Top Stories
ప్రధాన వార్తలు

రాష్ట్రమంతా ‘నెట్టిల్లు’
సాక్షి, హైదరాబాద్: ఒకే ఒక్క ఇంటర్నెట్ కనెక్షన్.. మీ నట్టింట్లోని టెలివిజన్ తెరను కంప్యూటర్‌గా (వర్చువల్ డెస్క్ టాప్) మార్చేస్తుంది. వైఫై సేవ లతో పాటు కేబుల్ టీవీ అందుబాటులోకి వస్తుంది. మీ టీవీని, లేదా సెల్‌ఫోన్‌ను సీసీ కెమెరాలతో అనుసంధానించుకోవచ్చు. కేబుల్ టీవీ చానళ్లతో పాటు పిల్లలకు పాఠాలు చెప్పే టీ శాట్ చానళ్లు కూడా చూసేందుకు వీలవుతుంది. కేబుల్ ఆపరేటర్‌కు మీరు నెలా చెల్లించే మొత్తంలోనే వీటితో పాటు యూట్యూబ్, గూగుల్, ఓటీటీ లాంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.తక్కువ ఖర్చు తో అపరిమిత హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను నిరంతరం వినియోగించుకునే వెసులుబాటు వినియోగదారులకు దక్కుతుంది. ‘భారత్ నెట్’ప్రాజె క్టులో భాగంగా ఈ తరహా సౌకర్యాన్ని త్వరలో తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రయత్నాలు చేస్తోంది. రూ.300కే కనెక్షన్ ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్తో పాటు పలు ప్రైవేటు సంస్థలు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా టీ ఫైబర్ ప్రాజెక్టులో భాగంగా, ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే దిశగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 12,751 గ్రామ పంచాయతీలను ఆప్టిక్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ)తో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 5,001 గ్రామ పంచాయతీలను ఓఎఫ్‌సీతో కనెక్ట్ చేసింది. టీ ఫైబర్ పనులను పూర్తి చేసి ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా 2028 నాటికి రూ.500 కోట్ల మేర ఆదాయం పొందాలని ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందించడంలో లోకల్ కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములను చేసేందుకు తాజాగా టీ ఫైబర్ దరఖాస్తులు ఆహా్వనిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనిద్వారా లోకల్ కేబుల్ ఆపరేటర్లతో పాటు సుమారు 20 వేల మంది ఫైబర్ ఆప్టిక్ టెక్నీషియన్లకు కూడా ఉపాధి లభించనుంది. తొలి విడతలో సాంకేతిక సమస్యలు భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా తొలి విడత రాష్ట్రంలోని మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఓఎఫ్సీ నెట్వర్క్ పనులు ప్రారంభించారు. ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామ పంచాయతీలకు ఓఎఫ్సీని వేసే బాధ్యతను బీఎస్ఎన్ఎల్కు అప్పగించారు. ఓఎఫ్సీ కేబుల్ లైన్లతో గ్రామాలను అనుసంధానించినా, నిర్వహణ లోపంతో (ఓవర్ ది ఎయిర్) స్తంభాలపై వేసిన కేబుల్ లైన్లను ఇష్టారీతిన తొలగించడం, ఓఎఫ్సీని కత్తిరించడం మూలంగా లైన్లు దెబ్బతిని కనెక్టివిటీ ప్రశ్నార్దకంగా మారింది. దేశ వ్యాప్తంగా ఇదే తరహా సమస్యలు తలెత్తడంతో ‘భారత్ నెట్’రెండో దశలో ఓఎఫ్సీ లైన్లు వేయడంలో ఏ తరహా సాంకేతికతను అనుసరించాలనే స్వేచ్ఛను రాష్ట్రాలకు కేంద్రం వదిలేసింది. రింగ్ టెక్నాలజీ వైపు తెలంగాణ మొగ్గు భారత్ నెట్ రెండో దశలో తెలంగాణ ఒక్కటే ఓఎఫ్సీని భూగర్భంలో వేసే ‘రింగ్ టెక్నాలజీ’వైపు మొగ్గు చూపింది. రెండో దశలో భాగంగా రాష్ట్రంలో 32 వేల కిలోమీటర్ల మేర ఓఎఫ్సీ విస్తరించగా, మరో 3,500 కిలోమీటర్ల పొడవునా కేబుల్స్ వేయాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన ‘రింగ్ టెక్నాలజీ’విజయవంతం కావడంతో భారత్ నెట్ ప్రాజెక్టు మూడో దశలో అన్ని రాష్ట్రాలు రింగ్ టెక్నాలజీ అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా రింగ్ టెక్నాలజీ ద్వారా ఓఎఫ్సీ విస్తరణకు అయ్యే ఖర్చును భారత్ నెట్ ప్రాజెక్టు భరించేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో రెండో దశలోనే రింగ్ టెక్నాలజీ అనుసరించేందుకు తాము వెచ్చించిన రూ.1,779 కోట్లను కనీసం వడ్డీలేని రుణంగా అయినా ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. 4 గ్రామాల్లో ఉచితంగా ప్రయోగం టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే కార్యక్రమంలో భాగంగా ప్రయోగాత్మకంగా నాలుగు గ్రామాల్లో డిజిటలైజేషన్ చేపట్టాం. హాజిపల్లి (రంగారెడ్డి జిల్లా), మద్దూర్ (నారాయణపేట), సంగుపేట (సంగారెడ్డి), అడవి శ్రీరాంపూర్ (పెద్దపల్లి) గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చాం. ఈ బాధ్యతను మూడు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించి 3 నెలల పాటు ఇంటర్నెట్ సేవలు ఉచితంగా అందిస్తాం. తర్వాత ఒక్కో వినియోగదారుడి నుంచి కనిష్టంగా సుమారు రూ.300 చొప్పున వసూలు చేస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో 70శాతం గృహాల్లో 30 శాతం లోకల్ కేబుల్ ఆపరేటర్లు, 31శాతం డీటీహెచ్, మరో 39 శాతం ఇంటర్నెట్ ద్వారా డిజిటల్ కనెక్టివిటీ ఉంది. ఈ గృహాలన్నింటినీ భవిష్యత్తులో టీ ఫైబర్ పరిధిలోకి తీసుకువచ్చి నామమాత్ర చార్జీలతో అపరిమిత నిరంతర హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి తెస్తాం. 15 జిల్లాల్లో డిజిటల్ కనెక్టివిటీ పనులు చివరి దశలో ఉన్నాయి. – వేణు ప్రసాద్, ఎండీ, టీ ఫైబర్ టీ ఫైబర్ ప్రాజెక్టు ప్రస్తుత స్థితి పనులు పూర్తయిన జిల్లాలు: మహబూబ్‌నగర్, జనగామ, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, వరంగల్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్ పనులు పురోగతిలో ఉన్న జిల్లాలు: నల్లగొండ, నాగర్‌కర్నూల్ మెదక్, సూర్యాపేట, సంగారెడ్డి భారత్ నెట్ మొదటి దశలో సాంకేతిక సమస్యలు తలెత్తిన జిల్లాలు: మేడ్చల్– మల్కాజిగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి అటవీ అనుమతులో పనులు ఆగిన జిల్లాలు: ఆదిలాబాద్, భూపాలపల్లి, నిర్మల్, మహబూబాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ములుగు ప్రస్తుతం పనుల పరిస్థితి మొత్తం పంచాయతీలు ః 12,751 పనులు పూర్తయినవి ః 5001 పనుల పురోగతి ః 3888 అటవీ అనుమతులు కావాల్సినవి ః 773 భారత్ నెట్ మొదటి దశ సమస్యలు ః 3089 హెచ్ఎండీఏ పరిధిలో పనులు కావాల్సినవిః 1.1కోట్ల జనాభా (18 లక్షల గృహాలు) అపరిమితంగా ఇంటర్నెట్ నాలుగు నెలల క్రితం మా కాలనీలో స్మార్ట్ టీవీ ఉన్నవారికి టీ ఫైబర్ కనెక్షన్ ఇచ్చారు. మొదట యూట్యూబ్ మాత్రమే వచ్చేది. వైఫై ద్వారా నెట్ సౌకర్యం అంతంత మాత్రమే వచ్చింది. నెల తర్వాత కొన్ని చానల్స్ ఆన్ అయ్యాయి. ప్రస్తుతం యూట్యూబ్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వైఫై స్పీడ్ కూడా దాదాపు 20 ఎంబీపీఎస్‌కు పెరిగింది. జియో, ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ సంస్థలు ఆప్టిక్ ఫైబర్ ద్వారా సేవలందిస్తున్నాయి. ఈ సంస్థలకు ప్రతినెలా రూ.700 నుంచి రూ.900 వరకు చెల్లించాల్సి వచ్చేది. టీ ఫైబర్‌కు ప్రస్తుతం ఎలాంటి రుసుము తీసుకోవడం లేదు. – మిట్టే చంద్రశేఖర్, మద్దూర్, నారాయణపేట జిల్లా అప్పుడప్పుడు సిగ్నల్స్ సమస్య వస్తోంది.. ఫైబర్ నెట్ వినియోగంలో కొంత సిగ్నల్స్ సమస్యలు ఏర్పడుతున్నాయి. కరెంట్ పోయి వచ్చిన సందర్భాల్లో సిగ్నల్స్ రావడానికి 20 నిమిషాల సమయం పడుతోంది. అయితే సిగ్నల్స్ సమస్య వచ్చినప్పుడు గ్రామంలో ఫైబర్ నెట్ ఆపరేట్ చేసే వ్యక్తికి తెలియజేయగానే వెంటనే వచ్చి సరిచేస్తున్నారు. గ్రామంలో నెట్ వినియోగించుకోవడం తెలియని వారికి వివరంగా తెలియజేస్తున్నారు. – వెంకటేశ్వర్ గౌడ్, సంగుపేట, సంగారెడ్డి జిల్లా

ఇటు రోహిత్ అటు కోహ్లి
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ విజృంభించారు. భారీ షాట్లతో అలరిస్తూ ఆదివారం అభిమానులకు డబుల్ ధమాకా అందించారు. పంజాబ్ కింగ్స్‌తో పోరులో కోహ్లి క్లాసిక్ ఇన్నింగ్స్‌తో కదంతొక్కగా... చెన్నైతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఊర మాస్ షాట్లతో చెలరేగిపోయాడు. ఫలితంగా పంజాబ్‌పై బెంగళూరు బదులు తీర్చుకోగా... చెన్నైపై ముంబై ఇండియన్స్ భారీ విజయం నమోదు చేసుకుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఓ మాదిరి ప్రదర్శనతో సరిపెట్టుకున్న రోహిత్... తనను ‘హిట్‌మ్యాన్’ ఎందుకు అంటారో వాంఖడేలో నిరూపించాడు. విరాట్ దూకుడుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లగా... రోహిత్ మెరుపులతో ముంబై నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లుగా తొలి ఓవర్లోనే క్రీజులో అడుగుపెట్టిన ఈ ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచి తమ జట్లను గెలిపించడం కొసమెరుపు.ముంబై: సిక్స్... ఫోర్... ముంబై ఇన్నింగ్స్ మొత్తం ఇదే తీరు! బంతి పడటమే ఆలస్యం బౌండరీ వెళ్లెందుకు ఓసారి, సిక్స్ అయ్యేందుకు మరోసారి బంతి అదేపనిగా ముచ్చట పడిందనిపించింది. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ, టి20 స్పెషలిస్ట్ సూర్యకుమార్‌ల ఆట మ్యాచ్‌లో హైలైట్స్‌ను చూపించలేదు. హైలైట్సే మ్యాచ్‌గా మార్చేసింది. దీంతో ముంబై 177 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. చెన్నైపై 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ముందుగా చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), సూర్య (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) హోరెత్తించారు. దంచేసిన జడేజా, దూబే ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ (20 బంతుల్లో 19; 1 ఫోర్)కు ఓపెనింగ్‌లో అవకాశమిస్తున్న ధోనిని నిరుత్సాహపరిచాడు. పవర్‌ప్లేలో 20 బంతులాడి కూడా ఒకే ఒక్క బౌండరీ బాదాడు. రచిన్ రవీంద్ర (5) విఫలమవగా, 17 ఏళ్ల ‘లోకల్ బాయ్’ ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉన్నది కాసేపే అయినా ఫోర్లు, సిక్స్‌లతో అలరించాడు. తర్వాత వచ్చిన జడేజా, దూబే భారీషాట్లు బాదడంతో చెన్నై పుంజుకుంది. ఇద్దరు నాలుగో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. సిక్స్‌లు బాదిన దూబే 30 బంతుల్లో, జడేజా 34 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ధోని (4)ని బుమ్రా ఎంతో సేపు నిలువనీయలేదు. బాదుడే... బాదుడు రోహిత్ శర్మకు జతగా ఓపెనింగ్ చేసిన రికెల్టన్ తొలి ఓవర్లోనే బౌండరీలతో తమ ఉద్దేశం చాటగా, రెండో ఓవర్ నుంచి రోహిత్ విరుచుకుపడటంతో చెన్నై బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. జేమీ ఓవర్టన్ ఓవర్‌న్నర (9 బంతులు) వేసిన ఐదో ఓవర్లో రికెల్టన్, రోహిత్ చెరో సిక్స్ కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో 62 పరుగులు చేసిన ముంబై తర్వాతి ఓవర్లోనే రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్‌ను కోల్పోయింది. సూర్యకుమార్ రావడం... రోహిత్‌తో కలిసి ధనాధన్ షోను డబుల్ చేసింది. ఇద్దరు బౌండరీలు, సిక్సర్లు కొట్టేందుకు పోటీపడటంతో స్టేడియం హోరెత్తింది. ముందుగా ‘హిట్‌మ్యాన్’ 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... సూర్య 26 బంతుల్లో అర్ధసెంచరీ అధిగమించాడు. ఇద్దరు బంతిని అదేపనిగా బౌండరీలైన్‌ను దాటిస్తూనే ఉండటంతో లక్ష్యం ముంబై వైపు నడిచివచ్చింది.స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: షేక్ రషీద్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 19; రచిన్ (సి) రికెల్టన్ (బి) అశ్వని 5; ఆయుశ్ (సి) సాంట్నర్ (బి) దీపక్ చహర్ 32; జడేజా (నాటౌట్) 53; దూబే (సి) జాక్స్ (బి) బుమ్రా 50; ధోని (సి) తిలక్ (బి) బుమ్రా 4; జేమీ ఓవర్టన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–16, 2–57, 3–63, 4–142, 5–156. బౌలింగ్: చహర్ 4–0–32–1, బౌల్ట్ 4–0–43–0, అశ్వని 2–0–42 –1, సాంట్నర్ 3–0–14–1, బుమ్రా 4–0–25–2, విల్ జాక్స్ 1–0–4–0, హార్దిక్ 2–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) ఆయుశ్ (బి) జడేజా 24; రోహిత్ (నాటౌట్) 76; సూర్యకుమార్ (నాటౌట్) 68; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (15.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 177. వికెట్ల పతనం: 1–63. బౌలింగ్: ఖలీల్ 2–0–24–0, ఓవర్టన్ 2–0– 29–0, అశ్విన్ 4–0–25–0, జడేజా 3–0–28–1, నూర్ 3–0–36–0, పతిరణ 1.4–0–34–0. ముల్లాన్‌పూర్: ముందు బౌలర్లు, తర్వాత బ్యాటర్లు రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తమ సొంతగడ్డపై పొగొట్టుకున్న ఫలితాన్ని పంజాబ్‌కు వెళ్లి రాబట్టుకుంది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. జోష్ ఇన్‌గ్లిస్ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), శశాంక్ సింగ్ (33 బంతుల్లో 31; 1 ఫోర్) మెరుగ్గా ఆడారు. కృనాల్, సుయశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించాడు. కోహ్లి ఆఖరిదాకా... పెద్ద లక్ష్యం కాకపోయినా... బెంగళూరు జట్టు తమ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (1) వికెట్‌ను తొలి ఓవర్లోనే కోల్పోయింది. పంజాబ్‌కు దక్కింది ఈ ఆరంభ సంబరమే! అటు తర్వాత కథంతా కింగ్ కోహ్లి, పడిక్కల్ నడిపించారు. వన్‌డౌన్ బ్యాటర్ పడిక్కల్ భారీ సిక్సర్లతో విరుచుకుపడగా... కోహ్లి క్లాసిక్స్ షాట్లతో ముల్లాన్‌పూర్ ప్రేక్షకుల్ని గెలిచాడు. ఇద్దరు రెండో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. పడిక్కల్ అవుటైనా... ఆఖరిదాకా క్రీజులో నిలబడిన కోహ్లి జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 22; ప్రభ్సిమ్రాన్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 33; అయ్యర్ (సి) కృనాల్ (బి) షెఫర్డ్ 6; ఇన్‌గ్లిస్ (బి) సుయశ్ 29; నేహల్ (రనౌట్) 5; శశాంక్ (నాటౌట్) 31; స్టొయినిస్ (బి) సుయశ్ 1; యాన్సెన్ (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–42, 2–62, 3–68, 4–76, 5–112, 6–114. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–26–0, యశ్ దయాళ్ 2–0–22–0, హాజల్‌వుడ్ 4–0–39–0, కృనాల్ పాండ్యా 4–0–25–2, షెఫర్డ్ 2–0–18–1, సుయశ్ 4–0–26–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఇన్‌గ్లిస్ (బి) అర్ష్ దీప్ 1; కోహ్లి (నాటౌట్) 73; పడిక్కల్ (సి) నేహల్ (బి) హర్‌ప్రీత్ 61; పాటీదార్ (సి) యాన్సెన్ (బి) చహల్ 12; జితేశ్ శర్మ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–6, 2–109, 3–143. బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–26–1, జేవియర్ 3–0–28–1, హర్‌ప్రీత్ బ్రార్ 4–0–27–1, యాన్సెన్ 3–0–20–0, చహల్ 4–0–36–1, స్టొయినిస్ 1–0–13–0, నేహల్ 0.5–0–9–0. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X గుజరాత్ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.అష్టమి ప.1.50 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.8.04 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ప.12.04 నుండి 1.40 వరకు, దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.15 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: రా.9.44 నుండి 11.20 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.44, సూర్యాస్తమయం: 6.12. మేషం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ధనలబ్ధి. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.వృషభం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలలో మార్పులు. బంధువులతో తగాదాలు. వ్యయప్రయాసలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.మిథునం: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.సింహం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు రాగలవు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.కన్య: శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.తుల: కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దైవదర్శనాలు. బంధువులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.వృశ్చికం: శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.ధనుస్సు: పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం.మకరం: మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.కుంభం: మిత్రులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.మీనం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు సజావుగా పూర్తి చేస్తారు. భూ, వాహనయోగాలు. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

ఆర్టీసీలో 3,038 ఖాళీల భర్తీకి ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో తొలి నియామక ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో చివరిసారి వివిధ కేటగిరీల్లో నియమకాలు జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు పోస్టుల భర్తీ జరగలేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ఏకంగా 3,038 పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. ఇప్పటివరకు ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీని సంస్థే చేపట్టే విధానం ఉండేది. తొలిసారి నియామక సంస్థలకు ప్రభుత్వం ఈ బాధ్యత అప్పగించింది. టీజీపీఎస్సీ, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డులు కేటగిరీల ప్రకారం నియామక ప్రక్రియలను చేపట్టనున్నాయి. ఏడెనిమిది నెలల క్రితమే కసరత్తు తెలంగాణ ఆర్టీసీలో ప్రసుతం చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతినెలా సగటున 200 మంది రిటైర్ అవుతుండటంతో ఖాళీల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీ చేపట్టాలని ఏడెనిమిది నెలల క్రితమే ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. దాదాపు ఐదు వేల ఖాళీల భర్తీకి ప్రతిపాదించింది. కానీ ప్రభుత్వం 3,038 పోస్టులకే అనుమతి ఇచ్చింది. అయితే తాము నియామక పరీక్షలకు రూపొందించుకున్న కేలండర్ ఆధారంగానే ఆర్టీసీలో పోస్టుల భర్తీ కూడా ఉంటుందని ఆయా సంస్థలు ప్రకటించాయి.దీంతో వెంటనే నియామకాలు చేపట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇంతలో ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి రావటంతో, అది తేలిన తర్వాతే నియామకాలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల ఎస్సీ వర్గీకరణ జరిగి, రోస్టర్ పాయింట్లపై స్పష్టత రావడంతో ఖాళీల భర్తీకి రంగం సిద్ధమైంది.కీలకమైన డ్రైవర్ల ఎంపిక ప్రక్రియ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చూడనుంది. మరో రెండు నెలల్లో ప్రక్రియ మొదలవుతుందని, నాలుగు నెలల్లో కొత్త డ్రైవర్లు అందుబాటులోకి వస్తారని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. జోనల్ పోస్టులు, రీజియన్ పోస్టుల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లను సూచిస్తూ ఆర్టీసీ సంబంధిత బోర్డులకు వివరాలు అందజేయాల్సి ఉంది. బోర్డులు అడగ్గానే వాటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అప్పటి వరకు ఔట్సోర్సింగ్ డ్రైవర్లతో.. ప్రస్తుతం ఆర్టీసీలో 1,600 డ్రైవర్పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్న డ్రైవర్లపై తీవ్ర పనిభారం పెరిగింది. డబుల్ డ్యూటీలు చేయాల్సి వస్తోంది. దీంతో 1,500 మంది ఔట్సోర్సింగ్ డ్రైవర్లను విధుల్లోకి తీసుకునేందుకు సంస్థ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. మ్యాన్‌పవర్ సప్లయిర్స్ సంస్థల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఎంపిక చేసిన డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నారు. వీరిని మూడు నెలల పాటు కొనసాగిస్తామని ఒప్పందంలో సంస్థ పేర్కొంది.తాజాగా రెగ్యులర్ డ్రైవర్ల నియామకం వరకు వీరిని కొనసాగించాలని నిర్ణయించింది. ఇలా తాత్కాలిక పద్ధతిలో ఎంపికైన వారు, రెగ్యులర్ నియామకాల కోసం కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. వీరు శిక్షణ పొంది ఉన్నందున, రెగ్యులర్ నియామకాల్లో వీరికి ఆయా బోర్డులు ప్రాధాన్యం ఇచ్చే వీలుందని అధికారులు చెబుతున్నారు.త్వరలో భర్తీ ప్రక్రియ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వం వచ్చిన తర్వాత యువత ఉపాధికి పెద్దపీట వేస్తూ 60 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీలో తొలి సారి భర్తీ ప్రక్రియ చేపడుతున్నాం. 3,038 ఖాళీలను నియామక బోర్డుల ద్వారా భర్తీ చేయనున్నాం. ఇందుకోసం ఆయా బోర్డులు నియామక క్యాలెండర్‌ను సిద్ధం చేసుకున్నాయి. వాటి ప్రకారం వీలైనంత త్వరలో భర్తీ ప్రక్రియ జరుగుతుంది. – రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

ఊరూపేరు లేని 'ఉర్సా'
సాక్షి, అమరావతి : రూ.10,000 కోట్లు పెట్టుబడులు పెట్టే కంపెనీ అంటే దాని స్థాయి ఎంత గొప్పగా ఉండాలి..? నిత్యం వేలాది మంది ఉద్యోగుల కోలాహలంతో పాటు పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు ఉండాలి కదా..? కానీ రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చిన ఆ కంపెనీలో కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేడు. ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు చేసిన దాఖలాలు కూడా లేవు. అంతెందుకు..? అసలది ఆఫీసే కాదు! వాడుకునేది కూడా గృహ విద్యుత్తే. కనీసం కార్యాలయం కూడా లేని కంపెనీకి ఎకరం 99 పైసలకే అత్యంత ఖరీదైన భూమిని ఉరుకులు పరుగులపై అప్పగించడం నీకింత.. నాకింత! దోపిడీకి పరాకాష్ట. ప్రపంచ చరిత్రలో ఇది వింతల్లో వింత! ఊరు పేరు లేని ‘ఉర్సా క్లస్టర్స్’కు విశాఖలో దాదాపు రూ.3,000 కోట్ల విలువైన భూమిని టీడీపీ సర్కారు అప్పనంగా కట్టబెట్టడం తాజాగా అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కేవలం రెండు నెలల వయసు, కనీసం ఓ ఆఫీసు, ఫోన్ నెంబర్, వెబ్సైట్ కూడా లేని ఓ ఊహల కంపెనీకి మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన అనంతరం రూ.వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేయడం పట్ల అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.రెండు నెలలు తిరగక ముందే.. టీసీఎస్‌ని తెరపైకి తెచ్చి ఆ ముసుగులో..! సొంత కార్యాలయం.. కనీసం ఫోన్ నెంబరు కూడా లేని ఓ అనామక కంపెనీ ఏర్పాటై రెండు నెలలు తిరగక ముందే తెలుగు రాష్ట్రాల్లో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామనడం.. ఆ ప్రతిపాదనకు ముచ్చట పడి చంద్రబాబు సర్కారు విశాఖలో కారు చౌకగా అత్యంత ఖరీదైన భూములు కేటాయించేయడం, ఇందుకోసం టీసీఎస్‌ని తెరపైకి తెచ్చి ఆ ముసుగులో ఎకరం 99 పైసలకే అంటూ ప్రత్యేకంగా పాలసీ తెస్తుండటంపై రాష్ట్ర ఐఏఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యనేతలు తమ కుట్ర అమలులో భాగంగా తొలుత టీసీఎస్‌కు ఎకరా 99 పైసలకే కేటాయించి, అదే ధరకు ఉర్సా కస్టర్స్‌కు విలువైన భూములు ధారాదత్తం చేసేలా పావులు కదిపారు. ‘ఉర్సా క్లస్టర్స్’ పేరుతో విశాఖలో డేటా సెంటర్, ఐటా క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించడమే తడవుగా చౌకగా భూములు కేటాయించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించడం.. ఆ వెంటనే క్యాబినెట్లో భూ కేటాయింపులు చేయడంపై అనుమానాలు బలపడుతున్నాయి. కనీసం ఓ ఆఫీసు, ఫోన్ నెంబర్ కూడా లేని కంపెనీ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఎలా ఆమోదించిందో అర్థం కావడం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భూ కేటాయింపులకు పచ్చజెండా.. ఉర్సా క్లస్టర్స్ రూ.5,728 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, ఐటాక్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం విశాఖ మధురవాడలోని ఐటీ హిల్ నెంబర్ 3లో ఐటా క్యాంపస్‌కు 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో డేటా సెంటర్‌కు 56.36 ఎకరాలు కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు చేసుకున్న ఉర్సా కంపెనీ గురించి ‘సాక్షి’ పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.రెండు నెలల క్రితం పుట్టిన ఉర్సాకుమారుడేమో సాధారణ ఉద్యోగి తండ్రేమో కంపెనీకి డైరెక్టరట.. ఇంకో డైరెక్టర్ కథ ఇదీ.. తెలుగు రాష్ట్రాల్లో రూ.10 వేల కోట్లు పెట్టుబడులు పెడుతుందని చెబుతున్న ఉర్సా క్లస్టర్స్ మార్చి నెల కరెంటు బిల్లు ఇది. హైదరాబాద్‌లో కార్యాలయమే లేదు..! కేరాఫ్ అడ్రస్ ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టే సంస్థ కార్యాలయం ఎంత పెద్దగా ఉంటుందో..? వందలాది మంది ఉద్యోగులతో కోలాహలంగా ఉంటుందని ఊహించుకుంటే పప్పులో కాలేసినట్లే. టీడీపీ కూటమి సర్కారు భూ కేటాయింపులు చేయడానికి కేవలం రెండు నెలల ముందు అంటే 2025 ఫిబ్రవరి 12న ఉర్సా క్లస్టర్స్ హైదరాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన పెందుర్తి విజయ్‌కుమార్, అమెరికాలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న సతీష్ అబ్బూరి డైరెక్టర్లుగా ఈ కంపెనీ ఏర్పాటైంది. ప్లాట్ నెంబర్ 705, ఏక్తా బాసిల్ హైట్స్, కొత్తగూడ, హైదరాబాద్, తెలంగాణ– 500084 చిరునామాతో దీన్ని నెలకొల్పారు. అయితే ఆ చిరునామాకు వెళ్లి పరిశీలించగా... అది పూర్తిగా నివాస ప్రాంతమని తేలింది. పెందుర్తి విజయ్‌కుమార్‌కు అత్యంత దగ్గరి బంధువైన పెందుర్తి పద్మావతికి చెందిన త్రీ బెడ్ రూమ్ నివాస ఫ్లాట్‌ను ఉర్సా ఆఫీసు కార్యాలయంగా పేర్కొన్నారు. అది పూర్తిగా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. ఒక్కో అంతస్తుకు నాలుగు ఫ్లాట్ల చొప్పున మొత్తం 28 ఫ్లాట్లున్నాయి. ఉర్సా కార్యాలయంగా పేర్కొన్న ఒక ఫ్లాట్‌లో ఓ కుటుంబం నివాసం ఉంటోందని, అసలు అక్కడ ఐటీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు జరగడం లేదని స్థానికులు వెల్లడించారు. ఇక రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటున్న ఉర్సా క్లస్టర్స్ వాణిజ్య విద్యుత్ కాకుండా గృహ విద్యుత్తు కనెక్షన్‌ను వినియోగి స్తోంది. ఆర్వోసీలో నమోదుకు సమర్పించిన ఫ్లాట్ నెంబర్ 705 విద్యుత్ బిల్లే దీనికి నిదర్శనం. ఉర్సా క్లస్టర్ కంపెనీకి కనీసం ఓ ఫోన్ నెంబరు గానీ వెబ్‌సైట్‌గానీ లేకపోవడం గమనార్హం. పెందుర్తి విజయకుమార్ తన వ్యక్తిగత ఈ మెయిల్‌ను ఆర్వోసీకి అందించారు. అమెరికాలోనూ అంతే.. లోకేశ్ పర్యటనకు నెల ముందు...!ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాతృసంస్థగా చెబుతున్న అమెరికాలోని ఉర్సా క్లస్టర్స్ ఎల్ఎల్సీ పరిస్థితి కూడా ఇంతే. అది లిమిటెడ్ లయబులిటీ కంపెనీ. ఏడు నెలల క్రితం.. అంటే 2024 సెపె్టంబర్ 27న ఉర్సా క్లస్టర్స్ అమెరికాలో ఏర్పాటైంది. అమెరికాలోని డెలావర్‌లో 611, సౌత్ డ్యూపాంట్, హైవే సూట్, 102 డోవెర్, డీఈ 19901 చిరునామాతో ఈ కంపెనీ నమోదైంది. పెందుర్తి విజయ్‌కుమార్ తనయుడు కౌశిక్ దీనికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనకు సరిగ్గా నెల రోజుల ముందు ఈ కంపెనీ ఏర్పాటు కావడం గమనార్హం. ఇక ఈ కంపెనీ ఇప్పటి వరకు చెల్లించిన పన్ను కేవలం 300 అమెరికన్ డాలర్లు మాత్రమే. అంటే మన కరెన్సీలో సుమారు రూ.25,000. అమెరికా చిరునామాతో ఉన్న ఇల్లు కూడా పూర్తిగా నివాసప్రాంతం. కేవలం 1,560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక చిన్న కుటుంబం నివాసం ఉండటానికి అనువుగా ఉన్న ఇంటిని ఆఫీసు కార్యాలయంగా పేర్కొన్నారు. ఇక అక్కడ కూడా ఉర్సా క్లస్టర్స్ బోర్డు లేదు.. ఉద్యోగులు లేరు. కనీసం ఫోన్ నెంబర్లు లేవు. కౌశిక్ పెందుర్తి ప్రస్తుతం టాలస్ పే అనే కంపెనీలో సీపీటీవోగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన లింక్డిన్ ఖాతా ద్వారా తెలుస్తోంది. అంటే ఆయన అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగి. మరో డైరెక్టర్ సతీష్ అబ్బూరి ఎలిసియం అనలిటిక్స్‌కు వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. అలాంటి ఉర్సా కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెడతామనడం, అడిగిందే తడవుగా రూ.వేల కోట్ల విలువైన భూమినికారుచౌకగా కట్టబెడుతుండటంపై పెద్ద ఎత్తున అనుమానాలు ముసురుకుంటున్నాయి.‘ఐఎంజీ భారత్’ను మించిన స్కామ్..ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 2004లో తన బినామీ బిల్లీరావు చేత ‘ఐఎంజీ భారత్’ అనే డొల్ల కంపెనీని పెట్టించి.. అది అమెరికాలో ఉన్న ఐఎంజీ అకాడెమీకి చెందిన కంపెనీ అని నమ్మించి.. హడావిడిగా దానికి గచ్చిబౌలిలోని 400 ఎకరాలు కేటాయించి సేల్‌డీడ్ కూడా చేసేశారు.. అంతేకాదు శంషాబాద్ పక్కన మరో 450 ఎకరాలు కూడా కేటాయించడంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని స్టేడియాలనూ ఆ కంపెనీకి 45 ఏళ్లపాటు లీజుకిచ్చేసి వాటి నిర్వహణ చార్జీలను మాత్రం ప్రభుత్వమే ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.. ఇపుడు ‘ఉర్సా క్లస్టర్స్’ కంపెనీని హడావిడిగా ఏర్పాటు చేసి విలువైన భూములు కేటాయించడం చూస్తుంటే ఐఎంజీ స్కామ్ గుర్తుకొస్తోందని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు.

ఏటా కోటి పెళ్లిళ్లుమన వివాహ మార్కెట్ రూ.11 లక్షల కోట్లు
సాక్షి, అమరావతి: దేశంలో వివాహ ఖర్చు భారీగా పెరుగుతోంది. సగటు కుటుంబ వార్షిక ఆదాయం కంటే మూడు రెట్ల అధిక వ్యయం జరుగుతోంది. ఆభరణాల కొనుగోలు నుంచి దుస్తులు, పెళ్లి మండపాలు, అతిథి సత్కారాలకు వెనుకడుగు వేయకుండా భారీ వ్యయాలు చేస్తున్నారు. దీనికి తోడు వధూవరుల ప్రత్యేక కోర్కెలు సైతం వివాహ ఖర్చులను అమాంతం పెంచేస్తున్నాయి. ఔట్ఫిట్స్, ఫస్ట్‌లుక్, మెహందీ, హల్దీ, ఫొటోషూట్, వినోద కార్యక్రమాలను యువత అమితంగా ఇష్టపడుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ వివాహాలు ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమగా రూపాంతరం చెందడం ఆసక్తి కలిగిస్తున్న అంశం. దేశ వివాహ మార్కెట్ విలువ రూ.11 లక్షల కోట్లుగా మార్కెట్ వర్గాల అంచనా. ఏటా దేశంలో దాదాపు కోటి వివాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ‘వెడ్డింగ్‌వైర్ ఇండియా’ సర్వే వివాహాల ఖర్చుపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది.ఆకాశమంత పందిరి... భూదేవంత పీటభారతీయ కుటుంబ వివాహాల్లో విలాసానికి ప్రాధాన్యం పెరుగుతోంది. సగటున పెళ్లిళ్ల కోసం రూ.29.60 లక్షలకుపైగా ఖర్చవుతోంది. ఇందులో వివాహ వేదికకే 20 శాతానికిపైగా వెచ్చిస్తుండటం విశేషం. 2023లో ఒక వేదికకు సగటున రూ.4.70 లక్షలు ఖర్చు చేస్తే, ఇప్పుడు రూ.6 లక్షలకుపైగా కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఒక్కోసారి రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెరుగుతున్నట్లు సర్వే నివేదిక పేర్కొంది. ఆ సందర్భాల్లో మొత్తం వివాహ వ్యయం రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఉండడం విశేషం. తగ్గేదేలే..భారతీయ వివాహ వేడుకలు కనీసం మూడు, నాలుగు రోజులు కొనసాగుతున్నాయి. భారీగా వివాహ వ్యయం ధోరణి గ్రామాల్లోకీ విస్తరిస్తోంది. అవసరమైతే అప్పుచేసి మరీ భారీగా శుభ కార్యాన్ని నిర్వహిస్తున్నారు తప్ప, ఖర్చుకు వెనుకాడని పరిస్థితి కనబడుతోంది. అతిథులకు చిరస్మరణీయ ఆతిథ్యం ఇవ్వాలని యువత భావిస్తోంది.ఇందులో భాగంగా ఆహారం, పానీయాలపై దృష్టి పెడుతున్నారు. క్యాటరింగ్, వినోద కార్యక్రమాలపై ఖర్చులు పెరుగుతున్నాయి. శుభ లేఖలూ ‘వైభవంగా’ ఉండాల్సిందే. అయితే వివాహ ఆహ్వానాలు డిజిటల్ రూపంలోకి మారుతుండడం కొత్త ట్రెండ్.రెండో అతిపెద్ద మార్కెట్2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రిటైల్ మార్కెట్లో వివాహ పరిశ్రమ రూ.11 లక్షల కోట్లతో ఆహారం, నిత్యావసరాల తరువాత రెండో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. కొన్ని కీలక విభాగాల మార్కెట్ విలువలు ఇలా...

కొత్త పన్ను విధానం 'మార్పు' మంచిదే !
మధ్యతరగతి వారికి గుడ్‌న్యూస్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి చాలా మందికి ఆదాయపన్ను పన్ను భారం తొలగిపోయింది. 2025 బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో చేసిన మార్పులతో వేతన జీవులు, పెన్షనర్లకు రూ.12.75 లక్షలు, ఇతరులకు రూ.12 లక్షల వరకు ఆదాయం మించనప్పుడు ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఆదాయం ఈ పరిమితి దాటినప్పుడే వారు తమ మొత్తం ఆదాయంపై నిర్ణీత శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.7–7.75 లక్షలుగా ఉన్న పరిమితులను ప్రభుత్వం గణనీయంగా పెంచేసింది. పాత విధానంలో పన్ను ఆదా కోసం ఎన్నో రకాల పెట్టుబడులు పెట్టాల్సి వచ్చేది. వీటికితోడు బీమా ప్రీమియం, ఇంటి రుణం చెల్లింపులు ఇలా ఎన్నో క్లెయిమ్ చేసుకుంటే గానీ పన్ను భారం గణనీయంగా తగ్గేది కాదు. ఇప్పుడు కొత్త పన్ను విధానంలో ఈ తలనొప్పులేవీ లేకుండానే గణనీయమైన ప్రయోజనం కల్పించారు. 2025–26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో కొత్త పన్ను విధానంలోకి మారడం, లేదంటే పాత విధానాన్ని కొనసాగించడం వల్ల కలిగే లాభనష్టాలపై అవగాహన కల్పించే కథనమిది... ‘‘మన దేశంలో పన్ను రిటర్నులు వేస్తున్న వారిలో 90 శాతం మంది ఆదాయం రూ.13 లక్షల కంటే తక్కువే ఉంది. అంటే 140 కోట్ల మంది ప్రజల్లో కేవలం కోటి మందే 2025–26 ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లించనున్నారు. భారత్‌ను ఆదాయపన్ను రహితంగా మార్చడమే ఇది’’ అంటూ షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై చేసిన విమర్శనాత్మక పోస్ట్ తాజా పరిస్థితులకు అద్దం పడుతోంది. 2023–24 సంవత్సరం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం మన దేశంలో వేతన జీవుల సగటు ఆదాయం రూ.20,039గా ఉంది. కనుక మెజారిటీ వేతన జీవులే కాదు, స్వయం ఉపాధిలో ఉన్న వారిలోనూ అధిక శాతం మంది ఆదాయం రూ.12 లక్షల్లోపే ఉంటుంది. కనుక వారికి కొత్త పన్ను విధానమే లాభదాయకం. లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టుబడులు అన్నవి ఎప్పుడూ తమ లక్ష్యాలు, ఆశించే రాబడి, రిస్క్ సామర్థ్యం వీటన్నింటికీ సరిపోయే సాధనాలతో ఉండాలి. అంతే కానీ పన్ను ఆదా కోసమని చెప్పి మెరుగైన రాబడుల్లేని చోట ఇన్వెస్ట్ చేస్తే లక్ష్యాలకు కావాల్సినంత సమకూర్చుకోవడం కఠినతరం అవుతుంది. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదా కోసం పిల్లల ట్యూషన్ ఫీజులు మొదలు కొని జీవిత బీమా ప్రీమియం, పీపీఎఫ్, ఎన్సీఎస్, ఐదేళ్ల బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇలా ఎన్నో సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. పైగా పన్ను ఆదా పెట్టుబడులకు మూడు నుంచి ఐదేళ్ల లాకిన్ పీరియడ్ (అప్పటి వరకు ఉపసంహరణ కుదరదు) కూడా ఉంటుందని మర్చిపోవద్దు. పీపీఎఫ్ అయితే 15 ఏళ్లు. కొత్త పన్ను విధానంలో ఇలాంటి షరతులేవి లేకుండా రూ.12 లక్షలకు మించని ఆదాయం ఉన్న అందరికీ సెక్షన్ 87ఏ కింద పన్ను రాయితీ కల్పించారు. కనుక తమకు నచ్చిన చోట పెట్టుబడులు పెట్టుకునే స్వేచ్ఛ కొత్త విధానం కల్పిస్తోంది. దీర్ఘకాల లక్ష్యాలకు ఇతర సాధనాల కంటే ఈక్విటీలే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మించి మెరుగైన రాబడిని అందిస్తాయని చరిత్ర చెబుతోంది. కనుక మెజారిటీ పెట్టుబడులు ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. పాత పన్ను విధానంలో పన్ను ఆదా కోసం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే కొత్త పన్ను విధానంలో అయితే పన్ను ఆదా కోసం చూడకుండా ప్యాసివ్ ఫండ్స్, ఫ్లెక్సీక్యాప్, ఈక్విటీ–డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్, బంగారంలోనూ పెట్టుబడులకు వీలు కల్పించే మల్టీ అస్సెట్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లు, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు ఇలా ఎన్నో విభాగాల నుంచి తమకు అనుకూలమైన వాటిని నిపుణుల సూచనల మేరకు ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొందరికి కొత్త.. కొందరికి పాత పాత పన్ను విధానంలో వివిధ రకాల పన్ను పెట్టుబడులు, మినహాయింపుల రూపంలో రూ.5,75,000.. వేతనంలో 30 శాతాన్ని హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) కింద క్లెయిమ్ చేసుకున్నప్పటికీ.. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి (వేతన జీవులకు రూ.12.75 లక్షల వరకు) నూతన పన్ను విధనామే మెరుగైనది. ఈ కింది టేబుల్లో దీన్ని గుర్తించొచ్చు. ఒకవేళ ఆదాయం రూ.12 లక్షలు మించితే (వేతన జీవులకు రూ.12.75 లక్షల ఆదాయం దాటితే).. పాత పన్ను విధానంలో అన్ని మినహాయింపులు, రాయితీలను క్లెయిమ్ చేసుకునేట్టు అయితే.. కొత్త విధానం కంటే పాత విధానంలోనే కొంత అదనంగా ఆదా అవుతుంది. ఉదాహరణబ్యాంక్ ఉద్యోగి మోనాలీ దేవ్ ఆదాయం రూ.20.5 లక్షలు. ఆఫీసుకు వెళ్లి వచ్చేందుకు ఆమె కారు లేదా ట్యాక్సీ వినియోగించడం లేదు. దీంతో రూ.1.2 లక్షల ట్రాన్స్పోర్ట్ అలవెన్స్‌పై పూర్తి పన్ను చెల్లించాల్సి వస్తోంది. నెలల శిశువు కారణంగా ఎలాంటి పర్యటనలకూ వెళ్లే వీలు లేకపోవడంతో రూ.30,000 ఎల్‌టీఏ ప్రయోజనాన్ని కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. కేవలం ఎన్పీఎస్, సెక్షన్ 80సీ, గృహ రుణం చెల్లింపులు రూ.1.6 లక్షలు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.11,500 చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో తన ఆదాయంపై ఈ మినహాయింపులు క్లెయిమ్ చేసుకున్న తర్వాత పాత విధానంలో ఆమె 2023–24 సంవత్సరానికి రూ.3.15 లక్షల ఆదాయం చెల్లించాల్సి వచి్చంది. నిపుణుల సూచనలతో కొత్త విధానంలో మదింపు చేయగా చెల్లించాల్సిన పన్ను రూ.2.86 లక్షలుగా తేలింది. ఒకవేళ సెక్షన్ 80సీసీడీ (2) కింద కార్పొరేట్ ఎన్‌పీఎస్‌లో.. మూలవేతనంలో 14 శాతం చొప్పున ప్రతి నెలా రూ.15,156ను పనిచేసే సంస్థ నుంచి జమ చేయించుకుంటే అప్పుడు మోనాలీ దేవ్‌కు పన్ను భారం మరో రూ.57,000 తగ్గిపోతుంది. 2025–26 సంవత్సరం నుంచి అమల్లోకి వచి్చన కొత్త పన్ను విధానం శ్లాబుల ప్రకారం అయితే మోనాలీదేవ్ చెల్లించాల్సిన పన్ను (ఎన్పీఎస్ లేకుండా) కేవలం రూ.1.98 లక్షలే. ముందటి ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే రూ.88 వేలు ఆదా అవుతోంది. పనిచేసే సంస్థ నుంచి ఎన్పీఎస్ (కార్పొరేట్ ఎన్పీఎస్) జమ కూడా చేయించుకుంటే ఈ పన్ను ఇంకా తగ్గిపోనుంది. కనుక అధిక ఆదాయం పరిధిలోని వారు పాత–కొత్త విధానంలో మదింపు చేసుకుని తుదిగా తమకు ఏ విధానం లాభదాయకమో నిర్ణయించుకోవాలి. పన్ను చెల్లింపుదారుల్లో చాలా మంది గృహ రుణం తీసుకుని ఉండపోవచ్చు. అలాంటి వారు కేవలం హెచ్ఆర్ఏ మినహాయింపునకే పరిమితం కావాల్సి ఉంటుంది.ఆదాయాన్ని బట్టి మార్పు.. ‘‘కొత్త విధానం ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ, అన్ని ప్రయోజనాలను వినియోగించుకుంటే పాత విధానంలో పన్ను తక్కువ. రూ.60 లక్షలు ఆర్జించే వారు రూ.8.5 లక్షల మినహాయింపు/రాయితీలను క్లెయిమ్ చేసుకునేట్టు అయితే పాత విధానంలోనే రిటర్నులు వేసుకోవచ్చు’’ అని ట్యాక్స్‌స్పానర్ డాట్ కామ్ సీఈవో సు«దీర్ కౌశిక్ సూచించారు. → రూ.13.75 లక్షల ఆదాయం కలిగి కేవలం రూ.5.25 లక్షల పన్ను మినహాయింపుల వరకే క్లెయిమ్ చేసుకున్నా సరే పాత విధానంలో రూ.57,500 చెల్లించాల్సి వస్తే, కొత్త విధానంలో రూ.75,000 పన్ను పడుతోంది. → రూ.15.75 లక్షల ఆదాయం ఉంటే హెచ్ఆర్ఏ ప్రయోజనం లేకుండా మిగిలిన మినహాయింపులను క్లెయిమ్ చేసుకుంటే పాత విధానంలోనే పన్ను తక్కువ. → రూ.20 లక్షల ఆదాయం ఉన్న వారి విషయంలో (వేతన జీవులు అయితే రూ.20.75 లక్షలు) మళ్లీ ఇది మార్పునకు గురవుతుంది. హెచ్ఆర్ఏను పక్కన పెట్టి చూస్తే పాత విధానంలో రూ.5.25 లక్షల మొత్తాన్ని క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు చెల్లించాల్సిన పన్ను రూ.2,40,000 కాగా, కొత్త విధానంలో రూ.2 లక్షలే కావడం గమనించొచ్చు. అలాగే రూ.24 లక్షల ఆదాయంపై కొత్త విధానంలో రూ.60 వేలు ఆదా చేసుకోవచ్చు. → రూ.24.75 లక్షలపైన ఆదాయం కలిగిన వారు, మొత్తం మినహాయింపులు/తగ్గింపులు/రాయితీలు అన్నీ రూ.7.75 లక్షలకు మించితే అప్పుడు పాత విధానాన్ని పరిశీలించొచ్చు. → గ్రాంట్ థార్న్టన్ అంచనా ప్రకారం రూ.1.5 కోట్ల ఆదాయం కలిగిన వారు పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సీ ప్రయోజనాలను వినియోగించుకుంటే చెల్లించాల్సిన పన్ను రూ.40.09 లక్షలు కాగా, కొత్త విధానంలో రూ.48.52 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. → పన్నుకు అదనంగా సెస్సు చెల్లించాలి. రూ.50లక్షల ఆదాయం మించిన వారు సర్‌చార్జీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఏ విషయంలో షరతులు గృహ రుణం ఈఎంఐలో అసలు మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు, వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల వరకు సెక్షన్ 24బీ కింద పాత విధానంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే సమయంలో హెచ్ఆర్ఏ రాయితీని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చా? అంటే అందరికీ అని చెప్పలేం. ఇక్కడ కొన్ని షరతులు వర్తిస్తాయి. → వేతనంలో హెచ్ఆర్ఏ ప్రయోజనం తప్పకుండా ఉండాలి. పనిచేసే ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తూ అద్దె చెల్లించాలి. → తన పేరు లేదా తన జీవిత భాగస్వామితో కలసి ఉమ్మడిగా రుణం తీసుకుని పనిచేసే చోట కాకుండా వేరే ప్రాంతంలో ఇల్లు సమకూర్చుకుని చెల్లింపులు చేస్తుండాలి. → రుణంపై ఇల్లు సమకూర్చుకుని అందులోనే నివసిస్తూ.. వేతనంలో భాగంగా హెచ్ఆర్ఏ ప్రయోజనం తీసుకుంటున్న వారు.. గృహ రుణానికి చెల్లిస్తున్న అసలు, వడ్డీపైనే మినహాయింపును క్లెయిమ్ చేసుకోగలరు. అద్దె చెల్లించడం లేదు కనుక హెచ్ఆర్ఏ క్లెయిమ్‌కు అవకాశం లేదు. → ఒకవేళ మీరు పనిచేసే పట్టణంలోనే ఇంటి కొనుగోలుకు రుణం తీసుకున్నారు. కానీ, ఆ ఇంటిలో కాకుండా, అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఇలాంటప్పుడు హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయలేరు. ఒకవేళ కార్యాలయానికి, రుణంపై సమకూర్చుకున్న ఇల్లు మరీ దూరంగా ఉంటే తప్పించి హెచ్ఆర్ఏ క్లెయిమ్‌కు అర్హులు కారు. కనుక హెచ్ఆర్ఏతోపాటు గృహ రుణంపై గరిష్ట ప్రయోజనం పొందాలంటే పనిచేసే ప్రాంతంలో కాకుండా దూరంగా సొంతిల్లును సమకూర్చుకోవడం ఒక మార్గం. హెచ్ఆర్ఏ సూత్రం → యాజమాన్యం నుంచి స్వీకరించిన వాస్తవ హెచ్ఆర్ఏ → ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన మొత్తం ఇంటి అద్దె నుంచి.. ఏడాదిలో స్వీకరించిన మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలినది. → మూలవేతనం, డీఏలో 40 శాతం (నాన్ మెట్రోలు)/50 శాతం (మెట్రోల్లో నివసించే వారు) → ఈ మూడింటిలో తక్కువ మొత్తాన్ని హెచ్ఆర్ఏ కింద క్లెయిమ్ చేసుకుని పన్ను చెల్లించక్కర్లేదు. కొత్త విధానంలోనూ కొన్ని మినహాయింపులు పాత విధానంతో పోల్చి చూస్తే నూతన పన్ను విధానంలో చాలా వరకు మినహాయింపులు, రాయితీల్లేవు. హెచ్ఆర్ఏ, ఎల్టీసీ, టెలిఫోన్, ఇంటర్నెట్ వ్యయాలను క్లెయిమ్ చేసుకోలేరు. పన్ను ఆదా పెట్టుబడులూ లేవు. గృహ, విద్యా రుణాలపై అసలు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన ప్రయోజనాలు, లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులకూ ఎలాంటి పన్ను మినహాయింపులు లేవన్న విషయాన్ని గుర్తించాలి. అదే సమయంలో వేతన జీవులకు కొన్ని ప్రయోజనాలు కల్పించారు. కార్పొరేట్ ఎన్పీఎస్: సెక్షన్ 80సీసీడీ(2) కింద కార్పొరేట్ ఎన్పీఎస్ ప్రయోజనం ఉంది. ఉద్యోగి తరఫున ఎన్పీఎస్ ఖాతాకు యాజమాన్యం జమ చేయాల్సి ఉంటుంది. మూల వేతనం, డీఏ మొత్తంలో 14 శాతం చొప్పున యాజమాన్యం జమలపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. గరిష్ట జమ రూ.7.5 లక్షలకే ఇది వర్తిస్తుంది. సర్‌చార్జ్: రూ.5 కోట్లకు పైన ఆదాయం కలిగిన వారికి పాత విధానంలో చెల్లించాల్సిన పన్ను మొత్తంపై 37 శాతం సర్‌చార్జ్ చెల్లించాల్సి వస్తుంది. కొత్త విధానంలో ఇది 25 శాతమే. అలవెన్స్‌లు: దివ్యాంగులకు రవాణా భత్యం, ఉద్యోగులకు అధికారిక ప్రయాణాలు లేదా బదిలీ కోసం చెల్లించే అలవెన్స్, ఆఫీస్‌కు దూరంగా వేరే ప్రాంతంలో డ్యూటీ చేయాల్సి వస్తే చెల్లించే అలవెన్స్‌లకు పన్ను మినహాయింపులున్నాయి. సెక్షన్ 80సీసీహెచ్: అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపు ఉంది.ఏటా మారిపోవచ్చు..!రెండు పన్ను విధానాల్లోనూ తమకు అనుకూలమైన దాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వేతన జీవులకు ఉంది. ఒక విధానం నుంచి మరో విధానానికి ఏటా మారిపోవచ్చు కూడా. వేతనం/పింఛనుతోపాటు వ్యాపార ఆదాయం ఉంటే మాత్రం ఈ సదుపాయం లేదు. వ్యాపార ఆదాయం, వృత్తిపరమైన ఆదాయం కలిగిన వారు ఒక్కసారి నూతన విధానంలోకి మారితే.. తిరిగి పాత విధానంలోకి మళ్లేందుకు ఒక్కసారే అవకాశం ఉంటుంది. ఇక వేతన జీవులు, పెన్షనర్లు సైతం గడువులోపు (జూలై 31) ఐటీఆర్‌లు దాఖలు చేసినట్టయితేనే పాత, కొత్త విధానాల్లో తమకు నచ్చింది ఎంపిక చేసుకోగలరు. గడువు దాటిన తర్వాత సమర్పించే బీలేటెడ్ రిటర్నులు కొత్త విధానంలోనే సమర్పించడానికి అనుమతి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు సమయంలో ‘వెదర్ ఆప్టింగ్ అవుట్ న్యూ ట్యాక్స్ రెజిమ్ ఆఫ్ సెక్షన్ 115బీఏసీ?’’ అని అడుగుతుంది. యస్ అని క్లిక్ చేస్తే పాత విధానంలో పన్ను రిటర్నులు దాఖలవుతాయి. నో అని క్లిక్ చేస్తే ఐటీఆర్ నూతన విధానం కింద సమరి్పంచినట్టు అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్

మెగా డీఎస్సీలో మెలిక!
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో కూటమి సర్కారు మెలిక పెట్టింది. ఇంటర్మీడియట్, డిగ్రీల్లో కనీస అర్హత మార్కులు ఉండాలని నిబంధన విధించి, దరఖాస్తు దశలోనే సగం మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది. విద్యా రంగాన్ని ఉద్ధరిస్తామన్న కూటమి సర్కారు.. డిగ్రీలో అర్హత మార్కుల నిబంధన విధించి దాదాపు 8 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. బీఈడీ అర్హతతో రాసే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, ఇంటర్ అర్హతతో రాసే ఎస్జీటీ పోస్టులకు ఇదే తరహా నిబంధన విధించడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. 2024 ఫిబ్రవరిలో 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్లో అర్హత మార్కుల నిబంధనను విధించలేదని, ఆ నోటిఫికేషన్‌ను పూర్తి చేసి ఉంటే తమకు మేలు జరిగేదని అభ్యర్థులు వాపోతున్నారు. తాజా నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టులకు ఇంటర్లో 50 శాతం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం, పీజీటీ పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. దాదాపు 11 నెలల పాటు ఇదిగో అదిగో నోటిఫికేషన్ అంటూ ఆశలు చూపించిన కూటమి ప్రభుత్వం.. నోటిఫికేషన్ ఇచ్చి తమ ఆశలను చిదిమేసిందని అభ్యర్థులు మండిపడుతున్నారు. హడావుడి చేసినంత కూడా లేదు.. ప్రభుత్వ పాఠశాలల్లో 25 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేసి వెంటనే పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు టీడీపీ అగ్ర నాయకులు హామీలు గుప్పించారు. గతేడాది జూన్ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబునాయుడు మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేసి 16,347 పోస్టులను ప్రకటించారు. ఆగస్టులో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పి, గత ప్రభుత్వంలో 6,100 పోస్టులకు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. తర్వాత టెట్ రాసేందుకు అవకాశం ఇస్తున్నామంటూ ఒకసారి, టెట్‌కు, డీఎస్సీకి 3 నెలల కాలం ఉండాలని మరోసారి కాలయాపన చేశారు. వాస్తవానికి పాఠశాల విద్యా శాఖలో 27,333 పోస్టులు ఖాళీ ఉన్నా, కేవలం 16,347 పోస్టులకే ఏడాది తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. తుదకు అర్హత మార్కుల నిబంధన పెట్టి అన్యాయం చేశారు. గ్రామీణ పేద విద్యార్థులపై వేటు రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో చదువుకునే వారిలో పేద, దిగువ మధ్య తరగతి విద్యార్థులే అధికం. కోర్సులు పూర్తయిన వెంటనే జీవితంలో స్థిర పడేందుకు వీరి ముందున్న ఏకైక అవకాశం డైట్ లేదా బీఈడీ మాత్రమే. దాంతో కోర్సులు ఏదోలా పాసై ఇంటర్ అర్హతతో డైట్, డిగ్రీ అర్హతతో బీఈడీ చేసిన వారు 15 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరిలో 8 లక్షల మందికి పైగా ఇంటర్, గ్రాడ్యుయేషన్‌లో సాధించిన మార్కుల శాతం 40–45 ఉంటుంది. ప్రస్తుత డీఎస్సీ–2025లో జనరల్ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు ఇంటర్లో 50 శాతం, స్కూల్ అసిస్టెంట్‌కు డిగ్రీలో 50 శాతం, పీజీటీకి పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేశారు. అలాగే, రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎస్జీటీ/ఎస్ఏ పోస్టులకు 45, పీజీటీకి 50 శాతంగా ఉండాలని నిబంధన పెట్టారు. దీంతో దాదాపు 8 లక్షల మంది అర్హత గల అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశమే లేకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు విధానంలో బోధన అందిస్తున్న టీచర్లు డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వాలని కోరుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ్ పాఠశాలల్లో గత 15 ఏళ్లుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ టీచర్లుగా సుమారు 1,200 మంది పని చేస్తున్నారు. బీసీ, సాంఘిక సంక్షేమం, ఏపీ మోడల్ స్కూళ్లలో మరో 2 వేల మంది పని చేస్తున్నారు. ప్రస్తుత డీఎస్సీలో వారికి ఎలాంటి వెయిటేజీ ఇవ్వకుండానే దాదాపు 3,109 పోస్టులు రెగ్యులర్ విధానంలో భర్తీ చేయనున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సర్వీసు అందిస్తున్న వారు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది.

మీ రైస్‌లో ఆర్సెనిక్ ఉందా!?
వరి. విశ్వవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలకు నిత్యం కడుపునింపే అమృతం. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్ని చిరుతిళ్లు, ఇతర చల్లనిపానీయాలు తాగినా కాస్తంత వరి అన్నంతో భోజనం చేస్తేనే కడుపు నిండిన సంతృప్తికర భావన కల్గుతుంది. జీవకోటి ప్రాణాలు నిలుపుతున్న వరిలో ఇప్పుడు అత్యంత విషపూరిత ఆర్సెనిక్ మూలకం స్థాయిలు ఎక్కువ అవుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి చేదు నిజాన్ని బయటపెట్టింది. యథేచ్ఛగా జరుగుతున్న మానవ కార్యకలాపాలు, అడవుల దహనం, శిలాజ ఇంధనాల వాడకంతో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పుడీ వాతావరణ మార్పుల విపరిణామాలు వరి పంటలపై పడుతున్నాయని స్పష్టమైంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి, కార్భన్‌డయాక్సైడ్, కర్భన ఉద్గారాల స్థాయిలు పెరగడంతో వాటి కారణంగా పొల్లాల్లో మట్టి, నీటి నుంచి ఆర్సెనిక్ మూలకం అత్యధికంగా వరిధాన్యంలోకి చేరుతోంది. విషాల రారాజుగా పేరొందిన ఆర్సెనిక్ పాళ్లు వరిలో పెరిగితే ఆరోగ్యంపై దాని దు్రష్పభావాలు దారుణంగా ఉంటాయి. ఆర్సెనిక్ స్థాయి పెరిగిన వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటే చర్మ, ఊపిరితిత్తుల సంబంధ క్యాన్సర్లతో పాటు ఎన్నోరకాల తీవ్ర ఆరోగ్య సమస్యలు మనిషిని చుట్టుముట్టడం ఖాయం. రక్తసరఫరా, రోగ నిరోధక వ్యవస్థలు, కాలేయం, మూత్రపిండాలు, మూత్రాశయం, చర్మం, ప్రోస్టేట్ గ్రంథి వంటి శరీర భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హృద్రోగ సమస్యతోపాటు మధుమేహ వ్యాధి ప్రబలే ప్రమాదముంది. గర్భిణుల్లో పిండం సరిగా ఎదగపోవడం, అకాల మరణాలు సంభవించే ముప్పు ఉంది. వాతావరణ మార్పుల కారణంగా వాతావరణంలోని వెలువడుతున్న అధిక కర్భన ఉద్గారాలు, ఉష్ణోగ్రతల పెరుగుదలతో అమృతాహారం కాస్తా విషాహారంగా మారుతున్న వైనాన్ని శాస్త్రవేత్తలు వివరించారు. కొలంబియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల బృందం చేసిన ఈ అధ్యయన ఫలితాలు ‘లాన్సెట్ ప్లానిటరీ హెల్త్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అకర్బన ఆర్సెనిక్తో మరింత ప్రమాదం ఆర్సెనిక్ కర్భన, అకర్బన రూపాల్లో సహజంగానే నేల పొరల్లో ఉంటుంది. మానవునికి అకర్బన ఆర్సెనిక్తో పోలిస్తే అకర్బన ఆర్సెనిక్తో ముప్పు చాలా ఎక్కువ. వరిపంట మడుల్లో నీటితో నింపినప్పుడు మట్టిలోని ఆర్సెనిక్ వరినాట్ల ద్వారా వరిధాన్యంలోకి చేరుతుంది. అధ్యయనంలో భాగంగా పదేళ్లపాటు చైనాలో వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో సాగుచేస్తున్న 28 రకాల వరి వంగడాలపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, వాతావరణంలో కార్భన్‌డయాక్సైడ్ స్థాయిలు పెరిగినప్పుడు ఆర్సెనిక్ శోషణ స్థాయిలూ పెరుగుతున్నాయి. దీంతో వరి ధాన్యంలో ఆర్సెనిక్ స్థాయిలు ఎక్కువవుతున్నాయి. ఇలాగే కొనసాగితే ఒక్క చైనాలోనే వరి అన్నం తినడం వల్ల 1.93 కోట్ల క్యాన్సర్ కేసులు పెరుగుతాయని న్యూయార్క్‌లోని కొలంబియా వర్సిటీలోని వాతావరణ ఆరోగ్య శాస్త్ర సహాయ అధ్యాపకులు, ఈ పరిశోధనలో సహ రచయిత లెవీస్ జిస్కా చెప్పారు. ఉష్ణోగ్రత మరో 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే మరో పాతికేళ్లలో వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ ప్రతి 10 లక్షలకు 200 పాళ్లు ఎక్కువవుతుందని ఆయన పేర్కొన్నారు. మతలబు అంతా వరిమళ్లలోనే వేల సంవత్సరాల క్రితం వరిసాగు లేదు. అక్కడక్కడా పెరిగిన వరికంకుల నుంచే వరిధాన్యాన్ని సేకరించి వండుకుని తిన్నారు. ఆ వరిమొక్కల మొదళ్ల వద్ద ఎలాంటి నీరు నిల్వ ఉండేదికాదు. ఇప్పుడు నాగరిక సమాజంలో మడులు కట్టి నీటిని నిల్వచేసి వరిసాగు చేస్తున్నారు. వరి మొక్కల మొదళ్ల వద్ద పూర్తిగా నీరు ఉంటుంది. దీంతో మట్టిలో సహజ ఆక్సిజన్ ఉండదు. దీంతో మొక్క వేర్ల వద్ద అన్ఎరోబిక్ బ్యాక్టీరియా శక్తి సంగ్రహణ కోసం ప్రత్యామ్నాయంగా ఆర్సెనిక్ అణువులను లాగేస్తుంది. అలా గతంలో పోలిస్తే ఆర్సెనిక్ వరిధాన్యంలోని వచ్చి చేరుతోంది. కాలుష్యం, తదితర మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల కారణంగా నేలలో కర్భన ఉద్గారాలు పెరిగి, ఉష్ణోగ్రత ఎక్కువై ఈ ఆర్సెనిక్ సంగ్రహణ రేటు పెరుగుతోంది. అరికట్టే మార్గాలున్నాయి వరిధాన్యంలోని ఆర్సెనిక్ వంట ద్వారా ఒంటిలోకి చేరకుండా అడ్డుకునే చిట్కాలున్నాయి. బ్రౌన్ రైస్‌తో పోలిస్తే తెల్ల బియ్యంలో పోషకాలు తక్కువ. అలాగే ఆర్సెన్ పాళ్లు కూడా తక్కువే. అందుకే బ్రౌన్‌రైస్ బదులు తెల్ల అన్నం తింటే కాస్త దీని ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఇతర రకాలతో పోలిస్తే బాస్మతి రకం బియ్యంలోనూ ఆర్సెనిక్ తక్కువగా ఉంటుంది. ఆగ్నేయాసియా, అమెరికా, యూరప్ దేశాల్లోని రకాలతో పోలిస్తే తూర్పు ఆఫ్రికాలో దొరికే వరిలో ఆర్సెనిక్ తక్కువగా ఉంటోంది. ‘‘ అప్పటికే మరుగుతున్న నీటిలో బియ్యాన్ని పోసి ఉడకబెట్టండి. ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ నీటినంతా పారబోయండి. తర్వాత మళ్లీ కొత్తగా నీళ్లు జతచేసి అన్నం వండండి. గంజి వార్చకండి’’ అని బ్రిటన్‌లోని షెఫీల్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. ‘‘ వండటానికి ముందు బియ్యాన్ని బాగా కడగండి. తర్వాత ఒక పాలు బియ్యానికి, ఆరు పాళ్ల నీటిని జతచేసి వండండి’’ అని బ్రిటన్ ఆహార ప్రమాణాల ప్రాధికార సంస్థ సూచించింది.బ్రౌన్ రైస్ కంటే తెల్ల అన్నమే మంచిది ! ‘‘బ్రౌన్ రైస్‌లో అకర్బన ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటుంది. తెల్ల అన్నంలో ఇది తక్కువగా ఉంటుంది. విషపూరిత ఆర్సెనిక్ కోణంలో చూస్తే ఆహారంగా బ్రౌన్ రైస్ కంటే పాలిష్ చేసిన తెల్ల అన్నమే మంచిది’’ అని శాస్త్రవేత్తలు చెప్పారు. తెల్ల అన్నంతో పోలిస్తే ముడి అన్నం, బ్రౌన్ రైస్ మంచివి అంటూ జనం కొత్తపోకడలో వెళుతున్న ఈ తరుణంలో శాస్త్రవేత్తలు తెల్ల అన్నమే ఉత్తమమని చెప్పడం గమనార్హం. ‘‘ వరిధాన్యంలో ఆర్సెనిక్ స్థాయిని తేల్చేందుకు ప్రపంచంలో విస్తృతస్థాయిలో జరిగిన తొలి అధ్యయనం ఇది’’ అని బెల్ఫాస్ట్లోని క్వీన్స్ యూనివర్సిటీ బయోలాజికల్ సైన్సెస్ విభాగ ప్రొఫెసర్ ఆండ్రూ మెహార్గ్ చెప్పారు. రంగు, రుచి, వాసన ఉండదు ఆర్సెనిక్ విషపూరితమైనదని ప్రాచీన మానవులకు కూడా తెలుసు. ఇది ఎలాంటి రంగు, రుచి, వాసన ఉండదు. ప్రాచీనకాలంలో రోమ్, యూరప్ దేశాల్లో శత్రువులను చంపేసేందుకు ఆర్సెనిక్‌ను ఇచ్చేవారని కథలు కథలుగా చెప్పేవారు. అయితే అత్యల్ప స్థాయిలో దీనిని తీసుకుంటే వెంటనే ఎలాంటి ప్రభావం చూపించదుగానీ స్లో పాయిజన్‌లా పనిచేసి దీర్ఘకాలంలో శరీరంపై తీవ్ర దు్రష్పభావాలను చూపిస్తుంది. అకర్బన ఆర్సెనిక్ అణువులు మానవశరీరంలోని జీవఅణువులతో అత్యంత సులభంగా బంధం ఏర్పర్చుకుంటాయి. కర్బన ఆర్సెనిక్ సహజంగా శిలలు, నేలల్లో ఉంటుంది. అకర్బన ఆర్సెనిక్ ఎక్కువగా గనుల తవ్వకం, బొగ్గును కాల్చడం ఇతర పారిశ్రామిక కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి చేరుతుంది. ఇది నీటిలో కరుగుతుంది. పారిశ్రామిక వ్యర్థాలు నదీజలాల్లోకి పారి ఆ నీటితో పండించే పంటల ద్వారా మానవ శరీరాల్లోకి చేరుతోంది. దక్షిణ అమెరికా, దక్షిణ, మధ్యాసియా దేశాల్లోని భూగర్భ జలాల్లోనూ అకర్బన ఆర్సెనిక్ ఉంటోంది. అమెరికాలో దాదాపు 21 లక్షల మంది ప్రజలు ఇలా అకర్బన∙ఆర్సెనిక్ ఉన్న నీటినే తాగుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితులను దాటిన ఆర్సెనిక్ ఉన్న జలాలనే ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మంది జనం తాగుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్

నేడే సతీసమేతంగా జె.డి.వాన్స్ రాక
న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ సతీసమేతంగా భారత పర్యటనకు రాబోతున్నారు. భార్య ఉషా చిలుకూరి, ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్‌తో కలిసి ఆయన సోమవారం ఇటలీ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. దేశంలో మొత్తం నాలుగు రోజులపాటు పర్యటిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాన్స్ దంపతులు ఇండియాకు వస్తుండడం ఇదే మొదటిసారి. ఉషా చిలుకూరి తెలుగు మూలాలున్న అమెరికా మహిళ అనే సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం ప్రతీకార సుంకాలు విధించడం, తర్వాత 90 రోజులపాటు వాయిదా వంటి పరిణామాల నేపథ్యంలో జె.డి.వాన్స్ ఇండియా పర్యటన ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రధాని మోదీతో ఆయన భేటీ కాబోతున్నారు. ద్వైపాక్షిక, వాణిజ్య అంశాలపై ఇరువురు నేతలు చర్చించబోతున్నారు. వ్యాపారం, వాణిజ్యం, టారిఫ్‌లు, ప్రాంతీయ భద్రత వాన్స్ దంపతులకు ప్రధాని మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సోమవారం సాయంత్రం విందు ఇవ్వనున్నారు. అంతకంటే ముందు ఇరువురు నేతలు సమావేశమవుతారు. అమెరికా–భారత్ మధ్య వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా చర్చలు జరుగుతాయని సమాచారం. ఇరు దేశాల నడుమ సంబంధాల పురోగతిని వారు సమీక్షిస్తారు. సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవడానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారం, వాణిజ్యం, టారిఫ్‌లు, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. అత్యంత కీలకమైన ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మోదీ–వాన్స్ భేటీలో ముందడుగు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చర్చల్లో భారత్ తరఫున ప్రధాని మోదీతోపాటు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా పాల్గొంటారని తెలిసింది. అమెరికా తరఫున వాన్స్‌తోపాటు ఐదుగురు సీనియర్ అధికారులు హాజరవుతారని సమాచారం. జైపూర్, ఆగ్రా సందర్శన ఢిల్లీకి చేరుకున్న తర్వాత వాన్స్, ఉషా దంపతులు ప్రఖ్యాత స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. భారతీయ సంప్రదాయ హస్తకళాకృతులు విక్రయించే మార్కెట్‌ను సందర్శిస్తారు. ఐటీసీ మౌర్య షెరటాన్ హోటల్లో బస చేయబోతున్నారు. సోమవారం రాత్రి వారు రాజస్తాన్ రాజధాని జైపూర్‌కు చేరుకుంటారు. రామ్‌భాగ్ ప్యాలెస్‌లో బస చేస్తారు. మంగళవారం అమేర్(అంబర్) కోటతోపాటు రాజస్తాన్‌లోని ప్రఖ్యాత కట్టడాలను సందర్శిస్తారు. సాయంత్రం జైపూర్‌లోని రాజస్తాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఓ కార్యక్రమంలో వాన్స్ ప్రసంగిస్తారు. ట్రంప్ పాలనలో భారత్–అమెరికా సంబంధాలపై ఆయన అభిప్రాయాలు వెల్లడిస్తారని సమాచారం. బుధవారం వాన్స్ దంపతులు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చరిత్రాత్మక కట్టడం తాజ్‌మహల్‌ను సందర్శించబోతున్నారు. సాయంత్రం మళ్లీ జైపూర్‌కు తిరిగివెళ్తారు. వాన్స్ కుటుంబం జైపూర్ నుంచి గురువారం అమెరికాకు పయనమవుతుంది
విశ్రాంత డీజీపీ దారుణ హత్య
డొనాల్డ్ ట్రంప్‌పై ప్రజాగ్రహం
హైడ్రోజన్ బాంబ్‌ను పరీక్షించిన చైనా
జంధ్యం ఉంటే నో ఎగ్జామ్
యెమెన్ పోర్టుపై మళ్లీ అమెరికా దాడులు
బీజేపీ వివరణ రాజకీయ వంచన
నేడే సతీసమేతంగా జె.డి.వాన్స్ రాక
మావోయిస్టుల లొంగు‘బాట’
కవరు కట్టు.. లాభాలు పట్టు
మీ రైస్‌లో ఆర్సెనిక్ ఉందా!?
నా పని నన్ను చేసుకోనివ్వండి -ట్రంప్
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
కర్ణాటక మాజీ డీజీపీ హత్య..?
స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!
మూతపడిన జిందాల్ స్టీల్స్
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
పెళ్లిని నమ్మనన్న త్రిష.. రెండు పెళ్లిళ్లు అందుకే నన్న కమల్
‘ప్రవీణ్ పగడాల పోస్ట్‌మార్టం రిపోర్టుపై ఎన్నో అనుమానాలు?’
రాజకీయాలు నాకు ఫుల్ టైం జాబ్ కాదు- యోగీ ఆధిత్యనాథ్
ప్రకృతి ప్రకోపం: ‘ఒక్కరాత్రిలోనే సర్వస్వం కోల్పోయాం’
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
చైనాపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్‌కు గోల్డెన్ ఛాన్స్!
ఇటు రోహిత్ అటు కోహ్లి
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
IPL 2025: రోహిత్, సూర్యకుమార్ విధ్వంసం.. చెన్నైను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
ఊరూపేరు లేని 'ఉర్సా'
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
PBKS VS RCB: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన కోహ్లి
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
నా బద్ధ శత్రువుకు కూడా ‘ఈ రోజు’ రాకూడదు!
కోత కోసి.. పూత పూసి..
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
రాష్ట్రమంతా ‘నెట్టిల్లు’
మెగా డీఎస్సీలో మెలిక!
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
బైరెడ్డి శబరి.. చెల్లని ఎంపీ!
MI VS CSK: సూర్యవంశీ తరహాలో ఇరగదీసిన ఆయుశ్ మాత్రే.. అరంగేట్రంతో రికార్డు
భారీ విశ్వంభర
పెళ్లి చేసుకున్న 'బిగ్ బాస్' జంట.. మూడేళ్ల ప్రేమ
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
50 ఏళ్ల 'సింగిల్' హీరోయిన్.. కానీ ప్రెగ్నెన్సీ రూమర్స్
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
నిశ్చితార్థంలో కాబోయే భార్య చేసిన పనికి.. పెళ్లిరోజే వరుడు షాకింగ్ నిర్ణయం
కొత్త పన్ను విధానం 'మార్పు' మంచిదే !
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
నేడే సతీసమేతంగా జె.డి.వాన్స్ రాక
డేటింగ్లో స్టార్ హీరోయిన్ సోదరి.. ప్రియుడికి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్!
డోంట్ వర్రీ సార్! ఇలా అయితేనే మీ టార్గెట్ పూర్తవుతుంది!
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
మనకు 'పుష్ప' మాదిరే.. కోలీవుడ్‌లో కెప్టెన్ ప్రభాకరన్ ఉన్నాడు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది
చోరీ చేశారు.. అమ్మలేక దొరికారు
అమ్మా, నాన్న క్షమించండి.. ప్రపంచం నుంచి వెళ్లిపోతున్నా!
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
విశ్వమూ భ్రమిస్తోంది
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
తూటాకు బలైన భారతీయ విద్యార్థిని
నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆ సినిమా చేయడమే: ప్రియదర్శి
వివాహేతర సంబంధం.. వాట్సప్ స్టేటస్‌లో ప్రియురాలి ఫొటో..
Mukesh Ambani Birthday ముఖేష్ అంబానీ బర్త్‌డే బాష్, ఇదే హైలైట్!
చల్లటి కబురు!
జెన్సోల్.. ఓ ఉత్తుత్తి కంపెనీ!
మీ రైస్‌లో ఆర్సెనిక్ ఉందా!?
‘తెలంగాణలో జనజాతర.. ఇది మన జాతర’
22న వైఎస్సార్సీపీ పీఏసీ సమావేశం
ఏటా కోటి పెళ్లిళ్లుమన వివాహ మార్కెట్ రూ.11 లక్షల కోట్లు
ఆ డైరెక్టర్‌తో తిరుమలకు సమంత.. వీడియో వైరల్!
మగవారి హక్కుల కోసం.. పురుష సత్యాగ్రహం
చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి
ఆ వయస్సు దాటితే హీరోయిన్గా కష్టమే: దియా మీర్జా ఆసక్తికర కామెంట్స్
అది గ్రేట్ మూవీ.. ఎలాన్ మస్క్ ట్వీట్
ఉపాధి హామీ పనులు.. 17జిల్లాలు అప్.. 15జిల్లాలు డౌన్..
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
‘మెగా డీఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు’
RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
మ్యాడ్ సినిమాతో ఫేమ్.. నటుడిపై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు!
ఆర్టీసీలో 3,038 ఖాళీల భర్తీకి ఏర్పాట్లు
క్రికెట్ ఆడుతుండగా పిడుగుపాటు.. ఇద్దరి మృతి
విశ్రాంత డీజీపీ దారుణ హత్య
టీమిండియా కెప్టెన్సీ రేసులో ఊహించని పేరు!.. జట్టులో చోటే లేదే!
యెమెన్ పోర్టుపై మళ్లీ అమెరికా దాడులు
క్షేమంగా ఊరికి పంపిస్తామని.. కాటేశారు
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
నా జీవితంలో మరిచిపోలేని బహుమతి ఇదే: మోహన్ లాల్ ఎమోషనల్ పోస్ట్
ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
అబ్దుల్లాకు జరిగిన నమ్మక ద్రోహం
నిశ్చితార్థం వేళ.. చితి మంటల ఘోష!
పాడుబడ్డ ఇంట్లో అనాథగా చిన్నారి.. కాపాడిన హీరోయిన్ సోదరి
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి.. కన్నతల్లే..
'భారత్ మూడేళ్ళలో ఆ దేశాలను అధిగమిస్తుంది'
డొనాల్డ్ ట్రంప్‌పై ప్రజాగ్రహం
ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్య
ట్రంప్ కొట్టిన దెబ్బ.. ఊడుతున్న 800 ఉద్యోగాలు!
బీజేపీ వివరణ రాజకీయ వంచన
భరించలేని నొప్పితో ఆస్పత్రిలో.. యాంకర్ రష్మీకి ఆపరేషన్
బ్యాంకులకు నేడు సెలవు ఉందా?
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మరో లగ్జరీ ప్రాజెక్ట్
బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
నగరంలో ఏకైక న్యూరో సర్జన్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
విశ్రాంత డీజీపీ దారుణ హత్య
డొనాల్డ్ ట్రంప్‌పై ప్రజాగ్రహం
హైడ్రోజన్ బాంబ్‌ను పరీక్షించిన చైనా
జంధ్యం ఉంటే నో ఎగ్జామ్
యెమెన్ పోర్టుపై మళ్లీ అమెరికా దాడులు
బీజేపీ వివరణ రాజకీయ వంచన
నేడే సతీసమేతంగా జె.డి.వాన్స్ రాక
మావోయిస్టుల లొంగు‘బాట’
కవరు కట్టు.. లాభాలు పట్టు
మీ రైస్‌లో ఆర్సెనిక్ ఉందా!?
నా పని నన్ను చేసుకోనివ్వండి -ట్రంప్
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
కర్ణాటక మాజీ డీజీపీ హత్య..?
స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!
మూతపడిన జిందాల్ స్టీల్స్
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
పెళ్లిని నమ్మనన్న త్రిష.. రెండు పెళ్లిళ్లు అందుకే నన్న కమల్
‘ప్రవీణ్ పగడాల పోస్ట్‌మార్టం రిపోర్టుపై ఎన్నో అనుమానాలు?’
రాజకీయాలు నాకు ఫుల్ టైం జాబ్ కాదు- యోగీ ఆధిత్యనాథ్
ప్రకృతి ప్రకోపం: ‘ఒక్కరాత్రిలోనే సర్వస్వం కోల్పోయాం’
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
చైనాపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్‌కు గోల్డెన్ ఛాన్స్!
ఇటు రోహిత్ అటు కోహ్లి
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
IPL 2025: రోహిత్, సూర్యకుమార్ విధ్వంసం.. చెన్నైను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
ఊరూపేరు లేని 'ఉర్సా'
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
PBKS VS RCB: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన కోహ్లి
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
నా బద్ధ శత్రువుకు కూడా ‘ఈ రోజు’ రాకూడదు!
కోత కోసి.. పూత పూసి..
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
రాష్ట్రమంతా ‘నెట్టిల్లు’
మెగా డీఎస్సీలో మెలిక!
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
బైరెడ్డి శబరి.. చెల్లని ఎంపీ!
MI VS CSK: సూర్యవంశీ తరహాలో ఇరగదీసిన ఆయుశ్ మాత్రే.. అరంగేట్రంతో రికార్డు
భారీ విశ్వంభర
పెళ్లి చేసుకున్న 'బిగ్ బాస్' జంట.. మూడేళ్ల ప్రేమ
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
50 ఏళ్ల 'సింగిల్' హీరోయిన్.. కానీ ప్రెగ్నెన్సీ రూమర్స్
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
నిశ్చితార్థంలో కాబోయే భార్య చేసిన పనికి.. పెళ్లిరోజే వరుడు షాకింగ్ నిర్ణయం
కొత్త పన్ను విధానం 'మార్పు' మంచిదే !
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
నేడే సతీసమేతంగా జె.డి.వాన్స్ రాక
డేటింగ్లో స్టార్ హీరోయిన్ సోదరి.. ప్రియుడికి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్!
డోంట్ వర్రీ సార్! ఇలా అయితేనే మీ టార్గెట్ పూర్తవుతుంది!
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
మనకు 'పుష్ప' మాదిరే.. కోలీవుడ్‌లో కెప్టెన్ ప్రభాకరన్ ఉన్నాడు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది
చోరీ చేశారు.. అమ్మలేక దొరికారు
అమ్మా, నాన్న క్షమించండి.. ప్రపంచం నుంచి వెళ్లిపోతున్నా!
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
విశ్వమూ భ్రమిస్తోంది
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
తూటాకు బలైన భారతీయ విద్యార్థిని
నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆ సినిమా చేయడమే: ప్రియదర్శి
వివాహేతర సంబంధం.. వాట్సప్ స్టేటస్‌లో ప్రియురాలి ఫొటో..
Mukesh Ambani Birthday ముఖేష్ అంబానీ బర్త్‌డే బాష్, ఇదే హైలైట్!
చల్లటి కబురు!
జెన్సోల్.. ఓ ఉత్తుత్తి కంపెనీ!
మీ రైస్‌లో ఆర్సెనిక్ ఉందా!?
‘తెలంగాణలో జనజాతర.. ఇది మన జాతర’
22న వైఎస్సార్సీపీ పీఏసీ సమావేశం
ఏటా కోటి పెళ్లిళ్లుమన వివాహ మార్కెట్ రూ.11 లక్షల కోట్లు
ఆ డైరెక్టర్‌తో తిరుమలకు సమంత.. వీడియో వైరల్!
మగవారి హక్కుల కోసం.. పురుష సత్యాగ్రహం
చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి
ఆ వయస్సు దాటితే హీరోయిన్గా కష్టమే: దియా మీర్జా ఆసక్తికర కామెంట్స్
అది గ్రేట్ మూవీ.. ఎలాన్ మస్క్ ట్వీట్
ఉపాధి హామీ పనులు.. 17జిల్లాలు అప్.. 15జిల్లాలు డౌన్..
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
‘మెగా డీఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు’
RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
మ్యాడ్ సినిమాతో ఫేమ్.. నటుడిపై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు!
ఆర్టీసీలో 3,038 ఖాళీల భర్తీకి ఏర్పాట్లు
క్రికెట్ ఆడుతుండగా పిడుగుపాటు.. ఇద్దరి మృతి
విశ్రాంత డీజీపీ దారుణ హత్య
టీమిండియా కెప్టెన్సీ రేసులో ఊహించని పేరు!.. జట్టులో చోటే లేదే!
యెమెన్ పోర్టుపై మళ్లీ అమెరికా దాడులు
క్షేమంగా ఊరికి పంపిస్తామని.. కాటేశారు
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
నా జీవితంలో మరిచిపోలేని బహుమతి ఇదే: మోహన్ లాల్ ఎమోషనల్ పోస్ట్
ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
అబ్దుల్లాకు జరిగిన నమ్మక ద్రోహం
నిశ్చితార్థం వేళ.. చితి మంటల ఘోష!
పాడుబడ్డ ఇంట్లో అనాథగా చిన్నారి.. కాపాడిన హీరోయిన్ సోదరి
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి.. కన్నతల్లే..
'భారత్ మూడేళ్ళలో ఆ దేశాలను అధిగమిస్తుంది'
డొనాల్డ్ ట్రంప్‌పై ప్రజాగ్రహం
ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్య
ట్రంప్ కొట్టిన దెబ్బ.. ఊడుతున్న 800 ఉద్యోగాలు!
బీజేపీ వివరణ రాజకీయ వంచన
భరించలేని నొప్పితో ఆస్పత్రిలో.. యాంకర్ రష్మీకి ఆపరేషన్
బ్యాంకులకు నేడు సెలవు ఉందా?
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మరో లగ్జరీ ప్రాజెక్ట్
బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
నగరంలో ఏకైక న్యూరో సర్జన్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
సినిమా

ఆ వయస్సు దాటితే హీరోయిన్గా కష్టమే: దియా మీర్జా ఆసక్తికర కామెంట్స్
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ దియా మీర్జా ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల అవకాశాలపై ఆమె మాట్లాడింది. పెళ్లి తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడం తగ్గిపోతాయని వెల్లడించింది. పెళ్లి తర్వాత తన కెరీర్ ఎలా ప్రభావితం అయిందో వివరించింది. దాదాపు 25 ఏళ్లపాటు ఇండస్ట్రీలో కొనసాగిన దియా మీర్జా ఇటీవల నాదానియాన్ మూవీలో ఓ పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో ఇబ్రహీమ్ అలీ ఖాన్‌కు తల్లిపాత్రలో నటించింది. అయితే ప్రస్తుతం ఓటీటీల వల్ల కొత్తగా అవకాశాలు వస్తున్నాయని పేర్కొంది. తాను నటించిన 2019 వెబ్ సిరీస్‌ను మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె హీరోయిన్ల అవకాశాలపై స్పందించారు.దియా మీర్జా మాట్లాడుతూ..' నిజ జీవితంలో మాతృత్వాన్ని స్వీకరించిన తర్వాత సినిమాల్లో ఎంపిక చేసే విధానం మారింది. గత ఐదేళ్లలో నేను నా కొడుకు పుట్టడానికి ముందు.. పుట్టిన తరువాత నేను చేసిన ప్రతి క్యారెక్టర్ అతను చూడాలని కోరుకునే ప్రాజెక్ట్‌లు. కథలను ఎంచుకోవడంలో నా ప్రాధాన్యత అలానే ఉంటుంది. హీరోయిన్లకు వయస్సు, పెళ్లి, మాతృత్వం తర్వాత అవకాశాలపై ప్రభావం ఉంటుంది. నా వయస్సు కారణంగా ఛాన్సులు రావడం లేదని నమ్మడం ప్రారంభించా. చాలా సినీ ఇండస్ట్రీల్లోనూ ఇదే జరుగుతుంది. దాదాపు 35 నుంచి 48 వయస్సు మధ్యలో హీరోయిన్గా అవకాశాలు కష్టమే. ఆ తర్వాత మీరు తల్లి, సోదరి పాత్రలు చేయడం ప్రారంభిస్తారు. కానీ ఓటీటీ వల్ల మహిళలకు అవకాశాలను పెంచిందని' తెలిపింది.దియా మాట్లాడుతూ..' ఈ రోజుల్లో సోషల్ మీడియా ఫాలోయింగ్‌పై విచారం వ్యక్తం చేసింది. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక సరికొత్త అర్ధంలేని పని జరుగుతోంది. సోషల్ మీడియాలో వ్యక్తులకున్న పాపులారిటీ ఆధారంగా చాలా మంది నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇది చాలా అన్యాయం. కొందరు అత్యద్భుతమైన ప్రతిభావంతులు సోషల్ మీడియాలో తమ వాయిస్‌ని బయటపెట్టడానికి ఇష్టపడరు. కానీ దాని అర్థం వారికి అర్హత లేదని కాదు. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొత్త సంస్కృతి" అని ఆమె అన్నారు.

50 ఏళ్ల 'సింగిల్' హీరోయిన్.. కానీ ప్రెగ్నెన్సీ రూమర్స్
అప్పుడెప్పుడో వచ్చిన 'బద్రి' సినిమా గుర్తుందా? అందులో హీరోయిన్ గా చేసిన అమీషా పటేల్.. తర్వాత తెలుగులో పెద్దగా నటించలేదు. పూర్తిగా బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలావరకు అవకాశాలు తగ్గిపోయాయి. అలాంటిది ఇప్పుడు ఈమెపై ప్రెగ్నెన్సీ రూమర్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ చిన్న మెలిక ఉంది.49 ఏళ్ల అమీషా పటేల్ చివరగా గతేడాది 'తౌబా తేరా చల్వా' సినిమాలో కనిపించింది. అంతకు ముందు గదర్ 2 చిత్రంతో హిట్ అందుకుంది. మూవీస్ పెద్దగా చేయనప్పటికీ ఇన్ స్టాలో మాత్రం ఎప్పుడూ గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటిది రీసెంట్ గా గ్రీన్ కలర్ బికినీతో ఫొటో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్ బాస్' జంట.. మూడేళ్ల ప్రేమ)ఇందులో ఈమె పొట్ట కాస్త ఎత్తుగా ఉండటంతో అమీషా పటేల్ ప్రెగ్నెన్సీతో ఉందా అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ఈమె.. ప్రస్తుతం ఎవరితోనైనా రిలేషన్ లో ఉందా అని అనుకుంటున్నారు. అయితే ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్ ఏమో అనిపిస్తుంది.ఎందుకంటే ఈ ఫొటో పోస్ట్ చేయడానికి ముందు కూడా కొన్ని ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసింది. అందులో లేని బేబీ బంప్.. బికినీ ఫొటోలో కనిపించడం చూస్తుంటే సోషల్ మీడియాలో తన గురించి మాట్లాడుకోవాలని అమీషా చేసిన పనిలా అనిపిస్తుంది. మరి నిజమేంటనేది ఆమె చెబితే తప్ప తెలియదు.(ఇదీ చదవండి: చాలా అసహ్యంగా నటించా.. ఇప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత)

పెళ్లి చేసుకున్న 'బిగ్ బాస్' జంట.. మూడేళ్ల ప్రేమ
బిగ్ బాస్ షోతో పరిచయమై.. దాదాపు మూడేళ్లుగా ప్రేమించుకున్న జంట.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. చెన్నైలోని ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. అబ్బాయి ముస్లిం అయినప్పటికీ.. ఆమ్మాయి ఇష్టప్రకారం హిందు సంప్రదాయంలోనే పెళ్లి జరగడం విశేషం.(ఇదీ చదవండి: చాలా అసహ్యంగా నటించా.. ఇప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత)2012 నుంచి సినిమాలు చేస్తున్న నటి పావని రెడ్డి.. తెలుగులో గౌరవం, అమృతంలో చందమామ, సేనాపతి, మళ్లీ మొదలైంది, చారీ 111 తదితర చిత్రాలు చేసింది. తమిళ, తెలుగులో పలు సీరియల్స్ కూడా చేసి గుర్తింపు తెచ్చుకుంది.పావనికి ఇదివరకే 2017లో ప్రదీప్ అనే వ్యక్తితో పెళ్లయింది. పావని ఓ తెలుగు సీరియల్ చేస్తున్న టైంలో ఇతడి పరిచయమయ్యాడు. కాకపోతే పెళ్లయిన కొన్నాళ్లకే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో షాక్ లోకి వెళ్లిన ఈమె.. దాన్నుంచి తేరుకుని షోలు చేయడం మొదలుపెట్టింది.(ఇదీ చదవండి: స్టార్ హీరోకి ఐదేళ్ల తర్వాత హిట్.. కలెక్షన్ ఎంతొచ్చాయంటే?)అలా తమిళంలో బిగ్ బాస్ 5వ సీజన్ లో పావని పాల్గొంది. ఇదే షోలో పాల్గొన్న కొరియోగ్రాఫర్ ఆమిర్.. పావనిని చూసి ఇష్టపడ్డాడు. ఆమెకి విషయం చెబితే తొలుత నో చెప్పింది గానీ కొన్నాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా 2022 నుంచి ఆమిర్-పావని రెడ్డి రిలేషన్ షిప్ లో ఉన్నారు.దాదాపు మూడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పలు షోల్లోనూ జంటగా పాల్గొని విజేతగానూ నిలిచారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పెళ్లి గురించి పావని బయటపెట్టింది. ఇప్పుడు హిందూ సంప్రదాయంలో ఆమిర్-పావని పెళ్లి జరిగింది. ఈ క్రమంలోనే అందరూ కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: నిన్ను చాలా మిస్ అవుతున్నా.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్)

నా జీవితంలో మరిచిపోలేని బహుమతి ఇదే: మోహన్ లాల్ ఎమోషనల్ పోస్ట్
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇటీవల ఎల్2 ఎంపురాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్ం బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఎల్2 ఎంపురాన్ నిలిచింది.అయితే సినిమాల పరంగా సూపర్ స్టార్ మోహన్‌లాల్ దక్షిణాదితో పాటు నార్త్‌లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అలా సినిమా హీరోలకు అభిమానులు ఉండడం సహజం. కానీ అదే సినిమా హీరో మరొకరికి అభిమాని అయితే ఎలా ఉంటుంది. సినీ పరిశ్రమలో స్టార్డమ్ సొంతం చేసుకున్న మోహన్ లాల్ కూడా ఓ వ్యక్తికి వీరాభిమాని. అతనెవరో కాదు.. ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్.. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సి. అతనంటే మోహన్‌లాల్‌కు విపరీతమైన అభిమానం. అంతలా అభిమానించే లియోనాల్ మెస్సి.. మోహన్‌లాల్‌కు అరుదైన కానుకను పంపించారు. తాను సిగ్నేచర్ చేసిన జెర్సీని మోహన్‌లాల్‌కు బహుమతిగా పంపారు. ఈ విషయాన్ని మోహన్ లాల్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ లాల్ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.మోహన్‌లాల్ ట్విటర్లో రాస్తూ..' జీవితంలోని కొన్ని క్షణాలు మాటల్లో చెప్పలేనివిగా అనిపిస్తాయి. అవీ ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఈ రోజు నేను అలాంటి క్షణాలనే అనుభవించాను. నా బహుమతిని చూసినప్పుడు నా హదయం ఒక్కసారిగా ఆనందంతో నిండిపోయింది. లెజెండ్ లియోనెల్ మెస్సీ సంతకం చేసిన జెర్సీ... అందులో నా పేరు, అతని చేతులతో రాసినది. మెస్సీని చాలా కాలంగా మెస్సీని అభిమానించే వ్యక్తికి ఇది నిజంగా ప్రత్యేకమైనదే. డాక్టర్ రాజీవ్ మంగొట్టిల్, రాజేష్ ఫిలిప్ అనే ఇద్దరు ప్రియమైన స్నేహితుల లేకుండా ఈ అపురూపమైన క్షణం సాధ్యమయ్యేది కాదు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా జీవితంలో అన్నింటికంటే మరపురాని ఈ బహుమతికి ధన్యవాదాలు' అని పోస్ట్ చేశారు. కాగా.. మోహన్ లాల్ ప్రస్తుతం ఆయన తుడరుమ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న ఇది విడుదల కానుంది. Some moments in life feel too profound for words. They stay with you forever.Today, I experienced one of those moments. As I gently unwrapped the gift, my heart skipped a beat—a jersey signed by the legend himself, Lionel Messi. And there it was… my name, written in his own… pic.twitter.com/V1HXjDjH89— Mohanlal (@Mohanlal) April 20, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్‌రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక
క్రీడలు

ఇటు రోహిత్ అటు కోహ్లి
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ విజృంభించారు. భారీ షాట్లతో అలరిస్తూ ఆదివారం అభిమానులకు డబుల్ ధమాకా అందించారు. పంజాబ్ కింగ్స్‌తో పోరులో కోహ్లి క్లాసిక్ ఇన్నింగ్స్‌తో కదంతొక్కగా... చెన్నైతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఊర మాస్ షాట్లతో చెలరేగిపోయాడు. ఫలితంగా పంజాబ్‌పై బెంగళూరు బదులు తీర్చుకోగా... చెన్నైపై ముంబై ఇండియన్స్ భారీ విజయం నమోదు చేసుకుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఓ మాదిరి ప్రదర్శనతో సరిపెట్టుకున్న రోహిత్... తనను ‘హిట్‌మ్యాన్’ ఎందుకు అంటారో వాంఖడేలో నిరూపించాడు. విరాట్ దూకుడుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లగా... రోహిత్ మెరుపులతో ముంబై నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లుగా తొలి ఓవర్లోనే క్రీజులో అడుగుపెట్టిన ఈ ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచి తమ జట్లను గెలిపించడం కొసమెరుపు.ముంబై: సిక్స్... ఫోర్... ముంబై ఇన్నింగ్స్ మొత్తం ఇదే తీరు! బంతి పడటమే ఆలస్యం బౌండరీ వెళ్లెందుకు ఓసారి, సిక్స్ అయ్యేందుకు మరోసారి బంతి అదేపనిగా ముచ్చట పడిందనిపించింది. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ, టి20 స్పెషలిస్ట్ సూర్యకుమార్‌ల ఆట మ్యాచ్‌లో హైలైట్స్‌ను చూపించలేదు. హైలైట్సే మ్యాచ్‌గా మార్చేసింది. దీంతో ముంబై 177 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. చెన్నైపై 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ముందుగా చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), సూర్య (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) హోరెత్తించారు. దంచేసిన జడేజా, దూబే ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ (20 బంతుల్లో 19; 1 ఫోర్)కు ఓపెనింగ్‌లో అవకాశమిస్తున్న ధోనిని నిరుత్సాహపరిచాడు. పవర్‌ప్లేలో 20 బంతులాడి కూడా ఒకే ఒక్క బౌండరీ బాదాడు. రచిన్ రవీంద్ర (5) విఫలమవగా, 17 ఏళ్ల ‘లోకల్ బాయ్’ ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉన్నది కాసేపే అయినా ఫోర్లు, సిక్స్‌లతో అలరించాడు. తర్వాత వచ్చిన జడేజా, దూబే భారీషాట్లు బాదడంతో చెన్నై పుంజుకుంది. ఇద్దరు నాలుగో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. సిక్స్‌లు బాదిన దూబే 30 బంతుల్లో, జడేజా 34 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ధోని (4)ని బుమ్రా ఎంతో సేపు నిలువనీయలేదు. బాదుడే... బాదుడు రోహిత్ శర్మకు జతగా ఓపెనింగ్ చేసిన రికెల్టన్ తొలి ఓవర్లోనే బౌండరీలతో తమ ఉద్దేశం చాటగా, రెండో ఓవర్ నుంచి రోహిత్ విరుచుకుపడటంతో చెన్నై బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. జేమీ ఓవర్టన్ ఓవర్‌న్నర (9 బంతులు) వేసిన ఐదో ఓవర్లో రికెల్టన్, రోహిత్ చెరో సిక్స్ కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో 62 పరుగులు చేసిన ముంబై తర్వాతి ఓవర్లోనే రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్‌ను కోల్పోయింది. సూర్యకుమార్ రావడం... రోహిత్‌తో కలిసి ధనాధన్ షోను డబుల్ చేసింది. ఇద్దరు బౌండరీలు, సిక్సర్లు కొట్టేందుకు పోటీపడటంతో స్టేడియం హోరెత్తింది. ముందుగా ‘హిట్‌మ్యాన్’ 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... సూర్య 26 బంతుల్లో అర్ధసెంచరీ అధిగమించాడు. ఇద్దరు బంతిని అదేపనిగా బౌండరీలైన్‌ను దాటిస్తూనే ఉండటంతో లక్ష్యం ముంబై వైపు నడిచివచ్చింది.స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: షేక్ రషీద్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 19; రచిన్ (సి) రికెల్టన్ (బి) అశ్వని 5; ఆయుశ్ (సి) సాంట్నర్ (బి) దీపక్ చహర్ 32; జడేజా (నాటౌట్) 53; దూబే (సి) జాక్స్ (బి) బుమ్రా 50; ధోని (సి) తిలక్ (బి) బుమ్రా 4; జేమీ ఓవర్టన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–16, 2–57, 3–63, 4–142, 5–156. బౌలింగ్: చహర్ 4–0–32–1, బౌల్ట్ 4–0–43–0, అశ్వని 2–0–42 –1, సాంట్నర్ 3–0–14–1, బుమ్రా 4–0–25–2, విల్ జాక్స్ 1–0–4–0, హార్దిక్ 2–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) ఆయుశ్ (బి) జడేజా 24; రోహిత్ (నాటౌట్) 76; సూర్యకుమార్ (నాటౌట్) 68; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (15.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 177. వికెట్ల పతనం: 1–63. బౌలింగ్: ఖలీల్ 2–0–24–0, ఓవర్టన్ 2–0– 29–0, అశ్విన్ 4–0–25–0, జడేజా 3–0–28–1, నూర్ 3–0–36–0, పతిరణ 1.4–0–34–0. ముల్లాన్‌పూర్: ముందు బౌలర్లు, తర్వాత బ్యాటర్లు రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తమ సొంతగడ్డపై పొగొట్టుకున్న ఫలితాన్ని పంజాబ్‌కు వెళ్లి రాబట్టుకుంది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. జోష్ ఇన్‌గ్లిస్ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), శశాంక్ సింగ్ (33 బంతుల్లో 31; 1 ఫోర్) మెరుగ్గా ఆడారు. కృనాల్, సుయశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించాడు. కోహ్లి ఆఖరిదాకా... పెద్ద లక్ష్యం కాకపోయినా... బెంగళూరు జట్టు తమ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (1) వికెట్‌ను తొలి ఓవర్లోనే కోల్పోయింది. పంజాబ్‌కు దక్కింది ఈ ఆరంభ సంబరమే! అటు తర్వాత కథంతా కింగ్ కోహ్లి, పడిక్కల్ నడిపించారు. వన్‌డౌన్ బ్యాటర్ పడిక్కల్ భారీ సిక్సర్లతో విరుచుకుపడగా... కోహ్లి క్లాసిక్స్ షాట్లతో ముల్లాన్‌పూర్ ప్రేక్షకుల్ని గెలిచాడు. ఇద్దరు రెండో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. పడిక్కల్ అవుటైనా... ఆఖరిదాకా క్రీజులో నిలబడిన కోహ్లి జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 22; ప్రభ్సిమ్రాన్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 33; అయ్యర్ (సి) కృనాల్ (బి) షెఫర్డ్ 6; ఇన్‌గ్లిస్ (బి) సుయశ్ 29; నేహల్ (రనౌట్) 5; శశాంక్ (నాటౌట్) 31; స్టొయినిస్ (బి) సుయశ్ 1; యాన్సెన్ (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–42, 2–62, 3–68, 4–76, 5–112, 6–114. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–26–0, యశ్ దయాళ్ 2–0–22–0, హాజల్‌వుడ్ 4–0–39–0, కృనాల్ పాండ్యా 4–0–25–2, షెఫర్డ్ 2–0–18–1, సుయశ్ 4–0–26–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఇన్‌గ్లిస్ (బి) అర్ష్ దీప్ 1; కోహ్లి (నాటౌట్) 73; పడిక్కల్ (సి) నేహల్ (బి) హర్‌ప్రీత్ 61; పాటీదార్ (సి) యాన్సెన్ (బి) చహల్ 12; జితేశ్ శర్మ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–6, 2–109, 3–143. బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–26–1, జేవియర్ 3–0–28–1, హర్‌ప్రీత్ బ్రార్ 4–0–27–1, యాన్సెన్ 3–0–20–0, చహల్ 4–0–36–1, స్టొయినిస్ 1–0–13–0, నేహల్ 0.5–0–9–0. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X గుజరాత్ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

IPL 2025: రోహిత్, సూర్యకుమార్ విధ్వంసం.. చెన్నైను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్కే ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. షేక్ రషీద్ 20 బంతుల్లో 19, రచిన్ రవీంద్ర 9 బంతుల్లో 5, ధోని 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన ముంబై రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్కై వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో ఆది నుంచే దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ సీజన్లో తొలిసారి సామర్థ్యం మేరకు సత్తా చాటాడు. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్) కూడా పర్వాలేదనిపించాడు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజాకు వికెట్ దక్కింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది.

PBKS VS RCB: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన కోహ్లి
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విరాట్ ఛేదనలో అద్భుతమైన హాఫ్ సెంచరీతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) అదరగొట్టి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సీజన్లో విరాట్‌కు ఇది మూడో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఓవరాల్‌గా 19వది.ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో విరాట్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. రోహిత్ కూడా ఐపీఎల్లో ఇప్పటివరకు 19 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. విరాట్, రోహిత్ ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ ఐపీఎల్లో 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఏబీడీ తర్వాత అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు క్రిస్ గేల్ (22) పేరిట ఉంది. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్, రోహిత్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లు (టాప్-5)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్‌లు)19 - రోహిత్ శర్మ (263 మ్యాచ్‌లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్‌లు)16 - యూసుఫ్ పఠాన్ (174 మ్యాచ్‌లు)16 - రవీంద్ర జడేజా (248 మ్యాచ్‌లు)ఈ మ్యాచ్‌లో విరాట్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో విరాట్ ఇప్పటివరకు 67 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో రెండో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 66 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 62 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.ఐపీఎల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 బ్యాటర్స్..విరాట్- 67 (59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు)వార్నర్- 66 (62, 4)శిఖర్ ధవన్- 53 (51, 2)రోహిత్ శర్మ- 45 (43, 2)కేఎల్ రాహుల్- 43 (39, 4)ఏబీ డివిలియర్స్- 43 (40, 3)ఐపీఎల్లో విరాట్ పేరిట ఉన్న రికార్డు..అత్యధిక పరుగులుఅత్యధిక శతకాలుఅత్యధిక 50 ప్లస్ స్కోర్లుఅత్యధిక బౌండరీలుమ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ బౌలర్లు.. ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని పంజాబ్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, హాజిల్‌వుడ్ వికెట్లు తీయనప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేశారు.పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్‌గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. విరాట్ అజేయ అర్ద శతకంతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించగా.. దేవ్‌దత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ చేసి ఆర్సీబీ గెలుపుకు గట్టి పునాది వేశాడు. జితేశ్ శర్మ (8 బంతుల్లో 11 నాటౌట్; సిక్స్) సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్‌ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు.

MI VS CSK: సూర్యవంశీ తరహాలో ఇరగదీసిన ఆయుశ్ మాత్రే.. అరంగేట్రంతో రికార్డు
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ఆయుశ్ మాత్రే సీఎస్కే తరఫున అరంగేట్రం చేస్తున్నాడు. మాత్రే ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. మాత్రే 17 ఏళ్ల 278 రోజుల వయసులో సీఎస్కే తరఫున అరంగేట్రం చేశాడు. మాత్రేకు ముందు ఈ రికార్డు అభినవ్ ముకుంద్ పేరిట ఉండేది. ముకుంద్ 18 ఏళ్ల 139 రోజుల వయసులో సీఎస్కే తరఫున అరంగేట్రం చేశాడు.ఐపీఎల్లో సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కులైన ఆటగాళ్ళు17y 278d - ఆయుశ్ మాత్రే vs MI, వాంఖడే, 2025*18y 139d - అభినవ్ ముకుంద్ vs RR, చెన్నై, 200819y 123d - అంకిత్ రాజ్‌పూత్ vs MI, చెన్నై, 201319y 148d - మతీష పతిరన vs GT, వాంఖడే, 202220y 79d - నూర్ అహ్మద్ vs MI, చెన్నై, 2025మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే 16 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. అశ్వనీ కుమార్ బౌలింగ్‌లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి రచిన్ రవీంద్ర (5) ఔటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన ఆయుశ్ మాత్రే తన తొలి ఇన్నింగ్స్‌లోనే ఇరగదీశాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. #RRvLSG: 14-year-old Vaibhav Suryavanshi's first three balls vs LSG on IPL debut: 𝐒𝐈𝐗, 1 RUN, 𝐒𝐈𝐗,#MIvCSK: 17-year-old Ayush Mhatre's first four balls vs MI on IPL debut: 1 RUN, 𝗙𝗢𝗨𝗥, 𝐒𝐈𝐗, 𝐒𝐈𝐗,WHAT A WAY TO ANNOUNCE YOUR ARRIVAL! | 📸: JioStar pic.twitter.com/WRVTwqEt2f— CricTracker (@Cricketracker) April 20, 20256.5 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 57/2గా ఉంది. షేక్ రషీద్‌కు (17) జతగా రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. కాగా, నిన్న జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) ఎలా రెచ్చిపోయాడో, ఈ మ్యాచ్‌లో ఆయుశ్ మాత్రే కూడా అలాగే ఇరగదీశాడు. సూర్యవంశీ తన అరంగేట్రం ఇన్నింగ్స్‌లో 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు.
బిజినెస్

చైనాపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్‌కు గోల్డెన్ ఛాన్స్!
చైనా వస్తువులపై అమెరికా అధిక సుంకాలను విధించడంతో.. బొమ్మల ఎగుమతి క్షీణించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారతీయ బొమ్మల ఎగుమతిదారులు చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది అమెరికన్ కొనుగోలుదారులు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం వెతుకుతున్నారు.అమెరికాకు ఎక్కువగా బొమ్మలను ఎగుమతి చేసే దేశాల్లో చైనా అగ్రగామిగా ఉండేది. అయితే ఇప్పుడు అధిక సుంకాల కారణంగా చైనా ఎగుమతులు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ అవకాశాన్ని భారతదేశం సద్వినియోగం చేసుకోవచ్చని టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు 'అజయ్ అగర్వాల్' ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.ప్రస్తుతం, దాదాపు 20 సంస్థలు అమెరికన్ మార్కెట్‌కు పెద్ద ఎత్తున బొమ్మల ఎగుమతుల్లో నిమగ్నమై ఉన్నాయని అగర్వాల్ అన్నారు. గత నెలలో యుఎస్ బేస్డ్ బొమ్మల కొనుగోలుదారుల నుంచి మాకు మరిన్ని విచారణలు వస్తున్నాయి. యూఎస్ నియమాలు, నిబంధనల ప్రకారం బొమ్మ ఉత్పత్తులను తయారు చేయగల తయారీదారుల జాబితాను కోరుతూ కొన్ని భారతీయ ఎగుమతి సంస్థలు కూడా మమ్మల్ని సంప్రదించాయి ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?2024లో యూఎస్ బొమ్మల మార్కెట్ 42.8 బిలియన్ డాలర్లకు చేరుకుందని జీఎమ్ఐ రీసర్చ్ వెల్లడించింది. 2032 నాటికి ఈ వృద్ధి 56.9 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. బొమ్మల రంగంలో భారతదేశం నుంచి ఇప్పటికే దాదాపు 20 కంపెనీలు పెద్దమొత్తంలో అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి.ఇతర దేశాల కంటే తక్కువ రేట్లు ఉండటం వల్ల మనకు సుంకాల ప్రయోజనం లభిస్తే.. అమెరికా మార్కెట్లో భారతీయ బొమ్మల ఉనికిని తప్పకుండా పెంచుకోవచ్చని.. టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అన్నారు. అంతే కాకుండా త్వరలోనే తయారీదారులతో ఒక సెమినార్ నిర్వహించాలని అసోసియేషన్ యోచిస్తోందని ఆయన అన్నారు.

కొత్తరకం ఫ్యాన్లు: ధరలు ఎలా ఉన్నాయంటే?
టెక్నాలజీ పెరుగుతోంది. మనం రోజూ చూస్తున్న వస్తువుల్లో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇస్మార్ట్ క్రిస్టల్ షాండ్లియర్ ఫ్యాన్, కేబుల్ ఫ్యాన్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..షాండ్లియర్ అందించే చల్లగాలిఇంటి సీలింగ్‌కు షాండ్లియర్‌తో అలంకరిస్తే చూడటానికి భలే బాగుంటుంది. కాని, షాండ్లియర్‌ను తగిలిస్తే, ఆ చుట్టు పక్కల ఫ్యాన్ అమర్చుకోలేం. ఇప్పుడు ఈ సమస్యను దూరం చేస్తోంది ఈ ‘ఇస్మార్ట్ క్రిస్టల్ షాండ్లియర్ ఫ్యాన్’. ఇది ఒకవైపు వెలుగులు వెదజల్లుతూనే, మరోవైపు నిశ్శబ్దంగా చల్లని గాలిని కూడా వీస్తుంది. రిమోట్ కంట్రోల్ ద్వారా లైట్, ఫ్యాన్ స్పీడ్‌ను కంట్రోల్ చేయొచ్చు. ధర 299 డాలర్లు (రూ. 25,664).ఇదీ చదవండి: ఒక ఫ్యాన్స్ మూడు లాభాలుకేబుల్ ఫ్యాన్ఇది అచ్చం డేటా కేబుల్లాంటి ఫ్యాన్. ఎక్కడికైనా సరే తీసుకెళ్లడానికి చాలా అనువుగా ఉంటుంది. యూఎస్బీ పోర్ట్ సాయంతో మొబైల్, అడాప్టర్, కంప్యూటర్ కేస్, ల్యాప్‌టాప్ ఇలా దేనికైనా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఫ్యాన్ తిరిగేటప్పుడు చల్లటి గాలితో పాటు, సమయం, ఉష్ణోగ్రతలను తెలిపే డిజిటల్ క్లాక్‌ను కూడా ఇది డిస్ప్లే చేస్తుంది. ధర కంపెనీ, క్వాలిటీ లపై ఆధారపడి ఉంటుంది. వివిధ కంపెనీల పేర్లతో ఆన్లైన్లో లభిస్తోంది.

ఒకేసారి మూడు లాభాలు
సీలింగ్ ఫ్యాన్‌ను కూడా ఇప్పుడు బయటకు తీసుకెళ్లి వాడుకోవచ్చు. ఇది ఒక స్మార్ట్ పోర్టబుల్ ఫ్యాన్. పేరు ‘క్రోబాట్ స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్’. దీనికున్న ఈజీ డిటాచబుల్ రెక్కల సాయంతో ఎక్కడకు కావాలనుకుంటే అక్కడకు ఇట్టే తీసుకెళ్లవచ్చు.ఏదైనా ఎత్తైన హుక్కు తగిలించి.. సీలింగ్ ఫ్యాన్‌లా స్టాండ్‌కు బిగించి టేబుల్ ఫ్యాన్‌లా వాడుకోవచ్చు. అంతేకాదు, ఇందులో లైటింగ్ సిస్టమ్ ఉండటంతో ఇది ల్యాంప్గానూ పనిచేస్తుంది. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే దీనిని రిమోట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ధర రూ. 1,649 మాత్రమే!

విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?
ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకునేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కారణం ఏదైనా విడాకులు వరకు వెళ్లిపోతున్నారు. డివోర్స్ తీసుకుంటే ఆ తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉన్నా.. క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది వినడానికి వింతగా అనిపించినప్పటికీ, ఈ కథనం చదివితే.. తప్పకుండా మీకే అర్థమవుతుంది.భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు (ఉద్యోగం చేసే వారైతే).. జాయింట్ అకౌంట్స్ మీద హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటివి తీసుకుని ఉంటే.. విడాకులు తరువాత ఈ ఖాతాలను క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఎలా అంటే.. జాయింట్ అకౌంట్స్ కింద తీసుకున్న లోన్‌కు ఇద్దరూ బాధ్యత వహించాలి. ఆలా కాకుండా అకౌంట్ క్లోజ్ చేస్తే లేదా లోన్ చెల్లింపులు ఆలస్యం చేస్తే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది.కలిసి ఉన్నప్పుడు ఇద్దరి సంపాదన తోడవుతుంటుంది. విడాకుల తరువాత ఎవరి దారి వారిదే. అలాంటి సమయంలో ఆర్ధిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఇది మీ ఈఎంఐల మీద ప్రభావం చూపిస్తుంది. ఇది కూడా సిబిల్ స్కోర్ తగ్గిపోవడానికి కారణమవుతుంది.ఇదీ చదవండి: ఫుడ్ ఆర్డర్‌తో పాటు ఓ స్లిప్ పంచుతున్న డెలివరీ బాయ్.. అందులో ఏముందంటే?విడాకులు మంజూరు చేసే సమయంలో లోన్స్ క్లియర్ చేయాల్సిన బాద్యతను మీ భాగస్వామికి కోర్టు అప్పగించినప్పటికీ.. లోన్ అగ్రిమెంట్స్ మీద ఇద్దరి సంతకాలు ఉంటాయి. అలాంటి సమయంలో మీ భాగస్వామి చెల్లింపులను ఆలస్యం చేస్తే.. ఆ ప్రభావం ఇద్దరిపైన పడుతుంది. ఇది సిబిల్ స్కోర్ తగ్గడానికి కారణమవుతుంది.జాయింట్ అకౌంట్స్ లేదా క్రెడిట్ కార్డులను విడాకులు తీసుకున్న వెంటనే క్లోజ్ చేసుకున్నట్లయితే.. అది మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి విడాకులు తీసుకున్న తరువాత కూడా ఇలాంటి ఆర్ధిక సంబంధ లావాదేవీల గురించి మాట్లాడుకుంటే.. సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోవచ్చు.
ఫ్యామిలీ

ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు మస్ట్!
గతంలో గర్భధారణ (ప్రెగ్నెన్సీ) ప్లానింగ్ అంటూ ఏదీ ఉండేది కాదు. నిజానికి తమకు కావాల్సినప్పుడు, తమకు అవసరమైన సమయంలోనే ప్రెగ్నెన్సీ వచ్చేలా ప్లాన్ చేసుకుంటే... అది వచ్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కాబోయే తల్లికీ, పుట్టబోయే బిడ్డకూ చాలా ప్రయోజనాలు ఉంటాయి. తల్లీ బిడ్డా సురక్షితంగా కూడా ఉంటారు. సరైన ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌తో ప్రయోజనాలెలా కలుగుతాయో తెలుసుకుందాం. గతం తరం యువతుల్లో తమకు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం నెల తప్పిన తర్వాత గానీ తెలిసేది కాదు. అప్పుడు... తమకు పెగ్నెన్సీ వచ్చిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇంట్లోనే కొన్ని పరీక్షలు చేసుకునేవారు. అయితే గర్భధారణను ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లల్లో కొన్ని లోపాల నివారణకు ముందునుంచే జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న మహిళ తాము నెల తప్పాలనుకున్న మూడు నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అనే పోషకాన్ని తీసుకోవడం వల్ల ప్రయోజనాలుంటాయి. మార్కెట్లో మాత్రల రూపంలో దొరికే ఈ ఫోలిక్ యాసిడ్ చాలా చవక. నిజానికి పాలకూర లాంటి ఆకుకూరల్లో అది సమృద్ధిగా ఉంటుంది. పిండంలో వచ్చేందుకు అవకాశమున్న న్యూరల్ ట్యూబ్ (వెన్నుపాము) లోపాలను అది అరికడుతుంది. పుట్టుకతో వచ్చే ఈ వెన్నుపాము లోపాలను స్పైనాబైఫిడా అంటారు. చదవండి: అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవోఫోలిక్ యాసిడ్ ఇలాంటి అనేక ప్రెగ్నెన్సీ లోపాలను అరికడుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్న మహిళలకు మూడు నెలల ముందునుంచే ఆబ్స్ట్రెష్టీషియన్స్/ గైనకాలజిస్టులు ఫోలిక్ యాసిడ్ మాత్రలను సూచిస్తుంటారు. ప్రెగ్నెన్సీ ప్లాన్నింగ్ వల్ల స్పైనా బైఫిడా మాత్రమే కాకుండా పౌష్టికాహార లోపాల వల్ల పిండదశలో ఎదురయ్యే మరెన్నో సమస్యలూ నివారించవచ్చు. అంతేకాదు... దేశంలోని మహిళల్లో దాదాపు 59 శాతం మందిలో రక్తహీనత (అనీమియా) ఎక్కువ. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే మహిళకు ఐరన్ సప్లిమెంట్లు ఇవ్వడం ద్వారా కూడా కాబోయే తల్లీ, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంది. చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళిగర్భం ప్లాన్ చేసుకున్న నాటి నుంచి మహిళకు అన్ని పోషకాలూ అందేలా ఆరోగ్యకరమైన సమతు లాహారాన్ని ఇవ్వడం, అందులో కూరగాయలు, ఆకుకూరలు, తాజాపండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలతో ఇటు కాబోయే తల్లి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో పాటు, ఆ చిన్నారికి తగినంత రోగనిరోధక శక్తి సమకూరేలా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశముంటుంది. డా.స్వప్న సముద్రాలసీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రీషియన్

హాలీడేస్... జాలీడేస్...
వేసవి అంటే స్కూల్ ఉండదు, టైం టేబుల్ ఉండదు, హోంవర్క్ ఉండదు. రోజంతా ఖాళీ. పిల్లలు ఉదయం లేచిన దగ్గర్నుంచీ టీవీ లేదా మొబైల్ పట్టుకుని కూర్చుంటారు. పేరెంట్స్ కూడా సెలవులే కదా అని చూసీ చూడనట్లు ఊరుకుంటారు. కాని, ఈ నెల, రెండునెలల కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే వారి బోర్డమ్ను బ్రేక్ చేసి సృజనాత్మకత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, మేధస్సు పెరిగే ప్రయాణంగా మార్చే అవకాశం ఉంది. అదెలాగో ఈ రోజు తెలుసుకుందాం.బోర్ టైం... క్రియేటివ్ టైం... పిల్లలు బోర్‌గా ఫీలయిన సమయంలో మెదడులోని ‘డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్’ అనే భాగం యాక్టివ్ అవుతుంది. ఇది క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫ్యూచర్ ప్లానింగ్‌కు కేంద్రం. అలా జరగాలంటే రోజుకు కనీసం రెండుగంటల సమయం ఖాళీగా ఉంచండి. ఆ సమయంలో నో స్క్రీన్. అప్పుడే పిల్లల్లో ఊహాశక్తి పుట్టుకొస్తుంది. ఈ సమయం స్క్రిప్ట్ లేని సినిమా లాంటిది. ప్రతి బిడ్డ దర్శకుడే, కథానాయకుడే. పేపర్‌తో బొమ్మలు చేయడం, రాళ్లతో ఆటలాడటం, పాత వస్తువులతో టెంట్ తయారుచేయడం లాంటివి చేయమని చెప్పండి. ఇలాంటి ఆటలే పిల్లల్లో ప్లానింగ్, సెల్ఫ్ కంట్రోల్, భావోద్వేగాల అదుపును పెంచుతాయి. ఇంట్లోనే ‘ప్రేరణ ప్రదేశం‘ మనలో చాలామంది పిల్లలను తక్కువ అంచనా వేస్తాం. కానీ వాళ్ళను ఒక చక్కటి పరిసరంలో ఉంచితే, వారు చూపించే అద్భుతాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అందుకోసం ఇంట్లో ఒక ‘యెస్ షెల్ఫ్’ తయారు చేయండి – అందులో క్రేయాన్లు, కాగితాలు, పాత గడియారాలు, భూతద్దం, కథల పుస్తకాలు. ఇలా ఉంచితే పిల్లలు అడగకుండా అన్వేషించడం మొదలుపెడతారు. ఓ పిల్లాడు పాత రేడియోను తెరిచి ‘‘ఇది ఎలా శబ్దం చేస్తుంది?’’ అని అడిగాడనుకోండి. అదే సైన్స్‌కు మొదటి అడుగు. విగోట్స్కీ చెప్పినట్టు ‘జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్’లో పిల్లలకు స్వేచ్ఛనిస్తే స్వయంగా నేర్చుకుంటారు. ఇలాంటి ఆటల వల్ల ఏకాగ్రత పెరుగుతుందని హార్వర్డ్ అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. ఆటలు... జ్ఞానం పెంచే సాధనాలుపిల్లలకు ఏకాగ్రత లేదని అనుకోవడం తప్పుడు అభిప్రాయం. వాళ్ళకు నచ్చే విషయంలో ఆశ్చర్యకరమైన ఫోకస్ చూపిస్తారు. జిగ్సా పజిల్స్, మెమరీ గేమ్స్, లూడో, చెస్‌లాంటి గేమ్స్ అందుబాటులో ఉంచండి. ఇది మెదడులోని సీఈఓలాంటి ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ను యాక్టివేట్ చేస్తుంది. ఇది డెసిషన్ మేకింగ్, సెల్ఫ్ కంట్రోల్, ప్రొడక్టివ్ టాస్క్స్కు అవసరమైనది. వారానికి ఒకరోజు గేమ్ నైట్ డిజైన్ చేయమని పిల్లలకు అప్పగించండి. అది లాజిక్, ఎమోషన్, లీడర్షిప్ లక్షణాలను పెంచుతుంది. భావోద్వేగాలను బయటపెట్టే ప్రయోగాలుపిల్లలు ప్రతి రోజూ ఎన్నో ఎమోషన్స్ అనుభవిస్తారు. కానీ వాటిని ఎలా చెప్పాలో తెలియదు. పిల్లలు ‘నాకు బాధగా ఉంది’ అనే మాటే చెప్పలేరు. అందుకే భావప్రకటనను ఆటల ద్వారా నేర్పాలి. ఉదాహరణకు ఒక్కో భావాన్ని ఒక ప్రాణిగా గీయమని చెప్పండి. అంటే నిప్పు కళ్లతో రాక్షసుడు లాంటిది. అలాగే మూడ్ జర్నల్ రాయమనండి. అంటే, ‘నాకు ఈరోజు –––– అనిపించింది. ఎందుకంటే ––––.’ అలాగే ఒక్కో ఎమోషన్ మీద చీటీలు వేసి కథలు చెప్పడం. ఈ ప్రయత్నాలు ప్లే థెరపీలా పనిచేస్తాయి. భావాలను అర్థం చేసుకోవడం, వాటిని వ్యక్తం చేయడం వల్ల ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది.బంధాన్ని పెంచే యాక్టివిటీస్... వారంలో ఒక సాయంత్రం వాకింగ్, ఒక ఆదివారం కుకింగ్, రోజూ బెడ్‌టైమ్ స్టోరీ... ఇలాంటివి పిల్లల మనసుకు మిమ్మల్ని దగ్గర చేస్తాయి. ఇలాంటి చిన్న చిన్న పనులే పిల్లల ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్లా మారతాయని డాక్టర్ జాన్ గోట్మాన్ అంటారు. ప్రేమ, అంగీకారం, జాగ్రత్త... ఇవన్నీ మీరిచ్చే కానుకల కంటే విలువైనవి. వారానికో స్కిల్ ఛాలెంజ్...వేసవి అంటే ఫ్రీడమ్‌నే కదా. అయితే ఆ ఫ్రీడమ్‌కు ఓ స్ట్రక్చర్ ఉండాలి. అందుకే ప్రతివారం ఒక స్కిల్ చాలెంజ్ ఇవ్వండి. గార్డెనింగ్, కుకింగ్, ఒరిగామి, క్రాఫ్ట్స్ కుటుంబ సభ్యుల కోసం గ్రీటింగ్ కార్డ్స్ తయారుచేయడం, రూమ్ చక్కదిద్దుకోవడం లాంటివి వారానికో చాలెంజ్ ఇవ్వండి. ఇలాంటివి చేయడం నేనీ పనులను స్వయంగా చేయగలననే నమ్మకాన్ని పెంచుతుంది.

లెడ్ పాయిజనింగ్ అవుతోందా?
నాకిప్పుడు మూడోనెల. నేను పెయింట్, డైయింగ్ షాప్‌లో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నాను. లెడ్ పాయిజనింగ్ అవుతుందని విన్నాను. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – దేశీత, శ్రీకాకుళం.పెయింట్, డైయింగ్ పరిశ్రమల్లో పనిచేసే వారు ఎక్కువ శాతం లెడ్ డస్ట్‌కి గురవుతారు. లెడ్ పెయింట్స్‌ని స్ట్రిప్ చేసినప్పుడు, అది పీల్చుకుంటే లెడ్ డస్ట్ ఎక్కువ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఈ పరిశ్రమల్లో ఉండే ప్రాంతంలోని గ్రౌండ్ వాటర్ కూడా కలుషితం అవుతుంది. ఎక్కువ కాలం లెడ్ డస్ట్‌కు గురైతే, లెడ్ పార్టికల్స్ శరీరంలోకి చేరుతాయి. అందుకే, ఈ పరిశ్రమల్లో పని చేసేవారు శరీరం, చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి. సాధారణ వాతావరణం ద్వారా అందరికీ కొంత లెడ్ ఎక్స్పోజర్ అవుతుంది. కానీ, ఎక్కువ శాతం ఈ పెయింట్, డైయింగ్ పరిశ్రమల్లో వారికే అవుతుంది. ఈ లెడ్ శరీరంలోకి వ్యాపించి ఎముకలు, దంతాల్లో నిల్వ ఉంటుంది.అంతేకాదు, ప్రెగ్నెన్సీలో ఈ లెడ్ పార్టికల్స్ బ్లడ్ స్ట్రీమ్‌లోకి చేరి తల్లికి, బిడ్డకు ప్రమాదం చేస్తాయి. అందుకే, ప్రెగ్నెన్సీలో రక్తపరీక్షల్లో ఈ లెడ్ లెవల్‌ను పరిశీలిస్తాం. క్యాల్షియం, ఐరన్, విటమిన్ డీ, విటమిన్ ఈ, విటమిన్ సీలను ఆహారంలో తక్కువ తీసుకునే వారికి ఈ లెడ్ అబ్జార్ప›్షన్ పెరుగుతుంది. అందుకే, సమతుల్యమైన ఆహారం, పోషకాహారం ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి. ఈ లెడ్ లెవెల్స్ 5 ఎమ్సీజీ / డీఎల్ కన్నా ఎక్కువ ఉంటే అది డేంజర్ లెవెల్ అని అర్థం. లెడ్ మెటల్ ప్లాసెంటాను దాటి పిండంలోకి చేరగలదు. ఈ లెడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే గర్భస్రావం, పుట్టిన బిడ్డకు అంగవైకల్యం, బిడ్డ బరువు తక్కువ ఉండటం, నెలలు నిండకుండానే కాన్పు, హై బీపీ వంటి సమస్యలు పెరుగుతాయి. బిడ్డ మెదడుపై కూడా ప్రభావం పడుతుందని పరిశోధనల్లో తేలింది.బేబీకి బుద్ధిమాంద్యం ఏర్పడవచ్చు. అందుకే, డాక్టర్‌ను వెంటనే సంప్రదించాలి. రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది, రక్తంలో మీ లెడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చెస్తారు. నీటిలో కూడా లెడ్ ఎక్స్‌ప్లోజర్ కావచ్చు. కాబట్టి వడగట్టి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. పరీక్షల్లో లెడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మొదట క్యాల్షియం మాత్రలు ఇస్తారు. ఒక గ్రాము డోస్ రోజూ డెలివరీ వరకు తీసుకోవాలి. చెలేషన్ థెరపీ ఇవ్వాలి. రెండు నుంచి నాలుగు వారాల తరువాత లెడ్ లెవెల్స్‌ను మళ్లీ చెక్ చేస్తాం. రెండో త్రైమాసికంలో సురక్షితంగా ఈ మందును అడ్జస్ట్ చేసి ఇస్తాం. భవిష్యత్తులో లెడ్ ఎక్స్పోజర్ ఎక్కువ కాకుండా డెలివరీ వరకు జాగ్రత్తగా చూసుకోవాలి.ఎలాంటి వారికి సమస్య ఎక్కువ?నా వయసు ముప్పై సంవత్సరాలు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నాము. ఎలాంటి వాళ్లకి ప్రెగ్నెన్సీలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి?– ప్రణతి, గుంటూరు.ప్రెగ్నెన్సీలో కొందరికి ఎక్కువ సమస్యలు కావచ్చు. మరికొందరికి తక్కువ ఉండవచ్చు. సాధారణంగా అలసట, థైరాయిడ్ సమస్యలను ఎక్కువమందిలో చూస్తాం. కానీ, కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్న వారిలో సమస్యలు ఎక్కువ అవుతాయి. బరువు ఎక్కువ ఉండటం, స్థూలకాయం, బీఎమ్ఐ 30 కంటే ఎక్కువ ఉన్నవారిలో తల్లికి బీపీ, మధుమేహం, ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. బేబీకీ వెన్నెముక, మెదడు సమస్యలు పెరుగుతాయి. వయసు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న తల్లుల్లో క్రోమోజోమ్ అసాధారణతలు ఎక్కువ ఉంటాయి. అలానే టీనేజ్ ప్రెగ్నెన్సీలో కూడా సమస్యలు ఎక్కువ. కొన్నిసార్లు ఆరోగ్యకరమైన కండిషన్స్‌లో కూడా ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ట్విన్స్, మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్లో ఉండవచ్చు. వారిలో షుగర్, హై బీపీ ప్రమాదం పెరుగుతుంది. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో ఎదుగుదల సమస్యలు, ప్లాసెంటా సమస్యలు ఉన్నా ఇప్పుడు అవి ప్రభావం చూపుతాయి. అందుకే, మూడవనెల నుంచి మంచి ఆహారం తీసుకుంటూ, డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే, ప్రమాదాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా పరీక్షలు చేసి, మందులను సూచిస్తారు.ప్రెగ్నెన్సీలో బేబీకి ప్రమాదమా?నేను ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నాను. ఇంట్లో ఉమ్మడి కుటుంబ సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే పనిచేసే ఆఫీసులోనూ కూడా చాలా టార్గెట్స్ ఉంటాయి. ఒత్తిడి చాలా ఎక్కువ అవుతుంది. అది తగ్గించుకోవాలన్నా అవటం లేదు. ఈ ఒత్తిడి వలన ప్రెగ్నెన్సీలో బేబీకి ఏదైనా ప్రభావం ఉంటుందా? – రూప, బెంగళూరు.ఒత్తిడి అనేది మానవ జీవితంలో సహజం. కానీ, ప్రెగ్నెన్సీ చాలా సంతోషంగా, ఆరోగ్యంగా అనుభవించవలసిన సమయం. ఆ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత సంతోషంగా ముందుకు వెళ్లగలరు. సానుకూల వైఖరి చాలా అవసరం. సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి. ఒత్తిడి పెంచే ఆలోచనలు అస్సలు చెయ్యకూడదు. ప్రెగ్నెన్సీలో శరీరం, మెదడులో చాలా మార్పులు వస్తాయి. హార్మోన్ల మార్పుల వలన కొంత అసహనం, చిరాకు ఉంటాయి. అతిగా ఒత్తిడికి గురైతే నిద్రలేమి, తలనొప్పి, ఆకలి లేకపోవడం, హై బీపీ, నెలలు నిండకుండానే ప్రసవం, పుట్టిన బిడ్డ బరువు తక్కువ ఉండటంలాంటి సమస్యలు రావచ్చు. ఒత్తిడికి దారితీసే కారణాలను వెతికి, వాటిని ముందే పరిష్కరించుకోవాలి. కనీసం తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రోజూ ఒక గంటసేపు వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. బాగా నిద్రపోవాలి.

ఈ వారం కథ: చిద్విలాసుడు
అతను చాలాకాలం తర్వాత బస్‌స్టాండ్ లో కనిపించాడు. నేను చూడనట్టు నటించాను. ఎక్కడ నుంచి చూశాడో నన్ను, పరుగెత్తుకుంటూ వచ్చి పట్టేసుకున్నాడు. ‘‘ఎంతకాలం అయ్యిందో శ్రీను! నిన్ను చూసి’’ అంటుంటే మొహంలో ఆనందం. ‘‘సంయుక్త బాగుందా? పిల్లాడు ఎలా ఉన్నాడు?’’ అంటూ నా గురించి అడుగుతున్నాడు. అదే హుషారు, అదే నవ్వు. జీవితాన్ని ఈజీగా తీసుకునే అతన్ని చూస్తే ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. మామూలుగా అయితే అది అసూయ! తప్పదురా దేవుడా! అనుకుంటూ ముఖం మీద నవ్వు పులుముకుని, ‘‘మీరు ఎలా వున్నారు?’’.. అడిగాను.ఎప్పటిలాగానే జేబులోంచి సిగరెట్టు తీసి వెలిగించి గుండెల్లోకి గట్టిగా పీల్చి గాలిలోకి పొగ వదులుతూ, ‘‘నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను’’ అన్నాడు. పదిహేను ఏళ్ల క్రితం ఎలా అనేవాడో అదే మాడ్యులేష తో అన్నాడు. అప్పటికీ ఇప్పటికీ అతని వ్యవహారంలో మార్పు ఏమీ లేదు. మనిషిలో కూడా పెద్దగా వచ్చిన మార్పులేదు. శరీరం మీద కాలం మిగిల్చిన ఆనవాళ్ళు తప్ప. ‘‘మీ పిల్లలు ఎలా ఉన్నారు’’.. అని అడిగే లోపున, ‘‘నీ ఫోన్ నెంబర్ ఇయ్యి శ్రీను’’ అంటూ మొబైల్లో టిక్ టిక్‌మని అనిపించి దాన్ని జేబులో పడేసుకుని, ‘‘నేను ఎక్కవలసిన బస్ వచ్చేసింది, ఫోన్ చేస్తాను’’ అంటూ హడావుడిగా, కదులుతున్న బస్ ఎక్కి, వెళ్ళిపోయాడు. భలే మనిషి సన్యాసి! పేరుకు తగ్గ మనిషి. బాదరబందీలు ఉన్నా పట్టనట్టు తిరిగే సర్వసంగ పరిత్యాగి. సన్యాసి అనే పేరే విచిత్రంగా అనిపించి ఒకసారి అడిగితే, ‘‘మా అమ్మకి చాలాకాలంగా పిల్లలు పుట్టలేదుట. ఒక రోజు ఒక సన్యాసి మా అరుగు మీద కూర్చున్నాడుట. అతణ్ణి చూసి జాలిపడి మా అమ్మ అన్నం పెట్టిందిట. తృప్తిగా తిని, త్వరలో నీ కడుపు పండుతుంది. ఒక పిల్లాడు పుడతాడు అని చెప్పి వెళ్లిపోయాడట. తర్వాత నేను పుట్టాను. అందుకే నాకు సన్యాసి అని పెట్టుకుంది’’ అని చెప్తూ చిద్విలాసంగా నవ్వాడు. ప్రపంచంలో నా అంత ఆనందంగా ఉండేవాడు మరొకడు లేడు అనేలా నవ్విన ఆ నవ్వు నా మస్తిష్కంలోంచి చెరిగిపోలేదు. అంతలా నా మనస్సులో ముద్ర వేశాడు. పదిహేనేళ్ల క్రితం మొదలైన మా పరిచయం, ట్రాన్స్ఫర్ మీద ఈ వూరు వచ్చే వరకు సాగింది. బలవంతాన నా ఆలోచనల్లో చొరబడ్డ ఆ పెద్దమనిషి నన్ను గతంలోకి లాక్కెళ్లాడు.ఆ రోజు శనివారం ఆఫీసు హాఫ్ డే సెలవు. నేను వచ్చేసరికి, సంయుక్త గోడ అవతల ఉన్న ఒక కొత్త ఆమెతో మాట్లాడుతోంది. నేరుగా బాత్ రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి, కారుణ్యను ఎదురుగాకూర్చోబెట్టుకుని లెక్కలు చెప్పడం మొదలుపెట్టాను. సంయుక్త లోపలికి వస్తూ, ‘‘కాఫీ తాగారా’’ అని అడిగింది. తల ఊపాను.‘‘పక్క ఇంటికి కొత్తగా వచ్చారండి. ఆయన జిల్లా కోర్టులో పనిచేస్తారుట. ఆవిడే వచ్చి పరిచయం చేసుకుంది, ఆయన పేరు సన్యాసి, ఆమె పేరు పార్వతి. చాలా మంచామెలా ఉంది, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు అట. ఈ రోజుల్లో నలుగురంటే కష్టమే పాపం. పెద్ద అమ్మాయి వాళ్ళ పిన్ని దగ్గర ఉండి, చదువుకుంటోందట. పార్వతిగారికి పిండి వంటలు బాగా వచ్చట. మనకి ఏ సాయం కావాలన్నా చేస్తానన్నారు’’.. సంయుక్త కళ్ళల్లో ఆనందం. ఇంతలో గట్టిగా పెద్దపెద్ద అరుపులు, తిట్లు వినబడ్డాయి.ఇద్దరం బయటకు పరుగెత్తి శబ్దాలు వచ్చిన వైపు చూశాము. పక్క ఇంటి ఆవరణలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి జుట్టు జుట్టు పట్టుకుని రక్తాలు వచ్చేలా కొట్టుకుంటున్నారు. ఆడపిల్ల కూడా ఎక్కడా తగ్గడం లేదు.ఆ పిల్లాడితో సమానంగా పోరాడుతోంది. ఇద్దరికీ పది పన్నెండేళ్లు ఉండొచ్చు. పక్కింటావిడ వాళ్ళను విడదీయలేక, ‘‘ఒసేయ్ కమలా! ఒరేయ్ రాము ఆగండ్రా! కొట్టుకోకండి! ఏవయ్యో! వీళ్ళను ఆపలేకపోతున్నాను, వచ్చి ఆపవయ్యా’’ అంటూ అరుస్తోంది. మేము చూస్తున్నామని ఆమె గమనించినట్టుంది. సిగ్గుపడుతూ మొహం కిందకు దింపేసుకుని మొగుడు కోసం లోపలికి వెళ్ళింది. ఆ పిల్లలిద్దరూ మట్టిలో దొర్లుతున్నారు. కాసేపు అయ్యాక, అలిసిపోయి, ఆయాసపడుతూ అక్కడే మట్టిలో వెల్లకిలా పడుకుని ఆకాశం కేసి చూస్తున్నారు. ఇంతలో నడుము మీద వేలాడుతున్న లుంగీతో, పై భాగంలో ఏ ఆచ్ఛాదనా లేకుండా, నోటిలో కాలుతున్న సిగరెట్టుతో, నలభైఐదు, ఏభై ఏళ్ల మధ్యవయస్కుడు తాయితీయిగా నడుచుకుంటూ వచ్చి, ‘‘ఏరానాన్నా! ఏమ్మా అమ్ములూ! దెబ్బలు తగిలాయా! ఎందుకు నాన్నా అల్లరి’’ అంటూ వాళ్లను ప్రేమగా మందలించి లేవదీసుకుని లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు.‘‘ఛీ ఛీ ఎలా కొట్టుకున్నారో అనాగరికంగా? ఇలాంటి సంత తెచ్చి పెట్టాడు మన పక్క ఓనర్’’ అన్నాను సంయుక్తతో.నా మాట పట్టించుకోకుండా, ‘‘ఆ కూలిపోయేలా ఉన్న ఇంట్లో ఎలా ఉంటారో పాపం. పెంకులు మార్చి పదేళ్లు అవుతోంది. వానాకాలంలో ఎలాగో వీళ్ళకు?’’ అంటూ జాలి పడింది. నేను తన మాటలు పట్టించుకోకుండా.. నా కొడుకు చేసిన లెక్కలు చూస్తూ, వాడు తప్పు చేసినప్పుడల్లా, వాడిని మందలిస్తూ, శ్రద్ధగా చదవక పోతే ముందు ముందు ఎంత కష్టపడివలసి వస్తోందో మధ్య మధ్యలో వాడికి ఉపదేశిస్తున్నాను.‘‘ఎందుకండీ వాడిని మాటి మాటికి అలా భయపెడతారు?’’ అంటూ నా మాటలకు అడ్డు తగులుతోంది.‘‘నువ్వు మాటాడకు. నీకు తెలియదు. శ్రద్ధగా చదువుకోకపోతే చాలా కష్టం, చూస్తున్నావుగా బయట ఎంత కాంపిటీషనో?’’ అంటూ తనను మాట్లాడనివ్వలేదు. బాగా చదువుకుని, సరిగ్గా సెటిల్ అవ్వకపోతే, పిల్లాడి జీవితం ఏమైపోతుందోననే భయం నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఎన్నో కుటుంబాలలో పిల్లలు సరిగా స్థిరపడక పోవడం వలన, పెద్దలు మనఃశాంతి కోల్పోవడం చూశాను. అందుకే తెలియని భయం, బెంగ, టెన్షన్. ఎంత ప్రయత్నం చేసినా ఆ భయాన్ని వీడలేకపోతుంటాను. అందుకే, జీవితంలో చాలా క్రమబద్ధంగా, జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు కూడా క్రమశిక్షణలో ఉండాలనే నా తాపత్రయం. ఎవరైనా అందుకు విరుద్ధంగా ఉంటే నాకు నచ్చరు. అందుకనే మా పక్క ఇంటి పిల్లలు హోరాహోరీ కొట్టుకోవడం చూసి నాకు వెగటు వచ్చింది. వాళ్ళను కనీసం తిట్టకుండా, గారంగా మాట్లాడి, ఆ ఇంటిపెద్ద తీసుకువెళ్ళడం నాకు అస్సలు నచ్చలేదు. కారుణ్యను వాళ్ళ ఇంటి వైపుకు వెళ్ళకుండా ఆపమని సంయుక్తకు చెప్పాలి. లేకపోతే క్రమశిక్షణ లేకుండా వీడు కూడా వాళ్ళలా తయారవుతాడు అనే మరో అదనపు భయం నాకొచ్చి చేరింది.మర్నాడు స్కూటర్ మీద ఆఫీసుకు బయలుదేరే సమయంలో, ‘‘శ్రీనివాస్ గారూ! ఆగండడాగండి! అంటూ చేతికి గుడ్డసంచి తగిలించుకుని, జేబులో చిల్లర ఎక్కడ పడిపోతుందోనని, దాని మీద చెయ్యి నొక్కిపెట్టుకుని పరుగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడు సన్యాసి. వంటిమీద మాసిపోయిన చొక్కా, మడమలపైకి పోయిన ప్యాంటు చూసిన నాకు చిరాకు వేసింది. ‘‘శ్రీనివాస్ గారు! మేము మీ పక్క ఇంట్లో కొత్తగా దిగాం. మా ఆవిడా, మీ మిస్సెస్గారు అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారు. అన్ని విషయాలు మాట్లాడేసుకున్నారు’’ అంటూ అవసరం లేకపోయినా గట్టిగా నవ్వుతూ, చేతులు పైకీ క్రిందకూ ఊపుతూ, వీధిలో అందరికీ వినబడేలా గట్టిగా మాట్లాడుతూ.. తన పేరు, ఉద్యోగం, కుటుంబ విషయాలు ఏకరువు పెడుతున్నాడు. ఆఫీసుకు టైము అవుతోందని రెండుసార్లు వాచీ చూసుకున్నాను. అయినా ఆ జీవి, గమనించలేదు. తన ధోరణి తనదే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నా ఇబ్బందిని అరుగుమీద నిలబడ్డ పార్వతి గమనించినట్టుంది.‘‘అయ్యో! ఆయనకి ఆఫీసుకు టైము అవుతున్నట్టుందండీ’’ అని మొగుడుకి హింట్ ఇచ్చింది. అప్పుడు ఆయనగారు బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. ‘‘అయ్యో మీకు టైము అవుతుందనుకుంటా, మీ ఆఫీసు కూడా మా ఆఫీసు దగ్గరే! వెడుతూ మాట్లాడుకుందాం’’ అంటూ మొహమాటం లేకుండా, నా స్కూటర్ వెనకాల ఎక్కేశాడు. ఇదేం మనిషో? అనుమతి తీసుకుని ఎక్కాలన్న కనీస కర్టసీ లేదు అని మనసులో విసుక్కుంటూ వాహనం ముందుకు పోనిచ్చాను. వెనకాల కూర్చుని, ఆఫీసు వచ్చే వరకు మాట్లాడుతునే వున్నాడు. నేను వూ కొడుతూనే ఉన్నాను. అలా మొదలయింది నా మొదటి పరిచయం సన్యాసితో... తర్వాత.. మా మధ్యలో మాటలు కాస్త పెరిగాయి అనడం కన్నా, నేను అతణ్ణి వదిలించుకోలేక పోయాను అనే చెప్పాలి. ఆసక్తి లేకపోయినా, అతని వ్యవహారశైలి గమనించడం మొదలుపెట్టాను. దరిమిలా సన్యాసికి జీవితం పట్ల ఏ మాత్రం పట్టింపు లేదని అర్థం అయ్యింది. ఖాళీగా తన ఇంటి అరుగు మీద కూర్చుని, సిగరెట్టు కాలుస్తూ, నాలుగైదు సార్లు కాఫీలు తాగుతూ వీధిలో వెడుతున్నవాళ్లను పలకరిస్తూ ఉండడం చాలాసార్లు చూశాను. ఆదివారం వస్తే చాలు. ఇంటిల్లిపాదిని తీసుకుని సినిమాకి పోయేవాడు.సమాజంలో పెరుగుతున్న జీవన ప్రమాణాలు, తగ్గిపోతున్న డబ్బు విలువ, అతనికి పట్టవా అనిపించేది.ఆర్థిక ఇబ్బందులు నాకు పెద్దగా లేనప్పటికీ,. ఎప్పుడు డబ్బు అవసరం వస్తుందో అని టెన్షన్ పడుతూనే ఉంటాను. ఆచితూచి అడుగులు వేస్తూ పొదుపుగాను, క్రమశిక్షణతో ఉండడం నా నైజం. జీవితం పట్ల బాధ్యత, భవిష్యత్తు పట్ల భయం నన్ను అలా చేసినట్టుంది. అలాంటి నాకు సన్యాసి ఒక ప్రశ్నార్థకం.పార్వతి మాటలని బట్టి, అతనికి జీతం డబ్బులు తప్ప, వేరే ఏం ఆదాయం లేదని తెలిసింది. అయినా ఈ జీవి డబ్బులు కోసం ఏనాడూ ఇబ్బంది పడుతున్నట్టు కనబడేవాడు కాదు. నన్ను ఎక్కడ అప్పు అడుగుతాడో అని భయపడుతూ ఉండేవాడిని. అందుకే అతని ఆర్థిక పరిస్థితుల గురించి అస్సలు అడిగేవాడిని కాదు.ఎప్పుడూ సంతోషంగా ఉండే అతణ్ణి చూస్తూ ఉంటే, నాలో ఎన్నో సందేహాలు రేగేవి. ఒకసారి పిచ్చి ప్రశ్న వేశానని, నాలో నేను అనుకుంటూనే, ‘‘మీ పిల్లలు ఎలా చదువుతారు సన్యాసిగారు’’ అని అడిగాను.అంతలా అల్లరి చేస్తూ, క్రమశిక్షణ లేని పిల్లలకు చదువు రాదనే నా నిశ్చితాభిప్రాయం. అతను చెప్పే లోపునే, మరో ప్రశ్న సంధించాను. ‘‘ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి! ఈ రోజుల్లో నలుగురు పిల్లలంటే మాటలా? ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? చిన్న చిన్న కుటుంబాలమైన మేమే సంసారాన్ని కష్టంగా లాగుతున్నాం. మీరు నలుగురిని ఎలా పోషిస్తున్నారా అని?’’ సందేహంగా అడిగాను. వెంటనే గట్టిగా ఒక నవ్వు నవ్వి, జేబులోంచి చార్మినార్ సిగరెట్టు తీసి నోట్లో పెట్టుకుని, అగ్గిపుల్లను పెట్టి మీద పెట్టి సర్ మని గీత గీసి చాలా స్టైల్‌గా సిగరెట్టు ముట్టించి, గుప్పున ఒక దమ్ము లాగి, ‘‘చూడు శ్రీను!’’ అంటూ, ఏకవచన సంబోధనలోకి దిగాడు అని నేను గమనించే లోపులోనే, ‘‘నువ్వు నా కన్నా చిన్నవాడివని చనువుగా అనేశానులే ఏమీ అనుకోకు’’ అని చెప్పడం మొదలుపెట్టాడు.‘‘మొదటి సంతానం ఆడపిల్ల పుట్టగానే, మా అమ్మ మగపిల్లాడు కావాలని గోల పెట్టింది. రెండవ వాడు సూరిగాడు పుట్టాడు..’’‘‘మరింకేం!’’ అన్నాను. ఎందుకు ఆపలేదు అనే ఉద్దేశంతో.‘‘ఆపరేషన్ నువ్వు చేయించుకో అంటే నువ్వు చేయించుకో అని పార్వతీ నేనూ దెబ్బలాడుకున్నాం.ఈలోగా ఒక శుభ ముహూర్తాన కవలలు పుట్టేశారు. ఏం చేస్తాం అంతా ఆ పరమాత్ముడి లీల’’ అని భళ్ళున నవ్వి గాలిలోకి చూశాడు. ఒళ్ళు మండిపోయింది అతని ధైర్యానికి.నాకు ఆ కుటుంబం అంటే పెద్ద ఇష్టం లేకపోయినా, సంయుక్తకు పార్వతి ఎంతో ఆసరాగా ఉండేది. నేను ఆ వూళ్ళో ఉండగానే, పెద్ద కూతురుకు సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు సన్యాసి. వీళ్ళ ఆర్థిక స్తోమతకు, పిల్ల పెళ్లి ఎలా చేస్తారో అనుకుంటూ ఉండేవాడిని. మిస్టరీగా ఆ ఆమ్మాయి పెళ్లి జరిగితే అది హిస్టరీగా మిగిలిపోతుంది.. నవ్వుకునే వాడిని. ‘‘కనీసం ఒక పూట భోజనం కూడా సరిగా పెట్టలేని వాళ్ళు, అల్లుడు వస్తే ఎలా చూస్తారో కదా’’ అని సంయుక్తతో అంటే. ‘‘వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడుతున్నారు. ఏ సాయం చేయకపోగా, అలా వెటకారంగా మాట్లాడడం తప్పండీ పాపం’’ అని నన్ను మందలించేది. కారుణ్యని ఐఐటీ ఫౌండేష¯Œ కి కోచింగ్ ఇప్పించాలని, ఈ వూరికి ట్రాన్స్ఫర్ అప్లై చేశాను.వెంటనే వచ్చింది. మేము వూరు విడిచి వెళ్లిపోతున్న రోజున చాలా బాధ పడిపోయారు సన్యాసి దంపతులు. సన్యాసి అయితే, ‘‘శ్రీను! నువ్వు వెళ్లిపోతుంటే నా బలం తగ్గిపోతున్నట్టుగా అనిపిస్తోందయ్యా’’ అంటూ బేలగా మాట్లాడాడు. నేను పెద్దగా స్పందించలేదు. సిటీ స్కూళ్లలో పిల్లల చదువులకు ఢోకా ఉండదని, భవిష్యత్తు బావుంటుందనే ఆనందంలో నేనున్నాను. సంయుక్త మటుకు చాలా బాధగానే, ఊరు వదిలి వచ్చింది. ఇక్కడకు వచ్చాక, నేను సన్యాసిని దాదాపు మర్చిపోయాను. సంయుక్త మటుకు చాలా కాలం పార్వతితో గడిపిన రోజులు గుర్తుకు తెచ్చుకునేది. కాలక్రమేణా కారుణ్య చదువులు పూర్తి అయ్యాయి, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదికి, రెండేళ్లకి వస్తూ ఉంటాడు.సన్యాసి కనిపించాడు అని సంయుక్తకు చెప్పలేదు. ‘‘నాకేమయ్యా బ్రహ్మాండంగా ఉన్నాను’’ అనే సన్యాసి మాటలు నా గుండెలను కోసేస్తున్నాయి. చెవులలో ఆ మాటలే రింగుమంటున్నాయి. నలుగురు పిల్లలను కనడం అనే ఊహకే భయపడే ఈ రోజుల్లో, వాళ్ళను కని, చాలీ చాలని జీతం డబ్బులతో, అంతంత మాత్రంగా చదువుతున్న పిల్లలతో, గడుపుకు వస్తున్న సన్యాసి ఈ రోజుకీ ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నాడు? ‘మర్చిపోయాను’ అనుకున్న సన్యాసి, హఠాత్తుగా కనబడి, నేను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది. నాకు సమాధానం దొరక్క చివరికి సంయుక్తను ఆశ్రయించాను.‘‘బాబయ్యగారు కనిపించారా? నాకు చెప్పనేలేదు. మీకు వాళ్ళంటే చిన్నచూపు ఇంకా పోలేదన్నమాట?’’ రుసరుసలాడింది.‘‘నాకు తెలియక అడుగుతాను. నెత్తి మీద అన్ని బాధ్యతలు పెట్టుకున్న మీ బాబాయి గారు, పిల్లలు పెద్ద అయినా ఇప్పటికీ ‘నాకేమయ్యా బ్రహ్మాండంగా ఉన్నాను’ అని మాట్లాడుతున్నాడు. ఆదేమైనా గొప్పకు మాట్లాడతాడా? లేదా పిచ్చా ?’’ అన్నాను తనతో. నాకేసి చూసి ఒక నవ్వు నవ్వి, ‘‘వాళ్ళకేం బ్రహ్మాండంగానే ఉన్నారండీ’’ అంది. నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. ‘‘ఆ రోజుల్లో వాళ్ళ బతుకేదో వాళ్ళు బతికారు పాపం. నేను కూడా పెద్ద సాయం చేసేదాన్ని కాదు. పిల్లలు అల్లరి చేస్తూ కొట్టుకుంటున్నా, వాళ్ళను ఏమీ అనకుండా, దగ్గరకు తీసుకుని, మంచి మాటలు చెప్పేవారుట బాబయ్యగారు. వాళ్ళు ఏమి అడిగినా, అప్పోసొప్పో చేసి, కొనిపెట్టేవారుట. వాళ్ళు కూడా కొంతకాలానికి బాధ్యత తెలుసుకుని, ప్రవర్తించడం మొదలు పెట్టారుట.పార్వతి పిన్నిగారు మన వీధిలో అందరికీ సాయంగా ఉండేదిగా. ఆ మంచితనం వలనే, పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకుని, ముందుకు వచ్చి, పెద్ద కూతుర్ని కోడలుగా చేసుకున్నారుట’’ చెప్పింది. నేను ఆ రోజున వాళ్ళను చిన్నచూపు చూస్తూ సంధించిన మాటల శరాలు నాకే తిరిగి గుచ్చుకున్నట్టుగా అనిపించి గిల గిలలాడాను. ‘‘పెద్ద కొడుకు సూరి , కిరాణా హోల్‌సేల్ బిజెనెస్ పెట్టి, బాగా సంపాదిస్తున్నాడుట. వాడే కమల పెళ్లి చేశాడుట. మీరు ఎప్పుడూ ఎందుకు పనికిరాడు అని తిట్టి, ఇంట్లోకి కూడా రానిచ్చేవారు కదా! ఆ చిన్న కొడుకు రాముని,.. మనిషిగా పుట్టినా ఈ జన్మభూమికి నేను చేసింది ఏమీ లేదు! నువ్వైనా డిఫెన్సులో చేరి, దేశానికి సేవ చేయమని ప్రోత్సహించారుట బాబాయిగారు. మనం ఏం తిన్నామో, ఎలా బతికామో ఎవ్వరికీ తెలియకూడదు. మనల్ని చూసి ఎవరూ జాలి పడకూడదు. అవతలివాళ్ళ దగ్గర నుండి జాలి ఆశించకూడదు. అలా ఉంటే, దేహీ అని అందర్నీ ఆడగాలనిపించి, దానికి అలవాటు పడిపోతాం. అందుకే మనం ఎన్ని కష్టాలు వచ్చి మీద పడ్డా ఎప్పుడూ సంతోషంగా కనిపించాలి’’ అని మా అమ్మ చెప్పేది అని అంటూ ఉండేవారుట. ఆయన అలా నవ్వుతూ కనబడే మనిషే కానీ, లోతైన మనిషి అండీ’’ అంది తాపీగా.‘‘నీకు వాళ్ళ విషయాలన్నీ ఎలా తెలిశాయి?’’ సందేహం ఆపుకోలేకపోయాను. ‘‘మొన్నామధ్య సోషల్ మీడియాలో రాముని చూశాను. పార్వతి పిన్నిగారి నంబర్ తీసుకున్నాను, మీకు వాళ్ళంటే ఇష్టం ఉండదు కదా! అందుకే చెప్పలేదు’’ అని అక్కడ నుండి వెళ్ళిపోయింది.‘నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను’’ గొణుక్కున్నాను. అనుకరించడానికి ప్రయత్నించే అబద్ధంతో నన్ను నేనే ఆత్మవంచన చేసుకుంటున్నట్టుగా అనిపించింది నాకు. సన్యాసి నాకు రాజర్షిలా అంతర్దర్శనం ఇచ్చాడు. ∙చాగంటి ప్రసాద్
ఫొటోలు


#PavaniReddy : రెండో పెళ్లి చేసుకున్న నటి పావని రెడ్డి... ఫోటోలు వైరల్


జమ్మూ కశ్మీర్ అతలాకుతలం.. ప్రకృతి విలయ తాండవం (ఫొటోలు)


శ్రీదేవి సోడా సెంటర్ హీరోయిన్ ఆనంది లేటెస్ట్ ఫోటో గ్యాలరీ


'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)


హైదరాబాద్ : గచ్చిబౌలిలో తారల సందడి (ఫొటోలు)


ఆస్ట్రేలియాలో చిల్ అవుతోన్న సచిన్ కూతురు సారా టెండూల్కర్ (ఫోటోలు)


చిచ్చరపిడుగు.. సిక్సర్‌తో ఆగమనం! తగ్గేదేలే.. (ఫొటోలు)


ఇటలీ కుర్రాడితో హీరో అర్జున్ కూతురి నిశ్చితార్థం (ఫొటోలు)


Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 20-27)


కేజీఎఫ్ బ్యూటీ చేతిలో చంటిపాప.. మనసు నిండిపోయిందంటూ..
అంతర్జాతీయం

ఉల్కాపాతపు వెలుగులు
అంతరిక్ష వీక్షకులకు మరో రెండు రోజుల్లో పండుగే. లైరైడ్ ఉల్కాపాతం వారికి కావాల్సినంతగా కనువిందు చేయనుంది. ఉత్తరార్ధ గోళంలోని వారు ఏప్రిల్ 22న తెల్లవారుజాము నుంచి కనీసం రెండు రోజుల పాటు ఈ ఖగోళ అద్భుతాన్ని తనివితీరా ఆస్వాదించవచ్చు. మబ్బుల వంటివేమీ లేకుండా వాతావరణం పొడిగా, వీలైనంత చీకటిగా ఉంటే చాలు. గంటకు కనీసం 10 నుంచి 20 దాకా ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించి ప్రకాశవంతంగా మండిపోతూ కని్పస్తాయి. ఒక్కోసారి వాటి సంఖ్య గంటకు 100 దాకా కూడా ఉంటుంది. ఈ వార్షిక ఖగోళ వింత సాధారణంగా ఏప్రిల్ 20 తర్వాత ఏర్పడుతూ ఉంటుంది. ఏమిటి ఇవి: ఏటా భూమిని పలకరించే ఈ ఉల్కలను లైరైడ్స్గా పిలుస్తారు. వీటి మూలాలు లైరా నక్షత్రరాశిలో ఉండటమే అందుకు కారణం. అక్కడినుంచి పుట్టుకొచ్చిన థాచర్ అనే తోకచుక్క ఈ ఉల్కలకు మాతృస్థానం. థాచర్‌ను 1861లో తొలిసారిగా గుర్తించారు. ఇది సూర్యుని చుట్టూ 415 ఏళ్లకు ఓసారి చొప్పున తిరుగుతుంటుంది. ఆ క్రమంలో ఏటా ఏప్రిల్ చివర్లో భూమికి అతి సమీపంగా వస్తుంది. అప్పుడు దాని తోక తాలూకు శిథిలాలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంటాయి. కొన్ని అనామకంగా అదృశ్యమైపోతాయి. మరికొన్ని మాత్రం ప్రకాశవంతంగా మండిపోతూ అందమైన వెలుతురు వలయాలను సృష్టిస్తాయి. అందుకే వీటిని తారా సమూహంగా కూడా పిలుస్తుంటారు. ఎప్పుడు చూడొచ్చు: ఏప్రిల్ 22 తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య సమయంలో లైరైడ్స్ను వీక్షించేందుకు అత్యంత అనువైనది. ఆ సమయంలో వాటి సంఖ్య, వెలుతురు రెండూ గరిష్టంగా ఉంటాయి. – సాక్షి, నేషనల్ డెస్క్

బుల్లెట్‌కు బలైన భారతీయ విద్యార్థిని
న్యూయార్క్/తరన్ తారన్(పంజాబ్): ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి అక్కడ అనూహ్య ఘటనల్లో భారతీయులు ప్రాణాలు కోల్పోతున్న విషాద పర్వానికి ముగింపు కనిపించట్లేదు. తాజాగా కెనడాలో రెండు వాహనాల్లోని వ్యక్తుల మధ్య జరిగిన కాల్పుల ఘటనల్లో అభం శుభం తెలియని ఒక భారతీయ విద్యార్థిని బుల్లెట్ గాయాలకు బలైంది. పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లా ధుండా గ్రామానికి చెందిన 21 ఏళ్ల హర్సిమ్రత్ కౌర్ రంధావా కెనడాలో కాల్పుల ఘటనలో మృతిచెందారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఒంటారియో ప్రావిన్సులోని హామిల్టన్ నగరంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతి వార్త తెల్సి పంజాబ్‌లోని సొంతూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని వెంటనే భారత్‌కు తరలించాలని, నిందితులను కఠినంగా శిక్షించేలా కెనడా సర్కార్‌పై భారత ప్రభుత్వం ఒత్తిడితేవాలని సిమ్రత్ కుటుంబసభ్యులు డిమాండ్‌చేశారు. అసలేం జరిగింది? ఉన్నత విద్య కోసం సిమ్రత్ రెండేళ్ల క్రితం కెనడాకు వెళ్లారు. అక్కడ మొహాక్ కాలేజీలో చదువుకుంటున్నారు. రోజులాగే బుధవారం రాత్రి తాత్కాలిక ఉద్యోగం చేసే చోటుకు వెళ్లేందుకు హ్యామిల్టన్‌లోని అప్పర్ జేమ్స్, సౌత్ బెండ్ రోడ్ వీధిలోకి వచ్చారు. అక్కడే ఉన్న బస్టాప్‌లో నిల్చుని బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న రెండు వాహనాల్లోని వ్యక్తులు పరస్పరం గన్లతో కాల్పులు జరుపుకున్నారు. ఈ సందర్భంలో వేరే దిశలో దూసుకొచ్చిన ఒక బుల్లెట్ సిమ్రత్ ఛాతీలోకి దూసుకెళ్లింది. దీంతో విపరీతంగా రక్తమోడుతూ అక్కడే కుప్పకూలారు. విషయం తెల్సి అక్కడికొచ్చిన పోలీసులు ఈమెను వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. తుపాకీ బుల్లెట్లు సమీపంలోని ఇంట్లోకి సైతం దూసుకెళ్లాయి. వీడియోలు ఉంటే ఇవ్వండి ఘటనపై హ్యామిల్టన్ పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలెట్టారు. నిందితుని కోసం వేట మొదలెట్టారు. కాల్పుల తర్వాత ఆ రెండు వాహనాలు వెంటనే ఘటనాస్థలి నుంచి వెళ్లిపోయాయని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. వాస్తవంగా ఏం జరిగిందని తెల్సుకునేందుకు సీసీటీవీ వంటి వీడియో ఫుటేజీలను సంపాదించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో అదే రోడ్లో వెళ్తున్న వాహనాల్లోని డ్యాష్‌క్యామ్ కెమెరా రికార్డులను ఇవ్వాలని స్థానికులను పోలీసులు కోరారు. భారతీయ విద్యార్థి మృతి పట్ల విదేశాంగ శాఖ తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ఈ మేరకు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘కాల్పుల్లో అమాయక భారతీయురాలు ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం. సిమ్రత్ కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహం తరలింపుసహా అన్నిరకాల సహాయసహకారాలు ప్రభుత్వం నుంచి అందుతాయి’’అని పేర్కొంది.

మూడో దశ చర్చలు 26న
రోమ్: అణు కార్యక్రమాలను ఇరాన్ మరింతగా వేగవంతం చేసిన నేపథ్యంలో ఆ దేశంతో అమెరికా మొదలెట్టిన రెండో దఫా చర్చలు శనివారం రోమ్‌లో ముగిశాయి. తొలి దఫా చర్చలు ఒమన్‌లో ముగియగా రెండో రౌండ్ చర్చలు ఇటలీ వేదికగా శనివారం జరిగాయి. ఇటలీ రాజధాని రోమ్ నగరానికి సమీపంలోని క్యామిలూసియా ప్రాంతంలోని ఒమన్ రాయబార కార్యాలయంలో ఈ పరోక్ష చర్చలు జరిగాయి. అమెరికా తరఫున అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగీ్చలు చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చలకు ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైదీ మధ్యవర్తిగా వ్యవహరించారు. అయితే రెండోదఫా చర్చల్లో ఎలాంటి పురోగతి ఉందనే వివరాలను ఇరుదేశాలు వెల్లడించలేదు. అయితే ఏప్రిల్ 26వ తేదీన ఒమన్‌లో స్టీవ్ విట్కాఫ్తో మూడో దఫా చర్చలు జరగనున్నాయని ఇరాన్ మంత్రి అబ్బాస్ చెప్పారు. ‘‘ఇరాన్ గొప్పగా, సుసంపన్నంగా ఉంటే సరిపోతుంది. అణ్వాస్త్ర సామర్థ్యంతో పనిలేదు. ఆ సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవడమే మా లక్ష్యం’’అని ట్రంప్ శుక్రవారం వ్యాఖ్యానించారు. ‘‘మేం ఎల్లప్పడూ బాధ్యతాయుతంగానే మెలిగాం. సమస్యలకు దౌత్యమార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నాం. సంపత్రింపులు కొనసాగుతాయి’’అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ శనివారం తన ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. చర్చలు ముందు ఇరాన్ మంత్రి అరాగ్చీ ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీతో భేటీ అయ్యారు. తదుపరి చర్చల్లో రష్యా సైతం భాగస్వామి కానుందని వార్తలొచ్చాయి.

మనిషి.. మరమనిషి సై
మనిషికి దీటుగా కృత్రిమ మేధ ఆన్లైన్లో అసాధారణ ప్రతిభ చూపిస్తుంటే ఆఫ్‌లైన్‌లో అంటే ప్రత్యక్షంగా హ్యూమనాయిడ్ రోబోలు మనిషికి సవాల్ విసురుతున్నాయి. అనుకున్నదే తడవుగా పరుగుపందెంలో పోటీకి దిగి తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాయి. కృత్రిమ మేధ సాంకేతికతలో అధునాతన ఆవిష్కరణలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే 21 హ్యూమనాయిడ్ రోబోలు 21 కిలోమీటర్ల పరుగుపందెంలో మనుషులతో పోటీగా పరిగెత్తి శెభాష్ అనిపించుకున్నాయి. మానవులతో సమానంగా పరుగుకు ప్రయత్నించడంతో ప్రపంచంలోనే తొలి హ్యూమనాయిడ్ రోబో హాఫ్ మారథాన్‌గా ఈ కార్యక్రమం చరిత్రకెక్కింది. చైనాలోని బీజింగ్ నగరంలో శనివారం ఈ రోబోలు చేసిన హడావుడి అంతాఇంతా కాదు. మనిషి సృష్టించిన మరమనిషి.. మనిషితోనే పోటీకి సై అనడం చూసేందుకు జనం తండోపతండాలుగా విచ్చేశారు. వాటితో కలిపి సెలీ్ఫలు, వీడియోలు తీసుకున్నారు. ట్రాక్‌పై పరుగెడుతున్న రోబోలను ఉత్సాహపరుస్తూ జనం విజిల్స్ వేస్తూ చప్పట్లు కొట్టారు. అమెరికా రోబోటిక్స్ కంపెనీలతో పోటీపడుతూ హ్యూమనాయిడ్ రోబోల రంగంలో ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్న తరుణంలో దేశ రాజధాని బీజింగ్‌లో ఇజువాంగ్ హాఫ్ మారథాన్‌ను నిర్వహించడం గమనార్హం. ఫార్ములా 1 తరహాలో.. ఫార్ములా 1 కార్ల రేసులో మార్గమధ్యంలో కార్ల టైర్లు పాడైతే వెంటనే ట్రాక్ పక్కనే హఠాత్తుగా ఆపేస్తారు. అక్కడున్న సిబ్బంది సెకన్ల వ్యవధిలో టైర్లు మార్చేసి వెంటనే రేస్‌ను కొనసాగించడానికి సాయపడతారు. శనివారం రోబోట్ల హాఫ్ మారథాన్లోనూ ఇదే నియమం పాటించారు. వేగంగా పరుగెత్తే రోబోల బ్యాటరీలు పాడైనా, చార్జింగ్ అయిపోయినా నిట్టనిలువుగా అక్కడే ఆగిపోకుండా పక్కనే స్టాప్పాయింట్లను సిద్ధంచేశారు. అక్కడ వెంటనే బ్యాటరీలను మార్చుకుని రోబోలు పరుగు కొనసాగించాయి. ఒకదానితో మరోటి ఢీకొనకుండా ఉండేందుకు మొదట్లోనే వీటిని సమాంతరంగా 1–2 మీటర్ల దూరంలో నిలబెట్టి పోటీని ప్రారంభించారు. ఎన్నెన్నో సైజులు, ఆకారాలు బీజింగ్ ఎకనామిక్–టెక్నలాజికల్ డెవలప్మెంట్ ఏరియాలో జరిగిన ఈ రేసులో ఒకే డిజైన్‌తో కాకుండా భిన్న పరిమాణాల్లో వేర్వేరు ఆకారాల్లో ఉన్న హ్యూమనాయిడ్ రోబోలు పాల్గొన్నాయి. మారథాన్ పూర్తయ్యాక ఆయా రోబోట్ల తయారీ కంపెనీలు, విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు నిర్వాహకులు పలు విభాగాల కింద అవార్డులు అందజేశారు. ‘అత్యంత పోటీతత్వం’, ‘గొప్ప డిజైన్’, ‘అత్యంత వినూత్న తరహా రోబో’ఇలా పలు అవార్డ్లు ప్రదానం చేశారు. 2 గంటల 40 నిమిషాల్లో ఫినిషింగ్ లైన్‌కు.. ఈ పోటీలో చైనాలోని పలు ప్రముఖ హ్యూమనాయిడ్ రోబో కంపెనీలు, విశ్వవిద్యాలయాలు పోటీపడ్డాయి. తమ అధునాతన రోబోలను రంగంలోకి దింపాయి. ప్రతి రోబోకి ఒక రిమోట్ ఆపరేటర్, ఒక సహాయకుడు వెంటే పరుగెత్తారు. బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న రోబోట్ ఇన్నోవేషన్ సెంటర్ వారి ‘తియాన్‌గాంగ్ అల్ట్రా’రోబో వేగంగా దూసుకొచ్చి విజేతగా నిలిచింది. 21 కిలోమీటర్ల పరుగుపందాన్ని కేవలం 2 గంటల 40 నిమిషాల్లో పూర్తిచేసి ఔరా అనిపించింది. ‘‘మనిషిలాగా ఈ రోబోకు పొడవైన కాళ్లను అమర్చాం. మనిషిలా ఒక పద్ధతిగా పరుగెత్తేలా ప్రత్యేక అల్గారిథమ్‌ను ఇందులో సెట్‌చేశాం. అందుకే గెలుపు సాధ్యమైంది’’అని దీని తయారీసంస్థ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ చీఫ్ టెక్నాలజీ అధికారి టాంగ్ జియాన్ చెప్పారు. హాఫ్ మారథాన్‌లో పురుషుల విభాగంలో 12,000 మంది పాల్గొనగా ఇథియోపియాకు చెందిన ఎలియాస్ దెస్తా అందరికంటే వేగంగా ఒక గంట రెండు నిమిషాల్లో మారథాన్‌ను పూర్తిచేసి విజేతగా నిలిచాడు. ఫిబ్రవరినెలలో హాఫ్ మారథాన్‌లో ప్రపంచ పరుగువీరుడు, ఉగాండా అథ్లెట్ జాకబ్ కిప్లిమో ఇదే 21 కి.మీ.ల హాఫ్ మారథాన్‌ను కేవలం 56 నిమిషాల్లో పూర్తిచేయడం తెల్సిందే. ఇక్కడ పరుగు ముఖ్యం కాదు..! ‘‘ఇక్కడ కేవలం సరళరేఖ మార్గంలో పరుగు పందెం ముఖ్యం కాదు. అంతకుమించినవి ఎన్నో ఉన్నాయి. రోబోలు వేగంగా పరుగెత్తేటప్పుడు కూడా స్థిరంగా ఉండగల్గడం, ట్రాక్‌పై మలుపుల వద్ద తూలిపడిపోకుండా చూసుకోవడం, ట్రాక్‌పై జారిపోయే స్వభావం ఉన్న చోట జాగ్రత్తగా పరుగెత్తడం, ఎత్తుపల్లాలున్న చోట్ల వేగాన్ని అందుకు తగ్గట్లు మార్చుకోవడం వంటివన్నీ కీలకం. ఎంత వేగంతో వెళ్తే ఎంత బ్యాటరీ అయిపోతుంది?. గజిబిజి పరుగులో రోబో భాగాలు వదులుకాకుండా చూసుకోవడం వంటివన్నీ ముఖ్యమే’’అని బీజింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఇన్నోవేషన్ సెంటర్ సీఈఓ జియాంగ్ యూజువాన్ చెప్పారు. చైనాలో హ్యూమనాయిడ్ రోబోల మార్కెట్ మరో ఐదేళ్లలో ఏకంగా 119 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని ఓ అంచనా. ‘‘రోబోల మారథాన్ ఇక్కడితో ముగిసినా హ్యూమన్ టెక్నలాజికల్ అభివృద్ధి శకం ఇక్కడితోనే మొదలుకానుందనే చెప్పాలి. నేటి స్ఫూర్తితో మరిన్ని సంస్థలు ఈ రంగంలో ముందుకొస్తాయి. భవిష్యత్ హ్యూమనాయిడ్ శకానికి ఇది నాంది’’అని ఇజువాంగ్ స్థానిక యంత్రాంగం కమిటీ డిప్యూటీ డైరెక్టర్ లియాంగ్ లెయాంగ్ వ్యాఖ్యానించారు. – బీజింగ్
జాతీయం

సుప్రీంకోర్టుపై బీజేపీ నేతల వ్యాఖ్యలు.. జేపీ నడ్డా ఏమన్నారంటే?
ఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై బీజేపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై బీజేపీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ సీరియస్‌గా దృష్టి సారించింది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించి.. ఇలాంటి వ్యాఖ్యలను బీజేపీ తిరస్కరిస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.ఈ నేపథ్యంలో జేపీ నడ్డా ట్విట్టర్ వేదికగా..‘భారత న్యాయవ్యవస్థ, భారత ప్రధాన న్యాయమూర్తిపై ఎంపీలు నిషికాంత్ దూబే, దినేష్ శర్మ చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. ఇది వారి వ్యక్తిగత వ్యాఖ్యలు. వారితో బీజేపీ ఏకీభవించదు. అలాంటి వ్యాఖ్యలకు ఎప్పుడూ మద్దతు ఇవ్వదు. బీజేపీ వాటిని పూర్తిగా తిరస్కరిస్తుంది. సుప్రీంకోర్టుతో సహా అన్ని కోర్టులు మన ప్రజాస్వామ్యంలో విడదీయరాని భాగమని బీజేపీ ఎల్లప్పుడూ న్యాయవ్యవస్థను గౌరవిస్తుంది. కోర్టుల సూచనలు, ఆదేశాలను సంతోషంగా అంగీకరించింది’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. వక్ఫ్ సవరణ చట్టం, బిల్లులపై రాష్ట్రపతికి గడువు విషయంలో ఇప్పటికే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఇంతలోనే మరో బీజేపీ నేత, లోక్‌సభ సభ్యుడు నిశికాంత్ దూబే సర్వోన్నత న్యాయస్థానంపై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.भाजपा सांसद निशिकांत दुबे और दिनेश शर्मा का न्यायपालिका एवं देश के चीफ जस्टिस पर दिए गए बयान से भारतीय जनता पार्टी का कोई लेना–देना नहीं है। यह इनका व्यक्तिगत बयान है, लेकिन भाजपा ऐसे बयानों से न तो कोई इत्तेफाक रखती है और न ही कभी भी ऐसे बयानों का समर्थन करती है। भाजपा इन बयान…— Jagat Prakash Nadda (@JPNadda) April 19, 2025సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంటు భవనాన్ని మూసుకోవాల్సిందే అంటూ నిశికాంత్ దూబే వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు శాసనాధికారాల్లోకి న్యాయస్థానాలు చొరబడుతున్నాయని, చట్టసభ్యులు చేసిన చట్టాలను కొట్టివేస్తున్నాయని విమర్శించారు. జడ్జీలను నియమించే అధికారం ఉన్న రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఆదేశాలిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో అధికరణం 368 ప్రకారం చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందన్నారు. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగలదని, పార్లమెంటుకు మాత్రం కాదని తెలిపారు. పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ (సవరణ) బిల్లు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

పెళ్లిపీటలపై వధువు తల్లి.. అప్పుడే మొదలైంది అసలు కథ!
లక్నో: ఓ పెళ్లి పందిరిలో ఘరానా మోసం వెలుగు చూసింది. వధువు బదులు ఆమె తల్లి పెళ్లి పీఠలెక్కింది. పెళ్లి తంతులో వధువు తన అసలు పేరు బదులు మరో పేరు పలకడంతో పక్కనే ఉన్న వరుడికి అనుమానం వచ్చింది. ముసుగు తొలగించి చూడగా.. అసలు విషయం బయటపడింది. దీంతో తాను మోసపోయానని వరుడు గ్రహించాడు. వధువు బదులు ఆమె తల్లి ఎందుకు ఉందని ప్రశ్నించారు. వధువు తరుఫు కుటుంబ సభ్యులు బెదిరించడంతో పెళ్లి పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది.పోలీసుల వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్ (uttar pradesh) మీరట్‌లో (meerut) బ్రహ్మపురికి చెందిన వరుడు (22)కు శామలీ జిల్లావాసి వధువు (21)తో పెళ్లి కుదిరింది. కుదుర్చుకున్న సమయానికి పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు సిద్ధమయ్యారు. పెళ్లి తంతు మొదలైంది. అయితే, సరిగ్గా అప్పుడే వధువు తన పేరు చెప్పాల్సి ఉంది. బదులుగా ఆమె తల్లి పేరు చెప్పింది. ఇదేంటని బిత్తరపోయిన పెళ్లి కొడుకు వధువు ధరించిన ముసుగును తొలగించాడు.అంతే, వధువు బదులు ఆమె తల్లి ఉందని చూసి కంగుతిన్నాడు. ఇదే విషయాన్ని పెళ్లి పెద్దల్ని ప్రశ్నించాడు. పెళ్లి పెద్దలు సైతం వధువు తల్లికి మద్దతు పలికారు. వధువు తల్లిని పెళ్లి చేసుకోవాల్సిందేనని వరుడిని హెచ్చరించారు. లేదని అల్లరి చేస్తే రేప్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. తాను పూర్తిగా మోసపోయానని గ్రహించిన వరుడు పోలీసుల్ని ఆశ్రయించాడు.‘నాకు వధువు బదులు ఆమె తల్లిని ఇచ్చి పెళ్లి చేసేందుకు కుట్ర చేశారు. పెళ్లి కోసం రూ.5లక్షలు ఖర్చు చేశా. మీరే న్యాయం చేయండి’ అంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

‘దిశ’ తరహా ఘటన.. పెళ్లికి వెళ్లడమే ఆమె పాలిట శాపమైంది!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దిశ తరహా ఘటన లక్నోలో వెలుగుచూసింది. కదులుతున్న కారులో ఓ మహిళపై అత్యాచారయత్నం చేశారు ముగ్గురు దుండగులు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో.. కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.వివరాల ప్రకారం.. లక్నోలోని బెహాసా గ్రామానికి చెందిన ఛాయా(26) బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో లక్నోకు చెందిన సుధాన్షు అనే వ్యక్తి.. తన ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా మేకప్ కోసం రావాలని ఛాయాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె తన ఇంటికి వచ్చేందుకు కారును కూడా పంపాడు. కారులో అజయ్, వికాస్, ఆదర్శ్ కలిసి వెళ్లారు. దీంతో, ఛాయ తన సోదరి పాలక్‌తో కలిసి.. సుధాన్షు ఇంటికి బయలుదేరింది. వివాహ వేడుకల్లో పాల్గొన్న కారణంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో తాను ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో కారులో ఆమె ఇంటికి వెళ్తున్న సమయంలో అజయ్, వికాస్, ఆదర్శ్.. ఛాయా ఆమె సోదరి పాలక్‌పై అత్యాచారయత్నం చేశారు. కదులుతున్నా కారులో లైంగిక వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో ప్రతిఘటించడంతో ఛాయాపై కత్తితో దాడి చేశారు. ఈ సందర్భంగా వేగంతో వెళ్తున్న కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో, కారు బోల్తా పడటంతో పాలక్.. తమకు సాయం చేయాలని గట్టిగా అరిచింది.అనంతరం, అక్కడి నుండి ముగ్గురు నిందితులు పారిపోతూ పాలక్‌ను బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని హెచ్చరించారు. తర్వాత వారు ముగ్గురు పారిపోయారు. అది గమనించిన స్థానికులు.. వెంటనే ఛాయ, పాలక్‌ను ఆసుపత్రికి తరలించగా.. ఛాయ మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో, ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. వికాస్, ఆదర్శ్‌ను అరెస్ట్ చేయగా.. అజయ్ ఇంకా పరారీలో ఉన్నాడు. అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు ఏసీపీ వికాస్ పాండే తెలిపారు. ब्रेकिंग लखनऊ ब्यूटीशियन छाया की दुष्कर्म के प्रयास में हत्यातीन युवको ने ब्यूटीशियन के साथ की छेड़छाड़ छेड़छाड़ का विरोध करने पर हत्या एक आरोपी गिरफ्तार, दो फरार #BREAKING #Lucknow #Murder #RapeAttempt #indiavoice pic.twitter.com/W4ppJOskGW— India Voice (@indiavoicenews) April 19, 2025

ఢిల్లీ వెళ్లాల్సిన విమానం జైపూర్‌లో ల్యాండ్.. సీఎం ఒమర్ అబ్దుల్లా ఫైర్
ఢిల్లీ: ఇండిగో విమానం ఆలస్యంపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం వాతావరణం అనుకూలించక.. జైపూర్‌లో ల్యాండ్ కావడంపై తీవ్ర అసహనం వ్యక్త పరిచారు. ఈ క్రమంలో సెల్ఫీ తీసుకుని.. పరుష పదజాలంతో తన బాధను చెప్పుకొచ్చారు.వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం రాత్రి ఇండిగో విమానంలో ఢిల్లీలోకి బయలుదేరారు. ఈ సమయంలో ఢిల్లీలో వాతావరణం అనుకూలించకపోవడంతో, విమానాశ్రయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో సదరు ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. దీంతో, విమానం రాజస్థాన్‌లోని జైపూర్ ల్యాండ్ అయ్యింది. దాదాపు నాలుగు గంటల తర్వాత మళ్లీ విమానం.. ఢిల్లీ చేరుకుంది. ఈ నేపథ్యంలో విమానం ఆలస్యం కావడంపై సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. జమ్ము నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం దాదాపు మూడు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఢిల్లీ విమానాశ్రయంలో దిగాల్సిన విమానం.. జైపూర్‌లో ల్యాండ్ అయ్యింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నేను విమానం మెట్లపై నిలుచుని మాట్లాడుతున్నాను. స్వచ్ఛమైన గాలిని పొందుతున్నాను. ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతామో నాకు తెలియదు. ఢిల్లీ విమానాశ్రయం బ్లడీ షిట్ షో అంటూ పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల విషయంలో వీరి అలసత్వం చూస్తుంటే.. సహనం కోల్పోతున్నామని.. మర్యాదగా మాట్లాడే పరిస్థితుల్లో కూడా తాను లేనని అన్నారు. Delhi airport is a bloody shit show (excuse my French but I’m in no mood to be polite). 3 hours in the air after we left Jammu we get diverted to Jaipur & so here I am at 1 in the morning on the steps of the plane getting some fresh air. I’ve no idea what time we will leave from… pic.twitter.com/RZ9ON2wV8E— Omar Abdullah (@OmarAbdullah) April 19, 2025దాదాపు మూడు గంటల తర్వాత ఒమర్ అబ్దుల్లా మరో పోస్టులో స్పందిస్తూ..‘ఎవరైనా ఆలోచిస్తుంటే, నేను తెల్లవారుజామున 3:00 గంటల తర్వాత ఢిల్లీకి చేరుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ప్రతికూల వాతావరణం కారణంగా శనివారం శ్రీనగర్ విమానాశ్రయంలో ఆరు విమానాలు రద్దు అయినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగినందువల్ల ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల తరబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని ప్రభావం ఇతర కనెక్టింగ్ విమానాలపై కూడా పడినట్లు తెలుస్తోంది. ఈ అసౌకర్యంపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ.. తమ బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని.. జమ్మూలో భారీ వర్షాలు, వడగళ్లు కురవడం వల్ల ఈ అంతరాయం కలిగిందని తెలిపింది. వాతావరణం మెరుగైన వెంటనే తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తామని పేర్కొంది.
ఎన్ఆర్ఐ

హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
హాంకాంగ్‌లో ఉగాది వేడుకలు తెలుగు కుటుంబాలకు యెంతో ఉత్సాహాన్నిచ్చాయి, తెలుగు సంవత్సరాదిని ఐక్యతతో, సాంస్కృతిక సంపదతో జరుపుకుంన్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) నిర్వహించే ఈ కార్యక్రమం, అనధికారికంగా ఇరవై రెండు సంవత్సరాలుగా మరియు పదమూడు సంవత్సరాల అధికారిక సంస్థగా తెలుగు సేవ కొనసాగిస్తోంది. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్‌లో సుదీర్ఘ వారాంతం సెలవలు ఉన్నప్పటికీ, విశేషమైన సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హాంకాంగ్ & మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి కాన్సుల్ శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు; హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి శ్రీ మొక్ మాంగ్-చాన్ గారు; ఎన్.ఎ.ఎ.సి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి కోనీ వాంగ్ గారు; మరియు హాంకాంగ్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నత అధికారి శ్రీ దేవేష్ శర్మ గారు హాజరయ్యారు.చీకటిని పారద్రోలడానికి మరియు కొత్త ప్రారంభాలను స్వాగతించడానికి ప్రతీకగా గౌరవనీయ అతిథుల దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమైంది. ప్రార్థన తర్వాత, హాజరైన వారిని "మా తెలుగు తల్లి" శ్రావ్యమైన పాట ఆకట్టుకుంది,తెలుగుతనాన్ని ప్రేక్షక హృదయాలలో ప్రతిధ్వనించింది. ప్రముఖుల ప్రసంగాలు సమాజ ప్రయాణం మరియు దాని సభ్యులను బంధించే లక్ష్యం గురించి ప్రతిబింబించాయి. శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు తెలుగు భాష మరియు సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటిస్తూ ఇది భావితరాలికి అందించాల్సిన కర్తవ్య ప్రాముఖ్యతని గుర్తుచేశారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్ కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.తన ప్రసంగంలో, తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు హాంకాంగ్‌లోని తెలుగు వారిలో ఒక అనుబంధ భావన మరియు సంబంధాన్ని సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థ ప్రయాణం మరియు దాని లక్ష్యం గురించి ప్రతిబింబించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆమె యెంతో అవసరం అని చెప్పారు. హాంకాంగ్ మరియు భారతదేశంలోని వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.వినోదాత్మక స్కిట్ వైవిధ్యమైన ప్రదర్శనలను సజావుగా అనుసంధానించింది, ప్రేక్షకుల హర్షధ్వానాలు - కరతాళధ్వనులతో సాంస్కృతికోత్సవం ముగిసింది. ప్రదర్శలిచ్చిన కళాకారులను కాన్సల్ శ్రీ కూచిభొట్ల వెంకట్ రమణ గారు పురస్కరాలు అందజేస్తూ అభినందించారు.హాంకాంగ్‌లోని తెలుగు సమాజం శ్రీ విశ్వవాసు నామ ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్నందున, తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తూ సాంప్రదాయ ఉగాది పచ్చడితో, తెలుగు భోజనంతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం సమాజం యొక్క ఐక్యత, సేవా స్ఫూర్తికి నిదర్శనం, స్నేహం మరియు సేవా బంధాలను పెంపొందించడం, ఆనందం, విజయం మరియు సద్భావనతో నిండిన సంవత్సరాన్ని వాగ్దానం చేయడం మరియు తెలుగు ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం తార్కాణం.అధ్యక్షురాలు తన కృతజ్ఞతా ప్రసంగంలో,గౌరవనీయులైన అతిథులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సమాఖ్య సభ్యులు, స్నేహితులు మరియు తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

రాజాంలో విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం లో విద్యార్ధులకు ఉపకారవేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీశ్ గంథం తన సొంత ఊరికి చేతనైన సాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాంలోని శ్రీ విద్యానికేతన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సతీశ్ గంథం విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. అలాగే ఇక్కడే మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొని సతీశ్ గంథం సేవా నిరతిని ప్రశంసించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీష్ గంథం చూపిన చొరవను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు ప్రత్యేకంగా అభినందించారు.

డల్లాస్‌లో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం
అమెరికాలో సామాజిక బాధ్యత పెంచే కార్యక్రమాలను నాట్స్ తరచూ చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని డల్లాస్‌లోని ఫ్రిస్కో నగరంలో చేపట్టింది. డల్లాస్ నాట్స్ విభాగం ఆధ్వర్యలో ప్రిస్కోలోని మోనార్క్ పార్క్‌లో 50 మందికి పైగా నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్ధులు పాల్గొని పార్క్‌ని శుభ్రం చేశారు. ప్రకృతిని కాపాడేందుకు, శుభ్రతను ప్రోత్సహించేందుకు అడాప్ట్ ఎ పార్క్ వంటి కార్యక్రమాలు ఎంతో మేలును కలిగిస్తాయని, పార్కులను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణ హితమైన జీవనశైలికి మార్గం సుగమం అవుతుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు నాట్స్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం ద్వారా విద్యార్ధుల సేవను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వినియోగించి పార్కును శుభ్రపరిచారు. చెత్తను తొలగించారు. చెట్లకు నీరు పట్టారు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడ్డారు. విద్యార్ధులకు ఇది ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే గొప్ప అనుభవంగా మిగులుతుందని డల్లాస్ చాప్టర్ వ్కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రెజరర్ రవి తాండ్ర, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె, నాట్స్ సభ్యులు శివ మాధవ్, బద్రి, కిరణ్, పావని, శ్రీ దీపిక, ఉదయ్, వంశీ, వీరా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! రేపటి తరంలో సామాజిక బాధ్యత పెంచే అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన డల్లాస్ చాప్టర్ జట్టుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి తమ అభినందనలు తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో టంపాలో జరిగే 8 వ అమెరికా తెలుగు సంబరాలకు డల్లాస్‌లో ఉండే తెలుగువారంతా తరలిరావాలని కోరారు.

30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
గత మూడు దశాబ్దాల సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.....“విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా వంగూరు ఫౌండేషన్ ఎంపిక చేసి విజేతల వివరాలను ప్రకటించింది. అలాగే విజతలకు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు అభినందనలు తెలిపారు.వంగూరు ఫౌండేషన్ ప్రకటనఅమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఖతార్, చెకొస్లొవేకియా, అబుదాభి, బోస్ట్వానా, దుబై తదితర ప్రాంతాల నుండి ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. చేయి తిరిగిన రచయితలు, ఔత్సాహిక రచయితలూ అనేక మంది ఈ పోటీ కాని పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్ని రచనలకూ సర్వ హక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అందుబాటులో ఉన్న విజేతల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఏప్రిల్ 13, 2025 నాడు శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక, హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" లో ఆహూతుల సమక్షంలో బహూకరిస్తాం.30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలుప్రధాన విభాగం – 30వ సారి పోటీఉత్తమ కథానిక విభాగం విజేతలు“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)ప్రశంసా పత్రాలు‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TXఉత్తమ కవిత విభాగం విజేతలు“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI)ప్రశంసా పత్రాలు“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా “వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India-
క్రైమ్

వివాహేతర సంబంధం.. వాట్సప్ స్టేటస్‌లో ప్రియురాలి ఫొటో..
అచ్చంపేట (మహబూబ్‌నగర్): పట్టపగలే ఓ వ్యక్తిపై గొడ్డలి, సుత్తితో దాడిచేసి హతమార్చిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 15న అచ్చంపేట మండలం నడింపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై చోటు చేసుకున్న హత్య కేసు వివరాలను శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాసులుతో కలిసి ఏఎస్పీ రామేశ్వర్ వెల్లడించారు. వివరాలిలా.. నడింపల్లి గ్రామానికి చెందిన బూరం వీరయ్య చిన్న కుమారుడు పరమేశ్ అదే గ్రామానికి చెందిన సుగూరు మహేశ్ భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. గత నెల 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా గురుజాలకు ఆమెను తీసుకెళ్లాడు. తన భార్య అదృశ్యంపై అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో భర్త మహేశ్ ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న మహేశ్ బంధువులు గురుజాలకు వెళ్లి పరమేశ్‌పై దాడిచేసి సదరు మహిళను ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత పరమేశ్ వైఖరిలో మార్పు రాక పోవడం.. వాట్సప్ స్టేటస్‌లో ఈ నెల 15న మహిళతో ఉన్న ఫొటోలను పెట్టాడు. ఈ క్రమంలో భర్త మహేశ్ అదే గ్రామానికి చెందిన పదిర శివ, ఎడ్ల మహేశ్‌లతో కలిసి పరమేశ్ కుటుంబ సభ్యులను హత్య చేసేందుకు పథకం రచించారు. ఈ నెల 15న అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్‌పై వెళ్తున్న పరమేశ్ తండ్రి బూరం వీరయ్య, సోదరుడు వెంకటేశ్ ను కారు, బైక్‌తో వెంబడించారు. నడింపల్లి సమీపానికి రాగానే ఒక్కసారిగా వీరయ్యపై గొడ్డలి, సుత్తితో దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్‌పై దాడికి యత్నించగా.. సమీప గ్రా మస్తులు రావడంతో వదిలిపెట్టి వెళ్లారు. హత్యలో పాల్గొన్న ముగ్గురు నిందితులు గతంలో నేర చరిత్ర కలిగి ఉండటంతో వారిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. హత్య కేసును చేధించిన డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, ఉప్పునుంతల ఎస్ఐ వెంకట్‌రెడ్డి, ఇందిర, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ రమేశ్, కానిస్టేబుళ్లు విశ్వనాథ్, బాలస్వామి, మల్లేష్, విష్ణు ఉన్నారు.భర్త, ఇద్దరు పిల్లలున్న మహిళతో వివాహేతర సంబంధం

నగరంలో ఏకైక న్యూరో సర్జన్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య
సోలాపూర్: పట్టణంలోని సుప్రసిద్ధ న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ శిరీష్ వలసంగకర్ (65) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి 8:30 గంటల సమయంలో తన నివాసంలో రెండు సార్లు రివాల్వర్‌తో తల వద్ద కాల్చుకుని మృతి చెందారు. ఆ సమయంలో కూతురు ఉమ ఇంట్లోనే ఉన్నారు. తుపాకీ శబ్దం విన్న కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వెంటనే అక్కడకు వచ్చి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న డాక్టర్ శిరీష్‌ను రామ్వాడి ప్రాంతంలోని ఆయన సొంత ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన కుమారుడు డా.అశ్విన్, కోడలు డా. సోనాలి, ఇతర డాక్టర్లు ఆయనను కాపాడేందుకు రెండు గంటలపాటు తీవరంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు రాత్రి 10:45 నిమిషాలకు ఆయన మరణించినట్లు వారు ధృవీకరించారు. డా. శిరీష్ మరణంపై పలువురు ప్రముఖులు, వైద్య నిపుణులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తీవ్ర సంతాపం వ్యక్తమైంది.శనివారం సాయంత్రం మోదీ స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. డాక్టర్ శిరీష్ అంతిమ సంస్కారాలకు సామాజిక, రాజకీయ, వైద్య రంగ ప్రముఖులు , ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. గత 35 సంవత్సరాలుగా పట్టణంలో ఏకైక న్యూరో సర్జన్ గా, బ్రెయిన్ డిజాస్టర్ డాక్టర్ గా ప్రసిద్ధి చెందిన శిరీష్ వలసంగకర్ కుటుంబం మొత్తం వైద్య నిపుణులే. డాక్టర్ శిరీష్ నాలుగు భాషల్లో( మరాఠీ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు) ప్రావీణ్యుడు. ఆయన ఇటీవలే వరల్డ్ మెడికల్ టూర్ కోసం డబల్ ఇంజన్ డైమండ్ ప్లేన్ కూడా కొనుగోలు చేశారు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే జీవితాన్ని చేతులారా అంతం చేసుకున్నారు. ఖచ్చితమైన కారణంపై స్పష్టత లేనప్పటికీ, గత కొన్ని రోజులుగా ఆయన ఒత్తిడిలో ఉన్నారని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. సదర్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పలువురు సంతాపండాక్టర్ శిరీష్ పద్మాకర్ వల్సంగ్కర్ అత్యంత గౌరవనీయమైన న్యూరాలజిస్ట్ మరియు మహారాష్ట్రలోని సోలాపూర్‌లోని SP ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ (వల్సంగ్కర్ హాస్పిటల్) వ్యవస్థాపకుడు. ఈ ప్రాంతంలో న్యూరాలజీ రంగంలో మార్గదర్శకుడిగా పేరుగాంచారు. మెదడుకు వివిధ , అధునాతన మార్గాల్లో చికిత్స చేయడానికి ఒక అత్యాధునిక ఆసుపత్రిని ప్రారంభించిన ఘనత ఆయన సొంతం. ఆందుకే సోలాపూర్‌లో న్యూరాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు చేసిన డాక్టర్ శిరీష్ వల్సంగ్కర్ అని పిలుస్తారు. ఈ సంఘటనతో యావత్ వైద్యలోకం షాక్‌కు గురైంది. ఇది చాలా దిగ్భ్రాంతికరమైన పరిణామంమని సోలాపూర్‌కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ సచిన్ బల్దావా డా. శిరీష్ మరణంపై సంతాపం వెలిబుచ్చారు. చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి

ప్రసవం కోసం వెళ్తే ప్రాణం పోయింది..
జడ్చర్ల(మహబూబ్‌నగర్): పురిటి నొప్పులతో ప్రసవం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన నిండు గర్భిణి మృత్యువాత పడిన ఘటన జడ్చర్ల పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ వివరాల మేరకు.. రాజాపూర్ మండలం మల్లేపల్లికి చెందిన రేణుక (24)ను నవాబుపేట మండలం పల్లెగడ్డకు చెందిన నరేందర్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరు హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో నివాసం ఉంటున్నారు. అయితే రేణుక మొదటి కాన్పు కోసం తల్లిదండ్రులు శుక్రవారం జడ్చర్ల ఇందిరానగర్ కాలనీలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి వైద్యురాలు ఆమెను పరీక్షించి జాయిన్ చేసుకున్నారు. రాత్రివేళ ఆకస్మికంగా ఆమెకు ఫిట్స్ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సదరు ఆస్పత్రి వైద్యురాలు మెరుగైన వైద్యం కోసం తన వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు ఆమెను పరీక్షించి.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, తన కూతురు మరణంపై ఎలాంటి అనుమానం లేదని తండ్రి వడ్డె పరశురాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉంటే, ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే తన భార్య రేణుక మృతిచెందిందని భర్త నరేందర్‌తో పాటు బంధువులు మొదట ఆరోపించారు. తన భార్యకు ఎప్పడూ ఫిట్స్ రాలేదని.. కానీ ఫిట్స్ వచ్చినట్లు తనకు ఫోన్లో తెలిపారన్నారు. విషయం తెలుసుకుని తాను ఆస్పత్రికి వచ్చే సరికే పేషంట్ కండీషన్ సీరియస్‌గా ఉందంటూ జిల్లా ఆస్పత్రికి తరలించారని తెలిపారు. కాగా, గర్భిణి మృతికి సంబంధించి సంబంధిత ఆస్పత్రి నిర్వాహకులు, మృతురాలి కుటుంబీకుల మధ్య చర్చలు సాగినట్లు సమాచారం.గర్భిణి మృతిపై విచారణ..గర్భిణి మృతిపై మాస్ మీడియా అధికారిణి మంజుల శనివారం విచారణ జరిపారు. సదరు ఆస్పత్రి డాక్టర్ నీలోఫర్ జగీర్ధార్తో వివరాలు సేకరించారు. అయితే వైద్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదని.. పరిస్థితి విషమంగా ఉండటంతో తన కారులో జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు వైద్యురాలు తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు చేపడుతామని మాస్ మీడియా అధికారిణి పేర్కొన్నారు.

ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్య
వనపర్తి(మహబూబ్‌నగర్): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నా డని కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. సూగూరు గ్రామానికి చెందిన రవి, అతడి భార్య సునీత మేస్త్రి నరేశ్ వద్ద పనిచేస్తుండే వారు. క్రమంలో శ్రీరంగాపూర్‌కు చెందిన అరవింద్‌తో సునీతకు పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త రవికి తెలియడంతో అరవింద్‌ను హెచ్చరించాడు. అప్పటి నుంచి రవి తన భార్య సునీతను ఇబ్బంది పెడుతుండేవాడు. ఈ క్రమంలో తన భర్త అడ్డు తొలగించాలని ప్రియుడు అరవింద్‌కు చెప్పడంతో గత నెల 18న అతడు తన స్నేహితులైన భగవంతు, గిరితో కలిసి అయ్యవారిపల్లిలో మద్యం తాగుతూ రవి హత్యకు పథకం రచించారు. ఈ మేరకు మార్చి 19న సాయంత్రం అరవింద్ తన స్నేహితుడైన సూగూరుకు చెందిన బాష కారును అవసరం ఉందని తీసుకుని అయ్యవారిపల్లిలో భగవంతు, గిరిని ఎక్కించుకున్నాడు. వెంకటాపురంలో ఒక కిరాణం షాపులో మద్యం, వాటర్ బాటిల్స్, నల్ల కవర్స్ తీసుకున్నారు. అక్కడి నుంచి సూగూరుకు వెళ్లి ఆంజనేయులు అనే వ్యక్తితో రవికి ఫోన్ చేయించి మద్యం తాగుదామని పిలిపించారు. వారి వద్దకు వచ్చిన రవిని కారులో ఎక్కించుకుని గ్రామ సమీపంలోని శ్మశానవాటిక వద్దకు వెళ్లి మద్యం తాగారు. రవి మత్తులోకి వెళ్లిన తర్వాత అందరూ కలిసి అతడి ముఖానికి ప్లాస్టిక్ కవర్లు చుట్టి ఊపిరాకుండా చేసి చంపారు. ఎవరికీ అనుమానం రాకూడదని కొత్త సూగూరు ఊరి బయట రోడ్డు పక్కన శవాన్ని ఉంచి, నేరానికి ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లను బూడిదపాడు వద్ద వాగులో పడేసి వెళ్లిపోయా రు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టారు. సునీతను తమదైన శైలిలో విచారించగా.. చేసిన నేరాన్ని ఒప్పుకుంది. హత్య లో పాల్గొన్న వారిని అరెస్టు చేసి.. వారి నుంచి కారు, సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్ విధించినట్టు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ రాంబాబు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, పెబ్బేరు ఎస్ఐ యుగంధర్ రెడ్డి ఉన్నారు.
వీడియోలు


విశాఖలో ఎకరా స్థలం 99పైసలే.. రండి బాబు రండి!


పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణంపై అనుమానాలు తీరలేదు: విజయ్ కుమార్


క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి


టైటిల్ డీడ్ లేని భూములను వక్ఫ్ పేరుతో ఎంఐఎం ఆక్రమించింది


సిద్దు నేను బెస్ట్ ఫ్రెండ్.. వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే..


కాకినాడ జిల్లాలో దళితుల గ్రామ బహిష్కరణ


అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి ఆదినారాయణరెడ్డి బెదిరింపులు


బాచుపల్లి పీఎస్ పరిధిలోని ప్రగతి నగర్ లో విషాదం


చంద్రబాబు నీకు దమ్ముంటే.. వర్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల నిరసన


జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్.. ముగ్గురు మృతి