Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Facts revealed in Sakshi investigation into the collusion of key leaders with Ursa1
ఊరూపేరు లేని 'ఉర్సా'

సాక్షి, అమరావతి : రూ.10,000 కోట్లు పెట్టుబడులు పెట్టే కంపెనీ అంటే దాని స్థాయి ఎంత గొప్పగా ఉండాలి..? నిత్యం వేలాది మంది ఉద్యోగుల కోలాహలంతో పాటు పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు ఉండాలి కదా..? కానీ రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చిన ఆ కంపెనీలో కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేడు. ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు చేసిన దాఖలాలు కూడా లేవు. అంతెందుకు..? అసలది ఆఫీసే కాదు! వాడుకునేది కూడా గృహ విద్యుత్తే. కనీసం కార్యాలయం కూడా లేని కంపెనీకి ఎకరం 99 పైసలకే అత్యంత ఖరీదైన భూమిని ఉరుకులు పరుగులపై అప్పగించడం నీకింత.. నాకింత! దోపిడీకి పరాకాష్ట. ప్రపంచ చరిత్రలో ఇది వింతల్లో వింత! ఊరు పేరు లేని ‘ఉర్సా క్లస్టర్స్‌’కు విశాఖలో దాదాపు రూ.3,000 కోట్ల విలువైన భూమిని టీడీపీ సర్కారు అప్పనంగా కట్టబెట్టడం తాజాగా అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కేవలం రెండు నెలల వయసు, కనీసం ఓ ఆఫీసు, ఫోన్‌ నెంబర్, వెబ్‌సైట్‌ కూడా లేని ఓ ఊహల కంపెనీకి మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటన అనంతరం రూ.వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేయడం పట్ల అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.రెండు నెలలు తిరగక ముందే.. టీసీఎస్‌ని తెరపైకి తెచ్చి ఆ ముసుగులో..! సొంత కార్యాలయం.. కనీసం ఫోన్‌ నెంబరు కూడా లేని ఓ అనామక కంపెనీ ఏర్పాటై రెండు నెలలు తిరగక ముందే తెలుగు రాష్ట్రాల్లో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామనడం.. ఆ ప్రతిపాదనకు ముచ్చట పడి చంద్రబాబు సర్కారు విశాఖలో కారు చౌకగా అత్యంత ఖరీదైన భూములు కేటాయించేయడం, ఇందుకోసం టీసీఎస్‌ని తెరపైకి తెచ్చి ఆ ముసుగులో ఎకరం 99 పైసలకే అంటూ ప్రత్యేకంగా పాలసీ తెస్తుండటంపై రాష్ట్ర ఐఏఎస్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యనేతలు తమ కుట్ర అమలులో భాగంగా తొలుత టీసీఎస్‌కు ఎకరా 99 పైసలకే కేటాయించి, అదే ధరకు ఉర్సా కస్టర్స్‌కు విలువైన భూములు ధారాదత్తం చేసేలా పావులు కదిపారు. ‘ఉర్సా క్లస్టర్స్‌’ పేరుతో విశాఖలో డేటా సెంటర్, ఐటా క్యాంపస్‌ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించడమే తడవుగా చౌకగా భూములు కేటాయించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రతిపాదించడం.. ఆ వెంటనే క్యాబినెట్‌లో భూ కేటాయింపులు చేయడంపై అనుమానాలు బలపడుతున్నాయి. కనీసం ఓ ఆఫీసు, ఫోన్‌ నెంబర్‌ కూడా లేని కంపెనీ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఎలా ఆమోదించిందో అర్థం కావడం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భూ కేటాయింపులకు పచ్చజెండా.. ఉర్సా క్లస్టర్స్‌ రూ.5,728 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, ఐటాక్యాంపస్‌ ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం విశాఖ మధురవాడలోని ఐటీ హిల్‌ నెంబర్‌ 3లో ఐటా క్యాంపస్‌కు 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో డేటా సెంటర్‌కు 56.36 ఎకరాలు కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు చేసుకున్న ఉర్సా కంపెనీ గురించి ‘సాక్షి’ పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.రెండు నెలల క్రితం పుట్టిన ఉర్సాకుమారుడేమో సాధారణ ఉద్యోగి తండ్రేమో కంపెనీకి డైరెక్టరట.. ఇంకో డైరెక్టర్‌ కథ ఇదీ.. తెలుగు రాష్ట్రాల్లో రూ.10 వేల కోట్లు పెట్టుబడులు పెడుతుందని చెబుతున్న ఉర్సా క్లస్టర్స్‌ మార్చి నెల కరెంటు బిల్లు ఇది. హైదరాబాద్‌లో కార్యాలయమే లేదు..! కేరాఫ్‌ అడ్రస్‌ ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టే సంస్థ కార్యాలయం ఎంత పెద్దగా ఉంటుందో..? వందలాది మంది ఉద్యోగులతో కోలాహలంగా ఉంటుందని ఊహించుకుంటే పప్పులో కాలేసినట్లే. టీడీపీ కూటమి సర్కారు భూ కేటాయింపులు చేయడానికి కేవలం రెండు నెలల ముందు అంటే 2025 ఫిబ్రవరి 12న ఉర్సా క్లస్టర్స్‌ హైదరాబాద్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన పెందుర్తి విజయ్‌కుమార్, అమెరికాలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న సతీష్‌ అబ్బూరి డైరెక్టర్లుగా ఈ కంపెనీ ఏర్పాటైంది. ప్లాట్‌ నెంబర్‌ 705, ఏక్తా బాసిల్‌ హైట్స్, కొత్తగూడ, హైదరాబాద్, తెలంగాణ– 500084 చిరునామాతో దీన్ని నెలకొల్పారు. అయితే ఆ చిరునామాకు వెళ్లి పరిశీలించగా... అది పూర్తిగా నివాస ప్రాంతమని తేలింది. పెందుర్తి విజయ్‌కుమార్‌కు అత్యంత దగ్గరి బంధువైన పెందుర్తి పద్మావతికి చెందిన త్రీ బెడ్‌ రూమ్‌ నివాస ఫ్లాట్‌ను ఉర్సా ఆఫీసు కార్యాలయంగా పేర్కొన్నారు. అది పూర్తిగా రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌. ఒక్కో అంతస్తుకు నాలుగు ఫ్లాట్ల చొప్పున మొత్తం 28 ఫ్లాట్‌లున్నాయి. ఉర్సా కార్యాలయంగా పేర్కొన్న ఒక ఫ్లాట్‌లో ఓ కుటుంబం నివాసం ఉంటోందని, అసలు అక్కడ ఐటీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు జరగడం లేదని స్థానికులు వెల్లడించారు. ఇక రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటున్న ఉర్సా క్లస్టర్స్‌ వాణిజ్య విద్యుత్‌ కాకుండా గృహ విద్యుత్తు కనెక్షన్‌ను వినియోగి స్తోంది. ఆర్వోసీలో నమోదుకు సమర్పించిన ఫ్లాట్‌ నెంబర్‌ 705 విద్యుత్‌ బిల్లే దీనికి నిదర్శనం. ఉర్సా క్లస్టర్‌ కంపెనీకి కనీసం ఓ ఫోన్‌ నెంబరు గానీ వెబ్‌సైట్‌గానీ లేకపోవడం గమనార్హం. పెందుర్తి విజయకుమార్‌ తన వ్యక్తిగత ఈ మెయిల్‌ను ఆర్వోసీకి అందించారు. అమెరికాలోనూ అంతే.. లోకేశ్‌ పర్యటనకు నెల ముందు...!ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాతృసంస్థగా చెబుతున్న అమెరికాలోని ఉర్సా క్లస్టర్స్‌ ఎల్‌ఎల్‌సీ పరిస్థితి కూడా ఇంతే. అది లిమిటెడ్‌ లయబులిటీ కంపెనీ. ఏడు నెలల క్రితం.. అంటే 2024 సెపె్టంబర్‌ 27న ఉర్సా క్లస్టర్స్‌ అమెరికాలో ఏర్పాటైంది. అమెరికాలోని డెలావర్‌లో 611, సౌత్‌ డ్యూపాంట్, హైవే సూట్, 102 డోవెర్, డీఈ 19901 చిరునామాతో ఈ కంపెనీ నమోదైంది. పెందుర్తి విజయ్‌కుమార్‌ తనయుడు కౌశిక్‌ దీనికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటనకు సరిగ్గా నెల రోజుల ముందు ఈ కంపెనీ ఏర్పాటు కావడం గమనార్హం. ఇక ఈ కంపెనీ ఇప్పటి వరకు చెల్లించిన పన్ను కేవలం 300 అమెరికన్‌ డాలర్లు మాత్రమే. అంటే మన కరెన్సీలో సుమారు రూ.25,000. అమెరికా చిరునామాతో ఉన్న ఇల్లు కూడా పూర్తిగా నివాసప్రాంతం. కేవలం 1,560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక చిన్న కుటుంబం నివాసం ఉండటానికి అనువుగా ఉన్న ఇంటిని ఆఫీసు కార్యాలయంగా పేర్కొన్నారు. ఇక అక్కడ కూడా ఉర్సా క్లస్టర్స్‌ బోర్డు లేదు.. ఉద్యోగులు లేరు. కనీసం ఫోన్‌ నెంబర్లు లేవు. కౌశిక్‌ పెందుర్తి ప్రస్తుతం టాలస్‌ పే అనే కంపెనీలో సీపీటీవోగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన లింక్డిన్‌ ఖాతా ద్వారా తెలుస్తోంది. అంటే ఆయన అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్న ప్రైవేట్‌ ఉద్యోగి. మరో డైరెక్టర్‌ సతీష్‌ అబ్బూరి ఎలిసియం అనలిటిక్స్‌కు వ్యవస్థాపకుడు, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. అలాంటి ఉర్సా కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెడతామనడం, అడిగిందే తడవుగా రూ.వేల కోట్ల విలువైన భూమినికారుచౌకగా కట్టబెడుతుండటంపై పెద్ద ఎత్తున అనుమానాలు ముసురుకుంటున్నాయి.‘ఐఎంజీ భారత్‌’ను మించిన స్కామ్‌..ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 2004లో తన బినామీ బిల్లీరావు చేత ‘ఐఎంజీ భారత్‌’ అనే డొల్ల కంపెనీని పెట్టించి.. అది అమెరికాలో ఉన్న ఐఎంజీ అకాడెమీకి చెందిన కంపెనీ అని నమ్మించి.. హడావిడిగా దానికి గచ్చిబౌలిలోని 400 ఎకరాలు కేటాయించి సేల్‌డీడ్‌ కూడా చేసేశారు.. అంతేకాదు శంషాబాద్‌ పక్కన మరో 450 ఎకరాలు కూడా కేటాయించడంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని స్టేడియాలనూ ఆ కంపెనీకి 45 ఏళ్లపాటు లీజుకిచ్చేసి వాటి నిర్వహణ చార్జీలను మాత్రం ప్రభుత్వమే ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.. ఇపుడు ‘ఉర్సా క్లస్టర్స్‌’ కంపెనీని హడావిడిగా ఏర్పాటు చేసి విలువైన భూములు కేటాయించడం చూస్తుంటే ఐఎంజీ స్కామ్‌ గుర్తుకొస్తోందని ఓ సీనియర్‌ అధికారి అభిప్రాయపడ్డారు.

US Vice President JD Vance Reached India Updates2
భారత్‌ చేరుకున్న జేడీ వాన్స్‌ దంపతులు.. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

ఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) భారత్‌కు చేరుకున్నారు. భారత్‌లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా జేడీ వాన్స్‌.. సోమవారం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో విమానం దిగారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఘన స్వాగతం పలికారు. కాగా, వాన్స్‌ వెంట ఆయన సతీమణి ఉషా వాన్స్, ముగ్గురు పిల్లుల కూడా వచ్చారు. జేడీ వాన్స్‌ పిల్లులు.. భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించడం విశేషం. ఎయిర్‌పోర్టులో భారత శాస్త్రీయ నృత్యంతో వారికి సాదర స్వాగతం పలికారు. కాసేపట్లో వారు ఢిల్లీలోని అక్షర్‌ధామ్‌ టెంపుల్‌కు వెళ్లనున్నారు.#WATCH | Delhi: Visuals from the Akshardham Temple where Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children, will visit shortly.Akshardham Temple Spokesperson Radhika Shukla says, "The Vice President and the Second Lady are coming… pic.twitter.com/yEKwdZemVj— ANI (@ANI) April 21, 2025అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. వాన్స్‌కు మన సైనిక దళాలు గౌరవ వందనం చేశాయి. సాయంత్రం 6.30 గంటలకు వాన్స్‌ దంపతులకు లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధాని మోదీ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. భేటీ అనంతరం వాన్స్‌ దంపతులు, అమెరికా అధికారులకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు.#WATCH | Delhi: Vice President of the United States, JD Vance, along with Second Lady Usha Vance arrive at Palam airport. pic.twitter.com/iCDdhYLVdz— ANI (@ANI) April 21, 2025విందు అనంతరం సోమవారం రాత్రే వాన్స్‌ దంపతులు జయపురకు వెళ్తారు. అక్కడ విలాసవంతమైన రాంభాగ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో బస చేస్తారు. మంగళవారం ఉదయం పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. అందులో అంబర్‌ కోట కూడా ఉంది. మధ్యాహ్నం రాజస్థాన్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో వాన్స్‌ ప్రసంగిస్తారు. ట్రంప్‌ హయాంలో భారత్, అమెరికా సంబంధాలపై మాట్లాడతారు.#WATCH | Delhi: Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children, at Palam airport.Vice President JD Vance is on his first official visit to India and will meet PM Modi later today. pic.twitter.com/LBDQES2mz1— ANI (@ANI) April 21, 2025ఈనెల 23వ తేదీ(బుధవారం) ఉదయం వాన్స్‌ కుటుంబం ఆగ్రాకు వెళ్లనుంది. అక్కడ తాజ్‌ మహల్‌ను, భారతీయ కళలకు సంబంధించిన శిల్పాగ్రామ్‌ను సందర్శిస్తారు. అదేరోజు మధ్యాహ్నం తర్వాత మళ్లీ వారు జయపురకు వెళ్తారు. 24వ తేదీన జయపుర నుంచి బయలుదేరి అమెరికా వెళ్తారు.#WATCH | Delhi: Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children welcomed at Palam airport. Union Minister Ashwini Vaishnaw received the Vice President. pic.twitter.com/ocXCXOdmgQ— ANI (@ANI) April 21, 2025

KSR Comment On Chandrababu Lies Speeches3
బాబు మాటల్లో నిజం.. నేతిబీర చందమే!

పొంతన లేని మాటలతో జనాల్ని తికమకపెట్టడంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది తిరుగులేని రికార్డు. తాజాగా కొద్ది రోజుల క్రితం జ్యోతీరావు ఫూలే జయంతి ఉత్సవాల్లో ఇది మరోసారి నిరూపితమైంది. ఎల్లోమీడియా ‘బీసీల సంక్షేమానికి రూ.48 కోట్లు’ అంటూ బాబుగారి ప్రసంగాన్ని భాజాభజంత్రీలతో కథనంగా వండి వార్చినప్పటికీ వివరాలు చూస్తే ప్రజలు ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఎందుకంటే.. బాబు గారు తన ప్రసంగంలో సంక్షేమ వసతి గృహాలకు రూ.405 కోట్లు, గ్రూప్‌ పరీక్షల అభ్యర్థులకు శిక్షణ శిబిరాలు, బీసీ స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటు, అమరావతిలో 500 మంది బ్యాచ్‌తో ఉచిత శిక్షణ, ఆదరణ పథకం కింద ఏటా రూ.వెయ్యికోట్లు ఖర్చు వంటివి మాత్రమే ప్రస్తావించారు. .. ఇవేవీ కొత్తవి కాకపోవడం ఒక వింతైతే.. వీటికయ్యే ఖర్చు ఏటా రెండు వేల కోట్లకు మించకపోవడం ఇంకోటి. మరి.. రూ.48 వేల కోట్లు ఎక్కడ? ఎప్పుడు? ఎలా వ్యయం చేస్తారు? ఎల్లో కథనం చదివిన వారి ఊహకే వదిలేయాలి దీన్ని. పోనీ మొత్తం ఐదేళ్లకు ఇంత మొత్తం అనుకుంటే.. ఒక ఏడాది గడచిపోయింది కాబట్టి.. మిగిలిన నాలుగేళ్లలో ఏటా రూ.12 వేల చొప్పున ఖర్చు పెట్టాలి. దీనిపై కూడా స్పష్టత లేదు. అయినా చంద్రబాబు(Chandrababu) బీసీ సంక్షేమానికి 48 వేల కోట్లు అని ఒక అంకె చెప్పడం, అదేదో మొత్తం ఇచ్చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేసి బ్యానర్‌ కథనాలు రాసేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయడం ఎల్లో మీడియా మార్కు జర్నలిజమై పోయింది. 👉బాబు గారు ఇంకొన్ని మాటలూ ఆడారు. ఆర్థిక అసమానతలను రూపుమాపే బ్రహ్మాస్త్రం పీ-4 అని, దీని ద్వారా లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని చెప్పనైతే చెప్పారు కానీ.. ఎలా అన్నది మాత్రం చెప్పడం మరిచారు!. సాధారణంగా ఏ నేత అయినా వేల కోట్ల మొత్తాలను ప్రకటించినప్పుడు దేనికెంత ఖర్చు చేస్తారు? బడ్జెట్‌ కేటాయింపులు ఎలా ఉన్నాయి? వంటి వివరాలు ఇవ్వడం జర్నలిజమ్‌ ప్రాథమిక లక్షణం. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాంటి భారీ కేటాయింపులు జరిగినప్పుడు దానికి కట్టుబడి ఉన్నట్టు సమాచారం ఉండేది. అప్పటి విపక్షం టీడీపీ కూడా తప్పు పట్టే పరిస్థితి ఉండేది కాదు. పోనీలే... ఏదో ఒక రీతిన బీసీల సంక్షేమానికి రూ.48 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని సంతోషిస్తూండగానే చంద్రబాబు అన్నమాటతో నిరాశ కమ్మేసింది. 👉అప్పు చేసి సంక్షేమం అమలు చేస్తే రాష్ట్రం కష్టాలలో కూరుకుపోతుందని, సంపద సృష్టించి సంక్షేమానికి ఖర్చు చేస్తామని చంద్రబాబు ప్రకటించారని ఎల్లో మీడియా(Yellow Media)నే తెలిపింది. చంద్రబాబు అక్కడితో ఆగలేదు. కాని టీడీపీకి నష్టం అని భావించి ఎల్లో మీడియా ఆ భాగం రాయకుండా వదలి వేసింది. మిగిలిన మీడియాలో ఆ వివరాలు ఉన్నాయి. చెప్పినవన్నీ చేయాలని ఉన్నా గల్లా పెట్టే ఖాళీగా కనిపిస్తోందని, అప్పు చేద్దామన్నా ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావడం లేదని అన్నారు. పరపతి లేకపోతే అప్పు ఎలా పుడుతుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు దాటిపోయింది. ఈ కాలంలో సంపద సృష్టించ లేకపోయానని ఆయన చెబుతున్నట్లే కదా? పైగా అప్పు పుట్టని పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబే కదా దానికి బాధ్యుడు అవుతారు. పోనీ అదే నిజమనుకున్నా, ఇప్పటికే రూ.లక్ష కోట్ల అప్పు ఎలా చేశారు? దానిని ఎందుకోసం ఖర్చు పెట్టారు అన్నది ఎప్పుడైనా చెప్పారా అంటే లేదు. ఒక్క అమరావతి(Amaravati) నిర్మాణాలకే ఏభైవేల కోట్ల అప్పు ఎలా తీసుకు వస్తున్నారు? ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ, ఎన్నికల ప్రణాళిక అంటూ తెగ వాగ్దానాలు ఇచ్చేశారు కదా? బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్‌ ఇస్తానన్నారు కదా? ఇప్పుడు ప్రతి దానికి గల్లా పెట్టె ఖాళీగా ఉందని చెప్పడం ప్రజలను చీట్ చేయడమే కాదా? ఈ లెక్కన ఇప్పుడు బీసీల సంక్షేమానికి ప్రకటించిన రూ.48 వేల కోట్లు ఉత్తుత్తి ప్రకటనగానే తీసుకోవాలా? లేక దాని అమలుకు వేరే మార్గం ఏమైనా ఉందని చెబుతారా?. తల్లికి వందనం కింద త్వరలో డబ్బులు ఇస్తామని అంటారు. ఒక ఏడాది ఇప్పటికే ఎగవేసిన విషయాన్ని మాత్రం ప్రస్తావించరు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే రూ.ఆరు వేలు పోను మిగిలిన రూ.14 వేలు ఇస్తామని చెప్పారు. మరి ఈ ఏడాది ఎందుకు ఎగవేశారో వివరించాలి కదా? కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా రైతులకు సాయం చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చుతున్నారు. ఇవైనా ఏ మేరకు అమలు చేస్తారో తెలియదు. చంద్రబాబు మాత్రం వాటిని నివృత్తి చేయరు. తాను చెప్పదలచుకున్నది ఏదో అది ప్రజలు నమ్ముతారా? లేదా ?అనేదానితో నిమిత్తం లేకుండా ప్రచారం చేసి వెళుతుంటారు. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకు వస్తామని, వారికి 34 శాతం రిజర్వేషన్లు తెస్తామని, నామినేటెడ్ పోస్టులలో 33 శాతం బీసీలకు కేటాయిస్తామని, కల్లు గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయించామని.. ఇలా ఆయా విషయాలను చెప్పారు. విశేషం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం సత్యసాయి జిల్లాలో బీసీ వర్గానికి చెందిన ఒక వైసీపీ నేత లింగమయ్యను టీడీపీ వారు హత్య చేస్తే వీరు కనీసం ఖండించలేదు. ఆ కేసులో ఇరవైమంది నిందితులు ఉన్నారని చెబుతున్నా ఇద్దరిపైనే కేసు నమోదు చేశారని బాధితులు ఆరోపిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం బీసీ రక్షణ చట్టం గురించి ఉపన్యాసం ఇస్తున్నారు.ఏపీలో సోషల్ మీడియా(AP Social Media) నేరస్తులకు అడ్డాగా మారిందని, వ్యక్తిత్వ హననం చేస్తే అది వారికి అదే చివరి రోజు అవుతుందని చంద్రబాబు అంటున్నారు. నిజానికి సోషల్ మీడియాను దుర్వినియోగం ఎక్కువగా చేసింది టీడీపీ వారే అనే సంగతి ఆయనకూ తెలుసు. వారిని ప్రోత్సహించింది తాను, తన కుమారుడు అన్న విషయం అందరికి విదితమే. ఈ మధ్య తప్పని స్థితిలో ఒక టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతనిని విచారించి ,అతను వాగిన పిచ్చివాగుడు వెనుక ఎవరు ఉన్నారో పోలీసులు తేల్చుతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు. సీమ రాజా అని, ఇంకేవేవో పేర్లతో వైఎస్సార్సీపీ మహిళా నేతలపై దారుణమైన నీచమైన వ్యాఖ్యలు చేసినవారంతా రాష్ట్రంలో సేఫ్‌గా తిరుగుతున్నారు. మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి అసహ్యకరమైన ఆరోపణ చేసిన ఒక టీడీపీ నేతకు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసిన చరిత్ర కూడా సార్‌దే కదా! ఏదైనా చిత్తశుద్దితో చెబితే పర్వాలేదు. కాని సుద్దులు పైకి చెప్పి, టిడిపి సోషల్ మీడియా అరాచక శక్తులకు అండగా నిలబడుతున్నారన్న అపకీర్తి మూట కట్టుకుంటే ఏమి చేస్తాం. అందువల్ల నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో చంద్రబాబు మాటల్లో వాస్తవం అంత ఉంటుందని ఆయన ప్రత్యర్ధులు వ్యాఖ్యానిస్తుంటారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

US Defence Chief Shared Yemen War Plans With Family Too Details Here4
‘యెమెన్‌ లీక్ ఎపిసోడ్‌’లో బిగ్‌ ట్విస్ట్‌

యెమెన్‌పై భీకర దాడులకు సంబంధించి అమెరికా ప్రణాళికలు ముందుగానే బయటపడడం చర్చనీయాంశమైన వేళ.. విస్మయం కలిగించే విషయం ఒకటి వెలుగు చూసింది. హౌతీ రెబల్స్‌పై దాడుల సమాచారాన్ని అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్ తన భార్య, కుటుంబ సభ్యులు, వ్యక్తిగత లాయర్‌తోనూ పంచుకున్నట్లు బయటపడింది. సమాచారం లీక్‌ విషయంలో ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.న్యూయార్క్‌: సమాచారం లీక్‌ అవ్వడానికి కారణమైన ‘సిగ్నల్‌’ గ్రూప్‌ను తానే క్రియేట్‌ చేశానని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్‌ వాల్జ్‌ (Mike Waltz) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ గ్రూప్‌లో సమాచారం ఎలా లీక్‌ అయ్యిందో అర్థం కావడం లేదని, దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని అన్నారాయన. ఈలోపు.. అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్(Pete Hegseth) తన కుటుంబ సభ్యులతోనూ ఆ కీలక సమాచారం పంచుకున్నారనే విషయం వెలుగు చూసింది.యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌ను టార్గెట్‌ చేస్తూ జరిగిన F/A-18 హార్నెట్‌ దాడుల షెడ్యూల్‌ల వివరాలను ఆయన మరో ఛాట్‌లో భార్య, తన సోదరుడు, స్నేహితులతోనూ పంచుకున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్ ఆదివారం ఒక కథనం ప్రచురించింది. అంతేకాదు హెగ్సెత్ భార్య, ఫాక్స్‌ న్యూస్‌ ప్రొడ్యూసర్‌ అయిన జెన్నిఫర్‌.. సైన్యానికి సంబంధించిన కీలక సమావేశాలకూ హాజరయ్యారని వాల్‌ స్ట్రీట్‌ జనరల్‌ విడిగా మరో కథనం ఇచ్చింది.ఈ కథనాలపై ఇటు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌.. అటు వైట్‌హౌజ్‌ వర్గాలు స్పందించాల్సి ఉంది. మరోవైపు.. అత్యంత సున్నితమైన భద్రతా వివరాలను పంచుకోవడానికి ట్రంప్ పేషీ ‘‘సిగ్నల్‌’’ లాంటి యాప్‌ను వాడడంపై అమెరికాలో తీవ్ర చర్చ నడుస్తోంది.అమెరికా బలగాలు కిందటి నెలలో యెమెన్‌(Yemen Attacks Plan Leak)పై భీకర దాడులు చేయడానికి సంబంధించిన ప్రణాళికలు ముందుగానే ఓ పాత్రికేయుడికి తెలియడం అమెరికాలో కలకలం రేపింది. సిగ్నల్‌లో గ్రూప్‌చాట్‌ కోసం తనను రెండు రోజుల ముందే యాడ్‌ చేశారని ‘అట్లాంటిక్‌ మ్యాగజైన్‌’ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ జెఫ్రీ గోల్డ్‌బర్గ్‌ ప్రకటించారు. లక్ష్యాలు, అమెరికా ఆయుధాల మోహరింపు, దాడులు చేసే దిశ వంటి అంశాలపై గ్రూపులో చర్చించారని, ఆ ప్రకారమే దాడులు జరిగాయని ఆయన వెల్లడించారు. అయితే తన వద్ద ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.. తాను ఎలాంటి కథనాలు ఇవ్వలేదంటూ చెప్పారాయన.అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ముఖ్య అధికారులు యెమెన్‌పై చర్చించిన సిగ్నల్‌ యాప్‌ గ్రూప్‌చాట్‌లో ఈ జర్నలిస్టును యాడ్‌ చేశారు. దాడుల విషయాలు ఆ పాత్రికేయునికి తెలుసని శ్వేతసౌధం ధ్రువీకరించింది.మరోవైపు.. ఈ ప్రణాళిక లీకైన అంశంపై తనకెలాంటి సమాచారం లేదని అధ్యక్షుడు ట్రంప్‌ అంటున్నారు. ఈ భద్రతా ఉల్లంఘనను ట్రంప్‌ సాధారణ విషయంగా తీసుకున్నప్పటికీ.. డెమోక్రట్లు తీవ్రంగా ఖండించారు. నూతన పాలకవర్గం అజాగ్రత్త వల్లే ఇది జరిగిందని వ్యాఖ్యానించారు.ఇక.. ఈ ఉదంతంపై ఉన్నతస్థాయి నిఘా అధికారులను అమెరికా సెనెట్‌ విచారిస్తోంది. ఇప్పటికే ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్, సీఐఏ డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్, జాతీయ నిఘా డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్‌లు సెనెట్‌ నిఘా కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అయితే గ్రూప్‌ను తానే క్రియేట్‌ చేసినప్పటికీ సదరు జర్నలిస్టు ఫోన్‌ నెంబర్‌ తన వద్ద లేదని అన్నారు. ఫోన్‌లో లేని నెంబర్‌ ఎలా గ్రూప్‌లోకి వచ్చిందో తెలుసుకోవడానికి సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని .. విషయంలో తాము ఇలాన్‌ మస్క్‌ సహాయం కూడా తీసుకుంటున్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్‌ వాల్జ్‌ వెల్లడించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మార్చి 15న యెమెన్‌పై దాడులను ప్రకటించారు. ఇజ్రాయెల్‌ నౌకలపై దాడుల్ని పునరుద్ధరిస్తామని ప్రకటించిన యెమెన్‌ తిరుగుబాటు దళం హూతీలపై అమెరికా ఇటీవల పెద్దఎత్తున దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలు, ఉగ్ర నేతలపై తమ దళాలు భీకర దాడులు చేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఈ దాడుల్లో 50 మందికి పైగా మృతిచెందగా.. అనేకమంది గాయపడ్డారు.

Rohit Sharma Breaks Silence On IPL 2025 Form After Fifty Against CSK5
ఒక్కోసారి మనపై మనకే డౌట్‌!.. ఇప్పుడు ఇలా..: రోహిత్‌ శర్మ

ముంబై ఇండియన్స్‌ దిగ్గజ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్‌ కింగ్స్‌ (MI vs CSK)తో మ్యాచ్‌ సందర్భంగా.. చాలా కాలం తర్వాత హిట్‌మ్యాన్‌ బ్యాట్‌ ఝులిపించాడు. సొంత మైదానం వాంఖడేలో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ 45 బంతుల్లోనే 76 పరుగులతో అజేయంగా నిలిచాడు.చాలా కాలం తర్వాత ఇలానాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో అజేయ అర్ద శతకంతో జట్టును గెలిపించిన రోహిత్‌ శర్మను ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా రోహిత్‌ మాట్లాడుతూ.. ‘‘చాలా కాలం తర్వాత నేను ఇక్కడ నిలుచోగలిగాను. ఫామ్‌లేమి కారణంగా ఒక్కోసారి మనపై మనకే సందేహం కలుగుతుంది. మన పంథాను మార్చుకునేలా చేస్తుంది. కానీ అలాంటపుడే సంయమనంతో ఉండాలి. లేదంటే ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుంది. నా వరకు ఈరోజు ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్‌. అందుకే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆడాలని ముందే నిర్ణయించుకున్నా. మా ప్రణాళికల ప్రకారమే నా ఇన్నింగ్స్‌ కొనసాగించాను.బంతి నా ఆధీనంలోకి వచ్చినప్పుడు బౌండరీకి తరలించాను. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగడంలో నాకెలాంటి ఇబ్బంది లేదు. ఫీల్డింగ్‌ వేళ చివరి 2-3 ఓవర్లలో వచ్చినా.. నేరుగా బ్యాటింగ్‌కే దిగినా పెద్దగా తేడా ఏమీ ఉండదు’’ అని పేర్కొన్నాడు.నాకు దక్కిన అరుదైన గౌరవంఅదే విధంగా.. వాంఖడేలో కొత్తగా తన పేరిట ఏర్పాటు చేసిన స్టాండ్‌ గురించి కూడా రోహిత్‌ శర్మ ఈ సందర్భంగా స్పందించాడు. ‘‘రోహిత్‌ శర్మ స్టాండ్‌లోకి బంతిని తరలించడాన్ని ఎంతగానో ఆస్వాదించాను. నాకు దక్కిన అరుదైన గౌరవం ఇది. ఆ పేరును పలికినప్పుడల్లా ఎలా స్పందించాలో కూడా నాకు తెలియడం లేదు.ఏదేమైనా ఈరోజు చివరి వరకు నిలిచి మ్యాచ్‌ను విజయంతో ముగించడం సంతోషంగా ఉంది. నా బాధ్యత కూడా అది. సరైన సమయంలో మేము గెలుపు బాట పట్టాము. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచాం’’ అని రోహిత్‌ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో చెపాక్‌లో చెన్నై చేతిలో ఓడిన తాజా గెలుపుతో ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ముంబై ఎనిమిదింట నాలుగు మ్యాచ్‌లలో గెలిచి.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు రోహిత్‌ శర్మ.. ఏడు ఇన్నింగ్స్‌ ఆడి 158 పరుగులు చేశాడు.ఐపీఎల్‌-2025: ముంబై వర్సెస్‌ చెన్నై స్కోర్లుటాస్‌: ముంబై.. తొలుత బౌలింగ్‌చెన్నై స్కోరు: 176/5 (20)ముంబై స్కోరు: 177/1 (15.4)ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసిన ముంబై.చదవండి: IPL 2025: ఇటు రోహిత్‌.. అటు కోహ్లి A perfect way to wrap a dominant victory and seal back-to-back home wins 💙@mipaltan sign off tonight by winning round 2⃣ against their arch rival 🥳Scorecard ▶ https://t.co/v2k7Y5tg2Q#TATAIPL | #MIvCSK pic.twitter.com/u2BDXfHpXJ— IndianPremierLeague (@IPL) April 20, 2025

This Is How BJP Reacts to Raj Uddhav Thackerays reunion buzz6
వదినమ్మకు చెప్పారా? అసలు ఒప్పుకుంటుందా?

మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న ఓ పరిణామం.. దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. రెండు దశాబ్దాలుగా రాజకీయ విరోధులుగా ఉన్న సోదరులు ఉద్దవ్‌ థాక్రే, రాజ్‌ థాక్రేలు కలిసి పోనున్నారనేది ఆ వార్త సారాంశం. అయితే ఈ కలయిక ప్రచారాన్ని బీజేపీ ఇప్పుడు ఎద్దేవా చేస్తోంది.ముంబై: యూబీటీ సేన-ఎంఎన్‌ఎస్‌ పొత్తు అవకాశాలపై ఓ హిందీ న్యూస్ ఛానెల్‌ పాడ్‌కాస్ట్‌లో మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్‌ నారాయణ్‌ రాణే(Nitesh Narayan Rane) ఈ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఎంఎన్‌ఎస్‌తో థాక్రే శివసేన చేతులు కలపబోతోందా?. ఈ విషయంలో తన భార్య రష్మీ థాక్రే(Rashmi Thackeray) అనుమతి తీసుకున్నారో లేదో?. ఈ విషయాన్ని ఉద్దవ్‌ థాక్రేను మీరే(న్యూస్‌ యాంకర్‌ను ఉద్దేశించి..) అడగాలి. ఇలాంటి నిర్ణయాల్లో ఆమె భాగస్వామ్యమే ఎక్కువ అనే విషయం ఆయన మరిచిపోవొద్దు’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.శివసేన నుంచి రాజ్‌ థాక్రే(Raj thackeray) నిష్క్రమణకు రష్మీనే కారణమన్న రాణే.. ఆ సమయంలో సోదరుల మధ్య ఎలాంటి విబేధాలు లేవనే విషయాన్ని ప్రస్తావించారు. మహారాష్ట్ర ప్రజలు మయూతీ కూటమికి అఖండ విజయం కట్టబెట్టారని.. కాబట్టి ఎంఎన్‌ఎస్‌, యూబీటీ శివసేన పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా.. ఇక్కడి రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపించబోదని నితీశ్‌ రాణే అన్నారు.ఈ క్రమంలో ఏక్‌నాథ్‌ షిండే-రాజ్‌ థాక్రే విందు సమావేశంపైనా రాణేకు ప్రశ్న ఎదురైంది. షిండేకు బాల్‌ థాక్రే కుటుంబానికి దశాబ్దాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా రాజ్‌ థాక్రేను బాల్‌ థాక్రేకు అంశగా షిండే భావిస్తుంటారు. అంతేగానీ వాళ్ల భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నది కాదు అని రాణే అన్నారు. మహారాష్ట్ర ప్రజలు, మరాఠీ భాష ప్రయోజనాల కోసం ఉద్ధవ్‌ థాక్రేతో కలిసి పని చేసేందుకు సిధ్ధమని ఎంఎన్‌ఎస్‌ అధినేత రాజ్‌ ఠాక్రే ఇటీవల ప్రకటించారు. ఇందుకు ఉద్ధవ్‌ థాక్రే కూడా సానుకూలంగా స్పందించడంతో ఇరువురు ఏకం కానున్నారనే వార్తలు విస్తృతమయ్యాయి. అయితే దీనిపై తాజాగా యూబీటీ సేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) మాట్లాడుతూ.. రాజకీయ పొత్తుకు సంబంధించి ఎటువంటి సంప్రదింపులు జరగలేదని, కేవలం వీరి మధ్య భావోద్వేగ చర్చలు మాత్రమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: నా బద్ధ శత్రువుకి కూడా ఈరోజు రాకూడదు

Kotak Mahindra Bank Hikes ATM Transaction Charges From 2025 May 1st7
దిగ్గజ బ్యాంక్ కీలక నిర్ణయం: మారిన ఏటీఎం ఛార్జీలు

దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన.. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల అనుగుణంగానే ఈ ఛార్జీలను పెంచడం జరిగిందని స్పష్టం చేసింది. కొత్త ఛార్జీలు 2025 మే 1నుంచి అమలులోకి వస్తాయి.మే 1 నుంచి ప్రతి లావాదేవీకి రూ.23 వసూలు చేయనున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. గతంలో ఈ ఛార్జ్ రూ. 21గా ఉండేది. ఈ ఛార్జీలు నెలవారీ ఫ్రీ విత్‌డ్రా లిమిట్ పూర్తయిన తరువాత మాత్రమే వర్తిస్తుంది. ఛార్జీల పెరుగుదల విషయాన్ని బ్యాంక్ ఇప్పటికే.. కస్టమర్లకు మెయిల్స్ ద్వారా పంపింది.ఏటీఎంలలో నిర్వహించే ఆర్ధిక లావాదేవీలకు, ఆర్థికేతర లావాదేవీళ్లకులకు & కోటక్ మహీంద్రా బ్యాంక్ మెషీన్లలో అయినా లేదా ఇతర బ్యాంకులకు సంబంధించిన మెషీన్లలో అయినా.. ఫ్రీ ఏటీఎం లావాదేవీల లిమిట్ దాటితే.. ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్‌మెంట్ వంటి వాటికోసం వరుసగా రూ. 8.50, రూ. 10 ఛార్జీలు వసూలు చేయనున్నారు.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం నుంచి కస్టమర్ రోజుకు గరిష్టంగా రూ. 1,00,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం కోటక్ ఎడ్జ్, ప్రో, ఏస్ ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈజీ పే ఖాతాదారుడు రూ. 25,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మరికొన్ని డెబిట్ కార్డులను కలిగి ఉన్న కస్టమర్లు రూ. 50వేలు వరకు విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది.

Lawrence Bishnoi Target Other Bollywood Actor And His Wife8
నీ భార్య క్షమాపణ చెప్పాలి.. మరో హీరోకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ హెచ్చరిక

లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌(Lawrence Bishnoi) నుంచి బాలీవుడ్‌కు చెందిన మరో హీరోకు హత్య బెదిరింపులు వచ్చాయి. సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు జరిపినట్లే నటుడు అభినవ్ శుక్లా( Abhinav Shukla)ఇంటిపై కూడా దాడులు జరుపుతామంటూ బెదిరింపులకు దిగారు. త్వరలో చంపేస్తామంటూ ఒక హెచ్చరికతో మెసేజ్‌ పంపారు. అయితే, ఈ మెసేజ్‌ను సోషల్‌మీడియా యూజర్‌ పంపినట్లు తెలుస్తోంది. తాను లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కోసం పనిచేస్తున్నాని ఈ హెచ్చరికలు వారికి జారీ చేశాడు.కారణం ఇదే..నటుడు అభినవ్ శుక్లా సతీమణి రుబీనా వల్లే ఈ వార్నింగ్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ టీవీలో ప్రసారం అయ్యే 'బాటిల్‌గ్రౌండ్' షోలో ఆమె పాల్గొంది. అయితే, ఆ షో కొనసాగుతున్న మధ్యలో రాపర్ ఆసిమ్ రియాజ్‌తో ఆమెకు గొడవ అయింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది. అది జరిగిన కొన్ని గంటల్లోనే ఈ బెదిరింపుల మెసేజ్‌ వచ్చింది. ఎపిసోడ్ ప్రసారం అయిన వెంటనే.. ఆమెతో పాటు అభినవ్‌ను ఆన్‌లైన్‌లో లక్ష్యంగా చేసుకుని భారీగా వార్నింగ్స్‌ వచ్చాయి. వారికి వచ్చిన మెసేజ్‌లను శుక్లా తన సోషల్‌మీడియా హ్యాండిల్‌లో వరుస స్క్రీన్‌షాట్‌లు, వీడియోలను పంచుకున్నారు, అందులో అంకుష్ గుప్తా అనే వ్యక్తి ఈ బెదిరింపు మెసేజ్‌ పంపినట్లు కనిపిస్తోంది.అభినవ్‌ శుక్లా దంపతులకు పంపిన ఆ మెసేజ్‌ ఇలా ఉంది. 'నేను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి వచ్చాను. మీ చిరునామా నాకు తెలుసు. నేను రావాలా..? సల్మాన్ ఖాన్‌పై కాల్పులు జరిపినట్లే, నేను మీ ఇంటికి వచ్చి AK-47తో మిమ్మల్ని కాల్చివేస్తాను. ఇది మీ చివరి హెచ్చరికగా భావించండి. ఆసిమ్‌కు వెంటనే క్షమాపణలు చెప్పండి. అలా జరగలేదంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. లారెన్స్ బిష్ణోయ్ ఆసిమ్‌కు అండగా నిలుస్తాడు. ఆసిమ్‌ మా గ్యాంగ్‌ మనిషి' అని ఉంది. వార్నింగ్‌ ఇచ్చిన వ్యక్తిది చండీగఢ్‌లా ఉందని అభినవ్ తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పుకొచ్చాడు.

Kerala tour its diverse tourist attractions9
Kerala Tour అరేబియా తీరం, హౌస్‌బోట్‌ విహారం

టెక్నాలజీతో రూపుదిద్దుకున్న రామాయణ ఘట్టం ఉంది.అరేబియా తీరాన కొలువుదీరిన అతిపెద్ద గంగాధరుడున్నాడు.అనంత సంపన్నుడు అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు. భారతీయ మూర్తులకు పశ్చిమ రంగులద్దిన రవివర్మ ఉన్నాడు.కేరళ సిగ్నేచర్‌ హౌస్‌బోట్‌ విహారం ఉంది... కథకళి...కలరిపయట్టు విన్యాసాలూ ఉన్నాయి.టీ తోటలు... మట్టుపెట్టి డ్యామ్‌ బ్యాక్‌ వాటర్స్‌...ఇవే కాదు... ఇంకా చాలా చూపిస్తోంది ఐఆర్‌సీటీసీ. మొదటి రోజుత్రివేండ్రమ్‌ ఎయిర్‌పోర్ట్‌ లేదా రైల్వే స్టేషన్, కొకువెలి రైల్వేస్టేషన్‌ల నుంచి పికప్‌ చేసుకుని బస చేయాల్సిన హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌ త్రివేండ్రమ్‌ లేదా కోవళమ్‌లలో ఉంటుంది. సాయంత్రం కోవళం బీచ్, అళిమల శివుని విగ్రహాన్ని దర్శించుకుని విశ్రాంతి తీసుకోవడమే. రెండో రోజుఉదయం త్రివేండ్రమ్‌లోని పద్మనాభస్వామి ఆలయ దర్శనం. జటాయు ఎర్త్‌ సెంటర్‌ని చూసిన తర్వాత ప్రయాణం కుమర్‌కోమ్‌ వైపు సాగుతుంది. ఈ ప్యాకేజ్‌ పేరుతో ఉన్న హౌస్‌బోట్‌ విహారం ఇక్కడ మొదలవుతుంది. కుమర్‌కోమ్‌ లేదా అలెప్పీలో క్రూయిజ్‌లోకి మారాలి. రాత్రి భోజనం, బస, ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అన్నీ హౌస్‌బోట్‌లోనే.తెరవని ఆరవ గదిత్రివేండ్రమ్‌... ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన అనంత పద్మనాభ స్వామి వల్ల ఈ పేరు విశ్వవ్యాప్తంగా ప్రచారం సంతరించుకుంది. ఈ నగరానికి ఆ పేరు వచ్చింది కూడా అనంత పద్మనాభ స్వామి వల్లనే. తిరు అనంత పురం... క్రమంగా మలయాళీల వ్యవహారంలో తిరువనంతపురం అయింది. బ్రిటిష్‌ వారి వ్యవహారంలో త్రివేండ్రమ్‌గా మారింది. ఇక్కడ పద్మనాభ స్వామి ఆలయంలో తెరవని ఆరో గది ఇప్పటికీ ఆసక్తికరమే. నాగబంధంతో మూసిన ఆ గదిని తెరవడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పద్మనాభ స్వామి ఆలయ దర్శనంలో ఈ గదిని తప్పనిసరిగా చూడాలి. ఇక త్రివేండ్రమ్‌ అనగానే గుర్తొచ్చే మరో పేరు రాజా రవి వర్మ. భారతీయ దేవతల చిత్రాలకు కొత్తరంగులద్దిన ట్రావెన్‌కోర్‌ రాజవంశానికి చెందిన రవివర్మ నివాసాన్ని కూడా చూడవచ్చు.జటాయు ఎర్త్‌ సెంటర్‌... ఇది ఒక థీమ్‌ పార్క్‌. జటాయు పక్షి ఆకారంలో నిర్మించారు. రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించిన సమయంలో రావణుడితో పోరాడి ప్రాణాలు వదిలిన పక్షి జటాయు. ఆ పక్షి రావణుడితో యుద్ధం చేసి నేలకొరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఈ పార్క్‌ను పశ్చిమ కనుమల్లో ఓ కొండ మీద 65 ఎకరాల్లో నిర్మించారు. ఈ కొండమీదకు వెళ్లడానికి ఎనిమిది వందలకు పైగా మెట్లెక్కాలి. కేబుల్‌కార్‌ కూడా ఉంది. ఆరోగ్యవంతులు ఎక్కగలిగిన కొండే అయినప్పటికీ బయటి ప్రదేశాల నుంచి పర్యటన కోసం వచ్చిన వాళ్లు టైమ్‌ వేస్ట్‌ చేసుకోకుండా పశ్చిమ కనుమల సౌందర్యాన్ని వీక్షిస్తూ కేబుల్‌ కార్‌లో వెళ్లడమే మంచిది. వెకేషన్‌ కోసం వెళ్లి నాలుగైదు రోజులు బస చేసేవాళ్లు ఒక రోజు కొండ ఎక్కడాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ ప్యాస్టిక్‌ని అనుమతించరు.మూడో రోజుఅలెప్పీ నుంచి మునార్‌కు ప్రయాణం. రోడ్డు మార్గాన మునార్‌కు చేరాలి. మధ్యలో పునర్జనిలో కేరళ సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించాలి. రాత్రి బస మునార్‌లో.కలరిపయట్టు... కథకళి చూద్దాం!పునర్జని ట్రెడిషనల్‌ విలేజ్‌... కేరళ సంప్రదాయ కళల ప్రదర్శన వేదిక. అలాగే ఆయుర్వేద చికిత్సల నిలయం కూడా. మునార్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రోజూ సాయంత్రం ఆరు గంటలకు కథకళి నాట్యం, కలరిపయట్టు యుద్ధకళా విన్యాసాలను ప్రదర్శిస్తారు. రిలాక్సేషన్‌ థెరపీలు ఐదు నుంచి పదిహేను వేలు చార్జ్‌ చేస్తారు. అవి ఈ ప్యాకేజ్‌లో వర్తించవు. నాలుగో రోజురోజంతా మునార్‌లోనే. ఎరవికులమ్‌ నేషనల్‌ పార్క్‌ పర్యటన, టీ మ్యూజియం, మట్టుపెట్టి డ్యామ్, ఎఖో పాయింట్, కుందల డ్యామ్‌ లేక్‌లో విహరించిన తర్వాత రాత్రి బస మునార్‌లోనే.మునార్‌ టీ తోటల మధ్య విహారం, ఝుమ్మనే వాటర్‌ ఫాల్స్‌ ను దూరం నుంచే చూస్తూ ముందుకు సాగిపోవడంతోపాటు టీ మ్యూజియం సందర్శన బాగుంటుంది. మట్టుపెట్టి డ్యామ్, రిజర్వాయర్‌ చుట్టూ విస్తరించిన టీ తోటల దృశ్యం కనువిందు చేస్తుంది. ఎరవికులమ్‌ నేషనల్‌ పార్క్‌ విజిట్‌ మరిచిపోలేని అనుభూతి. నీలగిరుల్లో పన్నెండేళ్లకోసారి పూచే నీలకురింజి పువ్వు దట్టంగా పూసేది ఇక్కడే. నీలకురింజి మళ్లీ పూసేది 2030లో. కానీ ఎక్కడో ఓ చోట ఒకటి రెండు గుత్తులు కనిపిస్తాయి. గైడ్‌లు వాటిని చూపించి కొండ మొత్తం పూసినప్పుడు దృశ్యం ఎలా ఉంటుందో ఫొటోలు చూపిస్తారు. అయిదో రోజుమునార్‌లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి కొచ్చి వైపు సాగిపోవాలి. కొచ్చిలో హోటల్‌ చెక్‌ ఇన్‌. మెరైన్‌ డ్రైవ్‌ను ఎంజాయ్‌ చేసిన తర్వాత షాపింగ్‌ తర్వాత నైట్‌ స్టే.కొచ్చిలో షాపింగ్‌ చేయడం మొదలు పెడితే మన లగేజ్‌ పెరిగిపోతుంది. లవంగాలు, యాలకులు, మిరియాల వంటివి చక్కటి ఘాటు వాసనతో స్వచ్ఛంగా ఉంటాయి. టూర్‌ గుర్తుగా కేరళ చీర ఒక్కటైనా కొనుక్కోవాలి. అవి బాగా మన్నుతాయి కూడా! స్థానిక హస్తకళాకృతులకు కొదవే ఉండదు. కోకోనట్‌ కాయిర్‌తో చేసిన గృహోపకరణాలు కూడా బాగుంటాయి. కథకళి సావనీర్‌లు తెచ్చుకోవచ్చు. ఆయుర్వేద తైలాల పేరుతో దొరికేవన్నీ స్వచ్ఛమైనవి కాదు, నకిలీలు కూడా ఉంటాయి. వీటిని గవర్నమెంట్‌ ఆథరైజ్‌డ్‌ స్టోర్‌లలో మాత్రమే కొనాలి. షాపింగ్‌ చేసేటప్పుడు ఫ్లయిట్‌లో లగేజ్‌ బరువు పరిమితిని దృష్టిలో ఉంచుకోవాలి. వెళ్లేటప్పుడు ఫ్లయిట్, తిరిగి వచ్చేటప్పుడు ట్రైన్‌లో ప్రయాణం చేస్తే లగేజ్‌ బరువు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. ఆరో రోజుకొచ్చిలో హోటల్‌ చెక్‌ అవుట్‌ చేసి, కొచ్చి లోని డచ్‌ ప్యాలెస్‌ సందర్శనం. యూదుల సినగోగ్‌ (ధార్మిక సమావేశ మందిరం), సర్‌ ఫ్రాన్సిస్‌ చర్చ్, సాంటా క్రాజ్‌ బాసిలికా పర్యటన తర్వాత కొచ్చి ఎయిర్‌ పోర్ట్‌ లేదా ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌లో డ్రాప్‌ చేయడంతో టూర్‌ పూర్తవుతుంది. కొచ్చి, ఎర్నాకుళం మన హైదరాబాద్‌– సికింద్రాబాద్‌ వంటి జంట నగరాలు. ఎయిర్‌΄ోర్టు కొచ్చిలో ఉంది, రైల్వే స్టేషన్‌ ఎర్నాకుళంలో ఉంది.వాస్కోడిగామా రాక ఫలితం!డచ్‌ ప్యాలెస్‌... అనగానే పాశ్చాత్య నిర్మాణశైలిని ఊహిస్తాం. కానీ ఇది పూర్తిగా కేరళ సంప్రదాయ నాలుకేట్టు నిర్మాణశైలిలో ఉంటుంది. పోర్చుగీసు వాళ్లు నిర్మించడం వల్ల డచ్‌ ప్యాలెస్‌గా అనే పేరు వచ్చింది. ఇది కొచ్చి నగరానికి సమీపంలోని మత్తన్‌ చెర్రి అనే ప్రదేశంలో ఉండడంతో స్థానికులు మత్తన్‌చెర్రి ప్యాలెస్‌ అనే పిలుస్తారు. వాస్కోడిగామా మనదేశంలో కేరళతీరం, కొచ్చి రాజ్యం, కప్పడ్‌ దగ్గర ప్రవేశించాడు. కొచ్చి రాజు అతడికి సాదర స్వాగతం పలికాడు. మనదేశం బ్రిటిష్‌ వలస పాలనలోకి వెళ్లడానికి దారులు వేసిన ఒక కారణం ఇది. ఈ ప్యాలెస్‌ భవనాల సముదాయం హెరిటేజ్‌ సైట్‌ల జాబితా కోసం యునెస్కో పరిశీలనలో ఉంది. ఈ ప్యాలెస్‌ లోపల నాటి చిత్రరీతుల ప్రదర్శన ఉంది.యూదులు వచ్చారు!మత్తన్‌చెర్రిలో డచ్‌ ప్యాలెస్‌ పక్కనే యూదు మతస్థుల ధార్మిక సమావేశ మందిరం సినగోగ్‌ కూడా ఉంది. ఇది కూడా డచ్‌ ప్యాలెస్‌ నాటి 16వ శతాబ్దం నాటి నిర్మాణమే. పశ్చిమం నుంచి మనదేశానికి అరేబియా సముద్రం మీదుగా జలమార్గాన్ని కనుక్కున్న తర్వాత పాశ్చాత్య దేశాలతో వర్తక వాణిజ్యాలు ఊపందుకున్నాయి. వర్తకులు, నౌకాయాన ఉద్యోగులు తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకోవడం మొదలైంది. అలా స్పెయిన్, పోర్చుగల్‌ నుంచి వచ్చిన వారిలో కొంతమంది ఇక్కడే స్థిరపడ్డారు. ఆ కాలనీలు క్రమంగా వారి మత విశ్వాసాలను కొనసాగించడానికి మందిరాలు కట్టుకున్నారు. అలాంటిదే ఇది కూడా. ఈ సినగోగ్‌ క్రిస్టల్‌ షాండ్లియర్‌లతో అందంగా ఉంటుంది. తమ మత సంప్రదాయాలను గౌరవిస్తూ భారతదేశంలో భారతీయులుగా మమేకమయ్యారు. ‘వింగ్స్‌ ఆఫ్‌ జటాయు విత్‌ హౌస్‌బోట్‌’... ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్‌ ప్యాకేజ్‌. ఇందులో త్రివేండ్రమ్, అలెప్పీ, మునార్, కొచ్చి ప్రదేశాలు కవర్‌ అవుతాయి. నీలగిరి తార్‌కు ప్రసూతి సమయం కావడంతో మునార్‌లోని ఎరవికులమ్‌ నేషనల్‌ పార్క్‌ను ఏప్రిల్‌ 1 వరకు క్లోజ్‌ చేశారు. ప్రస్తుతం పర్యాటకులను అనుమతిస్తున్నారు. కాబట్టి ‘వింగ్స్‌ ఆఫ్‌ జటాయు విత్‌ హౌస్‌బోట్‌’ టూర్‌కి ఇది అనువైన సమయం.కంఫర్ట్‌ కేటగిరీలో సింగిల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి దాదాపుగా 57 వేల రూపాయలవుతుంది. డబుల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 30 వేలవుతుంది. ట్రిపుల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 23 వేలవుతుంది. పిల్లలకు విడిగా బెడ్‌ తీసుకుంటే తొమ్మిది వేలు, బెడ్‌ తీసుకోకపోతే దాదాపుగా ఐదు వేల ఐదు వందలు. టూర్‌లో ఏసీ వాహనంలో ప్రయాణం, ట్రావెల్‌ ఇన్సూ్యరెన్స్, మార్గమధ్యంలో టోల్‌ ఫీజులు, పార్కింగ్‌ ఫీజులు, ప్యాకేజ్‌లో చెప్పిన ప్రదేశాల్లో ఎంట్రీ టికెట్‌లు, హోటల్‌ గది బస, హౌస్‌బోట్‌లో బస, నాలుగు బ్రేక్‌ఫాస్ట్‌లు, హౌస్‌బోట్‌లో లంచ్, డిన్నర్‌ ఈ ప్యాకేజ్‌లో ఉంటాయి.ప్యాకేజ్‌లో మన ప్రదేశం నుంచి త్రివేండ్రమ్‌కు చేరడం, కొచ్చి లేదా ఎర్నాకుళం నుంచి ఇంటికి రావడానికి అయ్యే రైలు లేదా విమాన ఖర్చులు వర్తించవు. త్రివేండ్రమ్‌లో రిసీవ్‌ చేసుకోవడం నుంచి కొచ్చిలో వీడ్కోలు పలకడం వరకే ఈ ప్యాకేజ్‌. ఇటీవల పర్యాటకులు యూ ట్యూబ్‌ వీడియోల కోసం ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా హౌస్‌బోట్‌ ప్రయాణంలో నిర్వహకుల సూచనలను విధిగా పాటించాలి.ఈ టూర్‌లోని పర్యాటక ప్రదేశాల్లో మునార్‌ టీ మ్యూజియానికి సోమవారం సెలవు, కొచ్చిలోని డచ్‌ ప్యాలెస్‌ శుక్రవారం, యూదుల సినగోగ్‌కి శనివారం సెలవు. వీటిలో ఒకటి – రెండు మిస్‌ కాక తప్పదు. విమానాశ్రయంలో దేవుని ఊరేగింపు!త్రివేండ్రమ్‌ చేరడానికి విమానంలో వెళ్లడం వల్ల బోనస్‌ థ్రిల్‌ ఉంటుంది. పద్మనాభస్వామి ఊరేగింపు కోసం విమానాలు ల్యాండింగ్‌ ఆపేస్తారు. ఏడాదికి రెండు దఫాలు ఈ విచిత్రం చోటు చేసుకుంటుంది. ఏప్రిల్‌ నెలలో పైన్‌కుని పండుగ సందర్భంగా జరిగే పది రోజుల వేడుకలో చివరి రోజు ఆరట్టు (సముద్రస్నానం) కోసం పద్మనాభ స్వామి ఊరేగింపు ఆలయం నుంచి షంగుముగమ్‌ బీచ్‌ వరకు ఆరు కిలోమీటర్ల దూరం సాగుతుంది. అలాగే అక్టోబర్‌ లేదా నవంబర్‌ నెలలో అల్పఱి పండుగ వేడుకల సందర్భంగా కూడా రన్‌వేని మూసివేస్తారు. ఎందుకంటే విమానాశ్రయం రన్‌వే ఈ దారిలోనే ఉంది. విమానాశ్రయాన్ని నిర్మించేటప్పుడే (1932 ) ప్రభుత్వం విధించిన నియమం ఇది. ఈ మేరకు ఏడాదిలో రెండుసార్లు ఇక్కడ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్‌ తీసుకోవు. పండుగకు రెండు నెలల ముందే ఆలయ ట్రస్ట్‌ బోర్డు వేడుకల షెడ్యూల్‌ను ఎయిర్‌పోర్ట్‌ అథారిటీకి తెలియచేస్తుంది. ఆ మేరకు ఏ తేదీన ఏ సమయంలో ఎయిర్‌΄ోర్ట్‌ రన్‌వేను మూసివేయనున్నారనే సమాచారం అక్కడ రాకపోకలు సాగించే విమానాల సంస్థలకు అందుతుంది. ఇది ప్రపంచవింత కాదు కానీ విచిత్రం. -వాకా మంజులా రెడ్డి సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

BJP MP Nishikant Dubey Ex Poll Body Chief SY Quraishi10
ఈసీ కాదు.. ముస్లిం కమిషనర్‌.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఢిల్లీ: ఇటీవలి కాలంలో బీజేపీ ఎంపీలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో, ఎంపీల వ్యాఖ్యల దుమారం హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. ఇంతకుముందు, సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంటు భవనాన్ని మూసుకోవాల్సిందే అంటూ నిశికాంత్‌ దూబే చేసిన వ్యాఖ్యల వేడి తగ్గకముందే.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తాజాగా మాజీ చీఫ్ ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ‌పై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో దూబే మాట్లాడుతూ..‘ఖురేషీ సీఈసీగా ఉన్నప్పుడు జార్ఖండ్‌లోని సంతాల్‌ పరగణాలో బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఓటర్‌ గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఆయన ఎన్నికల కమిషనర్‌ కాదు.. ముస్లిం కమిషనర్‌. చరిత్ర ప్రకారం క్రీ.శ 712 సంవత్సరంలో దేశంలోకి ఇస్లాం ప్రవేశించిందని, అప్పటిదాకా ఈ భూభాగం అంతా హిందువులు, గిరిజనులు, జైనులు, బౌద్ధులదే. అంతేకాదు, దేశాన్ని ఐక్యంగా ఉంచండి. చరిత్రను చదవండి. అప్పట్లో దేశాన్ని విభజించి పాకిస్థాన్‌ను సృష్టించారు. ఇకపై విభజన ఉండదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే,ర నిశికాంత్‌ దూబే జార్ఖండ్‌లోని గోడ్డా లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు సుప్రీంకోర్టును టార్గెట్‌ చేసిన దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంటు భవనాన్ని మూసుకోవాల్సిందే అన్నారు. పార్లమెంటు శాసనాధికారాల్లోకి న్యాయస్థానాలు చొరబడుతున్నాయని, చట్టసభ్యులు చేసిన చట్టాలను కొట్టివేస్తున్నాయని విమర్శించారు. జడ్జీలను నియమించే అధికారం ఉన్న రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఆదేశాలిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో అధికరణం 368 ప్రకారం చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందన్నారు. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగలదని, పార్లమెంటుకు మాత్రం కాదని తెలిపారు. పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్‌ (సవరణ) బిల్లు రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.Muslim Commissioner: BJP's Nishikant Dubey now targets former poll panel chiefNishikant Dubey criticises former poll panel chief over Waqf ActAccuses SY Quraishi of legitimising #BangladeshiInfiltratorsBJP distanced itself from Dubey's remarks on judiciary pic.twitter.com/Q1zhgZBL4X— The Contrarian 🇮🇳 (@Contrarian_View) April 20, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement