెందుర్తి విజయకుమార్ తన వ్యక్తిగత ఈ మెయిల్‌ను ఆర్వోసీకి అందించారు. అమెరికాలోనూ అంతే.. లోకేశ్ పర్యటనకు నెల ముందు...!ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాతృసంస్థగా చెబుతున్న అమెరికాలోని ఉర్సా క్లస్టర్స్ ఎల్ఎల్సీ పరిస్థితి కూడా ఇంతే. అది లిమిటెడ్ లయబులిటీ కంపెనీ. ఏడు నెలల క్రితం.. అంటే 2024 సెపె్టంబర్ 27న ఉర్సా క్లస్టర్స్ అమెరికాలో ఏర్పాటైంది. అమెరికాలోని డెలావర్‌లో 611, సౌత్ డ్యూపాంట్, హైవే సూట్, 102 డోవెర్, డీఈ 19901 చిరునామాతో ఈ కంపెనీ నమోదైంది. పెందుర్తి విజయ్‌కుమార్ తనయుడు కౌశిక్ దీనికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనకు సరిగ్గా నెల రోజుల ముందు ఈ కంపెనీ ఏర్పాటు కావడం గమనార్హం. ఇక ఈ కంపెనీ ఇప్పటి వరకు చెల్లించిన పన్ను కేవలం 300 అమెరికన్ డాలర్లు మాత్రమే. అంటే మన కరెన్సీలో సుమారు రూ.25,000. అమెరికా చిరునామాతో ఉన్న ఇల్లు కూడా పూర్తిగా నివాసప్రాంతం. కేవలం 1,560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక చిన్న కుటుంబం నివాసం ఉండటానికి అనువుగా ఉన్న ఇంటిని ఆఫీసు కార్యాలయంగా పేర్కొన్నారు. ఇక అక్కడ కూడా ఉర్సా క్లస్టర్స్ బోర్డు లేదు.. ఉద్యోగులు లేరు. కనీసం ఫోన్ నెంబర్లు లేవు. కౌశిక్ పెందుర్తి ప్రస్తుతం టాలస్ పే అనే కంపెనీలో సీపీటీవోగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన లింక్డిన్ ఖాతా ద్వారా తెలుస్తోంది. అంటే ఆయన అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగి. మరో డైరెక్టర్ సతీష్ అబ్బూరి ఎలిసియం అనలిటిక్స్‌కు వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. అలాంటి ఉర్సా కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెడతామనడం, అడిగిందే తడవుగా రూ.వేల కోట్ల విలువైన భూమినికారుచౌకగా కట్టబెడుతుండటంపై పెద్ద ఎత్తున అనుమానాలు ముసురుకుంటున్నాయి.‘ఐఎంజీ భారత్’ను మించిన స్కామ్..ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 2004లో తన బినామీ బిల్లీరావు చేత ‘ఐఎంజీ భారత్’ అనే డొల్ల కంపెనీని పెట్టించి.. అది అమెరికాలో ఉన్న ఐఎంజీ అకాడెమీకి చెందిన కంపెనీ అని నమ్మించి.. హడావిడిగా దానికి గచ్చిబౌలిలోని 400 ఎకరాలు కేటాయించి సేల్‌డీడ్ కూడా చేసేశారు.. అంతేకాదు శంషాబాద్ పక్కన మరో 450 ఎకరాలు కూడా కేటాయించడంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని స్టేడియాలనూ ఆ కంపెనీకి 45 ఏళ్లపాటు లీజుకిచ్చేసి వాటి నిర్వహణ చార్జీలను మాత్రం ప్రభుత్వమే ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.. ఇపుడు ‘ఉర్సా క్లస్టర్స్’ కంపెనీని హడావిడిగా ఏర్పాటు చేసి విలువైన భూములు కేటాయించడం చూస్తుంటే ఐఎంజీ స్కామ్ గుర్తుకొస్తోందని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు.

భారత్ చేరుకున్న జేడీ వాన్స్ దంపతులు.. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
ఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) భారత్‌కు చేరుకున్నారు. భారత్‌లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా జేడీ వాన్స్.. సోమవారం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో విమానం దిగారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు. కాగా, వాన్స్ వెంట ఆయన సతీమణి ఉషా వాన్స్, ముగ్గురు పిల్లుల కూడా వచ్చారు. జేడీ వాన్స్ పిల్లులు.. భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించడం విశేషం. ఎయిర్‌పోర్టులో భారత శాస్త్రీయ నృత్యంతో వారికి సాదర స్వాగతం పలికారు. కాసేపట్లో వారు ఢిల్లీలోని అక్షర్ధామ్ టెంపుల్‌కు వెళ్లనున్నారు.#WATCH | Delhi: Visuals from the Akshardham Temple where Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children, will visit shortly.Akshardham Temple Spokesperson Radhika Shukla says, "The Vice President and the Second Lady are coming… pic.twitter.com/yEKwdZemVj— ANI (@ANI) April 21, 2025అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. వాన్స్‌కు మన సైనిక దళాలు గౌరవ వందనం చేశాయి. సాయంత్రం 6.30 గంటలకు వాన్స్ దంపతులకు లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధాని మోదీ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. భేటీ అనంతరం వాన్స్ దంపతులు, అమెరికా అధికారులకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు.#WATCH | Delhi: Vice President of the United States, JD Vance, along with Second Lady Usha Vance arrive at Palam airport. pic.twitter.com/iCDdhYLVdz— ANI (@ANI) April 21, 2025విందు అనంతరం సోమవారం రాత్రే వాన్స్ దంపతులు జయపురకు వెళ్తారు. అక్కడ విలాసవంతమైన రాంభాగ్ ప్యాలెస్ హోటల్లో బస చేస్తారు. మంగళవారం ఉదయం పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. అందులో అంబర్ కోట కూడా ఉంది. మధ్యాహ్నం రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో వాన్స్ ప్రసంగిస్తారు. ట్రంప్ హయాంలో భారత్, అమెరికా సంబంధాలపై మాట్లాడతారు.#WATCH | Delhi: Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children, at Palam airport.Vice President JD Vance is on his first official visit to India and will meet PM Modi later today. pic.twitter.com/LBDQES2mz1— ANI (@ANI) April 21, 2025ఈనెల 23వ తేదీ(బుధవారం) ఉదయం వాన్స్ కుటుంబం ఆగ్రాకు వెళ్లనుంది. అక్కడ తాజ్ మహల్‌ను, భారతీయ కళలకు సంబంధించిన శిల్పాగ్రామ్‌ను సందర్శిస్తారు. అదేరోజు మధ్యాహ్నం తర్వాత మళ్లీ వారు జయపురకు వెళ్తారు. 24వ తేదీన జయపుర నుంచి బయలుదేరి అమెరికా వెళ్తారు.#WATCH | Delhi: Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children welcomed at Palam airport. Union Minister Ashwini Vaishnaw received the Vice President. pic.twitter.com/ocXCXOdmgQ— ANI (@ANI) April 21, 2025

బాబు మాటల్లో నిజం.. నేతిబీర చందమే!
పొంతన లేని మాటలతో జనాల్ని తికమకపెట్టడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది తిరుగులేని రికార్డు. తాజాగా కొద్ది రోజుల క్రితం జ్యోతీరావు ఫూలే జయంతి ఉత్సవాల్లో ఇది మరోసారి నిరూపితమైంది. ఎల్లోమీడియా ‘బీసీల సంక్షేమానికి రూ.48 కోట్లు’ అంటూ బాబుగారి ప్రసంగాన్ని భాజాభజంత్రీలతో కథనంగా వండి వార్చినప్పటికీ వివరాలు చూస్తే ప్రజలు ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఎందుకంటే.. బాబు గారు తన ప్రసంగంలో సంక్షేమ వసతి గృహాలకు రూ.405 కోట్లు, గ్రూప్ పరీక్షల అభ్యర్థులకు శిక్షణ శిబిరాలు, బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు, అమరావతిలో 500 మంది బ్యాచ్‌తో ఉచిత శిక్షణ, ఆదరణ పథకం కింద ఏటా రూ.వెయ్యికోట్లు ఖర్చు వంటివి మాత్రమే ప్రస్తావించారు. .. ఇవేవీ కొత్తవి కాకపోవడం ఒక వింతైతే.. వీటికయ్యే ఖర్చు ఏటా రెండు వేల కోట్లకు మించకపోవడం ఇంకోటి. మరి.. రూ.48 వేల కోట్లు ఎక్కడ? ఎప్పుడు? ఎలా వ్యయం చేస్తారు? ఎల్లో కథనం చదివిన వారి ఊహకే వదిలేయాలి దీన్ని. పోనీ మొత్తం ఐదేళ్లకు ఇంత మొత్తం అనుకుంటే.. ఒక ఏడాది గడచిపోయింది కాబట్టి.. మిగిలిన నాలుగేళ్లలో ఏటా రూ.12 వేల చొప్పున ఖర్చు పెట్టాలి. దీనిపై కూడా స్పష్టత లేదు. అయినా చంద్రబాబు(Chandrababu) బీసీ సంక్షేమానికి 48 వేల కోట్లు అని ఒక అంకె చెప్పడం, అదేదో మొత్తం ఇచ్చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేసి బ్యానర్ కథనాలు రాసేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయడం ఎల్లో మీడియా మార్కు జర్నలిజమై పోయింది. 👉బాబు గారు ఇంకొన్ని మాటలూ ఆడారు. ఆర్థిక అసమానతలను రూపుమాపే బ్రహ్మాస్త్రం పీ-4 అని, దీని ద్వారా లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని చెప్పనైతే చెప్పారు కానీ.. ఎలా అన్నది మాత్రం చెప్పడం మరిచారు!. సాధారణంగా ఏ నేత అయినా వేల కోట్ల మొత్తాలను ప్రకటించినప్పుడు దేనికెంత ఖర్చు చేస్తారు? బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి? వంటి వివరాలు ఇవ్వడం జర్నలిజమ్ ప్రాథమిక లక్షణం. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాంటి భారీ కేటాయింపులు జరిగినప్పుడు దానికి కట్టుబడి ఉన్నట్టు సమాచారం ఉండేది. అప్పటి విపక్షం టీడీపీ కూడా తప్పు పట్టే పరిస్థితి ఉండేది కాదు. పోనీలే... ఏదో ఒక రీతిన బీసీల సంక్షేమానికి రూ.48 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని సంతోషిస్తూండగానే చంద్రబాబు అన్నమాటతో నిరాశ కమ్మేసింది. 👉అప్పు చేసి సంక్షేమం అమలు చేస్తే రాష్ట్రం కష్టాలలో కూరుకుపోతుందని, సంపద సృష్టించి సంక్షేమానికి ఖర్చు చేస్తామని చంద్రబాబు ప్రకటించారని ఎల్లో మీడియా(Yellow Media)నే తెలిపింది. చంద్రబాబు అక్కడితో ఆగలేదు. కాని టీడీపీకి నష్టం అని భావించి ఎల్లో మీడియా ఆ భాగం రాయకుండా వదలి వేసింది. మిగిలిన మీడియాలో ఆ వివరాలు ఉన్నాయి. చెప్పినవన్నీ చేయాలని ఉన్నా గల్లా పెట్టే ఖాళీగా కనిపిస్తోందని, అప్పు చేద్దామన్నా ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావడం లేదని అన్నారు. పరపతి లేకపోతే అప్పు ఎలా పుడుతుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు దాటిపోయింది. ఈ కాలంలో సంపద సృష్టించ లేకపోయానని ఆయన చెబుతున్నట్లే కదా? పైగా అప్పు పుట్టని పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబే కదా దానికి బాధ్యుడు అవుతారు. పోనీ అదే నిజమనుకున్నా, ఇప్పటికే రూ.లక్ష కోట్ల అప్పు ఎలా చేశారు? దానిని ఎందుకోసం ఖర్చు పెట్టారు అన్నది ఎప్పుడైనా చెప్పారా అంటే లేదు. ఒక్క అమరావతి(Amaravati) నిర్మాణాలకే ఏభైవేల కోట్ల అప్పు ఎలా తీసుకు వస్తున్నారు? ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ, ఎన్నికల ప్రణాళిక అంటూ తెగ వాగ్దానాలు ఇచ్చేశారు కదా? బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ ఇస్తానన్నారు కదా? ఇప్పుడు ప్రతి దానికి గల్లా పెట్టె ఖాళీగా ఉందని చెప్పడం ప్రజలను చీట్ చేయడమే కాదా? ఈ లెక్కన ఇప్పుడు బీసీల సంక్షేమానికి ప్రకటించిన రూ.48 వేల కోట్లు ఉత్తుత్తి ప్రకటనగానే తీసుకోవాలా? లేక దాని అమలుకు వేరే మార్గం ఏమైనా ఉందని చెబుతారా?. తల్లికి వందనం కింద త్వరలో డబ్బులు ఇస్తామని అంటారు. ఒక ఏడాది ఇప్పటికే ఎగవేసిన విషయాన్ని మాత్రం ప్రస్తావించరు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే రూ.ఆరు వేలు పోను మిగిలిన రూ.14 వేలు ఇస్తామని చెప్పారు. మరి ఈ ఏడాది ఎందుకు ఎగవేశారో వివరించాలి కదా? కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా రైతులకు సాయం చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చుతున్నారు. ఇవైనా ఏ మేరకు అమలు చేస్తారో తెలియదు. చంద్రబాబు మాత్రం వాటిని నివృత్తి చేయరు. తాను చెప్పదలచుకున్నది ఏదో అది ప్రజలు నమ్ముతారా? లేదా ?అనేదానితో నిమిత్తం లేకుండా ప్రచారం చేసి వెళుతుంటారు. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకు వస్తామని, వారికి 34 శాతం రిజర్వేషన్లు తెస్తామని, నామినేటెడ్ పోస్టులలో 33 శాతం బీసీలకు కేటాయిస్తామని, కల్లు గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయించామని.. ఇలా ఆయా విషయాలను చెప్పారు. విశేషం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం సత్యసాయి జిల్లాలో బీసీ వర్గానికి చెందిన ఒక వైసీపీ నేత లింగమయ్యను టీడీపీ వారు హత్య చేస్తే వీరు కనీసం ఖండించలేదు. ఆ కేసులో ఇరవైమంది నిందితులు ఉన్నారని చెబుతున్నా ఇద్దరిపైనే కేసు నమోదు చేశారని బాధితులు ఆరోపిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం బీసీ రక్షణ చట్టం గురించి ఉపన్యాసం ఇస్తున్నారు.ఏపీలో సోషల్ మీడియా(AP Social Media) నేరస్తులకు అడ్డాగా మారిందని, వ్యక్తిత్వ హననం చేస్తే అది వారికి అదే చివరి రోజు అవుతుందని చంద్రబాబు అంటున్నారు. నిజానికి సోషల్ మీడియాను దుర్వినియోగం ఎక్కువగా చేసింది టీడీపీ వారే అనే సంగతి ఆయనకూ తెలుసు. వారిని ప్రోత్సహించింది తాను, తన కుమారుడు అన్న విషయం అందరికి విదితమే. ఈ మధ్య తప్పని స్థితిలో ఒక టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతనిని విచారించి ,అతను వాగిన పిచ్చివాగుడు వెనుక ఎవరు ఉన్నారో పోలీసులు తేల్చుతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు. సీమ రాజా అని, ఇంకేవేవో పేర్లతో వైఎస్సార్సీపీ మహిళా నేతలపై దారుణమైన నీచమైన వ్యాఖ్యలు చేసినవారంతా రాష్ట్రంలో సేఫ్‌గా తిరుగుతున్నారు. మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి అసహ్యకరమైన ఆరోపణ చేసిన ఒక టీడీపీ నేతకు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసిన చరిత్ర కూడా సార్‌దే కదా! ఏదైనా చిత్తశుద్దితో చెబితే పర్వాలేదు. కాని సుద్దులు పైకి చెప్పి, టిడిపి సోషల్ మీడియా అరాచక శక్తులకు అండగా నిలబడుతున్నారన్న అపకీర్తి మూట కట్టుకుంటే ఏమి చేస్తాం. అందువల్ల నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో చంద్రబాబు మాటల్లో వాస్తవం అంత ఉంటుందని ఆయన ప్రత్యర్ధులు వ్యాఖ్యానిస్తుంటారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

‘యెమెన్ లీక్ ఎపిసోడ్’లో బిగ్ ట్విస్ట్
యెమెన్‌పై భీకర దాడులకు సంబంధించి అమెరికా ప్రణాళికలు ముందుగానే బయటపడడం చర్చనీయాంశమైన వేళ.. విస్మయం కలిగించే విషయం ఒకటి వెలుగు చూసింది. హౌతీ రెబల్స్‌పై దాడుల సమాచారాన్ని అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తన భార్య, కుటుంబ సభ్యులు, వ్యక్తిగత లాయర్‌తోనూ పంచుకున్నట్లు బయటపడింది. సమాచారం లీక్ విషయంలో ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.న్యూయార్క్: సమాచారం లీక్ అవ్వడానికి కారణమైన ‘సిగ్నల్’ గ్రూప్‌ను తానే క్రియేట్ చేశానని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ (Mike Waltz) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ గ్రూప్‌లో సమాచారం ఎలా లీక్ అయ్యిందో అర్థం కావడం లేదని, దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని అన్నారాయన. ఈలోపు.. అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్(Pete Hegseth) తన కుటుంబ సభ్యులతోనూ ఆ కీలక సమాచారం పంచుకున్నారనే విషయం వెలుగు చూసింది.యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌ను టార్గెట్ చేస్తూ జరిగిన F/A-18 హార్నెట్ దాడుల షెడ్యూల్ల వివరాలను ఆయన మరో ఛాట్‌లో భార్య, తన సోదరుడు, స్నేహితులతోనూ పంచుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఆదివారం ఒక కథనం ప్రచురించింది. అంతేకాదు హెగ్సెత్ భార్య, ఫాక్స్ న్యూస్ ప్రొడ్యూసర్ అయిన జెన్నిఫర్.. సైన్యానికి సంబంధించిన కీలక సమావేశాలకూ హాజరయ్యారని వాల్ స్ట్రీట్ జనరల్ విడిగా మరో కథనం ఇచ్చింది.ఈ కథనాలపై ఇటు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్.. అటు వైట్‌హౌజ్ వర్గాలు స్పందించాల్సి ఉంది. మరోవైపు.. అత్యంత సున్నితమైన భద్రతా వివరాలను పంచుకోవడానికి ట్రంప్ పేషీ ‘‘సిగ్నల్’’ లాంటి యాప్‌ను వాడడంపై అమెరికాలో తీవ్ర చర్చ నడుస్తోంది.అమెరికా బలగాలు కిందటి నెలలో యెమెన్(Yemen Attacks Plan Leak)పై భీకర దాడులు చేయడానికి సంబంధించిన ప్రణాళికలు ముందుగానే ఓ పాత్రికేయుడికి తెలియడం అమెరికాలో కలకలం రేపింది. సిగ్నల్‌లో గ్రూప్‌చాట్ కోసం తనను రెండు రోజుల ముందే యాడ్ చేశారని ‘అట్లాంటిక్ మ్యాగజైన్’ ఎడిటర్-ఇన్-చీఫ్ జెఫ్రీ గోల్డ్బర్గ్ ప్రకటించారు. లక్ష్యాలు, అమెరికా ఆయుధాల మోహరింపు, దాడులు చేసే దిశ వంటి అంశాలపై గ్రూపులో చర్చించారని, ఆ ప్రకారమే దాడులు జరిగాయని ఆయన వెల్లడించారు. అయితే తన వద్ద ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.. తాను ఎలాంటి కథనాలు ఇవ్వలేదంటూ చెప్పారాయన.అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ముఖ్య అధికారులు యెమెన్‌పై చర్చించిన సిగ్నల్ యాప్ గ్రూప్చాట్లో ఈ జర్నలిస్టును యాడ్ చేశారు. దాడుల విషయాలు ఆ పాత్రికేయునికి తెలుసని శ్వేతసౌధం ధ్రువీకరించింది.మరోవైపు.. ఈ ప్రణాళిక లీకైన అంశంపై తనకెలాంటి సమాచారం లేదని అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. ఈ భద్రతా ఉల్లంఘనను ట్రంప్ సాధారణ విషయంగా తీసుకున్నప్పటికీ.. డెమోక్రట్లు తీవ్రంగా ఖండించారు. నూతన పాలకవర్గం అజాగ్రత్త వల్లే ఇది జరిగిందని వ్యాఖ్యానించారు.ఇక.. ఈ ఉదంతంపై ఉన్నతస్థాయి నిఘా అధికారులను అమెరికా సెనెట్ విచారిస్తోంది. ఇప్పటికే ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, జాతీయ నిఘా డైరెక్టర్ తులసీ గబ్బార్డ్‌లు సెనెట్ నిఘా కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అయితే గ్రూప్‌ను తానే క్రియేట్ చేసినప్పటికీ సదరు జర్నలిస్టు ఫోన్ నెంబర్ తన వద్ద లేదని అన్నారు. ఫోన్లో లేని నెంబర్ ఎలా గ్రూప్‌లోకి వచ్చిందో తెలుసుకోవడానికి సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని .. విషయంలో తాము ఇలాన్ మస్క్ సహాయం కూడా తీసుకుంటున్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ వెల్లడించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మార్చి 15న యెమెన్‌పై దాడులను ప్రకటించారు. ఇజ్రాయెల్ నౌకలపై దాడుల్ని పునరుద్ధరిస్తామని ప్రకటించిన యెమెన్ తిరుగుబాటు దళం హూతీలపై అమెరికా ఇటీవల పెద్దఎత్తున దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలు, ఉగ్ర నేతలపై తమ దళాలు భీకర దాడులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో 50 మందికి పైగా మృతిచెందగా.. అనేకమంది గాయపడ్డారు.

ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. ఇప్పుడు ఇలా..: రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK)తో మ్యాచ్ సందర్భంగా.. చాలా కాలం తర్వాత హిట్‌మ్యాన్ బ్యాట్ ఝులిపించాడు. సొంత మైదానం వాంఖడేలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ 45 బంతుల్లోనే 76 పరుగులతో అజేయంగా నిలిచాడు.చాలా కాలం తర్వాత ఇలానాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో అజేయ అర్ద శతకంతో జట్టును గెలిపించిన రోహిత్ శర్మను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘‘చాలా కాలం తర్వాత నేను ఇక్కడ నిలుచోగలిగాను. ఫామ్‌లేమి కారణంగా ఒక్కోసారి మనపై మనకే సందేహం కలుగుతుంది. మన పంథాను మార్చుకునేలా చేస్తుంది. కానీ అలాంటపుడే సంయమనంతో ఉండాలి. లేదంటే ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుంది. నా వరకు ఈరోజు ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. అందుకే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆడాలని ముందే నిర్ణయించుకున్నా. మా ప్రణాళికల ప్రకారమే నా ఇన్నింగ్స్ కొనసాగించాను.బంతి నా ఆధీనంలోకి వచ్చినప్పుడు బౌండరీకి తరలించాను. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగడంలో నాకెలాంటి ఇబ్బంది లేదు. ఫీల్డింగ్ వేళ చివరి 2-3 ఓవర్లలో వచ్చినా.. నేరుగా బ్యాటింగ్‌కే దిగినా పెద్దగా తేడా ఏమీ ఉండదు’’ అని పేర్కొన్నాడు.నాకు దక్కిన అరుదైన గౌరవంఅదే విధంగా.. వాంఖడేలో కొత్తగా తన పేరిట ఏర్పాటు చేసిన స్టాండ్ గురించి కూడా రోహిత్ శర్మ ఈ సందర్భంగా స్పందించాడు. ‘‘రోహిత్ శర్మ స్టాండ్‌లోకి బంతిని తరలించడాన్ని ఎంతగానో ఆస్వాదించాను. నాకు దక్కిన అరుదైన గౌరవం ఇది. ఆ పేరును పలికినప్పుడల్లా ఎలా స్పందించాలో కూడా నాకు తెలియడం లేదు.ఏదేమైనా ఈరోజు చివరి వరకు నిలిచి మ్యాచ్‌ను విజయంతో ముగించడం సంతోషంగా ఉంది. నా బాధ్యత కూడా అది. సరైన సమయంలో మేము గెలుపు బాట పట్టాము. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచాం’’ అని రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో చెపాక్‌లో చెన్నై చేతిలో ఓడిన తాజా గెలుపుతో ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ముంబై ఎనిమిదింట నాలుగు మ్యాచ్‌లలో గెలిచి.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు రోహిత్ శర్మ.. ఏడు ఇన్నింగ్స్ ఆడి 158 పరుగులు చేశాడు.ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ చెన్నై స్కోర్లుటాస్: ముంబై.. తొలుత బౌలింగ్చెన్నై స్కోరు: 176/5 (20)ముంబై స్కోరు: 177/1 (15.4)ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసిన ముంబై.చదవండి: IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి A perfect way to wrap a dominant victory and seal back-to-back home wins 💙@mipaltan sign off tonight by winning round 2⃣ against their arch rival 🥳Scorecard ▶ https://t.co/v2k7Y5tg2Q#TATAIPL | #MIvCSK pic.twitter.com/u2BDXfHpXJ— IndianPremierLeague (@IPL) April 20, 2025

వదినమ్మకు చెప్పారా? అసలు ఒప్పుకుంటుందా?
మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న ఓ పరిణామం.. దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. రెండు దశాబ్దాలుగా రాజకీయ విరోధులుగా ఉన్న సోదరులు ఉద్దవ్ థాక్రే, రాజ్ థాక్రేలు కలిసి పోనున్నారనేది ఆ వార్త సారాంశం. అయితే ఈ కలయిక ప్రచారాన్ని బీజేపీ ఇప్పుడు ఎద్దేవా చేస్తోంది.ముంబై: యూబీటీ సేన-ఎంఎన్ఎస్ పొత్తు అవకాశాలపై ఓ హిందీ న్యూస్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ నారాయణ్ రాణే(Nitesh Narayan Rane) ఈ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఎంఎన్ఎస్తో థాక్రే శివసేన చేతులు కలపబోతోందా?. ఈ విషయంలో తన భార్య రష్మీ థాక్రే(Rashmi Thackeray) అనుమతి తీసుకున్నారో లేదో?. ఈ విషయాన్ని ఉద్దవ్ థాక్రేను మీరే(న్యూస్ యాంకర్‌ను ఉద్దేశించి..) అడగాలి. ఇలాంటి నిర్ణయాల్లో ఆమె భాగస్వామ్యమే ఎక్కువ అనే విషయం ఆయన మరిచిపోవొద్దు’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.శివసేన నుంచి రాజ్ థాక్రే(Raj thackeray) నిష్క్రమణకు రష్మీనే కారణమన్న రాణే.. ఆ సమయంలో సోదరుల మధ్య ఎలాంటి విబేధాలు లేవనే విషయాన్ని ప్రస్తావించారు. మహారాష్ట్ర ప్రజలు మయూతీ కూటమికి అఖండ విజయం కట్టబెట్టారని.. కాబట్టి ఎంఎన్ఎస్, యూబీటీ శివసేన పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా.. ఇక్కడి రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపించబోదని నితీశ్ రాణే అన్నారు.ఈ క్రమంలో ఏక్నాథ్ షిండే-రాజ్ థాక్రే విందు సమావేశంపైనా రాణేకు ప్రశ్న ఎదురైంది. షిండేకు బాల్ థాక్రే కుటుంబానికి దశాబ్దాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా రాజ్ థాక్రేను బాల్ థాక్రేకు అంశగా షిండే భావిస్తుంటారు. అంతేగానీ వాళ్ల భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నది కాదు అని రాణే అన్నారు. మహారాష్ట్ర ప్రజలు, మరాఠీ భాష ప్రయోజనాల కోసం ఉద్ధవ్ థాక్రేతో కలిసి పని చేసేందుకు సిధ్ధమని ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే ఇటీవల ప్రకటించారు. ఇందుకు ఉద్ధవ్ థాక్రే కూడా సానుకూలంగా స్పందించడంతో ఇరువురు ఏకం కానున్నారనే వార్తలు విస్తృతమయ్యాయి. అయితే దీనిపై తాజాగా యూబీటీ సేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) మాట్లాడుతూ.. రాజకీయ పొత్తుకు సంబంధించి ఎటువంటి సంప్రదింపులు జరగలేదని, కేవలం వీరి మధ్య భావోద్వేగ చర్చలు మాత్రమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: నా బద్ధ శత్రువుకి కూడా ఈరోజు రాకూడదు

దిగ్గజ బ్యాంక్ కీలక నిర్ణయం: మారిన ఏటీఎం ఛార్జీలు
దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన.. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల అనుగుణంగానే ఈ ఛార్జీలను పెంచడం జరిగిందని స్పష్టం చేసింది. కొత్త ఛార్జీలు 2025 మే 1నుంచి అమలులోకి వస్తాయి.మే 1 నుంచి ప్రతి లావాదేవీకి రూ.23 వసూలు చేయనున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. గతంలో ఈ ఛార్జ్ రూ. 21గా ఉండేది. ఈ ఛార్జీలు నెలవారీ ఫ్రీ విత్‌డ్రా లిమిట్ పూర్తయిన తరువాత మాత్రమే వర్తిస్తుంది. ఛార్జీల పెరుగుదల విషయాన్ని బ్యాంక్ ఇప్పటికే.. కస్టమర్లకు మెయిల్స్ ద్వారా పంపింది.ఏటీఎంలలో నిర్వహించే ఆర్ధిక లావాదేవీలకు, ఆర్థికేతర లావాదేవీళ్లకులకు & కోటక్ మహీంద్రా బ్యాంక్ మెషీన్లలో అయినా లేదా ఇతర బ్యాంకులకు సంబంధించిన మెషీన్లలో అయినా.. ఫ్రీ ఏటీఎం లావాదేవీల లిమిట్ దాటితే.. ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్మెంట్ వంటి వాటికోసం వరుసగా రూ. 8.50, రూ. 10 ఛార్జీలు వసూలు చేయనున్నారు.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం నుంచి కస్టమర్ రోజుకు గరిష్టంగా రూ. 1,00,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం కోటక్ ఎడ్జ్, ప్రో, ఏస్ ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈజీ పే ఖాతాదారుడు రూ. 25,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మరికొన్ని డెబిట్ కార్డులను కలిగి ఉన్న కస్టమర్లు రూ. 50వేలు వరకు విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది.

నీ భార్య క్షమాపణ చెప్పాలి.. మరో హీరోకు బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరిక
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్(Lawrence Bishnoi) నుంచి బాలీవుడ్‌కు చెందిన మరో హీరోకు హత్య బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లే నటుడు అభినవ్ శుక్లా( Abhinav Shukla)ఇంటిపై కూడా దాడులు జరుపుతామంటూ బెదిరింపులకు దిగారు. త్వరలో చంపేస్తామంటూ ఒక హెచ్చరికతో మెసేజ్ పంపారు. అయితే, ఈ మెసేజ్‌ను సోషల్‌మీడియా యూజర్ పంపినట్లు తెలుస్తోంది. తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కోసం పనిచేస్తున్నాని ఈ హెచ్చరికలు వారికి జారీ చేశాడు.కారణం ఇదే..నటుడు అభినవ్ శుక్లా సతీమణి రుబీనా వల్లే ఈ వార్నింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ టీవీలో ప్రసారం అయ్యే 'బాటిల్‌గ్రౌండ్' షోలో ఆమె పాల్గొంది. అయితే, ఆ షో కొనసాగుతున్న మధ్యలో రాపర్ ఆసిమ్ రియాజ్‌తో ఆమెకు గొడవ అయింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది. అది జరిగిన కొన్ని గంటల్లోనే ఈ బెదిరింపుల మెసేజ్ వచ్చింది. ఎపిసోడ్ ప్రసారం అయిన వెంటనే.. ఆమెతో పాటు అభినవ్‌ను ఆన్లైన్లో లక్ష్యంగా చేసుకుని భారీగా వార్నింగ్స్ వచ్చాయి. వారికి వచ్చిన మెసేజ్‌లను శుక్లా తన సోషల్‌మీడియా హ్యాండిల్లో వరుస స్క్రీన్షాట్లు, వీడియోలను పంచుకున్నారు, అందులో అంకుష్ గుప్తా అనే వ్యక్తి ఈ బెదిరింపు మెసేజ్ పంపినట్లు కనిపిస్తోంది.అభినవ్ శుక్లా దంపతులకు పంపిన ఆ మెసేజ్ ఇలా ఉంది. 'నేను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి వచ్చాను. మీ చిరునామా నాకు తెలుసు. నేను రావాలా..? సల్మాన్ ఖాన్‌పై కాల్పులు జరిపినట్లే, నేను మీ ఇంటికి వచ్చి AK-47తో మిమ్మల్ని కాల్చివేస్తాను. ఇది మీ చివరి హెచ్చరికగా భావించండి. ఆసిమ్‌కు వెంటనే క్షమాపణలు చెప్పండి. అలా జరగలేదంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. లారెన్స్ బిష్ణోయ్ ఆసిమ్‌కు అండగా నిలుస్తాడు. ఆసిమ్ మా గ్యాంగ్ మనిషి' అని ఉంది. వార్నింగ్ ఇచ్చిన వ్యక్తిది చండీగఢ్‌లా ఉందని అభినవ్ తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పుకొచ్చాడు.

Kerala Tour అరేబియా తీరం, హౌస్‌బోట్ విహారం
టెక్నాలజీతో రూపుదిద్దుకున్న రామాయణ ఘట్టం ఉంది.అరేబియా తీరాన కొలువుదీరిన అతిపెద్ద గంగాధరుడున్నాడు.అనంత సంపన్నుడు అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు. భారతీయ మూర్తులకు పశ్చిమ రంగులద్దిన రవివర్మ ఉన్నాడు.కేరళ సిగ్నేచర్ హౌస్‌బోట్ విహారం ఉంది... కథకళి...కలరిపయట్టు విన్యాసాలూ ఉన్నాయి.టీ తోటలు... మట్టుపెట్టి డ్యామ్ బ్యాక్ వాటర్స్...ఇవే కాదు... ఇంకా చాలా చూపిస్తోంది ఐఆర్సీటీసీ. మొదటి రోజుత్రివేండ్రమ్ ఎయిర్పోర్ట్ లేదా రైల్వే స్టేషన్, కొకువెలి రైల్వేస్టేషన్ల నుంచి పికప్ చేసుకుని బస చేయాల్సిన హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్ త్రివేండ్రమ్ లేదా కోవళమ్‌లలో ఉంటుంది. సాయంత్రం కోవళం బీచ్, అళిమల శివుని విగ్రహాన్ని దర్శించుకుని విశ్రాంతి తీసుకోవడమే. రెండో రోజుఉదయం త్రివేండ్రమ్‌లోని పద్మనాభస్వామి ఆలయ దర్శనం. జటాయు ఎర్త్ సెంటర్‌ని చూసిన తర్వాత ప్రయాణం కుమర్‌కోమ్ వైపు సాగుతుంది. ఈ ప్యాకేజ్ పేరుతో ఉన్న హౌస్‌బోట్ విహారం ఇక్కడ మొదలవుతుంది. కుమర్‌కోమ్ లేదా అలెప్పీలో క్రూయిజ్‌లోకి మారాలి. రాత్రి భోజనం, బస, ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అన్నీ హౌస్‌బోట్‌లోనే.తెరవని ఆరవ గదిత్రివేండ్రమ్... ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన అనంత పద్మనాభ స్వామి వల్ల ఈ పేరు విశ్వవ్యాప్తంగా ప్రచారం సంతరించుకుంది. ఈ నగరానికి ఆ పేరు వచ్చింది కూడా అనంత పద్మనాభ స్వామి వల్లనే. తిరు అనంత పురం... క్రమంగా మలయాళీల వ్యవహారంలో తిరువనంతపురం అయింది. బ్రిటిష్ వారి వ్యవహారంలో త్రివేండ్రమ్‌గా మారింది. ఇక్కడ పద్మనాభ స్వామి ఆలయంలో తెరవని ఆరో గది ఇప్పటికీ ఆసక్తికరమే. నాగబంధంతో మూసిన ఆ గదిని తెరవడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పద్మనాభ స్వామి ఆలయ దర్శనంలో ఈ గదిని తప్పనిసరిగా చూడాలి. ఇక త్రివేండ్రమ్ అనగానే గుర్తొచ్చే మరో పేరు రాజా రవి వర్మ. భారతీయ దేవతల చిత్రాలకు కొత్తరంగులద్దిన ట్రావెన్కోర్ రాజవంశానికి చెందిన రవివర్మ నివాసాన్ని కూడా చూడవచ్చు.జటాయు ఎర్త్ సెంటర్... ఇది ఒక థీమ్ పార్క్. జటాయు పక్షి ఆకారంలో నిర్మించారు. రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించిన సమయంలో రావణుడితో పోరాడి ప్రాణాలు వదిలిన పక్షి జటాయు. ఆ పక్షి రావణుడితో యుద్ధం చేసి నేలకొరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఈ పార్క్‌ను పశ్చిమ కనుమల్లో ఓ కొండ మీద 65 ఎకరాల్లో నిర్మించారు. ఈ కొండమీదకు వెళ్లడానికి ఎనిమిది వందలకు పైగా మెట్లెక్కాలి. కేబుల్‌కార్ కూడా ఉంది. ఆరోగ్యవంతులు ఎక్కగలిగిన కొండే అయినప్పటికీ బయటి ప్రదేశాల నుంచి పర్యటన కోసం వచ్చిన వాళ్లు టైమ్ వేస్ట్ చేసుకోకుండా పశ్చిమ కనుమల సౌందర్యాన్ని వీక్షిస్తూ కేబుల్ కార్లో వెళ్లడమే మంచిది. వెకేషన్ కోసం వెళ్లి నాలుగైదు రోజులు బస చేసేవాళ్లు ఒక రోజు కొండ ఎక్కడాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ ప్యాస్టిక్‌ని అనుమతించరు.మూడో రోజుఅలెప్పీ నుంచి మునార్‌కు ప్రయాణం. రోడ్డు మార్గాన మునార్‌కు చేరాలి. మధ్యలో పునర్జనిలో కేరళ సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించాలి. రాత్రి బస మునార్‌లో.కలరిపయట్టు... కథకళి చూద్దాం!పునర్జని ట్రెడిషనల్ విలేజ్... కేరళ సంప్రదాయ కళల ప్రదర్శన వేదిక. అలాగే ఆయుర్వేద చికిత్సల నిలయం కూడా. మునార్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రోజూ సాయంత్రం ఆరు గంటలకు కథకళి నాట్యం, కలరిపయట్టు యుద్ధకళా విన్యాసాలను ప్రదర్శిస్తారు. రిలాక్సేషన్ థెరపీలు ఐదు నుంచి పదిహేను వేలు చార్జ్ చేస్తారు. అవి ఈ ప్యాకేజ్‌లో వర్తించవు. నాలుగో రోజురోజంతా మునార్‌లోనే. ఎరవికులమ్ నేషనల్ పార్క్ పర్యటన, టీ మ్యూజియం, మట్టుపెట్టి డ్యామ్, ఎఖో పాయింట్, కుందల డ్యామ్ లేక్‌లో విహరించిన తర్వాత రాత్రి బస మునార్‌లోనే.మునార్ టీ తోటల మధ్య విహారం, ఝుమ్మనే వాటర్ ఫాల్స్ ను దూరం నుంచే చూస్తూ ముందుకు సాగిపోవడంతోపాటు టీ మ్యూజియం సందర్శన బాగుంటుంది. మట్టుపెట్టి డ్యామ్, రిజర్వాయర్ చుట్టూ విస్తరించిన టీ తోటల దృశ్యం కనువిందు చేస్తుంది. ఎరవికులమ్ నేషనల్ పార్క్ విజిట్ మరిచిపోలేని అనుభూతి. నీలగిరుల్లో పన్నెండేళ్లకోసారి పూచే నీలకురింజి పువ్వు దట్టంగా పూసేది ఇక్కడే. నీలకురింజి మళ్లీ పూసేది 2030లో. కానీ ఎక్కడో ఓ చోట ఒకటి రెండు గుత్తులు కనిపిస్తాయి. గైడ్లు వాటిని చూపించి కొండ మొత్తం పూసినప్పుడు దృశ్యం ఎలా ఉంటుందో ఫొటోలు చూపిస్తారు. అయిదో రోజుమునార్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి కొచ్చి వైపు సాగిపోవాలి. కొచ్చిలో హోటల్ చెక్ ఇన్. మెరైన్ డ్రైవ్‌ను ఎంజాయ్ చేసిన తర్వాత షాపింగ్ తర్వాత నైట్ స్టే.కొచ్చిలో షాపింగ్ చేయడం మొదలు పెడితే మన లగేజ్ పెరిగిపోతుంది. లవంగాలు, యాలకులు, మిరియాల వంటివి చక్కటి ఘాటు వాసనతో స్వచ్ఛంగా ఉంటాయి. టూర్ గుర్తుగా కేరళ చీర ఒక్కటైనా కొనుక్కోవాలి. అవి బాగా మన్నుతాయి కూడా! స్థానిక హస్తకళాకృతులకు కొదవే ఉండదు. కోకోనట్ కాయిర్‌తో చేసిన గృహోపకరణాలు కూడా బాగుంటాయి. కథకళి సావనీర్లు తెచ్చుకోవచ్చు. ఆయుర్వేద తైలాల పేరుతో దొరికేవన్నీ స్వచ్ఛమైనవి కాదు, నకిలీలు కూడా ఉంటాయి. వీటిని గవర్నమెంట్ ఆథరైజ్డ్ స్టోర్లలో మాత్రమే కొనాలి. షాపింగ్ చేసేటప్పుడు ఫ్లయిట్లో లగేజ్ బరువు పరిమితిని దృష్టిలో ఉంచుకోవాలి. వెళ్లేటప్పుడు ఫ్లయిట్, తిరిగి వచ్చేటప్పుడు ట్రైన్లో ప్రయాణం చేస్తే లగేజ్ బరువు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. ఆరో రోజుకొచ్చిలో హోటల్ చెక్ అవుట్ చేసి, కొచ్చి లోని డచ్ ప్యాలెస్ సందర్శనం. యూదుల సినగోగ్ (ధార్మిక సమావేశ మందిరం), సర్ ఫ్రాన్సిస్ చర్చ్, సాంటా క్రాజ్ బాసిలికా పర్యటన తర్వాత కొచ్చి ఎయిర్ పోర్ట్ లేదా ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడంతో టూర్ పూర్తవుతుంది. కొచ్చి, ఎర్నాకుళం మన హైదరాబాద్– సికింద్రాబాద్ వంటి జంట నగరాలు. ఎయిర్΄ోర్టు కొచ్చిలో ఉంది, రైల్వే స్టేషన్ ఎర్నాకుళంలో ఉంది.వాస్కోడిగామా రాక ఫలితం!డచ్ ప్యాలెస్... అనగానే పాశ్చాత్య నిర్మాణశైలిని ఊహిస్తాం. కానీ ఇది పూర్తిగా కేరళ సంప్రదాయ నాలుకేట్టు నిర్మాణశైలిలో ఉంటుంది. పోర్చుగీసు వాళ్లు నిర్మించడం వల్ల డచ్ ప్యాలెస్‌గా అనే పేరు వచ్చింది. ఇది కొచ్చి నగరానికి సమీపంలోని మత్తన్ చెర్రి అనే ప్రదేశంలో ఉండడంతో స్థానికులు మత్తన్‌చెర్రి ప్యాలెస్ అనే పిలుస్తారు. వాస్కోడిగామా మనదేశంలో కేరళతీరం, కొచ్చి రాజ్యం, కప్పడ్ దగ్గర ప్రవేశించాడు. కొచ్చి రాజు అతడికి సాదర స్వాగతం పలికాడు. మనదేశం బ్రిటిష్ వలస పాలనలోకి వెళ్లడానికి దారులు వేసిన ఒక కారణం ఇది. ఈ ప్యాలెస్ భవనాల సముదాయం హెరిటేజ్ సైట్ల జాబితా కోసం యునెస్కో పరిశీలనలో ఉంది. ఈ ప్యాలెస్ లోపల నాటి చిత్రరీతుల ప్రదర్శన ఉంది.యూదులు వచ్చారు!మత్తన్‌చెర్రిలో డచ్ ప్యాలెస్ పక్కనే యూదు మతస్థుల ధార్మిక సమావేశ మందిరం సినగోగ్ కూడా ఉంది. ఇది కూడా డచ్ ప్యాలెస్ నాటి 16వ శతాబ్దం నాటి నిర్మాణమే. పశ్చిమం నుంచి మనదేశానికి అరేబియా సముద్రం మీదుగా జలమార్గాన్ని కనుక్కున్న తర్వాత పాశ్చాత్య దేశాలతో వర్తక వాణిజ్యాలు ఊపందుకున్నాయి. వర్తకులు, నౌకాయాన ఉద్యోగులు తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకోవడం మొదలైంది. అలా స్పెయిన్, పోర్చుగల్ నుంచి వచ్చిన వారిలో కొంతమంది ఇక్కడే స్థిరపడ్డారు. ఆ కాలనీలు క్రమంగా వారి మత విశ్వాసాలను కొనసాగించడానికి మందిరాలు కట్టుకున్నారు. అలాంటిదే ఇది కూడా. ఈ సినగోగ్ క్రిస్టల్ షాండ్లియర్లతో అందంగా ఉంటుంది. తమ మత సంప్రదాయాలను గౌరవిస్తూ భారతదేశంలో భారతీయులుగా మమేకమయ్యారు. ‘వింగ్స్ ఆఫ్ జటాయు విత్ హౌస్‌బోట్’... ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజ్. ఇందులో త్రివేండ్రమ్, అలెప్పీ, మునార్, కొచ్చి ప్రదేశాలు కవర్ అవుతాయి. నీలగిరి తార్కు ప్రసూతి సమయం కావడంతో మునార్‌లోని ఎరవికులమ్ నేషనల్ పార్క్‌ను ఏప్రిల్ 1 వరకు క్లోజ్ చేశారు. ప్రస్తుతం పర్యాటకులను అనుమతిస్తున్నారు. కాబట్టి ‘వింగ్స్ ఆఫ్ జటాయు విత్ హౌస్‌బోట్’ టూర్‌కి ఇది అనువైన సమయం.కంఫర్ట్ కేటగిరీలో సింగిల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి దాదాపుగా 57 వేల రూపాయలవుతుంది. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 30 వేలవుతుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 23 వేలవుతుంది. పిల్లలకు విడిగా బెడ్ తీసుకుంటే తొమ్మిది వేలు, బెడ్ తీసుకోకపోతే దాదాపుగా ఐదు వేల ఐదు వందలు. టూర్లో ఏసీ వాహనంలో ప్రయాణం, ట్రావెల్ ఇన్సూ్యరెన్స్, మార్గమధ్యంలో టోల్ ఫీజులు, పార్కింగ్ ఫీజులు, ప్యాకేజ్‌లో చెప్పిన ప్రదేశాల్లో ఎంట్రీ టికెట్లు, హోటల్ గది బస, హౌస్‌బోట్‌లో బస, నాలుగు బ్రేక్‌ఫాస్ట్‌లు, హౌస్‌బోట్‌లో లంచ్, డిన్నర్ ఈ ప్యాకేజ్‌లో ఉంటాయి.ప్యాకేజ్‌లో మన ప్రదేశం నుంచి త్రివేండ్రమ్‌కు చేరడం, కొచ్చి లేదా ఎర్నాకుళం నుంచి ఇంటికి రావడానికి అయ్యే రైలు లేదా విమాన ఖర్చులు వర్తించవు. త్రివేండ్రమ్‌లో రిసీవ్ చేసుకోవడం నుంచి కొచ్చిలో వీడ్కోలు పలకడం వరకే ఈ ప్యాకేజ్. ఇటీవల పర్యాటకులు యూ ట్యూబ్ వీడియోల కోసం ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా హౌస్‌బోట్ ప్రయాణంలో నిర్వహకుల సూచనలను విధిగా పాటించాలి.ఈ టూర్‌లోని పర్యాటక ప్రదేశాల్లో మునార్ టీ మ్యూజియానికి సోమవారం సెలవు, కొచ్చిలోని డచ్ ప్యాలెస్ శుక్రవారం, యూదుల సినగోగ్‌కి శనివారం సెలవు. వీటిలో ఒకటి – రెండు మిస్ కాక తప్పదు. విమానాశ్రయంలో దేవుని ఊరేగింపు!త్రివేండ్రమ్ చేరడానికి విమానంలో వెళ్లడం వల్ల బోనస్ థ్రిల్ ఉంటుంది. పద్మనాభస్వామి ఊరేగింపు కోసం విమానాలు ల్యాండింగ్ ఆపేస్తారు. ఏడాదికి రెండు దఫాలు ఈ విచిత్రం చోటు చేసుకుంటుంది. ఏప్రిల్ నెలలో పైన్కుని పండుగ సందర్భంగా జరిగే పది రోజుల వేడుకలో చివరి రోజు ఆరట్టు (సముద్రస్నానం) కోసం పద్మనాభ స్వామి ఊరేగింపు ఆలయం నుంచి షంగుముగమ్ బీచ్ వరకు ఆరు కిలోమీటర్ల దూరం సాగుతుంది. అలాగే అక్టోబర్ లేదా నవంబర్ నెలలో అల్పఱి పండుగ వేడుకల సందర్భంగా కూడా రన్‌వేని మూసివేస్తారు. ఎందుకంటే విమానాశ్రయం రన్‌వే ఈ దారిలోనే ఉంది. విమానాశ్రయాన్ని నిర్మించేటప్పుడే (1932 ) ప్రభుత్వం విధించిన నియమం ఇది. ఈ మేరకు ఏడాదిలో రెండుసార్లు ఇక్కడ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ తీసుకోవు. పండుగకు రెండు నెలల ముందే ఆలయ ట్రస్ట్ బోర్డు వేడుకల షెడ్యూల్‌ను ఎయిర్పోర్ట్ అథారిటీకి తెలియచేస్తుంది. ఆ మేరకు ఏ తేదీన ఏ సమయంలో ఎయిర్΄ోర్ట్ రన్‌వేను మూసివేయనున్నారనే సమాచారం అక్కడ రాకపోకలు సాగించే విమానాల సంస్థలకు అందుతుంది. ఇది ప్రపంచవింత కాదు కానీ విచిత్రం. -వాకా మంజులా రెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

ఈసీ కాదు.. ముస్లిం కమిషనర్.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ: ఇటీవలి కాలంలో బీజేపీ ఎంపీలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో, ఎంపీల వ్యాఖ్యల దుమారం హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. ఇంతకుముందు, సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంటు భవనాన్ని మూసుకోవాల్సిందే అంటూ నిశికాంత్ దూబే చేసిన వ్యాఖ్యల వేడి తగ్గకముందే.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తాజాగా మాజీ చీఫ్ ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో దూబే మాట్లాడుతూ..‘ఖురేషీ సీఈసీగా ఉన్నప్పుడు జార్ఖండ్‌లోని సంతాల్ పరగణాలో బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఓటర్ గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఆయన ఎన్నికల కమిషనర్ కాదు.. ముస్లిం కమిషనర్. చరిత్ర ప్రకారం క్రీ.శ 712 సంవత్సరంలో దేశంలోకి ఇస్లాం ప్రవేశించిందని, అప్పటిదాకా ఈ భూభాగం అంతా హిందువులు, గిరిజనులు, జైనులు, బౌద్ధులదే. అంతేకాదు, దేశాన్ని ఐక్యంగా ఉంచండి. చరిత్రను చదవండి. అప్పట్లో దేశాన్ని విభజించి పాకిస్థాన్‌ను సృష్టించారు. ఇకపై విభజన ఉండదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే,ర నిశికాంత్ దూబే జార్ఖండ్‌లోని గోడ్డా లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు సుప్రీంకోర్టును టార్గెట్ చేసిన దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంటు భవనాన్ని మూసుకోవాల్సిందే అన్నారు. పార్లమెంటు శాసనాధికారాల్లోకి న్యాయస్థానాలు చొరబడుతున్నాయని, చట్టసభ్యులు చేసిన చట్టాలను కొట్టివేస్తున్నాయని విమర్శించారు. జడ్జీలను నియమించే అధికారం ఉన్న రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఆదేశాలిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో అధికరణం 368 ప్రకారం చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందన్నారు. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగలదని, పార్లమెంటుకు మాత్రం కాదని తెలిపారు. పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ (సవరణ) బిల్లు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.Muslim Commissioner: BJP's Nishikant Dubey now targets former poll panel chiefNishikant Dubey criticises former poll panel chief over Waqf ActAccuses SY Quraishi of legitimising #BangladeshiInfiltratorsBJP distanced itself from Dubey's remarks on judiciary pic.twitter.com/Q1zhgZBL4X— The Contrarian 🇮🇳 (@Contrarian_View) April 20, 2025
ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?
భారత్ చేరుకున్న జేడీ వాన్స్ దంపతులు.. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
బాబు మాటల్లో నిజం.. నేతిబీర చందమే!
Kerala Tour అరేబియా తీరం, హౌస్‌బోట్ విహారం
ముంబై జెర్సీలో రాధికా మర్చంట్.. రోహిత్ ఫిఫ్టీ కొట్టగానే అనంత్ అంబానీతో కలిసి..
నాకు నువ్వు వద్దు!
దిగ్గజ బ్యాంక్ కీలక నిర్ణయం: మారిన ఏటీఎం ఛార్జీలు
Viral: చిన్నారిని రక్షించిన ఈ రియల్ హీరో ఏమన్నాడంటే..
ఓటీటీలో రొమాంటిక్ సినిమా.. రూ. 1900 కోట్ల కలెక్షన్స్‌తో రికార్డ్
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
నా పని నన్ను చేసుకోనివ్వండి -ట్రంప్
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
Smita Sabharwal: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి
రిక్కీ అంత సులభంగా గన్ షాట్‌కి ఎలా దొరికాడు?
ఊరూపేరు లేని 'ఉర్సా'
మెగా డీఎస్సీలో మెలిక!
రాజకీయాలు నాకు ఫుల్ టైం జాబ్ కాదు- యోగీ ఆధిత్యనాథ్
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
మూతపడిన జిందాల్ స్టీల్స్
కర్ణాటక మాజీ డీజీపీ హత్య..?
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
నిశ్చితార్థం వేళ.. చితి మంటల ఘోష!
పెళ్లిని నమ్మనన్న త్రిష.. రెండు పెళ్లిళ్లు అందుకే నన్న కమల్
హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
కోత కోసి.. పూత పూసి..
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
‘ప్రవీణ్ పగడాల పోస్ట్‌మార్టం రిపోర్టుపై ఎన్నో అనుమానాలు?’
ఈసీ కాదు.. ముస్లిం కమిషనర్.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
భార్య మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. అక్కడ ఫొటో చూసి భర్త..
నీ భార్య క్షమాపణ చెప్పాలి.. మరో హీరోకు బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరిక
రాష్ట్రమంతా ‘నెట్టిల్లు’
వదినమ్మకు చెప్పారా? అసలు ఒప్పుకుంటుందా?
ప్రకృతి ప్రకోపం: ‘ఒక్కరాత్రిలోనే సర్వస్వం కోల్పోయాం’
చైనాపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్‌కు గోల్డెన్ ఛాన్స్!
IPL 2025: రోహిత్, సూర్యకుమార్ విధ్వంసం.. చెన్నైను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
ప్రమాదంలో మిడిల్ క్లాస్ ఉద్యోగాలు!
బైరెడ్డి శబరి.. చెల్లని ఎంపీ!
‘యెమెన్ లీక్ ఎపిసోడ్’లో బిగ్ ట్విస్ట్
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
కొత్త పన్ను విధానం 'మార్పు' మంచిదే !
PBKS VS RCB: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన కోహ్లి
సినీ నటిని మోసగించిన 'ప్రేమిస్తే' నటుడు
50 ఏళ్ల 'సింగిల్' హీరోయిన్.. కానీ ప్రెగ్నెన్సీ రూమర్స్
నా బద్ధ శత్రువుకు కూడా ‘ఈ రోజు’ రాకూడదు!
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
పెళ్లి చేసుకున్న 'బిగ్ బాస్' జంట.. మూడేళ్ల ప్రేమ
డోంట్ వర్రీ సార్! ఇలా అయితేనే మీ టార్గెట్ పూర్తవుతుంది!
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
భారీ విశ్వంభర
MI VS CSK: సూర్యవంశీ తరహాలో ఇరగదీసిన ఆయుశ్ మాత్రే.. అరంగేట్రంతో రికార్డు
మనకు 'పుష్ప' మాదిరే.. కోలీవుడ్‌లో కెప్టెన్ ప్రభాకరన్ ఉన్నాడు
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
నిశ్చితార్థంలో కాబోయే భార్య చేసిన పనికి.. పెళ్లిరోజే వరుడు షాకింగ్ నిర్ణయం
మీ రైస్‌లో ఆర్సెనిక్ ఉందా!?
జెన్సోల్.. ఓ ఉత్తుత్తి కంపెనీ!
ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. ఇప్పుడు ఇలా..: రోహిత్ శర్మ
బెట్టింగ్ యాప్స్‌లో గెలిచిన డబ్బులు తీసుకోలేని పరిస్థితి..!
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
చోరీ చేశారు.. అమ్మలేక దొరికారు
నేడే సతీసమేతంగా జె.డి.వాన్స్ రాక
ఓటీటీలో రొమాంటిక్ సినిమా.. రూ. 1900 కోట్ల కలెక్షన్స్‌తో రికార్డ్
వివాహేతర సంబంధం.. వాట్సప్ స్టేటస్‌లో ప్రియురాలి ఫొటో..
తూటాకు బలైన భారతీయ విద్యార్థిని
విశ్రాంత డీజీపీ దారుణ హత్య
బ్యాంకులకు నేడు సెలవు ఉందా?
డేటింగ్లో స్టార్ హీరోయిన్ సోదరి.. ప్రియుడికి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్!
నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆ సినిమా చేయడమే: ప్రియదర్శి
Hyderabad: ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
యెమెన్ పోర్టుపై మళ్లీ అమెరికా దాడులు
విశ్వమూ భ్రమిస్తోంది
చల్లటి కబురు!
Viral: చిన్నారిని రక్షించిన ఈ రియల్ హీరో ఏమన్నాడంటే..
ఏటా కోటి పెళ్లిళ్లుమన వివాహ మార్కెట్ రూ.11 లక్షల కోట్లు
డొనాల్డ్ ట్రంప్‌పై ప్రజాగ్రహం
ఆ వయస్సు దాటితే హీరోయిన్గా కష్టమే: దియా మీర్జా ఆసక్తికర కామెంట్స్
బీజేపీ వివరణ రాజకీయ వంచన
అమ్మా, నాన్న క్షమించండి.. ప్రపంచం నుంచి వెళ్లిపోతున్నా!
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
ఉపాధి హామీ పనులు.. 17జిల్లాలు అప్.. 15జిల్లాలు డౌన్..
RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లు
Hyderabad Zoo సందర్శన టికెట్ రేట్లు పెరిగినా..తగ్గని ఆదరణ
మ్యాడ్ సినిమాతో ఫేమ్.. నటుడిపై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు!
అందంగా లేదని చిత్రహింసలు
22న వైఎస్సార్సీపీ పీఏసీ సమావేశం
'భారత్ మూడేళ్ళలో ఆ దేశాలను అధిగమిస్తుంది'
Mukesh Ambani Birthday ముఖేష్ అంబానీ బర్త్‌డే బాష్, ఇదే హైలైట్!
క్షేమంగా ఊరికి పంపిస్తామని.. కాటేశారు
బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
పుట్టి.. మళ్లీ కడుపులోకి వెళ్లి.. మళ్లీ పుట్టి
ఆ డైరెక్టర్‌తో తిరుమలకు సమంత.. వీడియో వైరల్!
కంగారు పడకు! నేనే ఈ సారి ఎండలు కాస్త ఎక్కవగా ఉన్నాయ్!
హైడ్రోజన్ బాంబ్‌ను పరీక్షించిన చైనా
‘తెలంగాణలో జనజాతర.. ఇది మన జాతర’
ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?
భారత్ చేరుకున్న జేడీ వాన్స్ దంపతులు.. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
బాబు మాటల్లో నిజం.. నేతిబీర చందమే!
Kerala Tour అరేబియా తీరం, హౌస్‌బోట్ విహారం
ముంబై జెర్సీలో రాధికా మర్చంట్.. రోహిత్ ఫిఫ్టీ కొట్టగానే అనంత్ అంబానీతో కలిసి..
నాకు నువ్వు వద్దు!
దిగ్గజ బ్యాంక్ కీలక నిర్ణయం: మారిన ఏటీఎం ఛార్జీలు
Viral: చిన్నారిని రక్షించిన ఈ రియల్ హీరో ఏమన్నాడంటే..
ఓటీటీలో రొమాంటిక్ సినిమా.. రూ. 1900 కోట్ల కలెక్షన్స్‌తో రికార్డ్
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
నా పని నన్ను చేసుకోనివ్వండి -ట్రంప్
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
Smita Sabharwal: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి
రిక్కీ అంత సులభంగా గన్ షాట్‌కి ఎలా దొరికాడు?
ఊరూపేరు లేని 'ఉర్సా'
మెగా డీఎస్సీలో మెలిక!
రాజకీయాలు నాకు ఫుల్ టైం జాబ్ కాదు- యోగీ ఆధిత్యనాథ్
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
మూతపడిన జిందాల్ స్టీల్స్
కర్ణాటక మాజీ డీజీపీ హత్య..?
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
నిశ్చితార్థం వేళ.. చితి మంటల ఘోష!
పెళ్లిని నమ్మనన్న త్రిష.. రెండు పెళ్లిళ్లు అందుకే నన్న కమల్
హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
కోత కోసి.. పూత పూసి..
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
‘ప్రవీణ్ పగడాల పోస్ట్‌మార్టం రిపోర్టుపై ఎన్నో అనుమానాలు?’
ఈసీ కాదు.. ముస్లిం కమిషనర్.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
భార్య మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. అక్కడ ఫొటో చూసి భర్త..
నీ భార్య క్షమాపణ చెప్పాలి.. మరో హీరోకు బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరిక
రాష్ట్రమంతా ‘నెట్టిల్లు’
వదినమ్మకు చెప్పారా? అసలు ఒప్పుకుంటుందా?
ప్రకృతి ప్రకోపం: ‘ఒక్కరాత్రిలోనే సర్వస్వం కోల్పోయాం’
చైనాపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్‌కు గోల్డెన్ ఛాన్స్!
IPL 2025: రోహిత్, సూర్యకుమార్ విధ్వంసం.. చెన్నైను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
ప్రమాదంలో మిడిల్ క్లాస్ ఉద్యోగాలు!
బైరెడ్డి శబరి.. చెల్లని ఎంపీ!
‘యెమెన్ లీక్ ఎపిసోడ్’లో బిగ్ ట్విస్ట్
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
కొత్త పన్ను విధానం 'మార్పు' మంచిదే !
PBKS VS RCB: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన కోహ్లి
సినీ నటిని మోసగించిన 'ప్రేమిస్తే' నటుడు
50 ఏళ్ల 'సింగిల్' హీరోయిన్.. కానీ ప్రెగ్నెన్సీ రూమర్స్
నా బద్ధ శత్రువుకు కూడా ‘ఈ రోజు’ రాకూడదు!
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
పెళ్లి చేసుకున్న 'బిగ్ బాస్' జంట.. మూడేళ్ల ప్రేమ
డోంట్ వర్రీ సార్! ఇలా అయితేనే మీ టార్గెట్ పూర్తవుతుంది!
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
భారీ విశ్వంభర
MI VS CSK: సూర్యవంశీ తరహాలో ఇరగదీసిన ఆయుశ్ మాత్రే.. అరంగేట్రంతో రికార్డు
మనకు 'పుష్ప' మాదిరే.. కోలీవుడ్‌లో కెప్టెన్ ప్రభాకరన్ ఉన్నాడు
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
నిశ్చితార్థంలో కాబోయే భార్య చేసిన పనికి.. పెళ్లిరోజే వరుడు షాకింగ్ నిర్ణయం
మీ రైస్‌లో ఆర్సెనిక్ ఉందా!?
జెన్సోల్.. ఓ ఉత్తుత్తి కంపెనీ!
ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. ఇప్పుడు ఇలా..: రోహిత్ శర్మ
బెట్టింగ్ యాప్స్‌లో గెలిచిన డబ్బులు తీసుకోలేని పరిస్థితి..!
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
చోరీ చేశారు.. అమ్మలేక దొరికారు
నేడే సతీసమేతంగా జె.డి.వాన్స్ రాక
ఓటీటీలో రొమాంటిక్ సినిమా.. రూ. 1900 కోట్ల కలెక్షన్స్‌తో రికార్డ్
వివాహేతర సంబంధం.. వాట్సప్ స్టేటస్‌లో ప్రియురాలి ఫొటో..
తూటాకు బలైన భారతీయ విద్యార్థిని
విశ్రాంత డీజీపీ దారుణ హత్య
బ్యాంకులకు నేడు సెలవు ఉందా?
డేటింగ్లో స్టార్ హీరోయిన్ సోదరి.. ప్రియుడికి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్!
నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆ సినిమా చేయడమే: ప్రియదర్శి
Hyderabad: ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
యెమెన్ పోర్టుపై మళ్లీ అమెరికా దాడులు
విశ్వమూ భ్రమిస్తోంది
చల్లటి కబురు!
Viral: చిన్నారిని రక్షించిన ఈ రియల్ హీరో ఏమన్నాడంటే..
ఏటా కోటి పెళ్లిళ్లుమన వివాహ మార్కెట్ రూ.11 లక్షల కోట్లు
డొనాల్డ్ ట్రంప్‌పై ప్రజాగ్రహం
ఆ వయస్సు దాటితే హీరోయిన్గా కష్టమే: దియా మీర్జా ఆసక్తికర కామెంట్స్
బీజేపీ వివరణ రాజకీయ వంచన
అమ్మా, నాన్న క్షమించండి.. ప్రపంచం నుంచి వెళ్లిపోతున్నా!
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
ఉపాధి హామీ పనులు.. 17జిల్లాలు అప్.. 15జిల్లాలు డౌన్..
RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లు
Hyderabad Zoo సందర్శన టికెట్ రేట్లు పెరిగినా..తగ్గని ఆదరణ
మ్యాడ్ సినిమాతో ఫేమ్.. నటుడిపై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు!
అందంగా లేదని చిత్రహింసలు
22న వైఎస్సార్సీపీ పీఏసీ సమావేశం
'భారత్ మూడేళ్ళలో ఆ దేశాలను అధిగమిస్తుంది'
Mukesh Ambani Birthday ముఖేష్ అంబానీ బర్త్‌డే బాష్, ఇదే హైలైట్!
క్షేమంగా ఊరికి పంపిస్తామని.. కాటేశారు
బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
పుట్టి.. మళ్లీ కడుపులోకి వెళ్లి.. మళ్లీ పుట్టి
ఆ డైరెక్టర్‌తో తిరుమలకు సమంత.. వీడియో వైరల్!
కంగారు పడకు! నేనే ఈ సారి ఎండలు కాస్త ఎక్కవగా ఉన్నాయ్!
హైడ్రోజన్ బాంబ్‌ను పరీక్షించిన చైనా
‘తెలంగాణలో జనజాతర.. ఇది మన జాతర’
సినిమా

ఆ డైరెక్టర్‌తో తిరుమలకు సమంత.. వీడియో వైరల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత.. ప్రస్తుతం నిర్మాతగా అభిమానుల ముందుకు రానుంది. ఆమె నిర్మించిన తాజా చిత్రం శుభం త్వరలోనే ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే గత కొద్ది కాలంగా వ్యక్తిగత విషయాలతొనే వార్తల్లో నిలుస్తోంది. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తర్వాత.. సమంతపై పెద్దఎత్తున రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ సిరీస్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడిమోరుతో సామ్ డేటింగ్లో ఉందంటూ చాలాసార్లు కథనాలొచ్చాయి. ఇటీవల పికిల్ బాల్ లీగ్‌లోనూ వీరిద్దరూ జంటగా కనిపించారు. ఆ తర్వాత కోలీవుడ్‌లో బీహైండ్వుడ్స్ అవార్డ్స్ ఫంక్షన్లో రాజ్ నిడిమోరు, సమంత సందడి చేశారు. కొంతకాలంగా ఈవెంట్స్‌లో కనిపించడంతో ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని టాక్ కూడా వినిపిస్తోంది.ఈ వార్తల నేపథ్యంలో సమంత, రాజ్ నిడిమోరు రిలేషన్షిప్ మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం సమంత, రాజ్ నిడిమోరు సంప్రదాయ దుస్తుల్లో తిరుమల వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. దీంతో మరోసారి వీరిద్దరి డేటింగ్‌పై చర్చ మొదలైంది. అయితే ఈ రూమర్స్‌పై ఇప్పటి వరకు సమంత, రాజ్ ఒక్కసారి కూడా స్పందించలేదు. వీరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ ఇప్పట్లో రూమర్స్ ఆగేలా కనిపించడం లేదు.కాగా.. రాజ్ డైరెక్షన్లో సామ్ 'సిటాడెల్: హనీ బన్నీ, 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' (2021) అనే రెండు ప్రాజెక్ట్‌ల్లో నటించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్' లోనూ సమంత నటిస్తోంది. సమంత చివరిసారిగా వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్‌లో కనిపించింది. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

మ్యాడ్ సినిమాతో ఫేమ్.. నటుడిపై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు!
నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో తనదైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు రవి ఆంథోని. ఈ పేరు మ్యాడ్ మూవీతో ఫేమస్ అయినా మ్యాడ్ స్క్వేర్తో మరోసారి మార్మోగిపోయింది. టాలెంట్ ఉంటే సినీ ప్రేక్షకులు ఎంత దూరమైనా ఒక నటుడిని తీసుకెళ్లగలరు అని మరోసారి రుజువు చేశారు.ఆంథోనీ అసలు పేరు రవి ఆంథోనీ. స్క్రీన్ నేమ్ ఆంథోనీగా అందరికి సుపరిచితుడు. తన కామెడీ టైమింగ్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇటీవల జరిగిన మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్లో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఆంథోనీ నటనకి ఫిదా అయ్యానని తెలిపారు. అతని నటనకి మంచి భవిష్యత్తు కూడా ఉందని అన్నారు. ప్రస్తుతం ఆంథోనీ పలు సినిమాల్లో నటిస్తూ.. మరిన్ని ప్రాజెక్టులు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

డేటింగ్లో స్టార్ హీరోయిన్ సోదరి.. ప్రియుడికి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్!
బాలీవుడ్ భామ ఆలియా భట్ తెలుగువారికి సుపరిచితమైన పేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఓ కూతురు కూడా జన్మించింది. గతేడాది జిగ్రా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలీవుడ్ బ్యూటీ ఈ ఏడాది ఆల్ఫా అనే మూవీలో కనిపించనుంది.అయితే ఆలియా భట్‌కు పూజా భట్, షాహీన్ భట్ అనే ఇద్దరు సిస్టర్స్ ఉన్న సంగతి తెలిసిందే. వారిలో ఒకరైన షాహీన్ భట్ ప్రముఖ ఫిట్నెస్ కోచ్ ఇషాన్ మెహ్రాతో డేటింగ్లో ఉన్నారు. ఇవాళ అతని బర్త్ డే కావడంతో షాహీన్ భట్ విషెస్ చెబుతూ అతనితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో అతనితో రిలేషన్లో ఉన్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది.ఇది చూసిన అలియా భట్ తన సిస్టర్ షాహీన్ భట్‌కు మద్దతుగా నిలిచింది. ఇషాన్ మెహ్రా పుట్టినరోజు సందర్భంగా అలియా భట్ శుభాకాంక్షలు తెలిపింది. అంతే కాకుండా షాహీన్ చేసిన పోస్ట్‌ను అలియా భట్ షేర్ చేసింది. ఈ పోస్ట్‌పై నీతూ కపూర్, పూజా భట్, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, అనన్య పాండే, పరిణీతి చోప్రా, బాద్షా,మసాబా గుప్తా సైతం స్పందించారు. షాహీన్ భట్ భాయ్‌ఫ్రెండ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. షాహీన్ భట్ గతంలో హాస్యనటుడు రోహన్ జోషితో రిలేషన్ షిప్లో ఉన్నారు. రెండేళ్ల క్రితమే వీరిద్దరు విడిపోయారు.కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో షాహీన్ భట్.. ఇషాన్‌తో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. కానీ అతని ఎవరు అనేది వెల్లడించలేదు. ఈ ఏడాది కపూర్, భట్ కుటుంబాలు న్యూ ఇయర్ సందర్భంగా థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లాయి. ఇన్‌స్టాగ్రామ్‌లోకి షాహీన్ తన ట్రిప్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు పంచుకున్నారు. ఒక ఫోటోలో ఆమె ఇషాన్ పక్కన నిలబడి పోజులిచ్చింది. మరో చిత్రంలో క్రూయిజ్‌లో ఉన్నప్పుడు వారిద్దరు కౌగిలించుకున్నారు. అప్పటి నుంచే ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.

అట్నే ఉండు
‘ఏ... వన్ డే హీరో నువ్వే ఫ్రెండు... నీ కోసమే డప్పుల్ సౌండు... అస్సల్ తగ్గక్... అట్నే ఉండు... మొక్కూతారు కాళ్లూ రెండు...’ అంటూ ఊర మాస్ పాట పాడారు హీరో ధనుష్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నా ముఖ్య తారలుగా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ‘కుబేర’ చిత్రంలో ‘పోయిరా మామా...’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు.దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ పాటకి భాస్కరభట్ల సాహిత్యం అందించగా ధనుష్ పాడారు. శేఖర్ వీజే నృత్య రీతులు సమకూర్చారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 20న హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల కానుంది.
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్‌రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక
క్రీడలు

IPL 2025 GT vs KKR: టైటాన్స్ జోరు సాగేనా!
కోల్‌కతా: ఐపీఎల్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న గుజరాత్ టైటాన్స్ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో పోరుకు సిద్ధమైంది. కేకేఆర్ జట్టు లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు 259 మ్యాచ్‌లాడగా... అందులో మూడుసార్లు మాత్రమే గుజరాత్ టైటాన్స్‌తో తలపడింది. షెడ్యూల్ కారణంగా ఇరు జట్ల మధ్య తక్కువ మ్యాచ్‌లు జరగగా... సోమవారం పోరులో అటు కేకేఆర్, ఇటు గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్లే ప్రధాన ఆయుధంగా బరిలోకి దిగనున్నాయి. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ రూపంలో ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు కోల్‌కతాకు అందుబాటులో ఉండగా... గుజరాత్ తరఫున రషీద్ ఖాన్, సాయికిషోర్ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత సీజన్లో శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 2 పరాజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానంలో ఉంది. గతంలో కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహించిన గిల్... తన పాత జట్టుపై విజృంభించాలని చూస్తుంటే... విండీస్ ద్వయం రసెల్, నరైన్ సమష్టిగా కదంతొక్కి జట్టును గెలుపు బాట పట్టించాలని కోల్‌కతా మేనేజ్మెంట్ భావిస్తోంది. టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి తప్పించిన అనంతరం తిరిగి కేకేఆర్ గూటికి చేరిన అభిషేక్ నాయర్ ఈ మ్యాచ్‌లో డగౌట్ నుంచి కోల్‌కతా ప్లేయర్లకు సలహాలు ఇవ్వనున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో విజయంతో గుజరాత్ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుందా... లేక సొంతగడ్డపై కోల్‌కతా విజయ దరహాసం చేస్తుందా చూడాలి! నిలకడ లేమి సమస్య... డిఫెండింగ్ చాంపియన్‌గా సీజన్ ఆరంభించిన కోల్‌కతా... స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోతోంది. పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన కేకేఆర్... 95 పరుగులకే కుప్పకూలింది. బ్యాటర్లు ముకుమ్మడిగా విఫలమవడంతో కోల్‌కతా మూల్యం చెల్లించుకుంది. అయితే అభిõÙక్ నాయర్ రాకతో జట్టులో జవసత్వం నిండుతుందని యాజమాన్యం ఆశిస్తోంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇకపై ఆడనున్న అన్నీ మ్యాచ్‌లు కీలకమైన నేపథ్యంలో... ప్లేయర్లంతా సమష్టిగా సత్తా చాటాలని చూస్తున్నారు. ముఖ్యంగా వేలంలో రూ. 23.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్ అయ్యర్ కనీస ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు. ఈ సీజన్లో వెంకటేశ్ 24.20 సగటుతో 121 పరుగులు చేయగా... రమణ్‌దీప్ కేవలం 29 పరుగులే చేశాడు. హిట్టర్లుగా పేరున్న రసెల్ 5 మ్యాచ్‌ల్లో 34 పరుగులకే పరిమితం కాగా... రింకూ సింగ్ 38.66 సగటుతో 116 పరుగులు చేశాడు. కెప్టెన్ అజింక్య రహానే 2 అర్ధశతకాల సాయంతో 221 పరుగులు చేయగా... 20 ఏళ్ల రఘువంశీ 170 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్లు సునీల్ నరైన్, డికాక్ కొన్ని మెరుపులు మెరిపిస్తున్నా... నిలకడగా జట్టుకు శుభారంభం అందించలేకపోతున్నారు. ఈ లోపాలన్నీ సరిద్దిద్దుకుంటేనే కేకేఆర్ తిరిగి గెలుపు పట్టాలెక్కనుంది. బౌలింగ్‌లో హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి మంచి ఫామ్‌లో ఉన్నారు. అన్నీ రంగాల్లో పటిష్టంగా... అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో గుజరాత్ టైటాన్స్ బలంగా కనిపిస్తోంది. టాప్–3 ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్ చక్కటి ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసి రానుంది. రూథర్‌ఫార్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా రూపంలో మిడిలార్డర్ కూడా పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో శతకానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయిన బట్లర్ ఈ సీజన్లో 63.00 సగటుతో 315 పరుగులు చేయగా... సాయి సుదర్శన్ 365 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. బౌలింగ్‌లోనూ గుజరాత్‌కు ఇబ్బందులు లేవు. సీనియర్ పేసర్ ప్రసిధ్ కృష్ణ తాజా సీజన్లో 14 వికెట్లు పడగొట్టి దూకుడు మీద ఉండగా... హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ అతడికి చక్కటి సహకారం అందిస్తున్నారు. తమిళనాడు స్పిన్నర్ సాయి కిషోర్ తనకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తుండగా... రషీద్ ఖాన్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. తుది జట్లు (అంచనా) కోల్‌కతా నైట్ రైడర్స్: రహానే (కెప్టెన్), నరైన్, డికాక్, వెంకటేశ్ అయ్యర్, రఘువంశీ, రింకూ సింగ్, రసెల్, రమన్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, నోర్జే, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. గుజరాత్ టైటాన్స్: గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్, రూథర్‌ఫర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.

భారత షూటర్లకు రెండు రజతాలు
లిమా (పెరూ): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) రెండో ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్ల నిలకడైన ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం భారత షూటర్లు రెండు రజత పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అర్జున్ బబూటా... 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రుద్రాంక్ష్ పాటిల్–ఆర్య బోర్సె రజత పతకాలు సాధించారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో అర్జున్ బబూటా 252.3 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. 253.4 పాయింట్లతో చైనా షూటర్ షెంగ్ లిహావో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. పెనీ మార్టన్ (హంగేరి; 229.8 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌కు చేరిన మరో భారత షూటర్ రుద్రాంక్ష్ పాటిల్ 104.8 పాయింట్లతో చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఫైనల్లో రుద్రాంక్ష్ పాటిల్–ఆర్య ద్వయం 11–17తో జెనెట్ హెగ్–జాన్ హెర్మన్ హెగ్ (నార్వే) జంట చేతిలో ఓడిపోయింది. సోమవారంతో ముగియనున్న ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఆరు పతకాలతో మూడో స్థానంలో ఉంది.

IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ విజృంభించారు. భారీ షాట్లతో అలరిస్తూ ఆదివారం అభిమానులకు డబుల్ ధమాకా అందించారు. పంజాబ్ కింగ్స్‌తో పోరులో కోహ్లి క్లాసిక్ ఇన్నింగ్స్‌తో కదంతొక్కగా... చెన్నైతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఊర మాస్ షాట్లతో చెలరేగిపోయాడు. ఫలితంగా పంజాబ్‌పై బెంగళూరు బదులు తీర్చుకోగా... చెన్నైపై ముంబై ఇండియన్స్ భారీ విజయం నమోదు చేసుకుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఓ మాదిరి ప్రదర్శనతో సరిపెట్టుకున్న రోహిత్... తనను ‘హిట్‌మ్యాన్’ ఎందుకు అంటారో వాంఖడేలో నిరూపించాడు. విరాట్ దూకుడుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లగా... రోహిత్ మెరుపులతో ముంబై నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లుగా తొలి ఓవర్లోనే క్రీజులో అడుగుపెట్టిన ఈ ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచి తమ జట్లను గెలిపించడం కొసమెరుపు.ముంబై: సిక్స్... ఫోర్... ముంబై ఇన్నింగ్స్ మొత్తం ఇదే తీరు! బంతి పడటమే ఆలస్యం బౌండరీ వెళ్లెందుకు ఓసారి, సిక్స్ అయ్యేందుకు మరోసారి బంతి అదేపనిగా ముచ్చట పడిందనిపించింది. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ, టి20 స్పెషలిస్ట్ సూర్యకుమార్‌ల ఆట మ్యాచ్‌లో హైలైట్స్‌ను చూపించలేదు. హైలైట్సే మ్యాచ్‌గా మార్చేసింది. దీంతో ముంబై 177 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. చెన్నైపై 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ముందుగా చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), సూర్య (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) హోరెత్తించారు. దంచేసిన జడేజా, దూబే ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ (20 బంతుల్లో 19; 1 ఫోర్)కు ఓపెనింగ్‌లో అవకాశమిస్తున్న ధోనిని నిరుత్సాహపరిచాడు. పవర్‌ప్లేలో 20 బంతులాడి కూడా ఒకే ఒక్క బౌండరీ బాదాడు. రచిన్ రవీంద్ర (5) విఫలమవగా, 17 ఏళ్ల ‘లోకల్ బాయ్’ ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉన్నది కాసేపే అయినా ఫోర్లు, సిక్స్‌లతో అలరించాడు. తర్వాత వచ్చిన జడేజా, దూబే భారీషాట్లు బాదడంతో చెన్నై పుంజుకుంది. ఇద్దరు నాలుగో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. సిక్స్‌లు బాదిన దూబే 30 బంతుల్లో, జడేజా 34 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ధోని (4)ని బుమ్రా ఎంతో సేపు నిలువనీయలేదు. బాదుడే... బాదుడు రోహిత్ శర్మకు జతగా ఓపెనింగ్ చేసిన రికెల్టన్ తొలి ఓవర్లోనే బౌండరీలతో తమ ఉద్దేశం చాటగా, రెండో ఓవర్ నుంచి రోహిత్ విరుచుకుపడటంతో చెన్నై బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. జేమీ ఓవర్టన్ ఓవర్‌న్నర (9 బంతులు) వేసిన ఐదో ఓవర్లో రికెల్టన్, రోహిత్ చెరో సిక్స్ కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో 62 పరుగులు చేసిన ముంబై తర్వాతి ఓవర్లోనే రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్‌ను కోల్పోయింది. సూర్యకుమార్ రావడం... రోహిత్‌తో కలిసి ధనాధన్ షోను డబుల్ చేసింది. ఇద్దరు బౌండరీలు, సిక్సర్లు కొట్టేందుకు పోటీపడటంతో స్టేడియం హోరెత్తింది. ముందుగా ‘హిట్‌మ్యాన్’ 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... సూర్య 26 బంతుల్లో అర్ధసెంచరీ అధిగమించాడు. ఇద్దరు బంతిని అదేపనిగా బౌండరీలైన్‌ను దాటిస్తూనే ఉండటంతో లక్ష్యం ముంబై వైపు నడిచివచ్చింది.స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: షేక్ రషీద్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 19; రచిన్ (సి) రికెల్టన్ (బి) అశ్వని 5; ఆయుశ్ (సి) సాంట్నర్ (బి) దీపక్ చహర్ 32; జడేజా (నాటౌట్) 53; దూబే (సి) జాక్స్ (బి) బుమ్రా 50; ధోని (సి) తిలక్ (బి) బుమ్రా 4; జేమీ ఓవర్టన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–16, 2–57, 3–63, 4–142, 5–156. బౌలింగ్: చహర్ 4–0–32–1, బౌల్ట్ 4–0–43–0, అశ్వని 2–0–42 –1, సాంట్నర్ 3–0–14–1, బుమ్రా 4–0–25–2, విల్ జాక్స్ 1–0–4–0, హార్దిక్ 2–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) ఆయుశ్ (బి) జడేజా 24; రోహిత్ (నాటౌట్) 76; సూర్యకుమార్ (నాటౌట్) 68; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (15.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 177. వికెట్ల పతనం: 1–63. బౌలింగ్: ఖలీల్ 2–0–24–0, ఓవర్టన్ 2–0– 29–0, అశ్విన్ 4–0–25–0, జడేజా 3–0–28–1, నూర్ 3–0–36–0, పతిరణ 1.4–0–34–0. ముల్లాన్‌పూర్: ముందు బౌలర్లు, తర్వాత బ్యాటర్లు రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తమ సొంతగడ్డపై పొగొట్టుకున్న ఫలితాన్ని పంజాబ్‌కు వెళ్లి రాబట్టుకుంది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. జోష్ ఇన్‌గ్లిస్ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), శశాంక్ సింగ్ (33 బంతుల్లో 31; 1 ఫోర్) మెరుగ్గా ఆడారు. కృనాల్, సుయశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించాడు. కోహ్లి ఆఖరిదాకా... పెద్ద లక్ష్యం కాకపోయినా... బెంగళూరు జట్టు తమ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (1) వికెట్‌ను తొలి ఓవర్లోనే కోల్పోయింది. పంజాబ్‌కు దక్కింది ఈ ఆరంభ సంబరమే! అటు తర్వాత కథంతా కింగ్ కోహ్లి, పడిక్కల్ నడిపించారు. వన్‌డౌన్ బ్యాటర్ పడిక్కల్ భారీ సిక్సర్లతో విరుచుకుపడగా... కోహ్లి క్లాసిక్స్ షాట్లతో ముల్లాన్‌పూర్ ప్రేక్షకుల్ని గెలిచాడు. ఇద్దరు రెండో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. పడిక్కల్ అవుటైనా... ఆఖరిదాకా క్రీజులో నిలబడిన కోహ్లి జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 22; ప్రభ్సిమ్రాన్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 33; అయ్యర్ (సి) కృనాల్ (బి) షెఫర్డ్ 6; ఇన్‌గ్లిస్ (బి) సుయశ్ 29; నేహల్ (రనౌట్) 5; శశాంక్ (నాటౌట్) 31; స్టొయినిస్ (బి) సుయశ్ 1; యాన్సెన్ (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–42, 2–62, 3–68, 4–76, 5–112, 6–114. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–26–0, యశ్ దయాళ్ 2–0–22–0, హాజల్‌వుడ్ 4–0–39–0, కృనాల్ పాండ్యా 4–0–25–2, షెఫర్డ్ 2–0–18–1, సుయశ్ 4–0–26–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఇన్‌గ్లిస్ (బి) అర్ష్ దీప్ 1; కోహ్లి (నాటౌట్) 73; పడిక్కల్ (సి) నేహల్ (బి) హర్‌ప్రీత్ 61; పాటీదార్ (సి) యాన్సెన్ (బి) చహల్ 12; జితేశ్ శర్మ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–6, 2–109, 3–143. బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–26–1, జేవియర్ 3–0–28–1, హర్‌ప్రీత్ బ్రార్ 4–0–27–1, యాన్సెన్ 3–0–20–0, చహల్ 4–0–36–1, స్టొయినిస్ 1–0–13–0, నేహల్ 0.5–0–9–0. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X గుజరాత్ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

IPL 2025: రోహిత్, సూర్యకుమార్ విధ్వంసం.. చెన్నైను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్కే ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. షేక్ రషీద్ 20 బంతుల్లో 19, రచిన్ రవీంద్ర 9 బంతుల్లో 5, ధోని 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన ముంబై రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్కై వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో ఆది నుంచే దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ సీజన్లో తొలిసారి సామర్థ్యం మేరకు సత్తా చాటాడు. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్) కూడా పర్వాలేదనిపించాడు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజాకు వికెట్ దక్కింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది.
బిజినెస్

ప్రజా ప్రయోజనాలే ముఖ్యం
ముంబై: ప్రజా ప్రయోజనాలను వాణిజ్య ప్రాధాన్యతలు అధిగమించేందుకు అనుమతించబోమని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలపై పాండే తాజాగా స్పందించారు. ఈ అంశాన్ని నియంత్రణ సంస్థలు బలపరచవలసి ఉన్నట్లు సీఐఐ నిర్వహించిన కార్పొరేట్ పాలన సదస్సులో తెలియజేశారు. వాణిజ్య లేదా లాభార్జన సంస్థలు ఎక్సే్ఛంజీలుగా ఆవిర్భవించేందుకు భారత్ అనుమతిస్తుందని, అయితే నియంత్రణ సంస్థలు మాత్రం సాధారణ ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తాయని వివరించారు. ఈ అంశంలో సర్దుబాట్లకు అవకాశంలేదని వ్యాఖ్యానించారు. ఇదేవిధంగా స్టాక్ ఎక్సే్ఛంజీల మధ్య ఘర్షణలు తలెత్తితే పరిష్కరించడం సెబీ బాధ్యతగా పేర్కొన్నారు. కాగా.. ఎనిమిదేళ్లుగా ఎన్ఎస్ఈ ఐపీవో ప్రణాళికలు కొనసాగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా ఈ ఏడాది మొదట్లో సెబీ అనుమతిని కోరింది. దీంతో ఎన్ఎస్ఈ ఐపీవోపై సెబీ ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. అన్నిరకాల సమస్యలనూ పరిష్కరించుకోవలసిందిగా ఎన్ఎస్ఈని ఆదేశించింది.

జెన్సోల్.. ఓ ఉత్తుత్తి కంపెనీ!
ముంబై: కంపెనీ నిధులను ఇష్టాసారం వాడేసుకుని, ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన జోన్సోల్ ఇంజినీరింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కంపెనీ షేరు ధరతో పాటు నిధుల్లో గోల్మాల్ చోటు చేసుకుందని గతేడాది జూన్‌లో సెబీకి అందిన ఫిర్యాదుపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ)అధికారి పుణెలోని కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ప్లాంట్‌లో జరిపిన తనిఖీల్లో అసలు ఎలాంటి తయారీ కార్యకలాపాలు లేనట్లు బట్టబయలైంది. అలాగే, అక్కడ కేవలం ఇద్దరు ముగ్గురు కార్మికులు మాత్రమే ఉన్నారని ఈ నెల 15న సెబీ జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్లో సెబీ వెల్లడించింది. జెన్సోల్ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ.. కంపెనీ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడటమే కాకుండా ఇన్వెస్టర్లను పక్కదారి పట్టించిన విషయాన్ని నియంత్రణ సంస్థ బయటపెట్టింది. తవ్వేకొద్దీ... సెబీ తరఫున ఎస్ఎస్ఈ అధికారి ఈ నెల 9న పుణె దగ్గర్లోని చకన్ వద్దనున్న జెన్సోల్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్‌లో విచారణ చేపట్టారు. ‘ఈ సందర్భంగా అక్కడ ఉత్పత్తి కార్యకపాపాలు ఏవీ కనబడలేదు. ఇద్దరు ముగ్గురు కార్మికులే ఉన్నారు. దీంతో గత 12 నెలల కరెంట్ బిల్లులను అధికారి కోరగా 2024 ఏడాది డిసెంబర్ నెలలో మాత్రమే అత్యధికంగా రూ.1,57,037 మొత్తాన్ని ఈ యూనిట్ చెల్లించినట్లు వెల్లడైంది‘ అని సెబీ తెలిపింది. కాగా, ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో జెన్సోల్ కొత్త ఈవీని ప్రదర్శించడమే కాకుండా, దాదాపు 30,000 ఈవీలకు ప్రి–ఆర్డర్లు కూడా వచ్చాయని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేయడం గమనార్హం. అయితే, కంపెనీ డాక్యుమెంట్ల ప్రకారం 29,000 ఈవీల కొనుగోలుకు వ్యక్తం చేసిన 9 సంస్థలతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) మాత్రమే కుదిరినట్లు సెబీ గుర్తించింది. ఎలాంటి ధర, డెలివరీ తేదీలు లేకపోవడాన్ని చూస్తే, ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన విషయం స్పష్టమవుతోందని సెబీ పేర్కొంది. జెన్సోల్ ప్రమోటర్లు జగ్గీ బ్రదర్స్ 6,400 ఈవీలను కొనుగోలు చేయడం కోసం ఇరెడా, పీఎఫ్సీ నుంచి 978 కోట్ల రుణాలు తీసుకుని కేవలం 4,704 ఈవీలను మాత్రమే (రూ.568 కోట్లు) కొనుగోలు చేసిన విషయం సెబీ దర్యాప్తులో తాజాగా బయటపడిన విషయం తెలిసిందే. మిగతా నిధులను పక్కదారి పట్టించి, జగ్గీ బ్రదర్స్ సొంతానికి వాడేసుకున్నట్లు కూడా సెబీ తేల్చింది. దీంతో జెన్సోల్ సహా ప్రమోటర్లను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి నిషేధించడంతో పాటు జగ్గీ సోదరులు కంపెనీలో ఎలాంటి పదవులూ చేపట్టకుండా కఠిన చర్యలు చేపట్టింది. దీంతో ప్రమోటర్లు తమ డైరెక్టర్ పదవులను రాజీనామా చేశారు, మరోపక్క, జెన్సోల్ ఇంజినీరింగ్ షేరు విభజన ప్రణాళికను కూడా సెబీ పక్కనబెట్టింది.

క్యూ4 ఫలితాలే దిక్సూచి
గత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసిక(క్యూ4) ఫలితాలే ప్రధానంగా ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. వీటికితోడు యూఎస్ టారిఫ్ వార్తలు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వారాంతాన వెలువడిన వర్షపాత అంచనాలు సెంటిమెంటుకు జోష్‌నివ్వనున్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం..ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ దిగ్గజాల క్యూ4(జనవరి–మార్చి) ఫలితాల ఆధారంగా కదలనున్నాయి. క్యూ4తోపాటు మార్చితో ముగిసిన పూర్తి ఏడాది పనితీరును సైతం వెల్లడించనున్నాయి. కొన్ని రంగాల కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ప్రభావిత అంశాలు, పనితీరుపై అంచనాలు సైతం వెలువరించనున్నాయి. ఈ జాబితాలో కార్ల దిగ్గజం మారుతీసహా.. ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎఫ్ఎంసీజీ బ్లూచిప్ హిందుస్తాన్ యూనిలీవర్, ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తదితరాలున్నాయి. ఐటీ బ్లూచిప్ ఇన్ఫోసిస్‌తోపాటు వారాంతాన(19న) ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐసహా యస్ బ్యాంక్ ఫలితాలు విడుదల చేశాయి. దీంతో నేడు(21న) ఈ కౌంటర్లపై ఫలితాల ప్రభావం కనిపించనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఇతర అంశాలు ప్రపంచ ప్రధాన(ఆరు) కరెన్సీలతో మారంకలో ఇటీవల డాలరు బలహీనపడుతుండటంతో దేశీ కరెన్సీ బలపడుతోంది. డాలరు ఇండెక్స్ కొద్ది రోజులుగా 104 స్థాయి నుంచి 99కు నీరసించడం రూపాయికి జోష్‌నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు దేశీ స్టాక్స్‌లో తిరిగి విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీగా పెట్టుబడులు చేపడుతుండటం మరింత మద్దతిస్తున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. కాగా.. ముడిచమురు ధరలు బ్యారల్ 65–60 డాలర్ల స్థాయికి దిగిరావడం దేశీయంగా సానుకూల అంశమని, ఇది ద్రవ్యోల్బణం తగ్గేందుకు దోహదపడుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. గత వారమిలా కేవలం మూడు రోజులు జరిగిన గత వారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 4 శాతంపైగా జంప్‌చేయడం విశేషం! ఇందుకు ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడం తోడ్పాటునిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత వారం సెన్సెక్స్ నికరంగా 3,396 పాయింట్లు(4.5 శాతం)దూసుకెళ్లగా, నిఫ్టీ సైతం 1,023 పాయింట్లు(4.5 శాతం) ఎగసింది. వెరసి సెన్సెక్స్ 78,553 వద్ద, నిఫ్టీ 23,852 వద్ద ముగిశాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ ఇదేస్థాయిలో ర్యాలీ చేయడం గమనార్హం! సాంకేతికంగా గత వారం సెలవుల నేపథ్యంలో సాంకేతికంగా మార్కెట్లు మూడు ట్రేడింగ్ సెషన్లలోనే భారీగా బలపడ్డాయి. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 23,600 పాయింట్ల స్థాయిలో బలమైన మద్దతును కూడగట్టుకుంటున్నట్లు సాంకేతిక నిపుణులు తెలియజేశారు. దీంతో మరోసారి నిఫ్టీకి ఈ స్థాయి సపోర్ట్‌గా నిలిచే వీలున్నట్లు అంచనా వేశారు. ఇదేవిధంగా 24,550 పాయింట్ల వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని పేర్కొన్నారు. వెరసి సమీప భవిష్యత్‌లో సపోర్ట్ లేదా రెసిస్టెన్స్‌లను అధిగమిస్తే మార్కెట్ల తీరు వెల్లడికావచ్చని అభిప్రాయపడ్డారు.రుతుపవనాల ఎఫెక్ట్ ఈ ఏడాది సాధారణానికంటే అధిక వర్షపాతానికి వీలున్నట్లు దేశీ వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసిన అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. ఇది ధరల(ద్రవ్యోల్బణ) క్షీణతకు దారి చూపవచ్చని పేర్కొన్నారు. అయితే యూఎస్ టారిఫ్ వార్తలు మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకావచ్చని విశ్లేషించారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగల యూఎస్, చైనా సుంకాల విధింపులో పోటాపోటీగా వ్యవహరిస్తుండటం ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతున్నట్లు పలువురు నిపుణులు తెలియజేశారు. ఇకపై టారిఫ్‌ల యుద్ధం మరింత వేడెక్కడం లేదా చల్లబడటం అనే అంశాలపై మార్కెట్లు దృష్టిపెట్టనున్నట్లు వివరించారు.ఎఫ్‌పీఐల దన్ను 3 రోజుల్లో రూ. 8,500 కోట్లు గత వారం మూడు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 8,472 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. నిజానికి ఈ నెల మొదట్లో సైతం ఎఫ్‌పీఐలు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. ఈ బాటలో గత వారం తొలి రోజు రూ. 2,352 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. తదుపరి రెండు సెషన్లలో ఏకంగా రూ. 10,824 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. దీంతో ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్ నుంచి రూ. 23,103 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అంటే 2025 జనవరి నుంచి రూ. 1.4 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించారు.

కొత్త పన్ను విధానం 'మార్పు' మంచిదే !
మధ్యతరగతి వారికి గుడ్‌న్యూస్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి చాలా మందికి ఆదాయపన్ను పన్ను భారం తొలగిపోయింది. 2025 బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో చేసిన మార్పులతో వేతన జీవులు, పెన్షనర్లకు రూ.12.75 లక్షలు, ఇతరులకు రూ.12 లక్షల వరకు ఆదాయం మించనప్పుడు ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఆదాయం ఈ పరిమితి దాటినప్పుడే వారు తమ మొత్తం ఆదాయంపై నిర్ణీత శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.7–7.75 లక్షలుగా ఉన్న పరిమితులను ప్రభుత్వం గణనీయంగా పెంచేసింది. పాత విధానంలో పన్ను ఆదా కోసం ఎన్నో రకాల పెట్టుబడులు పెట్టాల్సి వచ్చేది. వీటికితోడు బీమా ప్రీమియం, ఇంటి రుణం చెల్లింపులు ఇలా ఎన్నో క్లెయిమ్ చేసుకుంటే గానీ పన్ను భారం గణనీయంగా తగ్గేది కాదు. ఇప్పుడు కొత్త పన్ను విధానంలో ఈ తలనొప్పులేవీ లేకుండానే గణనీయమైన ప్రయోజనం కల్పించారు. 2025–26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో కొత్త పన్ను విధానంలోకి మారడం, లేదంటే పాత విధానాన్ని కొనసాగించడం వల్ల కలిగే లాభనష్టాలపై అవగాహన కల్పించే కథనమిది... ‘‘మన దేశంలో పన్ను రిటర్నులు వేస్తున్న వారిలో 90 శాతం మంది ఆదాయం రూ.13 లక్షల కంటే తక్కువే ఉంది. అంటే 140 కోట్ల మంది ప్రజల్లో కేవలం కోటి మందే 2025–26 ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లించనున్నారు. భారత్‌ను ఆదాయపన్ను రహితంగా మార్చడమే ఇది’’ అంటూ షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై చేసిన విమర్శనాత్మక పోస్ట్ తాజా పరిస్థితులకు అద్దం పడుతోంది. 2023–24 సంవత్సరం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం మన దేశంలో వేతన జీవుల సగటు ఆదాయం రూ.20,039గా ఉంది. కనుక మెజారిటీ వేతన జీవులే కాదు, స్వయం ఉపాధిలో ఉన్న వారిలోనూ అధిక శాతం మంది ఆదాయం రూ.12 లక్షల్లోపే ఉంటుంది. కనుక వారికి కొత్త పన్ను విధానమే లాభదాయకం. లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టుబడులు అన్నవి ఎప్పుడూ తమ లక్ష్యాలు, ఆశించే రాబడి, రిస్క్ సామర్థ్యం వీటన్నింటికీ సరిపోయే సాధనాలతో ఉండాలి. అంతే కానీ పన్ను ఆదా కోసమని చెప్పి మెరుగైన రాబడుల్లేని చోట ఇన్వెస్ట్ చేస్తే లక్ష్యాలకు కావాల్సినంత సమకూర్చుకోవడం కఠినతరం అవుతుంది. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదా కోసం పిల్లల ట్యూషన్ ఫీజులు మొదలు కొని జీవిత బీమా ప్రీమియం, పీపీఎఫ్, ఎన్సీఎస్, ఐదేళ్ల బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇలా ఎన్నో సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. పైగా పన్ను ఆదా పెట్టుబడులకు మూడు నుంచి ఐదేళ్ల లాకిన్ పీరియడ్ (అప్పటి వరకు ఉపసంహరణ కుదరదు) కూడా ఉంటుందని మర్చిపోవద్దు. పీపీఎఫ్ అయితే 15 ఏళ్లు. కొత్త పన్ను విధానంలో ఇలాంటి షరతులేవి లేకుండా రూ.12 లక్షలకు మించని ఆదాయం ఉన్న అందరికీ సెక్షన్ 87ఏ కింద పన్ను రాయితీ కల్పించారు. కనుక తమకు నచ్చిన చోట పెట్టుబడులు పెట్టుకునే స్వేచ్ఛ కొత్త విధానం కల్పిస్తోంది. దీర్ఘకాల లక్ష్యాలకు ఇతర సాధనాల కంటే ఈక్విటీలే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మించి మెరుగైన రాబడిని అందిస్తాయని చరిత్ర చెబుతోంది. కనుక మెజారిటీ పెట్టుబడులు ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. పాత పన్ను విధానంలో పన్ను ఆదా కోసం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే కొత్త పన్ను విధానంలో అయితే పన్ను ఆదా కోసం చూడకుండా ప్యాసివ్ ఫండ్స్, ఫ్లెక్సీక్యాప్, ఈక్విటీ–డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్, బంగారంలోనూ పెట్టుబడులకు వీలు కల్పించే మల్టీ అస్సెట్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లు, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు ఇలా ఎన్నో విభాగాల నుంచి తమకు అనుకూలమైన వాటిని నిపుణుల సూచనల మేరకు ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొందరికి కొత్త.. కొందరికి పాత పాత పన్ను విధానంలో వివిధ రకాల పన్ను పెట్టుబడులు, మినహాయింపుల రూపంలో రూ.5,75,000.. వేతనంలో 30 శాతాన్ని హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) కింద క్లెయిమ్ చేసుకున్నప్పటికీ.. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి (వేతన జీవులకు రూ.12.75 లక్షల వరకు) నూతన పన్ను విధనామే మెరుగైనది. ఈ కింది టేబుల్లో దీన్ని గుర్తించొచ్చు. ఒకవేళ ఆదాయం రూ.12 లక్షలు మించితే (వేతన జీవులకు రూ.12.75 లక్షల ఆదాయం దాటితే).. పాత పన్ను విధానంలో అన్ని మినహాయింపులు, రాయితీలను క్లెయిమ్ చేసుకునేట్టు అయితే.. కొత్త విధానం కంటే పాత విధానంలోనే కొంత అదనంగా ఆదా అవుతుంది. ఉదాహరణబ్యాంక్ ఉద్యోగి మోనాలీ దేవ్ ఆదాయం రూ.20.5 లక్షలు. ఆఫీసుకు వెళ్లి వచ్చేందుకు ఆమె కారు లేదా ట్యాక్సీ వినియోగించడం లేదు. దీంతో రూ.1.2 లక్షల ట్రాన్స్పోర్ట్ అలవెన్స్‌పై పూర్తి పన్ను చెల్లించాల్సి వస్తోంది. నెలల శిశువు కారణంగా ఎలాంటి పర్యటనలకూ వెళ్లే వీలు లేకపోవడంతో రూ.30,000 ఎల్‌టీఏ ప్రయోజనాన్ని కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. కేవలం ఎన్పీఎస్, సెక్షన్ 80సీ, గృహ రుణం చెల్లింపులు రూ.1.6 లక్షలు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.11,500 చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో తన ఆదాయంపై ఈ మినహాయింపులు క్లెయిమ్ చేసుకున్న తర్వాత పాత విధానంలో ఆమె 2023–24 సంవత్సరానికి రూ.3.15 లక్షల ఆదాయం చెల్లించాల్సి వచి్చంది. నిపుణుల సూచనలతో కొత్త విధానంలో మదింపు చేయగా చెల్లించాల్సిన పన్ను రూ.2.86 లక్షలుగా తేలింది. ఒకవేళ సెక్షన్ 80సీసీడీ (2) కింద కార్పొరేట్ ఎన్‌పీఎస్‌లో.. మూలవేతనంలో 14 శాతం చొప్పున ప్రతి నెలా రూ.15,156ను పనిచేసే సంస్థ నుంచి జమ చేయించుకుంటే అప్పుడు మోనాలీ దేవ్‌కు పన్ను భారం మరో రూ.57,000 తగ్గిపోతుంది. 2025–26 సంవత్సరం నుంచి అమల్లోకి వచి్చన కొత్త పన్ను విధానం శ్లాబుల ప్రకారం అయితే మోనాలీదేవ్ చెల్లించాల్సిన పన్ను (ఎన్పీఎస్ లేకుండా) కేవలం రూ.1.98 లక్షలే. ముందటి ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే రూ.88 వేలు ఆదా అవుతోంది. పనిచేసే సంస్థ నుంచి ఎన్పీఎస్ (కార్పొరేట్ ఎన్పీఎస్) జమ కూడా చేయించుకుంటే ఈ పన్ను ఇంకా తగ్గిపోనుంది. కనుక అధిక ఆదాయం పరిధిలోని వారు పాత–కొత్త విధానంలో మదింపు చేసుకుని తుదిగా తమకు ఏ విధానం లాభదాయకమో నిర్ణయించుకోవాలి. పన్ను చెల్లింపుదారుల్లో చాలా మంది గృహ రుణం తీసుకుని ఉండపోవచ్చు. అలాంటి వారు కేవలం హెచ్ఆర్ఏ మినహాయింపునకే పరిమితం కావాల్సి ఉంటుంది.ఆదాయాన్ని బట్టి మార్పు.. ‘‘కొత్త విధానం ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ, అన్ని ప్రయోజనాలను వినియోగించుకుంటే పాత విధానంలో పన్ను తక్కువ. రూ.60 లక్షలు ఆర్జించే వారు రూ.8.5 లక్షల మినహాయింపు/రాయితీలను క్లెయిమ్ చేసుకునేట్టు అయితే పాత విధానంలోనే రిటర్నులు వేసుకోవచ్చు’’ అని ట్యాక్స్‌స్పానర్ డాట్ కామ్ సీఈవో సు«దీర్ కౌశిక్ సూచించారు. → రూ.13.75 లక్షల ఆదాయం కలిగి కేవలం రూ.5.25 లక్షల పన్ను మినహాయింపుల వరకే క్లెయిమ్ చేసుకున్నా సరే పాత విధానంలో రూ.57,500 చెల్లించాల్సి వస్తే, కొత్త విధానంలో రూ.75,000 పన్ను పడుతోంది. → రూ.15.75 లక్షల ఆదాయం ఉంటే హెచ్ఆర్ఏ ప్రయోజనం లేకుండా మిగిలిన మినహాయింపులను క్లెయిమ్ చేసుకుంటే పాత విధానంలోనే పన్ను తక్కువ. → రూ.20 లక్షల ఆదాయం ఉన్న వారి విషయంలో (వేతన జీవులు అయితే రూ.20.75 లక్షలు) మళ్లీ ఇది మార్పునకు గురవుతుంది. హెచ్ఆర్ఏను పక్కన పెట్టి చూస్తే పాత విధానంలో రూ.5.25 లక్షల మొత్తాన్ని క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు చెల్లించాల్సిన పన్ను రూ.2,40,000 కాగా, కొత్త విధానంలో రూ.2 లక్షలే కావడం గమనించొచ్చు. అలాగే రూ.24 లక్షల ఆదాయంపై కొత్త విధానంలో రూ.60 వేలు ఆదా చేసుకోవచ్చు. → రూ.24.75 లక్షలపైన ఆదాయం కలిగిన వారు, మొత్తం మినహాయింపులు/తగ్గింపులు/రాయితీలు అన్నీ రూ.7.75 లక్షలకు మించితే అప్పుడు పాత విధానాన్ని పరిశీలించొచ్చు. → గ్రాంట్ థార్న్టన్ అంచనా ప్రకారం రూ.1.5 కోట్ల ఆదాయం కలిగిన వారు పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సీ ప్రయోజనాలను వినియోగించుకుంటే చెల్లించాల్సిన పన్ను రూ.40.09 లక్షలు కాగా, కొత్త విధానంలో రూ.48.52 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. → పన్నుకు అదనంగా సెస్సు చెల్లించాలి. రూ.50లక్షల ఆదాయం మించిన వారు సర్‌చార్జీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఏ విషయంలో షరతులు గృహ రుణం ఈఎంఐలో అసలు మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు, వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల వరకు సెక్షన్ 24బీ కింద పాత విధానంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే సమయంలో హెచ్ఆర్ఏ రాయితీని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చా? అంటే అందరికీ అని చెప్పలేం. ఇక్కడ కొన్ని షరతులు వర్తిస్తాయి. → వేతనంలో హెచ్ఆర్ఏ ప్రయోజనం తప్పకుండా ఉండాలి. పనిచేసే ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తూ అద్దె చెల్లించాలి. → తన పేరు లేదా తన జీవిత భాగస్వామితో కలసి ఉమ్మడిగా రుణం తీసుకుని పనిచేసే చోట కాకుండా వేరే ప్రాంతంలో ఇల్లు సమకూర్చుకుని చెల్లింపులు చేస్తుండాలి. → రుణంపై ఇల్లు సమకూర్చుకుని అందులోనే నివసిస్తూ.. వేతనంలో భాగంగా హెచ్ఆర్ఏ ప్రయోజనం తీసుకుంటున్న వారు.. గృహ రుణానికి చెల్లిస్తున్న అసలు, వడ్డీపైనే మినహాయింపును క్లెయిమ్ చేసుకోగలరు. అద్దె చెల్లించడం లేదు కనుక హెచ్ఆర్ఏ క్లెయిమ్‌కు అవకాశం లేదు. → ఒకవేళ మీరు పనిచేసే పట్టణంలోనే ఇంటి కొనుగోలుకు రుణం తీసుకున్నారు. కానీ, ఆ ఇంటిలో కాకుండా, అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఇలాంటప్పుడు హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయలేరు. ఒకవేళ కార్యాలయానికి, రుణంపై సమకూర్చుకున్న ఇల్లు మరీ దూరంగా ఉంటే తప్పించి హెచ్ఆర్ఏ క్లెయిమ్‌కు అర్హులు కారు. కనుక హెచ్ఆర్ఏతోపాటు గృహ రుణంపై గరిష్ట ప్రయోజనం పొందాలంటే పనిచేసే ప్రాంతంలో కాకుండా దూరంగా సొంతిల్లును సమకూర్చుకోవడం ఒక మార్గం. హెచ్ఆర్ఏ సూత్రం → యాజమాన్యం నుంచి స్వీకరించిన వాస్తవ హెచ్ఆర్ఏ → ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన మొత్తం ఇంటి అద్దె నుంచి.. ఏడాదిలో స్వీకరించిన మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలినది. → మూలవేతనం, డీఏలో 40 శాతం (నాన్ మెట్రోలు)/50 శాతం (మెట్రోల్లో నివసించే వారు) → ఈ మూడింటిలో తక్కువ మొత్తాన్ని హెచ్ఆర్ఏ కింద క్లెయిమ్ చేసుకుని పన్ను చెల్లించక్కర్లేదు. కొత్త విధానంలోనూ కొన్ని మినహాయింపులు పాత విధానంతో పోల్చి చూస్తే నూతన పన్ను విధానంలో చాలా వరకు మినహాయింపులు, రాయితీల్లేవు. హెచ్ఆర్ఏ, ఎల్టీసీ, టెలిఫోన్, ఇంటర్నెట్ వ్యయాలను క్లెయిమ్ చేసుకోలేరు. పన్ను ఆదా పెట్టుబడులూ లేవు. గృహ, విద్యా రుణాలపై అసలు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన ప్రయోజనాలు, లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులకూ ఎలాంటి పన్ను మినహాయింపులు లేవన్న విషయాన్ని గుర్తించాలి. అదే సమయంలో వేతన జీవులకు కొన్ని ప్రయోజనాలు కల్పించారు. కార్పొరేట్ ఎన్పీఎస్: సెక్షన్ 80సీసీడీ(2) కింద కార్పొరేట్ ఎన్పీఎస్ ప్రయోజనం ఉంది. ఉద్యోగి తరఫున ఎన్పీఎస్ ఖాతాకు యాజమాన్యం జమ చేయాల్సి ఉంటుంది. మూల వేతనం, డీఏ మొత్తంలో 14 శాతం చొప్పున యాజమాన్యం జమలపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. గరిష్ట జమ రూ.7.5 లక్షలకే ఇది వర్తిస్తుంది. సర్‌చార్జ్: రూ.5 కోట్లకు పైన ఆదాయం కలిగిన వారికి పాత విధానంలో చెల్లించాల్సిన పన్ను మొత్తంపై 37 శాతం సర్‌చార్జ్ చెల్లించాల్సి వస్తుంది. కొత్త విధానంలో ఇది 25 శాతమే. అలవెన్స్‌లు: దివ్యాంగులకు రవాణా భత్యం, ఉద్యోగులకు అధికారిక ప్రయాణాలు లేదా బదిలీ కోసం చెల్లించే అలవెన్స్, ఆఫీస్‌కు దూరంగా వేరే ప్రాంతంలో డ్యూటీ చేయాల్సి వస్తే చెల్లించే అలవెన్స్‌లకు పన్ను మినహాయింపులున్నాయి. సెక్షన్ 80సీసీహెచ్: అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపు ఉంది.ఏటా మారిపోవచ్చు..!రెండు పన్ను విధానాల్లోనూ తమకు అనుకూలమైన దాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వేతన జీవులకు ఉంది. ఒక విధానం నుంచి మరో విధానానికి ఏటా మారిపోవచ్చు కూడా. వేతనం/పింఛనుతోపాటు వ్యాపార ఆదాయం ఉంటే మాత్రం ఈ సదుపాయం లేదు. వ్యాపార ఆదాయం, వృత్తిపరమైన ఆదాయం కలిగిన వారు ఒక్కసారి నూతన విధానంలోకి మారితే.. తిరిగి పాత విధానంలోకి మళ్లేందుకు ఒక్కసారే అవకాశం ఉంటుంది. ఇక వేతన జీవులు, పెన్షనర్లు సైతం గడువులోపు (జూలై 31) ఐటీఆర్‌లు దాఖలు చేసినట్టయితేనే పాత, కొత్త విధానాల్లో తమకు నచ్చింది ఎంపిక చేసుకోగలరు. గడువు దాటిన తర్వాత సమర్పించే బీలేటెడ్ రిటర్నులు కొత్త విధానంలోనే సమర్పించడానికి అనుమతి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు సమయంలో ‘వెదర్ ఆప్టింగ్ అవుట్ న్యూ ట్యాక్స్ రెజిమ్ ఆఫ్ సెక్షన్ 115బీఏసీ?’’ అని అడుగుతుంది. యస్ అని క్లిక్ చేస్తే పాత విధానంలో పన్ను రిటర్నులు దాఖలవుతాయి. నో అని క్లిక్ చేస్తే ఐటీఆర్ నూతన విధానం కింద సమరి్పంచినట్టు అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్
ఫ్యామిలీ

యూత్లోనయా ట్రెండ్, F3 : ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్
జనరేషన్ మారింది.. యూత్ లైఫ్‌స్టైల్ మారింది.. ఆలోచనాతీరు మారింది.. ఆధునికత రూపంలో పాశ్చాత్య సంస్కృతి దూసుకొచ్చింది. ఇప్పుడు ఎఫ్ త్రీ కీలకంగా మారింది. ఒకప్పుడు ఖలీల్ వాలీ హవేలీలు, మొగలాయి వంటకాలు, చార్మినార్ బజార్లకు ప్రసిద్ధి అయిన నగరం ఇప్పుడు మోడరన్ కల్చర్‌కు కేంద్రంగా మారుతోంది. పార్టీ గేమ్స్ అనేవి మోడరన్ యూత్ ఫన్ థీమ్స్‌గా మారాయి. ముఖ్యంగా ‘స్నూకర్‘, ‘పూల్‘, ‘డార్ట్‘, ‘షాఫుల్ బోర్డు‘, ‘బోర్డ్ గేమ్స్‘ లాంటి గేమ్స్ పబ్స్, లాంజ్లలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ గేమ్స్ హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, గచ్చిబౌలిప్రాంతాల్లో మొదలై జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి హై ఎండ్ జోన్లను దాటింది. – సాక్షి, సిటీ బ్యూరోపార్టీ గేమ్స్ మానసిక విశ్రాంతి, స్నేహితులతో కాలక్షేపానికి మాత్రమే కాకుండా సోషల్ కనెక్టివిటీకి వేదికగా మారాయి. వాటితోపాటు వచ్చిన ఫుడ్, మ్యూజిక్, డ్రింక్ కల్చర్ యువతను మరింత ఆకర్షిస్తోంది. ఇప్పటికీ ఇది ఫుడ్ + ఫన్ + ఫ్రెండ్స్ = ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అనే తత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ గేమ్స్ ద్వారా యువత మానసికోల్లాసం పొందడం, కొత్త పరిచయాలు పెంచుకోవడం, వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌ను కాపాడుకోవడం జరుగుతోంది. ఉద్యోగాల ఒత్తిడిని తగ్గించుకునే మార్గంగా ఇవి పనిచేస్తున్నాయి. ఇప్పుడు ‘నైట్ ఔట్‘ అంటే కేవలం ఫుడ్ కాకుండా, ఆటలతో కలిపిన ఎంటర్టైన్మెంట్ను సూచిస్తోంది. నగరంలో స్నూకర్, పూల్ లాంజ్‌లు జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కూకట్పల్లి, హిమాయత్ నగర్లలో అందుబాటులో ఉండగా డార్ట్, షాఫుల్ బోర్డు గేమ్స్ గండిపేట్, ఫైనాన్షియల్ డిస్ర్టిస్క్ట్, కొండాపూర్‌లో బోర్డ్ గేమ్స్, సాఫ్ట్ గేమింగ్ లాంజ్‌లు మాదాపూర్, మణికొండ, బంజారాహిల్స్‌లో యువతను ఆకర్షిస్తున్నాయి. బ్రిటన్ టు భారత్... పార్టీ గేమ్స్ కల్చర్ పాశ్చాత్య దేశాల నుంచి భారత్‌లోకి వచ్చింది. ముఖ్యంగా యూరప్‌లోని బ్రిటన్ దేశంలో స్నూకర్ పురుడు పోసుకుంది. అక్కడి పబ్ సంస్కృతిలో భాగంగా బిల్లియర్డ్స్, పూల్, డార్ట్ వంటి గేమ్స్ ప్రాచుర్యం పొందాయి. కాలక్రమేణా ఈ సంస్కృతి మల్టీనేషనల్ కంపెనీల ఉద్యోగుల ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. హైదరాబాద్ వంటి ఐటీ హబ్‌లలో ఇది వేగంగా వ్యాపించింది. ఉద్యోగులకు ఈ గేమ్స్ రిలాక్సేషన్‌తోపాటు టీమ్ బాండింగ్ సాధనంగా ఉపయోగపడుతున్నాయి. ఇదొక స్టేటస్ సింబల్... ఇప్పుడు పబ్‌కి వెళ్తే కేవలం మ్యూజిక్, డ్రింక్స్ కాదని, మినీ టోర్నమెంట్లు, ఫ్రెండ్స్ సర్కిల్ మధ్య స్నూకర్ మ్యాచ్‌లు సర్వసాధారణం అయ్యాయి. కొన్ని సంస్థలు కూడా తమ ఉద్యోగుల కోసం ఈ గేమ్స్‌ను కార్పొరేట్ పార్టీలలో భాగంగా ఉపయోగిస్తున్నాయి. యువతలో ఇది ఒక స్టేటస్ సింబల్‌గా కూడా మారుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పబ్లిక్ స్పేస్‌లు గేమింగ్ కల్చర్‌తో ముడిపడి, సాంస్కృతిక మార్పునకు సూచికలుగా మారుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతితో సమన్వయం సాధిస్తూ, నగరం తనదైన శైలితో ముస్తాబవుతోంది.ఇదీ చదవండి: అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవోఫ్రీ లేదా ప్లే అండ్ పే... నగరంలోని ఐక్యూ లాంజ్, స్ట్రైకర్ క్లబ్, ది హోపరీ, హార్ట్ కప్ కాఫీ, గేమర్స్ డెన్, సోబో కేఫ్ వంటి వాటిలో ఇలాంటి పార్టీ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. కొందరు నిర్వాహకులు ఈ గేమ్స్ తమ కస్టమర్లకు ఉచితంగా ఆడుకోవడానికి ఏర్పాటు చేస్తే, మరికొందరు మాత్రం ప్లే అండ్ పే అంటూ చార్జ్ చేస్తున్నారు. మరికొందరైతే రీ చార్జ్ గేమింగ్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు. చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి

మిల్లెట్స్‌తో ఆరోగ్యం మెరుగు: అమల
లెట్ సీ కమ్యూనిటీ ప్రారంభం మాదాపూర్: అందరూ ఆహారంలో మిల్లెట్స్‌ను భాగం చేసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుందని సినీనటి, సామాజిక కార్యకర్త అమల అక్కినేని అన్నారు. మాదాపూర్‌లోని మినర్వా గ్రాండ్ హోటల్లో శనివారం లెట్ సీ (లివింగ్ త్రూ కమ్యూనిటీ)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహారం, ఆధ్యాతి్మకత, ఆరోగ్యం, ఉద్యమోన్యుఖత అనే నాలుగు అంశాలు మన జీవితంలో ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మిల్లెట్లను వాడుతూ ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆనందంగా ఉండాలని కోరారు. లెట్సీ ద్వారా ఫిజికల్ మీటింగ్స్, ఆన్లైన్ సమావేశాలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మధ్యతరగతి యువతను మిల్లెట్ పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని ప్రశంసించారు. లెట్ సీ చైర్మన్ ప్రసన్న శ్రీనివాస్ శరకడం మాట్లాడుతూ టిపిన్స్, భోజనాల పోడులు, నూడుల్స్, పాస్తా, స్నాక్స్, మిఠాయిలు తదితర ఉత్పత్తుల గురించి వివరించారు. 50 మంది డాక్టర్లతో ఏర్పాటు చేసిన హెచ్‌ఎన్‌ఏ కౌన్సిల్ తరపున డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ మండలాల వారీగా ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు డాక్టర్లు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అడ్వకేట్ గోషిక, సీఎ ప్రవీణ్‌కుమార్, మిల్లెట్ రైతులు, వినియోగదారులు, లెట్సీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెట్ ఫెస్ట్.. స్టైలిష్ డాగ్స్విభిన్న జాతులు.. వివిధ రకాల పెంపుడు కుక్కలు సందడి చేశాయి. చూపరులను ఆకట్టుకున్నాయి. శనివారం బీ2ఎం వెట్‌కేర్ ఆసుపత్రిలో రెయిన్బో విస్టాస్ పెట్ లవర్స్ అసోసియేషన్ సహకారంతో పెట్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ మెగా పెట్ ఫెస్ట్‌లో 40కిపైగా విభిన్నమైన జాతుల స్టైలిష్ డాగ్‌లు కనువిందు చేశాయి. పెంపుడు జంతువులను ఆకర్షించడం, వాటితో స్నేహం చేయడం, అనుభవాలను పంచుకోవడానికి పెద్ద సంఖ్యలో పెట్ లవర్స్ తరలి రావడంపై గర్వంగా ఉందని బీ2ఎం వెట్‌కేర్ వ్యవస్థాపకుడు సంతోష్‌నాయక్ అన్నారు. పెంపుడు జంతువుల సంరక్షణ చర్యలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి పెట్ ఒక ప్రత్యేకమైనదన్నారు.

ఎండలు మండించే సమ్మర్... చైల్డ్ కేర్!
పిల్లలకు ఆటల్లో ఒళ్లు తెలియకపోవడమే కాదు... ఎండ తీవ్రతా తెలియదు. ఇప్పటికే ఎర్రటి ఎండ మండుతోంది. ఇంతటి ఎండల తీవ్రత వల్ల ఆరుబయట ఆడే పిల్లలకు వడదెబ్బ మొదలుకొని, డీహైడ్రేషన్ వరకు ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నీడపట్టున ఉంటే వడదెబ్బ తగలదని కొందరి అభిప్రాయం. కానీ నీడ ఉన్నప్పటికీ అక్కడ వేడిమి తీవ్రత ఎక్కువగా ఉంటే వడదెబ్బ తగిలే ప్రమాదం లేకపోలేదు. వేసవిలో చిన్నారులకు ఎండ ముప్పులు ఏయే రూపాల్లో వస్తాయో చూద్దాం. ఎండ తీవ్రతతో సమస్యలివి... మజిల్ క్రాంప్స్ : దేహం తన జీవక్రియలను కొనసాగించడానికి మెదడు నుంచి ప్రతి నరానికీ ఆదేశాలు అందుతూ ఉంటాయి. ఈ ఆదేశాలన్నీ లవణాలలోని విద్యుదావేశం కలిగిన అయాన్లు నరాల ద్వారా ప్రసరించడం వల్ల కండరాలకు ఆదేశాలందుతూ ఉంటాయి. ఇదీ చదవండి: అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవోఎండవేడిమి తీవ్రతతో చెమట రూపంలో నీటినీ, లవణాలనూ కోల్పోవడం వల్ల నరాల ద్వారా మెదడునుంచి కండరాలకు సరైన ఆదేశాలందవు. దాంతో డీ–హైడ్రేషన్‌కు గురి కాగానే కండరాలు బిగుసుకుపోతాయి. వీటినే మజిల్క్రాంప్స్గా చెబుతారు. మజిల్క్రాంప్స్ వస్తే వెంటనే దేహానికి నీటిని అందించాలి. పిల్లల్లో మజిల్ క్రాంప్స్ వస్తే : పిల్లలకు మజిల్క్రాంప్స్ కారణంగా కండరాలు బిగదీసుకుపోతుంటే వారికి ‘ఓరల్–రీ-హైడ్రేషన్ (ఓఆర్ఎస్) ద్రావణాన్ని తాగించాలి. ∙ఓఆర్ఎస్ అందుబాటులో లేక΄ోతే కొబ్బరినీళ్లు కూడా తాగించవచ్చు. ఓఆర్‌ఎస్‌గానీ, కొబ్బరినీళ్లుగానీ అందుబాటులో లేకపోతే... ఒక అరటిపండు తినిపించి, మంచినీళ్లు తాగించాలి. అరటిపండులో నొటాషియం వంటి లవణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అరటిపండూ, నీళ్లతో అవి చాలావరకు భర్తీ అవుతాయి.వడదెబ్బ : ఒక్కోసారి చాలా ప్రాణాంతకంగా మారే మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్ ఈ వడదెబ్బ. శరీర జీవక్రియలన్నీ సక్రమంగా జరగడానికి అవసరమైన ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్. కానీ పిల్లలు వడదెబ్బకు లోనైతే వారి శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగి΄ోతుంది. వాస్తవానికి శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీలు మెయింటెయిన్ అయ్యేందుకు మెదడులోని హై΄ోథెలామస్ అనే గ్రంథి తోడ్పడుతుంది. చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళిదేహ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమటలు పట్టి... దేహంలోంచి ఉష్ణోగ్రతను తీసుకుని ఆ చెమటలు ఆవిరైపోతూ ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత ఒకే స్థాయిలో మెయింటైన్ అవుతుంటుంది. కానీ దేహ ఉష్ణోగ్రత అదేపనిగా పెరిగి΄ోతూండటంతో స్వేదగ్రంథులు అలసిపోయి ఇక ఏమాత్రం పనిచేయని స్థితికి చేరుకుంటాయి. దాంతో శరీరం వేడెక్కుతున్నా... దాన్ని నియంత్రిస్తూ ఉష్ణోగ్రత సమంగా ఉండేలా చేయడానికి అవసరమైన యంత్రాంగం విఫలం కావడంతో దేహ ఉష్ణోగ్రత ఇంకా ఇంకా పెరిగి΄ోతుంది. దీనికి ఓ సూచన కూడా ఉంటుంది. పిల్లల చంకల్లోనూ చెమట పట్టని స్థితి రావడం ఒక్కోసారి పిల్లలు స్పృహ తప్పిపోయి అపస్మారక స్థితికి చేరడం వడదెబ్బను సూచిస్తాయి.వడదెబ్బలో లక్షణాలివి... వికారం, వాంతులు; కళ్లు తిరగడం; ∙నీరసం, స్పృహ తప్పడం, ఫిట్స్ రావడం,చివరగా కోమాలోకి వెళ్లడం జరగవచ్చు. వడదెబ్బకు చికిత్స: దేహ ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు చేరి అంతకంతకూ పెరుగుతుంటే... ఆ కారణంగా మెదడు, గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి కీలకమైన అవయవాల పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. అప్పుడు శరీర ఉష్ణోగ్రతను మళ్లీ సాధారణ స్థాయికి (నార్మల్కు) తీసుకురావడం అవసరం. ఒంటి ఉష్ణోగ్రత 100 ఫారెన్‌హీట్‌కు మించుతున్నట్లు తెలియగానే వెంటనే పిల్లలను చల్లటి గాలి సోకేలా ఫ్యాన్ కింద ఉంచాలి. ఫ్యాన్ కింద కూడా వేడిగాలి వస్తుంటే పిల్లల దుస్తులను వదులు చేసి, ఒంటికి చల్లగాలిని బాగా తగలనివ్వాలి. దుస్తులు ఇబ్బందికరంగా ఉంటే నడుముకు చిన్న ఆచ్ఛాదన ఉంచి, బట్టలన్నీ తీసేయాలి. చల్లటి నీటిలో ముంచిన గుడ్డతో ఒళ్లంతా తుడుస్తూ చల్లటి గాలి ఒంటికి వేగంగా తగులుతూ వెళ్లేలా చూడాలి. ఇలా ఒళ్లు త్వరగా చల్లబడుతుంది. ∙ఈ చర్యల తర్వాత కూడా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే పిల్లల చంకల కింద / గజ్జల దగ్గర ఐస్ గడ్డలనుంచాలి. దాంతో శరీరం మరింత చల్లబడుతుంది. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే, దాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ఒబేస్ పిల్లలకు జాగ్రత్త అవసరం! మామూలు పిల్లలతో పోలిస్తే కాస్త ఒబేస్‌గా ఉండే పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ పిల్లల ఒంట్లోంచి నీళ్లు కోల్పోతున్నప్పుడు ఆ నీటితో పాటు విలువైన ఖనిజలవణాలనూ కోల్పోతున్నారని గ్రహించాలి. స్థూలకాయమున్న పిల్లలు బాగా ఆటలాడుతున్నప్పుడు ప్రతి కిలోకు 50 మిల్లీలీటర్ల నీరు కోల్పోవచ్చు. దాంతో తమ పిల్లలు బరువు కోల్పోతూ, ఆరోగ్యంగా మారుతున్నారంటూ పెద్దలు అపోహ పడటం సరికాదు. వాళ్లు విలువైన ఖనిజలవణాలు కోల్పోయి డీ–హైడ్రేషన్‌కు గురవుతున్నారనే విషయాన్ని గ్రహించాలి. అందుకే ఇలా బరువు తగ్గుతున్నప్పుడు పెద్దలు వారి ఒంటిలో జరిగే జీవక్రియలకు (మెటబాలిక్ యాక్టివిటీస్‌కు) అవసరమైన నీటిని వెంటవెంటనే భర్తీ చేస్తూ ఉండాలి. అందుకే స్థూలకాయులైన పిల్లలు వెంటవెంటనే మరింత బరుతు తగ్గుతున్నట్లు గ్రహిస్తే పెద్దలు వారి ఒంట్లోకి తగిన ఎలక్ట్రోలైట్స్ పంపించేందుకు కొబ్బరినీళ్లు, గ్లూకోజ్ వంటివి ప్రతి 20 నిమిషాలకొకసారి తాగిస్తూ ఉండటం తప్పనిసరి. ఎండ దుష్ప్రభావాల నివారణ ఇలా... ఎండవేళల్లో పిల్లలు బయటకు వెళ్లకుండా ఇంట్లోని చల్లటి ప్రదేశాల్లోనే ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఎండవేళల్లో ఇన్డోర్ గేమ్స్‌కు మాత్రమే వారిని పరిమితం చేస్తే బాగుంటుంది. ∙ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారిని ఇంట్లోనే, అందునా ఇంట్లో కూడా చల్లగా ఉండే ప్రదేశాల్లోనే ఉండేలా చూడాలి. ఆటల్లో పూర్తిగా నిమగ్నమైపోయిన పిల్లలు తరచూ మంచినీళ్లు తాగకపోవచ్చు. అందుకే తరచూ వారు కొద్దికొద్దిగా మంచినీళ్లు తాగుతుండేలా చూడాలి. వీలైతే మధ్యమధ్యలో కొబ్బరినీళ్లు, పళ్లరసాలు కూడా ఇవ్వవచ్చు. ఇలాంటి కొద్దిపాటి జాగ్రత్తలతో పిల్లలు వేసవి దుష్ప్రభావాలకు లోనుకాకుండా జాగ్రత్త పడాలి. సాయంత్రాలు బాగా చల్లబడ్డ తర్వాతనే వాళ్లను ఔట్‌డోర్ గేమ్స్‌కు అనుమతించాలి. ఎండలు మండిపోతున్నాయి. పిల్లలకు సెలవులూ వచ్చాయి. నీడపట్టున ఉండాల్సిన పిల్లలు కాస్తా సెలవుల్లో ఆడుకోవడం కోసం ఎండల్లోకి వెళ్తే...? అది మరింత ప్రమాదం. ఈ వేసవి వేడిమితో చిన్నారులకు వచ్చే సమస్యలేమిటో, ఈ సెలవుల ఎండల్లోంచి పిల్లలను కాపాడుకోవడం ఎలాగో తెలిపే కథనమిది.ఎండల్లో పిల్లలు ఎక్కువగా చెమట వల్ల నీరూ, లవణాలూ కోల్పోతున్నారని తెలియడానికి విపరీతంగా చెమట పట్టడమే సూచన అని కొందరు అ΄ోహపడుతుంటారు. అది వాస్తవం కాదు. పిల్లలతో పోలిస్తే పెద్దల్లో చెమట గ్రంథులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉష్ణోగ్రత పెరగగానే చెమటలు పట్టడం పెద్దల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ పిల్లల్లో అలా కాదు. వాళ్లలో పెద్దల మాదిరిగా చెమటలు పట్టాలంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం. ఒంటిని చల్లబరిచే మెకానిజమైన చెమట పట్టడమన్నది పిల్లల్లో కాస్త తక్కువే కావడం వల్ల పెరిగే కొద్దిపాటి వేడిమి కూడా పిల్లలపై ఎక్కువగా దుష్ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలకు పెద్దగా చెమటలు పట్టక΄ోయినా... వాళ్ల ఒంటి ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుందని తెలుసుకోవడంతోపాటు చిన్నపిల్లల్లో చెమట గ్రంథుల సంఖ్య తక్కువ కాబట్టి వేడెక్కిన ఒళ్లు వెంటనే చల్లబడదు కాబట్టి బాగా చల్లగా ఉండేచోటే వాళ్లు ఆడుకుంటూ ఉండేలా చూడాలి. ఆరుబయటి ఉష్ణోగ్రత బాగా తగ్గాకే వారిని బయట ఆటలాడటానికి అనుమతించాలి. డా. శివనారాయణ రెడ్డి వెన్నపూస,సీనియర్ నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్

ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు మస్ట్!
గతంలో గర్భధారణ (ప్రెగ్నెన్సీ) ప్లానింగ్ అంటూ ఏదీ ఉండేది కాదు. నిజానికి తమకు కావాల్సినప్పుడు, తమకు అవసరమైన సమయంలోనే ప్రెగ్నెన్సీ వచ్చేలా ప్లాన్ చేసుకుంటే... అది వచ్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కాబోయే తల్లికీ, పుట్టబోయే బిడ్డకూ చాలా ప్రయోజనాలు ఉంటాయి. తల్లీ బిడ్డా సురక్షితంగా కూడా ఉంటారు. సరైన ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌తో ప్రయోజనాలెలా కలుగుతాయో తెలుసుకుందాం. గతం తరం యువతుల్లో తమకు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం నెల తప్పిన తర్వాత గానీ తెలిసేది కాదు. అప్పుడు... తమకు పెగ్నెన్సీ వచ్చిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇంట్లోనే కొన్ని పరీక్షలు చేసుకునేవారు. అయితే గర్భధారణను ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లల్లో కొన్ని లోపాల నివారణకు ముందునుంచే జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న మహిళ తాము నెల తప్పాలనుకున్న మూడు నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అనే పోషకాన్ని తీసుకోవడం వల్ల ప్రయోజనాలుంటాయి. మార్కెట్లో మాత్రల రూపంలో దొరికే ఈ ఫోలిక్ యాసిడ్ చాలా చవక. నిజానికి పాలకూర లాంటి ఆకుకూరల్లో అది సమృద్ధిగా ఉంటుంది. పిండంలో వచ్చేందుకు అవకాశమున్న న్యూరల్ ట్యూబ్ (వెన్నుపాము) లోపాలను అది అరికడుతుంది. పుట్టుకతో వచ్చే ఈ వెన్నుపాము లోపాలను స్పైనాబైఫిడా అంటారు. చదవండి: అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవోఫోలిక్ యాసిడ్ ఇలాంటి అనేక ప్రెగ్నెన్సీ లోపాలను అరికడుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్న మహిళలకు మూడు నెలల ముందునుంచే ఆబ్స్ట్రెష్టీషియన్స్/ గైనకాలజిస్టులు ఫోలిక్ యాసిడ్ మాత్రలను సూచిస్తుంటారు. ప్రెగ్నెన్సీ ప్లాన్నింగ్ వల్ల స్పైనా బైఫిడా మాత్రమే కాకుండా పౌష్టికాహార లోపాల వల్ల పిండదశలో ఎదురయ్యే మరెన్నో సమస్యలూ నివారించవచ్చు. అంతేకాదు... దేశంలోని మహిళల్లో దాదాపు 59 శాతం మందిలో రక్తహీనత (అనీమియా) ఎక్కువ. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే మహిళకు ఐరన్ సప్లిమెంట్లు ఇవ్వడం ద్వారా కూడా కాబోయే తల్లీ, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంది. చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళిగర్భం ప్లాన్ చేసుకున్న నాటి నుంచి మహిళకు అన్ని పోషకాలూ అందేలా ఆరోగ్యకరమైన సమతు లాహారాన్ని ఇవ్వడం, అందులో కూరగాయలు, ఆకుకూరలు, తాజాపండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలతో ఇటు కాబోయే తల్లి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో పాటు, ఆ చిన్నారికి తగినంత రోగనిరోధక శక్తి సమకూరేలా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశముంటుంది. డా.స్వప్న సముద్రాలసీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రీషియన్
ఫొటోలు


ఓజీ భామ ప్రియాంక మోహన్ గ్లామర్ షో (ఫొటోలు)


శతాబ్దాల చరిత్రకు నిలయం డిచ్పల్లి ఖిల్లా రామాలయం.. అద్భుతాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే (ఫొటోలు)


విజయవాడలో సందడి చేసిన నటి కీర్తి సురేష్ (ఫొటోలు)


సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో సినీనటి సౌమ్యజాను (ఫొటోలు)


నటి అభినయ దంపతులను ఆశీర్వదించిన ఓంకార్, సముద్రఖని (ఫోటోలు)


#PavaniReddy : రెండో పెళ్లి చేసుకున్న నటి పావని రెడ్డి... ఫోటోలు వైరల్


జమ్మూ కశ్మీర్ అతలాకుతలం.. ప్రకృతి విలయ తాండవం (ఫొటోలు)


శ్రీదేవి సోడా సెంటర్ హీరోయిన్ ఆనంది లేటెస్ట్ ఫోటో గ్యాలరీ


'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)


హైదరాబాద్ : గచ్చిబౌలిలో తారల సందడి (ఫొటోలు)
అంతర్జాతీయం

త్వరలో 30 ఎంబసీలు, 17 కాన్సులేట్ల మూసివేత
వాషింగ్టన్: అమెరికాలో ఇప్పటికే వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులు తొలగించిన ట్రంప్ సర్కార్ త్వరలో విదేశాల్లోని తమ రాయబార కార్యాలయాల సిబ్బందిపైనా తొలగింపు వేటు వేయనుందని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వంలోని అంతర్గత మంత్రిత్వశాఖకు సంబంధించిన డాక్యుమెంట్లలో ఆయా వివరాలు ఉన్నట్లు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రధానంగా యూరప్, ఆఫ్రికా ఖండాల్లో ఎక్కువ రాయబారకార్యాలయాలు, కాన్సులేట్లను శాశ్వతంగా మూసేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా 30 ఎంబసీలు, 17 కాన్సులేట్ కార్యాలయాలకు తాళాలు పడే అవకాశముంది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ వ్యయ నియంత్రణ ప్రతిపాదనల్లో భాగంగా ప్రభు త్వం ఈ చర్యలకు ఉపక్రమిస్తోందని తెలుస్తోంది. సోమాలియా, ఇరాన్ దేశాల్లోనూ అమెరికా తన ప్రాధాన్యాన్ని తగ్గించుకోనుంది.

ఉల్కాపాతపు వెలుగులు
అంతరిక్ష వీక్షకులకు మరో రెండు రోజుల్లో పండుగే. లైరైడ్ ఉల్కాపాతం వారికి కావాల్సినంతగా కనువిందు చేయనుంది. ఉత్తరార్ధ గోళంలోని వారు ఏప్రిల్ 22న తెల్లవారుజాము నుంచి కనీసం రెండు రోజుల పాటు ఈ ఖగోళ అద్భుతాన్ని తనివితీరా ఆస్వాదించవచ్చు. మబ్బుల వంటివేమీ లేకుండా వాతావరణం పొడిగా, వీలైనంత చీకటిగా ఉంటే చాలు. గంటకు కనీసం 10 నుంచి 20 దాకా ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించి ప్రకాశవంతంగా మండిపోతూ కని్పస్తాయి. ఒక్కోసారి వాటి సంఖ్య గంటకు 100 దాకా కూడా ఉంటుంది. ఈ వార్షిక ఖగోళ వింత సాధారణంగా ఏప్రిల్ 20 తర్వాత ఏర్పడుతూ ఉంటుంది. ఏమిటి ఇవి: ఏటా భూమిని పలకరించే ఈ ఉల్కలను లైరైడ్స్గా పిలుస్తారు. వీటి మూలాలు లైరా నక్షత్రరాశిలో ఉండటమే అందుకు కారణం. అక్కడినుంచి పుట్టుకొచ్చిన థాచర్ అనే తోకచుక్క ఈ ఉల్కలకు మాతృస్థానం. థాచర్‌ను 1861లో తొలిసారిగా గుర్తించారు. ఇది సూర్యుని చుట్టూ 415 ఏళ్లకు ఓసారి చొప్పున తిరుగుతుంటుంది. ఆ క్రమంలో ఏటా ఏప్రిల్ చివర్లో భూమికి అతి సమీపంగా వస్తుంది. అప్పుడు దాని తోక తాలూకు శిథిలాలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంటాయి. కొన్ని అనామకంగా అదృశ్యమైపోతాయి. మరికొన్ని మాత్రం ప్రకాశవంతంగా మండిపోతూ అందమైన వెలుతురు వలయాలను సృష్టిస్తాయి. అందుకే వీటిని తారా సమూహంగా కూడా పిలుస్తుంటారు. ఎప్పుడు చూడొచ్చు: ఏప్రిల్ 22 తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య సమయంలో లైరైడ్స్ను వీక్షించేందుకు అత్యంత అనువైనది. ఆ సమయంలో వాటి సంఖ్య, వెలుతురు రెండూ గరిష్టంగా ఉంటాయి. – సాక్షి, నేషనల్ డెస్క్

బుల్లెట్‌కు బలైన భారతీయ విద్యార్థిని
న్యూయార్క్/తరన్ తారన్(పంజాబ్): ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి అక్కడ అనూహ్య ఘటనల్లో భారతీయులు ప్రాణాలు కోల్పోతున్న విషాద పర్వానికి ముగింపు కనిపించట్లేదు. తాజాగా కెనడాలో రెండు వాహనాల్లోని వ్యక్తుల మధ్య జరిగిన కాల్పుల ఘటనల్లో అభం శుభం తెలియని ఒక భారతీయ విద్యార్థిని బుల్లెట్ గాయాలకు బలైంది. పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లా ధుండా గ్రామానికి చెందిన 21 ఏళ్ల హర్సిమ్రత్ కౌర్ రంధావా కెనడాలో కాల్పుల ఘటనలో మృతిచెందారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఒంటారియో ప్రావిన్సులోని హామిల్టన్ నగరంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతి వార్త తెల్సి పంజాబ్‌లోని సొంతూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని వెంటనే భారత్‌కు తరలించాలని, నిందితులను కఠినంగా శిక్షించేలా కెనడా సర్కార్‌పై భారత ప్రభుత్వం ఒత్తిడితేవాలని సిమ్రత్ కుటుంబసభ్యులు డిమాండ్‌చేశారు. అసలేం జరిగింది? ఉన్నత విద్య కోసం సిమ్రత్ రెండేళ్ల క్రితం కెనడాకు వెళ్లారు. అక్కడ మొహాక్ కాలేజీలో చదువుకుంటున్నారు. రోజులాగే బుధవారం రాత్రి తాత్కాలిక ఉద్యోగం చేసే చోటుకు వెళ్లేందుకు హ్యామిల్టన్‌లోని అప్పర్ జేమ్స్, సౌత్ బెండ్ రోడ్ వీధిలోకి వచ్చారు. అక్కడే ఉన్న బస్టాప్‌లో నిల్చుని బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న రెండు వాహనాల్లోని వ్యక్తులు పరస్పరం గన్లతో కాల్పులు జరుపుకున్నారు. ఈ సందర్భంలో వేరే దిశలో దూసుకొచ్చిన ఒక బుల్లెట్ సిమ్రత్ ఛాతీలోకి దూసుకెళ్లింది. దీంతో విపరీతంగా రక్తమోడుతూ అక్కడే కుప్పకూలారు. విషయం తెల్సి అక్కడికొచ్చిన పోలీసులు ఈమెను వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. తుపాకీ బుల్లెట్లు సమీపంలోని ఇంట్లోకి సైతం దూసుకెళ్లాయి. వీడియోలు ఉంటే ఇవ్వండి ఘటనపై హ్యామిల్టన్ పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలెట్టారు. నిందితుని కోసం వేట మొదలెట్టారు. కాల్పుల తర్వాత ఆ రెండు వాహనాలు వెంటనే ఘటనాస్థలి నుంచి వెళ్లిపోయాయని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. వాస్తవంగా ఏం జరిగిందని తెల్సుకునేందుకు సీసీటీవీ వంటి వీడియో ఫుటేజీలను సంపాదించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో అదే రోడ్లో వెళ్తున్న వాహనాల్లోని డ్యాష్‌క్యామ్ కెమెరా రికార్డులను ఇవ్వాలని స్థానికులను పోలీసులు కోరారు. భారతీయ విద్యార్థి మృతి పట్ల విదేశాంగ శాఖ తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ఈ మేరకు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘కాల్పుల్లో అమాయక భారతీయురాలు ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం. సిమ్రత్ కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహం తరలింపుసహా అన్నిరకాల సహాయసహకారాలు ప్రభుత్వం నుంచి అందుతాయి’’అని పేర్కొంది.

మూడో దశ చర్చలు 26న
రోమ్: అణు కార్యక్రమాలను ఇరాన్ మరింతగా వేగవంతం చేసిన నేపథ్యంలో ఆ దేశంతో అమెరికా మొదలెట్టిన రెండో దఫా చర్చలు శనివారం రోమ్‌లో ముగిశాయి. తొలి దఫా చర్చలు ఒమన్‌లో ముగియగా రెండో రౌండ్ చర్చలు ఇటలీ వేదికగా శనివారం జరిగాయి. ఇటలీ రాజధాని రోమ్ నగరానికి సమీపంలోని క్యామిలూసియా ప్రాంతంలోని ఒమన్ రాయబార కార్యాలయంలో ఈ పరోక్ష చర్చలు జరిగాయి. అమెరికా తరఫున అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగీ్చలు చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చలకు ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైదీ మధ్యవర్తిగా వ్యవహరించారు. అయితే రెండోదఫా చర్చల్లో ఎలాంటి పురోగతి ఉందనే వివరాలను ఇరుదేశాలు వెల్లడించలేదు. అయితే ఏప్రిల్ 26వ తేదీన ఒమన్‌లో స్టీవ్ విట్కాఫ్తో మూడో దఫా చర్చలు జరగనున్నాయని ఇరాన్ మంత్రి అబ్బాస్ చెప్పారు. ‘‘ఇరాన్ గొప్పగా, సుసంపన్నంగా ఉంటే సరిపోతుంది. అణ్వాస్త్ర సామర్థ్యంతో పనిలేదు. ఆ సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవడమే మా లక్ష్యం’’అని ట్రంప్ శుక్రవారం వ్యాఖ్యానించారు. ‘‘మేం ఎల్లప్పడూ బాధ్యతాయుతంగానే మెలిగాం. సమస్యలకు దౌత్యమార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నాం. సంపత్రింపులు కొనసాగుతాయి’’అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ శనివారం తన ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. చర్చలు ముందు ఇరాన్ మంత్రి అరాగ్చీ ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీతో భేటీ అయ్యారు. తదుపరి చర్చల్లో రష్యా సైతం భాగస్వామి కానుందని వార్తలొచ్చాయి.
జాతీయం

ప్రకృతి ప్రకోపం: ‘ఒక్కరాత్రిలోనే సర్వస్వం కోల్పోయాం’
న్యూఢిల్లీ: ప్రకృతి ప్రకోపానికి జమ్మూ కశ్మీర్ లోని రాంబాన్ కు చెందిన చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడటంతో పాటు భారీ వరద నీటికి ఒక్క రాత్రిలోనే తమ జీవితం తల్లకిందులైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆస్తులు, ఇళ్లులు అన్నీ కూడా ఆ ఘటనతో కోల్పోయమని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. ఇందులో ఓం సింగ్ అనే దుకాణదారుడు తన షాపు ఎలా నీటిలో కొట్టుకుపోయిందో ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. నేను అవతలి వైపు ఉంటున్నాను. కానీ అక్కడ నీటి ప్రవాహం చాలా అధికంగా ఉంది. మేము ఇక్కడకి సకాలంలో చేరుకోలేక పోయాం. నేను ఇక్కడికి చేరుకునే సరికి నా షాపు సహా మొత్తం మార్కెట్ అంతా అదృశ్యమైంది. దీనిని నేను కళ్లారా చూశాను. ఇలాంటింది చూడటం ఇదే తొలిసారి’ అని రాంబన్ నివాసి ఓమ్ సింగ్ తెలిపాడు.ఇది ఒక్క రాంబన్ పరిస్థితే కాదు. చాలా మంది పరిస్థితి ఇలానే ఉంది. తమ సర్వస్వం కోల్పోయామని వారు విలపిస్తున్నారు. వరద నీటి ప్రవాహానికి కొండచరియలు విరిగిపడటమే కాదు తాము సర్వస్వం కోల్పోయామని అంటున్నారు. కొండచరియలు విరిగిపడిన కారణంగా చాలా ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు కొందరు పేర్కొన్నారు.#WATCH | Ramban, J&K: Om Singh, a local, says, "I live on the other side, but even there, the flow of water was very strong, we could not make it here in time. When I reached here, I saw the whole market, including my shop, had vanished... This is the first time I am seeing… https://t.co/aPfmXKXGjZ pic.twitter.com/VjIFqY4ySd— ANI (@ANI) April 20, 2025 #WATCH | Jammu and Kashmir: Several buildings have been damaged due to a landslide following heavy rains and hailstorm in Ramban district pic.twitter.com/jx3MGycq4s— ANI (@ANI) April 20, 2025

మగవారి హక్కుల కోసం.. పురుష సత్యాగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా కమిషన్ మాదిరిగానే.. పురుషులకూ ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ హస్తినలో మార్మోగింది. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో శనివారం ‘పురుష సత్యాగ్రహం’ చేపట్టారు. సేవ్ ఇండియా ఫ్యామిలీ సంస్థ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. పురుషులు, భర్తల హక్కుల కోసం పోరాడుతున్న దేశంలోని సుమారు 40 ఎన్జీవోల ప్రతినిధులు 1,000 మందికి పైగా హాజరయ్యారు.వారిలో.. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు వంద మంది సహా.. ఇటీవల భార్యల చేతుల్లో హత్యకు గురైన, భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న భర్తల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. పురుషులకు ప్రత్యేక కమిషన్‌తోపాటు.. చట్టాల్లో లింగ వివక్షను రూపుమా పాలని, గృహహింస, లైంగిక వేధింపుల కేసులతో పెరుగుతున్న పురు షుల ఆత్మహత్యల నిరోధానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.∙

నిశ్చితార్థంలో కాబోయే భార్య చేసిన పనికి.. పెళ్లిరోజే వరుడు షాకింగ్ నిర్ణయం
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కాబోయే భార్య వేధింపులకు తాళలేక పెళ్లి రోజే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాసిక్‌కు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారి హరేరామ్(36)కి, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన మోహినికి నిశ్చితార్థం జరిగింది.మోహిని తన లవర్‌ను హగ్ చేసుకోవడం చూసిన హరేరామ్.. నిలదీశాడు. ఈ సంఘటన ఆమె ప్రేమ వ్యవహారాన్ని బట్టబయలు చేయడంతో ఈ విషయం బయటకు చెబితే తనతో పాటు కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెడతానని ఆమె బ్లాక్‌మెయిల్‌కు దిగింది.నిరంతరం తీవ్ర వేధింపులకు గురిచేయడంతో మానసిక ఒత్తిడికి గురై విసిగిపోయిన హరేరామ్.. నాసిక్‌లోని ఉత్తమ్‌నగర్ ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువతితో పాటు ఆమె లవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు.

జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. వరద బీభత్సంతో భయానక వాతావరణం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందగా.. సుమారు 100 మందిని సహాయక బృందాలు కాపాడాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కొండ చరియలు విరిగి పడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బాగ్నా గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో ముగ్గురు మరణించారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) రాంబన్ కుల్బీర్ సింగ్ ధృవీకరించారు. మృతులను మొహమ్మద్ అకిబ్ (14), మొహమ్మద్ సాకిబ్ (9), మోహన్ సింగ్ (75) గా గుర్తించారు. వీరందరూ బాగ్నా పంచాయతీ నివాసితులు.#JammuKashmir | Heavy rainfall in several parts of Bhalessa, Doda#Rainfall pic.twitter.com/8rDEyL8X3l— DD News (@DDNewslive) April 20, 2025 #Ramban | Flash floods triggered by heavy rains hit a village near the Chenab River in Dharamkund, J&K.#JammuKashmir #Dharamkund pic.twitter.com/mrcL9RX7Ja— DD News (@DDNewslive) April 20, 2025మరోవైపు.. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. సుమారు 100మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయినట్లు చెబుతున్నారు. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతవరణ పరిస్థితుల వల్లే జమ్మూలో భారీ వర్షాలు, తుఫాను సంభవించిందని వాతావరణ శాఖ తెలిపింది. ఐదేళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు, బలమై గాలులు వీయడం ఇదే మొదటిసారని పేర్కొంది.#Srinagar #Jammu National Highway is closed for traffic due to landslides & mudslides at multiple locations between Ramban and Banihal.The situation is extremely bad,as several vehicles have been damaged by landslides. Since last evening, #Banihal has received 71 mm of rainfall pic.twitter.com/zPj6hEgAl1— Indian Observer (@ag_Journalist) April 20, 2025ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. రాంబన్‌లో కొండ చరియలు విరిగిపడడం వల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందన్నారు. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇక, జిల్లా అంతటా రెండు హోటళ్ళు, అనేక దుకాణాలు, నివాస నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రహదారులన్నీ బురదతో నిండిపోయాయి. మహిళలు, పిల్లలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.जम्मू कश्मीर मे बादल फटने से भयंकर तबाहीहजारों लोगों की जान पर आफतजम्मू -श्रीनगर नेशनल हाईवे भारी बारिश और लैंडस्लाइड के कारण बंद करना पड़ा हाईवे पर कीचड़ भरा मालवा आने से इसके नीचे कई गाड़ियां दब गई है#JammuKashmir #jammusrinagarhighway #landslide #rain #ramban pic.twitter.com/wH16tknzWt— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) April 20, 2025Five vehicles half buried under debris in T2 Ramban#LANDSLIDE #CLOUDBURST #ramban pic.twitter.com/ucMCDsXvRf— Gulistan News (@GulistanNewsTV) April 20, 2025Flood like situation on Jammu - Srinagar National Highway. Avoid a journey till 22 April.Most affected areas: Banihal, Panthyal, and adjacent areas. pic.twitter.com/QUpZMzx8fX— Kashmir Weather (@Kashmir_Weather) April 20, 2025
ఎన్ఆర్ఐ

హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
హాంకాంగ్‌లో ఉగాది వేడుకలు తెలుగు కుటుంబాలకు యెంతో ఉత్సాహాన్నిచ్చాయి, తెలుగు సంవత్సరాదిని ఐక్యతతో, సాంస్కృతిక సంపదతో జరుపుకుంన్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) నిర్వహించే ఈ కార్యక్రమం, అనధికారికంగా ఇరవై రెండు సంవత్సరాలుగా మరియు పదమూడు సంవత్సరాల అధికారిక సంస్థగా తెలుగు సేవ కొనసాగిస్తోంది. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్‌లో సుదీర్ఘ వారాంతం సెలవలు ఉన్నప్పటికీ, విశేషమైన సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హాంకాంగ్ & మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి కాన్సుల్ శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు; హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి శ్రీ మొక్ మాంగ్-చాన్ గారు; ఎన్.ఎ.ఎ.సి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి కోనీ వాంగ్ గారు; మరియు హాంకాంగ్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నత అధికారి శ్రీ దేవేష్ శర్మ గారు హాజరయ్యారు.చీకటిని పారద్రోలడానికి మరియు కొత్త ప్రారంభాలను స్వాగతించడానికి ప్రతీకగా గౌరవనీయ అతిథుల దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమైంది. ప్రార్థన తర్వాత, హాజరైన వారిని "మా తెలుగు తల్లి" శ్రావ్యమైన పాట ఆకట్టుకుంది,తెలుగుతనాన్ని ప్రేక్షక హృదయాలలో ప్రతిధ్వనించింది. ప్రముఖుల ప్రసంగాలు సమాజ ప్రయాణం మరియు దాని సభ్యులను బంధించే లక్ష్యం గురించి ప్రతిబింబించాయి. శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు తెలుగు భాష మరియు సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటిస్తూ ఇది భావితరాలికి అందించాల్సిన కర్తవ్య ప్రాముఖ్యతని గుర్తుచేశారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్ కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.తన ప్రసంగంలో, తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు హాంకాంగ్‌లోని తెలుగు వారిలో ఒక అనుబంధ భావన మరియు సంబంధాన్ని సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థ ప్రయాణం మరియు దాని లక్ష్యం గురించి ప్రతిబింబించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆమె యెంతో అవసరం అని చెప్పారు. హాంకాంగ్ మరియు భారతదేశంలోని వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.వినోదాత్మక స్కిట్ వైవిధ్యమైన ప్రదర్శనలను సజావుగా అనుసంధానించింది, ప్రేక్షకుల హర్షధ్వానాలు - కరతాళధ్వనులతో సాంస్కృతికోత్సవం ముగిసింది. ప్రదర్శలిచ్చిన కళాకారులను కాన్సల్ శ్రీ కూచిభొట్ల వెంకట్ రమణ గారు పురస్కరాలు అందజేస్తూ అభినందించారు.హాంకాంగ్‌లోని తెలుగు సమాజం శ్రీ విశ్వవాసు నామ ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్నందున, తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తూ సాంప్రదాయ ఉగాది పచ్చడితో, తెలుగు భోజనంతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం సమాజం యొక్క ఐక్యత, సేవా స్ఫూర్తికి నిదర్శనం, స్నేహం మరియు సేవా బంధాలను పెంపొందించడం, ఆనందం, విజయం మరియు సద్భావనతో నిండిన సంవత్సరాన్ని వాగ్దానం చేయడం మరియు తెలుగు ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం తార్కాణం.అధ్యక్షురాలు తన కృతజ్ఞతా ప్రసంగంలో,గౌరవనీయులైన అతిథులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సమాఖ్య సభ్యులు, స్నేహితులు మరియు తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

రాజాంలో విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం లో విద్యార్ధులకు ఉపకారవేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీశ్ గంథం తన సొంత ఊరికి చేతనైన సాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాంలోని శ్రీ విద్యానికేతన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సతీశ్ గంథం విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. అలాగే ఇక్కడే మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొని సతీశ్ గంథం సేవా నిరతిని ప్రశంసించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీష్ గంథం చూపిన చొరవను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు ప్రత్యేకంగా అభినందించారు.

డల్లాస్‌లో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం
అమెరికాలో సామాజిక బాధ్యత పెంచే కార్యక్రమాలను నాట్స్ తరచూ చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని డల్లాస్‌లోని ఫ్రిస్కో నగరంలో చేపట్టింది. డల్లాస్ నాట్స్ విభాగం ఆధ్వర్యలో ప్రిస్కోలోని మోనార్క్ పార్క్‌లో 50 మందికి పైగా నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్ధులు పాల్గొని పార్క్‌ని శుభ్రం చేశారు. ప్రకృతిని కాపాడేందుకు, శుభ్రతను ప్రోత్సహించేందుకు అడాప్ట్ ఎ పార్క్ వంటి కార్యక్రమాలు ఎంతో మేలును కలిగిస్తాయని, పార్కులను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణ హితమైన జీవనశైలికి మార్గం సుగమం అవుతుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు నాట్స్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం ద్వారా విద్యార్ధుల సేవను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వినియోగించి పార్కును శుభ్రపరిచారు. చెత్తను తొలగించారు. చెట్లకు నీరు పట్టారు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడ్డారు. విద్యార్ధులకు ఇది ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే గొప్ప అనుభవంగా మిగులుతుందని డల్లాస్ చాప్టర్ వ్కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రెజరర్ రవి తాండ్ర, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె, నాట్స్ సభ్యులు శివ మాధవ్, బద్రి, కిరణ్, పావని, శ్రీ దీపిక, ఉదయ్, వంశీ, వీరా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! రేపటి తరంలో సామాజిక బాధ్యత పెంచే అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన డల్లాస్ చాప్టర్ జట్టుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి తమ అభినందనలు తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో టంపాలో జరిగే 8 వ అమెరికా తెలుగు సంబరాలకు డల్లాస్‌లో ఉండే తెలుగువారంతా తరలిరావాలని కోరారు.

30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
గత మూడు దశాబ్దాల సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.....“విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా వంగూరు ఫౌండేషన్ ఎంపిక చేసి విజేతల వివరాలను ప్రకటించింది. అలాగే విజతలకు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు అభినందనలు తెలిపారు.వంగూరు ఫౌండేషన్ ప్రకటనఅమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఖతార్, చెకొస్లొవేకియా, అబుదాభి, బోస్ట్వానా, దుబై తదితర ప్రాంతాల నుండి ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. చేయి తిరిగిన రచయితలు, ఔత్సాహిక రచయితలూ అనేక మంది ఈ పోటీ కాని పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్ని రచనలకూ సర్వ హక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అందుబాటులో ఉన్న విజేతల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఏప్రిల్ 13, 2025 నాడు శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక, హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" లో ఆహూతుల సమక్షంలో బహూకరిస్తాం.30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలుప్రధాన విభాగం – 30వ సారి పోటీఉత్తమ కథానిక విభాగం విజేతలు“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)ప్రశంసా పత్రాలు‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TXఉత్తమ కవిత విభాగం విజేతలు“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI)ప్రశంసా పత్రాలు“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా “వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India-
క్రైమ్

క్రికెట్ ఆడుతూ కుప్పకూలాడు
కీసర: మైదానంలో క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆదివారం రాంపల్లిదాయరలో చోటుచేసుకుంది. కీసర సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన ఎం.ప్రణీత్ (32) కెనరా బ్యాంకులో పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి రాంపల్లిదాయర సమీపంలోని మైదానంలో క్రికెట్ ఆడుతుండగా అకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే స్నేహితులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ప్రణీత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వచ్చి గుండెపోటుతో మృతి చెందడంతో ప్రణీత్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కీసర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రిక్కీ అంత సులభంగా గన్ షాట్‌కి ఎలా దొరికాడు?
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): రాష్ట్రంలో, అందులోనూ బెంగళూరు పరిసరాల్లో గత 48 గంటల్లో అనూహ్యమైన నేర సంఘటనలు దేశమంతటా చర్చనీయాంశమయ్యాయి. జాతీయ టీవీ చానెళ్లలో చాలా సమయాన్ని ఆక్రమించాయి. దీంతో బెంగళూరు హాట్ హాట్ చర్చల్లో భాగమైంది. సినిమా స్టైల్లో మాఫియా డాన్ కొడుకుపై తుపాకులతో హత్యాయత్నం, ఆ గొడవ సద్దుమణగకముందే ఏకంగా రిటైర్డు డీజీపీ ఇంట్లోనే హత్యకు గురికావడం, అందులోనూ ఆయన భార్య, కుమార్తెను పోలీసులు అరెస్టు చేయడం హాలీవుడ్ క్రైం స్టోరీలను మించిపోయింది. రిక్కీ కేసులో ఎవరు సూత్రధారి? మాజీ మాఫియా డాన్, దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై మీద గుర్తుతెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి కాల్పులు జరపడం సంచలనం కలిగిస్తోంది. రిక్కీని మట్టుబెట్టాలని ఫైరింగ్ చేయగా, తీవ్ర గాయాలతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు తెలిసింది. సిలికాన్ సిటీతో పాటు చుట్టుపక్కల జరుగుతున్న రియల్ ఎస్టేట్ గొడవలు, మాఫియా పోరాటాలు ఈ సంఘటనతో ఒక్కసారిగా తెర మీదకు వచ్చాయి. మొదట రియల్ ఎస్టేట్ నేపథ్యంలో హత్యాయత్నం జరిగిందని అందరూ భావించినప్పటికీ సమయం గడిచేకొద్దీ ముత్తప్ప రై రెండవ భార్య అనురాధపై అనుమానాలు పెరుగుతున్నట్లు పోలీసు వర్గాల కథనం. ముత్తప్పరై ఇద్దరు కుమారులు, రెండవ భార్య అనురాధ పేరున తన ఆస్తులు వీలునామా రాశారు. అనురాధకు ఓ మోస్తరుగా బంగారు ఆభరణాలు, ఒక కారు, పెద్ద మొత్తంలో నగదు, హెచ్డీ కోటలో ఉన్న ఆస్తి, బెంగళూరు సహకార నగరలో ఉన్న ఒక భవంతి రాసిచ్చారు. అయితే ఆస్తిలో తనకు ఇంకా భాగం రావాలని ఆమె కోర్టుకు వెళ్లింది. రిక్కీ, అతని అన్న రాకీతో ఆమెకు గొడవలు కూడా జరిగాయి. అయితే తరువాత రిక్కీ సోదరులు రాజీ చేసుకున్నారు. వారు పరస్పరం హత్యలకు కుట్రలు చేసినట్లు కూడా వార్తలున్నాయి. ఇప్పుడీ హత్యాయత్నంతో అది బహిర్గతమైంది. రిక్కిరై సెక్యూరిటీ ఏమైంది రిక్కీ రై మీద హత్యాయత్నం తరువాత అందరిలో అనేక ప్రశ్నలు కలుగుతున్నాయి. వేల కోట్ల రూపాయల వారసుడు, విస్తృతంగా శత్రువులను కలిగిన రిక్కీ రై అంత సులభంగా గన్ షాట్‌కి ఎలా దొరికాడు? పటిష్టమైన ప్రైవేటు భద్రత ఏమైంది? అనే సందేహాలున్నాయి. రిక్కీ రై సొంతంగా వీవీఐపీకి ఉన్నంత సెక్యూరిటీని పెట్టుకున్నాడు. గన్లు పట్టుకుని చుట్టూ బాడీగార్డులు ఉంటారు. బాడీ గార్డులు షార్ప్ షూటర్స్ అయి ఉంటారు. రిక్కిరై పై కాల్పులు జరిపిన సమయంలో కారులో ఒకరే సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. మిగతా ఇద్దరు ఎందుకు లేరనేది సందేహాస్పదమైంది. కాల్పుల వెనుక బయటి శత్రుల కన్నా లోపలి శత్రువులే ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిక్కీకి డిప్యూటీ సీఎం పరామర్శ రిక్కీ రై బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదివారంనాడు ఆస్పత్రికి వెళ్లి అతనిని పరామర్శించారు. నిందితులు ఎంతటివారైనా పోలీసులు అరెస్టు చేస్తారని రిక్కీకి భరోసా ఇచ్చారు.రిటైర్డు డీజీపీ విషాదాంతం యశ్వంతపుర: రాష్ట్ర రిటైర్డు డీజీపీ ఓం ప్రకాశ్ బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని సొంత భవనంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం ఈ ఘోరం వెలుగుచూసింది. తానే హత్య చేసినట్లు భార్య పల్లవి పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రం ఆమె పోలీసులకు కాల్ చేసినట్లు తెలిసింది. ఘటనా స్థలంలో ఉన్న పల్లవితో పాటు ఆమె కూతురిని పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణంగా భావిస్తున్నారు. వీరి కుటుంబంలో స్పర్థల గురించి చుట్టుపక్కలవారితో పాటు కొందరు విశ్రాంత పోలీసు అధికారులకు కూడా తెలుసని సమాచారం. తనకు ప్రాణభయం ఉందని ఓంప్రకాశ్ స్నేహితులకు చెప్పుకుని బాధపడినట్లు తెలుస్తోంది. ఓం ప్రకాశ్ హత్యతో ఆయన సహచర రిటైర్డు ఐపీఎస్‌లు విచారానికి లోనయ్యారు.

అందంగా లేదని చిత్రహింసలు
రాయచూరురూరల్(కర్ణాటక): ఎన్నో ఆశలతో అత్తింటిలోకి అడుగు పెట్టిన నవ వధువుకు కొద్ది రోజుల్లోనే వేధింపులు ఎదురయ్యాయి. అందంగా లేవని సూటిపోటి మాటలతో చిత్రహింసలు పెట్టడంతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గదగ్ జిల్లాలో చోటు చేసుకుంది. గదగ్ బేటిగేరిలోని శరణ బసవేశ్వర కాలనీకి చెందిన అమరేష్‌కు బళ్లారికి చెందిన పూజాతో నాలుగు నెలల క్రితం వివాహమైంది. భర్త అమరేష్ యాదగరి జిల్లా శహపురలోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవలే ఇతర ప్రాంతానికి బదలీ చేశారు. కొద్ది రోజలు పాటు బేటిగేరిలోనే ఉండాలని, అనంతరం బదిలీ అయిన ప్రాంతానికి తీసుకెళ్తాని భర్త చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం ఆమెకు అత్తింటిలో వేధింపులు మొదలయ్యాయి. అందంగా లేవని, వంటలు సరిగా చేయడం లేదని అత్త శశికళ, బావ వీరన గౌడలు సూటిపోటిమాటలతో మనస్సు నొచ్చుకునేలా వ్యవహరించేవారు. ఈ విషయాన్ని పుట్టింటి వారికి చెప్పగా కొద్ది రోజులు సర్దుకొని వెళ్లాలని సూచించారు. అయితే వేధింపులు ఎక్కువ కావడంతో పూజా ఈనెల 15న ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వెళ్లి పరిశీలించగా సూసైడ్ నోట్ లభించింది. అత్త శశికళ, బావ వీరన గౌడ వేధించినట్లు అందులో ఉండటంతో వారిని పోలీసుల అరెస్ట్ చేశారు.

నిశ్చితార్థం వేళ.. చితి మంటల ఘోష!
తూర్పు గోదావరి(పిఠాపురం): తెల్లారితే కాబోయే ధర్మపత్నికి దండ వేసి, ఉంగరాలు మార్చుకోవాల్సిన ఆ యువకుడి బతుకు అంతలోనే తెల్లారిపోయింది. నిత్యం వేదం పలికే ఆ గొంతు మూగబోయింది. తాంబూలాలు అందుకోవాల్సిన తండ్రి తల కొరివి పెట్టాల్సి వచ్చింది. కొద్ది గంటల్లో ఓ యువతితో నిశ్చితార్థం చేసుకోవాల్సిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన కాకినాడ జిల్లా పిఠాపురంలో చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. వింజమూరి వెంకటేష్ (30) పిఠాపురంలో పురోహితుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం అతని వివాహ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో శనివారం ఉదయమే కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెళ్లి, వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని వచ్చాడు. నిశ్చితార్థంలో వధువుకు, తనకు కావాల్సిన ఉంగరాలను తమ వేలి ముద్రలు ఉండేలా ప్రత్యేకంగా ముంబయిలో ఆర్డరు ఇచ్చి మరీ తయారు చేయించుకున్నాడు. కొత్త దుస్తులు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకున్నాడు. స్నేహితులకు, తోటి పురోహితులకు ఆహా్వనం పలికాడు. సంప్రదాయం ప్రకారం ఇంట్లో వారు నిశి్చతార్థానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ.. ఊహించని విధంగా శనివారం అర్ధరాత్రి పిఠాపురం సమీపంలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి, రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. సామర్లకోట రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆత్మహత్య చేసుకునేంత సమస్యలేవీ లేవని చెబుతూ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి శర్మ, తల్లి లక్ష్మి గుండెలవిసేలా రోదించారు. నిశి్చతార్థం కోసం తెచి్చన పూలను అంతిమ యాత్రకు వినియోగించాల్సి వచ్చింది. నిశ్చయ తాంబూలాలకు వచ్చిన పెద్దలు, బంధువులు బరువెక్కిన గుండెలతో అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఏదో బలమైన ఒత్తిడి... ఎవరో బెదిరించడం వల్లే వెంకటేష్ ఇలా అఘాయిత్యానికి పాల్పడినట్లు చర్చ జరుగుతోంది.
వీడియోలు


దిక్కున్నచోట చెప్పుకోండి.. మా వెనుక బాబున్నాడు


చేసుకోబోయే అమ్మాయి కోరికలు చూసి అవాక్కెన రాజేష్


ఊరూపేరు లేని ఉర్సా.. బట్టబయలైన బాబు సర్కార్ భారీ భూకుంభకోణం


భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఆవేదన


ముంబై దూకుడు.. చెన్నైకు మరో ఓటమి


కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం


కాసేపట్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భారత్ పర్యటన


మెగా డీఎస్సీ పేరిట నిరుద్యోగులకు కూటమి సర్కారు టోకరా


బెంగళూరులో మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య


సరైన అవగాహన లేకుండానే DSC నోటిఫికేషన్