
పర్యాటక కేంద్రంగా గుర్తింపునకు కృషి
● ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఇంద్రవెల్లి: భూమికోసం, భుక్తికోసం తమ ప్రాణా లు అర్పించిన ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్‌తో కలిసి ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని సందర్శించారు. ఏప్రిల్ 20న అమరుల సంస్మరణ దినోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క హాజరై అమరుల కుటుంబాలకు ట్రైకార్ పథకం ద్వారా రూ.10 లక్షల చొప్పున రుణం అందించనున్నట్లు తెలిపారు. ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. పాత రగల్ జెండా కమిటీ యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, రాయిసెంటర్ సార్‌మెడిలు మెస్రం చిన్ను పటేల్, మెస్రం వెంకట్‌రావ్ పటేల్, రగల్ జెండా కమిటీ అధ్యక్షుడు తొడసం నాగోరావ్, కాంగ్రెస్ నాయకులు కోరెంగా సుంకట్‌రావ్, ఎండీ జహీర్, తదితరులు పాల్గొన్నారు.