Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Trisha And Kamal Haasan Interesting comments On Marriage System1
పెళ్లిని నమ్మనన్న త్రిష.. రెండు పెళ్లిళ్లు అందుకే నన్న కమల్

నిస్సందేహంగా మన దేశం గర్వించదగ్గ నటుల్లో కమల్‌ హాసన్‌(Kamal Haasan) ఒకరు. నటనాపరంగా ఆయన పోషించని పాత్రల గురించి వెదుక్కోవాల్సిందే. నిజజీవితంలోనూ ఆయన భిన్న పాత్రలు పోషించారు. ముఖ్యంగా నటీమణులతో ఆయన సంబంధాలు, ఆయన పెళ్లిళ్లు, విడాకులు తరచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. ఎందుకంటే అత్యాధునిక తరం అని చెప్పుకునే ఈ తరం నటులు ఫాలో అవుతన్న లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్స్, పెళ్లి కాకుండా పిల్లలు వగైరాలన్నీ దాదాపు 2, 3 దశాబ్ధాల క్రితమే కమల్‌ చేసేశాడు..ఒక్కసారి కమల్‌ అనుబంధాలను పరిశీలిస్తే... 1975లో వచ్చిన మేల్నాట్టు మరుమగల్‌ చిత్రంలో కమల్‌ తనతో కలిసి నటించిన తర్వాత 1978లో డ్యాన్సర్‌ వాణీ గణపతిని వివాహం చేసుకున్నారు. ఒక దశాబ్దం తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత, కమల్‌ హాసన్‌ సహ నటి సారికతో సహజీవనం చేశాడు. ఆ అనుబంధం వల్ల వారికి 1986లో తమ మొదటి సంతానం శ్రుతి హాసన్‌ (ప్రస్తుతం టాప్‌ హీరోయిన్‌) జన్మించింది. ఆ తర్వాత వారు 1988లో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత 1991లో వారికి రెండవ కుమార్తె అక్షర హాసన్‌ పుట్టింది. ఈ అనుబంధం మరో పదేళ్లు పైనే కొనసాగి 2002లో, వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు, అది 2004లో మంజూరు అయ్యాయి. ఆ తర్వాత 2005 నుంచి 2016 వరకు నటి గౌతమితో కమల్‌ సహజీవనం చేశాడు. అందుకే తమ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తాను వివాహానికి సరిపోతానని తాను భావించడం లేదని ఇంటర్వ్యూలలో తరచుగా కమల్‌ చెబుతుంటాడు. ప్రస్తుతం 7 పదుల వయస్సులో కూడా కమల్‌ పెళ్లిళ్లు ప్రస్తావనకు నోచుకుంటున్నాయంటే... అందుకు ఆయన గత చరిత్రలో ఉన్న మలుపులే కారణం.ఈ నేపధ్యంలో సీనియర్‌ స్టార్‌ కమల్‌ హాసన్, నటి త్రిష కృష్ణన్(Trisha), సిలంబరసన్‌ టిఆర్, శింబులు నటించిన, మణిరత్నం చిత్రం థగ్‌ లైఫ్‌ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో నటీనటులంతా బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్‌ సందర్భంగా మరోసారి కమల్‌ పెళ్లిళ్ల ప్రస్తావన వచ్చింది.ప్రమోషన్‌ కార్యక్రమం సందర్భంగా ఓ యాంకర్‌ పెళ్లి గురించి నటీనటులను వారి అభిప్రాయాలను అడిగారు. దీనికి 3 పదుల వయసు దాటినా, ఇంకా పెళ్లి మాట ఎత్తకుండా సినిమాల్లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న త్రిష....బదులిస్తూ..‘‘ పెళ్లిపై తనకు నమ్మకం లేదు’’ అంటూ స్పష్టం చేసింది. ‘‘తనకు పెళ్లి జరిగే పరిస్థితి ఉండి అది జరిగినా ఓకే’’ అని అలా కాకుండా పెళ్లి జరగకపోయినా సరే తనకు ఓకే అని త్రిష సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత పెళ్లి విషయమై కమల్‌ను ప్రశ్నించగా.. దశాబ్దం క్రితం ఎంపీ జాన్‌ బ్రిటాస్‌కు తనకు జరిగిన ఓ సంభాషణను ఆయన వివరించాడు.‘‘ఇది 10–15 ఏళ్ల క్రితం జరిగింది. ఎంపీ బ్రిటాస్‌ నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయన కొంతమంది కాలేజీ స్టూడెంట్స్‌ ముందు నన్ను ‘‘ నువ్వు మంచి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడివి, మరి రెండు పెళ్లిళ్లు ఎలా చేసుకున్నావు? అని ప్రశ్నించాడు. దానికి మంచి కుటుంబం నుంచి రావడానికి పెళ్లికి సంబంధం ఏంటి? అని నేను ఎదురు ప్రశ్నించా. అది కాదు నువ్వు రాముడిని పూజిస్తావు అంటే ఆయన్ను అనుసరించాలి కదా అని అడిగాడు. దానికి నేనేం చెప్పానంటే..నేను ఏ దేవుడ్నీ పూజించను. అంతేకాదు నేను రాముడి జీవనశైలిని అనుసరించను. బహుశా నేను అతని తండ్రి (దశరథ) మార్గాన్ని (ముగ్గురు భార్యలు కలిగి ఉన్న) మార్గాన్ని అనుసరిస్తాను’’ అంటూ కమల్‌ హాసన్‌ బదులిచ్చాడు. విక్రమ్‌ సినిమా సూపర్‌ హిట్‌తో మరోసారి ఊపందుకుంది కమల్‌ హాసన్‌ కెరీర్‌... తదుపరి చిత్రం, థగ్‌ లైఫ్, జూన్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది.

Vijay Kumar Says Doubts About Praveen Pagadala Postmortem Report2
‘ప్రవీణ్‌ పగడాల పోస్ట్‌మార్టం రిపోర్టుపై ఎన్నో అనుమానాలు?’

సాక్షి, తాడేపల్లి: ప్రవీణ్ పగడాల మృతిపై లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున కోర్టులో పిల్ వేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరినీ కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుంటామని.. పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్ట్‌ మార్టం రిపోర్టులో స్పష్టత లేదన్నారు. ట్రావెల్ చేసింది.. ఆగింది.. మద్యం కొనుగోలు చేసింది ప్రవీణ్ కుమార్ అని ఎక్కడా నిరూపణ కాలేదు. చనిపోయిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ అనేది తప్ప పోలీసులు చూపిన వీడియోల్లో అతను ప్రవీణ్ కుమార్ అని నిర్ధారణ కాలేదు’’ అని విజయ్‌ కుమార్‌ వివరించారు.‘‘నాకు ఎన్నో పోస్టుమార్టం రిపోర్టులు చూసిన అనుభవం ఉంది. మద్యం సేవించడం వల్లే చనిపోయాడని పోస్టుమార్టంలో కావాలని రాసినట్లుంది. మద్యం తాగడం వల్లే చనిపోతే ఈ దేశంలో రాష్ట్రంలో ఇంతమంది ఎలా బతికున్నారు?. ప్రిలిమినరీ రిపోర్టులో ప్రవీణ్ కడుపులో 120 ఎంఎల్‌ ఫ్లూయిడ్ ఉందని రిపోర్టు ఇచ్చారు. ఈ ఫ్లూయిడ్‌లో అనుమానాస్పదమైన ఎలాంటి ఆల్కహాల్ లేదని ఇచ్చారు. ప్రిలిమినరీ రిపోర్టులో ఆల్కహాల్ లేదని చెప్పిన వైద్యులు.. ఫైనల్ రిపోర్టులో ఆల్కహాల్ ఉందని ఇవ్వడం చిత్రంగా ఉంది. ఎందుకు ఆల్కహాల్ గురించి ఇంతగా ప్రస్తావిస్తున్నారు. పోలీసులు మొదట చెప్పిన ప్రెస్ మీట్‌లో ఎక్కడా ఆల్కహాల్ గురించి ప్రస్తావన లేదు. తర్వాత ఒక స్టోరీని అల్లడం కోసం ఆల్కహాల్‌ను వాడుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి’’ అని విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ‘‘పనిగట్టుకుని ఆల్కహాల్ ఉందని రిపోర్టులో రాశారని అనిపిస్తోంది. మొహం రాళ్లకు గుద్దుకున్నందుకు గాయాలయ్యాయన్నారు. మరి తలవెనుక గాయం ఎలా అయ్యింది?. వెల్లకిలా పడిన వ్యక్తి పై మోటార్ సైకిల్ ఎలా పడింది?. అనేక సందేహాలున్నాయి వాటికి ఎక్కడా సమాధానం లేదు. హర్షకుమార్ అరెస్టును మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఏపీలో అసలు మానవహక్కులు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నాం. స్వేచ్ఛగా నిరసన తెలిపే హక్కు కూడా పౌరులకు లేదా?. రెండు సార్లు ఎంపీగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి వేధించడం పద్ధతేనా?. ముందస్తు అరెస్ట్ చేయడానికి ఒక విధానం ఉంటుంది.మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న కొద్ది ప్రవీణ్ కుమార్‌ది హత్యేనేమోనని అనుమానాలు బలపడుతున్నాయ్. ప్రవీణ్ మృతిపై మాట్లాడాలంటేనే భయపడేలా చేస్తున్నారు. మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ద్రోహులెవరో తెలిసిపోతారని ప్రభుత్వం ఉలిక్కిపడుతుందనే అనుమానం కలుగుతోంది. ఒక్క మంత్రి కూడా మాట్లాడలేదు. పేదల ఓట్లు మీకు కావాలి?. పేదల భావాలతో మీకు పనిలేదా?’’ అంటూ విజయ్‌కుమార్‌ ప్రశ్నించారు.

UP Techie Ends His Life  Accuses Wife3
అమ్మా, నాన్న క్షమించండి.. ప్రపంచం నుంచి వెళ్లిపోతున్నా!

నేటి కాలంలో భార్యా భర్తల సంబంధాల్లో ఆస్తులే ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. జీవితాంతం కలిసుండాలని ప్రమాణం చేసిన బంధాల్ని చిదిమేస్తున్నాయి. పెళ్లి సంబంధాలు వేట మొదలుపెట్టిన దగ్గర్నుంచీ అబ్బాయికి ఎంత ఉంది(ఆస్తి).. అమ్మాయి ఎంత స్త్రీ ధనం(కట్నం) తెచ్చుకుంటుందనే తతంగం మరీ ఎక్కువైపోయింది. అసలుకంటే కొసరు ముద్దు అనే చందంగా తయారైంది. అది చివరకు వైవాహిక బంధాలు నాశనం కావడానికి కూడా కారణమవుతోంది. తాజాగా జరిగిన ఘటనలో తన పేరున ఇల్లు రాసివ్వాలని భార్య పట్టుబట్టడంతో పాటు బంధువుల్ని తీసుకొచ్చి నానా రకాల హింస పెట్టడంతో ప్రాణాలు తీసుకున్నాడు భర్త. భార్య నుంచి వేధింపుల్ని తట్టుకోలేక చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎటావాలో 33 ఏళ్ల ఫీల్డ్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య నుంచి ఎలా వేధింపులకు గురయ్యాడో వీడియో రికార్డ్ చేసి మరీ తనువు చాలించాడు. మోహిత్ యాదయ్‌కు ప్రియా అనే అమ్మాయితో రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఏడేళ్ల పాటు రిలేషనలో ఉన్న వీరు 2023లో పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్నుంచీ అమ్మాయి తల్లి.. వీరి కాపురాన్ని శాసిస్తూ వస్తోంది. చివరకు భార్య ప్రియ గర్బవతి అయినా కూడా అబార్షన్ చేయించిందట అత్త. ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా తన అత్త తీసుకెళ్లిపోయిందని మోహిత్ రికార్డు చేసిన వీడియో ద్వారా తెలిసింది.చనిపోయి ముందే మోహిత్ చెప్పిన మాటలు..‘ఇల్లు తన పేరున రిజిస్టర్ చేయాలని నా భార్య తరచు వేధింపులకు గురిచేస్తోంది. ఇల్లు, ఆస్తి అంతా తన పేరునే రాయాలట. మా అమ్మా‍, నాన్నలపై కూడా వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆమె తండ్రి చేత ఒక తప్పుడు కేసు పెట్టించింది. నా భార్య సోదరుడు నా బావమరిది నన్ను చంపుతానని పదే పదే బెదిరిస్తున్నాడు. రోజూ ఇంట్లో ఏదో గొడవ పెట్టుకుంటూనే ఉంది నా భార్య, ఆమె తల్లి దండ్రులకు దీనికి సపోర్ట్ చేస్తున్నారు’ అని పేర్కొన్నాడు.అమ్మా నాన్న క్షమించండి.. నేను ఈ ప్రపంచం నుంచి వెళ్లి పోతున్నా. నాకు న్యాయం జరిగాలి. నా చావుతోనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఒకవేళ నాకు న్యాయం జరగకపోతే నా బూడిదను డ్రైన్ లో కలిపేయండి’ అని వీడియోలో కన్నీళ్లు పెట్టుకుని మరీ ప్రాణాలు తీసుకున్నాడు.ఇదీ చదవండి: నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా.. ఇక సెలవు

Jammu And Kashmir flash floods And landslides Roads Cut off4
జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. వరద బీభత్సంతో భయానక వాతావరణం

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా కుండపోత వర్షం కురిసింది. రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందగా.. సుమారు 100 మందిని సహాయక బృందాలు కాపాడాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌‌లో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రాంబన్‌ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కొండ చరియలు విరిగి పడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బాగ్నా గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో ముగ్గురు మరణించారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) రాంబన్ కుల్బీర్ సింగ్ ధృవీకరించారు. మృతులను మొహమ్మద్ అకిబ్ (14), మొహమ్మద్ సాకిబ్ (9), మోహన్ సింగ్ (75) గా గుర్తించారు. వీరందరూ బాగ్నా పంచాయతీ నివాసితులు.#JammuKashmir | Heavy rainfall in several parts of Bhalessa, Doda#Rainfall pic.twitter.com/8rDEyL8X3l— DD News (@DDNewslive) April 20, 2025 #Ramban | Flash floods triggered by heavy rains hit a village near the Chenab River in Dharamkund, J&K.#JammuKashmir #Dharamkund pic.twitter.com/mrcL9RX7Ja— DD News (@DDNewslive) April 20, 2025మరోవైపు.. చాలా చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. సుమారు 100మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయినట్లు చెబుతున్నారు. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతవరణ పరిస్థితుల వల్లే జమ్మూలో భారీ వర్షాలు, తుఫాను సంభవించిందని వాతావరణ శాఖ తెలిపింది. ఐదేళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు, బలమై గాలులు వీయడం ఇదే మొదటిసారని పేర్కొంది.#Srinagar #Jammu National Highway is closed for traffic due to landslides & mudslides at multiple locations between Ramban and Banihal.The situation is extremely bad,as several vehicles have been damaged by landslides. Since last evening, #Banihal has received 71 mm of rainfall pic.twitter.com/zPj6hEgAl1— Indian Observer (@ag_Journalist) April 20, 2025ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా స్పందిస్తూ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. రాంబన్‌లో కొండ చరియలు విరిగిపడడం వల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందన్నారు. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇక, జిల్లా అంతటా రెండు హోటళ్ళు, అనేక దుకాణాలు, నివాస నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రహదారులన్నీ బురదతో నిండిపోయాయి. మహిళలు, పిల్లలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.जम्मू कश्मीर मे बादल फटने से भयंकर तबाहीहजारों लोगों की जान पर आफतजम्मू -श्रीनगर नेशनल हाईवे भारी बारिश और लैंडस्लाइड के कारण बंद करना पड़ा हाईवे पर कीचड़ भरा मालवा आने से इसके नीचे कई गाड़ियां दब गई है#JammuKashmir #jammusrinagarhighway #landslide #rain #ramban pic.twitter.com/wH16tknzWt— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) April 20, 2025Five vehicles half buried under debris in T2 Ramban#LANDSLIDE #CLOUDBURST #ramban pic.twitter.com/ucMCDsXvRf— Gulistan News (@GulistanNewsTV) April 20, 2025Flood like situation on Jammu - Srinagar National Highway. Avoid a journey till 22 April.Most affected areas: Banihal, Panthyal, and adjacent areas. pic.twitter.com/QUpZMzx8fX— Kashmir Weather (@Kashmir_Weather) April 20, 2025

Mukesh AmMukesh Ambani BirthDay Bash Rangoli highlite Hosted By Nita Ambani5
Mukesh Ambani Birthday ముఖేష్‌ అంబానీ బర్త్‌డే బాష్‌, ఇదే హైలైట్‌!

భారతీయ వ్యాపార దిగ్గజం అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు రిలయన్స్‌ సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా విస్తరించిన ముఖేష్‌ అంబానీ (Mukesh Ambani. రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industties) చైర్మన్‌గా, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరుగా ఎదిగారు. ఏప్రిల్‌ 19న 68వ ఏట ప్రవేశించారు. ఈ సందర్భంగా ముఖేష్‌ అంబానీ కోసం నీతా అంబానీ (Nita Ambani) గ్రాండ్‌ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట సందడిగా మారింది.ముఖేష్ అంబానీ బర్త్‌డే (Ambani birthday) వేడుకలను అంబానీ కుటుంబం అత్యంత ఘనంగా నిర్వహించింది. అంబానీ అప్‌డేట్ అనే అభిమానుల పేజీ కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది. ఇందులో రంగోలి రంగులు ,పువ్వులతో తీర్చిదిద్దిన అంబానీ జంట ఫోటోల ప్రత్యేకమైన రంగోలి హైలైట్‌గా నిలిచాయి. నీతా అంబానీ నారింజ రంగు చీరలో అందంగా కనిపించారు. వేడుకల్లో భాగంగా ముఖేష్‌, నీతా అంబానీ దంపతులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. View this post on Instagram A post shared by Veena Bollywood Mehendi (@veenanagda) ప్రముఖ మెహందీ కళాకారిణి వీణా నగ్దా ఇన్‌స్టాగ్రామ్‌లో రిలయన్స్ బాస్‌కి చక్కటి పుట్టినరోజు సందేశాన్ని పంచుకున్నారు. ఆసియాలో అత్యంత ధనవంతుడైనప్పటికీ, అంబానీ ఎంత "ది డౌన్ టు ఎర్త్" ఉంటారంటూ ప్రశంసించింది. కొన్ని దశాబ్దాలుగా అంబానీ కుటుంబ వేడుకల్లో వీణా మెహిందీ ఉండాల్సిందే. 0 సంవత్సరాల క్రితం జరిగిన తన వివాహంలో ముఖేష్ అంబానీ సోదరి దీప్తి సల్గావ్‌కర్‌ మొదలు 2024లో, అనంత్-రాధికల గ్రాండ్ వెడ్డింగ్‌ వేడుకదాకా అందర్నీ మెహందీడిజైన్స్‌తో అలంకరించింది. కాగా ముఖేష్ అంబానీ దివంగత ధీరూభాయ్ అంబానీ ,కోకిలాబెన్ అంబానీ దంపతుల పెద్ద కుమారుడు. 1957, ఏప్రిల్ 19, యెమెన్‌లో జన్మించారు. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, సోదరులు ముఖేష్,అనిల్ అంబానీ మధ్య వైరం కారణంగా కుటుంబ సామ్రాజ్యం చీలిపోయింది. తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన ముఖేష్‌ అంబానీ రిలయన్స్‌ సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా వివిధ రంగాలకు విస్తరించారు. ఆయిల్‌ నుంచి జియో ద్వారా టెలికాం సేవలు, రిలయన్స్ రిటైల్‌ రంగ సేవలతో విప్లవాత్మక మార్పులతో ఆసియా బిలియనీర్‌గా ఎదిగారు. ముఖేష్‌ సంతానం ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్‌ అంబానీ కూడా కుటుంబ వ్యాపారంలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. 2025 ఏప్రిల్ నాటికి ముఖేష్‌ అంబానీ ఆస్తి విలువ. దాదాపు రూ. 7.1 లక్షల కోట్లు. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 15 ధనవంతుల్లో ఒకరుగా అంబానీ ఉన్నారు.

Rasi Phalalu: Daily Horoscope On 21-04-2025 In Telugu6
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.అష్టమి ప.1.50 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.8.04 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ప.12.04 నుండి 1.40 వరకు, దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.15 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: రా.9.44 నుండి 11.20 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.44, సూర్యాస్తమయం: 6.12. మేషం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ధనలబ్ధి. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.వృషభం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలలో మార్పులు. బంధువులతో తగాదాలు. వ్యయప్రయాసలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.మిథునం: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.సింహం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు రాగలవు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.కన్య: శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.తుల: కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దైవదర్శనాలు. బంధువులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.వృశ్చికం: శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.ధనుస్సు: పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం.మకరం: మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.కుంభం: మిత్రులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.మీనం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు సజావుగా పూర్తి చేస్తారు. భూ, వాహనయోగాలు. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

TGSRTC will soon fill 3038 vacancies: Ponnam Prabhakar7
ఆర్టీసీలో 3,038 ఖాళీల భర్తీకి ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీలో తొలి నియామక ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో చివరిసారి వివిధ కేటగిరీల్లో నియమకాలు జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు పోస్టుల భర్తీ జరగలేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ఏకంగా 3,038 పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. ఇప్పటివరకు ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీని సంస్థే చేపట్టే విధానం ఉండేది. తొలిసారి నియామక సంస్థలకు ప్రభుత్వం ఈ బాధ్యత అప్పగించింది. టీజీపీఎస్సీ, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు, మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డులు కేటగిరీల ప్రకారం నియామక ప్రక్రియలను చేపట్టనున్నాయి. ఏడెనిమిది నెలల క్రితమే కసరత్తు తెలంగాణ ఆర్టీసీలో ప్రసుతం చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతినెలా సగటున 200 మంది రిటైర్‌ అవుతుండటంతో ఖాళీల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీ చేపట్టాలని ఏడెనిమిది నెలల క్రితమే ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. దాదాపు ఐదు వేల ఖాళీల భర్తీకి ప్రతిపాదించింది. కానీ ప్రభుత్వం 3,038 పోస్టులకే అనుమతి ఇచ్చింది. అయితే తాము నియామక పరీక్షలకు రూపొందించుకున్న కేలండర్‌ ఆధారంగానే ఆర్టీసీలో పోస్టుల భర్తీ కూడా ఉంటుందని ఆయా సంస్థలు ప్రకటించాయి.దీంతో వెంటనే నియామకాలు చేపట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇంతలో ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి రావటంతో, అది తేలిన తర్వాతే నియామకాలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల ఎస్సీ వర్గీకరణ జరిగి, రోస్టర్‌ పాయింట్లపై స్పష్టత రావడంతో ఖాళీల భర్తీకి రంగం సిద్ధమైంది.కీలకమైన డ్రైవర్ల ఎంపిక ప్రక్రియ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చూడనుంది. మరో రెండు నెలల్లో ప్రక్రియ మొదలవుతుందని, నాలుగు నెలల్లో కొత్త డ్రైవర్లు అందుబాటులోకి వస్తారని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. జోనల్‌ పోస్టులు, రీజియన్‌ పోస్టుల వారీగా ఖాళీలు, రోస్టర్‌ పాయింట్లను సూచిస్తూ ఆర్టీసీ సంబంధిత బోర్డులకు వివరాలు అందజేయాల్సి ఉంది. బోర్డులు అడగ్గానే వాటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అప్పటి వరకు ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్లతో.. ప్రస్తుతం ఆర్టీసీలో 1,600 డ్రైవర్‌పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్న డ్రైవర్లపై తీవ్ర పనిభారం పెరిగింది. డబుల్‌ డ్యూటీలు చేయాల్సి వస్తోంది. దీంతో 1,500 మంది ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్లను విధుల్లోకి తీసుకునేందుకు సంస్థ ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది. మ్యాన్‌పవర్‌ సప్లయిర్స్‌ సంస్థల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఎంపిక చేసిన డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నారు. వీరిని మూడు నెలల పాటు కొనసాగిస్తామని ఒప్పందంలో సంస్థ పేర్కొంది.తాజాగా రెగ్యులర్‌ డ్రైవర్ల నియామకం వరకు వీరిని కొనసాగించాలని నిర్ణయించింది. ఇలా తాత్కాలిక పద్ధతిలో ఎంపికైన వారు, రెగ్యులర్‌ నియామకాల కోసం కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. వీరు శిక్షణ పొంది ఉన్నందున, రెగ్యులర్‌ నియామకాల్లో వీరికి ఆయా బోర్డులు ప్రాధాన్యం ఇచ్చే వీలుందని అధికారులు చెబుతున్నారు.త్వరలో భర్తీ ప్రక్రియ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభు త్వం వచ్చిన తర్వాత యువత ఉపాధికి పెద్దపీట వేస్తూ 60 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీలో తొలి సారి భర్తీ ప్రక్రియ చేపడుతున్నాం. 3,038 ఖాళీలను నియామక బోర్డుల ద్వారా భర్తీ చేయనున్నాం. ఇందుకోసం ఆయా బోర్డులు నియామక క్యాలెండర్‌ను సిద్ధం చేసుకున్నాయి. వాటి ప్రకారం వీలైనంత త్వరలో భర్తీ ప్రక్రియ జరుగుతుంది. – రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

Indian star players Virat Kohli and Rohit Sharma have flourished8
ఇటు రోహిత్‌ అటు కోహ్లి

భారత స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ విజృంభించారు. భారీ షాట్లతో అలరిస్తూ ఆదివారం అభిమానులకు డబుల్‌ ధమాకా అందించారు. పంజాబ్‌ కింగ్స్‌తో పోరులో కోహ్లి క్లాసిక్‌ ఇన్నింగ్స్‌తో కదంతొక్కగా... చెన్నైతో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఊర మాస్‌ షాట్లతో చెలరేగిపోయాడు. ఫలితంగా పంజాబ్‌పై బెంగళూరు బదులు తీర్చుకోగా... చెన్నైపై ముంబై ఇండియన్స్‌ భారీ విజయం నమోదు చేసుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఓ మాదిరి ప్రదర్శనతో సరిపెట్టుకున్న రోహిత్‌... తనను ‘హిట్‌మ్యాన్‌’ ఎందుకు అంటారో వాంఖడేలో నిరూపించాడు. విరాట్‌ దూకుడుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లగా... రోహిత్‌ మెరుపులతో ముంబై నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లుగా తొలి ఓవర్‌లోనే క్రీజులో అడుగుపెట్టిన ఈ ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచి తమ జట్లను గెలిపించడం కొసమెరుపు.ముంబై: సిక్స్‌... ఫోర్‌... ముంబై ఇన్నింగ్స్‌ మొత్తం ఇదే తీరు! బంతి పడటమే ఆలస్యం బౌండరీ వెళ్లెందుకు ఓసారి, సిక్స్‌ అయ్యేందుకు మరోసారి బంతి అదేపనిగా ముచ్చట పడిందనిపించింది. ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ, టి20 స్పెషలిస్ట్‌ సూర్యకుమార్‌ల ఆట మ్యాచ్‌లో హైలైట్స్‌ను చూపించలేదు. హైలైట్సే మ్యాచ్‌గా మార్చేసింది. దీంతో ముంబై 177 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. చెన్నైపై 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ముందుగా చెన్నై సూపర్‌కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్‌ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 1 వికెట్‌ మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ (45 బంతుల్లో 76 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), సూర్య (30 బంతుల్లో 68 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) హోరెత్తించారు. దంచేసిన జడేజా, దూబే ఆంధ్ర కుర్రాడు షేక్‌ రషీద్‌ (20 బంతుల్లో 19; 1 ఫోర్‌)కు ఓపెనింగ్‌లో అవకాశమిస్తున్న ధోనిని నిరుత్సాహపరిచాడు. పవర్‌ప్లేలో 20 బంతులాడి కూడా ఒకే ఒక్క బౌండరీ బాదాడు. రచిన్‌ రవీంద్ర (5) విఫలమవగా, 17 ఏళ్ల ‘లోకల్‌ బాయ్‌’ ఆయుశ్‌ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉన్నది కాసేపే అయినా ఫోర్లు, సిక్స్‌లతో అలరించాడు. తర్వాత వచ్చిన జడేజా, దూబే భారీషాట్లు బాదడంతో చెన్నై పుంజుకుంది. ఇద్దరు నాలుగో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. సిక్స్‌లు బాదిన దూబే 30 బంతుల్లో, జడేజా 34 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ధోని (4)ని బుమ్రా ఎంతో సేపు నిలువనీయలేదు. బాదుడే... బాదుడు రోహిత్‌ శర్మకు జతగా ఓపెనింగ్‌ చేసిన రికెల్టన్‌ తొలి ఓవర్లోనే బౌండరీలతో తమ ఉద్దేశం చాటగా, రెండో ఓవర్‌ నుంచి రోహిత్‌ విరుచుకుపడటంతో చెన్నై బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. జేమీ ఓవర్టన్‌ ఓవర్‌న్నర (9 బంతులు) వేసిన ఐదో ఓవర్లో రికెల్టన్, రోహిత్‌ చెరో సిక్స్‌ కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో 62 పరుగులు చేసిన ముంబై తర్వాతి ఓవర్లోనే రికెల్టన్‌ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌) వికెట్‌ను కోల్పోయింది. సూర్యకుమార్‌ రావడం... రోహిత్‌తో కలిసి ధనాధన్‌ షోను డబుల్‌ చేసింది. ఇద్దరు బౌండరీలు, సిక్సర్లు కొట్టేందుకు పోటీపడటంతో స్టేడియం హోరెత్తింది. ముందుగా ‘హిట్‌మ్యాన్‌’ 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... సూర్య 26 బంతుల్లో అర్ధసెంచరీ అధిగమించాడు. ఇద్దరు బంతిని అదేపనిగా బౌండరీలైన్‌ను దాటిస్తూనే ఉండటంతో లక్ష్యం ముంబై వైపు నడిచివచ్చింది.స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: షేక్‌ రషీద్‌ (స్టంప్డ్‌) రికెల్టన్‌ (బి) సాంట్నర్‌ 19; రచిన్‌ (సి) రికెల్టన్‌ (బి) అశ్వని 5; ఆయుశ్‌ (సి) సాంట్నర్‌ (బి) దీపక్‌ చహర్‌ 32; జడేజా (నాటౌట్‌) 53; దూబే (సి) జాక్స్‌ (బి) బుమ్రా 50; ధోని (సి) తిలక్‌ (బి) బుమ్రా 4; జేమీ ఓవర్టన్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–16, 2–57, 3–63, 4–142, 5–156. బౌలింగ్‌: చహర్‌ 4–0–32–1, బౌల్ట్‌ 4–0–43–0, అశ్వని 2–0–42 –1, సాంట్నర్‌ 3–0–14–1, బుమ్రా 4–0–25–2, విల్‌ జాక్స్‌ 1–0–4–0, హార్దిక్‌ 2–0–13–0. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి) ఆయుశ్‌ (బి) జడేజా 24; రోహిత్‌ (నాటౌట్‌) 76; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 68; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (15.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 177. వికెట్ల పతనం: 1–63. బౌలింగ్‌: ఖలీల్‌ 2–0–24–0, ఓవర్టన్‌ 2–0– 29–0, అశ్విన్‌ 4–0–25–0, జడేజా 3–0–28–1, నూర్‌ 3–0–36–0, పతిరణ 1.4–0–34–0. ముల్లాన్‌పూర్‌: ముందు బౌలర్లు, తర్వాత బ్యాటర్లు రాణించడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు తమ సొంతగడ్డపై పొగొట్టుకున్న ఫలితాన్ని పంజాబ్‌కు వెళ్లి రాబట్టుకుంది. ఐపీఎల్‌ 18వ సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. జోష్‌ ఇన్‌గ్లిస్‌ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్‌), శశాంక్‌ సింగ్‌ (33 బంతుల్లో 31; 1 ఫోర్‌) మెరుగ్గా ఆడారు. కృనాల్, సుయశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కోహ్లి (54 బంతుల్లో 73 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అదరగొట్టాడు. దేవదత్‌ పడిక్కల్‌ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించాడు. కోహ్లి ఆఖరిదాకా... పెద్ద లక్ష్యం కాకపోయినా... బెంగళూరు జట్టు తమ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (1) వికెట్‌ను తొలి ఓవర్లోనే కోల్పోయింది. పంజాబ్‌కు దక్కింది ఈ ఆరంభ సంబరమే! అటు తర్వాత కథంతా కింగ్‌ కోహ్లి, పడిక్కల్‌ నడిపించారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ పడిక్కల్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడగా... కోహ్లి క్లాసిక్స్‌ షాట్‌లతో ముల్లాన్‌పూర్‌ ప్రేక్షకుల్ని గెలిచాడు. ఇద్దరు రెండో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. పడిక్కల్‌ అవుటైనా... ఆఖరిదాకా క్రీజులో నిలబడిన కోహ్లి జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ (సి) డేవిడ్‌ (బి) కృనాల్‌ 22; ప్రభ్‌సిమ్రాన్‌ (సి) డేవిడ్‌ (బి) కృనాల్‌ 33; అయ్యర్‌ (సి) కృనాల్‌ (బి) షెఫర్డ్‌ 6; ఇన్‌గ్లిస్‌ (బి) సుయశ్‌ 29; నేహల్‌ (రనౌట్‌) 5; శశాంక్‌ (నాటౌట్‌) 31; స్టొయినిస్‌ (బి) సుయశ్‌ 1; యాన్సెన్‌ (నాటౌట్‌) 25; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–42, 2–62, 3–68, 4–76, 5–112, 6–114. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–26–0, యశ్‌ దయాళ్‌ 2–0–22–0, హాజల్‌వుడ్‌ 4–0–39–0, కృనాల్‌ పాండ్యా 4–0–25–2, షెఫర్డ్‌ 2–0–18–1, సుయశ్‌ 4–0–26–2. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) ఇన్‌గ్లిస్‌ (బి) అర్ష్ దీప్ 1; కోహ్లి (నాటౌట్‌) 73; పడిక్కల్‌ (సి) నేహల్‌ (బి) హర్‌ప్రీత్‌ 61; పాటీదార్‌ (సి) యాన్సెన్‌ (బి) చహల్‌ 12; జితేశ్‌ శర్మ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–6, 2–109, 3–143. బౌలింగ్‌: అర్ష్ దీప్ 3–0–26–1, జేవియర్‌ 3–0–28–1, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4–0–27–1, యాన్సెన్‌ 3–0–20–0, చహల్‌ 4–0–36–1, స్టొయినిస్‌ 1–0–13–0, నేహల్‌ 0.5–0–9–0. ఐపీఎల్‌లో నేడుకోల్‌కతా X గుజరాత్‌ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

This book tells about the many crises that Farooq faced9
అబ్దుల్లాకు జరిగిన నమ్మక ద్రోహం

అమర్‌జీత్‌ సింగ్‌ దులత్‌ పుస్తకం జమ్ము –కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ ఫరూఖ్‌ అబ్దుల్లాను ఎందుకంత తీవ్రంగా బాధించిందో అర్థం కాని విషయం. ఆర్‌.ఏ. డబ్ల్యూ(రా) మాజీ ఉన్నతాధికారి దులత్‌ ఆయన మీద రాసిన ‘ద చీఫ్‌ మినిస్టర్‌ అండ్‌ ద స్పై’ పుస్తకం ఏమీ ఫరూఖ్‌కు తెలియకుండా వెలువడలేదు. ‘‘ఫరూఖ్‌ అబ్దుల్లా మీద నా అవగాహనతో రాసిన నా కథ’’ అని రచయిత ముందుమాటలో చెప్పుకొన్న ఈ రచనకు ఫరూఖ్‌ మద్దతు ఉంది. దాని గురించి వారిద్దరూ ‘‘అనేకసార్లు మాట్లాడుకున్నారు.’’ ఆయన ‘‘కరో నా (కానీయ్‌)’’ అంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాకే పుస్తకం వెలుగు చూసింది. కానీ పుస్తకం బయటకు వచ్చాక ఫరూఖ్‌ ఎంతో నొచ్చుకున్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయమే. ఈ పుస్తకం ఒక ప్రశంసా గీతిక అనేది సత్యం. ‘నేషనల్‌ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అంటే ఫరూఖ్‌ అబ్దుల్లానే అనీ, ఆయన లేకపోతే ఎన్సీ ఎక్కడ ఉండేదో ఊహించలేమనీ పుస్తకం చెబుతుంది. అంతటి తోనే ఆగదు. ‘‘డాక్టర్‌ సాహిబ్‌ కేవలం ముఖ్యమంత్రి కారు, ఆయనే కశ్మీర్‌’’ అని తేల్చిచెప్తుంది. ఫరూఖ్‌ తన తండ్రి షేక్‌ అబ్దుల్లా కంటే గొప్ప వ్యక్తి అనీ, బహుశా ఆయనే నేడు దేశంలో అత్యున్నత నాయ కుడు అనీ దులత్‌ ఇంటర్వ్యూలలో చెప్పారు. ఈ ప్రశంస అతిశయోక్తి. కానీ, దులత్‌ దృష్టిలో అక్షర సత్యం.ఫరూఖ్‌ ఎదుర్కొన్న పలు సంక్షోభాల గురించి ఈ పుస్తకం చెబుతుంది. ఫరూఖ్‌ ‘‘శ్రీనగర్‌కు ఢిల్లీకి నడుమ వారధిగా ఉండాలని కోరుకున్నారు... ఆయన రాజకీయాల్లో ఉన్నది ఢిల్లీతో కలిసి పని చేయడానికే గానీ, వ్యతిరేకంగా కాదు.’’ కానీ సమస్య ఏమిటంటే, ఢిల్లీ ఆయన ఆలోచనను గ్రహించలేక పోయింది. ‘‘ఫరూఖ్‌ అబ్దుల్లాను, ఆయన ఆశయాలను ఢిల్లీ ఏనాడూ అర్థం చేసుకోలేదు... దేశ రాజధానికి అంతు చిక్కనిది ఏదో ఆయనలో ఉంది.’’ ఇది ఒక పార్శ్వమైతే, రెండోది – కశ్మీరు ప్రజలతోనూ ఆయన సంబంధాలు. అవి ఏనాడూ సవ్యంగా లేవు. ఢిల్లీ మీద కశ్మీర్‌ ప్రజలకు విశ్వాసం లేదు. ‘‘ఢిల్లీతో ఏ మాత్రం సంబంధం ఉన్నా సరే ఆ వ్యక్తులను, సంస్థలను వారు అనుమానిస్తారు.’’ ఈ క్రమంలో ‘‘ఇండియా పట్ల విధేయత కారణంగా ఫరూఖ్‌ అబ్దుల్లా కుటుంబం కశ్మీరు పౌరుల ఆగ్రహానికి గురైంది.’’ ఫరూఖ్‌ అబ్దుల్లా అడకత్తెరలో పోకచెక్క అయ్యారు. ఢిల్లీకిచేరువ కావడం కోసం ఆయన ప్రయత్నించారు. కాని అక్కడ ఆయనకు పూర్తి ఆదరణ లభించలేదు. ఇక తాను దేని కోసం తపన పడుతున్నదీ తన సొంత ప్రజలకు అర్థం కాలేదు. వారి నుంచిమద్దతుకు బదులుగా అనుమానం, ఆగ్రహం ఎదుర్కోవలసివచ్చింది.కశ్మీరు రాజకీయాలను మిగతా దేశం నుంచి విడదీసిన క్లిష్ట సమస్య ఏమిటో దులత్‌ బాగానే అర్థం చేసుకున్నారు. ‘‘కశ్మీరు నాయ కులు కశ్మీరులో ఒక విధంగా మాట్లాడతారు, ఢిల్లీ వెళ్లి అక్కడ వేరేలా మాట్లాడతారు’’ అని ఆయన వివరించారు. ఆయన ఈ రెండు నాలుకల వైఖరిని కపటత్వంలా కాకుండా ‘ఫ్రెంచి భాష’లో పేర్కొనే ఒక రకమైన సభ్యతగా భావిస్తారు. వారున్న పరిస్థితిలో మనుగడ కోసం అలా మాట్లాడక తప్పదు. అది అవకాశ వాదం కాదు.దులత్‌ కథనం ప్రధానంగా ఫరూఖ్‌ అబ్దుల్లా ఎదుర్కొన్న మూడు నమ్మక ద్రోహాల చుట్టూ కేంద్రీకృతమై ఉంది. కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను ఇచ్చిన 370వ అధికరణం రద్దు వాటిలో ఒకటి. దులత్‌ దీన్ని సరిగ్గా చెప్పలేక పోయారు. అది వేరే విషయం. మిగిలిన రెండూ ఫరూఖ్‌ మెచ్చేలానే రాశారు.మొట్టమెదటి ద్రోహం – 1984లో ఒక అర్ధరాత్రి జరిగింది.ఇందిరా గాంధీ ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి కూలదోశారు. అది ఆయన మనసులో మానని గాయాన్ని మిగిల్చింది. ‘‘... ఆయన దీన్నుంచి కోలుకున్నారని నేననుకోవడం లేదు’’ అని ఇందిరను తీవ్రంగా దుయ్యబడుతూ దులత్‌ వ్యాఖ్యానించారు. దీంతో ఫరూఖ్‌ విభేదిస్తారని నేను అనుకోను. రెండోది – 2002 నాటిది. వాజ్‌పేయి, అద్వానీ కలిసి ఫరూఖ్‌కు ఉప రాష్ట్రపతి పదవి వాగ్దానం చేశారు. అయితే, వారు తర్వాత ఆ మాట నిలబెట్టుకోలేక పోయారు. వారి వాగ్దానానికి ‘‘ఫరూఖ్‌ఉప్పొంగిపోయారు... ఏదో ఒక రోజు భారత రాష్ట్రపతి కావాలన్నది ఆయన జీవితాశయం. దానికి ఇది తొలి మెట్టు అను కున్నారు.’’ దులత్, ఫరూఖ్‌ స్నేహబంధం ఇప్పుడు చిక్కులు ఎదుర్కొంటున్నా అది తెగేది కాదు. దులత్‌ తమను కలిపి ఉంచే ఆ బంధంపై ఇలా అంటారు. ‘‘డాక్టర్‌ సాహిబ్‌ నన్ను ఎంత నమ్మారో నేను ఎప్పటికీ తెలుసుకోలేను – ఆయన గురించి నాకు ఎంత తెలుసో ఆయన ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.’’ఏమైనప్పటికీ, దులత్‌ అవగాహనలో లోపాలు స్పష్టంగా కనబడతాయి. లేనట్లయితే, తనను విశ్వాసంలోకి తీసుకుని ఉంటే 370వ అధికరణం రద్దు విషయంలో సాయం అందించడానికి ఫరూఖ్‌ అబ్దుల్లా సుముఖమే అనే ఆరోపణ మీద దురదృష్టకరమైన ఈ వివాదం తలెత్తేదే కాదు. తన పుస్తకం మొదటి అధ్యాయంలోనే దులత్‌ ఇంతటి కీలకాంశం లేవనెత్తడం హాస్యాస్పదం.‘‘ఫరూఖ్‌ మూడు దశాబ్దాలుగా నాకు తెలిసి ఉన్నా, నాకు ఆయన నిజంగా తెలుసు అని పూర్తి నమ్మకంగా ఏనాడూ చెప్పలేను. అదీ డాక్టర్‌ సాహిబ్‌ అనే ప్రహేళిక. ఆయన్ను తెలుసుకోవడం అంత సులభం కాదు.’’ గత వారం తలెత్తిన వివాదం, దులత్‌ చెప్పిన అంశాన్నే విషాదకరంగా రుజువుచేసింది.-వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌-కరణ్‌ థాపర్‌

Massage holds a special place in various traditional medical systems including Ayurveda10
స్తుతి మర్దనం

‘మర్దనం గుణవర్ధనం’ అని మనకో నానుడి ఉంది. లోకంలో కొన్నింటిని ఎంతగా మర్దిస్తే, వాటి గుణాలు అంతగా వృద్ధిచెందుతాయని అర్థం. మర్దనానికి అచ్చతెలుగులో నలగగొట్టడం, పిసకడం, నూరడం అనే అర్థాలు ఉన్నాయి. చెరకుగడను, తాంబూలాన్ని, చందనాన్ని, పెరుగును ఎంతగా మర్దిస్తే, వాటి గుణాలు అంతగా ఇనుమడిస్తాయని ఈ నానుడికి మూలమైన సంస్కృత శ్లోకం చెబుతోంది. మర్దనకు అణచివేయడం, అంతమొందించడం అనే అర్థాలు కూడా ఉన్నట్లు పురాణ గాథలను గమనిస్తే అర్థమవుతుంది. ఉదాహరణకు ‘కాళీయమర్దనం’లో బాలకృష్ణుడు కాళింది మడుగును విషభరితం చేసిన కాళీయ సర్పం పడగల మీదకెక్కి తాండవనృత్యం చేసి, కాళీయుడి పొగరును అణచేశాడు. కృష్ణుడిపై శ్లోకాలలో ‘వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం’ అనే సంబోధన ఉంటుంది. కృష్ణుడి మీదకు కంసుడు ఉసిగొలిపిన చాణూరుడు, ఆ తర్వాత కంసుడు కూడా కృష్ణుడి చేతిలో అంతమొందారు. లోకకంటకుడైన మహిషాసురుడిని సంహరించడం వలన దుర్గాదేవి మహిషాసురమర్దినిగా పేరుపొందింది. నిఘంటవులను శోధిస్తే ‘మర్దన’ పదానికి అనేక పర్యాయపదాలు, అనేక నానార్థాలు ఉన్నాయి. ఇవి ఎన్ని ఉన్నా, మర్దన అంటే నొప్పుల నుంచి ఉపశమనం కలిగించి, ఒంటికి హాయినిచ్చే దేహమర్దన అనే అర్థమే విస్తృతంగా వాడుకలో ఉంది. ఊరూరా వ్యాపిస్తున్న అధునాతన మర్దన కేంద్రాల పుణ్యాన మర్దన కళ ఇదివరకు ఎన్నడూ లేనంతగా వర్ధిల్లుతోంది. ఆయుర్వేదం సహా నానా సంప్రదాయ వైద్యపద్ధతుల్లో మర్దనకు ప్రత్యేక స్థానం ఉంది. తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చర్మవ్యాధులు వంటి వాటికి మర్దనమే తగిన చికిత్స అని సంప్రదాయ వైద్యులు చెబుతారు. మర్దన చికిత్సలో రకరకాల తైలాలను ఉపయోగిస్తారు. మర్దన వల్ల శరీరానికి బడలిక తీరి, విశ్రాంతి కలుగుతుంది. శ్రమ వల్ల కలిగిన నొప్పులు తగ్గుముఖం పడతాయి. రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరానికి ఉల్లాసం కలిగి, చక్కగా నిద్రపడుతుంది. క్రమం తప్పని మర్దన వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మర్దన ఒక పురాతన శాస్త్రీయ కళ. ఆయుర్వేదాది సంప్రదాయ శాస్త్రాలు చెప్పేదంతా భౌతిక మర్దన పద్ధతుల గురించి మాత్రమే!లోకంలో మరో రకమైన మర్దన కళ కూడా విస్తృత వ్యాప్తిలో ఉంది. అయితే, అది అభౌతిక మైనది, ఇంకా నిర్గుణ నిరాకార పరబ్రహ్మ వలె అగోచరమైనది కూడా! భౌతిక మర్దనకు దేహ సౌఖ్యం, ఆరోగ్యం మాత్రమే పరమ ప్రయోజనాలైతే, అభౌతిక మర్దనకు అంతకు మించిన ఆధిభౌతిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ‘మహదానందానికి మీరు కేవలం ఒక మర్దనదూరంలో ఉన్నారు’ అనేది ఒక మర్దన కేంద్రం వ్యాపార నినాదం. మర్దన కలిగించే మహదానందం కోసమే మనుషులు అర్రులు చాస్తుంటారు. చాలామంది అందుకోసమే మర్దన కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించుకుంటూ ఉంటారు.భౌతిక మర్దనలో కించిత్‌ శారీరక శ్రమ ఉంటుంది గాని, అభౌతిక మర్దనలో అలాంటిదేమీఉండదు. ఊరకే నోటికి పనిచెప్పి, ఎదుటివారికి పరమానందం కలిగించే మాటలు అదను చూసి మాట్లాడితే చాలు– భౌతిక మర్దనకు మించిన ప్రయోజనాలు అనాయాసంగానే నెరవేరుతాయి. అభౌతిక మర్దనకు కీలక సాధనం పొగడ్త. పొగడ్త అగడ్త అని అంటారు. చాలామందికి ఈ సంగతి తెలిసినా, తెలిసి తెలిసి మరీ పొగడ్తలకు పడిపోతారు. పొగడ్త మనోమర్దన కళ. పొగడ్తలతో ఎదుటివారిని పడగొట్టడం ఒక కళ అయితే, పొగడ్తలకు పడిపోవడం ఒక బలహీనత.మనుషులన్నాక బలహీనతలు సహజం. మరి మనుషులన్నాక కొంత కళాపోషణ కూడా ఉండాలి కదా! అధికారంలో ఉన్న అత్యధికులకు పొగడ్తలు ఒక వ్యసనం. అధికారంలో ఉన్నవారిని పొగుడుతూ పబ్బం గడుపుకోవడం చాలామంది బతకనేర్పరులకు ఒక సత్కాలక్షేపం. అధికారంలో ఉన్నవారు చండశాసనులుగా ఎంతటి ప్రచండ ప్రఖ్యాతి పొందినా, ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి’ అని ఎరిగిన ధీమంతులు అలాంటివారిని కూడా తమ వాగ్మర్దన కళతో ఇట్టే లోబరచుకుంటారు.కళలో రాణించాలంటే, నిరంతర సాధనతో నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నాడు వేమన. ఈ సూత్రం మర్దన కళకు కూడా వర్తిస్తుంది – అది దేహమర్దన కళ అయినా, మనోమర్దన కళ అయినా సరే! తగినంత సాధన, కావలసినంత నైపుణ్యం లేకుంటే, రసాభాస తప్పదు. అప్పుడు ఆశించిన ఫలితాలు దక్కకపోగా, పరిస్థితులు వికటించే ప్రమాదం కూడా తలెత్తవచ్చు. అలా వికటించే ప్రమాదాలు ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. చైనాలో ఇటీవల అలాంటి ప్రమాదమే ఒకటి జరిగింది. హునాన్‌ ప్రావిన్స్‌ రాజధాని చాంగ్షా నగరంలో ఐటీ ఉద్యోగం చేసే ఒక ఇరవయ్యారేళ్ల కుర్రాడు మెడనొప్పికి ఉపశమనం కోసం మర్దనకేంద్రాన్ని ఆశ్రయించాడు. అక్కడ మర్దనచేసే మహానుభావుడు ఎవరో గాని, దాదాపుగాగొంతు నులిమే స్థాయిలో మర్దన చేశాడు. ఆ మర్దనధాటికి అర్భకపు ఐటీ కుర్రాడు పక్షవాతంతో ఆస్పత్రి పాలయ్యాడు. మర్దన చేసేటప్పుడు మితిమీరిన ఒత్తిడి ప్రయోగించడం వల్ల అతడి మెడ లోని రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పారు. ఈ సంఘటనకు ముందు ఇలాగే మెడనొప్పికి మర్దన చేయించుకున్న థాయ్‌ గాయకుడు ఒకరు ఏకంగా పరలోకగతుడయ్యాడు. ఎలాంటి మర్దన అయినా, శ్రుతి మించితే, అది మరణశాసనం కూడా కాగలదు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement